న్యూఢిల్లీ: ముగ్గురు భారతీయ యువతులతో పాటు మరో ఏడుగురు నేపాలీ యువతులకు భారత ప్రభుత్వం విముక్తి కల్పించింది. ఉపాధి నిమిత్తం వెళ్లిన యువతులు కెన్యా దేశంలోని మొంబాసా నగరంలో మోసపోయారు. వారి పాస్‌పోర్టులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నగరంలోని ఓ ఇంట్లో బంధించారు. భారత హైకమిషన్ అధికారులు స్పందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానిక కెన్యా పోలీసుల సహకారంతో వారిని విడిపించారు.
వారిని విడిపించేందుకు శతవిధాలా ప్రయత్నం చేసిన కెన్యాలో భారత హైకమిషనర్ అధికారిణి సుచిత్రా దురై, కరణ్ యాదవ్‌లను విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అభినందించారు. అలాగే కెన్యా పోలీసుల సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. యువతుల అక్రమ రవాణాకు పాల్పడిన ఏజెంట్లపై కేసు నమోదు చేయాలని పంజాబ్ ప్రభుత్వానికి సుష్మాస్వరాజ్ వివరాలు పంపారు. ఈ విషయాలన్నీ ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment