NGOs
-
పుట్టింది కెనడాలో. అన్నీ ఎదురుదెబ్బలే.. కట్ చేస్తే!
బాధితురాలిగా సానుభూతి తప్ప సరిౖయెన సలహాలు, సహాయం అందుకోలేకపోయింది రసిక సుందరం.తన చేదు జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ‘ఇమార’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. జెండర్ బేస్డ్ వయొలెన్స్‌ను నివారించడానికి, బాధితులకు అనేక రకాలుగా అండగా నిలవడానికి ‘ఇమార’ ద్వారా కృషి చేస్తోంది రసిక సుందరం.రెండు సంవత్సరాల క్రితం రసిక సుందరపై క్లోజ్‌ఫ్రెండ్ దాడి చేశాడు. ఊహించని ఈ సంఘటనకు భీతిల్లిన రసిక డిప్రెషన్లోకి వెళ్లింది. ఆ చీకటి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలనుకుంది. అయితే వారితో వరుసగా చేదు అనుభవాలు ఆమెను నిరాశకు గురి చేశాయి.‘చాలామంది నన్ను అవమానించారు. చికిత్స ఫీజులు కూడా ఎక్కువే’ గతాన్ని గుర్తు చేసుకుంది రసిక.మంచి లాయర్ దొరకక పోవడం ఆమెకు మరో అడ్డంకిగా మారింది. దీంతో తనను వేధించిన వ్యక్తిపై కేసు పెట్టలేదు.తన అనుభవాల నేపథ్యంలో ‘ఇమార సర్వైవర్ సపోర్ట్’ ఫౌండేషన్ ప్రారంభించింది. ఇది సెక్సువల్ అండ్ జెండర్–బేస్డ్ (ఎస్జీబీవి) నివారించడానికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ‘హింస నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి మేము అండగా ఉంటాం. క్షేత్రస్థాయిలోకి వెళ్లి జెండర్–బేస్డ్ వయొలెన్స్ అంటే ఏమిటి అనేదాని గురించి అవగాహన కలిగించడం, ప్రాణాలతో బయటపడిన వారికి ఎలా సహాయపడవచ్చో చెప్పడం, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ కష్టాల్లో ఉన్నవారికి ఎలా అండగా ఉండవచ్చో చెబుతాం’ అంటున్న రసిక విద్యాలయాల నుంచి కాలనీ వరకు ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. (పాల వ్యాపారంతో ఏడాదికి రూ.3 కోట్లు సంపాదన: రేణు విజయ గాథ)న్యాయ, వైద్యసహాయం, పోలీసు సహాయం కోసం వన్–స్టాప్ సెంటర్లకు రూపకల్పన చేయనుంది. ‘ఇమార’ ఫౌండేషన్ కోసం ఫెమినిస్ట్ రిసెర్చర్ కృతి జయకుమార్ మార్గదర్శకంలో ఎంతోమంది వాలెంటీర్లు, ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది రసిక. ఆర్థిక వేధింపులు, బలవంతపు గర్భస్రావం....ఇలా ఎంతో మంది బాధితులు ‘ఇమార’ను సంప్రదిస్తున్నారు.‘వరల్డ్ పల్స్ ప్లాట్‌ఫామ్’ ద్వారా ఆఫ్రికాలోని మానవ అక్రమ రవాణా బాధితురాలు ఒకరు రసికను సంప్రదించారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారు తనను లక్ష్యంగా చేసుకొని ఎలా కష్టపెడుతున్నారో చెప్పింది. కొన్నేళ్ళుగా వారి చెరలో ఉన్న బాధితురాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి బయటికి రావడానికి భద్రతను కోరింది. ‘ఇం పాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు పల్లవి ఘోష్ సహాయ సహకారాలతో బాధితురాలిని, ఆమె పిల్లలను చెర నుంచి విముక్తి కలిగించగలిగింది రసిక. అయితే బాధితురాలి కష్టాలు అక్కడితో ఆగిపోలేదు. కొత్త దేశంలో ఆహారం, ఆశ్రయం, ఆర్థిక సమస్యలలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ఇది తెలుసుకొని యాంటీ ట్రాఫికింగ్ న్యాయవాదుల సహకారంతో గ్లోబల్ నెట్వర్కింగ్ ద్వారా ఆమెకు ఎలాంటి సమస్యలు లేకుండా చేసింది రసిక. ఇప్పటి వరకు ఏడు వందల మందికి పైగా బాధితులకు ‘ఇమార’ సహాయ సహకారాలు అందించింది. ధైర్యాన్ని ఇచ్చింది. (భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!)కెనడాలో పుట్టిన రసిక ఎనిమిదేళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి భారతదేశానికి తిరిగివచ్చింది. తమ కుమార్తెలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మధ్య పెరగాలనే తల్లిదండ్రుల కోరికే వారు భారత్‌కు తిరిగిరావడానికి కారణం. చెన్నైలో డిగ్రీ చేసిన రసిక టొరంటోలోని యార్క్ యూనివర్శిటీలో పై చదువులు చదివింది. శరణార్థుల హక్కులు, వలస హక్కులు, లింగ–ఆధారిత హింస(జెండర్ బేస్డ్ వయొలెన్స్) చుట్టూ కేంద్రీకృతమైన మానవ హక్కులకు సంబంధించి ఇంటర్న్‌షిప్ చేసింది. జెండర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్‌లలో పనిచేసింది.‘ఏ స్వచ్ఛంద సంస్థకు అయినా నిధుల సమీకరణకు సంబంధించి మొదటి మూడేళ్లు కష్టకాలం’ అంటున్న రసిక సుందరం తన కుటుంబం, స్నేహితులు ఇచ్చిన డబ్బుతో ‘ఇమార’ను నడుపుతోంది. ‘ఒక్క క్లిక్‌తో డేటాబేస్‌ను బాధితులు యాక్సెస్ చేసే యాప్‌ను రూపొందించడంపై దృష్టి పెట్టింది .లింగ ఆధారిత హింసను అంతం చేయడం కోసం పని చేస్తున్న ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటుంది రసిక సుందరం. -
కార్మికులను ఆదుకునేందుకు గనిలోకి వలెంటీర్లు
దక్షిణాఫ్రికాలో బంగారు గనిలో అక్రమ మైనింగ్ ఉదంతం ముదురు పాకాన పడుతోంది. నార్త్‌వెస్ట్ ప్రావిన్స్‌లో మూసేసిన స్టీల్ఫాంటీన్ గనిలో 4 వేల మంది దాకా కార్మికులు చిక్కుకుపోవడం తెలిసిందే. వారిని అరెస్టు చేసేందుకు పోలీసు లు భారీగా మోహరించారు. ఆహారం తది తరాలు అందకుండా అడ్డుకుంటున్నారు. ‘‘దాంతో మరో దారిలేక వారే బయటకు వస్తారు. రాగానే అరెస్టు చేస్తాం. అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి కఠిన చర్యలు తప్పవు’’అని అధికారులు చెబున్నారు. ఈ ఉదంతం దక్షిణాఫ్రికాలోనే గాక అంతర్జాతీయంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. ప్రాణాలు నిలుపుకోవడానికి మరో దారి లేక కార్మికులు టూత్‌పేస్టు తింటూ, వెనిగర్ తాగుతున్నారన్న వార్తలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఇంకొద్ది రో జులు గడిస్తే వాళ్లు పూర్తిగా నీరసించి స్పృహ తప్పవచ్చంటున్నారు. ప్రభుత్వ చర్యలు హత్యాయత్నానికి ఏమాత్రం తీసిపోవంటూ హక్కుల సంస్థలు మండిపడుతున్నాయి. జీవించే హక్కును కాలరాసే అధికారం సహా ఎవరికీ లేదని వాదిస్తున్నాయి. అధికారులు మాత్రం చిక్కుబడ్డ కార్మికుల్లో పలువురి వద్ద ఆయుధాలుండే ఆస్కారం కూడా ఉందని చెబుతున్నారు. మరోవైపు కార్మికుల్లో పలువురు అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారే కావడంతో కఠిన శిక్షలకు భయపడి బయటికొచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. చాలామంది స్వచ్ఛంద కార్యకర్తలు ఆహారంతో పాటు నిత్యావసరాలు వెంట తీసుకుని భూగర్భ గనిలోకి ప్రవేశించారు. వారు 50 మందితో కూడిన బృందాలుగా లోనికి వెళ్తున్నారు. కార్మికులకు ఆహారం తదితరాలు అందించడమే గాక వారికి నచ్చజెప్పి బయటికి తీసుకొచ్చే పనిలో కూడా పడ్డారు. వాళ్లలో చాలామంది పూర్తిగా నీరసించిపోయిన స్థితిలో ఉండటంతో ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చేందుకు గంటకు పైగా పడుతోందట. గనిలో పలు మృతదేహాలను కూడా వలెంటీర్లు గుర్తించినట్టు సమాచారం. అవి కుళ్లి కంపు కొడుతున్నట్టు చెబుతున్నారు! గత వారం రోజుల్లో 1,000 మంది దాకా కార్మికులు బయటికొచ్చి లొంగిపోయారు. దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ భారీ ఎత్తున జరుగుతుంటుంది. ఫలితంగా ఖజానాకు వందలాది కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా వాటిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కొన్నేళ్లలో వందలాది గనులను మూసేయడంతో అప్పటిదాకా వాటిలో పని చేసిన కార్మికులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. బతుకుదెరువు కోసం అక్రమ మైనింగ్‌కు పాల్పడే ముఠాల చేతిలో చిక్కుతున్నారు. ఆ క్రమంలో నెలల తరబడి భూగర్భంలో గడుపుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ ఫుడ్స్ తింటే అంతే..షాకింగ్ స్టడీ! టాక్స్ విధించండి బాబోయ్!
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ప్రమాదకరమన్న తాజా సంచలన నివేదికల నేపథ్యంలో అటువంటి ఆహారాలపై పన్ను విధించాలంటూ మహారాష్ట్రలోని స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు, మనస్తత్వ వేత్తలతోకూడిన సంఘాలు కేంద్ర వినియోగ దారుల వ్యవహారాల మంత్రి, ఆహార మంత్రికి విన్నవించాయి. అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు , కొవ్వుతో కూడిన అధిక ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలపై పన్ను విధించాలని కోరుతూ ఎర్లీ చైల్డ్‌హుడ్ అసోసియేషన్ (ECA) , అసోసియేషన్ ఫర్ ప్రిపరేటరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (APER), కేంద్రమంత్రికి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశాయి. తద్వారా పాఠశాలల్లో చాక్లెట్లు, కేకులు, కుకీలు , పుట్టినరోజులు మరియు ఈవెంట్ల వంటి ఇతర వస్తువుల వినియోగం, పంపణీ ఆగిపోతుందని నమ్ముతున్నారు. ఈ పదార్థాల స్థానంలో తాజాపండ్లను చేర్చుకోవాలని కూడా ప్రజల్ని, పాఠశాలల్ని కోరారు. వీరి డిమాండ్లు ♦ అన్ని ఫుడ్ చెయిన్స్, రెస్టారెంట్లు మెనూలు, ప్యాకేజింగ్ , ప్రతీ బాక్సుపైనా ఉప్పు-చక్కెర-కొవ్వు శాతం వివరాలను తప్పనిసరిగా ప్రింట్ చేయాలి. ఉప్పు-చక్కెర-కొవ్వుతో సహా వీటి స్థాయి ఎక్కువుంటే ఎరుపు రంగు, మధ్యస్థానికి గుర్తుగా కాషాయం, తక్కువగా ఉంటే ఆకుపచ్చ రంగుల లేబులింగ్ ఉండాలి. ♦ బ్రాండ్ పేరు లేదా రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌తో రెస్టారెంట్లు విక్రయించే బర్గర్లు, పిజ్జాలు, టాకోలు, డోనట్స్, శాండ్విచ్లు, పాస్తా, బ్రెడ్ ఫిల్లింగ్‌లపై పరోక్ష కొవ్వు కంటెంట్ పన్ను 14.5 శాతం విధించాలి. ♦ చక్కెరపై ఆరోగ్య పన్నును ప్రవేశపెట్టాలి. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల వినియోగం చాలా ప్రమాదకరమని, ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని సైంటిస్టులు ఇటీవల హెచ్చరించారు. వీటితో ప్రాణాలకే ప్రమాదం వస్తుందని ఇటీవల అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఏకంగా 32 రకాల ప్రమాదకర వ్యాధులు వస్తాయని కూడా వెల్లడించారు. ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్, ఐర్లాండ్ దేశాలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కోటి మందికి పైగా వ్యక్తులపై జరిపిన అధ్యాయంలో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలతో వస్తున్న ముప్పుపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటీష్ జర్నల్ ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో మానసిక, శ్వాసకోశ , హృదయ, జీర్ణకోశ సమస్యలు వస్తాయని, మొత్తం 32 ప్రమాదకర వ్యాధులు వస్తాయి. మరణాలు సంభవించిన కేసులు కూడా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం ఉందని వారు నొక్కి చెప్పారు. అంతేకాదు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌తో 50 శాతం పెరుగుతుందని కూడా హెచ్చరించారు. డిప్రెషన్ 22 శాతం అధికంగా పెరిగే అవకాశం ఉందట. అల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌లో విటమిన్లు, పీచు తక్కువ, ఉప్పు, చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటాయి, అందుకే కేన్సర్, గుండె వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, మానసిక అనారోగ్యం తోపాటు, మెటబాలిజంకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని ఈ స్టడీ పేర్కొంది. -
విశాఖ మధురవాడ ఎన్జీవోస్ కాలనీలో సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
త్వరలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ పేరు మార్పు
సాక్షి, అమరావతి: ఇప్పటివరకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌గా ఉన్న తమ సంఘం పేరును త్వరలో ఏపీ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఎన్జీజీవో) అసోసియేషన్‌గా మార్పు చేయనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రకటించారు. సంఘం రాష్ట్ర 21వ కౌన్సిల్ సమావేశాల్లో రెండో రోజు ఆయన మాట్లాడారు. సంఘం పేరు మార్చేందుకు తీర్మానం చేసినట్లు చెప్పారు. గెజిటెడ్ అధికారులకు సంఘంలో సభ్యత్వం ఇచ్చేందుకు అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపారు. గతంలో తమ సంఘంలో ఉన్న ఉద్యోగులు కొందరు గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకులోకి వెళ్లారని, దీంతో వారిని కూడా సంఘంలో చేర్చుకోవాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచామని, వీలైనంత వేగంగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించారు. ప్రభుత్వంతో సామరస్యంగా ఉండి డిమాండ్లను సాధించుకుంటామన్నారు.సంఘం నిర్వహించే మహాసభలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించడం 7 దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోందని, అందులో భాగంగానే సీఎం జగన్‌ను ఆహ్వానించామని చెప్పారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేందుకు ప్రభుత్వం అంగీకరించడం శుభ పరిణామమన్నారు. కౌన్సిల్ సమావేశాల ముగింపు సందర్భంగా జిల్లాల పునర్విభజనతో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు కొత్త కార్యవర్గాలను ఎన్నుకోవాలని, మరింత మంది మహిళలకు నూతన కార్యవర్గంలో చోటు కల్పించాలని తీర్మానించారు. ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు సురేష్ లాంబ, 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు పాలనలో ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేశారు'
అమరావతి: చంద్రబాబు తన హయాంలో ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఉద్యోగుల పట్ల చంద్రబాబుకు చులకన భావం ఉందని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులతో అడ్డగోలుగా వ్యవహరించిందని విమర్శించారు. విజయవాడలో జరుగుతున్న ఏపీ ఎన్జీవో 21 రాష్ట్ర మహాసభలకు ప్రత్యేక అతిధిగా సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘం సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లులు కురిపించారు. ఉద్యోగులకు వరాలు.. సోమవారం ఏపీ ఎన్జీవో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్.. ఉద్యోగులపై వరాల జల్లులు కురిపించారు. పెండింగ్‌లో ఉన్న డీఏను దసరా కానుకగా ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. హెల్త్ సెక్టార్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఐదు రోజుల క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. 2019 నుంచి 3 లక్షల 19 వేల ప్రభుత్వ ఉద్యోగులను నియమించామని స్పష్టం చేశారు. 53 వేల మంది హెల్త్ సెక్టార్లో నియమించామని అన్నారు. 2,06,668 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని సీఎం జగన్ తెలిపారు. వేతనాలపై రూ.3,300 కోట్లు ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు రాసిన 'మనసులో మాట' పుస్తకాన్ని ఉటంకిస్తూ.. ఉద్యోగుల గురించి చంద్రబాబుకు దారుణమైన అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. బాబు దృష్టిలో కొందరే మంచోళ్లు అందరూ లంచగొండులేనని అన్నారు. ఉద్యోగులను నిందించే హక్కు ఆయనకు ఎవరిచ్చారని మండిపడ్డారు. అలాంటి బాబు ఉద్యోగులకు మంచి చేయగలడా? అలోచించాలని ఉద్యోగులను ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని సీఎం జగన్ అన్నారు. మొక్కుబడిగా కొన్ని మాత్రమే ఉద్యోగులకు మిగిల్చారని దుయ్యబట్టారు. బాబు హయాంలో దాదాపు 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశారని చెప్పారు. బాబు కాలంలో ఆర్టీసీ పరిస్థితి ఏంటి?.. పాఠశాలల దుస్థితి ఎలాంటిది? అలాంటివారు ఉద్యోగులకు న్యాయం చేయగలరా? అని ప్రశ్నించారు. బాబు, ఆయన వర్గానికి తమ ప్రభుత్వంపై కడుపు మంట అని సీఎం జగన్ మండిపడ్డారు. గ్యారెంటీ పెన్షన్ స్కీం.. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గ్యారెంటీ పెన్షన్ స్కీంను అమలులోకి తెచ్చిన్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. జీపీఎస్ స్కీంకు త్వరలో ఆర్డినెన్స్ వస్తుందని చెప్పారు. జీపీఎస్ దేశంలోనే విప్లవాత్మకమైన నిర్ణయమని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తినని సీఎం జగన్ చెప్పారు. రిటైరయ్యాక ఉద్యోగులకు మంచి జరగాలనే ఈ స్కీం తీసుకొచ్చినట్లు వెల్లడించారు. దేశంలో ఈ స్కీం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఉద్యోగులే వారదులు.. అభివృద్ధి, సంక్షేమంలో తమది ప్రజా ప్రభుత్వం అని సీఎం జగన్ అన్నారు. ప్రజలకు పప్రభుత్వాలకు మధ్య ఉద్యోగులు వారదులని చెప్పారు. ఏ ప్రభుత్వంతో పోల్చినా మెరుగ్గానే ఉన్నామని అన్నారు. అన్ని సేవలను గ్రామస్థాయికి విజయవంతంగా చేర్చామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఎల్లప్పుడు సానుకూలంగానే ఉందని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ గురించి అందిరికీ తెలుసని అన్నారు. 2019 నుంచి ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చిత్తశుద్దిని చాటుకున్నట్లు వెల్లడించారు. పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 వరకు పెంచామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిజాయితీగా కమిట్మెంట్తో ఉన్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల వలె కాకుండా ఎన్నికలతో సంబంధం లేకుండా జీతాలు పెంచామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశామని అన్నారు. గత ప్రభత్వాలు 6 న కరోనా సమయంలోనూ.. కోవిడ్ టైంలో రెవెన్యూ తగ్గినా డిబీటీని అమలు చేసిన ప్రభుత్వం తమదని సీఎం జగన్ అన్నారు. దేశానికే ఆదర్శంగా పాలన చేస్తున్నామని చెప్పారు. ఎక్కడా వివక్ష, లంచాలకు తావివ్వలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు వదిలేసిన కారుణ్య నియామకాల్లో పారదర్శకత పాటించామని తెలిపారు. పదివేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలోనూ ఎక్కడా వెనక్కి తగ్గలేదని చెప్పారు. మినిమం టైం పేస్కేల్.. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రక్షించి కార్మికులకు తోడుగా ఉన్నామని సీఎం జగన్ అన్నారు. ఉద్యోగుల ముఖంలో చిరునవ్వును చూడటమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేశామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం పేస్కేల్ అచ్చామని వెల్లడించారు. నెల మొదటి వారంలోనే జీతాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి చోట దళారి వ్యవస్థను నిర్మూలించామని స్పష్టం చేశారు. ప్రభుత్వ బడులు భేష్.. ప్రస్తుతం గ్రామ స్థాయిలో గవర్నమెంట్ బడులు కార్పొరేట్ ప్రమాణాలతో నడుస్తున్నాయని సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసిందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులను నాశనం చేసిందని అన్నారు. జిల్లాల విభజనతో పాలన ప్రజలకు మరింత దగ్గరైందని చెప్పారు. గత ప్రభుత్వాలు పక్కన పడేసిన అనేక సమస్యలకు పరిష్కారం చూపామని వెల్లడించారు. ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి ఏపీ ఎన్జీవో మహాసభలు జరుగుతుంటాయి. సంఘం ఆవిర్భావం జరిగిన నాటి నుంచి ఈ మహాసభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి జరుగుతున్న మహాసభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తోపాటు పలువురు మంత్రుల, ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇదీ చదవండి: పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం -
111 రద్దుపై సుప్రీంకోర్టుకు..!
సాక్షి, హైదరాబాద్: జంట జలాశయాల పరిరక్షణ కోసం తెచ్చి న జీవో 111ను పూర్తిగా తొలగించడంపై స్వచ్ఛంద సంస్థలు న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నాయి. భావితరాల కోసం జంట జలాశయాలను కాపాడుకోవలసిన అవసరముందంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చి న సూపర్ ఆర్డర్‌ను ధిక్కరించి ప్రభుత్వం జీవోను ఎత్తివేయడం పట్ల పర్యావరణ పరిరక్షణ సంస్థలు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వం జీవోను ఎత్తివేయడంపై ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం దూరదృష్టితో జీవో 111ను సమర్థించిందని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయకుండానే ఏ విధమైన అధ్యయనం లేకుండానే జీవోను తొలగించిందన్నారు. జీవో 111పై తాము ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను త్వరలో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. పర్యావరణానికి ముప్పు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లు రాజధాని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా భారీ వరదల నుంచి నగరాన్ని కాపాడుతున్నాయి. 1908లో నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు మరోసారి అలాంటి వరదల వల్ల నష్టపోకుండా ఉండేందుకు అప్పటి చీఫ్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు ఈ రెండు జలాశయాలను నిర్మించారు. 1912లో మొదట గండిపేట్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి 1917లో పూర్తి చేశారు. ఆ తరువాత 1921లో హిమాయత్‌సాగర్ నిర్మాణం ప్రారంభించి 1927 నాటికి వినియోగంలోకి తెచ్చారు. గ్రావిటీ ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందిస్తున్న ఈ రిజర్వాయర్ల నుంచి ఇప్పటికీ 65 మిలియన్ గ్యాలన్ల నీరు లభిస్తోంది. ప్రస్తుతం ఇవి స్వచ్ఛమైన వర్షపునీటితో నిండి ప్రజలకు అంతే స్వచ్ఛమైన జలాలను అందిస్తున్నాయి. ‘గోదావరి జలాల వల్ల భూగర్భ నీటిమట్టం పెరగదు. గతంలో నిర్మించిన ఏ ఎస్టీపీలు, రింగ్మెయిన్లు చెరువులను కాపాడలేకపోయాయి. ఇప్పటి కే నగరంలో వందలాది చెరువులు మాయమయ్యాయి. భవిష్యత్‌లో ఈ జలాశయాలు దెబ్బతింటే భూగర్భ జలాలు అడుగంటుతాయి. భూతాపం విపరీతంగా పెరుగుతుంది’అని నిపుణులు చెబుతున్నారు. జీవవైవిధ్యానికి హాని ఈ జలాశయాల వల్ల కొన్ని వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో జీవవైవిధ్యానికి రక్షణ లభిస్తుంది. అనేక రకాల పక్షులు, వన్యప్రాణులు మనుగడ సాగిస్తున్నాయి. జీవో 111 ఎత్తివేయడంతో జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. మృగవనం పార్కుకు నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పెరిగిన భారీ నిర్మాణాల వల్ల ఎన్నో విలువైన పక్షి జాతులు అంతరించాయి. భవిష్యత్తులో ఈ ముప్పు ఇంకా ఎక్కువవుతుంది. ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది హైదరాబాద్‌ను వరదల బారి నుంచి కాపాడేందుకు అప్పటి నిజాం నవాబు కట్టించిన జంట జలాశయాలు నగరాన్ని భూతా పం నుంచి రక్షిస్తున్నాయి. జీవ వైవిధ్యా న్ని రక్షించుకొనేందుకూ దోహదం చేస్తున్నాయి. జీవో 111ను ఎత్తివేసి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది. సహజవనదరులను, జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేయడం ఏ విధంగా కూడా ప్రజా సంక్షేమం కాదు. – లూబ్నా సార్వత్, సామాజిక కార్యకర్త సూపర్ ఆర్డర్‌ను ఎలా ధిక్కరిస్తారు ఏ నగరంలో అయినా 20 శాతం నీటి వనరులు ఉండాలి. కానీ హైదరాబాద్‌లో వందలాది చెరువులు మాయమయ్యాయి. భవిష్యత్‌లో ఈ జలాశయాలు కూ డా అలాగే మాయమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, సంపన్నులకు కొమ్ముకాసే పాలకులు పర్యావరణాన్ని కాపాడుతారనుకోవడం భ్రమే అవుతుంది. గతంలోనూ జీవోకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్లినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాం. జీవో 111ను సమర్థిస్తూ 2000 సంవత్సరంలో సుప్రీంకో ర్టు సూపర్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని ఎలా ధిక్కరిస్తారు. న్యాయనిపుణుల తో చర్చిస్తున్నాం. మరోసారి కోర్టుకెళ్తాం. – ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి -
మూడేళ్లలో రూ.2,430 కోట్లు
న్యూఢిల్లీ: గత మూడేళ్లకాలంలో భారతీయ ఎన్జీవో సంస్థలు విదేశాల నుంచి విరాళాల రూపంలో రూ.2,430.80 కోట్లను స్వీకరించాయని కేంద్రం వెల్లడించింది. బుధవారం రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ వివరాలు చెప్పారు. 2019–20లో రూ.727.1 కోట్లు, 2020–21కాలంలో రూ.798.1 కోట్లు, 2021–22కాలంలో రూ.905.5 కోట్ల విరాళాలు పొందాయని పేర్కొన్నారు. ఈ నెల పదోతేదీ నాటికి దేశవ్యాప్తంగా 16,383 ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయని తెలిపారు. వీటిలో దాదాపు 15వేల సంస్థలు 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక నివేదికలను సమర్పించాయి. కొన్ని సంస్థల నిధుల దుర్వినియోగం/ నిధుల మళ్లింపుపై ఫిర్యాదుల నేపథ్యంలో చర్యల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. -
ఉద్యోగుల మధ్య సూర్యనారాయణ చిచ్చు పెడుతున్నాడు: బండి శ్రీనివాస్
-
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ఎన్జీవో పాత్ర?
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) పాత్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు విచారణకు హాజరుకావాలని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం.విజయ్మాదిగకు సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన విచారణాధికారి ముందు శనివారం హాజరయ్యా రు. కేసులోని నిందితులతో ఉన్న సంబంధాలపై అధికారులు ఆయనను ప్రశ్నించారు. కేసుతో తన కుగానీ, సంస్థకు గానీ ఎలాంటి సంబంధమూ లేదని దాటవేసినట్లు తెలిసింది. అధికారులు సాంకేతిక ఆధారాలు చూపించడంతో జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం. విజయ్.. గతంలో నగరానికి చెందిన ఓ సామాజికవర్గ రిజర్వేషన్ల పోరాట సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతాప్‌గౌడ్ బ్యాంకు లావాదేవీలపై ఆరా.. అంబర్‌పేటకు చెందిన న్యాయవాది పోగులకొండ ప్రతాప్‌గౌడ్ రెండో రోజూ విచారణకు హాజరయ్యారు. నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్‌లతో జరిపిన పలు బ్యాంకు లావాదేవీలపై ప్రతాప్‌ను ప్రశ్నించగా.. ఆయన మౌనం వహించినట్లు తెలిసింది. దీంతో బ్యాంక్ స్టేట్మెంట్లు, ఇతరత్రా సాంకేతిక ఆధారాలను ఆయన ముందు పెట్టగా.. వ్యక్తిగత అవసరాల కోసం ఆయా మొత్తాన్ని వారికి ఇచ్చానని సమాధానమిచి్చనట్లు తెలుస్తోంది. చాలా ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఆ ‘35’పై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ -
SWAS NGO వ్యవస్థాపకుడు కరింగుల ప్రణయ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
స్వయంకృషి: ఇష్టమైన పనులతో కొత్తమార్గం...
పడుతున్న కష్టమే మనకు బతుకుదెరువును నేర్పుతుంది. కొత్తగా ఆలోచించమంటుంది. ఒంటరి గడపను దాటుకొని నలుగురిలో కలవమంటుంది నేనుగా ఉన్న ఆలోచనల నుంచి మనంగా మూటగట్టుకొని సమష్టిగా పయనం సాగించమంటుంది. శ్రీకాకుళం, తిరుపతి నుంచి హైదరాబాద్ లోని ఒక ఎన్జీవో ప్రోగ్రామ్‌కి ఎవరికి వారుగా వచ్చారు శోభారాణి, ప్రమీల, దేవి, అరుణ, పద్మ, చైతన్య... గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ మహిళలు తమ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ఒక్కరుగా ఎదగడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు కలిసికట్టుగా పనిచేద్దాం అని తమకై తాముగా కొత్త మార్గం వేసుకుంటున్నారు. సైదాబాద్‌లోని యాక్సెస్ లైవ్లీ హుడ్‌లో మహిళా సాధికారత కోసం అక్కడి వారు చేస్తున్న పనుల గురించి తెలుసుకోవడానికి వెళ్లినప్పుడు ఓ ఆసక్తికరమైన సంభాషణ మమ్మల్ని ఆకర్షించింది. ‘నేను మళ్లీ హైదరాబాద్‌కు వచ్చే టైమ్‌కి నా మిల్లెట్ లడ్డూలను ప్లాస్టిక్ బాక్స్‌ల్లో కాకుండా ఆర్గానిక్ స్టైల్ బాక్స్‌ల్లో తీసుకువచ్చి మార్కెటింగ్ చేస్తా..’ అని తన పక్కనున్నవారితో చెబుతోంది ఓ అమ్మాయి. ‘‘నేను కూడా శానిటరీ ప్యాడ్స్‌ను అలాగే తయారుచేసి తీసుకువస్తా’’ అంది మరో మహిళ. ‘మీ బనానా చిప్స్... మాకు పంపించండి. మా దగ్గర మార్కెట్ చేస్తా!’ అని ఇంకో మహిళ మాట్లాడుతోంది. వారితో మేం మాటలు కలిపినప్పుడు వారి గ్రూప్‌లోకి మమ్మల్నీ అంతే సాదరంగా కలుపుకున్నారు. ‘ఇల్లు నడుపుకోవాలన్నా, పిల్లలను చదివించుకోవాలన్నా మేమూ ఏదో పని చేసుకోవాలనుకున్నవాళ్లమే..’ అంటూ తమ గురించీ, తాము చేస్తున్న పనుల గురించి ఆనందంగా వివరించారు. మిల్లెట్ లడ్డూలను తయారుచేస్తున్నది మీనా. శానిటరీ న్యాప్కిన్ల గురించి, మిల్లెట్ మిక్స్‌ల గురించి వివరించింది ప్రమీల. వీరిద్దరూ తిరుపతి నుంచి వచ్చినవాళ్లు. ‘నేను బనానా చిప్స్ చేస్తాను’ అని శ్రీకాకుళంలోని సీతం పేట నుంచి వచ్చిన శోభారాణి చెబితే, రాగి బిస్కెట్లను, రాగులకు సంబంధించిన ఉత్పత్తులను తయారుచేస్తుంటాను’ అని చెప్పింది బ్రాహ్మణ మండలం నుంచి వచ్చిన అరుణ. ‘హోమ్మేడ్ స్నాక్స్ చేసి అమ్ముతుంటాను’ అని వివరించింది దేవి. తిరుపతిలో న్యూట్రిషనిస్ట్‌గా డిప్లమా చేసిన చైతన్య మల్టీ మిల్లెట్స్ ప్రొడక్ట్స్‌ని మార్కెటింగ్ చేస్తోంది. కరోనా సమయంలో... ప్రమీల మాట్లాడుతూ –‘మా ఆయనది ప్రైవేటు ఉద్యోగం. కరోనా కారణంగా పోయింది. పిల్లల చదువు, కుటుంబ పోషణకు ఏం చేయాలో అర్ధం కాలేదు. దీంతో ఉదయాన్నే రాగి జావ చేసి, దగ్గరలో ఉన్న పార్క్ దగ్గరకు వెళ్లి కూర్చోనేదాన్ని. మొదట్లో ఎవరు కొంటారో.. అనుకునేదాన్ని. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ నేను చేసే రాగి జావకు డిమాండ్ పెరిగింది. దీంతో పాటు మొలకెత్తిన గింజలు కూడా పెట్టి అమ్మేదాన్ని. తెల్లవారుజామున మూడు గంటల నుంచి నా పని మొదలవుతుంది. మా చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ఆడవాళ్లు కూడా మాకూ పని ఇప్పించమంటే, ఇదే పని నేర్పాను. తయారుచేసుకున్నది పార్క్‌ల వద్దకు తీసుకెళ్లి అమ్మడం, అలా వచ్చిన ఆదాయాన్ని వాళ్లకూ పంచడం.. కరోనా సమయం నుంచి చేస్తున్న. దీంతో పాటు రకరకాల మల్టీగ్రెయిన్ మిక్స్‌లు, డ్రింక్స్ స్వయంగా చేసి అమ్ముతున్నాను. ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ కూడా సొంతంగా తయారుచేస్తున్నాను. దీని వల్ల నాకే కాదు, మా దగ్గర ఉన్న కొంత మంది ఆడవాళ్లకైనా పని ఇప్పించగలుగుతాను’ అని వివరిస్తుంటే కష్టం నేర్పిన పనిలో ఉన్న తృప్తి ఆమె మోములో కనిపించింది. కూలీ పనుల నుంచి... శ్రీకాకుళం నుంచి వచ్చిన శోభారాణి మాట్లాడుతూ ‘మా దగ్గర అటవీ ఉత్పత్తులు ఎక్కువ. కానీ, వాటికి మా దగ్గర పెద్దగా మార్కెట్ లేదు. వాటి మీద మంచి ఆదాయం వస్తుందన్న విషయం కూడా నాకు అంతగా తెలియదు. కూలీ పనులకు వెళ్లేదాన్ని. ఏడాదిగా అరటికాయలతో చిప్స్ తయారీ చేసి అమ్ముతున్నాను. వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఆర్డర్ల మీద పంపిస్తున్నాను. ఎగ్జిబిషన్లలోనూ పాల్గొంటున్నాను. మా ఊళ్లో జరిగిన మహిళా సంఘాల కార్యక్రమాల్లో ‘మీ దగ్గర దొరికే ఉత్పత్తులతో ఏమైనా తయారుచేయచ్చు’ అంటే నేనిది ఎంచుకున్నాను. ఎక్కడా దొరకని స్పెషల్ అరటికాయలు మా ప్రాంతంలో లభిస్తాయి. వాటితోనే ఈ మార్గంలోకి వచ్చాను. మా ఇంటి దగ్గర ఉన్న ఇద్దరు వికలాంగులు నాకు ప్యాకింగ్‌లో సాయపడతారు. వారికి రోజుకు 200 రూపాయలు ఇస్తాను’ అని ఆనందంగా వివరించింది. కుటుంబ పోషణే ప్రధానంగా... ‘స్కూల్ ఏజ్‌లోనే పెళ్లవడం, పాప పుట్టడం.. ఆ తర్వాత వచ్చిన కుటుంబసమస్యలతో నా కాళ్ల మీద నేను నిలబడాలనే ఆలోచన కలిగింది’ అంటూ వివరించింది పాతికేళ్లు కూడా లేని మీనా. మిల్లెట్ లడ్డూల తయారీని సొంతంగా నేర్చుకుని, వాటిని మార్కెటింగ్ చేస్తోంది. మొదట ఇంటి చుట్టుపక్కల వాళ్లకే అమ్మేదని, తర్వాత్తర్వాత చిన్న చిన్న ఎగ్జిబిషన్స్‌లో పాల్గొనడం చేశాన’ని తెలియజేసింది. ‘‘కుటుంబాలను పోషించుకోవడానికే కాదు, మాకై మేం ఎదిగేందుకు, మాతో పాటు కొందరికి ఉపాధి ఇచ్చేందుకు మేం ఎంచుకున్న ఈ మార్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెళుతుంటాం..’’ అని వివరించారు దేవి, అరుణ. మిగతావారూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ‘ఈ పనిలో మా కుటుంబసభ్యులందరినీ పాల్గొనేలా చేస్తున్నాం. పనితో పాటు నెలకు సరిపడా ఆదాయం లభిస్తుంది. మా స్వశక్తితో మేం ఎదుగుతున్నాం అన్న ఆనందం కలుగుతుంది. మొదట్లో మాకెవ్వరికీ ఒకరికొకరం పరిచయం లేదు. మహిళా ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా కలుసుకున్నవాళ్లమే. మంచి స్నేహితులమయ్యాం. ఒకరి ఉత్పత్తులను మరొకరం ఆర్డర్ల మీద తెచ్చుకొని, మా ప్రాంతాలలో వాటినీ అమ్ముతుంటాం. ఎవరికి వారుగా వచ్చినా, ఈ ఏడాదిగా ఒకరికొకరం అన్నట్టుగా ఉన్నాం. మా వ్యాపారాలను పెంచుకునేందుకు, ఇక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాం’ అని వివరించారు. మొదటి అడుగు ఎప్పుడూ కీలకమైనదే. కష్టం నుంచో, ఎదగాలన్న తపన నుంచో పుట్టుకు వచ్చేదే. తమ ఎదుగుదలకు మద్దతుగా నిలిచే అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. మరెన్నో అడుగులు వేయడానికి సిద్ధమవుతున్న వీరిని మనసారా అభినందిద్దాం. – నిర్మలారెడ్డి ఫొటోలు: గడిగె బాలస్వామి -
4 సెకన్లకో ఆకలి చావు..
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా 45 దేశాల్లోని 34.5 కోట్ల మంది ప్రజలు తీవ్ర క్షుద్బాధతో తనువు చాలిస్తున్నారని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్(ఎన్జీవోలు) పేర్కొన్నాయి. రోజుకు 19,700 మంది వంతున ప్రతి సెకనుకు నలుగురు చొప్పున ఆకలితో చనిపోతున్నట్లు అందులో పేర్కొన్నాయి. 2019తో పోలిస్తే ఆకలి చావులు రెట్టింపయ్యాయని తెలిపాయి. 75 దేశాలకు చెందిన ఆక్స్‌ఫామ్, సేవ్ ది చిల్డ్రన్, ప్లాన్ ఇంటర్నేషనల్ వంటి 238 ఎన్జీవోలు ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశాలకు హాజరయ్యే ప్రపంచ దేశాల నేతల నుద్దేశించి లేఖ రాశాయి. ‘‘21వ శతాబ్దంలో కరువు పరిస్థితులను రానివ్వబోమంటూ ప్రపంచ నేతలు ప్రతినబూనినప్పటికీ సొమాలియాలో మరోసారి తీవ్ర కరువు తాండవిస్తోంది. 45 దేశాల్లోని మరో 5 కోట్ల మంది ప్రజలు కరువుకు చేరువులో ఉన్నారు’’ అని ఆ ప్రకటనలో తెలిపాయి. ‘కేవలం ఒక దేశం లేదా ఖండానికి సంబంధించింది కాదు. మొత్తం మానవాళికే జరుగుతున్న అన్యాయమిది’’ అని పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్త ఆకలి సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వాలు నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలని కోరాయి. ‘‘21వ శతాబ్దంలో కూడా కరువు గురించి మాట్లాడుకోవాల్సి రావడం దారుణం. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తక్షణమే ఆహారంతోపాటు దీర్ఘకాలం పాటు వారికి సాయం కొనసాగించడంలో ఏమాత్రం ఆలస్యం తగదు’’ అని పేర్కొన్నాయి. -
విరాళాలు సరిపోవు.. ఊతంగా నిలవాలి: పార్వతి నౌరియాల్
చిన్నచిన్న పదాలు, అంకెలు పలకడం, అర్థం చేసుకోవడం చిన్నారి పార్వతి నౌరియాల్‌కు చాలా కష్టమైంది. ‘‘చిన్నపిల్ల కదా నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది అని అనుకోలేదు తల్లిదండ్రులు. బద్దకస్తురాలు... ఏదీ వెంటనే నేర్చుకోదు’’ అని విసుక్కునేవారు. బుడిబుడి అడుగులతో, బుజ్జిమాటలతో ఆకట్టుకునే వయసులో అమ్మానాన్నల నిరాదరణకు గురైన ఆ చిన్నారి నేడు వందల మంది పిల్లలకు చదువు చెప్పడంతోపాటు, ఎంతోమంది సెక్స్వర్క్ర్లను వేశ్యావృత్తినుంచి బయటకు తీసుకువచ్చి గౌరవంగా బతికేందుకు అవకాశాలు కల్పిస్తోంది. మహారాష్ట్రకు చెందిన పార్వతి నౌరియాల్‌కు చిన్నతనంలో డిస్లెక్సియా సమస్య ఉండడంతో మూడేళ్లు వచ్చేంత వరకు పదాలు, అంకెలు కూడా సరిగా పలకలేక పోయేది. స్కూలుకెళ్లి చదువుకోవాల్సి వస్తుందని ఇలా చేస్తుంది అని చిరాకుపడుతుండేవారు తల్లిదండ్రులు. అయితే అదేమీ పట్టించుకోకుండా చదువుకుంటూ అతికష్టం మీద పదోతరగతి పాసయ్యింది పార్వతి. టెంత్ తరువాత పార్వతి డిస్లెక్సియాతో బాధపడుతోందని ఆమె తల్లి గుర్తించింది. అప్పటి నుంచి ఆమె వెన్నంటే ఉండి సమస్యను అధిగమించేందుకు సాయం చేసింది. పార్వతి తల్లి చదువుకోకపోయినప్పటికీ చదువు విలువ తెలియడం వల్ల తన పిల్లలతోపాటు, సమీపంలోని మురికివాడల్లోని అమ్మాయిలను చదివించమని పదేపదే చెబుతుండేది. తల్లి ప్రోత్సాహమే తనను ఇప్పుడు సమాజ సేవకురాలిగా నిలబెట్టిందని చెబుతుంది పార్వతి. ట్రిప్ నుంచి తిరిగి వస్తుండగా.. చక్కగా చదువుకుని విపత్తు నిర్వహణల ఉద్యోగం చేస్తోన్న పార్వతి 2015లో ఒకసారి కర్జత్ ట్రిప్‌కు వెళ్లింది. ట్రిప్ పూర్తిచేసుకుని అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఆమెకు కొంతమంది బాలకార్మికులు కనిపించారు. బాలలతో పనిచేయించకూడదని చట్టాలు చెబుతున్నప్పటికీ అక్కడ అంతమంది బాలకార్మికులు కనిపించడం విచిత్రంగా అనిపించింది. ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోలు సైతం వారిని చూసీ చూడనట్లు వదిలేయడం తనకు నచ్చలేదు. బాలకార్మికుల కష్టాలను తీర్చేందుకు అధికారులను కలిసి వారి దైన్యస్థితిని గురించి వివరించింది. నెలరోజులు తిరిగాక ఓ వ్యాపార వేత్త .. బాలకార్మికులకు వారాంతాల్లో చదువు చెప్పించడానికి టీచర్లను నియమించాడు. దీంతో కర్జత్‌లోని పిల్లలు చదువుకోవడం ప్రారంభించారు. 139 మంది బాలకార్మికులు బడిబాట పట్టడం ఎంతో సంతోషాన్నిచ్చింది. కోవిడ్ తర్వాత కామటిపురాకు... వందకుపైగా బాలకార్మికులని విద్యార్థులుగా మార్చిన ఆనందంలో మరింత మందిని చదివించాలని నిర్ణయించుకుంది పార్వతి. అప్పుడే కోవిడ్ కారణంగా లాక్డౌన్ విధించడంతో పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారాయి. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత ఉద్యోగాలు కోల్పోయిన అనేక మంది కుటుంబాలను కలిసింది. కుటుంబపోషణకు ఆధారం లేక చావే శరణ్యమంటోన్న అనేకమంది కన్నీటి బాధలు వింటోన్న సమయంలో ఓ నిరుపేద తల్లిదండ్రులు తమ కుమార్తెని పెంచే స్థోమతలేక కామటిపురాకు అమ్మేసినట్లు తెలిసింది. అప్పుడు ఆ అమ్మాయిని ఎలాగైనా రక్షించాలని నిర్ణయించుకుని కామటి పురాలో అడుగుపెట్టింది. అక్కడ ఎంత వెతికినా ఆ అమ్మాయి కనిపించలేదు కానీ, అక్కడ బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నలుగురు అమ్మాయిలను చేరదీసి సొంత డబ్బుతో శిక్షణ ఇప్పించి, వేశ్యావృత్తిని వదిలేలా చేసింది. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వేశ్యావృత్తిలోకి బలవంతంగా వస్తోన్న వారిని బయటకు తీసుకువచ్చి, వారికి వివిధ రకాల వృత్తులలో శిక్షణæఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇలా ఇప్పటిదాకా వెయ్యిమందిని కామటిపురా నుంచి బయటకు తీసుకువచ్చి సమాజంలో గౌరవంగా బతికేలా చేసింది. వీరిలో ఎక్కువమంది చిన్నవయసు అమ్మాయిలు ఉన్నారు. వీరి పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ అక్కడి వారికి తన వంతు ఊతం ఇస్తోంది పార్వతి. విరాళాలు కాదు ప్రేరణగా నిలవాలి ‘‘సమాజానికి ఎంతోకొంత తిరిగిచ్చేయాలని..మన దగ్గర ఉన్న డబ్బును దానాలు, విరాళాలుగా ఇవ్వడం, లేదా ఎన్జీవోలతో కలిసి కొంతకాలం పనిచేస్తే సరిపోదు. మరణించేలోపు మనం కొంతమందికి ప్రేరణగా, సలహాదారుగా, శిక్షకులుగా నిలవాలి. అప్పుడు సమాజంలో చాలామంది మారతారు. – పార్వతి నౌరియాల్ -
‘బ్యాక్‌ప్యాక్’ హీరోలు!
ఈసారి ప్రపంచంలో ఎక్కడైనా భారీ భూకంపం సంభవిస్తే శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సరికొత్త ‘హీరోలు’రంగంలోకి దిగనున్నారు! వీపుపై మైక్రోఫోన్లు, వీడియో కెమెరాలు, లొకేషన్ ట్రాకర్లతో కూడిన బ్యాక్‌ప్యాక్‌లు తగిలించుకొని చిన్నచిన్న రంధ్రాల్లోకి సైతం అలవోకగా దూసుకెళ్లనున్నారు!! హీరోలేమిటి.. రంధ్రాల్లోకి దూరడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? కానీ మీరు చదివింది నిజమే.. కానీ ఈ హీరోలు ఆరడుగుల బుల్లెట్లు కాదు... కేవలం మన అరచేయికి కాస్త అటుఇటు సైజులో ఉండే ఎలుకలు!! ఇంతకీ విషయం ఏమిటంటే.. భూకంపాలు వచ్చినప్పుడు కుప్పకూలే భవనాల శిథిలాల్లో చిక్కుకున్న క్షతగాత్రులను కచ్చితత్వంతో గుర్తించడం సహాయ సిబ్బందికి పెను సవాలే. దీనికితోడు సమయంతో పోటీపడాల్సి ఉంటుంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు, క్షతగాత్రులు శిథిలాల్లో ఎక్కడ చిక్కుకున్నారో కచ్చితత్వంతో గుర్తించేందుకు శాస్త్రవేత్తలు తాజాగా ఎలుకలకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ పనిని శునకాలు సైతం చేస్తున్నప్పటికీ వాటితో పోలిస్తే ఎలుకలు ఎన్నో రెట్లు చిన్నగా ఉండటం, చిన్నచిన్న ఖాళీ ప్రదేశాల్లోకి అలవోకగా వెళ్లే సామర్థ్యం ఉండటంతో ఇందుకోసం వాటిని ఎంచుకున్నారన్నమాట. ట్రైనింగ్‌లో ‘ర్యాట్’దేలుతూ.. టాంజానియాలోని మొరోగొరోలో ఎలుకలకు శిక్షణ ఇచ్చే అపోపో అనే ఎన్జీవో సంస్థతో కలసి శాస్త్రవేత్తలు సుమారు ఏడాదిగా పనిచేస్తున్నారు. తమ పరిశోధనకు హీరో ర్యాట్స్ అనే పేరుపెట్టారు. ప్రస్తుతం ఖాళీ బ్యాక్పాక్లతో వాటిని ‘డమ్మీ శిథిలాల్లో’కి వదిలి అక్కడ బాధితులెవరైనా కనపడగానే ఒక బటన్ నొక్కేలా వాటికి శిక్షణ ఇస్తున్నారు. అలాగే ‘బీప్’శబ్దం వినపడగానే ఎలుకలు తిరిగి తమ వద్దకు వచ్చేలా నేర్పుతున్నారు. ఎలుకల వీపులపై అమర్చే సాంకేతిక పరికరాలతో కూడిన బ్యాక్‌ప్యాక్‌లను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎలుకల బ్యాక్పాక్లలో సాంకేతిక పరికరాలను సిద్ధం చేశాక శిథిలాల్లోకి వెళ్లే ఎలుకలు ఎక్కడ ఉన్నాయో లొకేషన్ ట్రాకర్ల ద్వారా గుర్తిస్తామని... అప్పుడు ఎలుకల వద్ద ఉండే మైక్రోఫోన్ల ద్వారా క్షతగాత్రులతో నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న స్కాట్లాండ్లోని గ్లాస్గోకు చెందిన డాక్టర్ డోనా కీన్ చెప్పారు. ప్రస్తుతం ఏడు ఎలుకలకు శిక్షణ ఇచ్చామని... కేవలం రెండు వారాల్లోనే శిక్షణ వేగం పుంజుకుందని చెప్పారు. త్వరలోనే మొత్తంగా 170 ఎలుకలను భూకంపాలు ఎక్కువగా సంభవించే టర్కీకి తరలించనున్నారు. ఎలుకల సాయంతో భూకంప శిథిలాల్లో గాలింపు, సహాయ చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ అంగీకరించడం విశేషం. ఇదంతా బాగానే ఉంది కానీ... మనమంటే మానవత్వం కోసం తోటివారిని కాపాడాలనుకుంటాం... మరి ఎలుకలు ఎందుకు మనుషులకు సాయం చేస్తాయనే డౌట్ మీకు వచ్చిందా? దానికీ ఓ ఆన్సరుంది. ఇలా శిథిలాల్లోకి వెళ్లి చెప్పిన పని చేసొచ్చే ఎలుకలకు రుచికరమైన ఆహారాన్ని సిరంజీల ద్వారా లంచంగా ఇస్తున్నారట. దీంతో ఎలుకలు ఉత్సాహంగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ మరికొన్ని ప్రమాదకర టాస్కుల్లోనూ... ల్యాండ్మైన్ల వంటి పేలుడు పదార్థాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడంతోపాటు పశువులకు సోకే టీబీ, బ్రుసెల్లోసిస్ వంటి ప్రమాదకర రోగాలను కనిపెట్టడంలోనూ ఎలుకల సాయం తీసుకోవాలనుకుంటున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. పేలుడు పదార్థాల్లో ఉపయోగించే టీఎన్టీ (ట్రైనైట్రోటోల్యూని) లేదా టీబీ పాజిటివ్ నమూనాల వాసనలను ఎలుకలు పసిగట్టేలా శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. శునకాలతో పోలిస్తే నామమాత్రమైన బరువుండే ఎలుకలు పేలుడు పదార్థాలపై కాలుమోపినా పేలుళ్లు జరగవని... అలాగే శునకాల తరహాలోనే వాటి గ్రాహణ శక్తి కూడా అమోఘమని పేర్కొన్నారు. -
స్వఛ్చందసేవకు ఆసరాగా...హెచ్‌సీఎల్
విద్య, ఆరోగ్యం, పర్యావరణం ఈ మూడింటిలో పనిచేస్తున్న ఎన్జీఓలకు ఆర్ధికంగా సాయం చేసేందుకు ప్రత్యేక గ్రాంట్ ఏర్పాటు చేశామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ డైరెక్టర్ నిధి పుందిర్ తెలిపారు. హెచ్‌సీఎల్ గ్రాంట్ 8వ ఎడిషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... మూడేళ్ల పాటు ఆర్ధిక సాయం... హెచ్‌సిఎల్ ఫౌండేషన్‌లో భాగంగా హెచ్‌సీఎల్ గ్రాంట్ ను 2015లో లాంచ్ అయింది. మా సాయం పొందేందుకు ఒక ఎన్జీఓ ప్రారంభించి కనీసం మూడేళ్లు పూర్తి చేసుకుని ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. సంస్థల నిర్వహణ, అందిస్తున్న సేవల్లో పారదర్శకత వంటివి చూసి కేటగిరీల వారీగా ఎంపిక చేస్తాం. మా ప్రాధామ్యాల పరంగా సరితూగే సంస్థలను నిపుణుల జ్యూరీ ఎంపిక చేస్తుంది. కేటగిరీ వారీగా 3 ఫైనలిస్ట్స్‌ను ఎంపిక చేశాక ఏడాదికి మొత్తం రూ. 16.5 కోట్లు చొప్పున అందిస్తాం. మరో 30 ఎన్జిఓ సంస్థల గురించి ఒక పుస్తకం ప్రచురిస్తాం. ప్రస్తుతం 6వ వాల్యూమ్ ప్రచురించనున్నాం. అది ప్రభుత్వ శాఖలు, దాతలకు చేరుతుంది. వాళ్ల కార్యక్రమాల శైలులు అందరికీ తెలుస్తాయి. దరఖాస్తులకు ఆహ్వానం... ఇది 8వ ఎడిషన్. ఇటీవలే అప్లికేషన్స్ ఓపెన్ చేశాం. ఏవైనా అనివార్య కారణాలు ఉంటే తప్ప సాధారణంగా 60 రోజులు ఓపెన్ చేసి ఉంచుతాం. కేవలం ఆన్లైన్ ద్వారా తప్ప మరే విధంగాననూ దరఖాస్తులు స్వీకరించం. ఏ రాష్ట్రం నుంచైనా, ఏ నగరం, జిల్లా,గ్రామం నుంచైనా దీనికి దరఖాస్తు చేయవచ్చు. వీలైనన్ని ఎక్కువ ఎన్జిఓ సంస్థలు దీని గురించి తెలుసుకోవాలనేదే మా ఉద్ధేశ్యం. అందుకే నగరాల వారీగా సింపోజియమ్స్ నిర్వహిస్తున్నాం. ఎన్జీఓలు వాటికి అర్హతలు ఉన్నా లేకున్నా దీనికి హాజరు కావచ్చు. సీఎస్ఆర్ చట్టాలు,, ప్రాంతీయ అంశాలు, ఉపయుక్తమైన సమాచారం తెలుసుకోవడానికి ఈ సదస్సులు ఉపకరిస్తాయి. విభిన్న మార్గాల ద్వారా ఎన్జీఓలు సాయం పొందే అవకాశాలు కూడా తెలుస్తాయి. చదవండి: ఉక్రెయిన్ కోసం గూగుల్.. సుందర్ పిచాయ్ డేరింగ్ స్టెప్. -
సంచారుల కేరాఫ్ అడ్రస్.. మిత్తల్ పటేల్
అవి చేద్దాం ఇవి చేద్దాం అని జీవితంలో ఎన్నో కలలు కంటుంటాం కానీ, అన్నీ నిజం కావు. కొంతమంది కలలు ఒకరకంగా ఉంటే వారి డెస్టినీ మాత్రం మరోలా ఉంటుంది. కొన్నిసార్లు కల చెదిరినప్పటికీ డెస్టినీ చూపిన మార్గంలో మరెంతోమంది కలలను నిజం చేసే అవకాశం లభిస్తుంది. ఇలా లభించిన అవకాశంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది మిత్తల్ పటేల్. చిరునామా లేని వేలమందికి గుర్తింపు కార్డులతోపాటు, ఒక అడ్రెస్‌ను ఏర్పాటు చేసి, జనజీవన స్రవంతిలో కలుపుతోంది. గుజరాత్‌లోని సంఖల్‌పూర్‌లోని ఓ రైతు కుటుంబంలో పుట్టింది మిత్తల్ పటేల్. చిన్నప్పటి నుంచిఐఏఎస్ అధికారి కావాలనేది ఆమె కల. బీఎస్సీ అయ్యాక ఐఏఎస్ కోచింగ్ కోసం అహ్మదాబాద్ వెళ్లింది. ఒకపక్క ఐఏఎస్‌కు సన్నద్ధమవుతూనే గుజరాత్ విద్యాపీఠ్‌లో జర్నలిజం కోర్సులో చేరింది. ఇక్కడే ఆమె జీవితం పూర్తిగా మలుపు తిరిగింది. రెండు నెలల ఫెలోషిప్‌లో భాగంగా బార్డోలి గ్రామానికి వెళ్లింది మిత్తల్. అక్కడ ఓ సంచార తెగను చూసింది. ఈ తెగకు చెందిన వాళ్లలో కొందరు ఏవో చిన్నపాటి గుడ్డపీలికలు మాత్రమే ధరించడం, మరికొందరు అదీ లేకుండా అలాగే ఒకచోటనుంచి మరో చోటుకి వలస వెళ్తుండడం వల్ల రోజుల తరబడి తిండిలేక బక్కచిక్కిన శరీరాలను చూసి ఆమె చలించిపోయింది. పేదరికం ఇంత దారుణంగా ఉంటుందా అనిపించింది మిత్తల్‌కు. వీరికోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. రెండేళ్ల పాటు సంచార జాతుల గురించి పూర్తిగా తెలుసుకుని వారి కనీస అవసరాలు తీర్చి, వారికో గుర్తింపు ఇవ్వాలని పూనుకుంది. వీరి గురించి ఎంతోమంది అధికారులకు విన్నవించింది. వారికి సాయం చేయడానికి ఏ సీనియర్ అధికారీ ముందుకు రాలేదు. ప్రభుత్వ అధికారులే ఏం చేయలేనప్పుడు .. నేను ఆఫీసర్‌ను అయితే మాత్రం ఏం లాభం అనుకుంది. అప్పటిదాకా ఐఏఎస్ పరీక్షకు సిద్ధమైన మిత్తల్ ప్రిపరేషన్‌ను పక్కన పెట్టింది. విచారత సంస్థాన్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరిగే సంచార జాతులు ఒక్క గుజరాత్‌లోనే 40 రకాలు ఉన్నారు. ముఫ్పై నుంచి నలభై లక్షల వరకు జనాభా ఉండే ఈ సంచారులకు ఆధార్ కార్డు, ఓటరు కార్డు, జనన ధ్రువీకరణ, చిరునామా సంబంధిత పత్రాలు ఏవీలేవని గుర్తించింది. వీరికి కనీస అవసరాలు కల్పించడానికి పూర్తిస్థాయిలో పనిచేయాలనుకుంది. భర్త ప్రోత్సహించడంతో 2015 విచారత కమ్యునిటీ పేరిట ఎన్జీవోను ప్రాంభించింది. సంచార జాతులను వెతకడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరికి సంబంధించిన పెళ్లిళ్లు, ఇతర విందు వినోద కార్యక్రమాల వద్దకు వెళ్లి వారి గురించి వివరాలు అడిగేది. ఈమె ఎవరో ఏమిటో తెలియక మొదట్లో తిరస్కరించినప్పటికీ తరువాత ఆమెను నమ్మి తమ వివరాలు చెప్పేవారు. వాళ్లు నివసించే ప్రాంతంలో టెంట్ వేసుకుని మరీ వారి స్థితిగతులను అధ్యయనం చేసేది. ఈ క్రమంలోనే పద్నాలుగు వందల కుటుంబాలకు పక్కా ఇళ్లను సమకూర్చింది. విచారత ఆధ్వర్యంలో మూడు హాస్టల్స్‌ను నిర్మించింది. వీటిలో వందలమంది సంచారుల పిల్లలు చదువుకుంటున్నారు. ఐడెంటిటీతో అందర్ని కదిలించింది గుజరాత్ ఎలక్షన్ కమిషన్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరి చుట్టూ తిరిగి సంచారులకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని వినతి పత్రం సమర్పించింది. చివరికి 2010లో తొంబై వేలమంది సంచారులకు రాష్ట్రప్రభుత్వం ఐడెంటిటీ కార్డులు జారీ చేసింది. ఇదే సమయంలో విచారత సంస్థాన్ ‘అమె పన్ చియే’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా సంచారులకు ఐడెంటిటీ కార్డులు అందించారు. అప్పట్లో ఈ కార్యక్రమం అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలను ఆకర్షించింది. దీంతో ఆ తరువాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోల్లో పార్టీలన్నీ సంచారులకు అనేక హామీలు ఇచ్చాయి. ఊరు, పేరు లేని సంచారులకు ఐడెంటిటీని కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషించిన మిత్తల్‌ని 2017లో ‘నారీ రత్న’ అవార్డు వరించింది. దాదాపు పదిహేనేళ్లుగా సంచారుల అభ్యున్నతికి పాటుపడుతోన్న మిత్తల్ ప్రస్తుతం రాజాస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలోని సంచార, బంజార జాతుల అభివృద్ధే లక్ష్యంగా నిర్విరామంగా కృషిచేస్తోంది. చదవండి: అన్నాఖబాలే దుబా..: సేవలో.. ది బెస్ట్! -
మనసున్న మారాజు..
శిఖరం చేరడమే విజయం అనుకుంటే...అది చేరే ప్రస్థానంలో కష్టాలు పడుతున్న వారికి చేయూత ఇచ్చి, వెన్నుతట్టి, దారి చూపడం ఘన విజయం. ‘ఏకలవ్య’ మూమెంట్ ద్వారా రాజు కేంద్రె ఆ పనే చేస్తున్నాడు... విదర్భ(మహారాష్ట్ర)లోని సంచార తెగల్లో చదువు అనేది అరుదైన విషయం. అయితే రాజు కేంద్రె తల్లిదండ్రులు మాత్రం చదువుకు బాగా విలువ ఇచ్చారు. తమకు అక్షరం ముక్క రాకపోయినా పిల్లలను మాత్రం అవకాశం ఉన్నంత వరకు చదివించాలనుకున్నారు. రాజు చదువు ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగింది. హైస్కూలు వరకు పెద్దగా తెలియలేదుగానీ, కాలేజిలో చేరిన తరువాత రకరకాల దూరాలు పరిచయం అయ్యాయి. ఇంగ్లీష్‌కు తనకు మధ్య ఉండే దూరం, కమ్యూనికెషన్స్ స్కిల్క్కు తనకు మధ్య ఉండే దూరం, ఇంకా రకరకాల ఆర్థిక, సామాజిక దూరాలు! పుణె యూనివర్శిటీలో చదువుకోవాలనుకున్నప్పుడు కూడా ఇదే దూరం తనకు అడ్డుగా నిలిచించి. బుల్దాన జిల్లాలోని తన ఊరు నుంచి అక్కడికి 400 కిలోమీటర్ల దూరం. పుణె వెళ్లి చదువుకోవాలంటే, చదువు సంగతి సరే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. దీంతో యశ్వంత్‌రావు చవాన్ మహారాష్ట్ర ఒపెన్ యూనివర్శిటీలో చదుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత... టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(తుల్జాపూర్)లో చేరడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. మేల్ఘాట్లోని ‘కొర్కు’లాంటి గ్రాస్‌రూట్ కమ్యూనిటీలతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. వారి పనితీరు, నైపుణ్యాలను దగ్గరి నుంచి చూశాడు. ‘వీరికి చదువు వస్తే ఎన్ని గొప్ప విజయాలు సాధించేవారో కదా’ అనుకున్నాడు. అట్టడుగు వర్గాల విద్యార్థుల కోసం ‘ఏకలవ్య ఇండియా’ అనే స్వచ్ఛందసంస్థకు ఉద్యమస్ఫూర్తితో శ్రీకారం చుట్టాడు రాజు. స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, టెక్నాలజికల్ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూ వరకు ఎన్నో నేర్పిస్తుంది ఏకలవ్య. దీంతో పాటు చదువుల ప్రస్థానంలో తన కష్టాల నుంచి ప్రతిష్ఠాత్మకమైన చీవ్‌నింగ్ స్కాలర్షిప్(యూకే గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం) గెలుచుకోవడం వరకు ఎన్నో విషయాలు చెబుతున్నాడు రాజు. అట్టడుగు వర్గాల తొలితరం విద్యార్థులకు కొండంత అండగా ఉన్న ‘ఏకలవ్య’కు ఎంటర్‌ప్రెన్యూర్స్, సోషల్ వర్కర్స్, డాక్టర్లు, వివిధ రంగాల ప్రముఖలు సహకారం అందిస్తున్నారు. ‘ఏకలవ్య’ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు 300 మంది విద్యార్థులు ప్రముఖ విశ్వవిద్యాలయాలలో చదువుకునేందుకు సహాయం చేసింది. చదువు విలువ గురించి పేదకుటుంబాల దగ్గరకి వెళ్లి ప్రచారం చేస్తుంది ఏకలవ్య, 2030 నాటికి వెయ్యిమంది వరకు గ్రాస్రూట్స్ లీడర్స్‌ను తయారుచేయాలనేది ‘ఏకలవ్య’ లక్ష్యంగా పెట్టుకుంది. ‘అట్టడుగు వర్గాల గురించి అంకితభావంతో పనిచేస్తున్న రాజు ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తున్నాడు’ అని ప్రశంసపూర్వకంగా అంటున్నారు స్కూల్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(టిస్) అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణ సుధీర్ పటోజు. -
సినిమాలో ఆ పాత్ర.. ఇప్పుడు వారి కోసం రియల్ లైఫ్‌లో ఇలా
Yami Gautam Joins Hands With NGOs To Help Rape Survivors: బాలీవుడ్ ముద్దుగుమ్మ యామీ గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నితిన్ సరసన కొరియర్ బాయ్ కల్యాణ్, గౌరవం, నువ్విలా తదితర చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఆడియెన్స్‌కు చేరువైంది. అయితే ఆశించినంత పేరు ప్రఖ్యాతలు సంపాదించలేకపోయింది. అందుకే మళ్లీ బాలీవుడ్లోనే తనను తాను నిరూపించుకుంటోంది. అయితే తాజాగా ఈ భామ లైంగిక వేధింపులకు గురైన బాధితులకు మద్దతు తెలిపింది. అలాంటి వారికి పునరావాసం కల్పించడానికి మజ్లిస్, పారి పీపుల్ ఎగైనెస్ట్ రేప్ ఇన్ ఇండియా అనే రెండు ఎన్జీవోలతో కలిసి పనిచేయనుంది. 'లైంగిక వేధింపుల బాధితుల పునరావాసానికి కృషి చేస్తున్న రెండు ఎన్జీవోలతో నేను కలిసి పనిచేయబోతున్నాని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. చాలా గర్వంగా కూడా ఉంది. మహిళల భద్రత సమస్యలపై పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. భవిష్యత్తులో అన్ని వర్గాల మహిళలను రక్షించడానికి, వారికి మెరుగైన వనరులను సేకరించడంలో సహాయపడేందుకు నేను మరింత సహకారం అందించాలనుకుంటున్నాను.' అని యామీ పేర్కొంది. ఇదిలా ఉంటే యామీ గౌతమ్ నటించిన తాజా చిత్రం 'ఏ థర్స్డే'. ఇందులో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో యామీ అత్యాచార బాధితురాలి పాత్రను పోషించి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే లైంగిక వేధింపులకు గురైన బాధితుల పునరావాసం కోసం అందుబాటులో ఉన్న ప్రస్తుత మౌలిక సదుపాయాల గురించి మనందరం ఆలోచింపజేసింది. ఇప్పుడు నిజ జీవితంలో లైంగిక వేధింపుల బాధితుల కోసం తనవంతు సహకారం అందించడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే. -
రూ. 8లక్షల ఉద్యోగం కాదని చిత్తూరు కుర్రోడి సరికొత్త ఆలోచన.. ఫోర్బ్స్ జాబితాలో చోటు
డొనేట్‌కార్ట్. స్వచ్ఛంద సంస్థలకు, దాతలకు మధ్య వారధి. ఏ ప్రాంతానికి చెందిన స్వచ్ఛంద సంస్థ అయినా వెబ్సైట్లో వారి సేవలకు అవసరమైన వస్తు, సామగ్రి, పరిమాణాన్ని నమోదు చేసుకోవచ్చు. ఈ వివరాల ఆధారంగా దాతలు అందుకు అవసరమైన మొత్తాన్ని డొనేట్‌కార్ట్‌కు సమకూరుస్తారు. ఆ నగదుతో సంబంధిత స్వచ్ఛంద సంస్థ వెబ్సైట్లో నమోదు చేసిన అవసరాలను సమకూరుస్తుంది. వెబ్సైట్ వేదికగా పని చేస్తున్న ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడు బి.అనిల్‌కుమార్‌రెడ్డి. 26 ఏళ్ల ఈ యువకుని స్వగ్రామం జిల్లాలోని బి.కొత్తకోట మండలంలోని అటవీ సరిహద్దు గ్రామం చలిమామిడి. ఫోర్బ్స్ జాబితాలో ఈ సంస్థ చోటు దక్కించుకోవడంతో ఈ యువకుడి సేవాగుణం వెలుగులోకి వచ్చింది. సాక్షి, చిత్తూరు: కష్టాలను కళ్లారా చూసి.. సావాసం చేసి.. పోరాడి నిలిస్తే ఆ నీడ ఎంతో మందికి సేదతీరుస్తుంది. ఓ నిరుపేద కుటుంబం.. అందునా వ్యవసాయమే ఆధారం.. చదువును పెట్టుబడిగా మలుచుకుని రాణించాడు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని అంచెలంచెలుగా ఎదిగి పది మందికి సహాయపడే స్థాయికి చేరుకున్నాడు. లక్ష్యం బలంగా ఉంటే ఎంతటి కష్టమైనా తలవంచుతుందని నిరూపించాడు ఓ మారుమూల అటవీ సరిహద్దు గ్రామ యువకుడు. ఇప్పుడు అతని పేరు ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవడంతో ఊరంతా గర్వపడుతోంది. బి.కొత్తకోట మండలంలోని అటవీ సరిహద్దు గ్రామం చలిమామిడికి చెందిన రైతు దంపతులు సుశీలమ్మ, గోవిందరెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. రెండో కుమారుడు బి.అనిల్‌కుమార్‌రెడ్డి బి.కొత్తకోటలో ప్రాథమిక విద్య, తిరుపతిలో 9, 10.. నెల్లూరులో ఇంటర్, నాగ్‌పూర్‌లో ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత గ్రోఫోర్స్ సంస్థలో ఏడాదికి రూ.8 లక్షల వేతనంతో ఉద్యోగం వచ్చినా చేరలేదు. సొంతంగా ఓ సంస్థను స్థాపించాలనే లక్ష్యంతో ఎన్ఐటీ నాగ్‌పూర్‌లో చదివిన తెలంగాణలోని కోదాడకు చెందిన సందీప్ శర్మతో కలిసి డొనేట్‌కార్ట్‌ను 2016 అక్టోబర్ 11 ప్రారంభించగా ఇందులో మహారాష్ట్రకు చెందిన సారంగ్ బోబాడే సహా వ్యవస్థాపకులుగా సంస్థను నడిపిస్తున్నారు. చదవండి: ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో ముగ్గురు తెలుగు కుర్రాళ్లకు చోటు! వినూత్న ఆలోచన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డొనేట్‌కార్ట్ సంస్థ ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 గ్రూపు ఎన్జీఓలు–సోషల్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ విభాగంలో స్థానం దక్కించుకుంది. 30 ఏళ్లలోపు వయసు కలిగిన వారు నిర్వహిస్తున్న 30 సంస్థలను ఫోర్బ్స్ ఇండియా ఎంపిక చేయగా అందులో డొనేట్‌కార్ట్ ఒకటి. సాధారణ రైతు కుటుంబానికి చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి అందరిలా ఉద్యోగం చేసి జీవితంలో స్థిరపడితే చాలనుకోలేదు. తనవంతుగా సమాజానికి ఏదో ఒకటి చేయాలనుకుని బలంగా సంకల్పించాడు. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ‘సేవల వారధి’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. రూ.5వేల కోట్ల విరాళాలు లక్ష్యం 2016 ఆగస్టులో మా సంస్థను స్థాపించగా ఇప్పటి వరకు 10లక్షలకు పైగా దాతల నుంచి రూ.150 కోట్ల విరాళాలు సేకరించాం. భవిష్యత్తులో విరాళాలను రూ.5వేల కోట్లకు పెంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. విరాళాలు అత్యధికంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్‌ల నుంచే అందుతున్నాయి. – బి.అనిల్‌కుమార్‌రెడ్డి, ఫోర్బ్స్ సహ వ్యవస్థాపకుడు వెబ్సైట్ వేదికగా.. మొదట నాగ్‌పూర్‌లో వెబ్సైట్ వేదికగా ప్రారంభమైన డొనేట్‌కార్ట్ ఆ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చింది. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ రెండుచోట్లా పనిచేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డొనేట్‌కార్ట్ రూ.90 కోట్ల టర్నోవర్ సాధించింది. స్వచ్ఛంద సంస్థలకు సమకూర్చాల్సిన వస్తు సామగ్రిని బల్క్‌గా కొనుగోలు చేయడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది. ఆ మొత్తమే రూ.90కోట్లు. ఈ నిధుల నుంచే సంస్థలో పనిచేస్తున్న 75 మంది ఉద్యోగులకు వేతనాలు, ఖర్చులు వెచ్చిస్తున్నారు. ఉద్యోగులకు నెలసరి వేతనం రూ.25వేల నుంచి రూ.4లక్షల వరకు చెల్లిస్తుండటం విశేషం. -
కష్టకాలంలో మంచి నిర్ణయాలు
సాక్షి, అమరావతి: ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, సొంతింటి కల దిశగా ఎంఐజీ లే అవుట్లలో ప్లాట్లు తాము ఊహించలేదని, మొత్తంగా పీఆర్సీ పట్ల సంతృప్తిగా ఉన్నామని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. చాలా సమస్యలకు పరిష్కారం లభించిందని, కష్టకాలంలో సీఎం వైఎస్ జగన్ మంచి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం వారు సీఎంవో అధికారులతో సమావేశం అయ్యారు. అనంతరం అక్కడి మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. జగన్ చిత్రపటానికి స్వర్ణ కమలాభిషేకం శ్రీకాళహస్తి: ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఇతర వరాలు ప్రకటించిన నేపథ్యంలో శనివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన చిత్రపటాన్ని స్వర్ణ పుష్పాలతో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సంఘం నాయకులు చెంచురత్నంయాదవ్, నారాయణరెడ్డి, రవికాంత్, నాగేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నేతలు కృష్ణగిరి రెడ్డి, గోపి, విశ్రాంత ఉద్యోగుల సంఘం నేత రమణయ్య, పురపాలక, ఆర్టీసీ తదితర ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగుల్లో పండుగ సందడి ప్రభుత్వం పీఆర్సీ 23 శాతం పెంచడంతో పాటు పలు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఉద్యోగులందరూ ఆనందంగా ఉన్నారని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా.బి.ప్రతాపరెడ్డి అన్నారు. శనివారం ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఆయన ఉద్యోగుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచినందుకు గుంటూరులో ఎమ్మెల్సీ కల్పలత ఉపాధ్యాయ, ఉద్యోగులతో కలసి కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు ఆశించినట్లే హెచ్ఆర్ఏ ఉంటుంది హెచ్ఆర్ఏ విషయంలో ప్రస్తుత శ్లాబులనైనా కొనసాగించాలి, లేదా పీఆర్సీ కమిషనర్ సూచించిన శ్లాబులనైనా పరిగణలోకి తీసుకోవాలని తెలియజేశాం. పెన్షనర్లకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పాం. హెచ్ఆర్ఏ ఉద్యోగులు ఆశించినట్లే ఉంటుంది. సీఎం నిర్ణయాల పట్ల అందరూ ఆనందంగా ఉన్నారు. – కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రభుత్వంపై నమ్మకం ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పైన, ప్రభుత్వ ఉన్నతాధికారుల మీద మాకు నమ్మకముంది. అదనపు పెన్షన్ విషయంలో సీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే పెన్షనర్లు ఇబ్బందులు పడతారని చెప్పాం. 62 ఏళ్లకు పదవీ విరమణ, సొంతింటి కల మేము ఊహించని నిర్ణయం. అన్ని సమస్యలపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి సచివాలయాల ఉద్యోగులకు మేలు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలిసీ తెలియక కొంత మంది ఆందోళన చేస్తున్నారు. వాళ్లందరికీ తప్పకుండా రెగ్యులర్ అవుతుంది. ఇతర ఉద్యోగులతో సమానంగా వారికి అన్ని విషయాల్లో న్యాయం జరుగుతుంది. కారుణ్య నియామకాల విషయంలో ఏ శాఖలో అయినా నియామకం చేయాలని కోరాం. – కె.వి.శివారెడ్డి, ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేటి సమావేశం వాయిదా ఈ నెల 7న సీఎం జగన్ ప్రకటించినవి కాకుండా మిగిలిన విషయాల గురించి శనివారం సీఎంవో అధికారులతో చర్చించాం. కోవిడ్, నాన్ కోవిడ్‌లో చనిపోయిన వారికి కూడా కారుణ్య నియామకాలు చేయాలని కోరాం. సానుకూలంగా నిర్ణయాలు జరిగాయి కాబట్టి మా కార్యాచరణ కోసం ఆదివారం జరగాల్సిన సమావేశం వాయిదా వేస్తున్నాం. – వైవీ రావు, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నేత డీఏలు అన్నీ ఒకేసారి క్లియర్ ఫిట్మెంట్ విషయంలో ఉపాధ్యాయులు కొంత అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. కానీ డీఏలు అన్నీ ఒకేసారి క్లియర్ చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంది. సీఎం రాష్ట్ర పరిస్థితి గురించి ఆలోచించాలని చెప్పారు. మేమంతా అర్థం చేసుకుని ఆమోదించాం. ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లన్నీ పరిష్కారం అవుతున్నాయి. – జోసెఫ్ సుధీర్ బాబు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరాం. సీఎంవో అధికారులను కలిసి మా సమస్యను వివరించాం. ఎలిజిబిలిటీ ఉన్న వారికి వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని విన్నవించాం. ఉన్నతాధికారి అజయ్ జైన్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమావేశం నిర్మాణ భవన్లో నిర్వహిస్తామన్నారు. – బత్తుల అంకమ్మ రావు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు కొత్త పీఆర్సీలో భాగంగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కొత్త స్కేల్స్ వర్తింప చేస్తామని ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. సీఎం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత కార్యక్రమాలతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కడం పట్ల గర్వంగా ఉంది. – కె.నాగరాజు, స్టేట్ సెర్ప్ ఎంప్లాయిస్ జేఏసీ కన్వీనర్ సీఎం నిర్ణయం సాహసోపేతం ఉద్యోగుల పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం సాహసోపేతమైనది. ఈ పీఆర్సీలో మానవత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఉద్యోగులను వేరుగా చూడటంలేదు. ప్రభుత్వంలో అంతర్భాగంగా చూస్తోంది. ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ, ఏమాత్రం తగ్గకుండా ఉద్యోగుల కష్టాలను తీరుస్తోంది. రిటైర్మెంట్ వయో పరిమితి పెంచటంపై ఎల్లో మీడియా పెదవి విరచడం దారుణం. చంద్రబాబు వయస్సు ఎంత, ఎందుకు రాజకీయాలకు రిటైర్మెంట్ ఇవ్వడంలేదో చెప్పాలి. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లకు జగనన్న ఇచ్చిన సంక్రాంతి కానుక. – వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ -
ఐఐటీ ఢిల్లీకి విదేశీ విరాళాలు బంద్
న్యూఢిల్లీ: లైసెన్స్ రెన్యువల్ కాని కారణంగా దేశంలోని 5,789 ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాలను అందుకునే అవకాశాన్ని కోల్పోయాయి. ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), జామియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ తదితర ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ యాక్ట్) చట్టం కింద లైసెన్స్ పునరుద్ధరణకు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేయకపోవడం, చేసుకున్న దరఖాస్తు తిరస్కరణ, తదితర కారణాలతో ఈ సంస్థల లైసెన్స్ రెన్యువల్ కాలేదని కేంద్ర హోం శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సంస్థల గత లైసెన్స్ శనివారం(జనవరి ఒకటిన) ముగిసింది. ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆక్స్‌ఫామ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, గోద్రేజ్ మెమోరియల్ ట్రస్ట్, ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ, జేఎన్‌యూలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషర్మెన్స్ కోఆపరేటివ్స్, భారతీయ సంస్కృతి పరిషద్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాల లైసెన్స్ గడువు ముగిసింది. భారత్‌లోని ఎన్జీవోలు విదేశీ విరాళాలను సమీకరించాలంటే ఎఫ్సీఆర్ఏ కింద దరఖాస్తు చేసుకుని లైసెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. శుక్రవారం నాటికి వీటి సంఖ్య 22,762కాగా శనివారం తర్వాత వీటి సంఖ్య 16,829కి తగ్గింది. -
12,580 ఎన్జీవోల లైసెన్సులు రద్దు! ఇక నో ఫారిన్ ఫండ్స్..
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) 2010 కింద ఎన్జీవోలకు విదేశీ నిధులు చేరాలంటే లైసెన్సులను తప్పనిసరిగా కలిగి ఉండాలి. కాగా దాదాపు 12,580 ఎన్జీవో (నాన్ ఫ్రోఫిట్ ఆర్గనైజేషన్లు)ల లైసెన్సుల తుది గడువు నిన్నటితో ముగియడంతో వారి లైసెన్సులన్నీ శనివారం సీజ్ చేసినట్లు కేంద్ర హోం శాఖ తాజాగా విడుదల చేసిన జాబితాలో తెల్పింది. ఎఫ్సిఆర్ఎ కింద క్రితం రోజు వరకు యాక్టివ్‌గా ఉన్న 22,762 ఎన్జీఓలు ప్రస్తుతం 16,829కి తగ్గాయి. దాదాపు 5,933 ఎన్జీఓల రిజిస్ట్రేషన్లు రద్దు చేయబడ్డాయి (రెన్యూవల్ చేసుకోకపోవడంతో). మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇమాన్యుయేల్ హాస్పిటల్ అసోసియేషన్, ట్యూబర్క్యులోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆశాకిరణ్ రూరల్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ, చైతన్య రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, ఎఫ్సిఆర్ఎ లైసెన్స్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తాజా జాబితాలో ఉంది. హమ్‌దర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ సొసైటీ, డీఏవీ కాలేజ్ ట్రస్ట్ అండ్ మేనేజ్మెంట్ సొసైటీ, ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, జేఎన్‌యూలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, ఇండియా హాబిటాట్ సెంటర్, లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే 6587 ఎన్జీఓలు జాబితాలో ఉన్నాయి.లైసెన్స్‌ల రెన్యువల్ కోసం గడువుకాలం పొడిగించినప్పటికీ ఆయా సంస్థలు అప్డేట్ చేసుకోలేదు. కాగా కొన్ని ఎన్జీఓల ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేన్‌కు తుది గడువు 2021 సెప్టెంబర్ 29,30 తేదీల్లో ముగియనుండగా, ఆ సమయాన్ని మార్చి 2022 వరకు హోం శాఖ పొడిగించింది. చదవండి: Online Frauds: అయ్యో పాపం! రూ. 1 లక్ష విలువైన ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే డెలివరీ ఫ్యాక్‌లో.. -
భారత్‌లో జీరో రూపాయి నోటు ఉందని మీకు తెలుసా!...
Zero Rupee Note Create For Corruption: ఎవరైనా మీకు సున్నా రూపాయి నోటును అందజేస్తే మనం కచ్చితంగా అది నకిలీ నోటుగా భావించి వదిలేయడం లేదా పడేయడమో చేస్తాం. మనందరి దృష్టిలో రూ.10, 20 నుంచి రూ.500, 2000లు విలువ కలిగిన నోటులు. కానీ సున్న రూపాయి నోటుకి కూడా అది పెద్ద విలువ ఉంది. అది కేవలం సాధారణ కాగితం కాదని మీకు తెలిస్తే? బహుశా మీరు ఆశ్చర్యపోవచ్చు. (చదవండి: రాయ్ తుపాను ధాటికి 208 మంది మృతి) భారతదేశంలో సున్నా-రూపాయి నోటు అనేది లంచాలు లేకుండా చేసేలా మొత్తం వ్యవస్థాగత రాజకీయ అవినీతిని అరికట్టడానికి ఒక సాధనంగా జారీ చేసిన బ్యాంకు నోట్ల అనుకరణ. పైగా దీన్ని 50 రూపాయల నోటును పోలి ఉండేలా తయారు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నాలుగు మూలస్థంభాలుగా శాసనసభ, కార్యనిర్వాహకుడు, న్యాయవ్యవస్థ, మీడియా అని మాత్రమే తెలుసు. కానీ ఐదవ స్థంభంగా ప్రభుత్వేతర సంస్థ ఒకటి పనిచేస్తుందని మనకెవరికి తెలియదు. తమిళనాడుకు చెందిన ఎన్జీవో ఐదవ స్తంభంలా శాంతియుత ప్రజాస్వామ్య రక్షణకై తనవంతు కీలక పాత్రను పోషిస్తోంది. అంతేకాదు 2007లో లంచం తీసుకోవడానికి నిరాకరించడాన్ని నమోదు చేసేందుకు జీరో రూపాయి నోటును రూపొందించింది. అంతేకాదు ఈ నోటు రూ. 50కి చాలా సారూప్యంగా కనిపిస్తున్నప్పటికీ, వాటిపై "అన్ని స్థాయిలలో అవినీతిని నిర్మూలించండి" "నేను లంచం తీసుకోనని లేదా ఇవ్వనని వాగ్దానం చేస్తున్నాను." అనే అవినీతి వ్యతిరేక నినాదాలు ఉంటాయి. పైగా దశాబ్ద కాలంగా ప్రతి నెలా ఈ సున్న రూపాయి నోట్ల పంపిణీ జరుగుతోంది. అయితే నిజానికి అవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)చే ముద్రించినవి కావు. ఈ ఐదవ స్థంభానికి అధ్యక్షుడు అయిన విజయ్ ఆనంద్ ఈ కార్యక్రమ సమర్థత పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయ్ ఆనంద్ మాట్లాడుతూ..."ప్రజలు ఇప్పటికే వాటిని ఉపయోగించడం ప్రారంభించారు. అది పని చేస్తోంది కూడా. ఒక ఆటో-రిక్షా డ్రైవర్‌ను అర్ధరాత్రి ఒక పోలీసు తన ఆటోని ఆపి డబ్బు ఇస్తే వెళ్లిపోవచ్చు అని అన్నప్పుడు ఆ డ్రైవర్ ఈ సున్న రూపాయి నోటుని ఇచ్చాడు. ఆ పోలీసు ఒక్కసారిగా షాక్ అయ్యి నవ్వుతూ ఆ ఆటో డ్రైవర్ని విడిచి పెట్టాడు. దీని ఉద్దేశ్యం లంచం వద్దు అని ప్రజలలో విశ్వాసం కలిగించడమే" అని అన్నారు. ఈ మేరకు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం వంటి వివిధ భాషల్లో లక్షలాది జీరో రూపాయల నోట్లను ముద్రించాం అని చెప్పారు. అంతేకాదు ముఖ్యంగా అవినీతి, లంచగొండితనంపై అవగాహన కల్పించేందుకు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో వాలంటీర్లు పంపిణీ చేశారని విజయ్ ఆనంద్ చెబుతున్నారు. (చదవండి: ‘ఆ రోజు చేసిన పని నన్ను పదే పదే కలచివేసింది') -
డ్రగ్స్ అడిక్ట్ టూ విన్నర్!: ‘ఆ రోజు చేసిన పని నన్ను పదే పదే కలచివేసింది'
ఇటీవలకాలంలో యువత ఎక్కువగా సిగరెట్స్, మద్యం, డ్రగ్స్ వంటి వాటికి బానిసై తమ జీవితాలను ఏవిధంగా నాశనం చేసుకుంటున్నారో చూశాం. ఆఖరికి సినితారలను సైతం ఈ జాడ్యం వదలడం లేదు. ప్రముఖ సెలబ్రెటి పిల్లలతో సహా అందరూ వీటికి బానిసై పోతున్నారు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ప్రజల్లోనూ, యువతలోను మార్పు రాకపోవడం మన దురదృష్టమో లేక మరోకటో తెలియదు. అయితే ఇక్కడొక మహారాష్ట్రవాసి చిన్నవయసులో సిగరెట్ కాల్చడం, మద్యం సేవించడం వంటి వాటికి బానిసయ్యాడు. అయితే అతను అలా వాటికి అడిక్టి అవ్వడమే తనకు వరంగా మారిందనే చెప్పలి. ఒక రకంగా తన జీవితాన్ని అర్థవంతంగా మార్చింది. అసలు విషయంలోకెళ్లితే...మహారాష్ట్రలోని గోధాని గ్రామ నివాసి అయిన పంకజ్ మహాజన్ నాల్గవ తరగతి చదువుతున్నప్పటి నుంచి పొగాకు, మద్యపానానికి బానిసయ్యాడు. దీనికితోడు మద్యానికి బానిసైన తండ్రి, వికలాంగురాలైన తల్లి ఉండటంతో పంకజ్కి సరైన మార్గదర్శకత్వం లేకుండా పోయింది. అయితే పంకజ్ తండ్రి పోగాకుతో సహా నిత్యావసరాల వస్తువులు విక్రయించే దుకాణాన్ని నడిపేవాడు. ఈమేరకు పంకజ్ తన తండ్రి, ఆ గ్రామ పెద్దలు స్టైయిలిష్‌గా పొగాకు తాగటం చూసి తాను కూడ వారి అడుగుజాడల్లోనే నడవాలని అనుకున్నాడు. అంతేకాదు ఎవరికి తెలియకుండా పొగాకు కాల్చడం కూడా నేర్చుకున్నాడు. అమ్మను కాపాడుకోలేని స్థితి.... అయితే అది ఎంతవరకు వచ్చిందంటే ఒక్కరోజులోనే పొగాకు ప్యాకెట్ మొత్తం అయిపోయిలా తాగేంతవరకు వచ్చింది. అంతేకాదు పంకజ్ సిగరెట్ కాలుస్తున్నప్పటికీ తండ్రి మందలించకపోవడంతో పంకజ్కి అది తప్పు అన్న విషయం తెలియలేదు. ఆ తర్వాత పంకజ్ మద్యం సేవించటం కూడా మొదలు పెట్టేశాడు. దీంతో ఆ బస్తీలో ఉన్న మిగతా పిల్లల తల్లిదండ్రులు పంకజ్ దగ్గరకు వెళ్లనిచ్చేవారు కాదు. మరోవైపు తన తండ్రి మద్యానికి బానిసై డబ్బులు కోసం తన తల్లిని, తనను కొడతుండటంతో పదిలోనే చదువుకు స్వస్తి పలికి డబ్బులు సంపాదించటం మొదలు పెట్టాడు. అయితే ఒకరోజు తన తండ్రి తాగి వచ్చి తన తల్లిని చితకొట్టాడు. ఈ క్రమంలో ఆమె తలకు పెద్ద గాయం అవుతుంది. అయితే అక్కడే ఉన్న పంకజ్ తన తండ్రిని ఆపడానికి గాని తన తల్లిన కాపాడుకోవటానికి గాని ప్రయత్నించకుండా అలా చూస్తుండిపోతాడు. జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన.... చుట్టుపక్కల వాళ్లు వాళ్ల అమ్మను ఆసుపత్రిలో జాయిన్ చేసి కాపాడతారు. ఆ సంఘటనే తన జీవితాన్ని మారుస్తుంది. పంకజ్ ఈ చెడ్డఅలవాట్లకు బానిసయ్యి నీరసించపోవటం, అలిసిపోయి ఏ పని చేయలేని స్థితికి చేరుకుంటాడు. అందువల్లే ఆ రోజు అతను తన తండ్రి దాడి చేస్తున్నప్పుడు తల్లిని కాపాడే శక్తి కూడా లేక నిస్సత్తువగా చూస్తుండిపోయాడు. ఆ సంఘటనే తన జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. అనుకోకుండా పంకజ్ గ్రామానికి ఎన్జీవోలు వచ్చారు. అయితే ఆ గ్రామస్తులు కారణంగా పంకజ్ గురించి ఎన్జీవోలకు తెలుస్తుంది. ఈ మేరకు వారు స్వచ్ఛందంగా పంకజ్ విషయంలో జోక్యం చేసుకుని విజయ్ బార్సే ప్రారంభించిన ఆశ్రమంలో జాయిన్ చేశారు. అది ఎన్జీవోల ద్వారా జాయిన్ అయిన నిరాశ్రయులైన పిల్లలకు ఉచితంగా ఫుట్‌బాల్ శిక్షణ ఇచ్చే సెంటర్. ఈ మేరకు ఉచిత ఫుట్‌బాల్ శిక్షణ మాత్రమే కాక స్టైఫండ్ ఇచ్చి స్కూలుకి కూడా పంపిస్తారు. అయితే ఒక్కొక్కసారి తన చెడ్డ అలవాట్ల వైపు వెళ్లాలనిపించినా అతను వెళ్లలేదు. ఆ సంఘటనే కళ్ల ముందు మెదలడంతో... ఆ రోజు తన తల్లి నెత్తురోడుతుంటే అంబులెన్స్‌కి కూడా కాల్ చేయలేని నిస్సహాయ స్థితి అతనికి గుర్తుకు వచ్చేదని పంకజ్ ఇతరులకు పదే పదే చెబుతూ ఉండేవాడు. అంతేకాదు పంకజ్ ఎంతో కసిగా ఫుట్ బాల్ ఆడటం కూడా నేర్చకునేవాడు. పైగా ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ చేయడం మానేవాడు కాదు. ఆ నిర్విరామ కృషే అతన్ని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఫుట్బాల్ని ఆడేలా చేసింది. ఆ తర్వాత అతను 2013లో హోమ్‌లెస్ వరల్డ్ కప్ కోసం తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు పోలాండ్‌కు వెళ్లాడు. అప్పుడే అతని గురించి పత్రికల్లోనూ, మీడియాల్లోనూ బాగా వచ్చింది. అంతేకాదు ఏ గ్రామస్థులైతే అసహ్యంగా చూశారో వారే నన్ను ఇప్పుడూ మెచ్చకుంటున్నారని చెప్పాడు. అయితే తనలాంటి పిల్లలకు సాయం చేయడం కోసం ఎన్జీవోలో పేరు నమోదు చేసుకున్నానని, పైగా తాను ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశానని చెప్పాడు. ఇతని కథ నిజంగా స్ఫూర్తిధాయకం కదా! (చదవండి: బాప్రే! 14 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం... ఐతే ఆ ఇద్దరు...!! షాకింగ్ వీడియో)