
చిందులు వేస్తున్న ఎన్జీఓ నాయకులు (ఇన్‌సెట్‌లో) వీక్షిస్తున్న అశోక్‌బాబు
పోలవరం రూరల్: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం గ్రామంలో ఏపీ ఎన్జీఓ నాయకులు శనివారం రాత్రి మద్యం తాగి చిందులు వేశారు. శనివారం ఉదయం పోలవరం పనులను పరిశీలించడంతో పాటు ప్రాజెక్ట్ ప్రాంతంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ఏపీలోని 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరయ్యారు.
గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక రెస్ట్‌హౌస్‌లో వారంతా మద్యం తాగి, సినిమా పాటలకు చిందులు వేశారు. ఆదర్శంగా ఉండాల్సిన ఉద్యోగులు బహిరంగంగా మద్యం సేవించి కిక్కులో మునిగితేలడం విమర్శలకు తావిస్తోంది. కార్యక్రమంలో ఏపీఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు కూడా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం వీరంతా టూరిజం బోట్లలో పేరంటాలపల్లి, పాపికొండలు తదితర ప్రాంతాల్లో పర్యటించి గోదావరి అందాలను ఆస్వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment