‘పొలిటికల్ కరెక్ట్‌నెస్’ అనే మాట ఒకటి ఉంది. ఏ భావననైనా.. అది అక్షరం అయినా, చిత్రం అయినా, మాట అయినా.. సంస్కారవంతంగా వ్యక్తం చేసేలా జాగ్రత్త పడటమే పొలిటికల్ కరెక్ట్‌నెస్. సాటి మనిషి మనోభావాలు దెబ్బతినకుండా ఎరుక (లేక) స్పృహ కలిగి ఉండటం అది. బెంగళూరులోని ప్రసిద్ధ ఇ–కామర్స్ కంపెనీ ‘మింత్రా’ లోగో విషయంలో ఇలాంటి పొలిటికల్ కరెక్ట్‌నెస్ లేదని ‘అవెస్టా ఫౌడేషన్’ అనే ఎన్జీవో సంస్థ ప్రతినిధి ఒకరు డిసెంబరులో ఫిర్యాదు చేయడంతో మింత్రా రెండు రోజుల క్రితం తన లోగోను మార్చుకుంది. పాత లోగోని ఒక భాగం స్త్రీ జననావయవాన్ని సంకేత పరుస్తోందని ఆ ప్రతినిధి అభ్యంతరం.
(చదవండి: ఎస్‌బీఐ : యోనో బంపర్ ఆఫర్లు)
దాంతో లోగోను పూర్తిగా మార్చకుండానే ‘ఆ’ సంకేతాన్ని మార్పు చేయడంతో మింత్రా తన ఉనికిని నిలుపుకోగలిగింది. అయితే.. పొలిటికల్ కరెక్ట్‌నెస్ పేరుతో ప్రతి విషయాన్నీ వేరే కోణంలోంచి చూడటం సరికాదని నెటిజన్‌లు అంటున్నారు. ఇలాగైతే ఎన్నని మార్చుకుంటూ పోవాలి అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అందు నిదర్శనంగా కొన్ని కంపెనీల లోగోలను, వాటిలో ‘కనిపిస్తున్న’ అభ్యంతరాలను నెటిజెన్‌లు ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment