స్నానానికి ముందు!
చర్మంపై మృతకణాలు చేరినప్పుడు కాంతి తగ్గిపోతుంది. చర్మం నిస్తేజంగా, ముడతలుగా కనిపిస్తుంది. ఈ సమస్య పరిష్కారానికి...
⇔ ఆలివ్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు, సీ సాల్ట్ (రాతి ఉప్పు) టేబుల్ స్పూన్ చొప్పున తీసుకొని, శరీరానికి పట్టించి, మృదువుగా రాయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మృతకణాలు సులువుగా తొలగిపోతాయి. చర్మకాంతి పెరుగుతుంది.
⇔ బాడీ బ్రష్ మార్కెట్‌లో లభిస్తుంది. ఈ బ్రష్ కుచ్చులు చాలా మెత్తగా ఉంటాయి. స్నానం చేసే సమయంలో ఈ బ్రష్‌తో మృదువుగా చర్మంపై రబ్ చేస్తే మురికి, మృతకణాలు తొలగిపోతాయి.
⇔ టేబుల్ స్పూన్ చొప్పున ఆరెంజ్ జూస్, నిమ్మరసం తీసుకొని కప్పు పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి.
⇔ టేబుల్ స్పూన్ మినప్పప్పు, 6 బాదంపప్పులు కలిపి నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ రెండింటిని మెత్తగా రుబ్బాలి. స్నానం చేయడానికి అరగంట ముందు శరీరానికి పట్టించి, మృదువుగా రుద్దాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది.