రెండు గంటల్లో డెలివెరీ!.. సిద్దమవుతున్న మింత్రా | Myntra Jumps on Quick Commerce For Fast Delivery | Sakshi
Sakshi News home page

రెండు గంటల్లో డెలివెరీ!.. సిద్దమవుతున్న మింత్రా

Published Sat, Nov 23 2024 9:15 PM | Last Updated on Sat, Nov 23 2024 9:15 PM

Myntra Jumps on Quick Commerce For Fast Delivery

లైఫ్‌స్టైల్‌ ఈ కామర్స్ దిగ్గజం మింత్రా క్విక్‌కామర్స్‌లోకి అడుగుపెట్టడానికి యోచిస్తోంది. కేవలం రెండు గంటల్లో డెలివరీ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బెంగుళూరులోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సర్వీస్ అందించడానికి ప్రయోగాలను చేస్తోంది.

మింత్రా తన కస్టమర్లకు వేగంగా డెలివరీ చేయడానికి కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే.. ఎంపిక చేసిన ఉత్పత్తులను డెలివరీ చేయనుంది. దీనికోసం పైలట్ ప్రాజెక్ట్, 'M-Now' బెంగళూరులో కొన్ని పిన్ కోడ్‌లలో పనిచేస్తోంది. ఇది ఎలా పని చేస్తుందో చూడటానికి ప్రయోగాత్మకంగా సేవలు అందిస్తోంది.

నిజానికి 2022లోనే మింత్రా బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఎం ఎక్స్‌ప్రెస్ అనే డెలివరీ సర్వీస్ ప్రారంభించింది. ఈ సర్వీస్ ఉద్దేశ్యం ఏమిటంటే.. ఆర్డర్ పెట్టిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే ఉత్పత్తులను డెలివరీ చేయడం. ఇప్పుడు రెండు గంటల్లో డెలివరీ చేయడానికి సంకల్పించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement