ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని ప్రముఖ షాపింగ్ యాప్ మింత్రా (Myntra) పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులను తొలగించింది. పలు నివేదికల ప్రకారం.. కంపెనీ నిర్వహించిన తాజా రౌండ్ లేఆఫ్‌లలో దాదాపు 50 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. అయినప్పటికీ, పునర్వ్యవస్థీకరణ ఇంకా కొనసాగుతున్నందున కొంతమంది ఉద్యోగులను ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో కొనసాగించే అవకాశం ఉందని మింత్రా ప్రతినిధి తెలిపారు.
మారుతున్న కస్టమర్ల అవసరాలకు, సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మింత్రా ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. అపెరల్స్ స్థానంలో కొన్ని ప్రైవేట్ లేబుల్‌లపై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, దాని అంతర్గత బ్రాండ్లు ప్రభావితమవుతాయని ఆలోచిస్తున్నారు.
ఇదీ చదవండి ➤ ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ సృష్టికర్త.. మింత్రాకు సీఈవో.. ఈ సూపర్ ఉమన్!
మింత్రా ప్రైవేట్ లేబుల్ చీఫ్ మనోహర్ కామత్ గత ఏప్రిల్‌లో రాజీనామా చేయగా, కొత్త వ్యాపారాల అధిపతి ఆదర్శ్ మీనన్ కూడా గత మే నెలలో కంపెనీని విడిచిపెట్టారు. గత 18 నెలలుగా ఉద్యోగులను వదులుకున్న స్టార్టప్ కంపెనీల జాబితాలో మింత్రా కూడా చేరింది. Inc42 'ఇండియన్ స్టార్టప్ లేఆఫ్ ట్రాకర్' ప్రకారం, 2022 ఫిబ్రవరి నుంచి 100 కంటే ఎక్కువ స్టార్టప్‌లు 28,000 మంది ఉద్యోగులను తొలగించాయి.
Comments
Please login to add a commentAdd a comment