పాపం.. తాగునీటి కోసం వెళ్లి మరణం అంచుదాకా! | Kenya Mud Struck Elephants Rescued By Sheldrick Wildlife Trust | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం వెళ్లి మరణం అంచుదాకా.. అంతలోనే ఊహించని సాయం

Published Thu, Sep 15 2022 11:43 AM | Last Updated on Thu, Sep 15 2022 11:58 AM

Kenya Mud Struck Elephants Rescued By Sheldrick Wildlife Trust - Sakshi

నైరోబీ: జంతువులు ఆపదలో చిక్కుకోవడం.. వాటిని మంచి మనసుతో కొందరు కాపాడడం లాంటి వీడియోలు తరచూ వైరల్‌ అవుతుంటాయి. అలాంటివి చూసినప్పుడల్లా మనసుకు ఒకరకమైన సంతోషం కలుగుతుంది. అలాంటి వీడియో గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం.

కెన్యాలో తాజాగా ఓ శాంక్చురీలో ఈ ఘటన జరిగింది. దాహంతో నీటి కోసం అన్నీచోట్ల తిరిగి తిరిగిన రెండు ఆడ ఏనుగులు.. ఓ నీటి మడుగులో దిగి బురదలో చిక్కుకుని పోయాయి. కాలు కదిపే వీలులేక.. అందులోనే కుప్పకూలి పడిపోయాయి. ఆ బురదలో పాపం అవి అలాగే రెండురోజులకు పైనే ఉన్నాయి. వాటిని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు కొందరు. సమాచారం అందుకున్న షెల్‌డ్రిక్‌ వైల్డ్‌లైఫ్‌ ట్రస్ట్‌, కెన్యా వైల్డ్‌లైఫ్‌ సర్వీస్‌లు సంయుక్తంగా శ్రమించి.. ఆ రెండు ఏనుగులను బయటకు తీశాయి. 

అదృష్టవశాత్తూ అవి ప్రాణాలతో బయటపడడంతో.. కాపాడిన టీంలు సంబురాలు చేసుకున్నాయి. తీవ్ర కరువు నేపథ్యంలో ఏనుగులు ఇలా నీటి మడుగులలోకి వెళ్లి చిక్కుకుపోవడం సహజమేనని అధికారులు అంటున్నారు.

ఇదీ చదవండి: నచ్చినోడు.. తాళి కట్టేవేళ పట్టరాని సంతోషంతో.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement