స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: దేశ ఆహార స్వావలంబనకు ముప్పుగా పరిణమిస్తున్న బహుళ జాతి విత్తన సంస్థ ‘మోన్‌శాం టో’ను తరిమికొట్టాలని పలు స్వచ్ఛంద సంస్థలు, రైతు సం ఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. జన్యుమార్పిడి పంటలపై క్షేత్రస్థాయి పరిశోధనలను నిషేధించాలని డిమాండ్ చేశారు. తమ వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో మోన్‌శాంటో సంస్థ ఎంతటి అనైతిక పద్ధతులకైనా పాల్పడుతోందని విమర్శించారు. ఈ మేరకు స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగిన సదస్సులో పలు సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు.
ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లోని శాస్త్రవేత్తలు మోన్‌శాంటోకు వ్యతిరేకంగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి, రైతు స్వరాజ్యవేదిక నేత విస్సా కిరణ్ కుమార్, ‘చేతన’ నరసింహా రెడ్డి, డాక్టర్ అరిబండి ప్రసాదరావు, ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త గంటా సత్యనారాయణ రెడ్డి, సీపీఐ రైతు సంఘం నేత రామకృష్ణ, భారతీయ కిసాన్ సంఘ్ నేత శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘మోన్‌శాంటో’ను తరిమి కొట్టండి
Published Thu, Oct 10 2013 1:20 AM | Last Updated on Mon, Oct 1 2018 4:38 PM
Advertisement
Advertisement