పర్సనల్ కేర్, కాస్మొటిక్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే గుడ్ గ్లామ్ గ్రూప్ దాదాపు 150 మంది లేదా 15 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది చివర్లో ఐపీవోకి వెళ్తున్న నేపథ్యంలో ఈ యూనికార్న్ కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు తన మానవ వనరులను పునర్నిర్మించడంతో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత 12-15 నెలల్లో వివిధ విభాగాలలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో లాభదాయకమైన కంపెనీగా ఉండాలనే దృఢమైన లక్ష్యానికి ఈ వ్యూహాత్మక చొరవ దోహదపడుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా గుడ్ గ్లామ్ గ్రూప్ ఇటీవల పోప్‌గ్జో, ప్లిగ్సో, బేబీ చక్ర, మామ్స్‌కో, స్కూప్‌ఊప్, ట్వీక్ ఇండియా కంపెనీలను కొనుగోలు చేసింది. గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా మనన్ జైన్, గ్రూప్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, ఫౌండర్ ఇనిషియేటివ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కార్తీక్ రావు, బ్రాండ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా అంకితా భరద్వాజ్‌ని నియమించింది. ఇటీవలే గ్రూప్ కొత్త గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కమల్ లత్ నియామకాన్ని కూడా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment