mud
-
పోలవరం కాలువ గట్లపై మట్టిని తవ్వేస్తున్న జనసేన, టీడీపీ నేతలు
-
మట్టి ప్రమిదలు,నువ్వుల నూనె : ఆరోగ్య లక్ష్మి, ఐశ్వర్యలక్ష్మికి ఆహ్వానం!
వినాయక చవితి సందర్భంగా మట్టివిగ్రహాలతొ విఘ్ననాయకుడ్ని కొలిచి తరించాం. ఇపుడు దీపాల పండుగ దీపావళి సంబరాలకు సమయం సమీపిస్తోంది. దీపావళి రోజున పెట్టిన దీపాల పరంపర, కార్తీకమాసం అంతా కొనసాగుతుంది. దీపావళి పండుగలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది.దీపావళి రోజున మట్టి ప్రమిదలనే వాడదాం. తద్వారా దైవశక్తులను ఆకర్షించడం మాత్రమే కాదు, పర్యావరణాన్ని కాపాడిన వారమూ అవుతాం. ‘‘దీప” అంటే దీపము. ‘ఆవళి’ అంటే వరుస. అలా దీపావళి అంటే.. దీపాల వరుస అని అర్థం. దీపం అంటే జ్ఞానం, ఐశ్వర్యం. చీకటి నుంచి వెలుగులోకి, ఐశ్వర్యంలోకి పయనించడమే దీపాల పండుగ ఆంతర్యం.మట్టి ప్రమిద. నువ్వుల నూనె, లేదా ఆవు నెయ్యి ఈ కలయిక ఎంతో మంగళకరం. నువ్వుల నూనెతో కూడిన మట్టి ప్రమిదల దీపపు కాంతి, ఆరోగ్యానికి కంటికి ఎంతో మేలు చేస్తాయి. శీతాకాలపు చలిగాలు మధ్య మన శరీరానికి ఏంతో మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభించి, పూర్వ జన్మ పాపపుణ్యాలు తొలగి పోతాయి. మట్టి ప్రమిదల్లో దీపం పెట్టడం అంటే అటు ఆరోగ్య లక్ష్మీని ఇటు ఐశ్వర్యలక్ష్మీని ఆహ్వానించి, వారి అనుగ్రహాన్ని పొందడన్నమాట.దీపారాధన చేసే సమయంలో ”దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర! దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదేవి నమోస్తుతే!!” అనే శ్లోకాన్ని చదువుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల మట్టి ప్రమిదలు, దీపాలు అందుబాటులో ఉన్నాయి. మట్టి దీపాలను వాడటం ద్వారా వృత్తి కళాకారులకు ప్రోత్సాహమిచ్చినవారమవుతాం. అలాగే కస్టమర్ల ఆసక్తికి అనుగుణంగా, ఆకట్టుకునే డిజైన్లతో ట్రెండీ లుక్‌తో అలరిస్తున్నాయి మట్టి దీపాలు. పాత ప్రమిదలను కూడా శుభ్రం చేసుకొని వాడుకోవచ్చు. -
బురదలోనే విద్యార్థులకు భోజనాలు
విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజులకే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఐదేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న దుస్థితే మళ్లీ దాపురించింది. ఎన్నికల ముందు వరకు పాఠశాల భవనంలో ఫ్యాన్ల కింద మధ్యాహ్న భోజనాలు చేసిన విద్యార్థులు.. ఇప్పుడు బురదలో కూర్చొని తినాల్సిన పరిస్థితులు తలెత్తాయి. విశాఖపట్నంలోని కప్పరాడ ప్రభుత్వ పాఠశాలలో కనిపించిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం. పాఠశాల విద్యార్థులను బురదలో కూర్చోబెట్టి మధ్యాహ్న భోజనాలు పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కారు బడులను అభివృద్ధి చేసింది. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలను కన్పించింది. రోజూ నిర్దిష్ట మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించింది. అయితే కూటమి ప్రభుత్వం వ చ్చిన కొద్ది రోజులకే విద్యార్థులకు మళ్లీ ఆరుబయట ఇబ్బందులు పడాల్సిన దుస్థితి వచ్చేసింది. కప్పరాడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తరగతి గదుల్లో భోజనాలు చేయడానికి సిబ్బంది అంగీకరించలేదు. ఒకవైపు వర్షం పడి బురదమయంగా మారిన పాఠశాల ఆవరణలో ఆరుబయటే విద్యార్థులను కూర్చోబెట్టేశారు. ఆ అపరిశుభ్ర వాతావరణంలోనే మధ్యాహ్న భోజనాలు వడ్డించారు. విద్యార్థులు బతిమాలినా.. బురదగా ఉందని.. గదుల్లో కాకపోయినా కనీసం వరండాలో అయినా తింటామని విద్యార్థులు బతిమలాడినప్పటికీ అక్కడి సిబ్బంది అంగీకరించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నారులు ఆరు బయట బురదలోనే కూర్చొని భోజనాలు చేయాల్సి వచ్చింది. దీనిపై కొంత మంది స్థానికులు పాఠశాల సిబ్బందిని ప్రశ్నించారు. పిల్లలు గదులను పాడు చేసేస్తారని, అందుకే లోపల తినొద్దని చెప్పామని సిబ్బంది చెప్పడం గమనార్హం. బురదలో విద్యార్థులకు భోజనాలు పెట్టడాన్ని స్థానికులు తమ ఫోన్లతో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రసుత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలను చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు అప్పటి, ఇప్పటి పరిస్థితులను బేరీజు వేసుకుంటూ నిట్టూరుస్తున్నారు. -
Nitin Gadkari: రోడ్డు బాగాలేకపోతే టోల్ వసూలు చేయొద్దు
న్యూఢిల్లీ: రహదారి సరిగ్గా లేకపోతే వాహనదారుల నుంచి టోల్ రుసుము వసూలు చేయొద్దని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ రహదారుల నిర్వహణ సంస్థలను ఆదేశించారు. శాటిలైట్ ఆధారిత టోల్ రుసుముల వసూలుపై బుధవారం ఢిల్లీలో జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు నాణ్యమైన సేవలు అందించలేనప్పుడు టోల్ చార్జి వసూలు చేయొద్దని అన్నారు. గుంతలు, బురదతో నిండిన రోడ్లపై కూడా టోల్ వసూలు చేస్తే జనం నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5,000 కిలోమీటర్ల మేర రహదారులపై ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
పిల్లలు మట్టి, సుద్ద తింటున్నారా? కారణాలేంటో తెలుసా? చిన్ని చిట్కాలు
పుట్టబోయే బిడ్డ కడుపున పడింది మొదలు తల్లిదండ్రులకు బిడ్డలపై ఆపేక్ష మొదలవుతుంది. ఇక బోసి నవ్వులు నవ్వుతూ, పారాడుతూ, బుల్లి బుల్లిఅడుగులూ వేస్తూ, ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతోంటే ఆ మురిపమే వేరు. ఏ చిన్ని అనారోగ్యం వచ్చినా ఆందోళనే. పసిబిడ్డలను ఎదుగుతున్న క్రమంలో కంటికి రెప్పలా చూసుకోవాలి. వయసు తగ్గట్టుగా ఎదుగుతున్నారా లేదా అని తనిఖీ చేసుకోవడంతో పాటు, సమయానికి టీకాలు వేయించాలి. అలాగే వారి ఆరోగ్యం పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కొంతమంది పిల్లలు మట్టి, బలపాలు, సబ్బు, పేపర్లు, సుద్ద లేదా గోడ గోళ్లతో గీరి తింటారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? తిట్టి, కొట్టి దండించడం కాకుండా అసలు ఎలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వైద్యులను సంప్రదించాలి. పిల్లలు మట్టిని ఎందుకు తింటారు? ఈ బురద తినే అలవాటు లేదా అలాంటి ఇతర తినకూడని వస్తువులను తినే అలవాటు రెండేళ్లకు మించి కొనసాగితే, శిశువు పికా అనే రుగ్మతతో బాధపడుతూ ఉండవచ్చు. ఎందుకు అలా తింటారుపోషకాహార లోపం, జింక్, కాల్షియం ,ఇనుము మొదలైన మూలకాల లోపంకుటుంబలో నిర్లక్ష్యం/ అశాంతి వాతావరణంఆటిజం , మేధో వైకల్యం, ఇతర అభివృద్ధి సమస్యలు. ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) లేదా స్కిజోఫ్రెనియా వంటి మానసిక ఆరోగ్య సమస్యలుసుద్ద, బలపం, సున్నం, లాంటి వాటిని తినడం వల్ల పిల్లలు అనీమియా వస్తుంది. మరింత బలహీనంగా తయారవుతారు. కడుపులో పురుగులు, నొప్పులు, ఇన్ఫెక్షన్లు లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏం చేయాలి?పిల్లల వైద్యుల సలహా ప్రకారం పిల్లలకు తగిన ఆహారం ఇస్తే ఈ సమస్యలు దూరమవుతాయి. అలాగే ఐరన్, కాల్షియం, కార్బోహైడ్రేట్, ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా లభించే అరటి పండ్లను తినిపించాలి. కాల్షియం లోపిస్తే పిల్లలకు బీన్స్, ఆకుపచ్చ కూరగాయలను తినిపించడం ద్వారా కాల్షియం లోపాన్ని దూరం చేయవచ్చు. పిల్లల్లో అభద్రత తొలగించేలా, వారితో మరింత సన్నిహితంగా మెలగాలి. వారి పట్ల ప్రేమను మరింత ఎక్కువ పంచాలి. పిల్లల అలవాటు, ఆరోగ్య ఆధారంగా వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు. మినరల్, ఐరన్, కాల్షియం సప్లిమెంటేషన్‌తో పాటు డీవార్మ్ మందులను సిఫారసు చేస్తారు. కొంతమందిలో ప్రవర్తనా లేదా మానసిక చికిత్స కూడా అవసరం కావచ్చు. సమస్య ఏంటి అనేది వైద్య నిపుణుడు నిర్ధారిస్తారు. -
బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ అంటే ఏమిటి? 70 వేల మందిని బురద ఎందుకు చుట్టుముట్టింది?
అమెరికాలోని నెవాడా స్టేట్‌లో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ సాంస్కృతిక సంబరాన్ని తిలకించేందుకు 70 వేల మంది హాజరయ్యారు. అయితే వారంతా అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఉత్సవం దక్షిణ నెవాడాలోని ఒక ఇసుక ఎడారి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఉత్సవ సమయంలో ఇలాంటి విపరత్కర పరిస్థితులు ఏర్పడతాయని ఎవరూ ఊహించలేదు. రెండు మూడు రోజులుగా ఇక్కడ కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో ఉత్సవం జరుగుతున్న ప్రాంతమంతా బురదమయంగా మారిపోయింది. నడిచేందుకు కూడా వీలు లేనివిధంగా రోడ్లు తయారయ్యాయి. చివరికి టాయిలెట్లు కూడా ఉపయోగించలేని విధంగా మారిపోయాయి. ఈ ఫెస్టివల్‌కు ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు, బిలియనీర్లు హాజరయ్యారు. ప్రకృతి వైపరీత్య వాతావరణం కారణంగా ఇప్పటివరకూ ఒకరు మృతి చెందినట్లు సమాచారం. నిర్వాహకులు ఇప్పటికే ఉత్సవాన్ని నిలిపివేశారు. అలాగే ఇక్కడికి కొత్తగా వాహనాల రాకను నియంత్రించారు. కాగా 2018లోనూ ఈ ఉత్సవంలో ఇటువంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. ఆ తరువాత రెండేళ్లపాటు కరోనా మహమ్మారి కారణంగా ఉత్సవాలను నిర్వహించలేదు. ప్రస్తుతం ఉత్సవం జరుగుతున్న ప్రాంతంలో భారీగా వర్షపాతం నమోదవుతోంది. అమెరికా ల్యాండ్ మేనేజిమెంట్ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ అత్యధికంగా బురద పేరుకుపోయిన కారణంగా వాహనాలు రాకపోకలకు సురక్షితం కాదు. రాబోయే రోజుల్లో వర్షాలు పడతాయనే సూచనలు ఉన్నందున ఇక్కడ ఉన్నవారంతా ఆహారాన్ని, తాగునీటిని జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది. Looks like God is not down with all the hedonism at Burning Man...#WeWantAnswers #BurningMan #BurningMan2023 #Satanic #SatanicAgenda pic.twitter.com/0knj4thwMW — Isaac’s Army (@ReturnOfKappy) September 4, 2023 అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్‌కు సంబంధించిన సమాచారం తమకు అందిందని, వైట్‌హౌస్ అధికారులు అప్రమత్తమై, సహాయక చర్యలు ప్రారంభించారని తెలిపారు తుపాను కారణంగా ఫెస్టివల్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెవాడాలోని బ్లాక్ రాక్ సిటీలో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు. కాగా బర్నింగ్ మ్యాన్ పండుగ 1990లలో ప్రారంభమైంది. ఆ సమయంలో ఇక్కడికి 80 మంది మాత్రమే వచ్చారు. ఆ తర్వాత 1993 సంవత్సరంలో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య 1000కి పైగా పెరిగింది.ఈ సంఖ్య ప్రస్తుతం 70 వేలకు చేరుకుంది. అమెరికాలో అత్యధిక సెలవులు వచ్చే రోజుల్లో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తారు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్కు దూరంగా ఉంటూ సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం ఈ పండుగ ప్రత్యేకత. ఇక్కడికి వచ్చినవారు తాము రూపొందించిన కళాఖండాలను ప్రదర్శిస్తారు. అలాగే వారు రూపొందించిన వస్తువులను వారే తగులబెడతారు. తద్వారా వ్యక్తిలోని అహం అంతమవుతుందని నమ్ముతారు. అందుకే ఈ ఉత్సవానికి బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ అనే పేరు వచ్చింది. ఇది కూడా చదవండి: బిల్ గేట్స్ కు దోమలకు సంబంధం ఏమిటి? Burning Man is a mess. Upward of 60,000 people are literally stuck in mud and have been ordered to stay put. Food and water running low. pic.twitter.com/HKRZSwkTCY — Citizen Free Press (@CitizenFreePres) September 2, 2023 -
ఇసుకపై పదేపదే వక్రీకరణలు
సాక్షి, అమరావతి : ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే దాన్నే నిజమని ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఈనాడు రామోజీరావు ప్రతిరోజూ పని గట్టుకుని రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై బురద జల్లుతున్నారు. ఇసుక కొరత లేకపోయినా ఉన్నట్లు.., స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన ఇసుకను అక్రమ నిల్వలుగా పేర్కొంటూ ఇష్టానుసారం అవాస్తవాలు ప్రచురిస్తున్నారు. రాజధాని లావాదేవీల్లో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దాని గురించి ఒక్క ముక్క రాయని ఈనాడు.. దాన్ని కప్పిపుచ్చేందుకు ఇసుక, ఇతర వ్యవహారాలపై కట్టు కథలు రాస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రబాబును రక్షించేందుకు, ఆయన అవినీతిని కప్పిపుచ్చేలా ఈనాడు ఇలా ప్రతిసారీ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకొంది. ఇదే విధంగా ఇసుక పైనా ఓ అసత్య కథనాన్ని ప్రచురించింది. ‘ఇది ఇసుక దోపిడీ కాదా‘ అనే శీర్షికతో శనివారం ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. డ్రెడ్జింగ్ రీచ్‌లు, స్టాక్ యార్డుల్లోనే ఇసుక విక్రయాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. దాన్ని వక్రీకరిస్తూ అక్రమ మైనింగ్గా చిత్రీకరించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. దీనిపై వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా పనిగట్టుకుని మళ్లీ అవాస్తవాలు రాయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుందని తెలిపారు. దీనివల్లే వర్షాలు ప్రారంభం కాకుండానే పలు చోట్ల స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు ఉంచామన్నారు. వర్షాలు పడుతున్నా ఇసుక లభించేలా ఏర్పాట్లు చేశామని, ఇసుక కొరత అనేది రాష్ట్రంలో లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక పరిస్థితిపై ఆయన చెప్పిన వివరాలు.. అక్రమ మైనింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? రాష్ట్రవ్యాప్తంగా 136 ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వాటిలో 64 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి. వినియోగదారులు స్టాక్ పాయింట్లలోని ఇసుక కొని, తీసుకెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇసుక స్టాక్ యార్డ్ ఫోటోలు తీసి అక్రమ ఇసుక తవ్వకాలు అంటూ ఈనాడు పత్రిక వక్రీకరణలతో తప్పుడు కథనాలు రాయడం దారుణం. రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు ఉన్న 110 రీచ్‌లలో 77 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది.అలాగే 42 డీసిల్టింగ్ పాయింట్ల ద్వారా 90 లక్షల ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. ఇసుక కొరత లేకుండా డీసిల్టింగ్ పాయింట్ల నుంచి కూడా తవ్వుతున్నాం. అన్ని చోట్లా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక లభిస్తోంది. అటువంటప్పుడు అక్రమ మైనింగ్ ఎవరు చేస్తారు? ఎక్కువ రేటుకు ఎవరైనా ఎందుకు కొంటారు? రాష్ట్రంలో జేపీ సంస్థ ద్వారానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్ని రీచ్‌లలో సమీపంలోనే స్టాక్ యార్డులు ఉన్నాయి. నదీ తీరంలో ఏర్పాటు చేసిన యార్డ్‌లో నిల్వ చేసిన ఇసుకను కూడా రీచ్ అని చిత్రీకరిస్తారా? పారదర్శక ఇసుక విధానంపై చాలా స్పష్టంగా వివరించినప్పటికీ ఇటువంటి వార్తలు రాయడం తగదు. గతంలో ఉచిత ఇసుక ఎవరికి ఇచ్చారు! గత ప్రభుత్వ హయాంలో ఏ నియోజకవర్గంలో ఇసుక ఉచితంగా ప్రజలకు అందింది? ఉచిత ఇసుక పేరుతో ప్రజలు ఎక్కువ రేటుకు కొనుక్కోవాల్సిన దుస్థితి తెచ్చారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని అయోమయ స్థితి ప్రజలకు కల్పించారు. తప్పులు చేసిన వారిని దండించలేదు. జరిమానాలు విధించలేదు. మెరుగైన ఇసుక విధానంతో మా ప్రభుత్వం ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోసింది. ప్రజలకు నియోజకవర్గాల్లో డిపోల వద్ద ఎంత ధరకు ఇసుక విక్రయిస్తున్నారో అత్యంత పారదర్శకంగా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియచేస్తోంది. అంతకంటే ఎక్కవ రేటుకు ఎవరైనా ఆమ్మితే తక్షణం ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ను తెచ్చింది.ఎవరైనా అక్రమాలకు పాల్పడితే రెండు లక్షల రూపాయల జరిమానా, రెండేళ్ళ వరకు జైలు శిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు తెచ్చింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. దాదాపు 18 వేల కేసులు ఈ బ్యూరో నమోదు చేసింది. 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసింది. ఈ కేసుల్లో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. కట్టుదిట్టంగా నిబంధనలను అమలు చేస్తున్నాం. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేశాం. ఓపెన్ రీచ్‌ల ద్వారా నాణ్యమైన ఇసుకను అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి తీవ్రంగా స్పందించింది. ఏకంగా రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఇది కూడా సీఎంగా చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపైనే. ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి సంతృప్తి చెందిన ఎన్జీటీ ఆ జరిమానాను రద్దు చేసింది. రీచ్‌లకు ఎవరైనా వెళ్లవచ్చు ఓపెన్ రీచ్‌లు, ఇసుక శాండ్ డిపోలకు ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. అవసరమైనంత ఇసుక కొనుక్కోవచ్చు. ఇలాంటి చోట ఎవరైనా ఆంక్షలు పెడతారా? ఎవరూ రాకుండా కాపలా పెడతారా? ఈనాడు ప్రతినిధులను అడ్డుకున్నారని వార్తలు రాయడం కేవలం అభాండాలు వేయడం తప్ప మరొకటి కాదు. పారదర్శకంగా జరుగుతున్న చోట ఏదో జరిగిపోతోందనే భ్రమలు కల్పించడమే ఈనాడు లక్ష్యం. దీనిని మినీ కేజిఎఫ్ అంటూ చిత్రీకరించడం ఈనాడు పత్రిక దివాళాకోరుతనానికి నిదర్శనం. కాంట్రాక్ట్ వ్యాల్యూ పైన కాంట్రాక్టింగ్ ఏజెన్సీ జీఎస్టీ చెల్లిస్తోంది. ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక విక్రయాలకు నిబంధనల ప్రకారం ఎంత జీఎస్టీ చెల్లించాలో అంతా చెల్లిస్తోంది. దీనిపైనా అసత్య ప్రచారం చేస్తున్నారు. వర్షాకాలంలో ఓపెన్ రీచ్‌ల నుంచి తవ్వకాలు జరగడంలేదు. అయితే స్టాక్ చేసిన యార్డ్‌లోని ఇసుకను విక్రయిస్తున్నాం. చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం అరణియార్‌లో ఇసుక తవ్వకాలు గతంలోనే నిలిపివేశారు. పాత ఫోటోలతో అక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ తప్పుడు కథనాలను ప్రచురించారు. ఇసుక మాఫియాకు చెక్ పెట్టాం ఈ ప్రభుత్వం గతంలో జరిగిన ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టింది. నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లభించేలా చర్యలు తీసుకుంటోంది. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, నూతన ఇసుక పాలసీని ప్రకటించింది. దానిలో భాగంగా 2019 ఏప్రిల్ 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో 70, 71 జారీ చేసింది. అనంతరం ఇసుక విధానంలోని లోటుపాట్లను సవరించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై 2020 నవంబరు 12న జీవో 78 జారీ చేసింది. అలాగే ఈ విధానంలోని కొన్ని నిబంధనల్లో మార్పు చేస్తూ 2021 ఏప్రల్ 16న జీవో 25ని జారీ చేసింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. పారదర్శకంగా ఇసుక తవ్వకాలు జరగాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎఎస్టీసీ ద్వారా, వారి పర్యవేక్షణలో టెండర్లు నిర్వహించాం. జేపీ పవర్ వెంచర్స్ ఈ టెండర్లు దక్కించుకుంది. వారి ద్వారానే ఇప్పటివరకు ఇసుక ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంత పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తే తప్పుడు ఆరోపణలా? టెండర్ దక్కించుకున్నది జేపీ పవర్ వెంచర్స్ కంపెనీ ఒక్కటే. అన్ని అనుమతులతోనే ఎక్కడైనా ఆ సంస్థే తవ్వకాలు చేస్తుంది. అలాంటప్పుడు ఆ సంస్థ అక్కడ తవ్వుతోంది, ఇక్కడ తవ్వుతోందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వారు టెండర్ నిబంధనల ప్రకారం వారికి అనుకూలమైన సంస్థను సబ్ కాంట్రాక్టర్ గా తీసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆ సంస్థ సొంత వ్యవహారం. కాంట్రాక్టు సంస్థ టన్నుకు రూ.375 చొప్పున ప్రభుత్వానికి చెల్లిస్తోంది. దీనిపై మరో వంద రూపాయలు వేసుకుని టన్ను రూ.475 కు అమ్ముకుంటోంది. ఆ వంద రూపాయల్లోనే కంపెనీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. ఇసుక టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. అంటే అయిదేళ్ళలో రూ.3,825 కోట్ల ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వ పాలనలో ఇన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎక్కడైనా ఇసుక కొనుక్కోవచ్చు. నాణ్యతను పరిశీలించుకోవచ్చు. అలాంటప్పుడు బ్లాక్ లో ఎక్కువ రేటుకు ఇసుకను కొనాల్సిన అవసరం ఎలా ఉంటుంది? -
వానోస్తే బురదమయం.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు
చెన్నూర్: జిల్లాలోని పలు మున్సిపాల్టీల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. వానొస్తే బురదమయంగా మారి ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షాలకు మురికి నీరంతా రోడ్లపై పారుతోంది. చినుకు పడితే రోడ్లు చిత్తడిగా మారి పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వైపు మట్టి రోడ్డు ఉంది. వర్షం పడినప్పుడు బురదగా మారుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. ఇందిరానగర్ కాలనీకి వెళ్లే దారిలో కల్వర్టు పూర్తి కాకపోవడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఎన్‌పీవాడ, దుబ్బాగూడెంలకు వెళ్లే దారిలో సిమెంట్ రోడ్డు శిథిలావస్థకు చేరింది. దీంతో వర్షపు నీరు నిలిచి నడక నరకప్రాయంగా మారింది. గాంధీచౌక్ నుంచి పద్మశాలి వీధికి వేళ్లే రోడ్డు మధ్యలో నీరు నిలుస్తోంది. పెద్దగూడెం, మారెమ్మవాడలలో రహదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. వర్షాలకు బురదమయంగా మారుతున్న రోడ్లను గుర్తించి అధికారులు కొత్త రోడ్ల నిర్మాణాలకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
మట్టి కుండలకు కాలం చెల్లిందా ? ఆవేదనలో కుమ్మరులు
-
సెలవొస్తే...మట్టి కాళీ
సెలవు రోజు వచ్చిందా...మట్టి మాఫియాకు పండగే...చీకటి వ్యాపారానికి తెర లేస్తుంది. మట్టి మాఫియా చెలరేగిపోతుంది. శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు యథేచ్ఛగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతాయి. గత టీడీపీ ప్రభుత్వంలో దోపిడీ చేసిన వారే ఇప్పటికీ అనధికారిక తవ్వకాలు సాగిస్తున్నారు. నాడు వీరిచ్చిన మామూళ్లకు అలవాటు పడిన అధికారులు ఇప్పటికీ వీరికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ రూరల్ మండలంలో మట్టి మాఫియా ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. పోలవరం కాలువ 147 నుంచి 150 చైనేజి కుడిపక్కన గత ఏడాది నుంచి ఇప్పటివరకు దాదాపు 70 నుంచి 80 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని అక్రమంగా తరలించినట్లు సమాచారం. సూరంపల్లికి చెందిన టీడీపీ నేత కనుసన్నల్లోనే ఈ తంతు జరిగినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ తవ్వకాలపై నున్న, పాతపాడు, సూరంపల్లి గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. అక్రమంగా తరలించిన దాదాపు 4 వేలకు పైగా ట్రిప్పుల మట్టిని ఫ్లిప్‌కార్ట్ వారికి చెందిన స్థలంతో పాటు, ముస్తాబాద వద్ద ఉన్న పొలాలను మెరక చేసేందుకు వినియోగించినట్లు సమాచారం. గత ఏడాది కాలంగా ఈ మట్టి మాఫియా వేలాది ట్రిప్పుల మట్టిని అక్రమంగా తరలించి, కోట్లాది రూపాయలను దండుకుంది. అక్రమ తవ్వకాలకు తెగబడుతున్నారిలా... ప్రధానంగా సెలవు రోజుల్లో శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఈ అక్రమ దందా చేస్తున్న టీడీపీ నేతకు అక్కడ పనిచేసే ఏఈ స్థాయి అధికారి బంధువు కావడంతో, ఆ అధికారి ద్వారా చక్రం తిప్పుతున్నారు. నీటిపారుదల శాఖలో గతంలో పనిచేసిన డీఈఈ, ఈఈ స్థాయి అధికారులతో ఆ టీడీపీ నేత బలమైన మైత్రీ బంధం ఉండడంతో తన బంధువు అయిన ఏఈకి ఏ ఇబ్బందీ రాకుండా చక్క బెడుతున్నారు. అనుమతులు లేవు పోలవరం కాలువ మట్టికి సంబంధించి ఒకరికి తప్ప, మరెవరికీ మట్టి తవ్వుకునేందుకు అనుమతులు ఇవ్వలేదు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మట్టి తవ్వకాలపై నిఘా ఏర్పాటు చేశాం. – కర్ణ శ్రీనివాసరావు,పోలవరం డివిజన్ ఈఈ -
ఆ మట్టితోనే ప్రాణం పోశాడు..
నిర్మల్: దేశ స్వాతంత్య్రం కోసం ఆయన ఎక్కడైతే చిరునవ్వుతో ఉరికొయ్యలను ముద్దాడాడో.. అక్కడి మట్టితోనే మళ్లీ ప్రాణం పోసుకున్నాడు. తనతోపాటు వెయ్యిమంది ప్రాణాలను అర్పించిన స్థలంలోని మట్టితో రాంజీగోండు విగ్రహానికి పోలీస్ భీమేశ్ అనే యువకుడు ప్రాణం పోశాడు. నిర్మల్ రూరల్ మండలం అనంతపేటకు చెందిన భీమేశ్ సెప్టెంబర్ 17 తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 1860లో వెయ్యి ఉరులమర్రి ఘటనలో ప్రాణత్యాగం చేసిన రాంజీగోండు మట్టి ప్రతిమను తయారు చేశారు. ఇందుకు ఎక్కడైతే వారిని ఉరితీశారో.. ఆ మట్టినే ఉపయోగించారు. ఈ సందర్భంగా భీమేశ్ మాట్లాడుతూ నిర్మల్ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ‘సాక్షి’విశేష కృషి చేస్తోందని తెలిపారు. ఇటీవల చేస్తున్న కార్యక్రమాల స్ఫూర్తితోనే తాను రాంజీ బొమ్మకు ప్రాణం పోసినట్లు భీమేశ్ వెల్లడించారు. -
పాపం.. తాగునీటి కోసం వెళ్లి మరణం అంచుదాకా!
నైరోబీ: జంతువులు ఆపదలో చిక్కుకోవడం.. వాటిని మంచి మనసుతో కొందరు కాపాడడం లాంటి వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అలాంటివి చూసినప్పుడల్లా మనసుకు ఒకరకమైన సంతోషం కలుగుతుంది. అలాంటి వీడియో గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం. కెన్యాలో తాజాగా ఓ శాంక్చురీలో ఈ ఘటన జరిగింది. దాహంతో నీటి కోసం అన్నీచోట్ల తిరిగి తిరిగిన రెండు ఆడ ఏనుగులు.. ఓ నీటి మడుగులో దిగి బురదలో చిక్కుకుని పోయాయి. కాలు కదిపే వీలులేక.. అందులోనే కుప్పకూలి పడిపోయాయి. ఆ బురదలో పాపం అవి అలాగే రెండురోజులకు పైనే ఉన్నాయి. వాటిని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు కొందరు. సమాచారం అందుకున్న షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్, కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్‌లు సంయుక్తంగా శ్రమించి.. ఆ రెండు ఏనుగులను బయటకు తీశాయి. అదృష్టవశాత్తూ అవి ప్రాణాలతో బయటపడడంతో.. కాపాడిన టీంలు సంబురాలు చేసుకున్నాయి. తీవ్ర కరువు నేపథ్యంలో ఏనుగులు ఇలా నీటి మడుగులలోకి వెళ్లి చిక్కుకుపోవడం సహజమేనని అధికారులు అంటున్నారు. View this post on Instagram A post shared by Sheldrick Wildlife Trust (@sheldricktrust) ఇదీ చదవండి: నచ్చినోడు.. తాళి కట్టేవేళ పట్టరాని సంతోషంతో.. -
రియల్ బాహుబలి.. ఇలా చేయాలంటే గట్స్ ఉండాలి
వైరల్: ఈ భూమ్మీద మనిషిలో మానవత్వం ఉందనే విషయాన్ని అప్పుడప్పుడు కొన్ని ఘటనలు నిరూపిస్తుంటాయి. వాటి గురించి ఎన్నిసార్లు చర్చించుకున్నా.. పెద్ద ఇబ్బందిగా అనిపించదు. ప్రాణం ఏదైనా ప్రాణమే అనుకున్న ఆ వ్యక్తి చేసిన సాహసం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. పొడి భాగం అని పొరబడి వెళ్లి.. బురదలో కూరుకుపోయింది ఓ ఇంపాలా. చాలా సేపు దానిని ఎవరూ పట్టించుకోలేదు. బయటకు రావడానికి అది ఎంతో ఇబ్బంది పడి.. గాయపడింది కూడా. ఈలోపు నేషనల్ పార్క్‌లో పని చేసే కొందరు దాని అవస్థలు చూశారు. సాధారణంగా అలాంటి బురదల్లో.. ఊబిలు ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే.. మొసళ్లు ఉండే ప్రమాదం కూడా ఉంటుంది. అయినా లెక్క చేయకుండా నడుముకి తాడుకు కట్టుకుని అందులోకి దిగాడు. నడుం లోతు బురదలో కష్టంగా ముందుకు వెళ్లి చాలా సేపు శ్రమించి.. దానిని బయటకు తీసుకురాగలిగాడు. జింబాబ్వే నేషనల్ పార్క్‌లో చాలా ఏళ్ల కిందటే ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన ట్విటర్లో ఈ వీడియోను తన అకౌంట్లో పోస్ట్ చేయగా.. మూడున్నర మిలియన్ల వ్యూస్ దాకా చేరుకుని మరోసారి ట్రెండింగ్ వీడియోల్లోకి వచ్చేసింది. అదన్నమాట విషయం. అతను చేసిన సాహసాన్ని మీరూ ఓ లుక్కేయండి. This man risked his life to save an impala calf! ❤️️👏 pic.twitter.com/og05rsdoLq — Tansu YEĞEN (@TansuYegen) July 27, 2022 -
బీజేపీ ఎమ్మెల్యేకి బురద స్నానం చేయించిన మహిళలు
Women soak BJP MLA in mud: తెలుగు రాష్ట్రాలు కుండపోత వర్షాలతో ఇబ్బంది పడుతుంటే ఉత్తరప్రదేశ్‌లో వర్షం కురవాలంటూ వింతవింత పూజలు చేస్తున్నారు. వాన దేవడుని ప్రసన్నం చేసుకోవడం కోసం యూపీలోని మహారాజ్‌గంజ్ నివాసితుల బురద స్నానం చేస్తారట. ఇది వారి పురాతన ఆచారం. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. వర్షం రాక కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే యూపీలోని పిప్రదేయోరా మహిళలు బీజేపీ ఎమ్మెల్యే జై మంగళ్ కనోజియాకు, మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కృష్ణ గోపాల్ జైస్వాల్‌లకు బురద స్నానం చేయించారు. ఇలా చేస్తే వాన దేవుడు ఇంద్రుడు సంతోషించి పట్టణాన్ని వర్షంతో ఆశీర్వదిస్తాడని వారి నమ్మకం. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే జై మంగళ్ కనోజా మాట్లాడుతూ...ఎండల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఈ పూజలో పాల్గొన్నానని చెప్పారు. ఈ వాతావరణంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇది పాత నమ్మకం పైన ఆధారపడిన ఆచారం కాబట్టి ఇందులో భాగం కావాలని నిర్ణయించుకున్నాం అని చెప్పుకొచ్చారు. (చదవండి: పాక్ జర్నలిస్ట్ ఆరోపణలు.. స్పందించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి) -
ప్రకృతి మాయ.. వందేళ్ల కిందట కొన్ని జ్ఞాపకాలను వదిలి వెళ్లింది!
వందేళ్ల కిందట ఓ మహోగ్ర ప్రవాహం తన రాకకు గుర్తుగా కొన్ని జ్ఞాపకాలను వదిలి వెళ్లింది. బాహుదా పేగు తెంచుకుని పుట్టి బంగాళాఖాతంతో జత కట్టే రాకాసి గెడ్డ అప్పటి తన వీర విహారానికి కొన్ని ఎర్రటి మట్టి దిబ్బలను సాక్షిగా నిలబెట్టింది. కాలం గడిచిపోయింది. ప్రవాహం నెమ్మదించింది. ప్రకృతి ఇష్టంగా చేసుకున్న ఈ అరుణ శిల్పాలు ఉద్దానం ఒడిలో ఎవరి కంటా పడకుండా రహస్యంగా ఉండిపోయాయి. ఒకనాటి మందస రాజులు వేటకు వెళ్తూ ఈ ప్రాంతాన్ని చూసి ముచ్చటపడిపోయారు. ఈ ఎర్ర మట్టితో కుండలు చేసిన కుమ్మర్లు ఆ ఊరే వదిలి వెళ్లిపోయారు. ఎలుగు బంట్లు, పునుగు పిల్లులు, తోడేళ్లు, నక్కలు, కొండ చిలువలకు ఇష్టమైన ప్రాంతమైన ఈ ఎర్ర మట్టి దిబ్బలు ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. షార్ట్‌ఫిల్మ్‌ల పుణ్యమా అని ఈ అందాలు కెమెరా కంట పడుతున్నాయి. సాక్షి, శ్రీకాకుళం: వజ్రపుకొత్తూరు మండలంలోని ఒంకులూరు–తోటూరు రాకాసి గెడ్డలోని ఎర్రమట్టి దిబ్బలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. వీటి ఉనికి పదేళ్ల కిందటే బయటపడినా.. ఇప్పుడు మాత్రం ఈ అందాలు చూసేందుకు ఇంకా ఎక్కువ మంది ఇక్కడకు వస్తున్నారు. ఈ ఎర్రమట్టి దిబ్బలు గునపాలు దింపినా దిగనంత గట్టిగా ఉంటాయి. వందేళ్ల కిందట రాకాసి గెడ్డలో ఏర్పడిన జల ప్రవాహానికి సహజసిద్ధంగా ఇవి ఏర్పడ్డాయి. ఎర్ర తివాచీ పరిచినట్లు ఉండే ఈ అందాలకు పర్యాటకులు ఫిదా అవుతున్నారు. ఒకప్పుడు ఈ మట్టితో కుమ్మర్లు కుండలు తయారు చేసి ఉద్దానం ప్రాంతంలో విక్రయించి ఉపాధి పొందేవారు. ఐతే ఆ కుండలు ఎప్పటికీ పగలకపోవడంతో మళ్లీ కుండలు కొనేవారు లేక వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని స్థానికులు చెబుతుంటారు. రాజుల కాలంలో.. 