హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బైక్ 25,597 యూనిట్లు బుకింగ్స్‌ను నమోదు చేసిందని హీరో మోటోకార్ప్ ప్రకటించింది. జూలై 4న బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం బుకింగ్స్ నిలిపివేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. సెప్టెంబరులో తయారీ మొదలుపెట్టి అక్టోబర్ నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని తెలిపింది.
ఎక్స్‌షోరూంలో ఎక్స్440 ధరలు డెనిమ్ వేరియంట్ రూ.2.39 లక్షలు, వివిడ్ రూ.2.59 లక్షలు, ఎస్ వేరియంట్ రూ.2.79 లక్షలు ఉంది. ‘ప్రీమియం విభాగంలోకి ప్రవేశించడంపై కస్టమర్లు చూపుతున్న విశ్వాసాన్ని చూస్తుంటే సంతోషం కలుగుతోంది. బుకింగ్స్ ఎక్కువ భాగం టాప్ ఎండ్ మోడల్ నుండి వస్తున్నాయి. వినియోగదార్లు సరైన బ్రాండ్, మోడల్‌కు ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని దీనినిబట్టి స్పష్టం అవుతోంది.
ప్రీమియం విభాగంలో గెలుపొందేందుకు కంపెనీ ప్రయాణానికి ఇది ప్రారంభం మాత్రమే’ అని హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. హార్లే డేవిడ్సన్ బైక్స్ అభివృద్ధి, విక్రయం కోసం 2020 అక్టోబరులో ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.
Comments
Please login to add a commentAdd a comment