Myntra
-
క్విక్ కామర్స్‌లోకి మింత్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా క్విక్ కామర్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ’ఎం–నౌ’ పేరుతో 30 నిమిషాల్లోనే ఉత్పత్తులను డెలివరీ చేయనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం బెంగళూరులో ఈ సేవలను అందిస్తోంది. రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా మెట్రో, నాన్–మెట్రో నగరాల్లో విస్తరించడానికి సిద్ధంగా ఉన్నామని మింత్రా సీఈవో నందిత సిన్హా తెలిపారు. ఉత్పత్తుల కొనుగోలు కోసం సమయం వృ«థా కాకుండా ఎం–నౌ సౌకర్యవంతమైన పరిష్కారం అని చెప్పారు. అంతర్జాతీయ, దేశీయ బ్రాండెడ్ లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను వినియోగదార్లు కేవలం 30 నిమిషాల్లోనే అందుకోవచ్చని కంపెనీ ప్రకటన తెలిపింది. ఫ్యాషన్, బ్యూటీ, యాక్సెసరీస్, గృహ విభాగంలో 10,000 కంటే ఎక్కువ ఉత్పత్తుల శ్రేణిని ప్రస్తుతం ఎం–నౌ లో అందిస్తోంది. 3–4 నెలల్లో ఈ సంఖ్యను లక్షకు పైచిలుకు చేర్చనున్నట్టు మింత్రా వెల్లడించింది. మార్పిడి, వెనక్కి ఇచ్చే సౌకర్యం.. నవంబర్‌లో బెంగళూరులో మింత్రా క్విక్ కామర్స్ పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించింది. పైలట్ ప్రాజెక్టులో కస్టమర్ల నుంచి సానుకూల స్పందన లభించిందని సిన్హా వ్యాఖ్యానించారు. ఇది ప్రారంభం మాత్రమేనని, మరింతగా విస్తరిస్తామని చెప్పారు. ఇతర క్విక్ కామర్స్ కంపెనీల మాదిరిగా కాకుండా ఉత్పత్తుల మార్పిడి, వెనక్కి ఇచ్చే సౌకర్యం కూడా ఉందని నందిత వెల్లడించారు. కాగా, మెట్రో నగరాల్లో మింత్రా ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవలకు 2022లో శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఆర్డర్ పెట్టిన 24–48 గంటల్లో ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. మరోవైపు క్విక్ కామర్స్ రంగంలో ఉన్న సంస్థలు బ్యూటీ, ఫ్యాషన్ విభాగాలను జోడిస్తున్న తరుణంలో.. క్విక్ కామర్స్ లోని ఎంట్రీ ఇస్తున్న తొలి ఫ్యా షన్ ప్లాట్‌ఫామ్ మింత్రా కావడం గమనార్హం. -
రెండు గంటల్లో డెలివెరీ!.. సిద్దమవుతున్న మింత్రా
లైఫ్‌స్టైల్ ఈ కామర్స్ దిగ్గజం మింత్రా క్విక్‌కామర్స్‌లోకి అడుగుపెట్టడానికి యోచిస్తోంది. కేవలం రెండు గంటల్లో డెలివరీ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బెంగుళూరులోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సర్వీస్ అందించడానికి ప్రయోగాలను చేస్తోంది.మింత్రా తన కస్టమర్లకు వేగంగా డెలివరీ చేయడానికి కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే.. ఎంపిక చేసిన ఉత్పత్తులను డెలివరీ చేయనుంది. దీనికోసం పైలట్ ప్రాజెక్ట్, 'M-Now' బెంగళూరులో కొన్ని పిన్ కోడ్లలో పనిచేస్తోంది. ఇది ఎలా పని చేస్తుందో చూడటానికి ప్రయోగాత్మకంగా సేవలు అందిస్తోంది.నిజానికి 2022లోనే మింత్రా బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఎం ఎక్స్‌ప్రెస్ అనే డెలివరీ సర్వీస్ ప్రారంభించింది. ఈ సర్వీస్ ఉద్దేశ్యం ఏమిటంటే.. ఆర్డర్ పెట్టిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే ఉత్పత్తులను డెలివరీ చేయడం. ఇప్పుడు రెండు గంటల్లో డెలివరీ చేయడానికి సంకల్పించింది. -
మింత్రాలో ఉద్యోగుల తొలగింపు.. ఫ్లిప్‌కార్ట్ కరుణిస్తేనే..
ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని ప్రముఖ షాపింగ్ యాప్ మింత్రా (Myntra) పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులను తొలగించింది. పలు నివేదికల ప్రకారం.. కంపెనీ నిర్వహించిన తాజా రౌండ్ లేఆఫ్‌లలో దాదాపు 50 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. అయినప్పటికీ, పునర్వ్యవస్థీకరణ ఇంకా కొనసాగుతున్నందున కొంతమంది ఉద్యోగులను ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో కొనసాగించే అవకాశం ఉందని మింత్రా ప్రతినిధి తెలిపారు. మారుతున్న కస్టమర్ల అవసరాలకు, సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మింత్రా ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. అపెరల్స్ స్థానంలో కొన్ని ప్రైవేట్ లేబుల్లపై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, దాని అంతర్గత బ్రాండ్లు ప్రభావితమవుతాయని ఆలోచిస్తున్నారు. ఇదీ చదవండి ➤ ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ సృష్టికర్త.. మింత్రాకు సీఈవో.. ఈ సూపర్ ఉమన్! మింత్రా ప్రైవేట్ లేబుల్ చీఫ్ మనోహర్ కామత్ గత ఏప్రిల్‌లో రాజీనామా చేయగా, కొత్త వ్యాపారాల అధిపతి ఆదర్శ్ మీనన్ కూడా గత మే నెలలో కంపెనీని విడిచిపెట్టారు. గత 18 నెలలుగా ఉద్యోగులను వదులుకున్న స్టార్టప్ కంపెనీల జాబితాలో మింత్రా కూడా చేరింది. Inc42 'ఇండియన్ స్టార్టప్ లేఆఫ్ ట్రాకర్' ప్రకారం, 2022 ఫిబ్రవరి నుంచి 100 కంటే ఎక్కువ స్టార్టప్‌లు 28,000 మంది ఉద్యోగులను తొలగించాయి. -
రిటెన్షన్ బోనస్‌తో సీఈవో లగ్జరీ విల్లా: ఇపుడు ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులు దాదాపు 700 మిలియన్ డాలర్లు (రూ. 5780 కోట్లు) స్టాక్ ఆప్షన్స్‌ను ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ హెచ్ఆర్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు, ఫ్యాషన్ విభాగం మింత్రా అర్హులైన న ఉద్యోగులకు ఇమెయిల్స్ పంపింది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని సంస్థ వేలాది ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ బైబ్యాక్ అందింనుంది. కంపెనీ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి. నివేదికల ప్రకారం, ఈ (జూలై) నెలాఖరులోగా ఈ నగదును సదరు ఉద్యగులకు అందించనున్నారు. అర్హత ఉన్న ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రతి ESOP యూనిట్‌కు రూ. 3615 అందు కుంటారు. ఫ్లిప్‌కార్ట్‌లో 15వేల మంది ఉద్యోగులు ఉండగా ఇందులో మింత్రాలో దాదాపు 3500 మంది ఉద్యోగులున్నారని సమాచారం. (దేశంలో రిచెస్ట్ గాయని ఎవరో తెలుసా?ఏఆర్ రెహమాన్‌తో పోలిస్తే?) వాల్‌మార్ట్ 2018లో కంపెనీలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 2017లో ఫ్లిప్‌కార్ట్ సీఈఓ అయిన కళ్యాణ్ కృష్ణమూర్తి ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్‌లో కృష్ణమూర్తి కీలక పాత్ర పోషించారట. అందుకే 16 బిలియన్ డాలర్ల ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్ తరువాత అతనికి 2 మిలియన్ డాలర్ల రిటెన్షన్ బోనస్ ఆఫర్ చేసినట్టు బిజినెస్ టుడే నివేదించింది. ఈ నేపథ్యంలోనే గతేడాది ఈస్ట్ బెంగళూరులో కృష్ణమూర్తి ఓ విల్లా కొన్నాడు. విల్లా 4921 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లా ఖరీదు రూ.8 కోట్లు. ఇందులో నాలుగు బెడ్రూమ్లు, ఐదు బాత్రూమ్లు, డ్యూయల్ కిచెన్లు, పూజ, లివింగ్, డైనింగ్, ఆఫీస్, మీడియా, యుటిలిటీ రూమ్‌లు వ్యక్తిగత గ్యారేజీ కూడా ఉంది. మరోవైపు కంపెనీ త్వరలోనే ఐపీఓకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. (ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) -
అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్!
ప్రముఖ ఈకామర్స్ బ్రాండ్ మింత్రా సీఈఓగా అనంత్ నారాయణన్ ఇప్పటికే కార్పొరేట్ వర్గాల్లో పాపులర్. కీలక పదవిలో ఉన్నప్పటికీ తన సొంత కంపెనీ ప్రారంభించే సాహసం చేయడమే కాదు ఆరునెలల్లో ఏకంగా రూ. 9,900 కోట్లకుపైగా సంపదను సాధించడం విశేషం. అతి తక్కువ సమయంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యూనికార్న్‌గా బిలియన్ డాలర్ల కంపెనీ మెన్సా బ్రాండ్స్ వ్యవస్థాపకుడిగా, రికార్డు సృష్టించిన అనంత్ నారాయణన్ సక్సెస్ స్టోరీ...! కేవలం రెండేళ్ళ వ్యవధిలో రెండు పెద్ద బ్రాండ్ల వ్యవస్థాపకుడిగా ఎంటర్ప్రెన్యూర్ జర్నీని ప్రారంభించిన ఘనత అనంత్నారాయణన్ది. భారతదేశంలో స్టార్టప్‌లకు ఆదరణ లభిస్తున్న సమయంలో అనంత్ నారాయణన్ తన దృష్టిని అటువైపు మళ్లించారు. సౌకర్యవంతమైన పదవిని వదిలేసి భారతదేశపు తొలి ఈ-కామర్స్ 'యునికార్న్' ఆవిష్కారానికి పూనుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి అనంతరం 2021లో మే నెలలో మెన్సా కంపెనీని స్థాపించారు. ఈ వెంచర్ ఒక నెలలోనే తొలి ఫండింగ్‌గా 50 మిలియన్ల డాలర్లను అందుకుంది. ఆరువాతి ఐదు నెలలకే 135 మిలియన్ల డాలర్ల నిధులను సేకరించిన తర్వాత కంపెనీ వాల్యూ బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు) Too many flights this week. Mumbai- bangalore- Coimbatore - Delhi - Mumbai - bangalore ! #startuplife pic.twitter.com/mKq17QVRvC — Ananth Narayanan (@ANarayanan24) February 3, 2023 అనంత్ మద్రాస్ మిచిగాన్ విశ్వవిద్యాలయాల నుండి ఉన్నత విద్యాను అభ్యసించారు . ప్రముఖ మెకిన్సే కంపెనీకి కీలక పదవుల్లో పనిచేశారు. ఆ తర్వాత ఫ్యాషన్ రీటైలర్ మింత్రాకి సీఈవోగాను పనిచేశారు. సీఈవోగా అధిక జీతం ఇచ్చే ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరీ మెడ్‌లైఫ్.కామ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓగా ఉన్నారు. అయితే అనంత్ తొలి వెంచర్‌ను ఫార్మసీ కొనుగోలు చేసింది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) అమెరికన్ యునికార్న్ ప్రేరణతో అనంత్ మెన్సా అనే సొంత బ్రాండ్‌తో ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా చిన్న వ్యాపారుల ఉత్పత్తులను ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా విక్రయిస్తుంది. మెన్సా అనే పదానికి గ్రీకులో కాన్స్టెలేషన్ అని అర్థం. డిజిటల్-ఫస్ట్ బ్రాండ్ల క్లస్టర్ మోడల్‌గా మెన్సాను తీర్చి దిద్దారు. డజనుకు పైగా బ్రాండ్లతో భాగస్వామ్యం కలిగి ఉంది. సంవత్సరానికి 100శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ప్రారంభించిన ఆరు నెలల్లోనే బిలియన్ డాలర్లు, అంతకంటే ఎక్కువ విలువైన భారతీయ యునికార్న్ గ్రూపులో అత్యంత వేగంగా ప్రవేశించిన స్టార్టప్‌గా నిలిచింది.ఇప్పటికే డజన్ల బ్రాండ్లను కొనుగోలు చేసింది.మెన్సా తన పోర్ట్‌ఫోలియో వృద్ధికి నిధులను ఉపయోగించాలని భావిస్తోందని ఇటీవల నారాయణన్ స్వయంగా వెల్లడించారు. ఇలాంటి మరెన్నో సక్సెస్ స్టోరీలు, ప్రేరణాత్మక కథనాలకోసం చదవండి: సాక్షి బిజినెస్ -
ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ సృష్టికర్త ఈమే..
ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్‌కు అత్యంత ఆదరణ తీసుకొచ్చింది బిగ్‌బిలియన్ డేస్ సేల్. ఇది దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్. ఈ సేల్ నిర్వహించినప్పుడు కొనుగోళ్లు విపరీతంగా ఉంటాయి. కారణం ఈ సమయంలో లభించే ఆఫర్లు. అయితే ఈ బిగ్‌బిలియన్ డేస్ సేల్ సృష్టికర్త ఎవరో తెలుసా? మింత్రా దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ మార్కెట్ ప్లేస్‌లలో ఒకటి. వాల్-మార్ట్ యాజమాన్యంలో ఉన్న ఈ ఈ-కామర్స్ వెబ్సైట్ ఒక సూపర్ ఉమన్ సీఈవోగా ఉన్నారు. ఆమే నందితా సిన్హా. అంచెలంచెలుగా ఎదిగి కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యారు. నందితా సిన్హా 2022 జనవరి 1న మింత్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యారు. ఈ-కామర్స్, ఎఫ్ఎంసీజీ రంగాలలో ఆమెకు 16 సంవత్సరాల అనుభవం ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్‌లో కెరీర్ ప్రారంభించిన ఆమె బ్రిటానియా లో కూడా పనిచేశారు. సమ్మర్ ట్రైనీగా ప్రారంభించి 2009లో కస్టమర్ మేనేజర్‌గా నిష్క్రమించారు. ఐదేళ్లపాటు హెచ్‌యూఎల్‌లో కొనసాగారు. బ్రిటానియాలో ఆమె ప్రోడక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. మీడియా ప్లానింగ్, కమ్యూనికేషన్‌కు బాధ్యత వహించారు. ఆ తరువాత ఆమె మైబేబీకార్ట్ (MyBabyCart.com) అనే ఈ-కామర్స్ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. నందితా సిన్హా 2013లో ఫ్లిప్‌కార్ట్‌లో చేరారు. ఆ తర్వాత ఆ కంపెనీ మింత్రాను కొనుగోలు చేసింది. ఫ్లిప్‌కార్ట్ వాల్‌మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లింది. నందితా సిన్హా ఎనిమిదేళ్లకుపైగా ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్నారు. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆమె కస్టమర్ల ఆకర్షణ, గ్రోత్ ఫంక్షన్‌కు నాయకత్వం వహించారు. ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్‌ను నిర్మించడంలో ఆమె పాత్ర కీలకమైనది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నడిపించింది ఈమే. మింత్రా సీఈవో కావడానికి ముందు నందితా సిన్హా కస్టమర్ గ్రోత్, మీడియా, ఎంగేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు. లక్నోకు చెందిన ఆమె ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారనాసీ (బనారస్ హిందూ యూనివర్సిటీ) నుంచి బీటెక్ చేసిన ఆమె ప్రతిష్టాత్మక ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎఫ్ఎంఎస్) నుంచి మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీలో ఎంబీఏ చేశారు. -
భారత ఆటగాడిపై సెటైరికల్ ట్వీట్.. మింత్రాపై మండిపడుతున్న నెటిజన్స్!
ఇటీవల కంపెనీలు మార్కెటింగ్ కోసం కొత్త దారులను ఎంచుకుంటున్నాయి. తమ వస్తువుల మార్కెటింగ్ కోసం కంటెంట్‌తో పాటు కాంట్రవర్శీని కూడా జత చేస్తున్నాయి. సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ఇలాంటివి బాగా పెరిగాయి.ఈ తరహాలో ఇప్పటికే ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పాటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో ఆన్లైన్ ప్లాట్‌పాం మింత్రా(MYNTR) కూడా చేరింది. టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌పై వ్యంగ్యంగా ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహాన్ని చవి చూస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ 20 ప్రపంచకప్‌లో భారత జట్టు కీలక సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ టోర్నిలో కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో రాహుల్ వైఫల్యాలపై మింత్రా వ్యంగ్యంగా ఓ పోస్ట్ చేసింది. అందులో.. 'అవుట్ ఆఫ్ ది వరల్డ్' అని ప్రింట్ చేసిన టీ-షర్టులో.. కేవలం 'అవుట్' మాత్రం కనిపంచేలా ఉన్న టీ షర్ట్ ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. ఆ ఫోస్ట్‌కు ‘కేఎల్ రాహుల్ ఇష్టమైన టీ-షర్ట్’ అంటూ సెటైరికల్‌గా క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ ట్వీట్‌కు సంబంధించి నెట్టింట దుమారమే రేగుతోంది. మింత్రా చేసని పనికి సోషల్‌మీడియాలో కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి చీఫ్ పబ్లిసిటీ స్టంట్స్ ఆపాలంటూ మండిపడుతున్నారు. చదవండి: ఏంటి బ్రో, చేరిన 2 రోజులకే నా ఉద్యోగం ఊడింది.. ఓ ఐఐటియన్ బాధ ఇది! -
మింత్రా ధమాకా సేల్: టాప్ బ్రాండ్స్‌పై 80 శాతం డిస్కౌంట్
సాక్షి,ముంబై: ఆన్లైన్ ఫ్యాషన్ రీటైలర్ మింత్రా కూడా ఫెస్టివ్ సేల్‌ను ప్రారంభిస్తోంది. బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ సేల్ 2022 డిస్కౌంట్సేల్ రేపు (సెప్టెంబరు 23 నుంచి) షురూ కానుంది. ఈ సందర్భంగా టాప్ బ్రాండ్స్‌పై 80 శాతం దాకా తగ్గింపు అందించనుంది. ముఖ్యంగా హెచ్ అండ్ ఎం, లిబాస్, రెడ్ టేప్,గినీ అండ్ జాయ్, మస్త్ అండ్ హార్బర్ ప్యూమా, నైక్ ఉత్పత్తులపై గొప్ప తగ్గింపును అందిస్తోంది. సెప్టెంబరు 23 నుంచి పలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్లు సంస్థల్లో పండుగ సీజన్ సేల్కు తెర తీయనున్నసంగతి తెలిసిందే. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఈ సంవత్సరం అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని రిటైలర్లు భావిస్తున్నారు. అందుకే డిస్కౌంట్, డీల్స్ అంటూ కస్టమర్లను ఊరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ సేల్‌ను లాంచ్ చేయనుంది. తద్వారా 60 లక్షల ప్రత్యేక కస్టమర్లను ఆకర్షించాలని భావిస్తోంది. మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ గ్రాండ్ ఓపెనింగ్ అర్ధరాత్రి 2 గంటలకు ప్రారంభమవుతుంది. కస్టమర్లకు 6వేలకు పైగా బ్రాండ్లను అందుబాటులో ఉంచుతోంది. మహిళలు, పురుషులు, పిల్లలు, ప్లస్ సైజ్ దుస్తులపై భారీ డీల్స్ అందిస్తోంది. అలాగే ప్యూమా కిడ్స్ వేర్‌పై కనీసం 60 శాతం తగ్గింపును అందిస్తోంది. ప్యూమా, నైక్ స్పోర్ట్స్ షూస్, క్యాజువల్ షూలను 50శాతం వరకు తగ్గింపుతో అందిస్తోంది. ఇంకా MAC, Lakme, Maybelline ఉత్పత్తులపై 15-40శాతం డిస్కౌంట్ లభ్యం. ఇంకా రెడ్ టేప్ షూస్‌పై 80 శాతం వరకు తగ్గింపును ఇస్తోంది. -
హైరింగ్ అలర్ట్: 16వేల ఉద్యోగాలు
సాక్షి, ముంబై: ఫ్యాషన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ మింత్రా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పండుగ సీజన్లో దాదాపు 16వేలమందికి ఉపాధికల్పించనుంది. డెలివరీ, వేర్‌హౌస్ హ్యాండ్లింగ్, లాజిస్టిక్స్‌లో వివిధ స్థానాల కోసం 16,000 ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. గత ఏడాది ఇదే కాలంలో సంస్థ దాదాపు 11,000 మందికి ఉపాధి అవకాశాలను కల్పించింది. ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని ఈ కంపెనీ మింత్రా ప్రకటించిన ఈ 16 వేలు ఉద్యోగాలలో 10 వేల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కాగా, 6 వేలు పరోక్షంగా ఉంటాయి. పండుగ సీజన్లో నియామకాల్లో ఇప్పటివరకు ఇదే అత్యధికమని మింత్రా హెచ్ఆర్ హెడ్ నూపూర్ నాగ్‌పాల్ తెలిపారని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఈ సంవత్సరం నియామకాలు సార్టింగ్, ప్యాకింగ్, పికింగ్, లోడింగ్, అన్లోడింగ్, డెలివరీ, రిటర్న్ ఇన్స్పెక్షన్ అలాగే కార్గో ఫ్లీట్ మేనేజ్మెంట్ ఇలా పలు విభాగాల్లో ఉంటాయి. తాజా నివేదిక ప్రకారం ప్రస్తుత కొత్త బ్యాచ్‌లోని సప్లై చైన్ మేనేజ్మెంట్ సిబ్బందిలో దాదాపు సగం మందికి ఉద్యోగాల్లో కొనసాగనుండగా, కాంటాక్ట్ సెంటర్ సిబ్బంది వారి ఒప్పందం మేరకు పనిచేస్తారు. -
ఆన్లైన్లో సాక్సులు ఆర్డర్ చేస్తే లోదుస్తులు.. ఇదేంటని అడిగితే షాకింగ్ రిప్లై
ముంబై: ఉరుకులు పరుగుల జీవితంలో మనకు కావాల్సిన అన్ని వస్తువులు మార్కెట్‌కు వెళ్లి కొనుక్కోలేం. ఇదే పెట్టుబడిగా ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలు పుట్టకొచ్చాయి. చాలా సంస్థలు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అయితే, కొన్ని పొరపాట్ల వల్ల ఆర్డర్ కోసం ఉత్సాహంగా ఎదురుచూసే కస్టమర్లకు షాకులు కూడా తగులుతుంటాయి. ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరొకటి రావడం, లేదంటే పాడైన వస్తువు డెలివరీ కావడం చూస్తుంటాం. తాజాగా ముంబైకి చెందిన కశ్యప్ అనే వ్యక్తికి అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మింత్రా యాప్‌లో ఫుట్‌బాల్ సాక్సులు ఆర్డర్ చేస్తే.. అతని ఇంటికి లేడిస్ లోదుస్తులు వచ్చాయి. కంగుతిన్న కశ్యప్ ఇదేంటని ప్రశ్నించి, రిఫండ్ కోసం ప్రయత్నిస్తే.. ‘ప్రొడక్టు తిరిగి స్వీకరించబడదు’ అనే రిప్లై వచ్చింది. (చదవండి: Viral Video: కదులుతున్న రైలు నుంచి దిగబోతూ కిందపడబోయిన గర్భిణీ.. క్షణం ఆలస్యమయ్యుంటే.) Ordered football stockings. Received a triumph bra. @myntra's response? "Sorry, can't replace it". So I'm going to be wearing a 34 CC bra to football games, fellas. Ima call it my sports bra. pic.twitter.com/hVKVwJLWGr — Kashyap (@LowKashWala) October 17, 2021 చేసేదేం లేక పాపం అతను తన బాధను ట్విటర్లో వెళ్లగక్కాడు. లోదుస్తులు ధరించి ఫుట్ బాల్ ఆడతాలే అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకేముంది.. ‘తప్పు జరిగిపోయింది. సారీ. అతి త్వరలో మీ సమస్య పరిష్కరస్తాం’ అంటూ ట్విటర్లో మింత్రా యాజమాన్యం రిప్లై ఇచ్చింది. I hear you and apologize for the unintended grievance caused. Kashyap! Please be assured that we are working on it on priority. As promised, one of our case managers will contact you within the mentioned time frame with an update. I appreciate your patience shown here. -AY — Myntra Support (@MyntraSupport) October 17, 2021 ఇక ఈ ఘటనపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అందుకేనా ఆన్లైన్ యాప్‌లు ట్యాంపర్ ప్రూఫ్‌గా వస్తువులను డెలివరీ చేస్తుంటాయి అని కొందరు కామెంట్లు చేస్తే.. లో దుస్తులకు బదులు సాక్సులు అందుకున్న ఆ మహిళ పరిస్థితి ఏంటో? మరికొందరు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. సదరు మహిళకు కూడా క్షమాపణలు చెప్పి.. ఆమె సమస్య కూడా పరిష్కరించాలని నెటిజన్లు కోరుతున్నారు. (చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు!) Well also apologise to the lady who is wondering how to wrap those football stockings around for better support — Priyanka Lahiri (@PriyankaLahiri_) October 17, 2021 -
Boycott Myntra.. ఎందుకో తెలుసా?
Boycott Myntra trending on Twitter: మనోభావాలు.. దెబ్బతినడానికి ప్రత్యేకించి కారణాలు అక్కర్లేని రోజులివి. అలాంటిది చిన్న కారణం దొరికినా.. వివాదాన్ని రేపి, రచ్చ చేసి గోల చేస్తున్నారు చాలామంది. ఈ తరుణంలో దుస్తుల ఈ-కామర్స్ సంస్థ మింత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. బాయ్‌కాట్ మింత్రా పేరుతో సోషల్ మీడియాలో కుప్పలుగా పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. దానికి కారణం.. ఓ పాత ఫేక్ పోస్ట్. లోగో మార్పుతో వివాదంలో నిలిచిన మింత్రా.. ఇప్పుడు మరో విమర్శను ఎదుర్కొంటోంది. మహాభారత దుశ్వాసన పర్వంలో కృష్ణుడు, ద్రౌపదికి వలువలు అందించే ఘట్టాన్ని తమ ప్రమోషన్‌కు వాడుకుందనేది మింత్రాపై వినిపిస్తున్న ఆరోపణ. ఈ కారణంతోనే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మింత్రా వ్యవహరించిందని.. కాబట్టి తక్షణమే దానిని అన్-ఇన్స్టాల్ చేయాలని విమర్శలు వినిపిస్తున్నాయి. Shame On Myntra . Retweet And #BoycottMyntrahttps://t.co/kPROnzxLwh — Sadhvi Prachi (@Sadhvi_prachi) August 23, 2021 This is not an ad, it is a direct insult to Hinduism & Hindu’s everywhere. It’s time to send a message loud & clear: Anti-Hindu propaganda will no longer be met with passivity. It will be met with action. #BoycottMyntra pic.twitter.com/EThpeT0xrL — Kavita (@Sassy_Hindu) August 22, 2021 Guy's this has not been done by @myntra it is a post shared on 2016 which has popped now . I'm not supporting myntra but what wrong is wrong . An I'm not an anti-Hindu . I love my religion but we should not blindly tweet without knowing thefact do fact check once #BoycottMyntra pic.twitter.com/MIH2NDt5v4 — B Sanki (@sanjubhujlthapa) August 23, 2021 Abe yaar bc pagal hain kya log? #BoycottMyntra but why? 5 saal pehle ka incident hai ye and myntra has said they didn’t create this artwork neither did they endorse it. Bhai ek baar double check to kar liya karo!🤦🏻♂️ pic.twitter.com/Hl5osQcNT0 — Sanjay Beniwal (@noSanjayBeniwal) August 23, 2021 ఈ మేరకు ఉదయం నుంచి విపరీతమైన పోస్టులు ట్విటర్లో కనిపిస్తుండడంతో.. ట్రెండింగ్‌లోని వచ్చింది. అయితే ఈ పోస్ట్ కొత్తది కాదు. మింత్రా డిజైన్ చేసింది అంతకన్నా కాదు. 2016లోనే ఈ ఫేక్ పోస్ట్ వైరల్ అయ్యింది. ఆ టైంలోనే స్పందించిన మింత్రా.. అలాంటి ఆర్ట్ వర్క్‌ను తాము సృష్టించలేదని, ఎండోర్స్ కూడా చేయలేదని స్పష్టం చేసింది. ఇప్పుడు మళ్లీ హిందుత్వఅవుట్లౌడ్( @hindutvaoutloud) అనే ఇన్స్టాగ్రామ్ పేజీ నుంచి ఈ పోస్ట్ అప్లోడ్ అయ్యింది. కొందరు మింత్రాకు మద్దతుగా ఈ ఫేక్ ఓల్డ్ పోస్ట్‌పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Outloud (@hindutvaoutloud) -
ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్లిప్‌కార్ట్ గ్రూపు ఉద్యోగులందరికీ కరోనా వైరస్ వ్యాక్సిన్‌న ఉచితంగా అందించాలని నిర్ణయించినట్టు తాజాగా ప్రకటించింది. ముగ్గురు డిపెండెంట్లతో సహా ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఉద్యోగులందరికీ కోవిడ్-19 టీకా ఖర్చును 100 శాతం చెల్లిస్తామని ఉద్యోగులకు అందించిన సమాచారంలో ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అంతేకాదు టీకా తీసుకునేందుకు ఒక రోజు సెలవు తీసుకోవడానికి కూడా అవకాశం ఇస్తుంది. దీంతోపాటు టీకా అనంతరం ఏదైనా ఇబ్బంది తలెత్తితే అందుకు కోవిడ్ స్పెషల్ కేర్ లీవ్ కూడా ఆఫర్ చేస్తోందని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ కృష్ణ రాఘవన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. తరువాతి దశపై ప్రభుత్వ నిర్ణయం కోసం తాము ఎదురుచూస్తున్నామని, ముగ్గురు డిపెండెంట్లతోపాటు తమ ఉద్యోగులందరికీ టీకా ఖర్చులో 100 శాతం భరించాలని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ నిర్ణయించడం సంతోషంగా ఉందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఉద్యోగులు టీకా ఖర్చును రీ ఎంబర్స్ చేసుకోవడం గానీ,తమ భాగస్వామి అసుపత్రిలో ఉచితంగా టీకా తీసుకోవడం గానీ చేయవచ్చని తెలిపింది. లేదా సంస్థ క్యాంపస్‌లో ఏర్పాటు చేసే టీకా డ్రైవ్‌లో పాల్గొనవచ్చని చెప్పింది. కరోనా నివారణకు గాను దేశవ్యాప్తంగా రెండోవద వ్యాక్సినేషన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ఎలా చూస్తే అలా.. ఆ సంకేతం మార్పు
‘పొలిటికల్ కరెక్ట్‌నెస్’ అనే మాట ఒకటి ఉంది. ఏ భావననైనా.. అది అక్షరం అయినా, చిత్రం అయినా, మాట అయినా.. సంస్కారవంతంగా వ్యక్తం చేసేలా జాగ్రత్త పడటమే పొలిటికల్ కరెక్ట్‌నెస్. సాటి మనిషి మనోభావాలు దెబ్బతినకుండా ఎరుక (లేక) స్పృహ కలిగి ఉండటం అది. బెంగళూరులోని ప్రసిద్ధ ఇ–కామర్స్ కంపెనీ ‘మింత్రా’ లోగో విషయంలో ఇలాంటి పొలిటికల్ కరెక్ట్‌నెస్ లేదని ‘అవెస్టా ఫౌడేషన్’ అనే ఎన్జీవో సంస్థ ప్రతినిధి ఒకరు డిసెంబరులో ఫిర్యాదు చేయడంతో మింత్రా రెండు రోజుల క్రితం తన లోగోను మార్చుకుంది. పాత లోగోని ఒక భాగం స్త్రీ జననావయవాన్ని సంకేత పరుస్తోందని ఆ ప్రతినిధి అభ్యంతరం. (చదవండి: ఎస్బీఐ : యోనో బంపర్ ఆఫర్లు) దాంతో లోగోను పూర్తిగా మార్చకుండానే ‘ఆ’ సంకేతాన్ని మార్పు చేయడంతో మింత్రా తన ఉనికిని నిలుపుకోగలిగింది. అయితే.. పొలిటికల్ కరెక్ట్‌నెస్ పేరుతో ప్రతి విషయాన్నీ వేరే కోణంలోంచి చూడటం సరికాదని నెటిజన్లు అంటున్నారు. ఇలాగైతే ఎన్నని మార్చుకుంటూ పోవాలి అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అందు నిదర్శనంగా కొన్ని కంపెనీల లోగోలను, వాటిలో ‘కనిపిస్తున్న’ అభ్యంతరాలను నెటిజెన్లు ట్వీట్ చేశారు. -
మింత్రా సేల్ : 5 వేల ఉద్యోగాలు
సాక్షి, ముంబై : ఫ్యాషన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా 'ఎండ్ ఆఫ్ రీజన్ సేల్'(ఇఒఆర్‌ఎస్)కు శ్రీకారం చుట్టింది. నేటి (జూన్19) నుంచి ప్రారంభించిన 12వ ఎడిషన్ అమ్మకాలు జూన్ 22తో ముగియనున్నాయి. ఈ సందర్భంగా సప్లయ్ చెయిన్, కస్టమర్ కేర్ విభాగాల్లో 5 వేల మందిని నియమించుకున్నామని మింత్రా ప్రకటించింది. అంతేకాదు తొలిసారిగా తమ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారని వెల్లడించింది. ఇఒఆర్‌ఎస్ అమ్మకాల్లో దేశవ్యాప్తంగా 3 వేలకు పైగా బ్రాండ్ల నుండి 7 లక్షలకు పైగా వెరైటీలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మహిళలు, పిల్లలు, క్రీడా, ఫ్యాషన్ దుస్తులు, బ్యూటీ, పర్సనల్ కేర్ విభాగాల్లో ఆకర్షణీయ ధరలు అందుబాటులో ఉన్నాయని మింత్రా ప్రకటించింది. పుంజుకున్న డిమాండ్ కనుగుణంగా నిమిషానికి 20 వేలకు పైగా ఆర్డర్లను తీసుకోవడానికి తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపింది. 30 లక్షల ప్రజలు తమ ప్లాట్ఫామ్లో షాపింగ్ చేస్తారని ఆశిస్తోంది. 'అన్‌లాక్ 1.0' దశలో సేల్ పుంజుకుందని తాజా సేల్ ద్వారా కూడా భారీ అమ్మకాలను సాధించనున్నామనే ధీమాను సీఈఓ అమర్ నాగారం వ్యక్తం చేశారు. గరిష్టంగా 7.5 లక్షలకు పైగా వినియోగదారులు ఈ సేల్ పాల్గొంటారని అంచనా వేశారు.300 నగరాల్లో 400 కి పైగా బ్రాండ్ల నుండి 3,500కు పైగా భారతీయ చేనేత ఉత్పత్తులను తమ ప్లాట్ఫామ్లో అందిస్తున్నామన్నారు. ప్రధానంగా ఎస్ఎంఇలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు అమర్ చెప్పారు. అంతేకాకుండా ఈ అమ్మకాలు ముగిసిన తరువాత ఉద్యోగులకు రెండు రోజుల "రీఛార్జ్ లీవ్" ను కూడా అందిస్తోంది. కాగా మునుపటి సేల్‌లో, 2.85 మిలియన్ల కస్టమర్ల ద్వారా 4.2 మిలియన్ ఆర్డర్లతో 9.6 మిలియన్ వస్తువులను మింత్రా విక్రయించింది. చదవండి : అది మా డీఎన్ఏలోనే ఉంది : అంబానీ -
మింత్రాలో జబాంగ్ విలీనం..
ముంబై: ఆన్లైన్ ఫ్యాషన్ రిటైల్ సంస్థ మింత్రాలో అనుబంధ సంస్థ జబాంగ్ విలీనం కానుంది. విలీనమైనప్పటికీ.. జబాంగ్ ప్రత్యేక బ్రాండ్‌గానే కొనసాగుతుందని మింత్రా తెలిపింది. రెండు సంస్థల టీమ్‌కు ప్రస్తుత మింత్రా సీఈవో అనంత్ నారాయన్నే సారథిగా కొనసాగుతారు. ఆయన రాజీనామా చేస్తారన్న వార్తలను మింత్రా తోసిపుచ్చింది. ఆన్లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 2014లో మింత్రాను కొనుగోలు చేసింది. 2016లో జబాంగ్ను మింత్రా కొనుగోలు చేసింది. అప్పట్నుంచి రెండు బ్రాండ్స్ కార్యకలాపాలను క్రమంగా అనుసంధానం చేయడం జరుగుతోందని మింత్రా ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇకపై టెక్నాలజీ, మార్కెటింగ్, ఆదాయాలు, ఆర్థికాంశాలు మొదలైన వాటన్నింటినీ పూర్తి స్థాయిలో ఏకీకృతం చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు, మింత్రా సీఎఫ్‌వో దీపాంజన్ బసు తన పదవికి రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తీవ్రమైన వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలతో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో పదవి నుంచి బిన్నీ బన్సల్ వైదొలిగిన దరిమిలా ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉద్యోగాల్లో కోత.. ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి కింద పనిచేయాలనే కారణంతో మింత్రా సీఈవో అనంత్ నారాయణన్ కూడా రాజీనామా చేయొచ్చన్న వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఆయన తోసిపుచ్చారు. ‘నేను ఇందులోనే కొనసాగబోతున్నాను‘ అని అనంత్ స్పష్టం చేశారు. మింత్రా సహ వ్యవస్థాపకుడు ముకేశ్ బన్సల్ స్థానంలో 2015లో ఆయన సీఈవోగా చేరారు. మింత్రా, జబాంగ్ కార్యకలాపాల ఏకీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, ఫలితంగా కొన్ని ఉద్యోగాల్లో కోత ఉండవచ్చని అనంత్ తెలిపారు. అయితే, ఇది మొత్తం సిబ్బందిలో 10 శాతం కన్నా తక్కువే ఉంటుందని చెప్పారు. తొలగించిన ఉద్యోగులకు 3–8 నెలల జీతాలు చెల్లించడంతో పాటు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడంలో సహకారం అందించడం, వైద్య బీమా వ్యవధిని పొడిగించడం మొదలైన మార్గాల్లో తోడ్పాటు అందిస్తున్నామని అనంత్ చెప్పారు. -
షాపింగ్ ఎక్కువగా చేసేది అబ్బాయిలే!!
న్యూఢిల్లీ : షాపింగ్ అంటే అమ్మాయిలని, అమ్మాయిలంటే షాపింగ్ అంటూ చమత్కారాలు చేస్తూ ఉంటారు. కానీ షాపింగ్ ఎక్కువగా చేసేది అమ్మాయిలు కాదట. అబ్బాయిలే ఎక్కువగా షాపింగ్ చేస్తారట. ఈ విషయాన్ని ఎవరు చెప్పారో తెలుసా? అతిపెద్ద ఆన్లైన్ ఫ్యాషన్ షాపింగ్ వెబ్సైట్లైన మింత్రా, జబాంగ్ల సీఈవో అనంత్ నారాయణన్. 55 శాతం అబ్బాయిలే ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉన్నారని తెలిపారు. ఇండియా టుడే యూత్ సమిట్ మైండ్ రాక్స్‌లో మాట్లాడిన నారాయణన్.. ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అబ్బాయిలే ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేయడానికి కారణం, అమ్మాయిల కంటే ఎక్కువగా వారి వద్దనే స్మార్ట్ఫోన్లు కలిగి ఉండటమని పేర్కొన్నారు. షాపర్ పరంగా చూసుకుంటే, అమ్మాయిలు ఎక్కువగా తమ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే వారి పరిమాణం పెరుగుతోంది. అయినప్పటికీ, అమ్మాయిల కంటే ఎక్కువగా అబ్బాయిలే షాపర్స్‌ను ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ, పట్టణ ప్రాంత దుకాణదారులకు ఎలాంటి తేడా లేదని, గ్రామీణ వినియోగదారులు కొనుగోలు చేసే ఉత్పత్తులు, పట్టణ వినియోగదారులు తీసుకునేవి సమానంగా ఉన్నాయని మింత్రా సీఈవో తెలిపారు. మింత్రాలో 55 శాతం డిమాండ్ టాప్ 30 నగరాలను మించి వస్తుందని, మిగతా 45 శాతం టాప్ 30 నగరాల నుంచి వెల్లువెత్తుందని చెప్పారు. చాలా గ్రామీణ ప్రాంతాల్లో యాక్సస్ లేదు, ఒకవేళ యాక్సస్ కల్పిస్తే, పట్టణ ప్రజలు అనుసరించే ట్రెండ్‌నే గ్రామీణ ప్రాంత ప్రజలు ఫాలో అవుతారని పేర్కొన్నారు. గ్లోబల్ ట్రెండ్స్ భారత్‌కు చాలా వేగంగా విస్తరిస్తాయని, భారతీయులు సరసమైన లేటెస్ట్ ఫ్యాషన్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారని చెప్పారు. -
జీఎస్టీ రేట్ల కోత : ఈ-కామర్స్ దిగ్గజాలకు ఝలక్
న్యూఢిల్లీ : పలు ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను తగ్గించి శనివారం జీఎస్టీ కౌన్సిల్ గుడ్‌న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ రేట్ల కోత చేపట్టిన జీఎస్టీ కౌన్సిల్ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా లాంటి కంపెనీలకు ఝలకిచ్చింది. ఉత్పత్తులపై తగ్గించిన పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు జీఎస్టీ అథారిటీలు ఆడిట్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఎకానమిక్ టైమ్స్ రిపోర్టు ప్రకారం, ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలపై ఆడిట్ చేపట్టాలని నేషనల్ యాంటీ-ప్రాఫిటరింగ్ అథారిటీ, డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. గతేడాది నవంబర్లోనే జీఎస్టీ కౌన్సిల్, 178 ఉత్పత్తులపై పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. అదే నెలలో ప్రభుత్వం నేషనల్ యాంటీ-ప్రాఫిటరింగ్ అథారిటీని ఏర్పాటు చేసింది. జీఎస్టీలో తగ్గిన పన్ను ప్రయోజనాలను పర్యవేక్షించేందుకు కేంద్రం దీన్ని ఏర్పాటు చేసింది. వినియోగదారుల నుంచి పన్ను రేట్లకు విరుద్ధంగా వ్యాపారులు వసూలు చేసినా.. పన్ను తగ్గిన తర్వాత ధరలు తగ్గించకపోయినా ఈ సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదుల్లో మెరిట్ ఉంటే, వాటిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సేఫ్‌గార్డ్స్‌కు తదుపరి విచారణకు పంపిస్తోంది. డైరెక్టర్ జనరల్ సేఫ్‌గార్డ్స్ మూడు నెలలో విచారణను పూర్తి చేస్తుంది. ఆ తర్వాత యాంటీ-ఫ్రాపిటరింగ్ అథారిటీకి రిపోర్టును పంపిస్తుంది. ఒకవేళ కంపెనీ జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందజేయడం లేదని అథారిటీ గుర్తించి.. లబ్దిదారుడు ఎవరో తెలియని పక్షంలో, ఈ మొత్తాన్ని కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్‌కు బదిలీ చేయాలని ఆదేశిస్తుంది. తక్కువ పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకపోతే, సంస్థ లేదా వ్యాపార రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం కూడా అథారిటీకి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు స్టాండింగ్ కమిటీ ముందుకు మొత్తం 354 ఫిర్యాదులు వచ్చాయి. తమకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను లేదా పన్ను కోత ప్రయోజనాలను అందజేయడం లేదని వినియోగదారులు ఫిర్యాదు చేశారు. -
అమెజాన్ సరికొత్త ప్లాన్ : వాటిపై కన్నేసింది
బెంగళూరు : దేశీయ ఆన్లైన్ ఫ్యాషన్ షాపింగ్ వేదికగా ఉన్న మింత్రాను ఫ్లిప్‌కార్ట్ దక్కించుకున్న అనంతరం, అమెజాన్ ఇండియా కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. సొంతంగా బ్యూటీ, పర్సనల్ కేర్ ఉత్పత్తుల బ్రాండును లాంచ్ చేయాలని సన్నద్ధమవుతోంది. ఆధిపత్య స్థానంలో ఉన్న చిన్న స్టార్టప్‌లను వెనక్కి నెట్టేస్తూ... వేగవంతమైన ఈ కాస్మోటిక్స్ మార్కెట్లో ఈ రెండు డిజిటల్ రిటైలర్లు పోటీ పడబోతున్నాయి. కాంట్రాక్ట్ మానుఫాక్ట్ర్చర్స్తో అమెజాన్ ఇండియా చర్చలు జరుపుతుందని, స్కిన్ కేర్, మేకప్‌లో కొన్ని కేటగిరీల్లో ప్రైవేట్ లేబుల్స్‌ను లాంచ్ చేస్తుందని ఈ విషయం తెలిసిన వర్గాలు చెప్పాయి. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ రెండూ ఎక్కువ మార్జిన్లు అందించే కాస్మోటిక్స్ కేటగిరీపై దృష్టిసారించాయని తెలిపాయి. అయితే సొంత బ్రాండులను ప్రవేశపెట్టేముందు ఈ కేటగిరీల్లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెజాన్ ఇండియా ఇప్పటికే 19వేల బ్రాండ్స్‌లో 20 లక్షల బ్యూటీ ప్రొడక్ట్‌లను రిటైల్ చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మింత్రా 100కు పైగా బ్రాండుల్లో బ్యూటీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా రిటైల్ చేయడం కంటే అంతర్జాతీయ బ్రాండులతో కలిసి కొత్తగా బ్యూటీ, పర్సనల్ కేర్ బ్రాండులను లాంచ్ చేయాలని కూడా మింత్రా చూస్తోంది. అంతర్జాతీయ బ్రాండులతో తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని చూస్తున్నట్టు మింత్రా, జబాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనంత్ నారాయణన్ తెలిపారు. 2020 వరకు మొత్తం రెవెన్యూలో బ్యూటీ సెగ్మెంట్ సహకారం 8 శాతం ఉంచుకోవాలని చూస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది 1 శాతంగా మాత్రమే ఉంది. -
ఫ్యాషన్ పోర్టల్ మింత్రా బంపర్ సేల్..
ఫ్యాషన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా కొత్త ఏడాదిలో గ్రాండ్ సేల్ నిర్వహించబోతుంది. 2017 జనవరి 3-5 వరకు 'ఎండ్ ఆఫ్ రీజన్' సేల్‌ను నిర్వహించనున్నట్టు మింత్రా పేర్కొంది. ఈ సేల్‌తో తమ విక్రయాలను 25 సార్లు ఎక్కువగా పెంచుకోవాలని కంపెనీ ఆశిస్తోంది. ఏడాదిలో రెండుసార్లు నిర్వహించే ఈ సేల్‌పై, 1,800 బ్రాండులకు 50-80 శాతం డిస్కౌంట్‌ను మింత్రా ఆఫర్ చేయనుంది. డిజిటల్‌గా కొనుగోలు చేసేవారికి అదనంగా డిస్కౌంట్లను అందిస్తామంటోంది మింత్రా. పెద్ద నోట్ల రద్దుతో పడిపోయిన అమ్మకాల నుంచి కూడా రికవరీ అయ్యేందుకు ఈ సేల్ దోహదం చేయనుందని కంపెనీ భావిస్తోంది. ఈ ఈవెంట్ ఇటు మింత్రా యజమాన్య సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు ప్రయోజనకరంగా మారనుందట. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఫ్లిప్‌కార్ట్ వృద్ధి రేటు 50 శాతం మేర క్షీణించింది. సాధారణ రోజుల కంటే ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ ఈవెంట్లో దాదాపు 25 సార్లు తమ విక్రయాలను పెంచుకుంటామని, 2016 జూలైలో నిర్వహించిన దానికంటే రెట్టింపు వృద్ధిని నమోదుచేస్తామని మింత్రా సీఈవో ఆనంత్ నారయణన్ తెలిపారు. ఈ మూడు రోజుల్లో తమ ప్లాట్‌ఫామ్‌పై 15 మిలియన్ ప్రజలు నమోదవుతారని ఆశిస్తోంది. అంతేకాక 5-6 లక్షల కొత్త కస్టమర్లను పొందుతామని కంపెనీ చెబుతోంది.. -
మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లూ మింత్రాకు గుడ్‌బై
బెంగళూరు : ఫ్యాషన్ పోర్టల్ మింత్రా మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను నిష్క్రమణకు సిద్ధమవుతోంది. మేనేజ్మెంట్ టీమ్‌ను పునర్నిర్మించుకునే క్రమంలో ఈ మేరకు సన్నద్దమవుతోంది. మింత్రా పేరెంట్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్, ప్రధాన ప్రత్యర్థి జబాంగ్ను సొంతంచేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ కొనుగోలు అనంతరం వ్యాపార వృద్ధిని మరింత పెంచుకోవడానికి మింత్రా తీవ్రంగా కృషిచేస్తోంది. అయితే మింత్రా వాణిజ్యానికి అధినేతలుగా ఉన్న ప్రసాద్ కోంపల్లి, అభిషేక్ వర్మలు కంపెనీ నుంచి వైదొలిగే ప్రక్రియలో ఉన్నట్టు.. వారి నిష్క్రమణకు కూడా కంపెనీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. గతనెలలోనే మింత్రాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న గౌతమ్ కోటంరాజ్ రాజీనామా చేసి, అమెజాన్ ఇండియాలో చేరారు. అదేవిధంగా కంపెనీ ఫైనాన్స్‌లను పర్యవేక్షించే ప్రభాకర్ సుందర్ సైతం మింత్రాకు గుడ్‌బై చెప్పి, మరో ప్రత్యర్థి ఫ్యాషన్ పోర్టల్ వోనిక్లో జాయిన్ అయ్యారు. కోంపల్లి అక్టోబర్ నుంచి అడ్వయిజరీ పాత్రను పోషించబోతున్నారని, అతని వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవడానికి సమయాన్ని కేటాయించడానికి ఆయన కంపెనీ నుంచి వైదొలగబోతున్నారని మింత్రా అధికారిక ప్రతినిధి చెప్పారు. అడ్వయిజరీగా కోంపల్లి కంపెనీ సీఈవో అనంత్ నారాయణన్‌కు వివిధ అంశాల్లో దగ్గరుండి సలహాలు అందిస్తారని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముందునుంచి వీరిద్దరూ నారాయణన్ ఆలోచనలకు చాలా దగ్గరుగా నిర్ణయాలు తీసుకునేవారని, క్లోజ్‌గా కంపెనీ వ్యవహారాలు నిర్వహించేవారని చెబుతున్నారు. నాలుగేళ్ల కాలంలో కోంపల్లి మార్కెటింగ్, కొనుగోలు వ్యవహారాలు, సామాగ్రి, బ్రాండ్ భాగస్వామ్యం, డిజిటల్, మొబైల్ ప్లాట్‌ఫామ్‌ల వ్యవహారాలను చూసుకునేవారు. రీటైల్ ఇండస్ట్రిలో ఓ సీనియర్ లీడర్‌ను అభిషేక్ వర్మ స్థానంలో మింత్రా ఫ్యాషన్ బ్రాండ్స్‌కు కొత్త అధినేతను సెప్టెంబర్‌లో నియమించబోతున్నట్టు తెలుస్తోంది. క్రాస్ ఇండస్ట్రిలో అనుభవం కలిగిన వారిని టాప్ మేనేజ్మెంట్లో నియమించుకుంటామని కంపెనీ చెప్పింది. జబాంగ్ను తన పేరెంట్ కంపెనీ సొంతం చేసుకున్న అనంతరం మేనేజ్మెంట్ టీమ్‌ను బలపర్చుకుంటూ వృద్ధి బాటలో పయనించడానికి కృషిచేస్తున్నట్టు మింత్రా తెలుపుతోంది. -
బాలీవుడ్ హీరో కంపెనీ వాటా కొన్న మింత్ర
న్యూఢిల్లీ: ఆన్ లైన్ రీటైల్ వ్యాపార దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సొంతమైన మింత్ర వ్యాపార విస్తరణలో దూసుకుపోతోంది. ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ మింత్ర ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కు చెందిన లైఫ్‌స్టైల్ అప్పారెల్ అండ్ క్యాజువల్ వేర్ బ్రాండ్ 'హెచ్ఆర్ఎక్స్ ' లో మేజర్ షేర్ ను సొంతం చేసుకుంది. 51 శాతం వాటాను కొనుగోలు చేసిన మింత్ర ఈ డీల్ వివరాలను వెల్లడిచేయలేదు. ఎక్సీడ్ ఎంటర్ టైన్మెంట్, , హృతిక్ కంపెనీల మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్టు ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపింది. ఈ రెండూ వాటాదార్లుగా కొనసాగుతారని తెలిపింది. బిలియన్ వినియోగదారులను సాధించాలన్న తమ లక్ష్య సాధనలో మింత్రా కొత్త భాగస్వామ్యాన్ని తోడ్పడుతుందని బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ చెప్పారు. ఫ్యాషన్, క్రియాత్మక క్రియాశీల దుస్తులు ఎంపిక లో పెరుగుతున్న వినియోగదారుల ఆసక్తి అనుగుణంగా క్రియాశీల జీవనశైలి దుస్తులు విభాగంలో వ్యూహాత్మక కొనుగోలు ఉపయోగపడనుందని మింత్రా ఫ్యాషన్ బ్రాండ్స్ ఉపాధ్యక్షుడు, బ్రాండ్ డైరెక్టర్ రాజేష్ నార్కర్ విశ్వసించారు. కాగా 2012 లో రంగంలోకి వచ్చిన హృతిక్ బ్రాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ .200 కోట్ల ఆదాయంతో దూసుకెళుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి సిద్దమవుతోంది. 2013లో హృతిక్ మింత్ర లమధ్య భాగస్వామ్యం ఒప్పంద కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
ప్రధాన ప్రత్యర్థిని కొనేసిన మింత్ర
ఆన్ లైన్ ఫ్యాషన్ దిగ్గజం మింత్ర తన ప్రధాన ప్రత్యర్థి కంపెనీ ,గ్లోబల్ ఫ్యాషన్ గ్రూప్ జబాంగ్ ను హస్తగతం చేసుకుంది. భారతదేశం లో అతిపెద్ద ఫ్యాషన్ షాపింగ్ డెస్టినేషన్ గా అవతరించడానికే ఈ కొనుగోలుచేసినట్టు మింత్ర మంగళవారం వెల్లడించింది. నమ్మకమైన కస్టమర్ బేస్ ఉన్న జబాంగ్ కొనుగోలుతో ప్రత్యేక ప్రపంచ బ్రాండ్లను అందించే ఏకైక సంస్థగా నిలవనున్నామని తెలిపింది. ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్ విభాగంలోఇండియా లో తిరుగులేని నాయకుడిగా పేరెంట్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ , మింత్రా అవతరించిందనీ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్వాధీనం ద్వారా అతిపెద్ద ఫ్యాషన్ వేదిక ఏర్పాటు దిశగా తమ ప్రయాణం లో మరో అడుగు పడిందన్నారు. మిలియన్ల వినియోగదారులకు మరిన్ని బ్రాండ్లను అందుబాటులోకి తేనున్నామన్నారు. భారత ఈ కామర్స్ వ్యాపార అభివృద్ధిలో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టయిల్ దే కీలకభూమిక అని ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్న బన్సాల్ వ్యాఖ్యానించారు. వినియోగదారుల విశ్వాసాన్ని మరింత పెంచుకోవడంలో ఈ స్వాధీనం ఉపయోగపడతుందన్నారు. ముఖ్యంగా బ్రాండ్ సంబంధాలు, వినియోగదారు అనుభవంలో తమ రెండు సంస్థల మధ్య సమన్వయంతో రాబోయే నెలల్లోఈ కామర్స్ మార్కెట్ ను షేక్ చేయనున్నామని ఆయన వివరించారు మింత్రా ద్వారా జబాంగ్ ను చేజిక్కించుకోవడం ఆన్లైన్ వ్యాపారంలో మరింత పోటీ పెరుగనుందని నిపుణుల అభిప్రాయం. టాటాక్లిక్, అబోఫ్, రిలయన్స్ తదితరకంపెనీల వస్తున్న తీవ్ర పోటీ నేపథ్యంలోనే ఈ కొనుగోలు జరిగిందని భావిస్తున్నారు -
200 బ్రాండ్లను తొలగిస్తున్న మింత్ర?
బెంగళూరు: దేశ అతిపెద్ద ఆన్ లైన్ ఫ్యాషన్ రీటైలర్ మింత్రా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గత ఏడాది కొనుగోలు చేసిన ఫ్యాషన్ పోర్టల్ మింత్రా దాదాపు 200 బ్రాండ్లను డీలిస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. కనీసం 10 శాతం ఉత్పత్తులను తమ వ్యాపారంనుంచి తొలగిస్తున్నట్టు సమాచారం. తక్కువ ఆదరణ ఉన్న ఉత్పత్తులను తమ ప్లాట్ ఫాం నుంచి తొలగించి, ప్రముఖ బ్రాండ్లపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుందిట. ప్రస్తుతం నైక్, అదిదాస్,పూమా, లీ, లివైస్, యారో, క్యాట్,హార్లీ డేవిడ్ సన్, ఫెరారి తదితర 25 అంతర్జాతీయ బ్రాండ్లను ఆన్ లైన్ లో విక్రయిస్తోంది. అమ్మకాల పరంగా బలహీనంగా ఉన్న బ్రాండ్లను తొలగించిన మింత్రా పెద్ద బ్రాండ్ దృష్టి సారించిందని బెంగుళూరు ఆధారిత కంపెనీ మింత్రా సన్నిహితులు తెలిపారు. 150-200 బ్రాండ్లను తొలగిస్తోందనీ, భవిష్యత్తులో మరిన్నింటిని తొలగించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రోజుకు రెండు మూడు మాత్రమే విక్రయిస్తున్న బ్రాండ్లను తొలగించనుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి తెలిపారు. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి మింత్రా నిరాకరించింది. కాగా మింత్రా కూడా ప్రపంచ బ్రాండ్లపై దృష్టి పెడుతుందనీ సీఈవో అనంత్ నారాయణ్ ఇటీవల వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాదికి బిలియన్ డాలర్ ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. స్థిరమైన వృద్ధి రేటుతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో అధికలాభాలు గడించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందులో భాగంగానే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఫరెవర్ 21 మింత్రా లో రంగప్రవేశంతో మింత్రా ఆదరణ పెరిగిన సంగతి తెలిసిందే. -
డెస్క్ టాప్ సేవల్లోకి మింత్ర రీ ఎంట్రీ
బెంగళూరు : ఫ్యాషన్ ఈ-కామర్స్ రిటైలర్ మింత్ర, తన డెస్క్ టాప్ సైట్ సేవలను జూన్ 1నుంచి పునఃప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. వ్యాపారమంతా అరచేతిలోనే అన్న మాదిరిగా మారిన తర్వాత మింత్ర తన డెస్క్ టాప్ సేవలను రద్దుచేసింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో 15-20 శాతం వరకూ అమ్మకాలు డెస్క్ టాప్ వెబ్ సైట్ ద్వారానే జరుగుతాయని కంపెనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం మొబైల్ ద్వారానే సేవలు అందించే వ్యూహాన్ని కాకుండా, డెస్క్ టాప్ ద్వారా కూడా తన సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. డెస్క్ టాప్ సేవలను పునరుద్ధరించి, ఈ వెబ్ సైట్ కోల్పోయిన కస్టమర్లను మళ్లీ వెనక్కి తెచ్చుకుంటామని, బిజినెస్ ను పెంచుకుంటామని పేర్కొంది. కస్టమర్ల అవసరాలను వినయపూర్వకంగా వినడం, తెలుసుకోవడం తమ బాధ్యత అని మింత్ర సీఈవో అనంత్ నారాయణన్ తెలిపారు. కస్టమర్ల అవసరాల మేరకు జూన్ 1నుంచి ఈ సేవలను పునఃప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. డెస్క్ టాప్ సేవలు కస్టమర్లను ఆకట్టుకోవడంలో మింత్ర సంస్థకు ఎంతో సహాయపడుతుందని, అదనంగా ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా నష్టాలను అధిగమించగలుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత ఆర్తిక సంవత్సరంలో కంపెనీ నిర్దేశించుకున్న 100 కోట్ల డాలర్ల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిందని, డెస్క్ టాప్ సేవలతో ఈ మైలురాయిని 2017 మార్చి వరకూ చేరుకుంటుందని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కేవలం డెస్క్ టాప్ వెర్షన్ తోనే కాకుండా వేరే డామినెంట్ ఛానెల్ ద్వారా కస్టమర్లను ఆకట్టుకుని తన సేవలను పెంచుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రపంచమే అరచేతిలోకి వచ్చాక, కొనాలనుకున్నది మొబైల్ లో ఒక్క క్లిక్ ఇస్తే చాలు క్షణాల్లో మన ముంగిట్లో ఉంటుంది. దీంతో చాలా ఈ-కామర్స్ సంస్థలు డెస్క్ టాప్ సేవలకు స్వస్తి పలికి, మొబైల్ యాప్ ద్వారాత సేవలందిస్తున్నాయి. -
మింత్రలో హర్లే డేవిడ్సన్ ఉత్పత్తులు
న్యూఢిల్లీ: ఎక్స్‌క్లూజివ్ ఆన్లైన్ స్టోర్ ద్వారా తన ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం కోసం ప్రముఖ బైక్ తయారీ సంస్థ హర్లే డేవిడ్సన్, ఫ్యాషన్ ఆన్లైన్ పోర్టల్ మింత్రతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆన్లైన్ స్టోర్‌లో తమ బ్రాండ్ స్పోర్ట్స్ దుస్తులు, సాధారణ ఔటర్ వేర్స్తోపాటు పలు ఉపకరణాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచామని హర్లే డేవిడ్సన్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు చేరువ అవడానికి ఈ ఒప్పందం తమకు ఎంతగానో ఉపకరిస్తుందని హర్లే డేవిడ్సన్ సేల్స్, డీలర్ డెవలప్మెంట్ డెరైక్టర్ రాజీవ్ వోహ్ర పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల హర్లే డేవిడ్సన్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని మింత్ర హెడ్ ప్రసాద్ కొంపల్లి తెలిపారు.