1947కు ముందు మందస సంస్థానం రాజులైన శ్రీనివాస రాజా మణిదేవ్, రాజా జగన్నాథ మణిదేవ్లు వేట కోసం ఇక్కడకు వచ్చి ఈ మట్టి దిబ్బల అందాలు తిలకించే వారని స్థానికంగా ఉండే వృద్ధులు చెబుతుంటారు. తోటూరు సముద్ర తీరం నుంచి పలాస మండలం నీలావతి వరకు దాదాపు ఏడెనిమిది కిలోమీటర్లు పొడవైన గెడ్డలో ఈ ఎర్రమట్టి దిబ్బలు ఉండగా.. తూర్పున తోటూరు వద్ద సాగర తీరం మరింత కనువిందు చేస్తుంటాయి. ప్రతి ఆదివారం వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. షూటింగ్‌లకు అనుకూలం ఈ ప్రాంతాన్ని ఇంకాస్త అభివృద్ధి చేస్తే భీమిలిలా మార్చవచ్చు. ఇక్కడ పది షార్ట్‌ఫిల్మ్‌ల వరకు తీశారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ నుంచి 12 కిలోమీటర్లు దూరాన ఉండే తోటూరు సముద్ర తీరానికి చేరుకునే మార్గంలో ఈ మట్టి దిబ్బలు ఉంటాయి. సహజ సిద్ధమైన అందాలను కాపాడేందుకు అవకాశం లేకపోవడంతో ఇప్పటికే చాలా మేరకు దిబ్బలు కరిగిపోయాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే తీర ప్రాంత ముఖచిత్రం మారిపోతుంది. అభివృద్ధి చేయాలి ఒంకులూరు, తోటూరు ప్రాంతాలకు ప్రతి ఆదివారం 150 మందికి తగ్గకుండా పర్యాటకులు వస్తారు. ప్రభు త్వం దృష్టి సారిస్తే కచ్చితంగా ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు మరింత హాయినిస్తుంది. – గుంటు ధర్మారావు, స్థానికుడు, తోటూరు ఎర్రమట్టి దిబ్బలను సందర్శిస్తాం భీమిలి తరహాలో ఉండే ఎర్రమట్టి దిబ్బలు ఉద్దానంలో ఉంటే కచ్చితంగా అభివృద్ధి చేయాల్సిందే. మేం ముందు వాటిని సందర్శిస్తాం. ఇప్పటికే సుదీర్ఘ తీరప్రాంతంలో కంబాలరాయుడుపేట బీచ్‌ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రూ.2 కోట్లు, నెమలి కొండ పర్యాటక అభివృద్ధికి రూ. 14.5కోట్లు, అక్కుపల్లి శివసాగర్ బీచ్‌కు రూ.1.50 కోట్లు ప్రతిపాదనలు పంపించాం. – మదన్మోహన్, ఏఈఈ, ఏపీ టూరిజం -
వర్షం బీభత్సం: పంట పోయింది.. బురద మిగిలింది
సాక్షి, మంథని(కరీంనగర్): మంథని మండలం విలోచవరానికి చెందిన బండరవి 38ఎకరాల వరి సాగుచేశాడు. పంట కలుపుతీతకు వచ్చింది. నాట్లు వేసిన అనంతరం పొలాల వద్దకు వాహనాలు వెళ్లాలంటే దారి లేకపోవడంతో రూ.మూడు లక్షలు వెచ్చించి అవసరమైన ఎరువులు, క్రిమిసంహారక మందులు కొని పొలం వద్ద ఏర్పాటు చేసిన షెడ్డులో నిల్వ చేశాడు. అకస్మాత్తుగా గోదావరికి వరద రావడంతో ఎరువులన్నీ నీటిలో కరిగిపోయాయి. క్రిమిసంహారక డబ్బాలు కొట్టుకుపోయాయి. నాటు వేసిన పొలం ప్రస్తుతం బురద మాత్రమే మిగిలింది. ఇది కేవలం ఒక్క రవి ఆవేదన మాత్రమే కాదు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రతి రైతు దుస్థితి. ఎడతెరపి లేని వర్షాలు.. ఉప్పొంగిన వరదలతో మంథని నియోజకవర్గ రైతులు తీవ్రంగా నష్టపోయారు. గోదావరి, మానేరుతీరం వెంట ఉన్న సుమారు ఐదు వేల ఎకరాల్లో వేసిన వరి, పత్తి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం వరద ఉధృతి తగ్గడంతో మంథని వద్ద గోదావరి సాధారణ స్థితిలో ప్రవహించింది. పరీవాహక ప్రాంతాలైన సిరిపురం, పోతారం, విలోచవరం, కాసిపేట, ఉప్పట్ల, ఆరెంద, మల్లారంతోపాటు పలు గ్రామాల్లో రైతులు వేసిన పంట కొట్టుకుపోయింది. నీరు వెళ్లిపోవడంతో పంట పొలాలు తేలాయి. ఇసుక మేటలు, బురద మాత్రమే మిగిలింది. లక్షల రూపాయల ఎరువులు వరద పాలు మంథనితోపాటు జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు సరైన దారి ఉండదు. నాట్లు వేసేముందే సీజన్‌కు సరిపడా ఎరువులు నిల్వ చేసుకుంటారు. ఇలా మంథని ప్రాంతానికి చెందిన రైతులు సుమారు రూ.10లక్షల విలువ చేసే ఎరువులను నిల్వ చేసుకోగా.. గోదావరిలో కొట్టుకుపోయాయి. నష్టాన్ని అధికారులు అంచనా వేసి ప్రభుత్వం ఆధుకోవాలని రైతులు కోరుతున్నారు. నిండా ముంచిన పోచంపల్లి చెక్‌డ్యాం బ్యాక్ వాటర్ కాల్వశ్రీరాంపూర్: ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని పోచంపల్లి వద్ద మానేరు నదిపై నిర్మించిన చెక్‌డ్యాం బ్యాక్‌వాటర్ ఉప్పొంగింది. పొలాల్లో ఇసుక మేటలు వేసింది. వేలాది రూపాయిలు పెట్టుబడి పెట్టి నాట్లు వేశామని, ఇంతలోనే బ్యాక్‌వాటర్‌తో నామరూపాలు లేకుండా పోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ అధికారులు బ్యాక్ వాటర్ పొలాల్లోకి రాకుండా కట్ట నిర్మించలేదని, ఇప్పుడు తీవ్రంగా నష్టపోయారని సర్పంచు నాగార్జున్ రావు, ఎంపీటీసీ జనార్దన్ రెడ్డి, రైతులు ఆరోపించారు. సంబంధిత అధికారులు సర్వే చేసి కట్ట నిర్మాణం చేయాలని, నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
వైరల్: బురదలో ఏనుగు సరదా!
వాషింగ్టన్: చిన్నపిల్లల ఆటలు ఎంతో ముద్దనిపిస్తాయి. అలాగే జంతువుల్లో కొన్ని చేసే చిలిపి చేష్టలు కూడా భలే సరదాగా ఉంటాయి. అవి చేసే చిలిపి పనులకు మనుషులు ఫిదా అవుతుంటారు. తాజాగా ఓ ఏనుగు బురదలో సరదా ఆటలు ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏనుగు బురదను కాలితో తన్నుతూ.. దానిలో బొర్లుతూ.. తెగ అల్లరి చేస్తోంది. ఈ వీడియోను ఒరెగాన్ జూ ‘స్పా డే’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. 35,000 మంది నెటిజన్లు వీక్షించారు. ఏనుగు సంబరాన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. కాగా ఏనుగు అల్లరి చేష్టలు చూస్తుంటే.. చిన్నప్పుడు ఆడిన ఆటలు గుర్తుకు వస్తున్నాయంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. Spa day pic.twitter.com/Yx7T4Ti7h9 — Oregon Zoo (@OregonZoo) June 10, 2021 చదవండి: అనుమతి వస్తే.. దేశంలో చిన్నారులకు తొలి కరోనా టీకా ఇదే! -
అమ్మవారిపై భక్తితో.. ఆలయం చుట్టూ బురదలో
-
కారు మట్టిలో కూరుకుపోయి..18 రోజుల తర్వాత
ఆస్ట్రేలియాకు చెందిన 58 ఏళ్ల రాబర్ట్ వెబర్ క్వీన్స్‌లాండ్‌లోని ఓ హోటల్ నుంచి తన పెంపుడు కుక్కతో జనవరి 6న బయటకు వెళ్లారు. ఆరోజు నుంచి అతను మళ్లీ ఎవరికీ కనిపించలేదు. ఆ తరువాత 18 రోజుల తర్వాత అంటే జనవరి 24 ఆదివారం అతన్ని పోలీసులు గుర్తించి రక్షించారు. కాగా వెబర్ పంటపొలాలు ఉన్న ఒక రోడ్డులో వెళ్తుండగా తన కారు మట్టిలో కూరుకుపోయింది. కారు అటూ ఇటూ కదలలేని పరిస్థితి. దాంతో ఎంత ప్రయత్నించినా అతను బయటకు రాలేక కారులోనే ఉండిపోయాడు. మూడురోజుల తరువాత అతికష్టం మీద కారునుంచి బయటపడి దగ్గరల్లో ఉన్న డ్యామ్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ కాస్త సేదతీరిన తరువాత అక్కడ దొరికిన పుట్టగొడుగులు(మష్రూమ్స్), డ్యామ్‌లోని నీటిని తాగి ప్రాణాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. అయితే ఆదివారం స్థానిక ఎంపీ టోనీ పెరెట్ అటుగా వెళ్తుండగా.. వెబర్ ఒక చెట్టుకింద కూర్చొని కనిపించడంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన పోలీసులు వెబర్‌ను రక్షించి వైద్యసాయం అందిస్తున్నారు. వెబర్ శరీరంలో వైటల్స్ తగ్గడం వల్ల కాస్త నీరసంగా ఉన్నప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు. అయితే తనతో వచ్చిన పెంపుడు కుక్క ఆచూకీ మాత్రం ఇంతవరకు దొరకలేదు. భౌభౌ రికార్డు కాలిఫోర్నియాకు చెందిన విష్, హలో అనే రెండు శునకాలు ఒకే నిమిషంలో ‘28’ ట్రిక్స్ ప్రదర్శించి వరల్డ్ రికార్డ్ సెట్ చేశాయి. గతంలో ఉన్న రికార్డ్‌ను బ్రేశాయి. జంప్, క్యాచ్, ఫార్వర్డ్, ఎరౌండ్ లెఫ్ట్, ఎరౌండ్ రైట్, డౌన్...ఇలా ఈ శునకాల రకరకాల ట్రిక్స్ వీడియో చూస్తే ఆశ్చర్యమే కాదు బోలెడంత నవ్వు కూడా వస్తుంది. వీటి పిల్లలు కికో, స్పానిష్, టగ్‌లు చిన్న చిన్న రికార్డుల కోసం శిక్షణ పొందుతున్నాయి. ట్రైనర్ ఎమిలీ లర్ల్హమ్ శునకాల కోసం ప్రత్యేకమైన యూట్యూబ్ చానల్ నిర్వహిస్తోంది. -
వరద తగ్గింది.. బురద మిగిలింది
భీకర వర్షం ముంచెత్తి నాలుగు రోజులైనా హైదరాబాద్ నగరం ఇంకా నీళ్లలోనే నానుతోంది. శుక్రవారానికి కూడా సుమారు 90కు పైగా కాల నీలు ముంపు నుంచి తేరుకోలేదు. వరద ముంపు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కాలనీల్లోని రోడ్లపై ఇసుక మేటలు వేసింది. ఎటుచూసినా బురద... చెత్తాచెదారం. అడుగుతీసి అడుగు వేయడం నరకంగా మారింది. ఇదంతా ఎత్తిపోయ డానికి ఎన్ని రోజులు పడుతుందో, ఎప్పటికి సాధారణ స్థితి నెలకొంటుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే ముంపు ప్రాంతాల నుంచి సుమారు పదివేల కుటుంబాలను బయటకు తెచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని అపార్ట్మెంట్స్ సెల్లార్లు, కాలనీలు వరద ముంపులో ఉండటంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పునరుద్ధరించక సుమారు 222 వీధులు అంధకారంలో కొనసాగుతున్నాయి. బురదతో అవస్థలు... ముంచెత్తిన వరద నుంచి కొన్ని కాలనీలు బయటపడినా... శివారులోని జల్పల్లి చెరువు, కొత్త చెరువు, పల్లె చెరువు, తదితర చెరువుల నుంచి నీరు ఓవర్‌ఫ్లో అవుతూనే ఉంది. మరోవైపు డ్రైనేజీలు, మ్యాన్‌హోళ్లు ఉప్పొంగుతుండటంతో పలు కాలనీలు జలదిగ్బంధం నుంచి బయటపడటం లేదు. అనేక ముంపు ప్రాంతాల్లో రాకపోకలు మెరుగుపడలేదు. కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గినా ఇళ్లలో మోకాలిలోతు నీరు చేరడంతో తొలగించేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ బురద, మురుగు పేరుకుపోయింది. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. పేరుకుపోయిన మట్టితో ఇళ్ల తలుపులు, గేట్లు కూడా తీయలేక జనం అవస్థలు పడుతున్నారు. జనజీవనం నరకప్రాయమై రోడ్లు నడవడానికి కూడా వీల్లేకుండా మారాయి. వ్యాధుల భయం మరోవైపు నగరవాసులకు అంటువ్యాధుల ముప్పు పొంచివుంది. పాతబస్తీలో వరదలకు జంతువుల కళేబరాలు కొట్టుకొని రావడం, కొన్ని మృత్యువాత పడి అక్కడే పడి ఉండి దుర్గంధం వెదజల్లుతున్నాయి. హషమాబాద్, అల్ జుబేల్ కాలనీలు జలమయం కావడంతో ఆ ప్రాంతాల్లోని ఇళ్లు, షెడ్లలో ఉన్న మేకలు, గొర్రెలు, బర్రెలు పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డాయి. కళేబరాల్లో కొన్ని కొట్టుకుపోగా... మరికొన్ని అక్కడే ఉండిపో యాయి. మరోవైపు ఆహార వ్యర్థాలు కుళ్లిపోయి కంపుకొడుతున్నాయి. కుళ్లిన పశు కళేబరాలు, బురదతో అంటువ్యాధులు ప్రబలే అవకాశా లున్నాయి. నగరంలో డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు పొంగి పొర్లుతున్నాయి. పైపులు లీకవుతున్నాయి. మురు గునీటి నాలాల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయి మురుగంతా వీధులను ముంచెత్తుతున్నది. ఇంకోవైపు దుర్గంధంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. శుక్రవారం వరద తాకిడి తగ్గడంతో బయటపడ్డ మూసారాంబాగ్ బ్రిడ్జి. (ఇన్సెట్లో) వరద నీటిలో బ్రిడ్జి మునిగిన దృశ్యం నీటి కాలుష్యంతో... శివారు ప్రాంతాల్లో పోటెత్తిన వరదల వల్ల నీటి కాలుష్యం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఉప్పల్‌లోని కావేరీనగర్, భరత్‌నగర్, శ్రీనగర్ కాలనీలతో పాటు హబ్సీగూడలోని రవీంద్రనగర్, సాయిచిత్రానగర్, లక్ష్మీనగర్, మధురానగర్‌లలో అంటువ్యాధుల భయం పొంచివుంది. టైఫాయిడ్, డయేరియా, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. మరోవైపు దోమలు స్వైరవిహారం చేస్తుండటంతో డెంగీ జ్వరం సోకే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నదీమ్ కాలనీలో నదీమ్ కాలనీతో పాటు బాల్‌రెడ్డినగర్, విరాసత్ నగర్, జమాలికుంట బస్తీల్లో వరదనీరు ఇంకా ప్రవహిస్తూనే ఉంది. మోకాలి లోతు నీరు ఇళ్లలోనే ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయంతో అంధకారం నెలకొంది. నదీమ్ కాలనీలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, గోల్కొండ పోలీసులు వరదలో చిక్కుకున్న వారిని సరక్షితంగా బయటకు తీసుకొని వస్తున్నారు. వారికి భోజనం, నీటి బాటిళ్లు అందిస్తున్నారు. ఇళ్లు ఖాళీ చేయని వారిని ఒప్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు పంపిస్తున్నారు. నీరు పంపింగ్.. నేషనల్ డిజాస్టర్ టీమ్ (ఎన్డీఆర్ఎఫ్), డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (డీఆర్ఎఫ్), ఆర్మీ, ఆక్టోపస్ బలగాలు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు కలిసి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. చైతన్యపురి, షిర్డీనగర్, పటేల్ నగర్, వసంతపురి కాలనీ, కావేరి నగర్, పెద్దఅంబర్ పేటలో వరదల్లో చిక్కుకున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల్లోని నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపడంతో పాటు రహదారులకు అడ్డుగా పడి ఉన్న చెట్లను తొలగించారు. ప్రమాదానికి అవకాశమున్న మ్యాన్‌హోల్స్‌ను ఓపెన్ చేసి నీటిని క్లియర్ చేస్తున్నారు. ఇంకా జలదిగ్బంధంలో నగరంలోని నదీం, నిజాం కాలనీ, హబ్సిగూడ, హరిహరపురం, మిథిలానగర్‌కాలనీ, అల్హస్నత్ కాలనీ, గుడిమాల్కాపూర్ హీరానగర్ బస్తీ, షేక్‌పేట ఎంజీనగర్, అంబేడ్కర్ నగర్, సింగరేణి కాలనీ, గౌతం నగర్, శారదా నగర్, కమలానగర్, కోదండ రామ్‌నగర్, పీఅండ్‌టీ కాలనీ, బార్కాస్, మైసారం, చంద్రాయణగుట్ట అల్ జుబేల్ కాల నీ, ఫలక్‌నుమా, ఇంద్రానగర్, జమాల్‌నగర్, సలాలా ప్రాంతాలు దాదాపు రెండు నుంచి మూడు అడుగుల ముంపులో ఉన్నాయి. హబ్సిగూడలో 5 వేల మంది నిరాశ్రయులు హబ్సిగూడ పరిధిలోని నాలుగు కాలనీల్లో వందల కొద్దీ అపార్ట్మెంట్లు, ఇళ్లు నీటము నిగాయి. కనీసం 5,000 మంది నిరాశ్రయుల య్యారు.సెల్లార్లలో, గుడిసెల్లో ఉన్న వాచ్ మెన్లు, సెక్యూరిటీ సిబ్బంది కుటుంబాలు సర్వం కోల్పోయాయి. వంటపాత్రలు, బియ్యం సహా అన్నీ నీటిపాలయ్యాయి. అదేవిధంగా రవీంద్రనగర్ కాలనీ, లక్ష్మీనగర్, సాయిచి త్రానగర్ కాలనీ, మధురానగర్‌లలో కనీసం 50 దుకాణాలు నీళ్లలో మునిగాయి. కిరాణా, ఎల క్ట్రిక్, బట్టల దుకాణాలు... తదితర అన్ని షాపు ల్లో వస్తువలన్నీ తడిసి ముద్దయ్యాయి. నాలుగు రోజులైనా సెల్లార్లు, గ్రౌండ్‌ఫ్లోర్ ఇళ్లు ఇంకా నీటిలోనే ఉన్నాయి టోలిచౌకిలోని నిజాంకా లనీ, అల్హస్నత్ కాలనీ, గుడిమల్కాపూర్ హీరానగర్ బస్తీ, షేక్‌పేట, ఎంజీనగర్, అంబే డ్కర్ నగర్ తదితర బస్తీలలోనూ వరద నీరు పూర్తిస్థాయిలో క్లియర్ కాలేదు. వివిధ ప్రాం తాల్లో అధికార పక్షంతో పాటు మిగతా రాజ కీయ పక్షాల నేతలు పర్యటించినా బాధితులకు సరైన భరోసా కల్పించలేకపోతున్నారు. అధికార యంత్రాంగం, కొన్ని స్వచ్ఛంద సంస్ధలు బాధితులకు అపన్నహస్తం అందిస్తూ పండ్లు, ఆహారపదార్థాలు అందజేస్తున్నారు. -
కోస్తా తీరంలో కంబళ.. ఎలా ఆడతారంటే
క్రికెట్, ఫుట్‌బాల్ టోర్నీలతో సమానంగా ఆదరణ. ఏడాదిపాటు దున్నపోతులు, పరుగువీరులకు శిక్షణ. గెలిస్తే దున్నలు, ఆటగాళ్లు, యజమానుల పేరు జిల్లాలో మార్మోగిపోతుంది. ఓడినవారు ఈసారి గెలవాలని మళ్లీ ప్రయత్నిస్తారు. ఒక గ్రామీణ క్రీడ కంబళ ఇప్పుడు అందరికీ హాట్ టాపిక్ అయ్యింది. కంబళ ఆటగాళ్లు ప్రపంచ పరుగు రికార్డులను అవలీలగా అధిగమిస్తుండడమే దీనికి కారణం. అంతేకాదు కంబళకు ఘనమైన వారసత్వ చరిత్ర కూడా ఉంది. కోస్తా జిల్లాల ప్రజల సంస్కృతిలో ఒక విడదీయలేని భాగం. సాక్షి, బెంగళూరు: బురద నీటిలో దున్నపోతులతో పోటీగా వంద మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పరుగెత్తి ప్రపంచ పరుగు పందెం విజేత ఉసేన్ బోల్ట్ రికార్డును బద్దలుకొట్టి మంగళూరుకు చెందిన శ్రీనివాసగౌడ, అలాగే నిశాంత్ శెట్టి అనే మరో కంబళ యువకుడు అదే 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలో పరిగెత్తి శ్రీనివాసగౌడ రికార్డును బద్దలుకొట్టాడు. ఎన్నో ఏళ్ల కఠోర సాధన చేసినా ఈ స్థాయిలో రికార్డు సృష్టించడానికి పరుగు పందేల క్రీడాకారులు ఆపసోపాలు పడుతుంటే కంబళ పోటీల్లో అవలీలగా ఎలా సాధించేశారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. కంబళ ఆటగాళ్లకు ఇంతటి శక్తిసామర్థ్యాలు ఎలా వచ్చాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎలా ఆడతారంటే 100 మీటర్లు అంతకంటే ఎక్కువ దూరం ఉండే ట్రాక్‌లు సిద్ధం చేసి వాటిలో కొద్దిమేర బురదనీటిని నింపుతారు. తరువాత ఒకటి, లేదా జంట దున్నపోతులతో ఆటగాళ్లు రంగంలోకి దిగుతారు. ఎవరు వేగంగా అవతలికి చేరితే వారే విజేత. ఇది కూడా ఒక తరహా పరుగు పందెం అనే చెప్పాలి. అయితే సాధారణ ట్రాక్‌కు కంబళ ట్రాక్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. సాధారణ ట్రాక్‌లో వేళ్లు, పూర్తి కాళ్లను నియంత్రించుకుంటూ పరుగెత్తాల్సి ఉంటుంది. కానీ కంబళలో మడమలను నియంత్రించుకుంటూ పరుగెత్తాల్సి ఉంటుంది. తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది ఈ పోటీల్లో ఏడు రకాలున్నాయి. బారే కంబళ, కోరి కంబళ, అరసు కంబళ, దెవెరే కంబళ, బాలె కంబళ, కెరె కంబళ, కాద్రి కంబళలుగా విభజించారు. అయితే కంబళ క్రీడలో అన్ని కంబళలు పోటీ కంబళలు కావు. అందులో కొన్ని కంబళలు పోటీ కంబళలు కాగా మరికొన్ని పోటీ లేని సాధారణ కంబళలు. రెండు రకాల కంబళలను బురదనీటిలో నిర్వహిస్తారు. ఏడు రకాల కంబళలు కంబళ పోటీల్లో కొన్ని రకాల పోటీలను ప్రత్యేక విభాగాలుగా విభజిస్తారు. వాటిలో నెగిలు, హగ్గ, అడ్డా హాలేజ్, కేన్ హాలేజ్ ప్రధానమైనవి. ఒక్కో రకమైన కంబళకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వాటి గురించి పరిశీలిస్తే.. నెగిలు చెక్క లేదా ఇనుముతో తయారు చేసిన ఒక రకమైన భారీ నాగలితో నిర్వహించే పోటీని నెగిలుగా గుర్తిస్తారు. ఈ భారీ నాగలిని దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఇందులో ఎంట్రీ స్థాయి, జూనియర్, సీనియర్ రౌండ్లు మాత్రమే ఉంటాయి. హగ్గ ఈ విభాగంలో పాల్గొనే దున్నలకు అనుభవం ఎక్కువగా ఉంటుంది. బలమైన తాడును దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఇందులో ఓ వ్యక్తి చేతిలో తాడుతో దున్నలను నియంత్రిస్తూ వాటితో పాటు బురదనీటిలో పరుగెత్తుతాడు. ఇందులోనూ సీనియర్, జూనియర్ రౌండ్లు ఉంటాయి. అడ్డా హాలేజ్ ఇది కాస్త కఠినంగానే ఉంటుంది. వంపు తిరిగిన చెక్కను దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఈ సమయంలో చెక్కపలకపై వ్యక్తి నిలబడి ఉంటాడు. దీంతో పోటీలో పాల్గొనే దున్నలు చెక్కతో పాటు వ్యక్తిని సైతం బురదనీటిలో వేగంగా లాక్కెళ్తాయి. ఇందులో కేవలం సీనియర్ రౌండ్ మాత్రమే ఉంటుంది. కేన్ హాలేజ్ ఈ రకం పోటీలు రసవత్తరంగా ఉంటాయి. ప్రత్యేకంగా తయారు చేసిన గుండ్రటి చెక్కను దున్నలకు కడతారు. చెక్కకు మధ్యలో రెండు ప్రత్యేక రంధ్రాలు ఏర్పాటు చేస్తారు. దున్నలు పరిగెత్తే సమయంలో ఈ రెండు రంధ్రాల నుంచి చిమ్మే నీటి ఎత్తు, వేగంతో విజేతను ఎన్నుకుంటారు. ఇందులో సూపర్ సీనియర్ రౌండ్ మాత్రమే ఉంటుంది. ఉడుపి, మంగళూరుకు ప్రత్యేకం కర్ణాటకలోని కరావళి ప్రాంతంగా పిలిచే ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ తదితర కోస్తా జిల్లాల్లో శతాబ్దాలుగా నిర్వహిస్తున్న క్రీడ కంబళ. తమ సంస్కృతికి ప్రతీకగా ప్రజలు ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. ఒక ఊరిని మించి మరో ఊరివారు పోటీలు ఘనంగా ఉండాలని శ్రమిస్తారు. నవంబర్ నెలలో మొదలయ్యే కంబళ సీజన్ మార్చి వరకు కొనసాగుతుంది. కంబళ సమితుల ఆధ్వర్యంలో కంబళ పోటీలు నిర్వహిస్తారు. అన్ని రకాల కంబళలు మూడు శతాబ్దాలకు పైగానే చరిత్ర ఉన్నవే. వీటిలో ఎక్కువ శాతం దక్షిణ కన్నడ జిల్లాలోనే నిర్వహిస్తుండగా కొన్ని కంబళలు సమీపంలోని ఉడుపి జిల్లాలో నిర్వహిస్తుంటారు. విజేతలకు బహుమానాల పంట కంబళలో పోటీల్లో గెలిచిన విజేతలను కొన్నిసార్లు నగదు బహుమానంతో మరికొన్నిసార్లు బంగారు నాణేలను బహుమానంగా అందించి సత్కరిస్తారు. గెలిచిన దున్నల యజమానులకూ పేరు లభిస్తుంది. ఆటగాళ్లు, చూసేవాళ్లలో కంబళ సాగుతున్నంతసేపూ ఉత్సాహం పొంగిపొర్లుతుంటుంది. కంబళ పోటీల కోసం దున్నలకు ప్రత్యేక శిక్షణనిస్తారు. శివుని భక్తుల ఆట కంబళ చరిత్ర శివునితో ముడిపడి ఉంది. పరమ శివునికి భక్తులైన నాథుల ప్రేరణతో కంబళ మొదలైనట్లు చెబుతారు. కంబళ క్రీడలు ప్రారంభమయ్యే ముందురోజు రాత్రి కొరగ తెగకు చెందిన పురుషులు కొరగ సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శిస్తారు. అందులో భాగంగా పంచకర్మగా భావించే మద్య, మాంస, మత్స్య, ముద్ర, మిథున క్రియలను పాటిస్తారు. దీంతోపాటు పానిక్కులుని అనే సాంస్కృతిక వేడుకను సైతం నిర్వహిస్తారు. -
అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో మట్టికప్పుల్లోనే చాయ్!
న్యూఢిల్లీ: ఇకపై ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ డిపోల వద్ద ఉన్న స్టాళ్లు, ఎయిర్‌పోర్టులు, మాల్స్‌లో మట్టి కప్పుల్లో చాయ్‌ని ఆస్వాదించవచ్చు. ఈమేరకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ.. రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం వారణాసి, రాయ్‌బరేలీ రెండు రైల్వే స్టేషన్లలో మాత్రమే కేటరర్లు ఈ మట్టి కప్పుల్లో చాయ్‌ను అందిస్తున్నారు. ‘సుమారు 100 రైల్వే స్టేషన్లలో, ఎయిర్‌పోర్టులు, రాష్ట్రాల్లోని బస్ డిపోల వద్ద ఉన్న టీ స్టాళ్లలో మట్టి కప్పుల్లోనే చాయ్‌ను అందించడాన్ని తప్పనిసరి చేయాలని గోయల్‌కు లేఖ రాశాను. దీంతో స్థానిక తయారీదారులకు మార్కెట్ లభించడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించే పేపర్, ప్లాస్టిక్‌ల వాడకాన్ని నిషేధించినట్లవుతుందని వివరించారు. -
దేశాయ్ చెరువులో మట్టి దొంగలు
ఎమ్మిగనూరు: మట్టి రుచి ఎరిగిన అక్రమార్కులు చెరువులను చెరబడుతున్నారు. యథేచ్ఛగా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. అధికారుల అండదండలతో మట్టి దొంగలు రూ. కోట్లకు పడిగలెత్తుతున్నారు. నందవరం మండలం హాలహర్వి రెవెన్యూ పరిధిలోని దేశాయ్ చెరువు ఉంది. దశాబ్దాల కాలంగా ఈ చెరువుకింద వందలమంది రైతులు తమ పంటలను పండించుకొంటున్నారు. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో ఉన్న ఈ చెరువు అధికారులకు, రాజకీయ దళారులకు ఆదాయవనరుగా మారింది. తెలుగుదేశంపార్టీ అధికారంలో ఐదేళ్లపాటు యథేచ్ఛగా కొనసాగిన మట్టిదోపిడీ ఇప్పుడు కూడా కొనసాగుతోంది. చెరువులో మట్టిని తవ్వేందుకు ఎమ్మిగనూరు పరిసరప్రాంతంలోని ఇటుకల బట్టీల యజమానులు ఏకంగా ప్రొక్లెయినర్లను, జేసీబీలను వాడుతున్నారు. ప్రతి రోజు 60 నుంచి 90 ట్రాక్టర్ల వరకు మట్టిని తరలించేందుకు వినియోగిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ కనీసం ఆరు ట్రిప్పుల మట్టిని రోజూ తరలిస్తోంది. ఒక్క ట్రాక్టర్ మట్టిని తరలించేందుకు ఇటుకల బట్టీల యజమానులు రూ.650 చెల్లిస్తారు. ఐదేళ్లూ దోపిడీ.. తెలుగుదేశంపార్టీ్ట అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు మట్టిని యథేచ్చగా దోచేశారు. చెరువులో సారవంతమైన జిగుట మట్టి కావటంతో ఇటుకల తయారికీ అనుకూలంగా ఉంది. దాదాపు 8 ఇటుకల బట్టీలకు ఈ ఒక్క చెరువుమట్టినే తరలిస్తున్నారంటే ఈ మట్టి ప్రాధాన్యతేమిటో తెలుస్తోంది. చెరువు మట్టితో ఇటుకల బట్టీ యజమానులు కోట్లకు పడగలెత్తారు. చెరువులో మట్టిని తరలించిన తరువాత నీరు–చెట్టు కింద అధికారులు బిల్లులు చేయటం, వాటిని దిగమింగటంలో అప్పటి టీడీపీ నేతలూ సిద్ధహస్తులే. అధికారం మారినా దేశాయి చెరువులో మట్టిదోపిడీ మాత్రం ఆగటం లేదు. ఇక్కడ దోపిడీ ‘అధికారిక’ పేటెంట్గా మారింది. సమన్వయంతో ప్రకృతి సంపదను పరిరక్షించాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మాత్రం కళ్లకు గంతలు కట్టుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల పొలాలకు ఉపయోగపడాల్సిన సారవంతమైన ఒండ్రుమట్టి నేడు వ్యాపారవస్తువుగా మారింది. ఇప్పటికైన జిల్లా అధికారులు స్పందించి ఇటుక బట్టీల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు హాలహర్వి దేశాయ్ చెరువులో మట్టి తరలించేందుకు ఎటువంటి అనుమతులు లేవని, ప్రస్తుతం తాము ఎవరికి అనుమతులివ్వలేదని డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. మట్టి అక్రమ తరలింపును అడ్డుకొనేందుకు రెవెన్యూ,పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టాలన్నారు. –వెంకటేశ్వర్లు, ఎల్లెల్సీ డీఈ -
ఇంజినీర్‌పై బురద పోసిన ఎమ్మెల్యే
సాక్షి, ముంబై: మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాధికారిని బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్‌వర్గీయా బ్యాటుతో కొట్టిన ఘటన జరిగి పక్షం రోజులైనా గడవక ముందే మహారాష్ట్రలోనూ దాదాపు అలాంటి ఘటనే గురువారం జరిగింది. గుంతలమయంగా మారిన హైవేపై మరమ్మత్తులు చేపట్టాలని వినతిపత్రాలు సమర్పించినా లాభంలేకపోవడంతో కోపంతో కాంగ్రెస్‌కు చెందిన నితేశ్ రాణే అనే ఎమ్మెల్యే ఓ ఇంజినీర్‌ను వంతెన కమ్మీకి కట్టేసి, ఆయనపై బక్కెట్లతో బురదపోశారు. నితేశ్ మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే కొడుకు. ముంబై–గోవా రహదారిపై, సింధుదుర్గ్ జిల్లాలోని కనకవ్లీ పరిసరాల్లో ఈ ఘటన గురువారం జరిగింది. ఇంజినీర్ ప్రకాశ్ ఖేడేకర్పై ఎమ్మెల్యే నితేశ్, కనకవ్లీ పురపాలక మండలి అధ్యక్షుడు సమీర్ నలవాడేలు బకెట్లతో బురద పోశారు. ‘గుంతల్లోంచి వెళ్లే వాహనాల కారణంగా పాదచారులపై బురద పడుతోందని, ఈ రోజు మీ మీదా బురద పడనీయండి’ అని నితేశ్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో పోలీసులు నితేశ్ను అదుపులోకి తీసుకున్నారు. -
తాళ్ల చెరువును తోడేస్తుండ్రు...
సాక్షి, వనపర్తి: ఓవైపు చెరువులకు పూర్వ వైభవం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించి నాటి గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేస్తుంటే, కొందరు చెరువుల మనుగడను ప్రమాదంలో పడేస్తున్నారు. ఇటీవల మరమ్మతు చేసిన వనపర్తి జిల్లా కేంద్రంలోని తాళ్ల చెరువు ఓ వైపు ఆక్రమణకు గురైంది. మరోవైపు అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే కొందరు రియల్ వ్యాపారులు చెరువులోని మట్టిని తరలించుకుపోయి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషమై స్థానికులు అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పొంచి ఉన్న ముప్పు చిన్ననీటి పారుదల నిబంధనల ప్రకారం చెరువు కట్టకు పదిమీటర్ల దూరం వరకు కనీసం పూడికతీత పనులు చేపట్టనివ్వరు. చెరువుకట్టకు సమీపంలో గోతి ఎక్కువగా చేస్తే నీరు నిల్వ అయిన సమయంలో కట్ట కిందభాగం నుంచి అవతలికి నీరు వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీంతో క్రమక్రమంగా కట్టబలహీనపడి తెగిపోయే పరిస్థితులు వస్తాయి. ఇంత ప్రమాదం ఉన్నా.. అధికారులతో ఎలాంటి అనుమతి తీసుకోకుండా ప్రభుత్వ ఆధీనంలోని చెరువులో నుంచి కొందరు రియల్ వ్యాపారులు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ చెరువు కింద ప్రస్తుతం ఆయకట్టు చాలా తక్కువగా ఉంది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చిన్నపాటి తాళ్ల చెరువును మినీ ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని ఏడాది పొడవునా.. నీటితో నిల్వ ఉంచి భూగర్భజలాలను పునఃరుద్ధరించాలని అధికారులు, ప్రభుత్వం భావిస్తోంది. తాళ్ల చెరువు అభివృద్ధి పనుల కోసం ఎస్టిమేట్ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులకు మౌకిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్షం రోజుల్లో ఎస్టిమేట్ సిద్ధమయ్యే సమయంలో రియల్ వ్యాపారులు చెరువులో మట్టితవ్వకాలకు తెగబట్టారు. సుమారు 2వేల ట్రాక్టర్ల వరకు మట్టిని తరలించినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యమే తాళ్ల చెరువులో కొందరు ఓ ప్రొక్లెయినర్, సుమారు పది ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారని చెరువుకు సమీపంలో నివాసం ఉండేవారు చిన్ననీటి పారుదలశాఖ అధికారులకు ఫోన్లో సమాచారం అందించారు. దీనికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఓ ఉన్నతస్థాయి అధికారి సమాధానం ఇచ్చారని సదరు వ్యక్తి తెలిపారు. సమాచారం ఇచ్చిన వారిని ప్రశ్నలతో ఎదురుదాడి చేయటానికి ప్రయత్నించటం విస్మయానికి గురిచేసిందని ‘సాక్షి’తో వాపోయారు. అక్రమణల పర్వం ఇలా.. ఇప్పటికే తాళ్ల చెరువు వాగు ఆక్రమణకు గురైంది. 1999, 2008లో రెండుసార్లు కురిసిన భారీ వర్షాలకు నీరంతా నిండి ఇళ్లలోకి, రోడ్లపైకి వచ్చాయి. 1999లో చోటుచేసుకున్న సంఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు గతంలో చోటుచేసుకున్న విషయం తెలిసినా.. అధికారులు చెరువుల విషయంలో అలసత్వం ప్రదర్శించటం ఏమిటని పలువురు అసహనం వ్యక్తంచేశారు. గతంలో చెరువులో నుంచి అలుగుపారడంతో పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్, శ్వేతానగర్, దామోదర్ కాలనీ, బ్రహ్మంగారివీధి, శంకర్‌గంజ్, రాంనగర్ కాలనీ, రామాటాకీస్, బంగారం దుకాణాలు, ఆర్అండ్బీ కార్యాలయం, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, టౌన్‌పోలీస్‌స్టేషన్ జలమయం అయ్యాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం రియల్ వ్యాపారులు చేసిన తవ్వకాలతో భవిష్యత్‌లో కట్టకు ఏదైనా ప్రమాదం జరిగితే సంభవించే నష్టాన్ని ఊహించటం కష్టమే. వెంటనే చర్యలు తీసుకుంటాం తాళ్ల చెరువులో మట్టి తవ్వకాల గురించి ఇప్పటికే స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే చెరువును సందర్శిస్తాం. అక్రమ మట్టి తరలింపును అడ్డుకుంటాం. మినీట్యాంక్‌బండ్ తరహాలో తాళ్ల చెరువును అభివృద్ధి చేసేందుకు ఎస్టిమేట్లు త్వరలో పూర్తి చేస్తాం. – భరత్, అసిస్టెంట్ ఇంజనీర్, వనపర్తి