‘అధర’హో...
లిప్‌స్టిక్ వేసుకునే ముందు పెదాలను శుభ్రం చేసుకోవాలి. అంటే స్క్రబ్ చేసి వాటిపై ఉండే డెడ్‌సెల్స్‌ను తొలగించాలి. తర్వాత వాటిపై పెట్రోలియం జెల్లీ లాంటి లిప్‌బామ్ అప్లై చేశాక మీకు నచ్చిన రంగు లిప్‌స్టిక్ వేసుకుంటే పెదవులు పగిలినట్టు కనిపించకుండా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
ఇప్పుడు మార్కెట్‌లో అన్ని రంగుల లిప్‌స్టిక్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ధరించే దుస్తుల రంగు లిప్‌స్టిక్‌ను ఎంచుకోవచ్చు. కానీ అది మీ స్కిన్‌టోన్‌కు సరిపోయేలా ఉంటేనే మరింత అందంగా కనిపిస్తారు. ఎందుకంటే కొందరికి ముదురు రంగు లిప్‌స్టిక్స్ నప్పినట్టు కనిపించవు.
వేసుకున్న లిప్‌స్టిక్ ఎక్కువసేపు ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకు లిప్‌బామ్ రుద్దిన కింది పెదవికి మధ్యభాగంలో లిప్‌స్టిక్‌ను అప్లై చేయిలి. తర్వాత రెండు పెదవులను కంప్రెస్ చేస్తే అది పై పెదవికి అందంగా అంటుతుంది. అప్పుడు ఒక టిష్యూపేపర్‌ని ఆ లిప్‌స్టిక్‌పై అద్ది మరో కోటింగ్ వేయాలి. అలా చేస్తే రంగు గాఢంగా చక్కగా కనిపించడంతో పాటు రోజంతా పెదవులు తాజాగానూ కనిపిస్తాయి.
{బాండెడ్ లిప్‌స్టిక్స్‌ను ఎంచుకుంటే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే తక్కువ ధరలో దొరికే లిప్‌స్టిక్స్‌లో రసాయనాల వాడకం ఎక్కువగా ఉంటుంది. అలాగే లిప్‌స్టిక్ వేసుకున్నాక లిప్ గ్లాస్ రాసుకుంటే పెదవులు మెరుస్తుంటాయి. అలాంటి లిప్‌గ్లాస్‌ల విషయంలోనూ జాగ్రత్తగా వహించాలి. రంగు రంగుల లిప్‌గ్లాస్‌ల కంటే కలర్‌లెస్‌ది ఎంచుకోవడం మంచిది.