Non-Government Organizations
-
కరోనాపై పోరులో కానరాని ఎన్జీవోలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ ప్రజారోగ్య వ్యవస్థకు ఎన్జీవో సంస్థలను పునాదులుగా పేర్కొంటారు. గతంలో మలేరియా మొదలుకొని ఏ మహమ్మారి దాడి చేసినా మేమున్నామంటూ ఎన్జీవో సంస్థలు ముందుకు వచ్చి ప్రజలకు అండగా నిలిచేవి. నేడు ప్రాణాంతక కరోనా వైరస్ కోరలుచాచి కాటేస్తున్నా చెప్పుకోతగ్గ స్థాయిలో ఎన్జీవో సంస్థలు ముందుకు వచ్చి క్రియాశీలకంగా పని చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకేనేమో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో తమవంతు సేవలను అందించాల్సిందిగా ఎన్జీవో సంస్థలకు ‘నీతి ఆయోగ్’ ఇటీవల పిలుపునిచ్చింది. (చదవండి: 5 సెకన్లలో కరోనా వైరస్ను గుర్తించవచ్చు!) ఢిల్లీలోని ‘ఎంసీకేఎస్ ఫుడ్ ఫర్ ది అంగ్రీ ఫౌండేషన్’, సాఫా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ‘యూత్ ఫీడ్ ఇండియా ప్రోగ్రామ్’, ‘శరణార్థి సేవ’ లాంటి సంస్థలు ప్రజల అన్నదాన కార్యక్రమాలకు మాత్రమే పరిమితమై పనిచేస్తున్నాయి. దేశంలోని ఎన్జీవో సంస్థలకు అందుతున్న విదేశీ విరాళాలను నియంత్రించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో ‘ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్’ను తీసుకొచ్చింది. దాంతో ఒక్కసారిగా దేశంలోని 20 వేలకు పైగా ఎన్జీవో సంస్థల లైసెన్స్లు రద్దయ్యాయి. దేశంలో పని చేస్తున్న ఎన్జీవో సంస్థలకు కొలరాడో కేంద్రంగా పని చేస్తోన్న ‘క్రిస్టియన్ చారిటీ కంపాషన్ ఇంటర్నేషనల్’ అత్యధికంగా అంటే, ఏటా 45 మిలియన్ డాలర్లు (దాదాపు 344 కోట్ల రూపాయలు) విరాళంగా ఇచ్చేది. ముఖ్యంగా దారిద్య్రంలో బతుకుతున్న నిమ్న వర్గాల పిల్లల కోసం కషి చేస్తున్న ఎన్జీవోలకే విరాళాలు ఎక్కువగా ఇచ్చేది. ('రికవరీ రేటు మన దేశంలో చాలా బాగుంది') -
‘మోన్శాంటో’ను తరిమి కొట్టండి
స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: దేశ ఆహార స్వావలంబనకు ముప్పుగా పరిణమిస్తున్న బహుళ జాతి విత్తన సంస్థ ‘మోన్శాం టో’ను తరిమికొట్టాలని పలు స్వచ్ఛంద సంస్థలు, రైతు సం ఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. జన్యుమార్పిడి పంటలపై క్షేత్రస్థాయి పరిశోధనలను నిషేధించాలని డిమాండ్ చేశారు. తమ వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో మోన్శాంటో సంస్థ ఎంతటి అనైతిక పద్ధతులకైనా పాల్పడుతోందని విమర్శించారు. ఈ మేరకు స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగిన సదస్సులో పలు సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లోని శాస్త్రవేత్తలు మోన్శాంటోకు వ్యతిరేకంగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి, రైతు స్వరాజ్యవేదిక నేత విస్సా కిరణ్ కుమార్, ‘చేతన’ నరసింహా రెడ్డి, డాక్టర్ అరిబండి ప్రసాదరావు, ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త గంటా సత్యనారాయణ రెడ్డి, సీపీఐ రైతు సంఘం నేత రామకృష్ణ, భారతీయ కిసాన్ సంఘ్ నేత శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.