bath
-
ఇంటి నుంచే కుంభమేళా స్నానం.. ఎలాగంటే..
మహా కుంభమేళా హిందువులకు పెద్ద పండుగలాంటిది. కుంభమేళా సమయంలో హిందువులు త్రివేణీ సంగమంలో స్నానం చేయాలని అనుకుంటారు. తద్వారా తాము చేసిన పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. అయితే పలు కారణాల దృష్ట్యా అందరికీ కుంభమేళాకు వెళ్లే అవకాశం లభించదు. అలాంటప్పుడు చింతించకుండా ఉండేందుకు ఒక మార్గాన్ని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తెలిపారు.కుంభమేళాకు వెళ్లే అవకాశం లేనివారు ఈ మేళాకు వెళ్లినవారిని అడిగి కుంభమేళా జలాలను తీసుకోవాలని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సూచించారు. ఆ నీటిని మీ ఇంటిలోని నీటి బకెట్లో వేసుకుని, ఆ నీటితో స్నానం చేయాలని తెలిపారు. ఇలా చేయడం ద్వారా కుంభస్నానం చేసినంతటి ఫలితాలనే పొందుతారని శంకరాచార్య స్వామి అన్నారు. మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతం నుంచి నీటిని, ప్రసాదాన్ని పంపేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వాటిని సంప్రదించి మన ఇంటికి నీటిని తెప్పించుకోవచ్చని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సూచించారు. ‘త్రివేణి సంగమ్ వాటర్ డెలివరీ సర్వీస్’ కుంభమేళా నుండి నీటిని ఇంటికి నేరుగా డెలివరీ చేస్తోందని తెలిపారు.ఏదైనా కారణం చేత మహా కుంభమేళా నీటిని మీరు పొందలేకపోతే మీ ఇంట్లో ఉంచుకున్న గంగా జలంలోని కొన్ని చుక్కలను బకెట్లో కలుపుకుని స్నానం చేయడం ద్వారా కూడా పుణ్యం పొందవచ్చని శంకరాచార్య స్వామి తెలిపారు. ఇలా స్నానం చేసిన తరువాత దానధర్మాలు చేయడం ఉత్తమఫలితాలనిస్తుందని తెలియజేశారు.ఇది కూడా చదవండి: Maha Kumbh-2025: ఒక్కో ఘాట్‌కు ఒక్కో ప్రత్యేకత.. విశేష ఫలితం -
మూడ్‌ని బట్టి స్నానం చేయిస్తుంది!
అద్భుతమైన ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన జపాన్ తాజాగా వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి.. సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఆవిష్కరించింది. వామ్మో..! ఏంటిది అనుకోకండి. మాములుగా మనమే స్నానం చేయడం అనేది పాత ట్రెండ్. దీన్ని కూడా మిషన్ సాయంతో తొందరగా పనికానిస్తే.. అనే వినూత్న ఆలోచనతో జపాన్ చేసిన ఆవిష్కరణ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే మనం బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ మాదిరి "హ్యూమన్ వాషింగ్ మెషిన్" అన్నమాట. ఏంటీ మిషన్‌తో స్నానమా అని విస్తుపోకండి. ఇది వెల్‌నెస్‌ని దృష్టిలో ఉంచుకుని, అత్యాధుని ఫీచర్లతో రూపొందించారు. అసలేంటీ మిషన్ ? ఎలా పనిచేస్తుంది..? తదితరాల గురించి తెలుసుకుందామా..!ఈ "హ్యూమన్ వాషింగ్ మెషిన్"ని ఒసాకాకు చెందిన సైన్స్ కో కంపెనీ ఏఐ సాంకేతికతో రూపొందించింది. దీన్ని జపాన్‌లో మిరాయ్ నింగెన్ సెంటకుకిగా పిలుస్తారు. ఈ మిషన్ కేవలం 15 నిమిషాల్లోనే మనిషి శరీరాన్ని శుభ్రపరుస్తుందట. అలాగే మంచి విశ్రాంతితో కూడిన మానసిక ఆనందాన్ని అందిస్తుందట. దీంట్లో కేవలం స్నానమే కాదు మనసు రిలాక్స్ అయ్యేలా చక్కటి వేడినీళ్ల మసాజ్ వంటి అత్యాధునిక ఫ్యూచర్లు కూడా ఉన్నాయి. దీనిలో ఉండే ఐఏ సెన్సార్లు మానవుల బాడీ మూడ్ ఎలా ఉందో టెస్ట్ చేసి దానికనుగుణంగా నీటి ఉష్ణోగ్రత ఆటోమెటిక్‌గా సెట్ అవుతుందట. అలాగే మన భావోద్వేగా పరిస్థితికి అనుకుణంగా మంచి విజువల్స్‌ని కూడా ప్రొజెక్ట్ చేస్తుందట. కేవలం పరిశుభ్రత మాత్రేమ గాక మంచి వెల్నెస్ అనుభవాన్ని కూడా అందిస్తుందని ఈ ఒసాకా కంపెనీ చైర్మన్ యసుకి అయోమా చెబుతున్నారు. ముఖ్యంగా అత్యంత బిజీగా ఉండే వ్యక్తులకు ఈ మిషన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఇది కొత్తదేం కాదు..ఇంతకు ముందే ఈ మానవ వాషింగ్ మిషన్‌ని రూపొందించారు. దీని తొలి వర్షన్‌ని 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్‌పోలో సాన్యో ఎలక్ట్రిక్ కో పరిచయం చేసింది. అయితే అప్పట్లో ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నప్పటికీ..కమర్షియల్ ప్రొడక్ట్‌గా ప్రజల్లోకి బాగా వెళ్లలేదు. కానీ ప్రస్తుతం ఏఐ సాంకేతికతో కూడిన ఈ మిషన్‌ని అత్యాధునిక ఫ్యూచర్లతో డిజైన్ చేశారు. ఈ ప్రొడక్ట్‌ని పానాసోనిక్ హోల్డింగ్స్ కార్పోరేషన్ కంపెనీ తీసుకురానుంది. ఈ ఏడాది ఒసాకా కన్సాయ్ ఎక్స్‌పోలో ఈ సరికొత్త సాంకేతిక హ్యూమన్ వాషింగ్ మిషన్‌ని ప్రదర్శించనున్నారు. అక్కడ దాదాపు వెయ్యిమందికి పైగా అతిథులు ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో.. ప్రత్యక్షం అనుభవం ద్వారా తెలుసుకోనున్నారు. అలాగే ఈ మిషన్ పనితీరు వారెంటీల గురించి సంకిప్త సమాచారం గురించి వివరింనుంది సదరు కంపెనీ ఒసాకా. అయితే సదరు కంపెనీ దీని ధర ఎంతనేది ఇంక ధృవీకరించలేదు. కాగా, ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆఖరికి వ్యక్తిగత శుభ్రతను కూడా హై-టెక్ లగ్జరీగా మార్చడం జపాన్‌కే చెల్లిందని ఒకరూ, ఇంత చిన్న పనికోసం అంతప్రయాస పడ్డారా మీరు అని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. 🚨AI-POWERED HUMAN WASHING MACHINE: BECAUSE WHO HAS TIME TO SCRUB?Japan’s "Mirai Ningen Sentakuki" is here to wash your...everything. A 15-minute AI-powered bath capsule uses jets, microbubbles, and calming videos to cleanse bodies and soothe egos.Chairman Yasuaki Aoyama… pic.twitter.com/0GBwOtCV9r— Mario Nawfal (@MarioNawfal) December 3, 2024 (చదవండి: ‘ఫాస్ట్’గా స్లిమ్ కాకండి!) -
సమ్మర్లో వేడి నీళ్ల స్నానమా? ఈ సర్ప్రైజింగ్ విషయాలు తెలుసా?
ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా స్నానం చేయడం దాదాపు అందరికీ అలవాటు. కొందరు వేడి నీటితో, మరికొందరు చల్లటి నీటితో స్నానం చేస్తారు. కానీ వేడి నీటి ( మరీ వేడి నీళ్లు కాదు) స్నానంతో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాస్తవానికి సీజన్ ఏదైనా వామ్ వాటర్‌తో స్నానంతో శరీరం, మనస్సు సేద తీరుతాయి. మరి వేడి నీటి స్నానంతో ఇంకా ఎలాంటి ప్రయో జనాలున్నాయో చెక్ చేద్దామా? చలికాలంలో వేడి స్నానం చేయడం కామన్. కానీ వేసవిలో కూడా వేడి నీటి స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదే. అన్ని సీజన్లలో వేడి స్నానం చేయడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గుండెజబ్బులు, అధిక బీపీ ఉన్న వారు కొంచెం అప్రతమత్తంగా ఉండాలి. కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది రోజంతా పనిచేసి అలిసిపోయిన శరీరానికి, కండరాలకు వేడి నీటి స్నానం హాయినిస్తుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు. కీళ్లకు ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడిని తగ్గించడంలోసహాయపడుతుంది ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి చాలా కామన్ అయిపోయింది. అందువల్ల, మనస్సు ప్రశాంతంగా, పూర్తిగా రిలాక్స్‌గా ఉండాలంటే వేడి స్నానం ఉత్తమం. ఇందులో ఎప్సమ్ లవణాలు, మంచి సువాసన గల నూనెలు కూడా ఉపయోగించవచ్చు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల వల్ల చర్మ రంధ్రాలు తెరుచు కుంటాయి .పేరుకుపోయిన మురికి, శరీరం శుభ్రపడి, బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తుంది. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది అందరికీ ఆరోగ్యకరమైన చర్మాన్నే కోరుకుంటారు. ఇందుకోసం కొంతమంది సౌందర్య సాధనాలు ఆశ్రయిస్తారు. కానీ, రోజువారీ వేడి స్నానంలో రహస్యాన్ని మర్చిపోకూడదు. వేడినీరు చర్మాన్ని హైడ్రేట్ చేసి, చర్మ కణాలలో ఆక్సిజన్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. ఫలితంగా మృదువైన స్కిన్ సొంతమవుతుంది. ఏర్పడుతుంది. రక్త ప్రసరణకు: శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అన్ని శరీర భాగాల సరైన పనితీరు సరైన రక్తప్రసరణచాలా అవసరం. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఇది కీలకం. మంచి నిద్రకు: వేడి నిటి షవర్ కండరాల ఒత్తిడిని తగ్గిస్తుందని ముందే చెప్పుకున్నాం కదా. దీని ఫలితంగా ప్రశాంతమైన మెదడు మెలటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. జుట్టుకు: జుట్టుకు చాలా ప్రయోజనకరం. స్కాల్ప్ లోని సూక్ష్మ రంధ్రాలు ఓపెన్ అయ్యి, తేమ లోపలికి వెళ్లేలా చేస్తుంది. స్కాల్ప్‌ను శుభ్రనడుతుంది. బాగా హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలకే కాదు, చుండ్రు లాంటి నిరోధానికి కూడా కీలకం. ఇక శీతాకాలంలో అయితే జలుబు , ఫ్లూ బారిన పడటం చాలా సాధారణం. అందుకే వేడి షవర్ తలనొప్పి, ముక్కు దిబ్బడ, జలుబుకి మంచి ఉపశమనం. టిప్: ఎప్సమ్ లవణాలు, 10 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్,అర కప్పు బేకింగ్ సోడా కలుపుకొని వారానికి ఒకసారి 20 నిమిషాలు, హాట్ బాత్ టబ్‌లో కూర్చోండి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. ఒత్తిడి సంబంధిత హార్మోన్లను తగ్గిస్తుంది, శరీర pH స్థాయిలను సమతుల్యం చేస్తుంది. -
USA: ‘ఈసారి నేను గెలవకపోతే’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్షఎన్నికల్లో తన గెలుపునకు సంబంధించి దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ప్రస్తుత అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలవకపోతే దేశంలో రక్త పాతం జరుగుతుందని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ తనతోనే సాధ్యమని, బైడెన్‌తో కాదని చెప్పారు. ఒహియోలో రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి బెర్నీ మొరినో తరపున ప్రచారం చేస్తూ శనివారం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Here’s the whole clip of Donald Trump talking about the bloodbath. pic.twitter.com/pu8M35B5MR — Molly Pitcher (@AmericanMama86) March 17, 2024 ‘నేను గెలవకపోతే దేశంలో రక్త పాతం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో నేను గనుక గెలవకపోతే ఈ దేశంలో మళ్లీ మీకు ఎన్నికలు ఉంటాయో లేదో చెప్పలేను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో బైడెన్ క్యాంపెయిన్ టీమ్ స్పందించింది. ‘ట్రంప్ మళ్లీ జనవరి 6 (2021లో వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిన రోజు)ను కోరుకుంటున్నాడు. ట్రంప్ తీవ్రవాద, కక్షపూరిత వైఖరికిగాను నవంబర్‌లో ప్రజలు అతడికి మళ్లీ ఓటమిని రుచి చూపించనున్నారు’ అని బైడెన్ టీమ్ ఎక్స్(ట్విటర్) పోస్టు చేసింది. Biden-Harris campaign statement on Trump tonight promising a “bloodbath” if he loses pic.twitter.com/8mBYh4QKnf — Biden-Harris HQ (@BidenHQ) March 17, 2024 కాగా, ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గత ఎన్నికల్లో పోటీ పడ్డ జో బైడెన్, ట్రంప్ మళ్లీ తలపడనున్నారు. ఇప్పటికే రెండు పార్టీల ప్రైమరీ బ్యాలెట్లలో వీరిద్దరే అధ్యక్ష అభ్యర్థులుగా నామినేట్ అయ్యారు. 1952, 1956లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాత్రమే ఒకసారి పోటీపడ్డ ఇద్దరు అభ్యర్థులు తిరిగి రెండోసారి పోటీపడ్డారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత అమెరికాలో గత ఎన్నికల్లో పోటీపడ్డ అభ్యర్థులే మళ్లీ ఈ ఏడాది ఎన్నికల్లో పోటీపడనుండటం విశేషం. ఇదీ చదవండి.. హౌతీల డ్రోన్‌ను పేల్చేసిన అమెరికా -
దేశవ్యాపంగా సంక్రాంతి సందడి
ఈరోజు మకర సంక్రాంతి. దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ పండుగ సందర్భంగా హరిద్వార్ చేరుకున్న భక్తులు గంగానదిలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. #WATCH | Uttarakhand: Devotees took a holy dip in the river Ganga in Haridwar, on the occasion of Makar Sankranti. pic.twitter.com/EpVlAdUKjS — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024 వారణాసిలోని గంగా ఘాట్‌కు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు.‘హర్ హర్ గంగా’ అని నినాదాలు చేస్తూ పుణ్య స్నానాలు చేస్తున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్‌లో భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. మకర సంక్రాంతి సందర్భంగా భక్తులు ఖిచ్డీ సమర్పించారు. #WATCH | Uttar Pradesh: Devotees take a holy dip in the Ganga River in Varanasi on the occasion of Makar Sankranti. pic.twitter.com/IOQ6ernWSc — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024 ఈ రోజున గంగా నదిలో స్నానమాచరించిన తర్వాత దానం చేయడం వల్ల సాధకునికి ఇహలోకం, పరలోకం రెండింటిలోనూ మంచి జరుగుతుందని చెబుతారు. #WATCH | West Bengal: Devotees take a holy dip and perform aarti in Gangasagar on the occasion of Makar Sankranti. pic.twitter.com/ywIq41tNz9 — ANI (@ANI) January 15, 2024 ఈ రోజు గంగా స్నానం చేస్తే 10 అశ్వమేధ యాగాలు చేసి, వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యఫలితాలు లభిస్తాయని పండితులు అంటుంటారు. కాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. #WATCH | Uttar Pradesh: A large number of people gathered at the Gorakhnath Temple to offer 'Khichdi' on the occasion of Makar Sankranti pic.twitter.com/39nhmYFZ0L — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024 ఇది కూడా చదవండి: గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు? శ్రీరామునితో సంబంధం ఏమిటి? #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath says, "Today is the auspicious occasion of Makar Sankranti. I extend my wishes of Makar Sankranti to all the devotees...It is celebrated across the country in different forms and names..." https://t.co/lAADGZSLZr pic.twitter.com/NAm4xa9BLd — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 14, 2024 -
గంగా నదిలో స్నానానికి పోటెత్తిన జనం!
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ధార్మిక నగరమైన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుండే వివిధ గంగా ఘాట్ వద్ద స్నానాలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. మకర సంక్రాంతి వేళ గంగాస్నానానికి ఎంతో విశిష్టత ఉంది. మకర సంక్రాంతి పండుగ రోజున సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనితోపాటు దక్షిణాయణం నుండి ఉత్తరాయణంలోకి మారతాడు. అందుకే మకర సంక్రాంతి నాడు స్నానం చేయడం విశేషమైనదిగా భావిస్తారు. పురాణాలలో పేర్కొన్న వివరాల ప్రకారం ఉత్తరాయణ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాయణ పర్వదినాన మరణించిన వారికి మరుజన్మ ఉండదని చెబుతారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినంతనే ఉత్తరాయణ పర్వదినం ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండుగ దేశంలోని వివిధ రాష్ట్రాలలో పలు పేర్లతో జరుపుకుంటారు. కొన్నిచోట్ల మకర సంక్రాంతిగా, కొన్నిచోట్ల పొంగల్‌గా, మరికొన్ని చోట్ల ఉత్తరాయణ పండుగగా జరుపుకుంటారు. ఉత్తరాయణంలో పూర్వీకులకు పిండప్రదానం చేస్తే, వారు సంతృప్తి చెందుతారని పండితులు చెబుతారు. ఇది కూడా చదవండి: ‘బుల్డోజర్ బాబా’ పతంగులకు డిమాండ్! -
శీతోష్ణస్నానం
వసంతకాలమే ఋతువుల రాణి అనుకుంటాం కానీ, హిమానీ నిబిడ హేమంతమూ, చలి వణి కించే శిశిరకాలం మాత్రం ఏం తక్కువ? ఆమాటకొస్తే ఏ ఋతువుకా ఋతువు జీవజాలాన్ని ఏకచ్ఛత్రంగా శాసించే మహరాణియే! మహరాణి అన్నప్పుడు ఆగ్రహానుగ్రహాలు సమపాళ్లలో ఉండకతప్పదు. అసలు మనం అల్లుకునే ఊహలు, కల్పించుకునే భావనలు, సృష్టించుకునే మాటల ఇరుకులో మనమే ఎలా బందీలమవుతామంటే; చన్నీళ్ళ, వేణ్ణీళ్ళ స్నానాలూ; పర్వదినాల్లో నదీ, సముద్రస్నానాలే తప్ప ఏటేటా నిండా మునిగే ఋతుస్నానాలు మనకు స్ఫురించవు. జ్యేష్ఠ – ఆషాఢమాసాల మహోష్ణంలోనూ, శ్రావణ – భాద్రపదాల కుంభవృష్టుల్లోనూ స్నానించినట్టే మార్గ శిర – పుష్యమాసాల్లో నిలువునా కోతపెట్టే శీతలస్నానాలే మనకు రాసిపెట్టి ఉంటాయి. ఇది ఋతు వుల రాణి ఆగ్రహపార్శ్వమైతే; హేమంత – శిశిరాలలో మిట్టమధ్యాహ్నం వేళ ఆరుబయటికో, డాబా మీదికో తరిమి శీతోష్ణస్నానంతో హాయిగొలపడం అనుగ్రహపార్శ్వం. హేమంతం కలిగించే ఆ హాయి ఇంకా ఎన్నెన్ని విధాలుగా ఉంటుందంటే, భక్త పోతన అంతటి వాడిలో కూడా అది రక్తిని రంగరించి రసికతను రాశిపోస్తుంది. శ్రీమంతమైన హేమంతం ప్రవేశించేసరికి చేమంతులు ధరించిన పూబంతుల కౌగిలిలో ఎందరో చలి భయాన్ని జయించారు కానీ; విరహులకు ఆ యోగం లేకుండా మన్మథుడు వేధించాడట. ఉత్తరపు గాలి అదే పనిగా విసురుతూ చీకాకు పెట్టే హేమంతరాత్రులలో మంచుకిరణాల రేరాజు మహాశత్రువయ్యాడట. ఎడమొహం, పెడమొహంగా ఉన్న దంపతులు కూడా రాజీపడిపోయి జంటగా చలిని జయించడానికి సిద్ధమ య్యారట. పగటి సమయం తగ్గి, అగ్ని ఆప్తమిత్రుడైపోయాడట. అతి శీతల దీర్ఘరాత్రుల పాలబడి లోకమంతా గడగడా వణికిపోయిందట. హిమం తాకిడికి కమలాలు బెదిరి తరిగి పోయాయట. ఆదికవి వాల్మీకి హేమంత చిత్రణలూ హృద్యంగా ఉంటాయి. పృథివి విరగబండుతుంది కానీ మంచు కసిపట్టినట్టు మనుషుల్ని కాల్చుకుతింటుంది. నీరూ, నీడా దుస్సహమవుతాయి. మధ్యా హ్నాలు సుఖసంచార సమయాలవుతాయి. సూర్యుడు దూరంగా జరిగిపోవడం వల్ల హిమాల యాలు మంచుతో పూర్తిగా గడ్డకట్టి సార్థకనామలవుతాయి. ఆకాశం కప్పు కింద నిద్రించడం మాని అందరూ ఇంటికప్పు కింద ముడుచుకుంటారు. సమస్త జనాన్ని ఇళ్ళల్లో బంధింపజేయగలిగిన హేమంత రుతురాజు యశస్సు దిక్కులను ఆవరించిందా అన్నట్టుగా మంచు సర్వత్రా కమ్ముకుందని మరో కవి వర్ణిస్తాడు. శీతఘాతానికి అన్ని జీవులూ సొమ్మసిల్లినా తను మాత్రం అచలంగాఉండి అందగించే భూదేవిని మెచ్చి ఆ హేమంత ప్రభువే వజ్రాలు కానుక చేశాడా అన్నట్టుగా ప్రాతర్వేళల లేత పచ్చికలపై మంచుబిందువులు రహించాయని ఇంకో కవి అభివర్ణన. నిత్యనూతనమవుతూ, ఆదికవి నుంచి ఆధునిక కవి వరకు ఋతుచక్రం ఒక్కలానే తిరుగుతూ ఉంటుంది. ‘ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇనబింబం పయనించు నింగిపై; ఎప్పుడు కూడా ఇవాళ లాగే గాలులు వీచును, పూవులు పూచును’ అంటూ శిశువులకు హామీపత్రం రాసిస్తాడు మహాకవి. ‘రాత్రంతా మంచుముక్కలా బిగుసుకున్న ఆకాశంలో కదల్లేని నక్షత్రాలు వెండి తెరల కాంతిలోంచి జారుకుంటూ గడ్డిపరకలపై కన్ను తెరిచే’ దృశ్యమూ; ఉదయం తొడుక్కున్న చలివస్త్రంలోంచి చెట్లు చల్లని పచ్చసిరాతో జీవితం కాగితమ్మీద కొత్త సంతకాలు చేయడ’మూ (బి.వి.వి. ప్రసాద్) నేటి కవి దృష్టినీ సమానంగా ఆకర్షిస్తాయి. అలాంటిదే, ‘పటిక ముక్కల్లాంటి మంచుబిందువుల శీతాకాలంలో చెరువు తేటపడడమూ, అప్పుడే అడవి, ఆకాశం, చెరువు ఒకదాని సౌందర్యాన్ని ఒకటి ఆస్వా దించడమూ’ (కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ) కూడా! సంగీతాన్ని వాయుశిల్పంలా దర్శించిన మరో కవి (పసునూరు శ్రీధర్ బాబు) స్వనస్నానమాచరించి శీతాకాలపు గదిలో చుబుకంకింద వణికే పిడికెళ్లేసుకుని ఓ మూల ముడుచుక్కూచోవలసిందేనంటాడు. ఏ ఋతువూ మరో ఋతువులా ఉండదు; ఒక ఋతువులోంచి మరో ఋతువులోకి మారి పోయే మన అనుభవమూ, అనుభూతీ ఒక్కలా ఉండవు. ప్రతి ఋతువులోనూ మనం పునర్జ న్మిస్తాం. ప్రతి ఋతువూ మనకు శైశవం నుంచి వార్ధక్యం వరకూ అన్ని దశలనూ చవిచూపి మరీ నిష్క్రమిస్తుంది. ప్రతి ఋతువులోకీ ఒక శిశువుగా కళ్ళు తెరుస్తాం. ఏటా పునర్జీవించే ఈ ఋత జన్మలను గణించకుండా ఒక్క జన్మనే ఊహించుకోవడం కూడా మనకు మనం విధించుకునే అజ్ఞానమే. అసలు జీవితమంటేనే ఋతువుల మధ్య నిరంతర సంచారం. సందర్భం వేరైనా మరో కవి(సిద్ధార్థ) అన్నట్టు, ఒక ఋతువులోంచి ఇంకొక ఋతువులోకి ‘అందరూ ఎవరికివారే కొత్తగా పుట్టి నడచుకుంటూ వెళ్లిపోతారు’. ఋతువులు, మాసాలు, సంవత్సరాలతో మన కేలండర్ మనకున్నట్టే ఈ విశ్వానికీ, అందు లోని ఈ భూగోళానికీ, అందులో మనం కూడా భాగమైన ప్రకృతికీ తనదైన కేలండర్ ఉంది.వందల కోట్ల సంవత్సరాల అస్తిత్వంలో భూమి ఎన్నో హిమప్రళయాలను చూసింది. వాటిలో చివరిదైన మంచుయుగం ఇరవయ్యారు లక్షల సంవత్సరాల క్రితం మొదలై పదకొండు వేలసంవత్సరాల క్రితం వరకూ కొనసాగింది. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలాన్ని కూడా మంచు యుగపు అంతర్దశగానే చెబుతారు. శీతోష్ణాల నిరంతర సంఘర్షణ నుంచే జీవం పుట్టి నేటి రక రకాల రూపాల్లోకి పరివర్తన చెందింది. ఆ వైశ్విక ఋతుభ్రమణం మన చేతుల్లో లేనిది కనుక దాని నలా ఉంచితే; మనకు తెలిసిన, మనం ప్రత్యక్షంగా భాగమైన ఋతుభ్రమణాన్ని మన చేతులారా గతి తప్పించకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే! -
వేడి నీళ్లు Vs చన్నీళ్లు.. ఏ నీళ్లతో స్నానం చేస్తే మంచిది?
స్నానం వేడినీళ్లతో చేస్తే మంచిదా? లేక చన్నీళ్లతోనా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కొందరు కాలంతో సంబంధం లేకుండా వేడినీళ్ల స్నానానికి అలవాటు పడితే, మరికొందరేమో చన్నీళ్లకు అలవాటు పడతారు. వేడి నీళ్లతో స్నానం చేస్తే ఒళ్లు నొప్పులు తగ్గడంతో పాటు కండరాలు ఉత్తేజంగా ఉంటాయని కొందరు అనుకుంటారు. చల్లటి నీళ్లలతో స్నానం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ ఏ నీళ్లతో స్నానం చేస్తే మంచిది? మనం ప్రతిరోజు స్నానం చేసే సమయంలో మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. దీని కారణంగా పలు సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కొందరు చన్నీళ్ల స్నానమే మంచిదంటారు. మరికొందరు వేడివేడి నీళ్ల వల్ల హానికారక క్రిములన్నీ తొలగిపోయి ఆరోగ్యం సమకూరుతుందనుకుంటారు. ఈ రెండూ అపోహలే. స్నానానికి నీళ్లు మరీ చల్లగా ఉండకూడదు. మరీ వెచ్చగా ఉండకూడదు. గోరువెచ్చని నీళ్లతో స్నానమే ఆరోగ్యం. ఇక బలహీనంగా ఉన్నవాళ్లు, వయసుపైబడిన వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో కానీ స్నానం చేయద్దు. ఒకవేళ మీరు మీ వృత్తిరీత్యా వేరే ఊళ్లలో ఉండటం వల్ల వేణ్ణీళ్లు పెట్టుకోవడం సాధ్యం కావడం లేదా? ఇలా మరీ చన్నీళ్ల స్నానమే చేయడం తప్పకపోతే... స్నానం చేసే వ్యవధిని వీలైనంత కుదించండి. అవి వేణ్ణీళ్లయినా, చన్నీళ్లయినా... వీలయినంత వరకు పొద్దున్నే ఏమీ తినకముందే స్నానం చేయడం మంచిది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల స్నానానికి ముందే తినాల్సివచ్చినా... కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు.ఇలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి స్నానం చేసిన తర్వాత కనీసం అర్ధగంట అయినా వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిది. నీళ్లు ఎంత చల్లగా ఉంటే... స్నానం వ్యవధి అంతగా తగ్గాలి. చన్నీళ్లతో స్నానం చేసే అలవాటు ఉన్నవారు... స్నానానికి ముందర చల్లటి నీళ్లు తాగకండి. చన్నీళ్లు గానీ లేదా వేణ్ణీళ్లు గానీ... వాటితో స్నానం చేశాక ఒకవేళ తలనొప్పి లేదా జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే... అవి (చన్నీళ్లు / వేణ్ణీళ్లు) మీకు అంతగా సరిపడవని గుర్తించి, ఆ మేరకు గోరువెచ్చని నీటికి షిఫ్ట్ అవడం మంచిది. -
4 డిగ్రీల చలిలో సమంత ఐస్‌బాత్.. ఎందుకలా?
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ మోడ్‌లో ఉన్నారు. స్నేహితులతో కలిసి ఇండోనేషియాలోని బాలిలో ఎంజాయ్ చేస్తోంది. అక్కడి వింత ప్రదేశాలను సందర్శిస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ నాలుగు డిగ్రీల చలిలో ఆరు నిమిషాల పాటు ఐస్‌బాత్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ‘మయోసైటిస్ చికిత్సలో భాగంగా ఈ ఐస్‌బాత్ థెరపీ చేసుకున్నారా?’అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా, గతంలో కూడా సామ్ ఐస్‌బాత్ చేసింది. ఐస్ గడ్డలు ఉన్న టబ్‌లో కూర్చొని ‘ఈ ఐస్ బాత్ రికవరీ సమయం తీవ్రంగా బాధిస్తుంది’అని అప్పట్లో పేర్కొంది. (చదవండి: బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..) ఐస్ బాత్ ఎందుకు చేస్తారు? చల్లటి నీటిలో కాసేపు అలానే ఉండటం ఐస్‌బాత్. క్రీడాకారులు, అధికంగా జిమ్ చేసేవారు అప్పుడప్పుడు ఐస్‌బాత్ చేస్తుంటారు. అలా చల్లటి నీటిలో కూర్చోవడం వల్ల వ్యాయామం చేసి అలసిపోయిన కండరాలు త్వరగా రిలాక్స్డ్ స్థితిలోకి వస్తాయి. అలాగే రక్త ప్రసరణ సులభతరం అవుతుంది. హృదయ స్పందన రేటు సరిగా ఉంటంది. శ్వాసపై నియంత్రణ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సమంత ఎక్కువగా వ్యాయామం చేస్తుంది. అందుకే ఆమె ఐస్‌బాత్ చేసి ఉండోచ్చు. సినిమాలకు బ్రేక్ సమంత దాదాపు ఏడాది కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సమంత తరచూ అనారోగ్యానికి గురవుతుంది. అందుకే కొంతకాలం వరకు సినిమాలకు బ్రేక్ ఇచ్చి, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సమంత నిర్ణయించుకున్నారట. అందుకే ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి నిర్మాతలకు అప్పగిస్తున్నారట. ఏడాది కాలం పూర్తిగా తన వ్యక్తిగత జీవితంపై దృష్టిపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన సిటడెల్ వెబ్ సిరీస్‌తో పాటు ఖుషి సినిమా విడుదలకు రెడీగా ఉన్నాయి. ఈ రెండు రిలీజ్ అయిన తర్వాత సమంత ఇక వెండితెరపై కనిపించదు. ఆమెను మళ్లీ తెరపై చూడాలంటే కనీసం ఏడాదిన్నర ఆగాల్సిందే. -
ఎండకు తట్టుకోలేక రోడ్డుమీద స్నానం చేసిన యువకుడు
-
రూ.10 పందెం గెలవడానికి నడిరోడ్డుపై యువకుడి స్నానం.. భారీ జరిమానా..!
సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, ఫోటోలు పోస్టు చేయడం కొందరికి మహా సరదా. వాటికి వచ్చిన లైక్స్‌ను చూసి తెగ మురిసిపోతుంటారు. తమను చాలా మంది ఆదరిస్తున్నారని గొప్పగా చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే రూ.10 బెట్ గెలవడానికి ఓ యువకుడు చేసిన పని ట్రాఫిక్ పోలీసులకు ఆగ్రహం తెప్పించింది. అతనికి రూ.3500 జరిమానాను విధించారు పోలీసులు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జరిగింది. ఎమ్. ఫారూక్(24) సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి రకరకాల వీడియోలు, ఫోటోలు పోస్టు చేస్తుండేవాడు. తన పోస్టులకు మరిన్ని లైక్స్‌ను రాబట్టడానికి తన స్నేహితునితో పందెం వేశాడు. ఇందుకు రూ.10 ని పందెంలో వేశారు. గెలిచినవారు ఆ డబ్బులను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన వీడియోకు ఎక్కువ లైక్స్ రావడానికి ఫారూక్.. రద్దీగా ఉండే సిగ్నల్ వద్ద నడిరోడ్డుపై స్నానం చేశాడు. ఒంటిపై నీటిని పోసుకున్నాడు. కారణం అడగగా.. వేడిని తట్టుకోవడానికి అలా చేసినట్లు స్థానికులకు చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన జిల్లా డీఎస్పీ జీ.జే. జవార్.. స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితునికి రూ.3500 జరిమానా విధించారు. చదవండి:కొంపముంచిన టిక్‌టాక్ రెసిపీ.. దెబ్బకు ముఖం వాచిపోయింది! -
నడిరోడ్డుపై స్నానం.. నవ్వులపాలే కాదు జైలుపాలు కూడా!
వైరల్ వీడియో: సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ సెలబ్రిటీగా, టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయేందుకు కొందరు చేసే ప్రయత్నాలు చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. తాజాగా.. ఓ వ్యక్తి, ఓ యువతితో కలిసి స్కూటీపై స్నానం చేసిన వీడియో వైరల్ కాగా, దానికి పోలీసులు అంతే లెవల్లో రిప్లై ఇచ్చారు. థానే(మహారాష్ట్ర) ఉల్లాస్‌నగర్‌లోని ఓ సిగ్నల్ వద్ద ఆ ఇద్దరూ ఈ చేష్టలకు దిగారు. వెనక కూర్చున్న యువతి బకెట్లో నీటిని తానూ పోసుకుంటూ.. ఆ యువకుడి మీద పోస్తూ కనిపించింది. దారినపోయేవాళ్లంతా వాళ్ల వేషాలు చూసి తెగ నవ్వుకున్నారు. అయితే.. ఆ వీడియో వైరల్ కావడం, అది కాస్త థానే పోలీసుల దాకా చేరడం, వాళ్లూ స్పందించడం చకచకా జరిగిపోయాయి. వీ డిజర్వ్ బెటర్ గవర్నమెంట్ అనే ట్విటర్ హ్యాండిల్ నుంచి ఈ వీడియో థానే నగర పోలీసులకు చేరింది. దీంతో స్పందించిన పోలీసులు.. సరైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే.. ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు ఆ వీడియోను షేర్ చేసి మరీ చర్యలు తీసుకోవాలని కోరారు. నడిరోడ్డుపై పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడడిన కారణంగా అతనిపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాగే.. హెల్మెట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు సైతం అతనిపై కేసు నమోదు చేసి ఛలానా విధించారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ముంబైకి చెందిన యూట్యూబర్ ఆదర్శ్ శుక్లా అట. తాను చేసిన పనికి క్షమాపణలు చెబుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్చేశాడతను. అయినా కూడా చర్యలు తప్పవని థానే పోలీసులు చెబుతున్నారు. @DGPMaharashtra @ThaneCityPolice This is ulhasnagar, Is such nonsense allowed in name of entertainment? This happened on busy Ulhasnagar Sec-17 main signal.Request to take strict action lncluding deletion of social media contents to avoid others doing more nonsense in public. pic.twitter.com/BcleC95cxa — WeDeserveBetterGovt.🇮🇳 (@ItsAamAadmi) May 15, 2023 -
బికినీలో రకుల్ ప్రీత్ బోల్డ్ ట్రీట్.. వీడియో అదిరిపోయిందిగా!
-
Viral Video: సబ్బు పెట్టి మరీ పాముకు స్నానం చేయించాడు
-
వామ్మో! కుక్కపిల్లకి చేయిస్తున్నట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు!
ఇంతవరకు పాములకు సంబంధించిన భయానక స్టంట్లు చూశాం. వాస్తవానికి ఇది స్టంట్ కాదు కానీ ఏదో కుక్కపిల్లకి స్నానం చేయించినట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి చాలా పొడువుగా ఉన్న కింగ్ కోబ్రాకి తల మీద నుంచి నీళ్లు పోస్తూ స్నానం చేయిస్తున్నాడు. పైగా ఆ పాము అతడు నీళ్లు పోస్తున్న మగ్గును పలుమార్లు కాటేస్తోంది కూడా. కానీ ఆ వ్యక్తి అదేం పట్టించుకోకుండా చక్కగా కోబ్రాకి స్నానం చేయించే పనిలో ఉన్నాడు. మహిళలు పురుషుల కంటే 5% ఎక్కువగా బతకడానికి కారణం ఇదే నంటూ ఈ వీడియో గురించి చెబుతున్నారు. ఎందుకంటే పురుషులు డేరింగ్ స్టంట్ చేస్తుంటారు అందువల్ల ఎక్కువ కాలం జీవించరంటూ గొప్ప స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఈ మేరకు ఒక ఇన్‌స్ట్రాగామ్ వినియోగదారుడు ఎందుకు మహిళలు పురుషులకంటే ఎక్కవ కాలం జీవిస్తారో తెలుసా! అంటూ "చన్నీటితో కోబ్రాకి బాత్ " అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by SAKHT LOGG 🔥 (@sakhtlogg) (చదవండి: ఏనుగుల బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉంటుందో తెలుసా!) -
ప్రాంక్ పేరిట వెకిలి పని.. పోలీసుల రియాక్షన్
నలుగురికి ఇబ్బంది కలిగించకుండా.. నవ్వించేదే ప్రాంక్ అంటే. అలాంటిది.. ప్రాంక్ పేరుతో పిచ్చి పిచ్చి చేష్టలకు పాల్పడే వాళ్లనే ఎక్కువగా ఇప్పుడు చూస్తున్నాం. అభ్యంతకరంగా ఉండే కంటెంట్‌తోనూ పాపులారిటీని సంపాదించుకుంటున్నారు కొందరు. ఈ క్రమంలో వాళ్లను అనుసరించే వాళ్ల సంఖ్య సైతం పెరిగిపోతోంది. తాజాగా కేరళలో ప్రాంక్ పేరిట ఇద్దరు యువకులు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. బైక్ మీద వెళ్తునే.. జోరువానలో అర్థనగ్నంగా స్నానం చేశారు. పైగా స్నానానికి సోప్‌ను సైతం ఉపయోగించారు. సిగ్నల్స్ దగ్గర కూడా వాళ్ల వెకిలి చేష్టలు కొనసాగాయి. అయితే.. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. యువకులను భరణిక్కవుకు చెందిన అజ్మల్, బాదుషాలుగా గుర్తించి.. కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించిన నేరానికి కేసు నమోదు చేసి.. ఐదువేల రూపాయల జరిమానా విధించారు. తాము నవంబర్ 1న సాయంత్రం ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌కు హాజరై వస్తున్నామని, వాన కురుస్తుండడంతో సరదా కోసం అలా ప్రాంక్ వీడియో చేశామని ఇద్దరు యువకులు వెల్లడించారు. -
షాకింగ్ ఘటన: మగ సంతానం కోసమని.. భార్యకు అందరి ముందు..
పుణే: మగ బిడ్డ కోసం, డబ్బుపై ఆశతో ఆ భర్త చేసిన పని దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. వ్యాపారంలో లాభాలు రావాలన్నా.. ఇంట్లో శాంతి నెలకొనాలన్నా.. అన్నింటికి మించి మగ సంతానం కలగాలన్నా తాను చెప్పినట్లు చేయాలని ఓ ఫేక్ బాబా సలహా ఇవ్వడంతో.. భార్యను అందరి ముందు దుస్తులు లేకుండా స్నానం చేయించాడు సదరు భర్త. మహారాష్ట్ర పుణేలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. పుణేకి చెందిన ఆమె భర్త కుటుంబం 2013 నుంచి అదనపు కట్నం, మగ బిడ్డ కోసం వేధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె చేత క్షుద్ర పూజలు కూడా చేయించింది. ఈ మధ్య మౌలానా బాబా జామదార్ అనే వ్యక్తి ఆమె భర్తతో జలపాతం కింద అంతా చూస్తుండగా ఒంటిపై బట్టలు లేకుండా స్నానం చేయిస్తే.. మగ సంతానం కలుగుతుందని, అప్పులు సైతం తీరతాయని సలహా ఇచ్చాడు. దీంతో ఆ మూర్ఖపు భర్త, అతని కుటుంబం బాధితురాలని రాయ్‌ఘడ్‌కి తీసుకెళ్లి.. అక్కడి జలపాతం కింద ఆమె చేత బలవంతంగా ఫేక్ బాబా చెప్పినట్టు స్నానం చేయించింది. అక్కడ చాలామందే ఉన్నా.. ఎవరూ అడ్డుకునే యత్నం చేయలేదు. చివరికి.. బాధితురాలే ధైర్యం చేసి భారతీ విద్యాపీఠ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్త, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి.. పరారీలో ఉన్న ఫేక్ బాబా కోసం గాలింపు చేపట్టారు. ఇదీ చదవండి: రూపాయి తెచ్చిన పంచాయితీ ! -
ఎమ్మెల్యే కళ్లెదుటే.. బురద నీటిలో కేరళ వ్యక్తి స్నానం, యోగా..
నిత్యం వందలు, వేల సంఖ్యలో వాహనాలు వెళ్లే రహదారులు దాదాపు రాత్రింబవళ్లు రద్దీగా ఉంటాయి. అలాంటి రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారుతుంటాయి. ఇక వర్షాకాలంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షం పడుతున్నంత సేపు వరద నీటితో రోడ్లు నిండిపోతే.. వాన వెలిసిన తర్వాత ఎక్కడ చూసినా సగం కొట్టుకుపోయిన రోడ్లు, గుంతలు, గతుకులే దర్శనమిస్తాయి.. ఇలాంటి రహదారులపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే రోడ్ల మరమ్మత్తులు చేపట్టడం లేదని తాజాగా కేరళలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. ఇటీవల కురిసిన వర్షానికి మలప్పురం ప్రాంతంలోని రోడ్లపై గుంతలు ఏర్పడి నీళ్లు నిలిచిపోయాయి. అయితే దీనిని అధికారులు పట్టించుకోకపోవడంతో.. ఓ వ్యక్తి స్వయంగా రంగంలోకి దిగాడు. స్థానిక ఎమ్మెల్యే యూఏ లతీఫ్ ముందు ఎమ్మెల్యే ఎదురుగానే గుంతల్లోని నీటిలో స్నానం చేశాడు. ఎమ్మెల్యే కారు సంఘటనా స్థలానికి చేరుకోగానే గుంతలో ధ్యానం చేయడం ప్రారంభించాడు. బురద నీటిలో యోగా చేశాడు. చెప్పులు శుభ్రం చేసుకొని, బట్టలు కూడా ఉతుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలోని వ్యక్తిని హంజా పోరాలిగా గుర్తించారు. #WATCH | Kerala: A man in Malappuram protested against potholes on roads in a unique way by bathing & performing yoga in a water-logged pothole in front of MLA on the way pic.twitter.com/XSOCPrwD5f— ANI (@ANI) August 9, 2022 కాగా రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి వ్యతిరేకంగా కేరళలో గత వారం అనేక నిరసనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ ఆందోళనలు ఏ రాజకీయ నాయకుడి దృష్టిని ఆకర్షించలేకపోయాయి. ఇదిలా ఉండగా అయిదు రోజుల క్రితం ఎర్నాకుళం జిల్లాలోని నెడుంబస్సేరి వద్ద జాతీయ రహదారిపై గుంతల కారణంగా 52 ఏళ్ల వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. అతనిపై ట్రక్కు వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో వారం రోజుల్లోగా తమ ఆధీనంలోని ప్రతి రోడ్డును బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను కేరళ హైకోర్టు ఆదేశించింది. -
నదీస్నానంలో భార్యకు ముద్దు.. చితకబాదిన జనం
లక్నో: పవిత్ర నదీస్నానంలో భార్యకు ముద్దు పెట్టాడంటూ ఓ వ్యక్తిని తిడుతూ.. చితకబాదారు ఉత్తర ప్రదేశ్ అయోధ్యలో. సరయూ నదిలో ఓ జంట నీళ్లలోకి దిగగా.. భర్త తన భార్యకు ముద్దు పెట్టాడు. ఈ వ్యవహారాన్ని అక్కడున్న వ్యక్తులు రికార్డు చేయగా.. కొందరు అతన్ని బయటకు లాగేసి చెయ్యి చేసుకున్నారు. ఇది పవిత్రమైన నేల. అయోధ్యలో ఇలాంటి పనులు సహించం అంటూ రామ భక్తుడిగా ఓ వ్యక్తి మాట్లాడడం ఆ వీడియోలో చూడొచ్చు. ఘటన ఎప్పుడు జరిగిందన్నది స్పష్టత లేదు. కానీ, ఈ వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు చర్యలు తీసుకుంటామని చెప్పారు. अयोध्या: सरयू में स्नान के दौरान एक आदमी ने अपनी पत्नी को किस कर लिया. फिर आज के रामभक्तों ने क्या किया, देखें: pic.twitter.com/hG0Y4X3wvO — Suneet Singh (@Suneet30singh) June 22, 2022 -
వార్నీ.. ఇదేం స్నానంరా బాబూ? తేడాలొస్తే మాత్రం..
కాస్త వేడిగానో, చల్లగానో నీళ్లతో స్నానం ఎవరైనా చేస్తారు.. మరి కరెంట్‌తో స్నానం చేస్తారా?.. వామ్మో ఇదేం పిచ్చి? ప్రాణాలు తీసే కరెంట్‌తో స్నానం చేయడం ఏమిటి? అంటారా.. ఇది నిజమే! జపాన్‌లో చాలా మంది అప్పుడప్పుడూ ఇట్లా కరెంట్ స్నానాలు చేస్తూనే ఉంటారు. దానికి ప్రత్యేకంగా ‘డెంకి బురో (ఎలక్ట్రిక్ బాత్)’ అని పేరు కూడా ఉంది. దీని సంగతేంటో తెలుసుకుందామా?.. నీళ్లకు, కరెంట్‌కు లింకు పెట్టొద్దని చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాం. వాటర్ హీటర్లు, గీజర్లు వంటివాటితో ప్రమాదాలు జరగడాన్ని చూస్తూనే ఉన్నాం. కానీ అదంతా హైఓల్టేజీ (ఎక్కువ తీవ్రత ఉన్న) కరెంట్. మరి డెంకి బురో స్నానాలకు వాడేది లోఓల్టేజీ కరెంట్. అంటే కొద్దిగా షాకి చ్చినట్టు అనిపిస్తూ.. మరీ పెద్దగా ఇబ్బంది కలగని కరెంట్ అన్నమాట. మన ఇళ్లలో వాడే ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి ఉపకరణాలకు సరఫరా అయ్యే విద్యుత్ 220 నుంచి 240 వోల్టుల మధ్య ఉంటుంది. డెంకి బురోలో 5 నుంచి 15 వోల్టేజీల మధ్య తీవ్రత ఉండే కరెంటును ఉపయోగిస్తారు. ఇంటా, బయటా.. ప్రత్యేక పూల్స్.. జపాన్‌లో డెంకి బురో స్నానాల కోసం ప్రత్యేకంగా బాత్‌టబ్‌లు, చిన్నపాటి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. వాటిలో రెండు వైపులా లోహపు పట్టీలను అమర్చి.. విద్యుత్ వైర్లో ఉండే రెండు తీగలను వాటికి అనుసంధానం చేస్తారు. ఆ లోహపు పట్టీలు మునిగేదాకా నీటిని నింపి, విద్యుత్ సరఫరా చేస్తే.. ఓ వైపు నుంచి మరోవైపునకు కరెంటు సరఫరా అవుతుంది. కొందరు వీటిని ఇళ్లలో ఏర్పాటు చేసుకుంటారు. బయట పబ్లిక్ బాత్ హౌజ్‌లలో కూడా డెంకి బురో సౌకర్యం ఉంటుంది. మనం బయటికి వెళ్లినప్పుడు ఏదో హోటల్‌కు వెళ్లి కాఫీ, చాయ్ తాగుతుంటాం కదా. అలా జపాన్‌లో కొందరు రిలాక్సేషన్ కోసం బాత్హౌజ్లకు వెళ్లి కరెంట్ స్నానాలు చేస్తుంటారు. జపాన్‌లో ఇలా కరెంట్ స్నానాల అలవాటు 18వ శతాబ్దం నుంచే ఉందట. ఎందుకిలా.. ఏమిటి లాభం? ఈ బాత్‌టబ్, మినీ స్విమ్మింగ్ పూల్స్‌లో స్నానం చేసేవారికి స్వల్పంగా కరెంట్ షాక్ తగులుతూ ఉంటుంది. ఇది నాడుల ద్వారా వ్యాపిస్తూ.. కండరాల్లో సన్నగా వణుకు (జలదరింపు) పుట్టిస్తుంది. అలసిపోయిన కండరాలు దీనితో రిలాక్స్ అవుతాయని.. ముఖ్యంగా కీళ్లు, వెన్ను, మెడ నొప్పి (రుమాటిజం, స్పాండిలైటిస్) వంటి సమస్యలున్న వారికి మంచి రిలీఫ్‌ను ఇస్తుందని చెప్తారు. ► అమెరికా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గాయపడిన సైనికులకు ఉపశమనం కోసం డెంకి బురో తరహాలో ఎలక్ట్రోథెరపీ ఇవ్వడం గమనార్హం. ► ఇప్పటికీ పలు రకాల వైద్య చికిత్సల్లో వివిధ వోల్టేజీల్లో విద్యుత్ షాక్‌ను ఇస్తుంటారు. స్వల్ప స్థాయి కరెంట్ షాక్ వల్ల శరీరంలో నాడులు స్పందించి మెదడుకు సిగ్నల్స్ పంపుతాయని, ఈ క్రమంలో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుం దని కొందరు వైద్య నిపుణులు చెప్తున్నారు. ► మరో పరిశోధన ప్రకారం.. స్వల్పస్థాయి కరెంట్ ప్రవాహంతో శరీరంలో ఎండార్ఫిన్లుగా పిలిచే సహజ పెయిన్ కిల్లర్లు విడుదలవుతాయి. దానితో కీళ్లు, వెన్ను, మెడ నొప్పుల వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ► కరెంట్ వోల్టేజీని తట్టుకునే సామర్థ్యం ఒక్కొక్క రిలో ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు కొంద రిలో 10 వోల్టుల కరెంటు షాక్‌ను, నొప్పిని కలి గిస్తే.. మరికొందరికి మాత్రం హాయిగా, విశ్రాం తిగా ఉంటుంది. అందుకే అవసరమైనట్టుగా ఓల్టేజీని తగ్గిస్తూ, పెంచుకుంటూ ఉంటారు. దయచేసి ఇళ్లల్లో ప్రయత్నించకండి అసలే కరెంటు, నీళ్ల జోడీ డేంజర్. వోల్టేజీలో తేడా వచ్చిందంటే ప్రాణాలకు ప్రమాదమే. అంతేకాదు.. మనకు ఎంత వోల్టేజీ అవసరమన్నది కూడా తెలియదు. పైగా సర్జరీలు జరిగినవారు, శరీరంలో రాడ్లు, ప్లేట్లు వంటివి అమర్చుకున్నవారు, గుండె జబ్బులున్నవారి విషయంలో మరింత అప్రమత్తత అవసరమని.. మొదట వైద్యులను సంప్రదించాకే డెంకి బురోకు వెళ్లాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జపాన్‌లో కొందరు డాక్టర్లు ప్రత్యేకంగా డెంకి బురో కోసం సలహాలు కూడా ఇస్తుంటారట. ఇది కేవలం సమాచారం ఇచ్చిన కథనం. దయచేసి ఎవరూ ఇంటా బయట ఇలాంటివి ప్రయత్నించకండి. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
స్నానం పూర్తి చేసుకున్న భర్త.. టవల్ త్వరగా ఇవ్వలేదని భార్య తలపై...
భోపాల్: స్నానం చేసిన తరువాత అడిగిన వెంటనే టవల్ ఇవ్వలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ దారుణం బాలాఘాట్ జిల్లా కిర్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపుర్ గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకోగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అటవీ శాఖకు చెందిన ఉద్యోగి రాజ్‌కుమార్ బాహే శనివారం సాయంత్రం స్నానం చేసిన తర్వాత. భార్య పుష్పా బాయ్ (45)ను టవల్ అడిగాడు. చదవండి: స్నేహితుడి భార్యపై కన్నేసిన దుర్మార్గుడు.. అత్యాచారం, వీడియోలు తీసి! అయితే ప్రస్తుతం తాను పనిలో ఉన్నానని తువ్వాలు కోసం కాసేపు ఆగాలని భార్య చెప్పింది. ఆ సమయంలో ఆమె వంట పాత్రలు శుభ్రం చేస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ తన భార్య తలపై అక్కడే ఉన్న పారతో పదే పదే కొట్టాడని కిర్ణాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర కుమార్ బారియా తెలిపారు. భర్త దాడిలో తలకు తీవ్ర గాయాలు కావడంతో పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది. చదవండి: రెండేళ్లుగా సహజీవనం.. కూతురుపై తల్లి ప్రియుడు లైంగిక దాడి.. కాగా తండ్రి ఘాతుకాన్ని 23 ఏళ్ల కుమార్తె అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమెను కూడా అడ్డొస్తే చంపేస్తాడని ఆమెను కూడా ఆ రాక్షసుడు బెదిరించాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. నిందితుడిని అరెస్టు చేసి, అతనిపై హత్య కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రాజేంద్ర కుమార్ బారియా తెలిపారు. -
భార్య రోజూ స్నానం చేయడం లేదు.. విడాకులు కోరిన భర్త!
లక్నో: భార్య నుంచి విడాకులు కోరుతూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అయితే భర్త విడాకులు కావాలని అడగడం పక్కన పెడితే ఇందుకు అతను చెప్పిన కారణం మాత్రం వింతంగా ఉంది. భార్య రోజూ స్నానం చేయడం లేదని చెబుతూ తనకు విడాకులు ఇప్పించాలని కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్‌లో చోటుచేసుకుంది. క్వార్సీ గ్రామానికి మహిళకు చందౌస్ గ్రామానికి చెందిన వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహం అవ్వగా.. ఏడాది వయసున్న పాప ఉంది. ఈ క్రమంలో రోజూ భార్య స్నానం చేయడం లేదని, స్నానం చేయాలని అడిగిన ప్రతిసారి ఆమె తనతో గొడవ పడుతుందని ఆమె నుంచి విడాకులు కావాలని కోరాడు. అయితే భర్తపై వ్యతిరేకంగా భార్య వుమెన్ ప్రొటెక్షన్ సెల్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని, వివాహ బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు వివాహిత వెల్లడించింది. ప్రస్తుతం ఈ జంటకు అలీగఢ్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కౌన్సిలింగ్ అందిస్తోంది. చదవండి: లాయర్ దుస్తుల్లో వచ్చి కోర్టు ఆవరణలో కాల్పులు.. నలుగురు మృతి ప్రతిరోజూ స్నానం చేయడం లేదనే సాకుతో భర్త తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడని ఒక మహిళ తమకు వ్రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చిందని వుమెన్ ప్రొటెక్షన్ సెల్ కౌన్సిలర్ తెలిపారు. వారి వివాహ బంధాన్ని కాపాడటానికి భర్తభర్తలిద్దరితోపాటు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అందిస్తున్నామన్నారు. వారు తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించాలని, భర్తతో ఆమె సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు కౌన్సిలర్ తెలిపారు. అయితే భర్త మాత్రం తనకు విడాకులు కావాలనే పదేపదే చెబుతున్నాడని, భార్య నుంచి విడాకులు తీసుకోవడంలో సాయం చేయాలని తమకు ఓ అప్లికేషన్ కూడా ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. కానీ చిన్న చిన్న సమస్యలకే వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దని తాము సూచించినట్లు తెలిపారు. విడాకులతో పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని చెప్పి అతన్ని నచ్చజేప్పుతున్నట్లు పేర్కొన్నారు. వారికి ఆలోచించడానికి మహిళా రక్షణ సెల్ కొంత సమయం ఇచ్చింది. అంతేగాక విడాకుల దరఖాస్తుకు భర్త చెప్పిన కారణం ఏ హింసాత్మక చట్టం, మహిళలపై నేరం కిందకు రాదు కాబట్టి, పిటిషన్ ముందుకు సాగదన్నారు. కౌన్సిలింగ్ సహాయంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. చదవండి: హెయిర్ కటింగ్‌లో పొరపాటు.. రూ.2 కోట్ల ఫైన్ -
మాఘ మాసం ఆరోగ్య స్నానాలు
అఘము అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘం అంటే పాపాలను నశింప చేసేది అన్నది పండితోక్తి. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఈ మాసంలో సూర్యుని ఆరాధి స్తారు. తెల్లవారుజామునే స్నానం చేయటాన్ని ఒక నియమంగా పెట్టుకుంటారు. నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుందని భావిస్తారు. శరీరాన్ని చలికి అలవాటు చేయటం కోసమే ఈ నియమాన్ని పెట్టి ఉంటారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. అందుకే చలికి భయపడకుండా ఉదయాన్నే నదీ స్నానం చేయటం ఉత్తమం. ♦ ‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసం శ్రేష్ఠమైనదని శాస్త్రం చెబుతోంది. మృకండు ముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అందుకే ఈ మాసానికి అంత విశిష్టత ఉంది. ప్రతిరోజూ స్నానం, పూజ, మాఘ పురాణ పఠనం లేదా శ్రవణం చేయడం సకల పాపహరణం అని మాఘపురాణం చెబుతోంది. ♦ మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి. ఆసమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్ఠాన దైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సూర్యశక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుందని అంటారు. ♦ మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతోనైనా ఆరు సంవత్సరాలఅఘమర్షణ స్నానఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. సూర్యుడు ఉచ్ఛ స్థితిలో ఉండే మాసం ‘మాఘాది పంచకం’ అంటే మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం ఈ ఐదు మాసాలు శుభకార్యాలకు ప్రసిద్ధి. ఇల్లు కట్టుకోవటానికి మాఘమాసం అనుకూలం. ఆత్మ కారకుడు, ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యభగవానుడు ఉచ్చస్థితిలో ఉండే కాలం. మఖ నక్షత్రంలో, పూర్ణిమ తిథి నాడు చంద్రుడు ఉండే కాలం కనుక కూడా దీనికి మాఘ మాసం అనే పేరు వచ్చింది. మాఘమాసం ఉత్తరాయణం ప్రారంభమై సూర్యుడు మకరరాశిలో సంచరించే కాలం. అటు చాంద్రమానంలోను, ఇటు సౌర మానంలోనూ సూర్యునికి ప్రాధాన్యత ఉన్న మాసంగా చెబుతారు. సూర్యుడి ఆరాధన వేద కాలం నుంచి ఉంది. ప్రపంచం యావత్తు ఆరాధించకపోయినా, ఆయన గమనాన్ని గమనిస్తూనే ఉంది. భౌతికంగా ఈ భూమి మీద ప్రాణం నిలచి ఉండటానికి కారణం సూర్యుడు. అన్ని శక్తులూ ఆయన నుంచే లభ్యమవుతున్నాయనీ, సమస్త శక్తులకు సూర్యకిరణాలే కారణమని ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. ప్రాతఃకాలంలో స్నానం చేస్తే సూర్యుడు సంతృప్తి చెందుతాడని అంటారు. అంటే ఆరోగ్యమనే కదా అర్థం. నిలవ ఉన్న చల్లని నీళ్లతోకంటె గోరు వెచ్చని నీళ్లతో తలారా ఈ నెలంతా సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఇలా ఎందుకు అనుకోవచ్చు. ఎవరినైనా మనం గౌరవించటమంటే ఏంటి? వాళ్లు మన ఇంటికి వచ్చేసరికి శుభ్రంగా స్నానం చేసి ఆహ్వానించాలి కదా. అందుకే సూర్యోదయానికి ముందే శుచిగా ఉండి, మనం సూర్యుడిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి. ఆయనను ఎందుకు ఆరాధించాలి అనుకోవచ్చు. మనం సూర్యుడి నుంచే ఆరోగ్యాన్ని కోరుకోవాలి. పాండవులు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు పాండవులను వెంటనంటి వచ్చిన వారందరికీ అన్నం పెట్టడానికి సూర్యుడు అక్షయపాత్ర ఇచ్చాడని ఒక కథ. ఇక కీచకుడు ద్రౌపది వెంటపడినప్పుడు ఆమె ఒక్క చేతితో అతడిని తోసేసరికి పక్కకు పడిపోతాడు. అంత శక్తి ఆవిడకు సూర్యారాధన వల్ల వచ్చిందని మరో కథ. సూర్యమంత్రాన్ని అగస్త్య మహాముని రాముడికి ప్రసాదించిన మరుసటి రోజున రావణ వధ జరిగిందని ఇంకో కథనం ఉంది. ఆయన వల్ల ఆరోగ్యం, ఆహారం, బలం, శక్తి సమకూరతాయని భావించడం వలనే వేద కాలం నుంచి సూర్యారాధన జరుగుతోంది. ఆయన పుట్టిన రోజు ఈ మాఘమాసంలోనే వస్తుంది. ఆయనను ఆరాధించటానికి మొదటిమెట్టుగా, స్నానం చేసి, అరుణోపాసనం చేసి, సూర్యభగవానుడిని ఆహ్వానించటానికి సిద్ధంగా ఉండాలి. – డా. ఎన్. అనంతలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త -
ఆ ఒక్కటి అడక్కండి..!
ముంబై : ప్రస్తుతం మహారాష్ట్రలో కొన్ని గ్రామాల్లో ఇంటి ద్వారం మీద మరాఠీలో ‘దయచేయండి.. భోజనం చేయండి.. కానీ మంచి నీళ్లు మాత్రం అడక్కండి’ అని రాసి ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ కరువు ఎంత తీవ్రంగా ఉందో. మహారాష్ట్రలోని మరఠ్వాడాలో గత 32 వారాల నుంచి కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఈ ప్రాంతానికి నీరు అందించే రిజార్వయర్లు పూర్తిగా అడుగంటిపోయాయి. బోర్లు, బావులు ఎండిపోయాయి. ప్రస్తుతం ఔరంగబాద్, మధ్య మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో కరవు కోరలు చాచింది. దాంతో ప్రజలు నీటిని అతి జాగ్రత్తగా, పొదుపుగా ఒక్క చుక్క కూడా వృథా కాకుండా వాడుకుంటున్నారు. దానిలో భాగంగా ఒంటికి సబ్బు పెట్టి స్నానం చేయడం మానేశారు. ఓ నులక మంచంలో కూర్చుని.. కింద మరో టబ్బు పెట్టుకుని స్నానం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల నీరు వృథా కాకుండా టబ్బులో పడుతుంది. తర్వాత ఆ నీటితోనే మిగతా కుటుంబ సభ్యులు స్నానం చేయడం ఆఖరున వాటిని బట్టలు ఉతకడానికి వినియోగించడం వంటివి చేస్తున్నారు. దాదాపు ప్రతి గ్రామంలో ఇదే తంతు. దీని గురించి ఓ గ్రామస్థుడు మాట్లాడుతూ.. ‘ఇది మీకు షాకింగ్‌గా.. చండాలంగా అనిపించవచ్చు. కానీ మాకు మాత్రం ఇదే సరైన మార్గంగా తోస్తుంది. తీవ్ర నీటి ఎద్దడి ఉన్నప్పుడు మీ ముందు రెండే మార్గాలుంటాయి. ఒకటి చావడం రెండు బతకడం. చావలేం కాబట్టి మాకు తోచిన రీతిలో ఉన్న నీటినే ఇలా వాడుకుంటున్నాం’ అని తెలిపారు. ఈ ప్రాంతాలకు ప్రభుత్వం వారంలో మూడు రోజుల పాటు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది. అలా పట్టుకున్న నీటినే అతి జాగ్రత్తగా.. పొదుపుగా వాడుకోవాల్సి వస్తుంది. లేదంటే డబ్బు చెల్లించి నీళ్లు కొనుక్కోవాలి. పది లీటర్ల నీటికి రూ. 12, వంద లీటర్ల నీటిని రూ. 80 చెల్లించాల్సిందే. కానీ ఇంత డబ్బు ఖర్చు పెట్టే స్థోమత ఇక్కడి జనాలకు లేదు. దాంతో ప్రభుత్వం సరఫరా చేసే నీటిని పట్టుకుని జాగ్రత్తగా వాడుకుంటారు. -
ఋషి
అవి వినాయక నవరాత్రులు. నవరాత్రులలో మూడోరోజులాగే సాయంత్రం అవుతుంది. ప్రకృతిలో జరుగుతున్న మార్పులే ఆరోజూ జరుగుతున్నాయి. పక్షులు తమ గూటికి చేరుకుంటున్నాయి. పశువులు కల్లం వైపు కదులుతున్నాయి. తెల్లనైన సూర్యుడు పడమటి కొండకు చేరి ఎరుపెక్కుతున్నాడు. మేత నుండి కల్లంకి పశువులకు పుల్లని కుడితిలో చిట్టేసి కలిపి తొందరగా పెడుతున్నాడు అప్పలరాములు.లేగదూడలను ఒక్కొక్కటిగా విప్పి, ఆవు సేపిన తరువాత దూడను తల్లి కట్టు వద్ద కట్టి పాలు పితికాడు. బయట ఉన్న ఆవులను శాలలో కట్టి రాత్రికి సరిపడినంత వరిగడ్డిని వాటి ముందు వేసాడు.పాలు గుడిసిన లేగదూడలను కూడా కట్టేసి, పాలను పట్టుకొని ఇంటికి వడివడిగా అడుగులు వేశాడు. చెమటతో ఉన్న వంటిని స్నానంతో శుభ్రం చేసి, తెల్లపంచె కట్టుకుని, రాత్రి భోజనం పెట్టేయ్యమని భార్యను తొందర చేశాడు అప్పలరాములు. ‘‘నాయనా మళ్లీ ముఖానికి రంగెయ్యటానికెలిపోతున్నావా ఏటి? ఇంత పెద్ద కుటుంబంలో పుట్టి ఈ నాటకాలెక్కడి నుంచి మరిగినావో!’’ అని తిడుతూనే అప్పుడే అన్నం ఓర్చిన కుండను పైకెత్తి జిబ్బిలో ఉన్న అన్నాన్ని కొంత ఓరిమి తీసి, పళ్లెంలో రెండు ముద్దలు వడ్డించి అప్పలరాముని ముందు పెట్టింది భార్య.చిన్న చిరునవ్వు నవ్వి ‘‘ఇంట్లో ఎవ్వరికి తెలియనియ్యకే’’ అంటూ తొందర తొందరగా కుండ బరువును గుండెకి దించేసి కమీజు తొడుక్కొని, తువ్వాలు భుజంపై వేసుకున్నాడు అప్పలరాములు.ఇంట్లో ఎవరికీ కనబడకుండా వెనుక దొడ్డి నుండి పరుగులాంటి నడకందుకున్నాడు.రాజాం బస్టాండ్ చేరుకునేసరికి తన సమాజం సభ్యులందరూ తన కోసమే ఎదురుచూస్తున్నారు.‘‘ఏటి అప్పలరాములు ఎప్పుడూ లేటే నువ్వు...ఇప్పటికే రెండు బస్సులెళ్లిపోనాయి...పోనీలే ఈ బస్సుకేనందినావు...లేకపోతే ఆ వూరోల్తోటి మాట కాసిద్దుము’’ అని నాటక సమాజపు గురువు శ్రీనుబాబు అప్పలరాముని చనువుగా తిట్టాడు.‘‘మరేటి పర్లేదులే వచ్చేన్ను కదా శీనుబాబు...ఎక్కండి ఎక్కండి’’ అని తనను పలకరిస్తున్న సభ్యులని తొందరపెట్టాడు అప్పలరాములు. బస్సు గమ్యాన్ని చేరుకుంది. ఆ వూళ్లో కమిటీ వారు నాటక సమాజాన్ని ఆహ్వానించి వాళ్లకు భోజన వసతి కల్పించారు.‘‘మరి కొద్దిసేపట్లో...మరికొద్ది క్షణాల్లో...మన గ్రామంలో రాష్ట్రస్థాయి కళాకారులచే హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించబడుతుంది’’ అంటూ కమిటీలోని మైకువీరులు జనాలను ఉదరగొడుతున్నారు.చెక్క బల్లలతో స్టేజిని వేశారు.కమిటీ వాళ్లు పైన ఒక పరజాగుడ్డను కట్టారు.ముందు పొట్టి, పొడుగు వాళ్లకు కూడా అందేటట్టు మైకులు కట్టారు.స్టేజు వెనుక నాలుగు పక్కలా దుప్పట్లు, పరదాల సాయంతో గ్రీన్‌రూమ్ కట్టారు.గ్రీన్‌రూమ్ చుట్టూ రంగు వేయక ముందు పాత్రధారుల రూపాలను చూడాలనే ఆతృత కనబరుస్తున్న ఆ వూరి యువజనులు...స్టేజ్ ముందు మంచు పడకుండా తలపాగాలు చుట్టి, దుప్పట్లు కప్పుకుని, తోడుగా తెచ్చుకున్న దుడ్డుకర్రలను భుజాలకు చేరవేసి, చుట్టలు, బీడీలు కాల్చుకుంటూనాటక ప్రదర్శన కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు...వారి వెనకాల చుట్టలు, బీడీలు, టీలు అమ్ముతూ రెండు కొట్లు.‘‘ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న నాటకం మరి కొద్దిక్షణాల్లోనే’’ కమిటీలోని మైకువీరుడు మరొక్కమారు మైకు ముందు తన కంఠాన్ని ప్రదర్శించాడు.నాటకం సిద్ధమయ్యిందోచ్ అన్నట్లుగా శీనుబాబు హార్మోనియంలో కొత్త సినిమా పాటలను వాయిస్తూ ప్రేక్షకును నాటకవీక్షణానికి సిద్ధం చేశాడు. కర్టెన్ వెనుక నుంచి ప్రార్థన గీతాన్ని ఆలపించి తమ గొంతులను శుద్ధి చేసుకున్నారు నాటక సభ్యులంతా.తెర తొలగించారు.ఆగ్రహోదగ్రుడైన విశ్వామిత్ర మహర్షి వేదిక మీదకు వచ్చి...‘‘సత్యసంధుడట, హరిశ్చంద్రుడట’’ అంటూ పేజీల డైలాగులను గుక్క తిప్పుకోకుండా చెబుతుంటే ముందున్న ప్రేక్షకులు నిజంగా మనల్ని శపించేసినట్లున్నాడీ విశ్వామిత్రుడని భయపడుతూ తమ శ్వాసలను నిలబెట్టేశారు.తరువాత హరిశ్చంద్ర, చంద్రమతుల ప్రవేశం, మాతంగి నృత్యం, అటుపిమ్మట విశ్వామిత్రుడు మరలా వేదిక పైకి రావటం, హరిశ్చంద్రుని కిరీటమెగరేసి తన్నటం, ప్రేక్షకులకు ఒక విధమైన గగుర్పాటు. ఆ తరువాత వారణాసి సీనులో వచ్చిన కాలకౌశికుడు భార్యావిధేయుడిగా ప్రేక్షకులందరినీ హాస్యంలో ముంచెత్తాడు.అటుపిమ్మట హరిశ్చంద్రుని కొనటానికి వచ్చిన వీరబాహుడు నిజంగా కర్కోటకుడేమో అంటూ ప్రేక్షకులు తమ అసహ్యాన్ని ఆ పాత్రపై ప్రదర్శించారు.ఈవిధంగా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని రసస్థాయికి తీసుకువెళ్లి, భయపెట్టి, ఆనంద పెట్టి, అసహ్య పెట్టించిన పాత్రధారుడు ఒక్కడే...అతడే ఇందాకటి అప్పలరాములు.తన వేషాన్ని తీసేసిన తరువాత ఏమీ తెలియని వాడిలాగా గ్రీన్‌రూమ్‌లో ఉన్న మేకప్ సామానుల పక్కన కూర్చున్నాడు. నాటకం పూర్తయ్యేసరికి తెల్లవారుజాము అయింది.‘‘శీను బాబూ...సాయంత్రం రూమ్కొచ్చి కలుస్తాను. పొలములో పనులున్నాయి. ఫస్ట్ బస్సెక్కి పోతాను’’ అంటూ సెలవు తీసుకొని ఆ వూరిలో ఉన్న నైటాల్ట్ బస్సెక్కి పూర్తిగా తెల్లారేసరికి కల్లానికి సేరుకున్నాడు. మరలా పశువుల్ని బయటకట్టి, పేడలు తీసి కసవ తుడిచి పెంటలో వేసేశాడు.పాలు తీసి ఇంటికి చేరుకొని భార్యకు అందించాడు.‘‘నాటకం తగిలితే ఇంటిపట్టునుండవు. ఏమి పుట్టుక పుట్టినావో’’ అంటూ భార్య అప్పలరాముడిని తిడుతూ టీ సుక్కలు కాసి యిచ్చింది.పాపం రాత్రంతా నిద్రలేక నాటకమాడొచ్చిన భర్తను తిట్టడం తనకూ ఇష్టం లేదు. తనుంటున్నది ఉమ్మడి కుటుంబం...తోడికోడళ్లు, బావలు, అత్తమామలు అందరూ రాత్రిపూట కలిసి భోజనాలు చేసినప్పుడు మాట్లాడుకుంటారు.తన భర్త నాటకాలకు వెళ్లిన రోజున...‘‘ఈడికి పనులు సెయ్యడానికి వొళ్లొంగక నాటకాలు మరిగినాడు’’ అంటూ బావలంటుంటే...‘‘మీరు లేరేటి పనులు సెయ్యడానికి’’ అని పుల్లిరుపు మాటలంటున్నారు తోడికోడళ్ళు.అవన్నీ వింటూ ఏమీ అనలేక అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లు అప్పలరాములుని తిట్టేది భార్య.రైతువారి యిళ్లలో నాటకాలేసే వాళ్లంటే ఉన్న చులకన భావాన్ని అప్పలరాముడు అనుభవించాడు. కానీ నాటకాన్ని విడిచిపెట్టలేదు.‘ఎన్నాళ్లున్నా ఏరు పాట్లు తప్పవు కదా’ అంటూ తండ్రి తనకున్న చెక్క ముక్కలను ముగ్గురు కొడుకులకి సమంగా పంచేశాడు. అప్పలరాములుకు కొత్త సంసారం బరువు, బాధ్యతలు, పిల్లల చదువు బాధ్యతలు పైన బడ్డాయి. అయినా తనకిష్టమైన నాటకాన్ని వదల్లేదు.ఈడొచ్చిన ఆడపిల్లలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. కొడుకును విజయనగరం మహారాజు కాలేజీలో చదివించాడు. కొడుకు కాలేజీలో సాంఘిక నాటకాల్లో హీరో యేషాలేత్తండని తెలసి....‘‘మన రక్తమెటిపోద్దే’’ అని ముసిముసి నవ్వులు నవ్వుతూ భార్యను ఆటపట్టించేవాడు.కొడుకు చదువు పూర్తిచేసుకుని టీచర్ కొలువులో చేరాడు.తండ్రిలానే పౌరాణిక నాటకాలలో ప్రవేశం కూడా చేశాడు.కొడుకు నాటికి నాటకరంగ పరిస్థితి పూర్తిగా దిగజారింది. పౌరాణిక నాటకం ఆడించే నాథుడే కరువయ్యాడు. ఎవరైనా సాహసం చేసి పెట్టించినా నాటకం చూడటానికి జనాలు రావడం లేదు. వినోదసాధనాలు మారినాయి...మార్కెట్లోకి సినిమా వచ్చింది. ఇంట్లోకి టీవీ వచ్చింది. జనాలు ఈదిలోకి రావడం మానేశారు. ఈ స్థితిలో నాటకం అంటే అభిమానమున్న కొడుకు ఈ స్థితిని జీర్ణించుకోలేకపోయాడు.ఒకసారి అప్పలరాములికి మలేరియా జ్వరం వచ్చింది. కొడుకు ఆసుపత్తిరికి తీసుకెళ్లి మందు, యింజప్షన్లు ఇప్పించాడు. భార్య పత్తెము చక్కగా పెట్టింది. వారం రోజ్లో అప్పలరాములు కోలుకున్నాడు. డాక్టరుగారు మరొక పదిరోజులు విశ్రాంతి తీసుకోమ్మన్నారు.అవి దేవి నవరాత్రులు. అప్పుడప్పుడే సత్తువందుకుంటున్న అప్పలరాములుకు శీనుబాబు నాటకముందని కబురెట్టాడు. ఆ మాట సెవిలో పడగానే యిన్ని రోజులు మంచం మీద పడిన బాధలు మరిచిపోయాడు. యింట్లో తెలిస్తే నాటకాలకెల్లనివ్వరని కళ్లంకెళ్లోస్తాని అటునుంచటే నాటకానికి చెక్కేశాడు.ఉదయాన్నే ఇంటికి చేరేసరికి కొడుక్కి తండ్రి మీద ఉన్న ప్రేమ కోపంగా మారింది.నాటకం హీనస్థితిని చూశాడు ఒకపక్క....విశ్రాంతి తీసుకోవాల్సిన తండ్రి రాత్రంతా నిద్ర లేకుండా నాటకం వేసి వచ్చాడు. అది తట్టుకోలేక...‘‘మీరు నాటకాలు వేసి మమ్మల్నేమీ ఉద్దరించియక్కర్లేదు...ఎవరూ మీకు బంగారు కంకణాలు తొడిగీరులే...ఇంకోసారి నాటకాలూసెత్తితే ఊరుకునేది లేదు’’ అంటూ చెడామడా తిట్టేశాడు.తన తోటి కళాకారుల ఇళ్లలో కూడా పిల్లలు నియంత్రిస్తున్నారని విన్నాడు. యిది తనకు కూడా వచ్చేసింది అంటూ ఆదుర్దాపడ్డాడు.‘‘నన్ను కన్న తండ్రినే ఒప్పించాను. నా కడుపున పుట్టిన కొడుకునొప్పించలేనా’’ అని సమాధాన పరుచుకున్నాడు.మరుసటిరోజు కొడుకున్నప్పుడే శీనుబాబు నుంచి నాటకముందని కబురు వచ్చింది.కొడుకున్నాడని కన్నుకొట్టి ‘‘నేనే నాటకానికి రాను’’ అని కుబురు తెచ్చిన మనిషిని పంపేశాడు.ఇదంతా గమనించాడు కొడుకు.‘విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో రాత్రిపూట మంచులో పడి నాటకాలు వేస్తే మళ్లీ జ్వరం తిరగబడుతుంది. ఈ ముసలోడికిలా కాదు’ అంటూ పడుకున్నట్లు నటిస్తున్న తండ్రిని ఇంట్లో పెట్టి బయట గడియ పెట్టేశాడు కొడుకు.అప్పలరాములు కొడుక్కి తన మీద ఉన్న ప్రేమను గమనించాడు.కానీ నాటకం మీద తనకున్న ప్రేమను చంపుకోలేకపోయాడు. చేసేదేమి లేక మంచం మీద చేరబడ్డాడు. ఆరోజు తాను వెళ్లవలసిన నాటకం ఎలా జరుగుతుందో...శీనుబాబేటనుకుంతాడో...నిజంగా కొడుకు చెప్పినట్లుగా నాటకరంగమంత దిగజారిపోయిందా...ఒకప్పుడు తన పరువపు వయసులో...నాటకమంటే పడిచచ్చే జ్ఞాపకాలు...తన కళ్ళ ముందు అలా అలా అలల్లా కదులుతున్నాయి.అప్పలరాములు పార పట్టుకొని దమ్ము మడిలో ఒంగితే గెనకు గెన పూర్తయ్యేవరకు నడుమెత్తేవాడు కాదు. పనులన్నీ పూర్తయ్యాక సాయంత్రం అయ్యేసరికి తోటివాళ్లతో కూడి చెక్క భజనలు, రామభజనలు...అప్పలరాములు గొంతెత్తి ముందు పాట పాడుతుంటే మారాము చేస్తున్న పిల్లలు మగతలోకి జారుకునేవారు. మనువుకు సిద్ధమైన యువతులు గిలిగింతలు పడేవారు. ఆనాడు సినిమా వినోద సాధనంగా మొదలైంది కానీ అది తమలాంటి పల్లెలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. పెద్దపెద్ద పండగలు, ఉత్సవాల సమయాల్లో పెద్ద పెద్ద కూడల్లలో పౌరాణిక నాటకాలు ప్రదర్శించేవారు. ఒకరోజు ఒక రిక్షా బండి ‘ఆలసించిన ఆశాభంగం నేడే...ఈరోజే...మన రాజాంలో ఈలపాట మొదలగు నటులతో పౌరాణిక నాటకం ప్రదర్శించబడును’ అంటూ దండోరా వేసుకుంటూ వెళ్ళిపోయింది.ఎలాగైనా నాటకం చూడాలనుకున్నాడు.నాటకం చూడాలంటే టికెట్ ఉండాలి.టికెట్ ఉండాలంటే డబ్బులు కావాలి.అమ్మ దగ్గరకు చేరాడు...అమ్మ ఇంట్లో బియ్యపుగింజలు ఊర్లో షావుకారుకిచ్చి డబ్బులు తెచ్చింది...అప్పలరాములు పొంగిపోండు. పనులన్నీ వేరము పూర్తి చేసుకుండు. జతగాళ్లతో కలిసి నాటకం చూడటానికి బయలుదేరాడు.నాటకం మొదలైంది...జనాలు ఈలలు, కేకలు...ఈలపాట మొదలగు నటులంతా పద్యాలతో రాగాలు పంపుతుంటే చెవులో అమృతమే పోయించుకున్నాడు. ఇంటికి చేరుకున్నాడు. రెండుమూడు రోజులు పద్యాలు తన చెవుల్నొగ్గలేదు...సివరకు ఒకరోజు సాయంత్రం పనులన్నీపెందరాళే పూర్తి చేసి నాటకాలు నేర్పుతున్న గురువు దగ్గరకు చేరుకున్నాడు.‘‘పొలంలో పండిన కూరో నారో ఇచ్చుకుంటాను. నాటకం నేర్పు గురువా’’ అని ప్రాధేయపడ్డాడు.గురువు కనికరించి పౌరాణిక నాటకాల్లోని మైనర్ పాత్రలను నేర్పించాడు. ఊరి బడిలో తెలుగు సదవడం, రాయడం వచ్చినంత వరకు సదువుకున్నాడు. అది ఇప్పుడుపయోగపడింది.రోజూ రాత్రి రెండు మైళ్ళ దూరం నడిచి గురువు దగ్గర పద్యం చెప్పించుకునేవాడు. ఉదయం అరక తోలునప్పుడో, పశువులు మేపుతూనో, గడ్డి కోస్తూనో సాధన చేసేవాడు. ప్రదర్శనలు కూడా ఇవ్వడంమొదలెట్టాడు. మొదట ప్రదర్శన ఇచ్చిన రోజు తను ఏదో రాజ్యాన్ని జయించినంత సంబరపడ్డాడు....ఇలా గ్యాపకాలు గుర్తొస్తుంటే కళ్ళంబడి నీళ్ళు రాలుతున్నాయి.వ్యవసాయం, సంసారం, సమాజం...ఇవ్వేమి ఇవ్వలేని సంతోషం మనసుకు నాటకం ఇచ్చింది. ఆరోజులు మరలా మోము మీద చిరునవ్వును చిందించాయి. మళ్లీ గతపు ఆలోచనలు...నాటకాలేస్తున్నయిషయం ఆ నోటా ఈ నోట తండ్రికి తెలిసింది. ఆరుగాలం శ్రమించాల్సిన రైతోడు నాటకాల్లో పడితే యివతల యవసాయం ఉట్టెక్కిపోతాది....అవతల మనిషి సెడు యసనాలకుబానిసైపోతాడు. రెంటికి సెడ్డ రేవడైపోతాది గాలా ఈడి బతుకు’’ అని తల్లి సమక్షంలో పరోక్షంగా మందలించాడు తండ్రి.‘‘పనులకు డోకా రాకుండా సూసుకుంతానులే. యసనాల జోలికి పోను’’ అని తల్లికి నచ్చచెప్పి తన మనసుకు ఇష్టమైన నాటకాలను విడవకుండా ముందుకెళ్లాడు.నాటకరంగ గొప్పస్థితిని చూశాడు...ఇప్పుడు అలాగే ఉందనుకుంటున్నాడు...నాటకం మీద తనకున్న ప్రేమ అలాంటిది. అనేకమైన ఆలోచనలు. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో...మళ్లీ కోడి కూయగానే మెలుకువొచ్చింది. గోళ్లోకెల్లోద్దామని లేవబోయాడు. యెడమసేయికి సెతన తగల్లేదు. యెడమ కాలు కూడా తన సెతనలో లేదు...‘పోనిలే పిల్లల కోరిక తీరిందిలే’ అనుకొని చిన్న చిరునవ్వు నవ్వాడు. నదికి ఆనకట్ట నీరును పొంగించి ఊర్లను ముంచెత్తది. నటనకి ఆనకట్ట తన రక్తాన్ని పొంగించి మనసును ముంచేసింది. అదెల్లి ఎక్కడో నరాలను తెంపేసింది. ‘సత్యసంధుడట, హరిశ్చంద్రుడట...’ అంటూ అందరినీ భయపెట్టే ఆ కంఠం మూగబోయి అప్పుడప్పుడు రుషి వలే నవ్వును మాత్రమే చిందిస్తుంది. అల్తి మోహనరావు