lay offs
-
మానవ వనరులను ఆకర్షించడంలో విఫలం
విదేశాల్లోని నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఆకర్షించడంలో యూకే ప్రభుత్వం విఫలమవుతోంది. దానివల్ల రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి క్షీణిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వెళ్లే వలసదారులు యూరప్‌లో పనిచేసేందుకు యూకేకు బదులుగా ఎక్కువ ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌ను ఎంచుకుంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.యూకే ప్రభుత్వం నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోతుంది. ఆన్లైన్ జాబ్ సెర్చ్ వెబ్సైట్ ఇండీడ్ ఆరు నెలలపాటు సర్వే చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం..యూరప్‌లో ఉద్యోగం చేయాలని భావించేవారిలో ఎక్కువగా అత్యధిక ప్యాకేజీ ఆశిస్తున్నవారే ఉన్నారు. యూకే ఉద్యోగం చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే అక్కడి ప్రభుత్వ విధానాలు, తక్కువ వేతనాలు ఆఫర్ చేయడంతో ఆసక్తి చూపించడంలేదు. యూకే కంటే మెరుగైన వేతనాలు అందించే ఫ్రాన్స్, నెదర్గాండ్స్ను ఎంచుకుంటున్నారు. యూకేలో స్థానికులకు నైపుణ్యాలు పెంపొందిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా విదేశీయుల అవసరాన్ని తగ్గిస్తామని ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ గతంలో తెలిపారు. దాంతో అధిక నైపుణ్యాలు కలిగిన వారు ఆ దేశానికి వెళ్లకపోవడానికి ఇదో కారణంగా ఉంది. ఐటీ, ఇంజినీరింగ్ వంటి అత్యంత ఉత్పాదక రంగాల్లో ఇప్పటికే సిబ్బంది కొరత ఉంది. చాలా కంపెనీలు లేఆఫ్స్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉన్నవారిపైనే ఎక్కువ పని ఒత్తిడి ఉంటోంది.ఇదీ చదవండి: ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోం’2021లో యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయిన యూకే ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసిందనే వాదనలున్నాయి. దీనివల్ల అధిక నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఆకర్షించడంలో వెనకబడుతోందని నిపుణులు చెబుతున్నారు. కరోనా కంటే ముందు యూకేలో ఉద్యోగం చేయడానికి 54 శాతం విదేశీయులు ఇష్టపడేవారని కొన్ని సర్వేలు నివేదించాయి. ఇదిలాఉండగా, ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకొస్తే నైపుణ్యాలు కలిగిన విదేశీయులు యూకే వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దాంతోపాటు స్థానికంగా మెరుగైన జీవిన విధానానికి సరిపడే వేతనాలు అందించినా పరిస్థితిలో మార్పులు వస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
ఆ కంపెనీ టెకీలపై లేఆఫ్ పిడుగు! 12,500 మంది తొలగింపు
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ టెక్నాలజీస్ మళ్లీ భారీ సంఖ్యలో తొలగింపులను ప్రకటించింది. గత 15 నెలల్లో ఇది రెండవ రౌండ్ లేఆఫ్. కంపెనీ ఈసారి దాదాపు 12,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది దాని మొత్తం వర్క్ ఫోర్స్‌లో దాదాపు 10 శాతం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక ఐటీ సొల్యూషన్స్‌లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఉద్దేశించిన విస్తృత పునర్వ్యవస్థీకరణలో ఈ తొలగింపులు భాగం. తమ కస్టమర్ సంస్థలకు ఏఐ ద్వారా మెరుగైన సేవలు అందించి మార్కెట్ వృద్ధిని పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.తొలగింపుల నిర్ణయాన్ని కంపెనీ గ్లోబల్ సేల్స్ అండ్ కస్టమర్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ బిల్ స్కానెల్, గ్లోబల్ ఛానెల్స్ ప్రెసిడెంట్ జాన్ బైర్న్ మెమో ద్వారా తెలియజేశారు. ఉద్యోగుల తొలగింపులు బాధాకరమే అయినప్పటికీ భవిష్యత్ వృద్ధి కోసం అనివార్యమైనట్లు పేర్కొన్నారు. తొలగింపుల గురించి ఉద్యోగులకు హెచ్ఆర్ ఎగ్జిట్ మీటింగ్‌ల ద్వారా తెలియజేశారు.కొందరికి వన్-ఆన్-వన్ మీటింగ్‌ల ద్వారా ఈ విషయం తెలిసింది. బాధిత ఉద్యోగులకు రెండు నెలల వేతనాలతో పాటు సంవత్సరానికి అదనంగా ఒక వారం, గరిష్టంగా 26 వారాల వరకు సీవెరన్స్ ప్యాకేజీలు అందిస్తున్నారు. అయితే ప్రోత్సాహకాలు, స్టాక్ ఆప్షన్లు కోల్పోవడంపై దీర్ఘకాలిక ఉద్యోగులలో అసంతృప్తి ఉంది. ఇటీవలి బడ్జెట్ తగ్గింపులు, రద్దైన ప్రాజెక్ట్‌లను గమనించిన కొంతమంది ఉద్యోగులు కోతలను ముందే ఊహించారు.డెల్ ఇప్పటికే 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 13,000 మంది ఉద్యోగులను తొలగించింది. రిమోట్-వర్క్ విధానాన్ని రద్దు చేస్తూ, గత సంవత్సరం ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌లకు పిలవాలని కంపెనీ తీసుకున్న నిర్ణయం కూడా సిబ్బందిని తగ్గించడంలో భాగంగా తీసుకున్న చర్యగా భావిస్తున్నారు. ప్రస్తుత తొలగింపులతో డెల్ వర్క్‌ఫోర్స్ 1.2 లక్షల నుంచి 1లక్ష దిగువకు తగ్గుతుందని అంచనా. -
మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. భారీగా తొలగింపులు!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ ఉద్యోగ కోతలను ప్రకటించింది. గత ఏడాది జనవరిలో ఏకంగా 10,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచిన మైక్రోసాఫ్ట్ అప్పటి నుంచి పలు చిన్న రౌండ్ల లేఆఫ్‌లు ప్రకటిస్తూ వచ్చింది. ఈ ఏడాది మేలో చివరిసారిగా తొలగింపులు చేపట్టిన టెక్ దిగ్గజం తాజగా మరో రౌండ్ తొలగింపును ప్రకటించింది.ఈ తొలగింపుల్లో మైక్రోసాఫ్ట్ మిక్స్డ్ రియాలిటీ విభాగం, అజ్యూర్ క్లౌడ్ యూనిట్‌తో సహా వివిధ విభాగాలలో సుమారు 1,000 మంది ఉద్యోగులు ప్రభావితమవుతున్నారు. అత్యంత ప్రభావితవుతున్న విభాగాల్లో హోలోలెన్స్ 2 ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను అభివృద్ధి చేసిన మిక్స్డ్ రియాలిటీ విభాగం ఉంది. ఓ వైపు ఉద్యోగ కోతలు ఉన్నప్పటికీ, హోలోలెన్స్ 2 అమ్మకాలను కొనసాగించాలని మైక్రోసాఫ్ట్ యోచిస్తోంది.'మైక్రోసాఫ్ట్ మిక్స్ డ్ రియాలిటీ సంస్థను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ఈ రోజు ప్రకటించాం. రక్షణ శాఖకు సంబంధించిన ఐవీఏఎస్ కార్యక్రమానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. మన సైనికులకు మద్దతు ఇవ్వడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూనే ఉంటాం. అదనంగా, విస్తృత మిక్స్ డ్ రియాలిటీ హార్డ్ వేర్ ఎకోసిస్టమ్ ను చేరుకోవడానికి మేము W365 లో పెట్టుబడిని కొనసాగిస్తాం. ఇప్పటికే ఉన్న హోలోలెన్స్ 2 కస్టమర్లు, భాగస్వాములకు మద్దతు ఇస్తూనే హోలోలెన్స్ 2 అమ్మకాలను కొనసాగిస్తాం' అని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి క్రెయిగ్ సిన్కోటా 'ది వెర్జ్'కు ఈమెయిల్ ప్రకటనలో తెలిపారు.మిక్స్ డ్ రియాలిటీ విభాగంతో పాటు అజూర్ క్లౌడ్ యూనిట్ ను కూడా గణనీయమైన తొలగింపులు తాకుతున్నాయి. అజూర్ ఫర్ ఆపరేటర్స్, మిషన్ ఇంజనీరింగ్ టీమ్‌లలో వందలాది ఉద్యోగాలను తొలగించినట్లు బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీస్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై దృష్టి సారించడానికి 2021లో స్థాపించిన స్ట్రాటజిక్ మిషన్స్ అండ్ టెక్నాలజీస్ ఆర్గనైజేషన్‌లో ఈ టీమ్‌లు భాగంగా ఉన్నాయి. -
మరో 600 జాబ్స్‌కి గండం!
Tesla Layoffs: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లాలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పని చేస్తున్న దాదాపు 10 శాతం మంది సిబ్బందిని తొలగించిన టెస్లా.. తాజాగా మరింత మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది.టెస్లా సోమవారం ప్రభుత్వ ఏజెన్సీలకు ఇచ్చిన నోటీసు ప్రకారం, కాలిఫోర్నియాలో అదనంగా 601 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించిన గ్లోబల్ ఉద్యోగ కోతల్లో భాగంగా కాలిఫోర్నియా, టెక్సాస్‌లలో 6,020 మందిని తొలగించనున్నట్లు గత నెలలో తెలిపింది.టెస్లా కార్ల విక్రయాలు ఇటీవల కాలంలో భారీగా పడిపోయాయి. మరోవైపు ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ భారీగా పెరిగింది. దీంతో టెస్లా కంపెనీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విక్రయాలు పెంచడం కోసం ధరలను తగ్గించింది. త్వరలో అందుబాటు ధరలో కొత్త కార్లను తీసుకురానున్నట్లు టెస్లా తెలిపింది. మరోవైపు ఖర్చులను తగ్గించేందుకు పెద్ద ఎత్తున తమ కంపెనీలను ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 శాతం మంది సిబ్బందిని తొలగించింది. -
ఇంకా తగ్గని లేఆప్స్ బెడద.. నాలుగు నెలల్లో 80 వేలమంది
కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుంచి.. ఉద్యోగులకు కష్టంకాలం మొదలైపోయింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గినా.. లేఆప్స్ మాత్రం తగ్గడమే లేదు. 2024 మొదటి నాలుగు నెలల్లోనే ఏకంగా 80,000 మంది ఉద్యోగాలను కోల్పోయారు.సుమారు 279 టెక్ కంపెనీలు ఇప్పటి వరకు (మే 3 వరకు) 80,230 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఆర్ధిక అనిశ్చితుల కారణంగా.. లాభాలు తగ్గుతున్నాయి. దీంతో టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. దీనికి తోడు కొత్తగా పుట్టుకొస్తున్న టెక్నాలజీలు కూడా ఉద్యోగుల మీద తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.2024లో కూడా ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో టెస్లా, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి.ఏప్రిల్ నెలలో మాత్రమే దిగ్గజ కంపెనీలు 20000 కంటే ఎక్కువమందిని తొలగించాయి. టెకీల పరిస్థితి ప్రస్తుతం గాల్లో దీపం లాగా మారిపోతున్నాయి.యాపిల్ కంపెనీలో స్మార్ట్ కారు, స్మార్ట్ వాచ్ డిస్ప్లే వంటి ప్రత్యేక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 600 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ కూడా ఈ బాటలోనే అడుగులు వేసింది.అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో.. ఏకంగా 10 శాతం మందిని విధుల నుంచి తప్పించింది. ఓలా క్యాబ్స్ కూడా 10 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించింది. హెల్త్ టెక్ స్టార్టప్ కంపెనీ, వర్ల్ పూల్, టెలినార్ మొదలైన కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తొలగించింది. -
Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలలో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ ఒకటి వెల్లడైంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి టెక్ కంపెనీలు.layoffs.fyi ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. టెక్నాలజీ రంగంలోని 50 కంపెనీల నుండి ఒక్క ఏప్రిల్ నెలలోనే 21,473 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ఈ ఏడాది లేఆఫ్‌ల ధోరణికి ఏప్రిల్ నెల తొలగింపులు అద్దం పడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కనీసం ఇప్పటి వరకూ 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగులను తొలగించాయి. జనవరిలో 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు జరిగాయి. ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 మందిని తొలగించాయి. ఇక మార్చిలో 37 కంపెనీల్లో 7,403 మంది ఉద్యోగాలను కోల్పోయారు. మార్చి నుంచి ఏప్రిల్‌కు ఒక్క నెలలో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ఏప్రిల్‌లో టెక్ తొలగింపులుయాపిల్ ఇటీవల 614 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొదటి ప్రధాన రౌండ్ ఉద్యోగ కోత.పైథాన్, ఫ్లట్టర్, డార్ట్‌లో పనిచేస్తున్న వారితో సహా వివిధ టీమ్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను గూగుల్ తొలగించింది.అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది ఉద్యోగాలను తగ్గించింది.ఇంటెల్ దాని ప్రధాన కార్యాలయంలోని దాదాపు 62 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది. ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది.ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా అత్యధికంగా 14 వేల మందిని లేఆఫ్ చేసింది.ఓలా క్యాబ్స్ దాదాపు 200 ఉద్యోగాలను తొలగించింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీఫైమ్ దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించింది. గృహోపకరణాలను తయారు చేసే వర్ల్‌పూల్ సుమారు 1,000 మందిని లేఆఫ్ చేసింది.టేక్-టూ ఇంటరాక్టివ్ కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 5% మందిని తొలగించింది. నార్వేలోని టెలికాం కంపెనీ టెలినార్ 100 మంది ఉద్యోగులను తొలగించింది. -
ఉద్యోగులను తొలగించిన లిప్‌స్టిక్ కంపెనీ
పర్సనల్ కేర్, కాస్మొటిక్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే గుడ్ గ్లామ్ గ్రూప్ దాదాపు 150 మంది లేదా 15 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది చివర్లో ఐపీవోకి వెళ్తున్న నేపథ్యంలో ఈ యూనికార్న్ కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు తన మానవ వనరులను పునర్నిర్మించడంతో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గత 12-15 నెలల్లో వివిధ విభాగాలలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో లాభదాయకమైన కంపెనీగా ఉండాలనే దృఢమైన లక్ష్యానికి ఈ వ్యూహాత్మక చొరవ దోహదపడుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా గుడ్ గ్లామ్ గ్రూప్ ఇటీవల పోప్గ్జో, ప్లిగ్సో, బేబీ చక్ర, మామ్స్కో, స్కూప్ఊప్, ట్వీక్ ఇండియా కంపెనీలను కొనుగోలు చేసింది. గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా మనన్ జైన్, గ్రూప్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, ఫౌండర్ ఇనిషియేటివ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కార్తీక్ రావు, బ్రాండ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా అంకితా భరద్వాజ్‌ని నియమించింది. ఇటీవలే గ్రూప్ కొత్త గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కమల్ లత్ నియామకాన్ని కూడా ప్రకటించింది. -
ప్రముఖ టెక్ కంపెనీలో తొలగింపులు, బదిలీలు
Google LayOff: ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ ఉద్యోగుల తొలగింపులు, బదిలీలు చేపట్టింది. ఈ విషయాన్నికంపెనీ ప్రతినిధి తెలిపారు. తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని, ప్రభావితమైన ఉద్యోగులు ఇతర అంతర్గత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్యను వెల్లడించలేదు. ప్రభావితమైన ఉద్యోగులలో కొంత మందిని భారత్, చికాగో, అట్లాంటా, డబ్లిన్ వంటి కంపెనీ పెట్టుబడులు పెడుతున్న కేంద్రాలకు బదిలీ చేయనున్నారు. గూగుల్ తొలగింపులతో ఈ సంవత్సరం టెక్, మీడియా పరిశ్రమలో మరిన్ని తొలగింపులు కొనసాగవచ్చనే భయాలు నెలకొన్నాయి. 2023 ద్వితీయార్థం నుంచి 2024 వరకు తమ అనేక బృందాలు మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పని చేయడానికి, ఉత్పత్తి ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. లేఆఫ్‌లతో గూగుల్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాలలోని అనేక మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ప్రభావితమైన ఫైనాన్స్ టీమ్‌లలో గూగుల్ ట్రెజరీ, వ్యాపార సేవలు, ఆదాయ నగదు కార్యకలాపాలు ఉన్నాయి. పునర్నిర్మాణంలో భాగంగా బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్లకు వృద్ధిని విస్తరింపజేస్తామని గూగుల్ ఫైనాన్స్ చీఫ్, రూత్ పోరాట్ సిబ్బందికి ఈ-మెయిల్ పంపారు. -
వందలాది ఉద్యోగులు ఇంటికి.. ఐటీ కంపెనీ నిర్ణయం
EXL Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఎక్సెల్ సర్వీస్ (Exl Service) అనే ఐటీ సంస్థ ఏఐ డిమాండ్ పేరుతో వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐకి పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా న్యూయార్క్ ఆధారిత ఐటీ సంస్థ ఎక్సెల్ సర్వీస్ తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా 800 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. వీరు కంపెనీ మొత్తం ఉద్యోగులలో 2 శాతం కంటే తక్కువే అని తెలుస్తోంది. కంపెనీ తాజా నిర్ణయం కారణంగా భారత్, అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. వీరిలో 400 మందిని పూర్తిగా ఇంటికి పంపిస్తుండగా మిగిలిన 400 మందికి కంపెనీలోని ఇతర విభాగాల్లో అవకాశం ఇవ్వనుంది. ఉద్యోగాల కోత ప్రాథమికంగా యునైటెడ్ స్టేట్స్, భారత్‌లో డేటా అనలిటిక్స్, డిజిటల్ ఆపరేషన్స్‌లో పనిచేస్తున్న జూనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ఎక్సెల్ సర్వీస్ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 55 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గతంలో కంపెనీ సీఈవోగా ఉన్న రోహిత్ కపూర్ ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా పదోన్నతి పొందారు. అలాగే వికాస్ భల్లా, వివేక్ జెట్లీ అనే ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డేటా, ఏఐ ఆధారిత సొల్యూషన్స్‌తో కూడిన విస్తృత బాధ్యతలను స్వీకరిస్తున్నారు. కాగా ప్రస్తుతం తొలగిస్తున్న వారి స్థానంలో ఏఐ, డేటాలో అత్యంత పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్నవారిని నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తమ క్లయింట్స్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. -
సంచలనం.. 70,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు
Layoffs in Argentina: ప్రైవేట్ కంపెనీల్లో గత కొన్ని నెలలుగా లేఆఫ్‌ల గురించి వింటున్నాం. ముఖ్యంగా ఐటీ సంస్థలు లేఆఫ్‌ల పేరుతో వేలాది సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వాలు సైతం వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం సంచలంగా మారింది. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ రాబోయే నెలల్లో 70,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి దూకుడు వ్యూహాన్ని ప్రదర్శించారు. ఈ తొలగింపులు అర్జెంటీనాలోని 35 లక్షల మంది ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పోలిస్తే తక్కవే అయినప్పటికీ కార్మిక సంఘాల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదరుకావచ్చిన భావిస్తున్నారు. అర్జెంటీనా దేశంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒప్పందం మార్చి 31తో ముగియనుంది. గతేడాదే కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. అన్యాయమైన తొలగింపులను సహించబోమని యూనియన్ నాయకులు హెచ్చరించారు. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. BREAKING: Bloomberg reports that Argentina's President Javier Milei is planning to fire 70,000 government workers — The Spectator Index (@spectatorindex) March 27, 2024 -
అర్జెంటీనాను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?
అర్జెంటీనా నూతన అధ్యక్షుడు జేవియర్ మిలీ.. ఇలా అధికారం చేపట్టారో లేదో అంతలోనే అనూహ్య నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది ఐదు వేల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్లు జేవియర్ మిలీ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. జేవియర్ మిలీ డిసెంబర్ 10న అర్జెంటీనా నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. సంక్షోభంలో కూరుకున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా చర్యలు ప్రారంభించారు. దేశంలోని ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు పలు రంగాలలో కోతలు, పెట్టుబడుల తగ్గింపులకు శ్రీకారం చుట్టారు. జేవియర్ మిలీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ పాల్గొన్నారు. కాగా 2023కు ముందు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్టులను సమీక్షించనున్నట్లు మిలీ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అర్జెంటీనాలో త్వరలో ద్రవ్యోల్బణం దాదాపు 200 శాతానికి చేరుతుందనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వ నిబంధనలు, ఎగుమతులు, పెట్టుబడులను సవరించేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు పరిశ్రమలను ప్రైవేటీకరించేందుకు అనుమతిస్తానని మిలే ప్రకటించారు. దేశాన్ని పునర్నిర్మాణ మార్గంలో తీసుకెళ్లడం, ప్రజలకు స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తి కల్పించడం, దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఉన్న నిబంధనలను సవరించడమే తన లక్ష్యమని మిలీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పలు ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరణపరం చేయనుందని నూతన అధ్యక్షుడు జేవియర్ మిలీ తెలిపారు. ఈ చర్యలలో పెసా (అర్జెంటీనా కరెన్సీ) విలువను 50 శాతం మేరకు తగ్గించడం, ఇంధనం, రవాణా సబ్సిడీలపై కోత, కొన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు స్వస్తి పలకడం వంటివి ఉన్నాయి. 53 ఏళ్ల మైలీ తన ఎన్నికల ప్రచారంలో తాను దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని, ఇందుకోసం పలు మార్పులు చేస్తానని పేర్కొన్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రస్తుత తరుణంలో నిరాశ చెందిన అర్జెంటీనా ప్రజలకు ఆయన ఆశాజ్యోతిగా కనిపించారు. ఈ నేపధ్యంలో ప్రజా మద్దతుతో ఆయన ఆ కొత్త అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుని నిర్ణయాలివే.. తన 21 క్యాబినెట్ పదవులలో 12 పదవులను తొలగించారు. ఐదువేల మంది మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపించారు. లెక్కలేనన్ని ప్రభుత్వ నిబంధనలకు ముగింపు పలికారు. మిలిటరీలో అనేక మార్పులు చేశారు. ఆత్మరక్షణ హక్కును నిర్ధారించే బిల్లుకు మద్దతు పలికారు. చిన్నారుల ఇంటి విద్యను చట్టబద్ధం చేసే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. బిట్‌కాయిన్‌లో చట్టబద్ధమైన చెల్లింపు ఒప్పందాలకు శ్రీకారం పలికారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ దిశగా ముందడుగు వేశారు. సొంత చమురు పరిశ్రమను తెరిచే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ భీకర దాడులు.. 24 గంటల్లో 200 మంది మృతి -
Amazon: వందల ఉద్యోగులపై వేటు.. ఇప్పటికే 27వేల మంది ఔట్.. కారణం ఇదేనా
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితుల కారణంగా ప్రముఖ కంపెనీలు ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దానికితోడు పెరుగుతున్న సాంకేతికతతో మరిన్ని ఉద్యోగాలపై వేటు పడుతోంది. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తూ శుక్రవారం ప్రకటించింది. లేఆఫ్స్‌కు సంబంధించి ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు తెలిపింది. వాణిజ్య ప్రాధాన్యాలు మారుతున్న తరుణంలో జనరేటివ్ ఏఐపై ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. దాంతో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో సిబ్బందిని తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే కచ్చితంగా ఎంతమందికి ఉద్వాసన పలికారో వెల్లడించేందుకు ఆయన నిరాకరించినట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. లేఆఫ్స్‌పై అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ రౌష్ మాట్లాడుతూ.. ఉత్పాదకతను పెంచడానికి కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. అలెక్సా వాయిస్ విభాగంలో కొత్త మార్పులు తీసుకురావడానికి ఖర్చు తగ్గింపుతో పాటు, వ్యాపార ప్రాధాన్యాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: 127 ట్రక్కుల్లో 3 కోట్ల పత్రాలు పంపిన సుబ్రతా రాయ్ కంపెనీలు ప్రస్తుతం ఏఐ టూల్స్‌పై ఆధారపడడం పెరుగుతోంది. ఏఐ ద్వారా తమ ఉత్పాదకత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెజాన్ సైతం కొన్ని నెలలుగా ఏఐని ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది సెప్టెంబర్‌లో అలెక్సాలో జనరేటివ్ ఏఐ ఆధారిత ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే అమెజాన్ సంస్థ గతేడాది చివర్లో, ఈ ఏడాది మొదట్లో దాదాపు 27వేల మంది ఉద్యోగులను తొలగించింది. -
భారత్‌లో లేఆఫ్‌లు.. విస్తుగొలుపుతున్న లెక్కలు!
ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల కారణంగా అన్ని రంగాల్లోనూ లేఆఫ్‌లు జరిగాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. భారత్‌లోనూ వేలాది మందిని ఆయా కంపెనీలు తొలగించాయి. అయితే దేశంలో లేఆఫ్స్‌కు సంబంధించి విస్తుగొలిపే లెక్కలు తాజాగా వెల్లడయ్యాయి. గత రెండేళ్లలో భారతదేశంలో దాదాపు లక్షమంది ఉద్యోగాలు కోల్పోయారని టెక్ ఫోకస్డ్ హైరింగ్ సంస్థ టాప్హైర్ (TopHire) నుంచి వచ్చిన డేటా పేర్కొంటోంది. ఈ లెక్కలు బహిరంగంగా నమోదైన గణాంకాల కంటే చాలా ఎక్కువ.గత రెండేళ్లలో భారతదేశం అంతటా 91,000 మంది ఉద్యోగులు తొలగించబడ్డారని టాప్హైర్ డేటా హైలైట్ చేసింది. మూడు రెట్లు అధికం పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న లేఆఫ్స్ డేటా అగ్రిగేటర్ అయిన లేఆఫ్స్డాట్ఫై (layoffs.fyi) ప్రకారం, 2021 సెప్టెంబర్ 1 నుంచి భారతదేశంలో దాదాపు 27,850 మంది ఉద్యోగాలు కోల్పోయారు. టెక్హైర్ సంస్థ నివేదించిన దానిలో ఇది దాదాపు మూడింట ఒక వంతు మాత్రమే.సైలెంట్ లేఆఫ్‌లు, బలవంతపు రాజీనామాల కారణంగా లెక్కల్లో ఈ భారీ వ్యత్యాసం ఉందని టెక్హైర్ నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: యాపిల్, శాంసంగ్ కీలక నిర్ణయం! ఇక్కడ తయారీ లేనట్లే.. లేఆఫ్స్డాట్ఫై డేటా ప్రకారం.. భారతదేశంలో గత రెండు సంవత్సరాలలో నమోదైన మొత్తం తొలగింపులలో విద్య లేదా ఎడ్టెక్ రంగంలోనే అత్యధికం ఉన్నాయి. బైజూస్, అనకాడమీ, వేదాంతు, అప్‌గ్రేడ్ వంటి కంపెనీలు 10,679 మందిని తొలగించాయి. వీటిలో ఒక్క బైజూస్ సంస్థే దాదాపు ఐదు వేల మందిని తొలగించింది. ఆ తర్వాత రిటైల్, ఈ-కామర్స్ రంగంలో గత రెండేళ్లలో అత్యధిక లేఆఫ్‌లు నమోదయ్యాయి. మింత్రా, మీషో, మమాఎర్త్, ఫ్లిప్‌కార్ట్, ఉడాన్, దుకాణ్ వంటి సంస్థలు 3,400 మందిని తొలగిచాయి. ఇక ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ రంగాలు 3195 ఉద్యోగాల కోతలతో మూడవ స్థానంలో నిలిచాయి. జొమాటో, స్విగ్గీ, రిలయన్స్ జియోమార్ట్, డన్జో తదితర సంస్థలు లేఆఫ్‌ల పేరుతో ఉద్యోగాలను తగ్గించాయి. -
మింత్రాలో ఉద్యోగుల తొలగింపు.. ఫ్లిప్‌కార్ట్ కరుణిస్తేనే..
ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని ప్రముఖ షాపింగ్ యాప్ మింత్రా (Myntra) పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులను తొలగించింది. పలు నివేదికల ప్రకారం.. కంపెనీ నిర్వహించిన తాజా రౌండ్ లేఆఫ్‌లలో దాదాపు 50 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. అయినప్పటికీ, పునర్వ్యవస్థీకరణ ఇంకా కొనసాగుతున్నందున కొంతమంది ఉద్యోగులను ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో కొనసాగించే అవకాశం ఉందని మింత్రా ప్రతినిధి తెలిపారు. మారుతున్న కస్టమర్ల అవసరాలకు, సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మింత్రా ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. అపెరల్స్ స్థానంలో కొన్ని ప్రైవేట్ లేబుల్లపై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, దాని అంతర్గత బ్రాండ్లు ప్రభావితమవుతాయని ఆలోచిస్తున్నారు. ఇదీ చదవండి ➤ ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ సృష్టికర్త.. మింత్రాకు సీఈవో.. ఈ సూపర్ ఉమన్! మింత్రా ప్రైవేట్ లేబుల్ చీఫ్ మనోహర్ కామత్ గత ఏప్రిల్‌లో రాజీనామా చేయగా, కొత్త వ్యాపారాల అధిపతి ఆదర్శ్ మీనన్ కూడా గత మే నెలలో కంపెనీని విడిచిపెట్టారు. గత 18 నెలలుగా ఉద్యోగులను వదులుకున్న స్టార్టప్ కంపెనీల జాబితాలో మింత్రా కూడా చేరింది. Inc42 'ఇండియన్ స్టార్టప్ లేఆఫ్ ట్రాకర్' ప్రకారం, 2022 ఫిబ్రవరి నుంచి 100 కంటే ఎక్కువ స్టార్టప్‌లు 28,000 మంది ఉద్యోగులను తొలగించాయి. -
స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం 35,000 ఉద్యోగాలు కట్
-
గూగుల్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఈసారి ఆ భాగ్యం కొందరికే!
అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దిగ్గజ టెక్ కంపెనీలు లేఆఫ్‌లను అమలు చేస్తూ వందలకొద్దీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్ కూడా ఇటీవలి కాలంలో అనేకమంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ప్రమోషన్ల విషయంలోనూ గూగుల్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో కంటే ఈ ఏడాది తక్కువ ప్రమోషన్లు ఉంటాయని ఉద్యోగులకు గూగుల్ సమాచారం అందించినట్లు సీఎన్‌బీసీ కథనం పేర్కొంది. ప్రమోషన్లు కొందరికే... ప్రమోషన్ల ప్రక్రియ గతంలో మాదిరిగానే మేనేజర్ల నేతృత్వంలో ఉండనుంది. అయితే నియామాలు పెద్దగా చేపట్టకపోవడంతో ఈ ఏడాది ప్రమోషన్లు కూడా తక్కువ సంఖ్యలోనే ఉంటాయని పేర్కొంది. అది కూడా ఎల్ 6, ఆపై స్థాయిలోనే ప్రమోషన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ తీసుకొచ్చిన కొత్త పనితీరు సమీక్ష వ్యవస్థ ప్రకారం సీనియర్లు, నాయకత్వ స్థాయిలో తగినంతమంది ఉద్యోగులు ఉండాలి. అందుకు అనుగుణంగా ఈ ప్రమోషన్లు ఉంటాయని యాజమాన్యం ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో స్పష్టం చేసినట్లు సమాచారం. కంపెనీలో మధ్య స్థాయిలో పనిచేసే ఉద్యోగులే కీలకం.. ప్రమోషన్లపై వారిలో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం కంపెనీ గత ఏడాదే ఒక అంతర్గత సర్వేను కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రమోషన్ల కోసం మార్చి 6 నుంచి 8 తేదీల మధ్య స్వయంగా నామినేట్ చేసుకోవచ్చని గూగుల్ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ లో పేర్కొంది. ఆర్థిక సంక్షోభం కారణంగా గూగుల్ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. ఈ క్రమంలో జనవరిలో ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. అయితే తొలగించిన ఉద్యోగులకు స్థానిక చట్టాలకు అనుగుణంగా పరిహారాలను అందిస్తున్నట్లు అప్పట్లో ఆయన వెల్లడించారు. -
‘హెచ్–1బీ’ గ్రేస్ పీరియడ్ 12 నెలలకు పెంచాలి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో లే–ఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. మరోవైపు ఇతర రంగాల్లోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఫలితంగా అమెరికాలో ఉంటున్న భారతీయులు నిరుద్యోగులుగా మారుతున్నారు. హెచ్–1బీ(నాన్–ఇమ్మిగ్రెంట్) వీసాపై ఉంటున్నవారు ఉద్యోగం పోయాక 60 రోజుల్లోగా(2 నెలలు) మరో కొలువు వెతుక్కోవాలి. లేకపోతే స్వదేశానికి వెళ్లిపోవాలి. ఈ గ్రేస్ పిరియడ్‌ను 60 రోజుల నుంచి 12 నెలలకు(ఒక సంవత్సరం) పెంచాలని కోరుతూ ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియన్ డయాస్పోరా స్టడీస్ అండ్ గ్లోబల్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అనే రెండు భారత–అమెరికన్ సంస్థలు పోరాటం ప్రారంభించాయి. భారత టెకీలకు మేలు చేసేలా నిర్ణయం తీసుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆన్లైన్లో పిటిషన్లు సమర్పిస్తున్నాయి. అధ్యక్షుడితోపాటు డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి, యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్‌కు ఆన్లైన్లో పిటిషన్లను పంపిస్తున్నాయి. -
లే ఆఫ్స్ దెబ్బకి భారత ఐటీ ఉద్యోగుల విలవిల
వాష్టింగన్: ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు పరంపర కొనసాగుతోంది. ఇంట మాత్రమే కాదు.. విదేశాల్లోనూ లక్షల మంది ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు పొగొట్టుకున్న భారతీయుల పరిస్థితి వర్ణనాతీంగా ఉందని వాషింగ్టన్ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అగ్రరాజ్యంలో వేలమంది భారతీయ ఐటీ ఉద్యోగులు.. లే ఆఫ్స్ బారిన పడ్డారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి బడా కంపెనీలతో పాటు పలు ప్రముఖ కంపెనీల్లోనూ ఉద్యోగాలు కోల్పోతున్నారు. కమిట్మెంట్ల కారణంగా తిరిగి స్వదేశానికి రావడానికి ఇష్టపడడం లేదు. ఈ తరుణంలో మరో ఉద్యోగం వెతుక్కునేందుకు బాగా కష్టపడుతున్నారు. ఇక వీసా చిక్కులతో దేశం విడిచిపెట్టాల్సిన పరిస్థితి నెలకొనడంతో.. ఈ లోపే కొత్త ఉద్యోగాల కోసం అన్వేషణలో మునిగిపోయారు. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. గతేడాది నవంబర్ నుంచి సుమారు 2 లక్షల మందికిపైగా ఐటీ ఉద్యోగులు లే ఆఫ్స్ బారినపడి ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. అయితే అందులో 30 నుంచి 40 శాతం ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారని నివేదికలు చెప్తున్నాయి. వాళ్లలో ఎక్కువగా హెచ్1బీ, ఎల్1 వీసాల మీద వెళ్లిన వాళ్లే ఉన్నారు. ఈ క్రమంలో.. ఉద్యోగాల వేటకు.. వాట్సాప్ గ్రూపు ఉద్యోగాలు పొగొట్టుకున్నవాళ్లు.. వర్క్ వీసాల కింద డెడ్లైన్లు ముందు ఉండడంతో కొత్త జాబ్‌ను వెతుక్కోవడానికి కష్టపడుతున్నారు. ఉద్యోగాలు పొగొట్టుకున్న ఉద్యోగుల్లో కొందరు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఎనిమిది వందల మందితో ఉన్న ఓ గ్రూప్ అందుకు నిదర్శనం. ఇక వీళ్ల కష్టాలను చూసి జిట్‌ప్రో(GITPRO), ఫిడ్స్(FIIDS) రంగంలోకి దిగాయి. ఆదివారం నుంచి ఓ ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌ను వాళ్ల కోసం ఏర్పాటు చేశాయి. ఉద్యోగాలు పొగొట్టుకున్నవాళ్లకు ఉద్యోగావకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే సమాచారాన్ని ప్లాట్‌ఫామ్ ద్వారా ఎప్పటికప్పుడు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. పరిస్థితి వర్ణనాతీతంగా ఉండడంతో ఉద్యోగులు సైతం తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారు. పరిస్థితి దారుణంగా ఉందని, చాలా కష్టంగా గడుస్తోందని కొందరు ఉద్యోగుల గోడు వెల్లబోసుకోగా.. వాళ్ల వ్యథలను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. ఈ రెండు వీసాలు ఎవరికంటే.. H-1B వీసా అనేది వలసేతర వీసా. అమెరికన్ కంపెనీలు తమకు అవసరమయ్యే టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌లను(విదేశీ ఉద్యోగులను) నియమించుకునేందుకు అనుమతి ఇస్తుంది. ఇక ఈ వీసా కింద భారత్, చైనా లాంటి దేశాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి అక్కడి బడా కంపెనీలు.హెచ్ 1 బీ వీసా జాబ్ పోతే గనుక.. 60రోజుల్లోగా హెచ్-1బీ స్పాన్సరింగ్ ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇక L-1A, L-1B వీసాలు.. కంపెనీలు తాత్కాలిక బదిలీల మీద పంపిస్తుంటాయి. మేనేజెరియల్ పొజిషన్స్ లేదంటే ప్రత్యేక పరిజ్ఞానం కలిగి ఉన్న ఉద్యోగుల విషయంలో ఈ వీసాలు ఎక్కువగా ఇస్తుంటారు. -
ఉద్యోగులకు దిగ్గజ కంపెనీ భారీ షాక్.. ఇక వేలాది మంది ఇంటికే
ఆర్ధిక మాంద్యం భయాల్లో ఇప్పట్లో పోయేలా లేవు. గతేడాది మే నుంచి మొదలైన రెసిషన్ భయాలు సంస్థల్ని ఇంకా పట్టి పీడుస్తూనే ఉన్నాయి. అందుకే నెలలు గడిచే కొద్ది ఖర్చుల్ని తగ్గించుకునేందుకు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించే విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా న్యూయార్క్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ఈ వారంలో దాదాపు 3,200 ఉద్యోగుల్ని ఫైర్ చేయనుంది. అస్థిరంగా గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల ఫలితంగా కార్పొరేట్ డీల్స్‌లో భారీ మందగమనం ఏర్పడింది. ఫలితంగా ఖర్చుల్ని తగ్గించుకునేందుకు కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేయనున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదిక వెలుగులోకి వచ్చింది. అయితే ఉద్యోగులపై గోల్డ్‌మన్ సాచ్చ్ యాజమాన్యం స్పందించింది. లేఆఫ్స్ ఉంటాయని ప్రకటిస్తూనే ఎంతమంది అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. కాగా సంస్థలోని కోర్ ట్రేడింగ్, బ్యాంకింగ్ యూనిట్ల నుంచి ఉద్యోగులను తొలగించనున్నట్లు గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ప్రకటించింది. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచెత్తనున్న లేఆఫ్స్ సునామీ? -
ఈ ఉద్యోగాలకు ఏమైంది?
మొన్న మైక్రోసాఫ్ట్, ట్విట్టర్... నిన్న వాట్సప్, ఫేస్‌బుక్‌ల మాతృసంస్థ మెటావర్స్... నేడు అమెజాన్... హెచ్‌పీ! వరుసగా ఉద్యోగాల్లో కోతల వార్తలే. అమెరికన్ టెక్ సంస్థలు అనేకం ఉద్యోగస్థుల్ని తగ్గించుకొనే పనిలో పడడంతో వేలమంది వీధిన పడనున్నారు. సదరు సంస్థల భారతీయ శాఖల్లో పనిచేస్తున్న మనవాళ్ళ మీదా అనివార్యంగా ఆ ప్రభావం ఉండనుంది. ఏ రోజు ఏ కంపెనీ ‘పింక్ స్లిప్’ ఇస్తుందో తెలియని కంగారు పుట్టిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం సహా అనేక పరిణామాలతో ద్రవ్యోల్బణం పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తుబిస్తుగా మారింది. లాభాలు పడిపోతూ, ప్రపంచమంతటా మాంద్యం తప్పదనే భయం నెలకొంది. అమెజాన్ నుంచి డిస్నీ దాకా దిగ్గజ టెక్ సంస్థలు శ్రామికశక్తిని పునర్వ్యవస్థీకరించు కుంటున్నదీ అందుకే. ఎక్కడికెళ్ళి ఆగుతుందో తెలియని ఈ పరిస్థితి భారత్ సైతం అప్రమత్తం కావాలని గుర్తుచేస్తోంది. శ్రామికశక్తి పునర్మూల్యాంకనంతో ఈ ఏడాది ఇప్పటి వరకు 850కి పైగా టెక్ కంపెనీల్లో లక్షా 37 వేల వైట్ కాలర్ ఉద్యోగులు ఇంటి బాట పట్టాల్సి వచ్చిందని ఓ అంతర్జాతీయ అంచనా. లిఫ్ట్, స్ట్రైప్, కాయిన్‌బేస్, షాపిఫై, నెట్‌ఫ్లిక్స్, శ్నాప్, రాబిన్‌హుడ్, చైమ్, టెస్లా అనేక సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికా కేంద్రంగా నడుస్తున్న భారీ సంస్థలు ఒక్క గత నెలలోనే 33,843 ఉద్యోగాలకు మంగళం పలికాయి. ఉద్యోగాల కోత సుమారు 13 శాతానికి ఎగబాకింది. 2021 ఫిబ్రవరి నుంచి గత నెల వరకు చూస్తే – ఒకే నెలలో ఇన్ని ఉద్యోగాలపై వేటు పడడం ఇదే అత్యధికం. పులి మీద పుట్రలా గూగుల్ సైతం ఈ వారం ఉద్వాసనల బాట పట్టింది. లక్షా 87 మందితో టెక్ రంగంలో అతి పెద్ద ఉద్యోగ సంస్థ అయిన గూగుల్ 10 వేల మందిని ఇంటికి సాగనంపడానికి సిద్ధమవుతోందని ప్రాథమిక వార్త. ఆ సంస్థకు అననుకూలమైన మార్కెట్ పరిస్థితులు నెలకొన్నాయి. పైపెచ్చు సంస్థలో గణనీయమైన వాటాతో యాజమాన్య నిర్ణయాలను ప్రభావితం చేసే ‘యాక్టివిస్ట్ హెడ్జ్ ఫండ్’ నుంచి ఒత్తిడి ఉంది. అలా 6 శాతం మంది ఉద్యోగులను తగ్గించుకొనే పనిలోకి దిగింది. పని తీరులో రేటింగు అతి తక్కువగా ఉన్నవారినే తొలగిస్తామన్నది గూగూల్ చెబుతున్న మాట. దానికి సమర్థమైన ర్యాంకింగ్ విధానం ఉందంటున్నా, అది ఏ మేరకు లోపరహితమో చెప్పలేం. ప్రస్తుత కోతల పరిస్థితి గూగుల్ స్వయంకృతమని నిపుణుల మాట. అవసరానికి మించి శ్రామిక శక్తి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా, పెడచెవిన పెట్టి గత త్రైమాసికంలో ఆ సంస్థ ఎడాపెడా కొత్త ఉద్యోగస్థుల్ని తీసుకుంది. అదీ భారీ వేతనాలకు తీసుకోవడం మెడకు గుదిబండైంది. లాక్డౌన్లలో పని నడపడానికి అమెరికా లాంటి చోట్ల తీసుకున్న ఉద్యోగాలు ఇప్పుడు వాటికి ఎక్కువయ్యాయి. ఉద్యోగస్థానాల్లో గణనీయంగా ఊపందుకున్న ఆటోమేషన్ ప్రభావం సరేసరి. వెన్నాడుతున్న ఆర్థిక మాంద్యానికి తోడు కరోనా అనంతర విక్రయాలు తగ్గాయి. ఫలితంగా పదేళ్ళుగా వీర విజృంభణలో ఉన్న టెక్‌సంస్థలు కొత్త వాస్తవాన్ని జీర్ణించుకోవాల్సి వచ్చింది. ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి సంస్థ హెచ్‌పీ వచ్చే 2025 చివరికి 6 వేల ఉద్యోగాలను తగ్గించుకుంటామని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ 10 వేల మందికి పింక్ స్లిప్పులు ఇస్తామనేసరికి, మన దేశంలోని దాని శాఖలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. ‘మీ అంతట మీరు ఉద్యోగాలు వదిలేయం’డంటూ అమెజాన్ ఇండియా తన ఉద్యోగులకు ‘స్వచ్ఛంద వీడ్కోలు పథకం’ (వీఎస్పీ) ప్రకటించడం చర్చ రేపుతోంది. మూకుమ్మడిగా ఇంటికి సాగనంపడాన్ని వ్యతిరేకిస్తూ మన కార్మిక శాఖకు ఫిర్యాదులు రావడం, వీఎస్పీ వివరాలను అందించాలంటూ మన ప్రభుత్వం ఇక్కడి శాఖను అడగడం చకచకా జరిగాయి. నిజానికి, కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా, ఐరోపాలు మూడూ బాగా మందగించాయి. అందుకే, వచ్చే 2023లో ప్రపంచానికి మాంద్యం తప్పదని వరల్డ్ బ్యాంక్ అధ్యయనం. ప్రపంచ ఆర్థికాభివృద్ధి నిదానించి, మరిన్ని దేశాలు మాంద్యం లోకి జారితే వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లోని ప్రజానీకం దుష్పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది. ప్రపంచానికి మెడ మీద కత్తిలా మాంద్యం భయపెడుతున్న వేళ, మనమూ అప్రమత్తం కావాలి. ప్రపంచీకరణతో ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ విపణికి మనం ముడిపడి ఉన్నాం. ముందు జాగ్రత్త చర్యలకు దిగాలంటున్నది అందుకే. రానున్న పరిణామాల్ని దీటుగా ఎదుర్కోవడానికి ఏ మేరకు సిద్ధంగా ఉన్నామన్నది కీలకం. ప్రపంచశ్రేణి టెక్ సంస్థల కార్యకలాపాల్లో మన ఐటీ సంస్థల ప్రమేయముంది గనక ఉద్యోగ విపణిలో సంక్షోభం తలెత్తకుండా ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. ఐటీ రంగంలో మొదలైన కోతలు ఇతర రంగాలకూ పాకే ముప్పుంది. సత్వరం మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే మార్గాలు వెతకాలి. అదనపు పెట్టుబడులు వచ్చేలా, ఉత్పాదకత పెరిగేలా విధానాలు నిర్ణయించడం దారిద్య్ర నిర్మూలనకూ, వృద్ధికీ కీలకం. కార్మిక హక్కులను నీరుగార్చి, ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియని అనిశ్చితి, అభద్రత కల్పించడం ఏ రంగానికైనా మంచివి కావు. అసలే కరోనాలో ఉపాధి పోయి రోజువారీ శ్రామికులు చిక్కుల్లో ఉన్నారు. ఇప్పుడు వైట్ కాలర్ ఐటీ రంగ ఉద్యోగుల పరిస్థితీ అదే అంటే ఉన్న సంక్షోభం ఇంకా తీవ్రమవుతుంది. ఇప్పటికీ మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మెరుగ్గా ఉందంటున్న పాలకులు మేకిన్ ఇండియా స్వప్నాలను చూపడమే కాక, ఉద్యోగక్షేత్రంలోనూ దాని ఫలాలు అందించగలిగితే మంచిది. కిందపడ్డా మళ్ళీ పైకి లేస్తాం! -
కొనసాగుతున్న కొలువుల కోత.. ఉద్యోగుల్లో కలవరం
న్యూఢిల్లీ: టెక్ ప్రపంచంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్, మెటా బాటలోనే గూగుల్, హెచ్‌పీ తదితర సంస్థలు కూడా సిబ్బందిని తగ్గించుకోవడమో లేక హైరింగ్‌ను నిలిపివేయడమో చేస్తున్నాయి. తాజాగా గూగుల్ 10 వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది తొలినాళ్లలో ప్రకటించినట్లుగా పనితీరును మెరుగుపర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సరైన పనితీరు లేని ఉద్యోగులను వర్గీకరించాల్సిందిగా మేనేజర్లకు ఆదేశాలు వచ్చినట్లు వివరించాయి. దీని ప్రకారం సుమారు 6 శాతం మంది ఉద్యోగులను (దాదాపు 10,000 మంది) ఈ కేటగిరీ కింద వర్గీకరించవచ్చని పేర్కొన్నాయి. (ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌లో పల్సర్ పీ150: ధర ఎంతంటే?) గూగుల్ వ్యయాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయంటూ సంస్థలో ఇన్వెస్టరయిన టీసీఐ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించు కుంది. ఉద్యోగుల సంఖ్య.. వారిపై వ్యయాలు చాలా భారీ గా ఉంటున్నాయని, ఈ విషయంలో మేనేజ్మెంట్ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ యాజమాన్యానికి రాసిన లేఖలో టీసీఐ ఎండీ క్రిస్టోఫర్ హాన్ సూచించారు. ఆల్ఫాబెట్లో టీసీఐకి 6 బిలియన్ డాలర్ల విలువ చేసే షేర్లు ఉన్నాయి. కోతల ప్రభావం భారత్‌లోని ఉద్యోగులపై ఎలా ఉండవచ్చనేది తెలియరాలేదు. భారత్‌లో టెక్నాలజీ వినియోగాన్ని పెంచేందుకు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్న గూగుల్‌కు దేశీయంగా సుమారు 5 వేల ఉద్యోగులున్నారు. ఇక్కడ 10 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు 2020లో కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. హెచ్‌పీలో 6 వేల ఉద్యోగాలు కట్ .. మరోవైపు, పర్సనల్ కంప్యూటర్స్, ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో వాటి తయారీ దిగ్గజం హెచ్‌పీ కూడా సిబ్బందిని తగ్గించుకునే యోచనలో ఉంది. 2025 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్యను 12 శాతం (6వేల వరకూ) తగ్గించుకోవాలని భావిస్తోంది. హెచ్‌పీలో సిబ్బంది సంఖ్య సుమారు 50,000 దాకా ఉండగా.. 4,000-6,000 వరకూ ఉద్యోగాల్లో కోత విధించే అవకాశం ఉంది. ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ, ఇతరత్రా వ్యయాల కింద 1 బిలియన్ డాలర్ల వరకూ వెచ్చించాల్సి రావచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. మొత్తం మీద ఈ ప్రక్రియతో 2025 ఆర్థిక సంవత్సరం తర్వాత ఏటా 1.4 బిలియన్ డాలర్ల మేర ఆదా చేయొచ్చని భావిస్తోంది. మహమ్మారి కాలంలో ఒక్కసారిగా ఎగిసిన పీసీల (పర్సనల్ కంప్యూటర్స్) అమ్మకాలు ఆ తర్వాత గణనీయంగా తగ్గాయి. ద్రవ్యోల్బణం దశాబ్దాల రికార్డు స్థాయుల్లో తిరుగాడుతుండటంతో వినియోగదారులు .. కొనుగోళ్లపై వెచ్చించడాన్ని తగ్గించుకుంటూ ఉండటమే ఇందుకు కారణం. దీంతో హెచ్‌పీ, డెల్ టెక్నాలజీస్ వంటి తయారీ సంస్థలపై ఒత్తిడి పెరుగుతోంది. మూడో క్వార్టర్లో డెల్ ఆదాయం 6 శాతం, నాలుగో త్రైమాసికంలో హెచ్‌పీ ఆదాయం 11 శాతం పడిపోయింది. మెటా ప్లాట్‌ఫామ్స్ (ఫేస్బుక్), అమెజాన్ ఇప్పటికే సుమారు 10,000 మంది చొప్పున ఉద్యోగుల తీసివేత ప్రక్రియ మొదలుపెట్టాయి. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో 7,500 మంది పైగా సిబ్బంది ఉండగా, కంపెనీ ఈ సంఖ్యను సగానికి పైగా తగ్గించుకుంది. సిస్కో సిస్టమ్స్ కూడా ఈ దిశగా ప్రణాళికలు ప్రకటించింది. అటు హార్డ్ డ్రైవ్‌ల తయారీ సంస్థ సీగేట్ టెక్నాలజీ హోల్డింగ్స్ సుమారు 3,000 ఉద్యోగాల్లో కోత పెట్టనుంది. మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, స్ట్రైప్ వంటివి కూడా సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. ఉద్వాసనలతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన నెలకొన్నప్పటికీ కంపెనీల షేర్లు మాత్రం పెరుగుతున్నాయి. అక్టోబర్ ఆఖరులో ఉద్యోగాల కోతల వార్త ప్రకటించినప్పటి నుండి మెటా షేరు సుమారు 18 శాతం పెరిగింది. -
వందల మంది ఉద్యోగులకు భారీ షాక్, ‘ఓలా.. ఎందుకిలా!’
ప్రముఖ రైడ్ షేరింగ్ దేశీయ దిగ్గజ సంస్థ ఓలాలో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. సంస్థ పునర్నిర్మాణం పేరుతో ఇప్పటికే వందలాది ఉద్యోగుల్ని ఇంటికి పంపిన ఓలా.. తాజాగా 500 మందిని విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల్ని ఫైర్ చేయడానికి కారణం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ తగ్గిపోవడమేనని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది డిసెంబర్లో ఓలా ఈవీ వెహికల్స్‌ను లాంఛ్ చేసింది. నాటి నుంచి సంస్థ పునర్నిర్మాణ కార్యక్రమాల్ని నిర్వహిస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రీ ఓన్డ్ కార్ బిజినెస్,ఓలా కార్స్, ఓలా డాష్ ఇలా సుమారు 2 వేల మంది ఉద్యోగులతో పాటు..గత రెండేళ్లలో ఆ సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ నాయకత్వ బృందం సభ్యులతో సహా 30 మందికి పైగా సీనియర్ అధికారుల్ని ఇంటికి సాగనంపింది. షట్ డౌన్ ఈ ఏడాది జులై నెలలో ఓలాకు చెందిన కర్ణాటక ప్లాంటును షట్ డౌన్ చేసింది. ఆ తర్వాత మూడు వారాల్లో సుమారు 350మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. తాజాగా మరో 500 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు పలు మీడియా సంస్థలు కథనాల్ని ప్రచురించాయి. ఇప్పుడు 500 మంది వెహికల్, బ్యాటరీ తయారీ, ఆటోమేషన్, అటానమస్ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లు, ఇతర విభాగాలకు చెందిన ఐటీ, ఆర్ అండ్ డి సామర్థ్యాలను నిర్మించడంపై దృష్టి సారించింది. అందుకే వాటిని బలోపేతం చేసే దిశగా పునర్నిర్మాణ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లు’ ఓలా ప్రతినిధులు తెలిపారు. మరో వైపు 500 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేయడంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. చదవండి👉 ఓలా: వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని! -
స్టార్టప్‌లకు గడ్డుకాలం.. ఉద్యోగాలన్నీ హుష్ కాకి..
ద్రవ్యోల్బణంతో సతమతం అవుతుంటే కొత్తగా ఉద్యోగాల్లోనూ ఇబ్బందులు మొదలవుతున్నాయి. కోటి ఆశలతో మొదలైన స్టార్టప్ కంపెనీలో నష్టాలతో విలవిలాడుతున్నాయ్. ఆర్థిక భారం తగ్గించుకునే యత్నంలో నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయ్. భవిష్యత్తు ఆశాకిరణాల్లా కనిపించిన కంపెనీలే ఉద్యోగులపాలిట అశనిపాతాల్లా మారాయి. దేశవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ బేస్డ్ సేవలు ప్రధానంగా వచ్చిన కొత్త కంపెనీల అడుగులు తడబడుతున్నాయ్. కరోనా ఎఫెక్ట్ తగ్గిపోయిన తర్వాత కంపెనీల పనితీరు ట్రాక్ తప్పుతోంది. నిధుల కొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ప్రతీ నెల క్రమం తప్పకుండా నష్టాలు పలకరించి వెళ్తున్నాయ్. దీంతో ఆర్థిక భారం తగ్గించుకునేందుకు కాస్ట్ కట్టింగ్ వైపు స్టార్టప్ కంపెనీలు చూస్తున్నాయి. రీ స్ట్రక్చర్ వంకతో దేశవ్యాప్తంగా స్టార్టప్‌లు ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఏడాదిలో ఇప్పటి వరకు పాపులర్ అయిన స్టార్టప్ కంపెనీల్లోనే ఏకంగా 10,500ల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపారు. నష్టాల పేరు చెబుతూ కంపెనీ పునర్మిణాం పేరిట వీళ్లను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ ఏడాది ఆరంభంలో మొదలైన తొలగింపు చర్యలు మే వచ్చే సరికి ఎక్కువై పోయాయి. రోజుకో స్టార్టప్ కంపెనీ నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. పాపులర్ స్టార్టప్‌లలోనూ దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన బ్రాండ్‌గా ఓలాకు పేరుంది. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సూపర్ సక్సెస్ అయ్యింది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు గమనిస్తే జనవరి నుంచి జూన్ వరకు ఓలా ఏకంగా 2100 మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. ఇక యూట్యూబ్ ఆన్ చేసినా ఏ టీవీ ఛానల్ చూసినా కనిపించే అన్ అకాడమీ అనే ఎడ్యుటెక్ కంపెనీ 750 మందికి గుడ్‌బై చెప్పింది. తిరుగులేని కంపెనీగా పేరున్న ఓలా, అన్అకాడమీ పరిస్థితే ఇలా ఉంటే చోటామోటా స్టార్టప్‌లు ఇంకా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వీళ్లు కొంత సేఫ్ స్టార్టప్‌ల బిజినెస్‌లు అనుకున్నంతగా పుంజుకోకపోవడంతో ఉద్యోగులపై వేటు తప్పడం లేదు. ప్రస్తుతం జాబ్‌లు కోల్పోతున్న వారిని పరిశీలిస్తే.. మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఇంజనీరింగ్, ప్రొడక్టు విభాగంలో కొంత మెరుగైన ఉద్యోగ భద్రత లభిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భారీగా తగ్గిపోయి ప్రైవేటు సెక్టారే శరణ్యం అనే పరిస్థితులు నెలకొనగా.. స్టార్టప్‌లు సైతం చేతులు ఎత్తేడయంతో నిరుద్యోగ సమస్య పెనుభూతంగా మారే పరిస్థితులు ఎదురవడానికి ఎంతో దూరం లేదని నిపుణులు అంటున్నారు. తొలగింపే పరిష్కారమా? మార్కెట్లో నిలదొక్కుకున్న కంపెనీలుగా గుర్తింపు దక్కించుకున్న మీషో, వేదాంతూ, బ్లింకిట్, కార్24 వంటి సంస్థలు కూడా వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటికే వస్తున్న నష్టాల పట్ల వెంచర్ క్యాపిటలిస్టులు ఆందోళన వ్యక్తం చేయడంతో మరిన్ని నిధులు సాధించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆర్థిక భారం మరింత ముదరకుండా ఉద్యోగుల తొలగింపే మేలైన పరిష్కారం అనే భావనలోకి స్టార్టప్‌లు వస్తున్నాయి. చదవండి: అగ్నివీరులకు కార్పొరేట్ల రెడ్ కార్పెట్: ఉద్యోగాలు పెరుగుతాయి! -
ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన యూనిలీవర్ కంపెనీ..!
ప్రముఖ కన్దూమర్ గూడ్స్ కంపెనీ యూనిలివర్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. 1500 మంది మేనేజ్మెంట్ సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల చేపట్టిన టేకోవర్ బిడ్ విఫలమైన తర్వాత వాటాదారుల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించే క్రమంలో ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మాగ్నమ్ ఐస్ క్రీమ్, డోవ్ సబ్బు తయారీదారు ఔషధ కంపెనీలైన గ్లాక్సోస్మిత్ క్లైన్, ఫైజర్ యాజమాన్యంలోని వినియోగదారుల ఆరోగ్య సంరక్షణ యూనిట్ కోసం £50-బిలియన్ ($68 బిలియన్) విలువ బిడ్ దాఖలు చేసింది. ఇప్పుడు టేకోవర్ బిడ్ విఫలం కావడంతో ఈ ప్రకటన చేసింది ఈ యూనిలీవర్ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 1,49,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీ ప్రధానంగా బ్యూటీ, వెల్జీయింగ్, పర్సనల్ కేర్, హోం కేర్, న్యూట్రిషన్, ఐస్ క్రీమ్ అనే ఐదు విభిన్న విభాగాలపై దృష్టిసారించాలని యూనిలీవర్ యోచించింది. ఇటీవల టేకోవర్ విఫలమైన తర్వాత పెట్టుబడిదారుల నుంచి విమర్శలను ఎదుర్కొన్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలాన్ జోప్ ఇలా అన్నారు.. "వృద్ధి మా మొదటి ప్రాధాన్యతగా ఉంది. ఈ మార్పులు ఈ అన్వేషణకు మద్దతు ఇస్తాయి" అని పేర్కొన్నారు. ఈ రంగాలపై ప్రత్యేక ఫోకస్‌ను కేంద్రీకరించడం ద్వారా మెరుగైన డెలివరీ జవాబుదారీతనం పెంపొందేలా చర్యలు చేపడతామని అలన్ జోప్ అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి పోతోంది అంటూ ఆర్థిక వేత్తలు చెప్పడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు ముఖ్యమైన వస్తువుల ధరల పెంచుకుంటూ పోయాయి. దీని ఎఫెక్ట్ మూడు నెలల వ్యవధిలోనే ఎఫ్‌ఎంసీజీలపై పడింది. ఆ ప్రభావం యూనిలీవర్ మీద కూడా పడింది. ఒక్కసారిగా ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఆయా వస్తువులను పొదుపుగా ఉపయోగిస్తున్నారు. నీల్సన్ సర్వే తాజా ఇదే విషయాన్ని పట్టి చూపుతోంది. 2021 అక్టోబరు నుంచి డిసెంబరు వరకు వెల్లడించిన వివరాల్లో ఎఫ్ఎంసీజీల అమ్మకాల వాల్యూమ్స్‌లో 1.8 శాతం క్షీణత నమోదు అయినట్టు వెల్లడించింది. (చదవండి: ఆన్లైన్లో వైరలవుతోన్న అనిల్ అంబానీ కుమారుడి ప్రి వెడ్డింగ్ ఫొటోస్..!) -
బీఎస్ఎన్ఎల్ : మరో 20వేల ఉద్యోగాలకు ముప్పు
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యోచిస్తోంది. మరో 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించనుందన్న అంచనాలు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ప్రస్తుతం సంక్షోభ సమయంలో ఈనిర్ణయాన్ని సమీక్షించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగాలు తొలగిపునకు సంబంధించి సెప్టెంబర్ 1న బీఎస్ఎన్ఎల్ తన మానవ వనరుల డైరెక్టర్ అనుమతితో ఒక ఉత్తర్వు జారీ చేసిందని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ వెల్లడించింది. కాంట్రాక్ట్ పనులు, కాంట్రాక్ట్ కార్మికుల ఖర్చులను తగ్గించుకునే క్రమంలో అన్ని చీఫ్ జనరల్ మేనేజర్లు చర్యలను తీసుకోవాలని కోరినట్టు యూనియన ఆరోపించింది. ఈ క్రమంలో మరో 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే 30వేలమంది కార్మికులను తొలగించిందనీ, వీరికి ఒక సంవత్సరం పాటు వేతనాలు చెల్లించాలని యూనియన్ ఆరోపించింది. ఈ విషయంలో సంస్థ తన నిర్ణయాన్ని సమీక్షించాలని కోరింది. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) అమలు తర్వాత సంస్థ ఆర్థికపరిస్థితి క్షీణించిందని, దీంతోపాటు వివిధ నగరాల్లో ఉద్యోగుల కొరత కారణంగా నెట్‌వర్క్‌లలో లోపాలు పెరిగాయంటూ బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి కె పూర్వర్‌కు యూనియన్ ఒక లేఖ రాసింది.మరోవైపు 900 కోట్ల రూపాయల విలువైనపెండింగ్ బకాయిలను బీఎస్ఎన్ఎల్ చెల్లించకపోతే ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తామని గతనెలలో ఫిన్నిష్ టెలికాం పరికరాల సంస్థ నోకియా హెచ్చరించింది. కరోనావైరస్ మహమ్మారి మధ్య ఖర్చు తగ్గించే చర్యలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని కంపెనీ తెలిపింది. కాగా నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రెండు సంస్థలను విలీనం చేయడం, ఆస్తులను మోనటైజ్ చేయడం, ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇవ్వడం లాంటి చర్యలను ప్రకటించింది. ఇందుకు 2019 అక్టోబర్‌లో 69 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే.