![Union minister Pralhad Joshi to head central team in meeting with farmer leaders](/styles/webp/s3/article_images/2025/02/15/JOSHI.jpg.webp?itok=l_0dggKT)
చండీగఢ్: పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత కల్పించడం వంటి డిమాండ్లపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సారథ్యంలోని బృందం శుక్రవారం చండీగఢ్‌లో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించింది. రెండున్నర గంటలకుపైగా జరిగిన ఈ చర్చల్లో సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాలకు చెందిన 28 మంది స భ్యుల ప్రతినిధి బృందం పాల్గొంది. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోని శంభు, ఖనౌరీల్లో ఈ రెండు రైతు సంఘాలు ఏడాదికిపైగా నిరసనలు సాగిస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వం తరఫున వ్యవసాయ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుద్దియన్, ఆహారం, పౌరసరఫరా శాఖ మంత్రి లాల్ చంద్ తదితరులు పాలొ న్నారు.
మహాత్మాగాంధీ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప బ్లిక్ అడ్మినిస్ట్రేషన్(ఎంజీఎస్‌ఐపీఏ)లో జరిగిన చ ర్చలు సుహృద్భావ వాతావరణంలో సాగాయన్నా రు. రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం తీసు కున్న చర్యలను ఈ సందర్భంగా రైతు నేతలకు వివరించామని ప్రహ్లాద్ జోషి చెప్పారు. తదుపరి రౌండ్ చర్చలు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో 22న జరుగుతాయని మంత్రి చెప్పారు. నిరశనదీక్ష సాగిస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఖనౌరీ నుంచి ఆయన్ను అంబులెన్సులో తీసుకువచ్చారు. ఆయన ప్రయాణానికి నాలుగు గంటల సమయం పట్టిందని రైతు నేత కాకా సింగ్ కొట్ర చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment