Farmers Movement
-
కమలం కమాల్!
హరియాణా. వివాదాస్పద మూడు సాగు చట్టాలపై రైతుల ఉద్యమానికి వేదికగా నిలిచిన రాష్ట్రం. అగ్నివీర్ పథకంతో ఆర్మీలో శాశ్వత నియామక అవకాశాలను కోల్పోతామని యువత తీవ్ర నిరాశంలో నిండిపోయిన రాష్ట్రం. ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ చూపిన దూకుడు, ఆపార్టీ అతి ఆత్మవిశ్వాసాన్ని కళ్లారా చూసిన రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రం పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతనూ కూడా పక్కనబెట్టి మళ్లీ కమలదళానికి అధికార పగ్గాలు అప్పజెప్పిన తీరు ఎగ్జిట్‌పోల్ సర్వేలనేకాదు రాజకీయ విశ్లేషకులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. 1966లో రాష్ట్రంగా ఏర్పడ్డాక హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఇదే తొలిసారి. ఏకమైన జాట్ వ్యతిరేక వర్గాలుఎగ్జిట్ పోల్ సర్వేలు సైతం తలకిందులైన ఈ బీజేపీ విజయం వెనుక జాట్యేతర వర్గం ఓటర్లు ఉన్నారని అర్థమవుతోంది. ‘‘జాట్లు కాంగ్రెస్‌కు ఓటేశారు. అయితే బలమైన జాట్లను ఎదుర్కొనేందుకు జాట్యేతర వర్గాలైన ఓబీసీలు, దళితులు, అగ్రవర్ణాల ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడంలో బీజేపీ నేతలు సఫలీకృతులయ్యారు. జాట్లు పూర్తిగా ఒక్క కాంగ్రెస్‌కే ఓటేయకపోవడమూ బీజేపీకి లాభించింది’’ అని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో అధ్యయనకారుడు రాహుల్ వర్మ విశ్లేషించారు. బీజేపీ వెంటే అహిర్వాల్దక్షిణ హరియాణాలోని అహిర్వాల్ ప్రాంత ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉంటారు. 2014, 2019లో బీజేపీ విజయానికి ఈ ప్రాంత ఓటర్ల మద్దతే ప్రధాన కారణం. ఈసారి కూడా అహిర్వాల్ ఓటర్లు బీజేపీ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో ఈసారీ అహిర్వాల్ ప్రాంతంలోని మెజారిటీ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లోనూ 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో 10 చోట్ల బీజేపీ ఘన విజయం సాధించడం గమనార్హం. హరియాణా సైబర్ కేంద్రంగా కీర్తికెక్కిన గురుగ్రామ్ సైతం బీజేపీ వెంటే నిలిచింది. ఫరీదాబాద్‌సహా చాలా పట్టణ ప్రాంతాల ప్రజలు మొదట్నుంచీ బీజేపీకి వెంటే నడవటం ఆ పార్టీ విజయాన్ని సులభతరం చేసింది.నాయబ్ సింగ్ సైనీ నాయకత్వంకేవలం 210 రోజుల క్రితమే సీఎంగా పగ్గాలు చేపట్టిన 54 ఏళ్ల నయాబ్ సింగ్ సైనీ తన ప్రజాకర్షక పాలనతో ఓటర్లను తన వైపునకు తిప్పుకున్నారు. గెలిస్తే ఈయననే మళ్లీ సీఎంను చేస్తానని బీజేపీ ప్రకటించడంతో ఖట్టర్ నిష్క్రమణ తర్వాత రాష్ట్రంలో పార్టీ అగ్రనేతగా అవతరించారు. హరియణా బీజేపీ మాజీ చీఫ్ అయిన సైనీ కేవలం ‘డమ్మీ సీఎం’ అంటూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు తప్పు అని నిరూపించారు.గ్రామపంచాయతీల వ్యయ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.21 లక్షలకు పెంచడం, గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులో కనీసం చార్జీల రద్దు, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సహా పలు అభివృద్ది పథకాలు సైనీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకాన్నిపెంచాయి. అగ్నివీర్లకు ఆర్మీ నుంచి బయటికొచ్చాక ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి యువతలో సైనీ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి..దాదాపు తొమ్మిదిన్నర ఏళ్ల పాటు సీఎంగా కొనసాగిన ఖట్టర్ పట్ల రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. దీనిని ముందే పసిగట్టిన బీజేపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అకస్మాత్తుగా ఆయనను తప్పించి సైనీని సీఎంను చేసింది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు ఖట్టర్‌ను పూర్తిగా పక్కనబెట్టింది. రాష్ట్రంలో ఎక్కడా పోస్టర్లలో కూడా ఖట్టర్ ఫొటో వేయలేదు. దీంతో సీఎం, ప్రభుత్వ వ్యతిరేకత చల్లబడిందని చెప్పొచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనబెట్టిన బీజేపీఏకంగా సీఎం ఖట్టర్‌ను పక్కనబెట్టిన కమలం పార్టీ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలపై దృష్టిపెట్టింది. ఏఏ స్థానాల్లో ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందో వారందరికీ టికెట్లు నిరాకరించింది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులపై ఉన్న వ్యతిరేకతకు పోగొట్ట గలిగింది. దాదాపు 60 కొత్తముఖాలకు టికెట్ ఇచ్చి కొత్త ప్రయోగం చేసింది. రైతులను బుజ్జగించే యత్నం..వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలపై హరియాణా రైతులు ఉద్యమించిన నేపథ్యంలో రైతాంగం ఆగ్రహం పోలింగ్‌లో బయటపడకుండా ఉండేందుకు ఈ ఏడాది ఆగస్టులో మరో 10 పంటలను జోడించి మొత్తంగా 24 పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రకటనతో రైతన్నలు ప్రభుత్వానికి అనుకూలంగా మారారని తెలుస్తోంది. రూ.500కే గ్యాస్ సిలిండర్రూ.500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని కమలనేతలు హామీ ఇచ్చారు. మహిళలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం, యువతకు 2 లక్షల ఉద్యోగాలు వంటి వాగ్దానాలకు ఓటర్లు ఆకర్షితులయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శంభూ ఉద్యమరైతుల గోడు వినేందుకు కమిటీ
న్యూఢిల్లీ: గత 200 రోజులుగా పంజాబ్, హరియాణా సరిహద్దులోని శంభూ సరిహద్దు వద్ద ఉద్యమం కొనసాగిస్తున్న రైతుల సాధకబాధకాలను పట్టించుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం ముందుకొచి్చంది. ఇందుకోసం పంజాబ్, çహరియాణా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ నవాబ్ సింగ్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. నిరసనబాట పట్టిన రైతన్నల సమస్యలను వినాలని, నెలల తరబడి రహదారిపై నిలిపిన వారి ట్రాక్టర్లు, ట్రాలీలు తదితరాలను హైవేల నుంచి తొలగించేందుకు రైతులను ఒప్పించాలని కమిటీకి కోర్టు సూచించింది. కమిటీ వారం రోజుల్లోపు తొలి భేటీ జరపాలని సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాల్ల ధర్మాసనం ఆదేశించింది. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి శంభూ వద్ద ప్రభుత్వం ఏర్పాటుచేసిన బారీకేడ్లను తొలగించాలంటూ హైకోర్టు ఇచి్చన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హరియాణా ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పై విధంగా స్పందించింది. ఈ కమిటీకి సలహాలు, సూచనలు చేసేందుకు పంజాబ్, హరియాణా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు కోర్టు స్పష్టంచేసింది. పిటిషన్ తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదావేసింది. -
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
పోరాటాల పురిటి గడ్డగా పేరొందిన పంజాబ్‌లో ఎన్నికల పోరు ఎప్పుడూ హై ఓల్టేజ్‌లో ఉంటుంది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)లను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊడ్చిపారేసిన ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ దుమ్ము రేపే ప్రయత్నంలో ఉంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగస్వాములైన ఆప్, కాంగ్రెస్ పంజాబ్‌లో మాత్రం విడిగా పోటీ చేస్తూ పరస్పరం తలపడుతుండటం విశేషం. గత లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కొల్లగొట్టిన కాంగ్రెస్ ఈసారీ సత్తా చాటాలని చూస్తోంది. అకాలీ–బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమికి ఆ ఎన్నికల్లో అంతంత ఫలితాలే వచ్చాయి. రైతు ఉద్యమం నేపథ్యంలో బీజేపీకి అకాలీ కటీఫ్‌తో పంజాబ్‌లో ఈసారి పారీ్టలన్నీ ఒంటరి పోరాటమే చేస్తున్నాయి... స్టేట్స్కాన్పంజాబ్ ఎన్నికల్లో కొన్నేళ్లుగా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 13 చోట్లా ఒంటరి పోరాటం చేసి ఏకంగా 8 స్థానాలు చేజిక్కించుకుంది. అకాలీదళ్ 10, బీజేపీ మూడు చోట్ల పోటీపడ్డా చెరో రెండు సీట్లతో సరిపెట్టుకున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా 4 సీట్లు కొల్లగొట్టిన కేజ్రీవాల్ పార్టీ అన్నిచోట్లా పోటీ చేసి ఒక్క స్థానానికే పరిమితమైంది. ఆ తర్వాత పంజాబ్‌లో రాజకీయాలు సమూలంగా మారిపోయాయి. 2020లో మోదీ సర్కారు వ్యవసాయ సంస్కరణ చట్టాలపై వ్యతిరేకంగా పంజాబ్‌లో వ్యతిరేకత తారస్థాయిలో వ్యక్తమైంది. ఆ దెబ్బకు 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ కుదేలయ్యాయి. సరికొత్త రాజకీయాల వాగ్దానంతో ఆప్ అధికారాన్ని తన్నుకుపోయింది. బీజేపీకి మళ్లీ ‘రైతు’ గండం... హస్తినతో పాటు దేశాన్నీ కుదిపేసిన సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమ సారథులు పంజాబ్ రైతులే. వారి ఆగ్రహ ప్రభావం ఎక్కడ తమపై పడుతుందోననే ఆందోళనతో అకాలీదళ్ 2020లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నా లాభం లేకపోయింది. సుర్జీత్ సింగ్ బర్నాలా, ప్రకాశ్ సింగ్ బాదల్ వంటి దిగ్గజాల సారథ్యంలో వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు పంజాబ్‌లో ఎదురీదుతోంది. తాజాగా మరోసారి రైతులు ‘చలో ఢిల్లీ’ అంటూ ఆందోళనల బాట పట్టడం పంజాబ్‌లో బీజేపీకి విషమ పరీక్షగా మారింది. ప్రచారంలోనూ కమలనాథులకు రైతుల నుంచి నిరసనల సెగ బాగానే తగులుతోంది. అభివృద్ధి నినాదం, మోదీ ఫ్యాక్టర్‌తోనే తదితరాలనే నమ్ముకుని బీజేపీ ఒంటరి పోరాటం చేస్తోంది. కెపె్టన్ అమరీందర్ తన పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను 2022లో బీజేపీలో విలీనం చేశారు. కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆయన భార్య ప్రణీత్ కౌర్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం విశేషం. లూధియానా కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టూ కూడా బీజేపీలో చేరి పార్టీ టికెట్‌పై అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.కలి‘విడి‘గా కాంగ్రెస్, ఆప్... పంజాబ్‌లో నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ, కెప్టెన్ అమరీందర్ సింగ్ వర్గ పోరు కాంగ్రెస్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. సిద్ధూకు పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టిన అధిష్ఠానం పార్టీ వీర విధేయుడైన కెపె్టన్‌కు పొమ్మనకుండా పొగబెట్టింది. దాంతో ఆయన వేరుకుంపటి పెట్టుకున్నారు. పర్యవసానంగా రెండేళ్లకే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తల బొప్పికట్టింది. 117 సీట్లకు ఏకంగా 92 చోట్ల గెలిచి ఆప్ ప్రభంజనం సృష్టించింది. ఢిల్లీ ఆవలా దుమ్ము రేపగలమని నిరూపించింది. ఆప్ నేత భగవంత్ మాన్ సీఎం అయ్యారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమితో జట్టుకట్టిన ఆప్ పంజాబ్‌లో మాత్రం పొత్తుకు ససేమిరా అంది. దాంతో కాంగ్రెస్, ఆప్ విడిగానే పోటీ చేస్తున్నాయి. గతంలో రైతుల పోరాటానికి దన్నుగా నిలిచిన ఆ పార్టీలకు ఎన్నికల ముందు మళ్లీ రైతులు ఆందోళనలకు దిగడం కలిసి రానుంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి రైతుల డిమాండ్లను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చడం విశేషం. 6 న్యాయాలు, 25 గ్యాంరటీలనూ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. కార్పొరేట్లతో బీజేపీ కుమ్మక్కు, అధిక ధరలు, నిరుద్యోగం వంటి అంశాలనూ గట్టిగా ప్రచారం చేస్తోంది.కేజ్రీవాల్ అరెస్టు ఆప్‌కు ప్లస్సా, మైనస్సా! ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో లోక్‌సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడం సంచలనంగా మారింది. బీజేపీ కక్షగట్టి విపక్ష నేతలను జైల్లో పెడుతోందంటూ ఇండియా కూటమి దేశవ్యాప్తంగా మూకుమ్మడి ఆందోళనలకు దిగింది. తొలుత కాస్త తడబడ్డ ఆప్ నేతలు ప్రచారంలో జోరు పెంచారు. ‘జైల్ కా జవాబ్ ఓట్ సే’ (జైల్లో పెట్టినందుకు ఓటుతో జవాబిద్దాం) నినాదంతో దూసుకెళ్తున్నారు. కేజ్రీవాల్ భార్య సునీత ప్రచార బరిలో దిగడంతో ఆప్ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. ఏమైనా ఎన్నికల ముంగిట అధినేత అందుబాటులో లేకపోవడం ఆప్‌కు ఇబ్బందికరమేనని కొందరంటుండగా, ఆప్‌కు సానుభూతి కలిసొస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.సర్వేల సంగతేంటి.. పంజాబ్ రైతుల తాజా ఆందోళనలు బీజేపీపై ప్రభావం చూపవచ్చని సర్వేలు అంచనా వేస్తున్నాయి. 13 సీట్లలో ఆప్, కాంగ్రెస్‌లకే చెరో సగం దక్కవచ్చని లెక్కలేస్తున్నాయి. బీజేపీకి 2, అకాలీదళ్‌కు ఒక సీటు రావచ్చని కొన్ని సర్వేలు అంటున్నాయి.చిన్న రాష్ట్రమే అయినా ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్ రూపంలో పంజాబ్ ఏకంగా ఇద్దరు ప్రధానులను అందించింది. వారి జన్మస్థలాలు దేశ విభజనతో ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోకి వెళ్లిపోయాయి. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీష్ జన్మస్థలమేమో మన పంజాబ్‌లో ఉండటం విశేషం.కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టినా ఆయన సిద్ధాంతాలను అరెస్టు చేయగలరా!? దేశవ్యాప్తంగా ఆయనకు మద్దతు పలుకుతున్న లక్షలాది కేజ్రీవాల్‌లను ఏ జైల్లో పెడతారు? కేజ్రీవాల్ వ్యక్తి కాదు, భావజాలం. మోదీ సర్కారు వేధింపులను ఇండియా కూటమి కలిసికట్టుగా ఎదుర్కొంటుంది. బీజేపీ భారతీయ జుమ్లా పార్టీగా మారింది. – ఎన్నికల ర్యాలీలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
Rakesh Tikait: చీలికకు కేంద్రమే కారణం
న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరే కంగా నెలల తరబడి పోరాడి మోదీ మెడలు వంచిన రైతు ఉద్యమంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రధానభూమిక పోషించించింది. అలాంటి ఎస్కేఎంలో తాజా చీలిక కుట్ర వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ఆరోపించారు. బీజేపీ కుట్రలు ఫలించడం వల్లే సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర)పేరిట మరో రైతు సంఘం పురుడుపోసుకుందని ఆయన వెల్లడించారు. ఎస్‌కేఎంకు ఎస్కేఎం(రాజకీయేతర)కు సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో తికాయత్ ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే.. ఆర్ఎస్ఎస్ నేతలే రైతులుగా.. ‘‘ ఒక్కటిగా ఉంటే మమ్మల్ని ఎదుర్కోలేమని గ్రహించే 41 రైతుల సంఘాల కూటమి అయిన ఎస్కేఎంలో సర్కార్ చీలిక తెచ్చింది. కొత్త సంఘం ఎస్కేఎం(రాజకీయేతర) ఢిల్లీ ఛలో అని పంజాబ్ నుంచి రైతులను తీసుకొచ్చి హరియాణాలోని శంభూ సరిహద్దు వద్ద ఉద్యమం చేస్తోంది. అసలు ఈ కార్యక్రమంపై మాతో వాళ్లు మాటవరసకైనా చెప్పలేదు. రాష్ట్రీయస్వయంసేవక్ సంఘ్ నేతలే రైతులుగా నటిస్తూ పంజాబ్ నుంచి వచ్చిన రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు’ జిల్లాకు 40 దొంగ సంఘాలు ‘‘ఒక్క నోయిడాలోనే భారతీయ కిసాన్ యూనియన్ పేరిట 37 రైతు సంఘాలను తెరిపించారు. వీటికి ఎమ్మెల్యేలే నడిపిస్తున్నారు. పంటలు, ఆ పంటల్ని పండించే కులాలవారీగా సంఘాలు తెరిచారు. జిల్లాకు 30–40 దొంగ సంఘాలు తెరచి రైతులందరినీ గందరగోళపరిచి, విభజించడమే మోదీ సర్కార్ లక్ష్యం’’ ఎర్రకోట ఘటన పోలీసు కుట్ర ‘‘ 2021 జనవరి 26 సంబంధ ఘటనల్లో పోలీసుల పాత్ర ఉంది. ఢిల్లీ ఐటీఓ ప్రాంతంలో నిలిపిఉంచిన ట్రాక్టర్లను పోలీసులే ఎర్రకోట వైపు నడిపేలా ఉసిగొల్పారు. నాడు ఉద్యమకారులను పోలీసులే తప్పుదోవ పట్టించారు. సిఫార్సులపై మరోమారు నమ్మం స్వామినాథన్ సిఫార్సులు అమలుచేస్తామని బీజేపీ 2014 మేనిఫెస్టోలో చెప్పింది. పదేళ్లయినా అమలుచేయలేదు. అందుకే 2024 బీజేపీ అజెండాను రైతులు నమ్మట్లేరు. విత్తనాలు, పురుగుమందులు, కూలీ ఖర్చులు, లీజు ఒప్పందం, ఇంథనం, సాగు ఖర్చులకు రైతు కుటుంబం ఉమ్మడి శ్రమ(ఏ2+ఎఫ్ఎల్)కు వెలకట్టి స్వామినాథన్ సిఫార్సుల్నే అమలుచేశామని కేంద్రం అబద్ధం చెబుతోంది. మేం సాగు ఖర్చుకు 50 శాతం విలువ జోడింపు అంటే సీ2+ 50 శాతం ఫార్ములా(స్వామినాథన్ సిఫార్సు) అమలుచేయాలని డిమాండ్‌చేస్తున్నాం’’ -
Farmers movement: ఉద్యమం మరింత ఉధృతం
న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందుకు ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో గురువారం జరిగిన ‘ కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్’ వేదికైంది. ఈ మహాపంచాయత్‌కు భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. 2021లో ఢిల్లీ సరిహద్దుల వెంట నెలల తరబడి ఉద్యమం, కేంద్రం తలొగ్గి వివాదాస్పద మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకున్నాక ఢిల్లీలో జరిగిన అతిపెద్ద రైతు సభ ఇదే కావడం విశేషం. సాగు, ఆహారభద్రత, సాగుభూమి, రైతు జీవనం పరిరక్షణే పరమావధిగా, మోదీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలంటూ చేసిన తీర్మానాన్ని రైతు సంఘాలు ఆమోదించాయి. రైతు సంఘాల ఉమ్మడి వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) అధ్వర్యంలో ఈ భారీసభ జరిగింది. ట్రాక్టర్లు తీసుకురావద్దని, శాంతియుత సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే లోక్‌సభ ఎన్నికల పూర్తయ్యేదాకా తమ ఉద్యమం కొనసాగిస్తామని రైతులు తీర్మానంలో స్పష్టంచేశారు. ‘ ఈ ఉద్యమం ఆగదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరిస్తుంది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మాతో చర్చించాల్సిందే’ అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. -
పంటలన్నిటికీ ఒకే విధానం సాధ్యమా?
కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించాలని చేస్తున్న రైతుల ఉద్యమం ఇప్పటికీ ఆగడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో వారి చర్చలు సఫలం కాలేదు.వారి డిమాండ్లు నెరవేరుతాయా? అన్ని పంటలకూ ఒకే విధానం అమలుచేయడం సాధ్యమేనా అన్నవి తలెత్తే ప్రశ్నలు. ప్రకటించిన 23 పంటలకు కనీస మద్దతు ధరను అమలు చేసినట్టయితే దాని ప్రభావం ఇతర అంశాలపైన, ముఖ్యంగా ఆర్థిక రంగంపైన ఉంటుందన్నది ఒక వాదన. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం కంటే మెరుగ్గా ఉండే విధంగా ‘ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్’ (ధరల స్థిరీకరణ నిధి) ఏర్పాటు చేయాలని కొందరు సూచిస్తున్నారు. దీనివల్ల రైతాంగానికి మంచి మద్దతు అందుతుంది. 2024 రైతు ఉద్యమంలో ఉధృతి తక్కువే. కానీ ప్రశ్నలు ఎక్కువ. మూడు రైతు సంస్క రణ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్నప్పటికీ రైతుల పేరిట జరుగుతున్న ఉద్యమం ఆగడం లేదు. కేవలం రెండు రాష్ట్రాల (పంజాబ్, హరియాణా) రైతులే ఇందులో ఎందుకు పాల్గొంటు న్నారు? కేంద్రం చర్చలకు పిలిచిన ప్రతిసారీ డిమాండ్లు ఎందుకు మారుతున్నాయి? అసలు చర్చలు సఫలమయ్యే దిశగా డిమాండ్లు ఉన్నాయా? ఎన్నికల ముందు మొదలైన చలో ఢిల్లీ రైతు ఉద్యమం బీజేపీ విజయావకాశాలను దెబ్బ తీసేందుకేనన్న విమర్శ మాటేమిటి? ఈ మేరకు ఒక రైతు నేత మాటలతో బయటపడిన వీడియో (మోదీ ప్రతిష్ఠను దించడమే ధ్యేయం అంటూ) మాటేమిటి? నిజానికి రెండేళ్ల నాటి రైతు ఉద్యమమమే చాలా అనుమానాలనే మిగిల్చింది. ఆఖరికి ‘టూల్–కిట్’ సాలెగూడులో కూడా రైతు ఉద్యమం చిక్కుకుంది. రైతు ఉద్యమ మంటే రైతుకు సాయపడాలి. రాజకీయాలకు కాదు. జాతి వ్యతిరేక శక్తులకు అసలే కాదు. ఐదు పంటలకు మద్దతు ధరను ఐదేళ్ల పాటు అమలు చేస్తామని కేంద్ర బృందం హామీ ఇచ్చింది. మొదట ఒప్పుకున్నట్టే ఒప్పుకున్న రైతు సంఘాలు, పంటల సంఖ్యను పెంచాయి. కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్– ఎంఎస్పీ)కి చట్ట బద్ధత కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోపాటు ఇతర అంశాలపైన ప్రభుత్వం తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ (కొన్ని ప్రాంతాలు)కు చెందిన రైతులు దాదాపు 200 యూనియన్లతో ఢిల్లీపైన దండయాత్రకు సిద్ధ మయిన నేపథ్యంలో, కేంద్రం చర్చలకు సిద్ధమైంది. చండీఘడ్‌లో నాలుగు దఫాలుగా సాగిన చర్చలు ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వలేదు. ఎంఎస్పీ ప్రభుత్వాల వ్యవసాయ ధరల నిర్ణయం విధానంలో భాగం. ఇది పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయటానికి నిర్దేశించే ధర. స్వామినాథన్ కమిషన్ కనీస మద్దతు ధరకు సిఫార్సు చేసింది. మొత్తం పంతొమ్మిది వందల పేజీలతో ఐదు నివేదికలు సమ ర్పించింది. కానీ రైతు నేతలు చెబుతున్నట్టు ఎంఎస్పీకి చట్టబద్ధత, లేదా దాని లెక్కింపు సూత్రాల గురించి ప్రతిపాదించలేదు. ఎంఎస్పీ పంట వ్యయానికి 50 శాతం అధికంగా ఉండాలని సూచించింది. రైతు సంఘాలు కోరే 23 పంటలకు ఎంఎస్పీ అమలు కష్టమని నిపుణులు, విశ్లేషకులు మొదటినుంచీ చెబుతున్నారు. ఆ నిర్ణయం ఆర్థిక రంగంపైన చూపించే ప్రభావం నేపథ్యంలో అన్ని పంటలకు ఒకే విధానం సరికాదన్నది బలంగా వినిపిస్తున్న వాదన. ఎంఎస్పీ భద్రత చట్టాన్ని అమలు చేయాలంటే, ప్రభుత్వం ఏటా రూ. 12 లక్షల కోట్లు అదనపు వ్యయాన్ని భరించాలి. అది సాధ్యం కాదని కేంద్రం కూడా చెబుతోంది. ప్రభుత్వం గనక ఎంఎస్పీ ప్రకటించిన 23 పంటలను కొనుగోలు చేసినట్టయితే అనేక అంశాలపైన దాని ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఎదుటికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వచ్చాయి. ఎంఎస్పీకి చట్టబద్ధత కంటే మెరుగ్గా ఉండే విధంగా ‘ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్’(ధరల స్థిరీక రణ నిధి) ఏర్పాటు చేయాలని కొందరు సూచిస్తున్నారు. ఎంఎస్పీ కంటే ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉత్పత్తిలో కొంత భాగాన్ని ప్రొక్యూర్ చేసి రైతులకు న్యాయబద్ధమైన ధరను అందిస్తుంది. దీనివల్ల రైతాంగానికి మంచి మద్దతు అందుతుంది. 2024 రైతు ఉద్యమం 2020 నాటి ఆందోళనకు కొనసాగింపుగా కాకుండా, ఒక వివాదం పొడిగింపుగానే కనిపిస్తోంది. 2020 నాటి ఆందోళన కేంద్రం తెచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకం. వాటిని కేంద్రం 2021లో రద్దు చేసింది. అప్పట్లో ప్రభుత్వం రైతుల డిమాండ్ల మేరకు ఆందోళన చేసిన రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయటానికి అంగీకరించింది. కానీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధతకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. కానీ నేటి ఢిల్లీ చలో ఉద్దేశం వేరు. ఆందోళనకు ముందే ఈ అంశం మీద చర్చించటానికి కేంద్రం సిద్ధమైంది. అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలనీ, రైతులకు రుణహామీ, పెన్షన్ సదుపాయాలు కల్పించా లనీ, స్వామినాథన్ కమిషన్ ఫార్ములాను అమలు చేయాలనీ రైతు సంఘాలు కోరుతున్నాయి. లఖింపుర్ హింసలో బాధితులకు న్యాయం చేయాలనీ, 2013 భూస్వాధీన చట్టాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలనీ, 2020–21 ఆందోళనల్లో చనిపోయిన రైతులకు పరిహారం అందించాలనీ కూడా కోరుతున్నారు. 2020లో ఈ నిరసనకు భారతీయ కిసాన్ యూనియన్, సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వం వహించాయి. ఇప్పుడు వివిధ యూని యన్లు నడిపిస్తున్నాయి. 2020 మాదిరిగా కేంద్రం రైతు సంఘాలను ఢిల్లీలోకి అడుగు పెట్టనీయలేదు. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలోనే ఆపేసింది. ఆందోళన నాలుగో రోజున, 63 ఏళ్ల జియాన్ సింగ్ మర ణించారు. రైతుల ఆందోళన సాగుతున్నతీరు, దానికి ఖర్చవుతున్న తీరు, ట్రాక్టర్ల స్థానంలో కోట్లాది రూపాయల విలువైన వాహనాలు అక్కడకు రావటం వంటివి చూస్తుంటే, ఈ ఆందోళనకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారో సులువుగా అర్థం చేసుకోవచ్చునన్న విమర్శలు ఉన్నాయి. రైతుల ఆందోళన ముసుగులో కొందరు యువకులు ముసు గులు ధరించి భద్రతా సిబ్బంది పైన రాళ్లు విసురుతున్నట్టు తేలింది. హరియాణా పోలీసులు ఆందోళనకారులపైన టియర్ గ్యాస్ షెల్స్, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించి ‘బలవంతపు చర్యలకు’ పాల్పడటంతో అనేక మంది గాయపడ్డారని రైతు నేతలు ఆరోపించారు. రైతుల, యూట్యూబర్ల సోషల్ మీడియా ఎకౌంట్లను రద్దు చేయటం ద్వారా ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని రైతు నేత సరవన్ సింగ్ పాంథర్ ఆరోపించారు. కేంద్రం మీద నిందంతా మోపుతున్నవారు గమనించవలసిన అంశాలు కూడా ఉన్నాయి. పంజాబ్– హరియాణా సరిహద్దుల్లో రైతు లకు, భద్రతా సిబ్బందికి మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నాలుగు దఫాలుగా చర్చలు నిర్వహించింది. రైతు నేతలు కేంద్రమంత్రుల మధ్య (ఫిబ్రవరి 8, 12, 15, 18) చర్చలు జరిగాయి. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పాల్గొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, వ్యవ సాయశాఖ మంత్రి గుర్మీత్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ చర్చలు ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వలేదు. ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు జాతీయ రహదారుల మీద కనిపించకూడదు. దానిని రైతులు ఉల్లంఘించారు. ఇంకా చాలా విషయాలలో చట్టాన్ని చేతుల్లోకి తీసు కుంటున్నారు. కాగా 23 పంటలకు ఒకే విధమైన విధానం సాధ్యం కాదని ఎవరైనా అంగీకరించాలి. కొత్తగా మళ్లీ, పాడి రైతుల సమస్యలను ఈ ఆందోళన ఎందుకు పట్టించుకోదన్న ప్రశ్న మొదలయింది. ఇంకా చేపల చెరువుల రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శ కూడా ఉంది. ఇప్పుడు కనీస మద్దతు ధర శాశ్వతంగా ఇవ్వాలని రైతులు చెబుతున్న 23 పంటలు మొత్తం వ్యవసాయంలో 30 శాతం లోపే. మరి మిగిలిన వ్యవసాయోత్పత్తుల మాటేమిటి? ఈ ప్రశ్నకు రైతు నేతల నుంచి సమాధానం రావాలి. ఏమైనా రైతుల సమస్యల పేరుతో రాజకీయ లబ్ధిని పొందాలని కొన్ని బీజేపీయేతర పక్షాలు కోరుకుంటున్నాయి. అందుకు అవి ఎంచుకున్న మార్గం రోడ్ల మీద తేల్చుకోవడం. రైతు సమస్యల పరిష్కారం అంటే రైతులకు చెడ్డపేరు తేవడం కాదు. వారి మీద దారుణ ముద్ర పడేలా చేయడం కాదు. పి. వేణుగోపాల్ రెడ్డి వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ ‘ pvg@ekalavya.net -
Farmers movement, Delhi Chalo: కేసు నమోదయ్యాకే అంత్యక్రియలు
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద బుధవారం ‘ఢిల్లీ చలో’ఆందోళనల్లో పాల్గొన్న రైతులు హరియాణా పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో శుభ్‌కరణ్‌సింగ్(21) అనే యువ రైతు గాయాలతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. శుక్రవారం ఖనౌరీ వద్ద కొనసాగుతున్న ఆందోళనలో పలువురు రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. శుభ్‌కరణ్ మృతికి బాధ్యులైన వారిపై పంజాబ్ ప్రభుత్వం కేసు నమోదు చేసే వరకు అంత్యక్రియలు జరిపేది లేదని నేతలు తేల్చి చెప్పారు. శుభ్‌కరణ్‌ను అమరుడిగా ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్ మేరకు శుభ్‌కరణ్ కుటుంబానికి రూ.కోటి పరిహారంతోపాటు అతడి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ పంజాబ్ సీఎం మాన్ ప్రకటించారు. రైతు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని కూడా సీఎం స్పష్టం చేశారు. అనంతరం రైతు నేత సర్వాన్ సింగ్ పంథేర్ మీడియాతో మాట్లాడారు. ‘మాక్కావాల్సింది డబ్బు కాదు. మృతికి బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే మాకు ముఖ్యం. ఆ తర్వాతే అంత్యక్రియలు జరుపుతాం. ఇందుకు అవసరమైతే 10 రోజులైనా సరే వేచి ఉంటామని శుభ్‌కరణ్ కుటుంబసభ్యులు మాకు చెప్పారు’అని వివరించారు. రైతులపైకి టియర్ గ్యాస్.. హిసార్: హరియాణా పోలీసులతో శుక్రవారం మరోసారి రైతులు తలపడ్డారు. ఖనౌరీ వద్ద నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఖేరి చోప్తా గ్రామ రైతులను పోలీసులు అడ్డగించారు. కొందరు రైతులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొందరు రైతులతోపాటు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు వారిపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు. గుండెపోటుతో మరో రైతు మృతి పంజాబ్–హరియాణా సరిహద్దుల్లో ఆందోళనల్లో పాల్గొంటున్న దర్శన్ సింగ్(62) అనే రైతు గుండెపోటుతో చనిపోయినట్లు రైతు సంఘం నేతలు చెప్పారు. మరోవైపు ఆందోళనలకు సారథ్యం వహిస్తున్న రైతు సంఘాల నేతలు శుక్రవారం పలు అంశాలపై చర్చించారు. తదుపరి కార్యాచరణను 29న ప్రకటిస్తామని మీడియాకు తెలిపారు. శనివా రం కొవ్వొత్తులతో ర్యాలీ చేపడతామ న్నారు. పంజాబ్‌వ్యాప్తంగా బ్లాక్ డే అమృత్సర్: రైతులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ పంజాబ్ అంతటా రైతులు బ్లాక్ డే పాటించారు. శుభ్‌కరణ్ మృతిని నిరసిస్తూ అమృత్సర్, లూధియానా, హోషియార్పూర్ సహా 17 జిల్లాల్లో నిరసనలు చేపట్టినట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే
న్యూఢిల్లీ: ఉధృతంగా కొనసాగుతున్న రైతుల ఉద్యమ సంబంధ ‘ఎక్స్’ఖాతాలను స్తంభింపజేయాలంటూ ‘ఎక్స్’ సంస్థకు మోదీ సర్కార్ నుంచి ఆదేశాలు రావడంపై కాంగ్రెస్ కన్నెర్రజేసింది. భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తూ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. రైతుల ఉద్యమంతో సంబంధం ఉన్న దేశంలో 177 సామాజికమాధ్యమాల ఖాతాలను తాత్కాలికంగా నిలిపేయాలంటూ ‘ఎక్స్’కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది. కేంద్ర హోం శాఖ సిఫార్సుమేరకు ఈ ఆదేశాలొచ్చాయి. దీనిపై తొలుత ‘ఎక్స్’ స్పందించింది. ‘‘ పెనాల్టీలు, జరిమానాలు, నిర్బంధాలకు వీలయ్యేలా 177 ఖాతాలను బ్లాక్ చేస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులొచ్చాయి. తప్పని పరిస్థితుల్లో ఆ ఆదేశాలను పాటించాం. కానీ ఇలా భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం సబబు కాదు. ఈ అంశంలో పారదర్శకత కోసం ఆయా ఉత్తర్వుల కాపీలను బహిర్గతంచేయాల్సింది. అయితే చట్టంలోని నిబంధనల కారణంగా మేం ఆ పనిచేయలేకపోతున్నాం. పారదర్శకత లేనంత కాలం, బహిర్గతం చేయనంతకాలం ఈ వ్యవస్థలో జవాబుదారీతనం లేనట్లే’’ అని ‘ఎక్స్’ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ బృందం ఒక ప్రకటన విడుదలచేసింది. -
Farmers movement: నేడు రైతు సంఘాల ‘బ్లాక్ డే’
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దు ల్లో ఖనౌరి వద్ద బుధవారం చోటుచేసుకున్న రైతు మరణంపై హరియాణా ముఖ్యమంత్రి, హోం మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు మృతికి సంతాపం ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం ‘బ్లాక్ డే’ గా పాటించాలని రైతులను కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హరియాణా సీఎం ఖట్టర్, రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 26వ తేదీన రైతులంతా తమ ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. అదేవిధంగా, మార్చి 14వ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో మహాపంచాయత్‌లో చేపట్టనున్నట్లు తెలిపింది. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం)లు కలిసి చేపట్టగా ఎస్కేఎం మద్దతు మాత్రమే ఇస్తోంది. 2020–21లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాడిన ఎస్కేఎం నేతలెవరూ ‘ఢిల్లీ చలో’లో పాలుపంచుకోవడం లేదు. గురువారం ఎస్కేఎం నేతలు చండీగఢ్‌లో సమావేశమై సరిహద్దుల్లోని శంభు, ఖనౌరిల వద్ద నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, జోగీందర్ సింగ్ ఉగ్రహాన్, రాకేశ్ తికాయత్, దర్శన్పాల్ మీడియాతో మాట్లాడారు. ఖనౌరి వద్ద బుధవారం జరిగిన ఆందోళనల్లో శుభ్‌కరణ్ సింగ్ అనే రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం ఖట్టర్, మంత్రి విజ్‌లపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారిద్దరూ వెంటనే పదవులకు రాజీనామా చేయాలన్నారు. మృతుడి కుటుంబానికి పరిహారంగా రూ.కోటి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతడికున్న రూ.14 లక్షల రుణాలను మాఫీ చేయాలన్నారు. ఈ నెల 26వ తేదీన ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తామన్నారు. ఎస్కేఎం(రాజకీయేతర)ను కూడా కలుపుకుని పోయేందుకు చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. -
దద్దరిల్లిన సరిహద్దులు
చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వ్యవసాయ రుణాల రద్దుతో సహా ఇతర డిమాండ్లపై రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. రెండు రోజుల విరామం తర్వాత బుధవారం నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా తమ పోరాటం ఆగదని తేలి్చచెప్పారు. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణలతో పంజాబ్–హరియాణా సరిహద్దులోని శంభు, ఖనౌరీ బోర్డర్ పాయింట్లు దద్దరిల్లిపోయాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో ట్రాక్టర్ ట్రాలీలు, మినీ వ్యాన్లు, జేసీబీలపై నిరసనకారులు తరలివచ్చారు. సరిహద్దుల్లో వేలాది మంది గుమికూడారు. రక్షణ వలయాన్ని ఛేదించుకొని ముందుకు దూసుకెళ్లడానికి ప్రయతి్నంచారు. వాహనాలతో బారీకేడ్లను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని పోలీసులు అనుమానించారు. నిరసనకారులను చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు డ్రోన్‌తో బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. శంభు బోర్డర్ పాయింట్ వద్ద బుధవారం మూడుసార్లు బాష్పవాయువు ప్రయోగం చోటుచేసుకుంది. డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెంచారు. ఖనౌరీలోనూ రైతుల ఆందోళన కొనసాగింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీ వెళ్లడానికి తమను అనుమతించడానికి డిమాండ్ చేశారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. బాష్పవాయువు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి చాలామంది రైతులు మాసు్కలు, కళ్లద్దాలు ధరించారు. -
కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. చర్చలు విఫలం
చండీగఢ్: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత తదితర డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీ చేసిన తాజా ప్రతిపాదనలను కూడా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. అవి రైతులకు మేలు చేసేవి కాదని నేతలు జగ్జీత్సింగ్ దల్లేవాల్, శర్వాన్‌సింగ్ పంథేర్ తదితరులు సోమవారం కుండబద్దలు కొట్టారు. ప్రతిపాదనలపై సంఘాలన్నీ చర్చించుకున్న మీదట ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. తమ ‘ఢిల్లీ చలో’ ఆందోళన బుధవారం ఉదయం 11 నుంచి శాంతియుతంగా కొనసాగుతుందని ప్రకటించారు. దాంతో సమస్య మొదటికొచ్చింది. రైతు సంఘాలతో ఆదివారం సాయంత్రం మొదలైన కేంద్ర మంత్రుల కమిటీ నాలుగో దశ చర్చలు అర్ధరాత్రి తర్వాత ముగిశాయి. చర్చల్లో మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. ‘ఐదేళ్ల ఒప్పంద’ ప్రతిపాదనను మంత్రులు తెరపైకి తెచ్చారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న రైతుల నుంచి పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ పంటలకు ఐదేళ్లపాటు ఎంఎస్పీ చెల్లింపుకు సుముఖత వ్యక్తం చేశారు. వారి నుంచి ఎంత పంటనైనా కొనుగోలు చేస్తామన్నారు. ఇది వినూత్నమైన ఆలోచన అని అనంతరం గోయల్ మీడియాతో చెప్పారు. ‘‘ఐదేళ్లపాటు ఎంఎస్పీకి ఆయా పంటల కొనుగోలుకు ఎన్సీసీఎఫ్, నాఫెడ్ వంటి ప్రభుత్వ రంగ సహకార సంఘాలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఇందుకు ఒక పోర్టల్ అభివృద్ధి చేస్తాం’’ అని చెప్పారు. కనీస మద్దతు ధరకు ఇప్పటికిప్పుడు చట్టబద్ధత అసాధ్యమని తేల్చిప్పారు. ఈ ప్రతిపాదనపై రైతులు, నిపుణులతో చర్చించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని పంథేర్ సోమవారం ఉదయం చెప్పారు. అప్పటిదాకా ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని నిలిపేస్తున్నామన్నారు. కానీ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నామంటూ రైతు నేతల నుంచి రాత్రికల్లా ప్రకటన వెలువడింది. -
Farmers movement: రణరంగమైన శంభు సరిహద్దు
చండీగఢ్: డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టిన ఆందోళనలతో పంజాబ్–హరియాణా నుంచి ఢిల్లీకి దారితీసే ప్రాంతాలన్నీ శుక్రవారం నాలుగో రోజూ అట్టుడికిపోయాయి. శంభు సరిహద్దు తదితర చోట్ల తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. పోలీసు వలయాలను ఛేదించుకొని దూసుకెళ్లేందుకు నిరసనకారులు తీవ్ర ప్రయత్నం చేశారు. కొందరు ముసుగులు ధరించి పోలీసులపైకి రాళ్లు విసిరారు. వారిని చెదరగొట్టానికి పోలీసులు భారీ సంఖ్యలో బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. ఇరు వర్గాల ఘర్షణలతో శంభు సరిహద్దు రణరంగంగా మారింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తదితర డిమాండ్ల సాధనకు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా తదితర రైతు సంఘాలు ‘చలో ఢిల్లీ’కి పిలుపునివ్వడం తెలిసిందే. నాలుగు రోజులుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్న 70 యూట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ భద్రతా దళాలను కవి్వస్తున్నారంటూ పోలీసులు వీడియోలు విడుదల చేశారు. శంభు సరిహద్దు వద్ద నాలుగు రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్న జ్ఞాన్‌సింగ్ అనే 63 ఏళ్ల రైతు గుండెపోటుతో మృతిచెందాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన ఆయనకు ఉదయం గుండె నొప్పి రావడంలో ఆసుపత్రిలో చేర్చినా లాభం లేకపోయింది. మరోవైపు, రైతు సంఘాలు ఇచ్చిన గ్రామీణ భారత్ బంద్ పిలుపుతో శుక్రవారం పంజాబ్, హరియాణాతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో చాలాచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రైతులు హైవేలను దిగ్బంధించారు. రేపు మంత్రుల కమిటీ చర్చలు కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల మూడు సార్లు చర్చలు జరిగాయి. ఈ నెల 8, 12, 15వ తేదీల్లో చర్చలు ఈ చర్చలు ఫలించలేదు. గురువారం రాత్రి ఐదు గంటలకు పైగా చర్చించినా ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాలేదు. డిమాండ్ల నుంచి రైతు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. చర్చలు ఆదివారం కూడా కొనసాగనున్నాయి. -
Delhi Chalo: రైతు ఉద్యమం ఉధృతం
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మరింత ఉధృతమైంది. ఢిల్లీ సమీపంలో శంభు, టిక్రి సరిహద్దుల వద్ద పోలీసుల బారికేడ్లు, ఇనుపకంచెలు, సిమెంట్ దిమ్మెలను దాటేందుకు రైతులు ప్రయతి్నస్తున్నారు. పోలీసుల భాష్పవాయు గోళాలు, జలఫిరంగుల దాడితో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఉద్యమం మొదలై మూడురోజులవుతున్నా అటు రైతులు, ఇటు కేంద్ర ప్రభుత్వం పట్టువిడవడం లేదు. పంజాబ్, హరియాణాల మధ్యనున్న శంభు సరిహద్దు వద్ద వేలాదిగా రైతులు సంఘటితమయ్యారు. టిక్రి, సింఘు, కనౌరీ బోర్డర్ పాయింట్ల వద్దా అదే పరిస్థితి కనిపించింది. వారిని నిలువరించేందుకు మరింతగా బాష్పవాయుగోళాలు అవసరమని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. 30,000 టియర్‌గ్యాస్ షెల్స్‌కు ఆర్డర్ పెట్టారు. గ్వాలియర్‌లోని బీఎస్ఎఫ్ టియర్‌స్మోక్ యూనిట్ వీటిని సరఫరా చేయనుంది. ఘాజీపూర్ సరిహద్దు వద్ద సైతం పోలీసులు మొహరించారు. చండీగఢ్‌లో రైతు సంఘాల నేతలు జగ్జీత్సింగ్ దల్లేవాల్, శర్వాణ్ సింగ్ పాంథెర్, ప్రభుత్వ ప్రతినిధులైన వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మధ్య గురువారం రాత్రి మూడో దఫా చర్చలు మొదలయ్యాయి. చర్చల్లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం పాల్గొన్నారు. వాటిలో తేలిందనేది ఇంకా వెల్లడి కాలేదు. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)లో భాగమైన భారతీయ కిసాన్ యూనియన్ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా రైతులు నేడు గ్రామీణ భారత్ బంద్‌ను పాటించనున్నారు. ‘‘రైతులెవ్వరూ శుక్రవారం నుంచి పొలం పనులకు వెళ్లొద్దు. కారి్మకులు సైతం ఈ బంద్‌ను భాగస్వాములవుతున్నారు. ఈ రైతు ఉద్యమంలో ఎంతగా భారీ సంఖ్యలో జనం పాల్గొంటున్నారో ప్రభుత్వానికి అర్థమవుతుంది’’ అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. భారత్‌బంద్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు హరియాణాలోని నోయిడాలో కర్ఫ్యూ విధించారు. పలు జిల్లాల్లో 17వ తేదీ దాకా టెలికాం సేవలను నిలిపేస్తూ హరియాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులు సైన్యంలా ఢిల్లీ ఆక్రమణకు వస్తున్నారంటూ బీజేపీ పాలిత హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పంజాబ్‌లోనూ శుక్రవారం దాకా ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. పట్టాలపై బైఠాయింపు నిరసనల్లో భాగంగా గురువారం రైతులు రైల్ రోకో కూడా నిర్వహించారు. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో అతి పెద్దదైన రాజాపురా రైల్వే జంక్షన్ వద్ద వందలాది మంది రైతులు పట్టాలపై బైఠాయించారు. మధ్యా హ్నం నుంచి సాయంత్రం దాకా రైళ్ల రాకపోకలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. చాలా రైళ్లను దారి మళ్లించగా కొన్నింటిని రద్దు చేశారు. -
Farmers movement, Delhi Chalo: రెండో రోజూ ఉద్రిక్తత
చండీగఢ్: డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ ఉద్రిక్తతలు వరుసగా రెండో రోజు బుధవారం సైతం కొనసాగాయి. ఢిల్లీకి చేరుకోకుండా రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. పంజాబ్–హరియాణా శంభు సరిహద్దులో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఇక్కడికి చేరుకున్న వేలాది మంది రైతులు రాత్రంతా ట్రాక్టర్లపైనే ఉండిపోయారు. బుధవారం ఉదయం రక్షణ వలయాన్ని ఛేదించుకొని, ఢిల్లీవైపు వెళ్లేందుకు ప్రయతి్నంచారు. రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేసి, తమను అడ్డుకున్న పోలీసులపై నిరసనకారులు ఆగ్రహావేశాలతో రాళ్లు విసిరారు. అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టడానికి డ్రోన్లతో బాష్ప వాయువు గోళాలు ప్రయోగించారు. ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. శంభు బోర్డర్లో రోజంతా యుద్ధ వాతావరణం కనిపించింది. పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. హరియాణా ప్రభుత్వం రాష్ట్రంలో పలు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీకి చేరుకొని తమ గళం వినిపించడం తథ్యమని, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రైతులు తేలి్చచెప్పారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న తమ డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదని, ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని రైతు సంఘం నేత జగజీత్ సింగ్ దలీవాల్ చెప్పారు. మరోవైపు, ఢిల్లీ సరిహద్దుల్లోనూ బుధవారం ఉద్రిక్తత కొనసాగింది. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. డ్రోన్లను కూల్చడానికి పతంగులు శంభు బోర్డర్ వద్ద పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను నేల కూల్చడానికి కొందరు యువ రైతులు వినూత్న ప్రయత్నం చేశారు. పతంగులు ఎగురవేశారు. పతంగుల దారాలతో డ్రోన్లను బంధించి, కూల్చివేయాలన్నదే వారి ఆలోచన. డ్రోన్లతో నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శంభు సరిహద్దులో హరియాణా పోలీసులు డ్రోన్లు ప్రయోగించడం పట్ల పంజాబ్ పోలీసులు అభ్యంతరం తెలిపారు. తమ రాష్ట్ర భూభాగంలోకి డ్రోన్లను పంపొద్దని స్పష్టం చేశారు. తమ ఆందోళన కొనసాగిస్తామని, గురువారం పంజాబ్‌లో పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై బైఠాయిస్తామని రైతు సంఘాల నాయకులు చెప్పారు. నేడు మూడో దశ చర్చలు! రైతుల డిమాండ్ల విషయంలో రైతు సంఘాలతో నిర్మాణాత్మక చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా బుధవారం చెప్పారు. చర్చలకు సానుకూల వాతావరణం కలి్పంచాలని, నిరసన కార్యక్రమాలు విరమించాలని రైతులకు సూచించారు. అసాంఘీక శక్తుల వలలో చిక్కుకోవద్దని చెప్పారు. కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల జరిగిన రెండు దశల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చర్చలకు ఇరుపక్షాలు సముఖంగా ఉన్నాయి. మూడో దశ చర్చలు గురువారం మధ్యాహ్నం చండీగఢ్‌లో జరుగనున్నట్లు తెలిసింది. -
Farmers movement: సర్కారు ‘మద్దతు’ లేదనే..!
సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతన్న మరోసారి కన్నెర్రజేశాడు. డిమాండ్ల సాధనకు రాజధాని బాట పట్టాడు. దాంతో రెండు రోజులుగా ఢిల్లీ శివార్లలో యుద్ధ వాతావరణం నెలకొంది. అవసరమైతే మరోసారి నెలల తరబడి ఆందోళనలు కొనసాగించేందుకే రైతులు సిద్ధమవుతున్నారు. పంజాబ్, హరియాణాతో పాటు ఉత్తర యూపీకి చెందిన రైతులు భారీ సంఖ్యలో నిరసనల్లో పాల్గొంంటున్నారు. అన్ని పంటలకూ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించడంతో పాటు దానికి చట్టబద్ధత కల్పించాలన్నది వారి ప్రధాన డిమాండ్. దాంతోపాటు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు కూడా రైతులు పట్టుబడుతున్నారు. ఇంతకీ ఏమిటీ ఎంఎస్పీ? రైతు సంక్షేమానికి స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులేమిటి...? ఎంఎస్పీ కీలకం.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడంలో కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్ ప్రైస్–ఎంఎస్పీ)ది కీలక పాత్ర. ► రైతుల నుంచి పంటను సేకరించేందుకు ప్రభుత్వం చెల్లించే కనీస ధరే ఎంఎస్పీ. ► ఇది వారికి మార్కెట్ ఒడిదొడుకుల బారినుంచి రక్షణతో పాటు స్థిరత్వాన్ని, ఆదాయ భద్రతను కల్పిస్తుంది. ► దీన్ని కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) నిర్ణయిస్తుంటుంది. ఈ విషయంలో ఉత్పత్తి వ్యయం, మార్కెట్ ధోరణులు, డిమాండ్–సరఫరా తదితరాలను పరిగణనలోకి తీసుకుంటుని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి ఎంఎస్పీపై సిఫార్సులు చేస్తుంది. వాటి ఆధారంగా సీసీఈఏ తుది నిర్ణయం తీసుకుంటుంది. సీఏసీపీ 1965లో ఏర్పాటైంది. ఇలా లెక్కిస్తారు... ఎంఎస్పీ లెక్కింపు సంక్లిష్టమైన ప్రక్రియ. ఇందుకోసం రైతులకయ్యే ప్రత్యక్ష, పరోక్ష ఉత్పత్తి వ్యయాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ► ఎరువులు, విత్తనాలు, కూలీల వంటివి ప్రత్యక్ష వ్యయం కాగా రైతు సొంత కుటుంబం పడే కష్టం, అద్దెలు తదితరాలు పరోక్ష వ్యయం. ► వీటిని స్థూలంగా ఏ2, ఎఫ్ఎల్, సీ2గా వర్గీకరిస్తారు. ► పంట ఎదుగుదల, ఉత్పత్తి, నిర్వహణ నిమిత్తం చేసే ఎరువులు, విత్తనాలు, కూలీల వ్యయం ఏ2 కిందకు వస్తుంది. ► ఈ అసలు ఖర్చులకు కుటుంబ కష్టం తదితర పరోక్ష ఉత్పత్తి వ్యయాన్ని కలిపితే ఎఫ్ఎల్. ► ఏ2, ఎఫ్ఎల్ రెండింటికీ మూలధన ఆస్తులు, రైతు చెల్లించే అద్దెలను కలిపితే వచ్చేదే సీ2. ► వీటికి తోడు పలు ఇతర అంశాలను కూడా సీఏసీఊ పరిగణలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు సాగు వ్యయం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ప్రతి క్వింటా పంట దిగుబడికి అయ్యే వ్యయమూ అంతే. అలాగే మార్కెట్ ధరలు, వాటి ఒడిదొడుకులు, కూలీల వ్యయం తదితరాలు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. వీటన్నింటితో పాటు సదరు పంట ఎగుమతులు, దిగుమతులు, మొత్తం నిల్వలు, డిమాండ్, తలసరి వినియోగం, ప్రాసెసింగ్ పరిశ్రమ ధోరణులు తదితరాలన్నింటినీ ఎంఎస్పీ లెక్కింపు కోసం సీఏసీపీ పరిగణనలోకి తీసుకుంటుంది. స్వామినాథన్ సిఫార్సులు... ► అన్ని పంటలకూ ఎంఎస్పీ హామీ ఇస్తూ చట్టం తేవాలి. ఎంఎస్పీ మొత్తం పంట సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతం ఎక్కువగా ఉండాలి (దీన్ని సీ2+50 పద్ధతిగా పిలుస్తారు). ► రైతు ఆత్మహత్యలను అరికట్టేలా భూమి, నీరు, సేంద్రియ వనరులు, రుణం, బీమా, టెక్నాలజీ, పరిజ్ఞానం, మార్కెట్ల వంటి మౌలిక సదుపాయాలు వారందరికీ అందుబాటులో తేవాలి. ► రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి. ► రైతు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ద్వారా మెరుగైన ధర కలి్పంచాలి. ► వ్యవసాయోత్పత్తుల సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రమాణాలకు తగ్గట్టు ఉండాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Delhi Chalo: హస్తినలో హైటెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ: పలు డిమాండ్ల సాధనతో మంగళవారం దేశ రాజధానిలో నిరసనకు సిద్ధమైన అన్నదాతల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధం అయ్యారు. ఉదయం నుంచే బారికేడ్లతో ఎక్కడికక్కడ సరిహద్దుల వద్ద నిలబడ్డారు. దీంతో అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు నెల రోజులపాటు ఢిల్లీలో సభలు, ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, నగరంలోకి ట్రాక్టర్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు పోలీసులు తేల్చి చెప్పారు. ఢిల్లీలో నెల రోజులపాటు 144 సెక్షన్ అమలవుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. నేటి నుంచి వచ్చే నెల 12వ తేదీ దాకా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జనం గుంపులుగా గుమికూడవద్దని పేర్కొన్నారు. రైతు సంఘాల ‘చలో ఢిల్లీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. రోడ్లను దిగ్బంధించడం, ప్రయాణికుల రాకపోకలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిటీలో ట్రాక్టర్ల ర్యాలీలపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. నగర పరిధిలో అనుమానిత వస్తువులు, పేలుడు పదార్థాలు, బాణాసంచా, ఇతర అనుమతి లేని ఆయుధాలు, ప్రమాదకరమైన రసాయనాలు, పెట్రోల్, సోడా సీసాలు రవాణా చేయడంపైనా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. #WATCH | Ambala, Haryana: Security heightened at the Shambhu border in view of the march declared by farmers towards Delhi today. pic.twitter.com/AwRAHprtgC — ANI (@ANI) February 13, 2024 రెచ్చగొట్టే నినాదాలు, ప్రసంగాలు, సోషల్ మీడియాలో అనుచిత మెసేజ్‌లు పంపడంపైనా నిషేధం ఉందన్నారు. భూసేకరణలో తీసుకున్న భూములకు పరిహారం పెంచడం, పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తీసుకురావడంతోపాటుఇతర డిమాండ్ల సాధన కోసం రైతులు మంగళవారం తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గత అనుభవాల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. రోడ్లపై బారికేడ్లు.. కొయ్యముక్కలు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాతోపాటు పలు రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. 13వ తేదీన పార్లమెంట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో 2 వేలకు పైగా ట్రాక్టర్లతో ఢిల్లీలో నిరసన చేపట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. నిరసనకారులను ∙అడ్డుకోవడానికి వివిధ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సరిహద్దుల్లో రోడ్లపై మేకుల్లాంటి పదునైన కొయ్యముక్కలు బిగించారు. #WATCH | Delhi: Security heightened at Delhi borders in view of the march declared by farmers towards the National Capital today. (Visuals from Gazipur Border) pic.twitter.com/XeKWMWi1S9 — ANI (@ANI) February 13, 2024 రైతు సంఘాలతో మంత్రుల చర్చలు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా సోమవారం చండీగఢ్‌లో రైతు సంఘాల నేతలతో రెండో దశ చర్చలు ప్రారంభించారు. సంయుక్త కిసాన్ మోర్చా నేత జగజీత్ దలీవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వన్ తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. రైతుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందని, చలో డిల్లీ కార్యక్రమాన్ని విరమించుకోవాలని మంత్రులు కోరారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 2020–2021 కాలంలో చేపట్టిన రైతుల ఉద్యమం సందర్భంగా వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకునేందుకు ఒప్పుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు -
Farmers movement: రేపు రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’
న్యూఢిల్లీ/చండీగఢ్: రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన ‘ఢిల్లీ చలో’మార్చ్ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు హరియాణా సరిహద్దుల్లో అధికారులు భారీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నిషేధాజ్ఞలను అమలు చేయడంతో పాటు వాహనాల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు కాంక్రీట్ దిమ్మెలు, స్పైక్ బారియర్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. టొహానా బోర్డర్ వద్ద ఇసుక కంటెయినర్లను, కాంక్రీట్ బారికేడ్లను, మేకులను రోడ్డుపై ఏర్పాటు చేశారు. సోమవారం చర్చలకు రావాల్సిందిగా రైతు సంఘాలను కేంద్రం ఆహా్వనించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి డిమాండ్లతో సంయుక్త కిసాన్ మోర్చా, పలు ఇతర రైతు సంఘాలు ఢిల్లీ మార్చ్‌కి పిలుపివ్వడం తెలిసిందే. దాంతో ట్రాక్టర్ ట్రాలీ మార్చ్ సహా ఎటువంటి నిరసనలు చేపట్టరాదంటూ హరియాణా ప్రభుత్వం 15 జిల్లాల పరిధిలో సెక్షన్ 144 విధించింది. శంభు వద్ద పంజాబ్‌తో సరిహద్దును మూసివేసింది. ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సరీ్వసులను, బల్క్ ఎస్ఎంఎస్లను మంగళవారం దాకా నిషేధించింది. 2020–21లో రైతులు ఏడాదికి పైగా నిరసనలు కొనసాగించిన సింఘు, ఘాజీపూర్, తిక్రీ సరిహద్దుల్లో బారికేడ్లనే ఏర్పాటు చేసి, తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీలోని ఈశాన్య జిల్లాలో కూడా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. నిరసనకారులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. యూపీ, పంజాబ్ సరిహద్దుల్లో 5 వేల మంది పోలీసులను నియోగించారు. మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నిరసనకారులు బారికేడ్లను తొలగించుకుని లోపలికి రాకుండా ఘగ్గర్ ఫ్లై ఓవర్ వద్ద రోడ్డుకు ఇరువైపులా ఇనుపïÙట్లను అమర్చారు. ఏదేమైనా కనీసం 20 వేల మంది రైతులు ఢిల్లీ తరలుతారని రైతు సంఘాలంటున్నాయి. మోదీ సర్కారు నిరంకుశత్వంతో రైతులను అడ్డుకోజూస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. దాన్ని ఢిల్లీ నుంచి శాశ్వతంగా పారదోలాలని పిలుపునిచ్చారు. -
ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీలో ఉద్రిక్తత
నోయిడా: వేలాది మంది రైతుల ర్యాలీ, నిరసన హోరుతో ఢిల్లీ శివార్లు గురువారం దద్దరిల్లాయి. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాలకు చెందిన రైతులు ఢిల్లీలో పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. పార్లమెంట్ దిశగా దూసుకెళ్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సేకరించిన తమ భూములకు పరిహారం పెంచాలని రైతులు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. భూములు తీసుకొని అభివృద్ధి చేసిన ప్లాట్లలో పది శాతం రెసిడెన్షయల్ ప్లాట్లు తమకు ఇవ్వాలని లేదా వాటికి సమానమైన పరిహారం చెల్లించాలని 2019 నుంచి ఉద్యమం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో పోరాటం ఉధృతం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో గురువారం పార్లమెంట్ వరకు ర్యాలీ తలపెట్టారు. దాదాపు 100 గ్రామాల నుంచి వేలాది మంది రైతులు తరలివచ్చారు. వీరిలో వృద్ధులు, మహిళలు సైతం ఉన్నారు. గురువారం మధ్యాహ్నం మహామాయ ఫ్లైఓవర్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. చిల్లా సరిహద్దు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. స్థానికంగా 144 సెక్షన్ విధించారు. నిరసకారులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉద్రిక్తత నెలకొంది. దీంతో నోయిడా–గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ రహదారితోపాటు పలు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. -
Farmers movement: యూరప్‌లోనూ రోడ్డెక్కిన రైతు
సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. భారత్‌లో కాదు, యూరప్‌లో! అవును. రైతుల నిరసనలు, ఆందోళనలతో కొద్ది వారాలుగా యూరప్ దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాల్లో అసలే జీవనవ్యయం ఊహించనంతగా పెరిగిపోయింది. దీనికి తోడు గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో కొద్ది నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇవి చాలవన్నట్టు సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. పన్నుల భారం మోయలేనంతగా మారింది. ఇలాంటి అనేకానేక సమస్యలు యూరప్ వ్యాప్తంగా రైతులను కుంగదీస్తున్నాయి. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలే సమస్యకు ప్రధాన కారణమంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. ఉక్రెయిన్ను కాపాడే ప్రయత్నంలో తమ ఉసురు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. పరిష్కారం కోసం ప్రాధేయపడ్డా ఫలితం లేకపోవడంతో పలు దేశాల్లో రైతులు వేలాదిగా ఆందోళన బాట పట్టారు. ఏకంగా వేల కొద్దీ ట్రక్కులు, ట్రాక్టర్లతో రోడ్లెక్కుతున్నారు. పట్టణాలు, రాజధానులను దిగ్బంధిస్తున్నారు. నడిరోడ్లపై టైర్లను, గడ్డిమోపులను కాలబెడుతున్నారు. ప్రభుత్వాల తీరు తమ పొట్ట కొడుతోందంటూ నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కొద్ది వారాలుగా పారిస్, బెర్లిన్ మొదలుకుని ఏ నగరంలో చూసినా, ఏ ఐరోపా దేశంలో చూసినా ఇవే దృశ్యాలు!! ఫిబ్రవరి 1న రైతులు ఏకంగా యూరోపియన్ పార్లమెంటు భవనంపైకి గుడ్లు విసరడం, రాళ్లు రువ్వారు! పలు దేశాల్లో పరిస్థితులు రైతుల అరెస్టుల దాకా వెళ్తున్నాయి... రైతుల సమస్యలు ఇవీ... ► యూరప్ దేశాలన్నింట్లోనూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది గిట్టుబాటు ధర లేమి. ► దీనికి తోడు ఏడాదిగా వారిపై పన్నుల భారం బాగా పెరిగిపోయింది. ఆకాశాన్నంటుతున్న పంట బీమా ప్రీమియాలు దీనికి తోడయ్యాయి. ► విదేశాల నుంచి, ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి చౌకగా దిగుమతవుతున్న ఆహారోత్పత్తులతో వారి ఉత్పత్తులకు గిరాకీ పడిపోతోంది. ► దక్షిణ అమెరికా దేశాల నుంచి చక్కెర, ఆహార ధాన్యాలతో పాటు మాంసం తదితరాల దిగుమతిని మరింతగా పెంచుకునేందుకు ఈయూ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ► అధికారుల అవినీతి, సకాలంలో సాయం చేయడంలో అలసత్వం మరింత సమస్యగా మారుతోంది. ► ఈయూ విధిస్తున్న పర్యావరణ నిబంధనలు మరీ శ్రుతి మించుతున్నాయన్న భావన అన్ని దేశాల రైతుల్లోనూ నెలకొంది. ► పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతూ 4 శాతం సాగు భూమిని నిరీ్ణత కాలం ఖాళీగా వదిలేయాలన్న నిబంధనను యూరప్ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. ► పైగా పలు దేశాలు ఏటా పంట మారి్పడినీ తప్పనిసరి చేశాయి. రసాయన ఎరువుల వాడకాన్ని 20 శాతం తగ్గించాలంటూ రైతులపై ఒత్తిడి తీవ్రతరమవుతోంది. ► సాగు అవసరాలకు వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీ ఎత్తేయాలన్న నిర్ణయం. దీంతో సాగు వ్యయం విపరీతంగా పెరుగుతోందంటూ చాలా యూరప్ దేశాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా యూరప్‌లో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్ రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ► పోర్చుగల్ నుంచి చౌకగా వచ్చి పడుతున్న వ్యవసాయోత్పత్తులు తమ పుట్టి ముంచుతున్నాయంటూ స్పెయిన్ రైతులు వాపోతున్నారు. ► నిధుల లేమి కారణంగా ఈయూ సబ్సిడీలు సకాలంలో అందకపోవడం రైతులకు మరింత సమస్యగా మారింది. ఇవీ డిమాండ్లు... ► ఆహారోత్పత్తుల దిగుమతులకు ఈయూ అడ్డుకట్ట వేయాలి. ► ఉక్రెయిన్ ఆహారోత్పత్తులను ప్రధానంగా ఆసియా దేశాలకు మళ్లించేలా చూడాలి. ► ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులను నిలిపేయాలి. ► సాగుపై ప్రభుత్వపరంగా పన్నుల భారాన్ని తగ్గించాలి. ► 4% భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధనను ఎత్తేయాలి. ► పలు పర్యావరణ నిబంధనలను వీలైనంతగా సడలించాలి. ► పెట్రోల్, డీజిల్‌పై సాగు సబ్సిడీలను కొనసాగించాలి. ఆందోళనలు ఏయే దేశాల్లో... జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలండ్, స్పెయిన్, రొమేనియా, గ్రీస్, పోర్చుగల్, హంగరీ, స్లొవేకియా, లిథువేనియా, బల్గేరియా – సాక్షి, నేషనల్ డెస్క్ -
Farmers Protest: ఫిబ్రవరి 16న భారత్ బంద్
నోయిడా: రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఫిబ్రవరి 16వ తేదీన భారత్ బంద్‌ను పాటించనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర సంబంధ చట్టం అమలుసహా రైతాంగ కీలక సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త బంద్ పాటించాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. మంగళవారం ముజఫర్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)సహా దేశంలోని అన్ని రైతు సంఘాలు ఆ రోజు భారత్ బంద్‌లో పాల్గొంటాయి. ఆ రోజు రైతులు తమ పొలం పనులకు వెళ్లకండి. ఒక్క రోజు పనులకు సమ్మె పాటించండి. పొలాల్లో అమావాస్య రోజున రైతులు పనులకు వెళ్లరు. అలాగే ఫిబ్రవరి 16 కూడా రైతులకు అమావాస్యే. వర్తకసంఘాలు, రవాణా సంస్థలు ఆరోజు వ్యాపార కార్యకలాపాలు నిలిపేయాలని కోరుకుంటున్నా. దుకాణాలను మూసేయండి. రైతులు, కార్మికులకు మద్దతుగా నిలబడండి’’ అని తికాయత్ విజ్ఞప్తిచేశారు. -
భారత ప్రభుత్వం బెదిరించింది
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020, 2021లో పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం జరిగినప్పుడు ట్విట్టర్ ఖాతాలపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం తమను ఆదేశించిందని, మాట వినకపోతే దేశంలో ట్విట్టర్‌ను మూసివేస్తామని హెచ్చరించిందని జాక్ డోర్సే సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడైన జాక్ డోర్సే 2021లో ఆ సంస్థ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. ఖాతాలపై ఆంక్షలు విధించడంతోపాటు కొన్ని పోస్టులను తొలగించకపోతే సంస్థను మూసివేయడంతోపాటు ఉద్యోగుల ఇళ్లలో సోదాలు చేస్తామని భారత ప్రభుత్వం బెదిరించిందని, తమపై ఒత్తిడి తెచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. తుర్కియే(టర్కీ), నైజీరియా ప్రభుత్వాల నుంచి కూడా తమకు బెదిరింపులు వచ్చాయని అన్నారు. చెప్పినట్లు చేయాలని అక్కడి ప్రభుత్వాలు తమపై ఒత్తిడి తెచ్చాయని పేర్కొన్నారు. భారత ప్రభుత్వంపై జాక్ డోర్సే చేసిన ఆరోపణలను కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మంగళవారం కొట్టిపారేశారు. డోర్సే పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. డోర్సే సీఈఓగా ఉన్న సమయంలో భారత ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా పనిచేసేందుకు ట్విట్టర్ యాజమాన్యం నిరాకరించిందని గుర్తుచేశారు. భారత ప్రభుత్వ చట్టాలు తమకు వర్తించవన్నట్లుగా వ్యవహరించిందని అన్నారు. ట్విట్టర్ సంస్థ నుంచి ఎవరూ జైలుకు వెళ్లలేదని, మన దేశంలో ట్విట్టర్‌ను మూసివేయలేదని చెప్పారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికే జాక్ డోర్సే పస లేని ఆరోపణలు చేస్తున్నారని రాజీవ్ చంద్రశేఖర్ ఆక్షేపించారు. జాక్ డోర్సే ఆరోపణలను కేంద్ర ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ ఐటీ విభాగం నాయకుడు అమిత్ మాలవీయ తదితరులు ఖండించారు. దేశానికి వ్యతిరేకంగా కొందరు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని, అలాంటి వారి ఖాతాలపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో ట్విట్టర్ యాజమాన్యానికి సూచించామని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కేంద్రం సమాధానం చెప్పాలి: ఖర్గే ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే చేసిన ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. సోషల్ మీడియాను, జర్నలిస్టులను అణచివేయడం ప్రభుత్వం ఇకనైనా ఆపాలని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలను కచ్చితంగా అడ్డుకుంటామని ఖర్గే తేల్చిచెప్పారు. డోర్సే ఆరోపణలపై మోదీ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేశ్, రణదీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ తదితరులు డిమాండ్ చేశారు. ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేశారు: తికాయత్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఉద్యమాన్ని ప్రముఖంగా వెలుగులోకి తీసుకొచ్చిన ట్విట్టర్ ఖాతాలను అప్పట్లో ప్రభుత్వం నిలిపివేసిన సంగతి నిజమేనని, ఈ విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. ఖాతాలను బ్లాక్ చేసేలా ట్విట్టర్ యాజమాన్యంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని అన్నారు. రైతుల ఉద్యమం ప్రజల్లోకి వెళ్లకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. చాలా ట్విట్టర్ ఖాతాలు ఇప్పటికీ మూసివేసి ఉన్నాయని వివరించారు. అసమ్మతిని, వ్యతిరేకతను కేంద్రం సహించదని వ్యాఖ్యానించారు. -
బీకేయూ నేత తికాయత్‌కు బెదిరింపులు
ముజఫర్‌నగర్(యూపీ): భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్, ఆయన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. రైతు సంఘాల ఆందోళనల నుంచి దూరంగా ఉండకుంటే రాకేశ్ తికాయత్, ఆయన కుటుంబాన్ని బాంబు వేసి చంపుతామంటూ ఓ ఆగంతకుడు ఫోన్ ద్వారా హెచ్చరించాడు. ఈ మేరకు రాకేశ్ తికాయత్ సోదరుడు గౌరవ్ తికాయత్, బీకేయూ అధ్యక్షుడు నరేశ్ తికాయత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిని గుర్తించి, పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని భవురా కలాన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో అక్షయ్ శర్మ చెప్పారు. రద్దయిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు సాగిన ఆందోళనలకు నాయకత్వం వహించిన రైతు నేతల్లో రాకేశ్ తికాయత్ ఒకరు. చట్టాలు రద్దయిన తర్వాత కూడా ఆయన దేశవ్యాప్తంగా వివిధ సమస్యలపై రైతు సంఘాలు చేపట్టే నిరసనల్లో పాల్గొంటున్నారు. -
వారు నమ్మనివే... నేడు జీవనాడులు
స్వాతంత్య్రం వచ్చాక అత్యంత శక్తిమంతమైన నిరసన ప్రదర్శన ఇటీవలి రైతు ఉద్యమం! కేంద్రం మెడలు వంచి, మూడు రాక్షస వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేలా చేసిన ఈ ఉద్యమం ప్రధానంగా జాతీయ జెండా నీడలోనే జరిగింది. నిజానికి, మూడు వర్ణాలతో, మధ్యలో నీలిరంగు అశోక చక్రంతో కూడిన జెండాను ఆర్ఎస్ఎస్ చాలాకాలం వ్యతిరేకించింది. సర్సంఘ్చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్‌కు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలపై నమ్మకం లేదు. కానీ ఆ మూడు విషయాలే ఇప్పుడు శూద్ర, దళిత, ఆదివాసీలకు జీవనాడిగా మారాయి. అశోక చక్రంతో కూడిన మువ్వన్నెల జెండాను అంబేడ్కర్ ఆమోదిస్తే... వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు రైతులు దాన్ని తమ సొంతం చేసుకున్నారు. ► 75ఏళ్ళ స్వాతంత్య్ర మహోత్సవాలు జరుపుకొంటున్న ఈ తరుణంలో భారత జాతీయ పతాకం ప్రాముఖ్యంపై దేశవ్యాప్తంగా కీలకమైన చర్చ ఒకటి నడుస్తోంది. సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో జాతీయ పతాకాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ పార్టీ ఏమో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రంతో కూడిన పతాకాన్ని ట్విట్టర్లో పంచుకుంది. కమ్యూనిస్టులు అసలు జాతీయ పతాకం తాలూకు చర్చ పట్టనట్టుగా వ్యవహరించారు. బహుశా వారికి త్రివర్ణ పతాకం కంటే తమ ఎర్రజెండానే ముద్దేమో మరి! ► బీజేపీ, కాంగ్రెస్‌లు తమ వాళ్ల చిత్రాలతో ప్రదర్శించుకునేందుకు వారికే సొంతమైన పార్టీ జెండాలు ఉండనే ఉన్నాయి. అవసరమైతే వారు వీటిని తమ ఇళ్లపై ఎగరేయడం ద్వారా తమ రాజకీయ ఉనికిని చాటుకోవచ్చు. అయితే ఈ దేశంలో ఉత్పాదక వర్గం దృష్టిలో జాతీయ పతాకం ప్రాముఖ్యం ఏమిటన్నది చూడాలి. కులాల ప్రాతిపదికన చూస్తే ఈ ఉత్పాదక వర్గం శూద్ర/ దళిత/ ఆదివాసీ వర్గాలతో కూడినదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేమీ లేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. స్వాతంత్య్రం తరువాత ఈ దేశంలో నమోదైన అత్యంత శక్తిమంతమైన నిరసన ప్రదర్శన ఇటీవలే విజయవంతమైన రైతు ఉద్యమం! కేంద్రం మెడలు వంచి, మూడు రాక్షస వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేలా చేసిన ఈ ఉద్యమం ప్రధానంగా జాతీయ జెండా నీడలోనే జరిగింది. రైతు నాయకులు తమ సంఘర్షణకు ప్రతీకగా జాతీయ పతాకం మినహా మరేదీ లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారు. ఈ ఉద్యమం జాతీయ పతాకం అసలు వారసులు ఎవరో నిర్ణయించిన ఉద్యమం. జాతీయ పతాకం మాదే అన్న రైతుల ధీమా అసలైనది. సాధికారికమైనది కూడా! ► మూడు వర్ణాలతో, మధ్యలో నీలిరంగు అశోక చక్రంతో కూడిన మన జెండాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చాలాకాలం పాటు వ్యతిరేకించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఆర్ఎస్ఎస్ రెండో సర్సంఘ్చాలక్ అయిన ఎంఎస్ గోల్వాల్కర్ తన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ పుస్తకంలో ‘‘మన నేతలు ఈ దేశానికి ఓ కొత్త జాతీయ జెండాను సిద్ధం చేశారు. ఎందుకిలా? కేవలం పక్కదోవ పట్టించేందుకు, ఇంకొకరిని అనుకరించేందుకు మాత్రమే! అసలీ జెండా ఉనికిలోకి ఎలా వచ్చింది? ఫ్రెంచ్ విప్లవ సమయంలో ‘‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ’’ భావనలకు ప్రతీకలుగా ఫ్రెంచి వారు మూడు రంగుల జెండాను సిద్ధం చేసుకున్నారు. దాదాపు ఇవే సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందిన అమెరికన్ విప్లవకారులూ కొన్ని మార్పులతో ఫ్రెంచి వారి మూడు వర్ణాల జెండాను తయారు చేసుకున్నారు. మన ఉద్యమకారులకూ ఈ మూడు వర్ణాలపై ఓ వ్యామోహం ఉందన్నమాట. దీన్నే కాంగ్రెస్ పార్టీ భుజానికెత్తుకుంది’’ అని రాసుకున్నారు. ► ఆర్ఎస్ఎస్ గురూజీకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృ త్వం అనే ఆదర్శాలపై నమ్మకం లేదు. వీటితో కులం, వర్ణం, ధర్మ వ్యవస్థ కుప్పకూలిపోతుందన్నది ఆయన ఆలోచన. ఇస్లామిక్ జెండాలోని పచ్చదనం మాదిరిగానే కమ్యూనిస్టుల ఎర్రజెండాలోని ముదురు ఎరుపు రంగు ఉందని ఆర్ఎస్ఎస్ అనుకునేది. కమ్యూనిస్టులకు మొదటి నుంచి కూడా శ్రామిక విప్లవానికి ప్రతీకగా నిలిచే ఎర్రజెండా మినహా మరే జెండా పట్ల గౌరవం ఉండేది కాదు. ఎరుపు, తెలుపు, పచ్చదనాల మేళవింపుతో కూడిన జాతీయ పతాకాన్ని ఆమోదించిన తరువాత రాజ్యాంగ విధానసభ చర్చల్లో అంబేడ్కర్ ఆ పతాకం మధ్యలో గాంధీ ప్రతిపాదించిన చరఖాకు బదులు అశోకుడి చక్రం ఉండాలని కోరారు. అంబేడ్కర్ అప్పటికే బౌద్ధ మతం వైపు ఆకర్షితుడై ఉన్నారు. ► 1947 జూలై 22న జాతీయ పతాకం ప్రస్తుత రూపంలో ఆమోదం పొందగా, ఆగస్టు 15 అర్ధరాత్రి తొలిసారి దాన్ని ఎగురవేశారు. ఆర్ఎస్ఎస్/బీజేపీలు అప్పట్లో అధికారంలో ఉండివుంటే జెండా ఈ రూపంలో ఉండేది కాదు. కాషాయ ధ్వజం మన జెండా అయ్యుండేది. బహుశా దాని మధ్యలో ఓ స్వస్తిక్ చిహ్నం చేరి ఉండేదేమో! దేశవ్యాప్తంగా ముస్లిమ్‌లు ఉన్న విషయాన్ని గుర్తుంచుకుంటే విభజన సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేదో తెలిసేది కాదు. ద్విజుల ఆధిపత్యంలో హిందూ/హిందూత్వ వాతావరణం నిండుకున్న సమయంలో శూద్ర/దళిత/ఆదివాసీ సమూహాల పరిస్థితి ఏమిటో అర్థమయ్యేది కాదు. అయితే అంబేడ్కర్ తన సంస్థ జెండా కోసమూ నీలి వర్ణాన్నే ఎన్నుకున్నాడు. ఇప్పుడు బహుజన సమాజ్‌పార్టీ జెండాలోనూ కనిపిస్తుంది. నాకైతే 2021–22లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక రైతు ఉద్యమంతోనే జాతీయ పతాకానికి కొత్త అర్థం లభించిందని అనిపిస్తుంది. ► 1947 ఆగస్టు 15న మువ్వన్నెల జెండాను ఎగురవేసింది మొదలు వర్ణధర్మం వల్ల ఇబ్బందులు పడ్డ శూద్రులు, దళితులు, ఆదివాసీల జీవితాల్లో ఒక కొత్త దశ మొదలైందని నా నమ్మకం. అందుకే ఈ వర్గాల వారు త్రివర్ణ పతాకంపై మరింత నమ్మకం పెంచుకోవాలని భావిస్తున్నా. అదృష్టవశాత్తూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కూడా మువ్వన్నెల్లోని మూడు రంగులు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు ప్రతీకలుగా రాజ్యాంగ రచన సమయంలో పలు సందర్భాల్లో రూఢి చేయడం గమనార్హం. గోల్వాల్కర్ చేసిన ప్రకటనను పరిశీలిస్తే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అంశాలపై అతడికి ఎంత ద్వేషం ఉందో మనకు ఇట్టే అర్థమైపోతుంది. కానీ ఈ మూడు విషయాలే ఇప్పుడు శూద్ర, దళిత, ఆదివాసీలకు జీవనాడిగా మారాయి. ► జాతీయ పతాకం పైభాగంలోని ఎరుపు లాంటి రంగు సూచించే విప్లవమే దేశంలోని ఉత్పాదక వర్గం కోరిక కూడా! తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. కులాధిపత్యం, శోషణ, అస్పృశ్యత, హింస వంటివాటికి ఫుల్స్టాప్ పెట్టి శాంతి నెలకొనాలని శూద్ర, దళిత, ఆదివాసీలూ కాంక్షించారు. ఆకుపచ్చదనం గురించి ఆర్ఎస్ఎస్ మేధావులు ఊహించినట్లు ఇస్లామ్‌ను సూచించలేదీ రంగు. పైరుపచ్చలు, పర్యావరణ హిత జీవనవిధానం, పాడి పశువుల వంటి వాటిని మాత్రమే సూచించింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం కోరుకుంటున్న హరిత పర్యావరణ ఉద్యమాలే మన జాతీయ జెండాలోని పచ్చ రంగు అన్నమాట. ఈ పచ్చదనాన్ని సూచించేదెవరు? ఈ దేశపు రైతన్నలు! ► ఆధునిక చరిత్రలో రైతులకు అసలు సిసలైన ప్రతినిధి మహాత్మా జ్యోతీరావు ఫూలే. శూద్రులు, అతిశూద్రులుగా జ్యోతిరావు ఫూలే అభివర్ణించే రైతుల సమస్యల కేంద్రంగానే ఆయన రచనలన్నీ సాగాయి. దేశ చరిత్రలో మొదటిసారి ఇలాంటి రచనలు చేసిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే. 1873లో ‘గులామ్‌గిరి’ పేరుతో ఆయన రాసిన తొలి పుస్తకం దేశంలోని ఉత్పాదక సమూహాలు ఆకాంక్షిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రతిబింబించింది. అశోక చక్రంతో కూడిన జెండాను అంబేడ్కర్ ఆమోదిస్తే... వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు రైతులు దాన్ని తమ సొంతం చేసుకున్నారు. ► మన రాజ్యాంగం, జాతీయ జెండా, ప్రజాస్వామ్య సంస్థలన్నింటినీ కాపాడుకోవాల్సిన... కొనసాగించాల్సిన అవసరం ఎంతో ఉంది. భిన్నాభిప్రాయాలు, ఆకాంక్షలు కలిగి ఉన్నా స్వాతంత్య్ర ఉద్యమకారులు కలసికట్టుగా ఆధునిక భారతదేశాన్ని ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఆలోచనలు, రాజ్యాంగాలతో రూపొందించారు. పల్లెలు, పట్టణాలు, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలపై జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని, స్వాతంత్య్ర ఉద్యమకారుల త్యాగ గుణాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంచె ఐలయ్య షెపర్డ్ – వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
మీసం మెలేసేది రైతన్నే!
దుక్కి దున్ని.. నారు పెట్టి.. నాగలి పట్టిన రైతన్నే ఉత్తరప్రదేశ్ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగి మీసం మెలేస్తున్నాడు. పోటీకి సై అంటున్నాడు. చట్టాల రూపకల్పనలో తనకూ భాగస్వామ్యం కావాలని గొంతెత్తున్నాడు. తనను పక్కనపెట్టినా, తక్కువ చేసినా తగ్గేదేలే అని హెచ్చరిస్తున్నాడు. సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమం తర్వాత యూపీ రాజకీయాల్లో పెరిగిన రైతుల పాత్ర ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశాలున్నాయి. అక్కడంతా రైతు ఎజెండా, రైతు నేతల మద్దతు చుట్టూతే రాజకీయం గిర్రున తిరుగుతోంది. యూపీ జనాభాలో 60 శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడి ఉండగా, ప్రతి సీటు గెలుపులోనూ వీరిపాత్రే కీలకంగా ఉండనుంది. ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న రైతులను చట్టసభలకు పంపేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. గ్రామీణ జనాభా ఉన్న ప్రాంతాల్లో సుమారు 250కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉండటంతో రైతు నేపథ్యం గల రాజకీయ నేతలను పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. గడిచిన నాలుగు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే వివిధ రంగాలకు చెందిన వారిలో రైతులే ఎక్కువ సంఖ్యలో అసెంబ్లీకి వెళ్తున్నారు. గత 2017 ఎన్నికల్లో చట్టసభలో ఏకంగా 161 మంది రైతులు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఇందులో వ్యవసాయంతో పాటు ఇతర వ్యాపారాలు చేస్తున్న ఎమ్మెల్యేలు 90 మందికి పైగా ఉండడం విశేషం. రైతుల తర్వాత అధిక సంఖ్యలో వ్యాపారులు, ఆ తర్వాత ఉపాధ్యాయులు చట్టసభల్లో ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన పార్టీలు ప్రకటించిన జాబితాల్లో 45శాతం మంది రైతులు ఉన్నారని ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. రైతు ఎజెండాతోనే రాజకీయం మరోవైపు యూపీ ఎన్నికల్లో రైతు అజెండాతోనే రాజకీయ పార్టీలు బాహాబాహీకి దిగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు చట్టాలు, వాటిపై యూపీ రైతుల నుంచే తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం కావడం, పుండుపై కారం చల్లినట్లుగా లఖీమ్‌పూర్ ఖేరీ ఘటన చోటుచేసుకోవడం, ఈ ఘటనకు బాధ్యుడైన కేంద్ర సహాయ మంత్రి అజయ్‌మిశ్రా తేనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం వంటి అంశాలు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. ఈ వ్యతిరేకతను తప్పించుకునేందుకు బీజేపీ తమ ప్రభుత్వం చేసిన రైతు అనుకూల చర్యలను పదేపదే వల్లెవేస్తోంది. చిన్న, సన్నకారు రైతుల కోసం రూ.36 వేల కోట్ల రుణాలు అందించామని, పీఎం ఫసల్ బీమా యోజన కింద రూ.2.21 కోట్ల మంది రైతులను చేర్చి ఇప్పటికే 28 లక్షల మందికి రూ.2,400 కోట్లు పరిహారం అందించామని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇక పీఎం కిసాన్ కింద యూపీ రైతులకు రూ.41 వేల కోట్లు జమ అయ్యాయని, ఎరువుల బస్తాల ధరలను రూ.2,400 నుంచి రూ.1200కి తగ్గించిందని తమ ప్రచారాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదేపదే ప్రస్తావిస్తున్నారు. మరోపక్క ఇటీవల జాట్ నేతలతో సమావేశం అయిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైతులకు రూ.36 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని, చెరకు రైతులకు రూ.1.40 లక్షల కోట్ల చెల్లింపులు చేశామని చెబుతూ వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఇక వెనుకబడ్డ బుందేల్‌ఖండ్ ప్రాంతానికి తాగు, సాగునీటి వసతిని పెంచేలా కెన్–బెత్వా నదుల అనుసంధానానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. మరోపక్క రైతుల్లో బీజేపీపై ఉన్న ఆగ్రహాన్ని సమాజ్‌వాదీ పార్టీ–ఆర్ఎల్డీ కూటమి తన అస్త్రంగా మలుచుకుంటోంది. రైతులపై నమోదు చేసిన కేసులు, చనిపోయిన వారికి పరిహారం ఇవ్వకపోవడంపై ప్రశ్నలు సంధిస్తోంది. తాము అధికారంలోకి వస్తే 15 రోజుల్లో కేసులను మాఫీ చేయడంతోపాటు చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. దీనికితోడు చెరకు రైతులకు బకాయిల మాఫీ, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు, బీమా సౌకర్యం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఇందులో ఎవరి హామీలు, ఎవరి మాటలను రైతులు నమ్ముతారన్నది బ్యాలెట్ తేల్చనుంది. బీజేపీకి కంట్లో నలుసుగా.. అధికార బీజేపీకి రైతు సంఘాల ప్రతినిధులు కంట్లో నలుసులా తయారయ్యారు. పంటలకు కనీస మద్దతు ధరపై తాజా కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయకపోవడం, రైతు నేతలపై కేసుల ఉపసంహరణకు సంబంధించి నాన్చుడు ధోరణితో విసుగు చెందిన రైతు సంఘాల నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటెయ్యాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. కుల, మత రాజకీయాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలనే ధోరణి ఇక చెల్లదని, హిందువులు, ముస్లింల పేరుతో సమాజాన్ని విభజించి ఓట్లు కొల్లగొట్టే రాజకీయాలు పనిచేయవని రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్నదాతల సంక్షేమం పట్ల శ్రద్ధ వహించే వారికే ప్రజలు పట్టం కడతారని తేల్చిచెప్పారు. ’మిషన్ యూపీ’ ద్వారా రైతు వ్యతిరేక పాలనకు గుణపాఠం చెబుతామని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ఇటీవల వెల్లడించారు. ఈ ప్రకటనలు ఎంతమేర ప్రభావం చూపుతాయన్న దానిపై రాజకీయ పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంది. – సాక్షి, న్యూఢిల్లీ -
రైతు నేత గర్నామ్ సొంత రాజకీయ పార్టీ
చండీగఢ్: రైతు ఉద్యమ ముఖ్య నేతల్లో ఒకరైన గుర్నామ్ సింగ్ చదుని సొంతంగా ‘సంయుక్త సంఘర్షణ మోర్చా’ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పాల్గొంటుందని చెప్పారు. స్వచ్ఛ రాజకీయాలు, మంచినేతలను ప్రోత్సహించడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మత్తు పదార్థం ఓపియం తయారీలో వాడే గసగసాల సాగును ప్రోత్సహిస్తామన్నారు. ఈ పంట సాగుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా ఆందోళనలు కొనసాగించిన 40 రైతు సంఘాల సమాఖ్య సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) సభ్యుల్లో గుర్నామ్ సింగ్ చదుని కూడా ఒకరు. ఈయన హరియాణా బీకేయూ అధ్యక్షుడిగా ఉన్నారు. చదవండి: సన్నిహితులపై ఐటీ దాడుల మీద అఖిలేశ్ స్పందన