స్నానం చేసేముందు ఎవరున్నా ఊరుకోదు | Excited pony rolls in mud pond – forgets small child on its back! | Sakshi
Sakshi News home page

స్నానం చేసేముందు ఎవరున్నా ఊరుకోదు

Published Fri, Apr 15 2016 8:42 AM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

స్నానం చేసేముందు ఎవరున్నా ఊరుకోదు

స్నానం చేసేముందు ఎవరున్నా ఊరుకోదు

తీరిక లేని కారణంగా స్నానం చేసేటప్పుడు ఉండే అనుభూతిని గుర్తించలేరేమోగానీ.. దానివల్ల కలిగే ఉపశమనం అంతా ఇంత కాదు. ఇలాంటి ఉపశమనం మనుషులే కాదు.. జంతువులు కూడా కోరుకుంటాయి. ఇక స్నానం చేసేసమయంలో అవి తమను తాము మరిచిపోతాయి. పూర్తిగా స్నానం చేయడాన్ని ఆస్వాదిస్తాయి. ఇక గుర్రాల విషయంలో ఇది మరీ ప్రత్యేకం. స్నానానికి వెళ్లే ముందు మనం ఎలా దుస్తులు విప్పేస్తామో.. గుర్రాలు కూడా తమ శరీరానికి బట్టలు ఉన్నట్లుగా భావించి వాటిని తీసేసినట్లుగా.. వాటి వీపుపై చిన్న పురుగును కూడా ఉండనివ్వవు.

అలా చేసుకున్న తర్వాతే స్నానానికి వెళతాయి. ఇదే విషయాన్ని ఓ గుర్రం నిరూపించింది. తన బాస్ కుమారుడిని వీపుపై ఎక్కించుకొని వచ్చిన ఓ తెల్ల గుర్రం పచ్చిక బయళ్లగుండా వెళుతూ ఓ నీటి గుంటను చూసింది. దాన్ని చూడగానే మెల్లగా వడివడిగా అడుగులు వేసుకుంటూ అందులోకి అడుగుపెట్టింది. ఆ వెంటనే నీళ్లను చూసిన సంబరంలో కాళ్లతో ముందుకు వెనక్కూ ఆ నీళ్లను చిమ్మింది.

మరింత పారవశ్యానికి లోనై వీపుపై తన యజమాని కుమారుడు ఉన్నాడని కూడా చూడకుండా అమాంతం మొకాళ్లతో నీళ్లలోకి కూర్చుంది. ఆ వెంటనే ఒక్క విదుల్పు విదిల్చింది. అంతే ఆ బుడతడు వెళ్లి బురద నీళ్లలో పడ్డాడు. ఆ తర్వాత ఆనందంగా ఆ గుర్రం చక్కగా నీళ్లలో పొర్లి మళ్లీ సవారీకి సిద్ధమైంది. ఇదంతా చూసిన ఆ బుడతడు తొలుత కంగారు పడినా తిరిగి ప్రేమగా దానిపైకి ఎక్కాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement