సాక్షి, న్యూఢిల్లీ : భారత్ ప్రజారోగ్య వ్యవస్థకు ఎన్జీవో సంస్థలను పునాదులుగా పేర్కొంటారు. గతంలో మలేరియా మొదలుకొని ఏ మహమ్మారి దాడి చేసినా మేమున్నామంటూ ఎన్జీవో సంస్థలు ముందుకు వచ్చి ప్రజలకు అండగా నిలిచేవి. నేడు ప్రాణాంతక కరోనా వైరస్ కోరలుచాచి కాటేస్తున్నా చెప్పుకోతగ్గ స్థాయిలో ఎన్జీవో సంస్థలు ముందుకు వచ్చి క్రియాశీలకంగా పని చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకేనేమో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో తమవంతు సేవలను అందించాల్సిందిగా ఎన్జీవో సంస్థలకు ‘నీతి ఆయోగ్’ ఇటీవల పిలుపునిచ్చింది.
(చదవండి: 5 సెకన్లలో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు!)
ఢిల్లీలోని ‘ఎంసీకేఎస్ ఫుడ్ ఫర్ ది అంగ్రీ ఫౌండేషన్’, సాఫా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ‘యూత్ ఫీడ్ ఇండియా ప్రోగ్రామ్’, ‘శరణార్థి సేవ’ లాంటి సంస్థలు ప్రజల అన్నదాన కార్యక్రమాలకు మాత్రమే పరిమితమై పనిచేస్తున్నాయి. దేశంలోని ఎన్జీవో సంస్థలకు అందుతున్న విదేశీ విరాళాలను నియంత్రించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో ‘ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్’ను తీసుకొచ్చింది.
దాంతో ఒక్కసారిగా దేశంలోని 20 వేలకు పైగా ఎన్జీవో సంస్థల లైసెన్స్‌లు రద్దయ్యాయి. దేశంలో పని చేస్తున్న ఎన్జీవో సంస్థలకు కొలరాడో కేంద్రంగా పని చేస్తోన్న ‘క్రిస్టియన్ చారిటీ కంపాషన్ ఇంటర్నేషనల్’ అత్యధికంగా అంటే, ఏటా 45 మిలియన్ డాలర్లు (దాదాపు 344 కోట్ల రూపాయలు) విరాళంగా ఇచ్చేది. ముఖ్యంగా దారిద్య్రంలో బతుకుతున్న నిమ్న వర్గాల పిల్లల కోసం కషి చేస్తున్న ఎన్జీవోలకే విరాళాలు ఎక్కువగా ఇచ్చేది.
('రికవరీ రేటు మన దేశంలో చాలా బాగుంది')
Comments
Please login to add a commentAdd a comment