Dead cells
-
Beauty Tips: మామిడి, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం!
Beauty Tips In Telugu- Mango Scrub Benefits: వేసవిలో లభించే పండ్లలో దాదాపు అందరికీ ఇష్టమైనది మామిడి. పండ్లలో రారాజైన మామిడి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, మామిడిలో కేవలం అనారోగ్యాన్ని దూరం చేసే గుణాలే కాదు అందాన్ని ఇనుమడింపజేసే లక్షణాలు కూడా ఉన్నాయి. మామిడితో ఈ స్క్రబ్ ట్రై చేశారంటే మంచి ఫలితం ఉంటుంది. మామిడి స్క్రబ్.. ట్యాన్ మాయం! ►నాలుగు టేబుల్ స్పూన్ల మామిడి పండ్ల గుజ్జులో మూడు టేబుల్ స్పూన్ల ఓట్స్, రెండు టేబుల్ స్పూన్ల బాదం పొడి వేసి చక్కగా కలుపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ►ఆరాక చల్లటి నీటితో కడిగేయాలి. ►ముఖం మీద మచ్చలు, ట్యాన్‌ను ఈ స్క్రబ్ చక్కగా తొలగిస్తుంది. ►మామిడి, ఓట్స్‌ను కలిపిన ఈ స్క్రబ్ ముఖం మీద మృతకణాలు, దుమ్మూధూళిని తొలగించి చర్మానికి నిగారింపునిస్తుంది. ►వారానికి మూడుసార్లు ఈ స్క్రబ్ వాడితే మంచి ఫలితం వస్తుంది. చదవండి👉🏾Vitamin B12: విటమిన్ బి 12 లోపం లక్షణాలివే! వీటిని తిన్నారంటే.. చదవండి👉🏾Hair Care Tips: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల -
దీర్ఘాయుష్షు మందు పరీక్ష పూర్తి...
దీర్ఘాయుష్షుకు మనిషి మరో అడుగు దగ్గరయ్యాడు. శరీరంలో వయసుతోపాటు నశించిపోయే కణాలను ఎంచక్కా తొలగించే మందును తయారు చేసిన టెక్సస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దాన్ని విజయవంతంగా మానవులపై ప్రయోగించారు కూడా. శరీరంలోని కణాలు నిత్యం విభజితమవుతూ పాడైపోతూంటాయన్నది తెలిసిన విషయమే. పాడైన కణాలన్నీ శరీరం బయటకు వెళ్లిపోవు. విభజితం కాకపోయినా.. ఈ కణాలు కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. వయసుతోపాటు వచ్చే సమస్యలన్నీ ఈ రసాయనాల కారణంగానే అని కొంతమంది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్సస్ వర్సిటీ శాస్త్రవేత్తలు 14 మంది ఊపిరితిత్తుల కేన్సర్ రోగులపై కొన్ని పరిశోధనలు చేపట్టారు. పాడైన... వృద్ధ కణాలను తొలగించగలదని అనుకున్న మందులను మూడు వారాల పాటు వీరికి అందించారు. ఈ సమయంలోనే కేన్సర్ మందులు కూడా వీరు తీసుకున్నారు. మూడు వారాల తరువాత జరిపిన పరిశీలనల్లో ఈ రోగులు మునుపటి కంటే ఎక్కువ దూరం నడవగలరని తెలిసిందని జేన్ జస్టిస్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వారి పరిస్థితి మెరుగైందనేందుకు కొన్ని ఇతర రుజువులు కూడా కనిపించాయని జేన్ తెలిపారు. దుష్ప్రభావాలు ఏమీ లేకపోవడం ఈ మందుతో కలిగే అదనపు ప్రయోజనమని అయితే మరిన్ని విస్తృత స్థాయి పరిశోధనలు చేపట్టి ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉందని వివరించారు. ఈ దిశగా తాము ఇంకో 15 మంది ఊపిరితిత్తి రోగులకు, 20 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఈ మందు ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపారు. -
తేనెతో ముడతల నివారణ...
బ్యూటిప్స్ టీ స్పూన్ తేనెలో టీ స్పూన్ పాల మీగడ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా 30 రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. టేబుల్ స్పూన్ టొమాటో గుజ్జులో టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం రెండు పూటలా అప్లై చేసుకుంటే మేనిఛాయ మెరుగవుతుంది. పుదీనా ఆకులు మెత్తగా పేస్ట్ చేసి దాంట్లో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా 15 రోజులపాటు చేస్తే మంచిఫలితం ఉంటుంది.టేబుల్ స్పూన్ బియ్యప్పిండిలో టీస్పూన్ ఆరెంజ్ జ్యూస్, టీ స్పూన్ తేనె తగినన్ని పాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించి మృదువుగా మర్దన చేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మృతకణాలు తొలగి చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. -
స్నానానికి ముందు!
చర్మంపై మృతకణాలు చేరినప్పుడు కాంతి తగ్గిపోతుంది. చర్మం నిస్తేజంగా, ముడతలుగా కనిపిస్తుంది. ఈ సమస్య పరిష్కారానికి... ⇔ ఆలివ్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు, సీ సాల్ట్ (రాతి ఉప్పు) టేబుల్ స్పూన్ చొప్పున తీసుకొని, శరీరానికి పట్టించి, మృదువుగా రాయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మృతకణాలు సులువుగా తొలగిపోతాయి. చర్మకాంతి పెరుగుతుంది. ⇔ బాడీ బ్రష్ మార్కెట్లో లభిస్తుంది. ఈ బ్రష్ కుచ్చులు చాలా మెత్తగా ఉంటాయి. స్నానం చేసే సమయంలో ఈ బ్రష్‌తో మృదువుగా చర్మంపై రబ్ చేస్తే మురికి, మృతకణాలు తొలగిపోతాయి. ⇔ టేబుల్ స్పూన్ చొప్పున ఆరెంజ్ జూస్, నిమ్మరసం తీసుకొని కప్పు పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి. ⇔ టేబుల్ స్పూన్ మినప్పప్పు, 6 బాదంపప్పులు కలిపి నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ రెండింటిని మెత్తగా రుబ్బాలి. స్నానం చేయడానికి అరగంట ముందు శరీరానికి పట్టించి, మృదువుగా రుద్దాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది. -
‘అధర’హో...
లిప్‌స్టిక్ వేసుకునే ముందు పెదాలను శుభ్రం చేసుకోవాలి. అంటే స్క్రబ్ చేసి వాటిపై ఉండే డెడ్సెల్స్ను తొలగించాలి. తర్వాత వాటిపై పెట్రోలియం జెల్లీ లాంటి లిప్‌బామ్ అప్లై చేశాక మీకు నచ్చిన రంగు లిప్‌స్టిక్ వేసుకుంటే పెదవులు పగిలినట్టు కనిపించకుండా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇప్పుడు మార్కెట్లో అన్ని రంగుల లిప్స్టిక్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ధరించే దుస్తుల రంగు లిప్‌స్టిక్‌ను ఎంచుకోవచ్చు. కానీ అది మీ స్కిన్‌టోన్‌కు సరిపోయేలా ఉంటేనే మరింత అందంగా కనిపిస్తారు. ఎందుకంటే కొందరికి ముదురు రంగు లిప్స్టిక్స్ నప్పినట్టు కనిపించవు. వేసుకున్న లిప్‌స్టిక్ ఎక్కువసేపు ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకు లిప్‌బామ్ రుద్దిన కింది పెదవికి మధ్యభాగంలో లిప్‌స్టిక్‌ను అప్లై చేయిలి. తర్వాత రెండు పెదవులను కంప్రెస్ చేస్తే అది పై పెదవికి అందంగా అంటుతుంది. అప్పుడు ఒక టిష్యూపేపర్‌ని ఆ లిప్‌స్టిక్‌పై అద్ది మరో కోటింగ్ వేయాలి. అలా చేస్తే రంగు గాఢంగా చక్కగా కనిపించడంతో పాటు రోజంతా పెదవులు తాజాగానూ కనిపిస్తాయి. {బాండెడ్ లిప్‌స్టిక్స్‌ను ఎంచుకుంటే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే తక్కువ ధరలో దొరికే లిప్‌స్టిక్స్‌లో రసాయనాల వాడకం ఎక్కువగా ఉంటుంది. అలాగే లిప్‌స్టిక్ వేసుకున్నాక లిప్ గ్లాస్ రాసుకుంటే పెదవులు మెరుస్తుంటాయి. అలాంటి లిప్గ్లాస్ల విషయంలోనూ జాగ్రత్తగా వహించాలి. రంగు రంగుల లిప్గ్లాస్ల కంటే కలర్లెస్ది ఎంచుకోవడం మంచిది.