మింత్రలో హర్లే డేవిడ్‌సన్ ఉత్పత్తులు
న్యూఢిల్లీ: ఎక్స్‌క్లూజివ్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా తన ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం కోసం ప్రముఖ బైక్ తయారీ సంస్థ హర్లే డేవిడ్‌సన్, ఫ్యాషన్ ఆన్‌లైన్ పోర్టల్ మింత్రతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆన్‌లైన్ స్టోర్‌లో తమ బ్రాండ్ స్పోర్ట్స్ దుస్తులు, సాధారణ ఔటర్ వేర్స్‌తోపాటు పలు ఉపకరణాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచామని హర్లే డేవిడ్‌సన్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు చేరువ అవడానికి ఈ ఒప్పందం తమకు ఎంతగానో ఉపకరిస్తుందని హర్లే డేవిడ్‌సన్ సేల్స్, డీలర్ డెవలప్‌మెంట్ డెరైక్టర్ రాజీవ్ వోహ్ర పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల హర్లే డేవిడ్‌సన్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని మింత్ర హెడ్ ప్రసాద్ కొంపల్లి తెలిపారు.