న్యూఢిల్లీ: ఉధృతంగా కొనసాగుతున్న రైతుల ఉద్యమ సంబంధ ‘ఎక్స్’ఖాతాలను స్తంభింపజేయాలంటూ ‘ఎక్స్’ సంస్థకు మోదీ సర్కార్ నుంచి ఆదేశాలు రావడంపై కాంగ్రెస్ కన్నెర్రజేసింది. భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తూ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. రైతుల ఉద్యమంతో సంబంధం ఉన్న దేశంలో 177 సామాజికమాధ్యమాల ఖాతాలను తాత్కాలికంగా నిలిపేయాలంటూ ‘ఎక్స్’కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది.
కేంద్ర హోం శాఖ సిఫార్సుమేరకు ఈ ఆదేశాలొచ్చాయి. దీనిపై తొలుత ‘ఎక్స్’ స్పందించింది. ‘‘ పెనాల్టీలు, జరిమానాలు, నిర్బంధాలకు వీలయ్యేలా 177 ఖాతాలను బ్లాక్ చేస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులొచ్చాయి. తప్పని పరిస్థితుల్లో ఆ ఆదేశాలను పాటించాం. కానీ ఇలా భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం సబబు కాదు. ఈ అంశంలో పారదర్శకత కోసం ఆయా ఉత్తర్వుల కాపీలను బహిర్గతంచేయాల్సింది. అయితే చట్టంలోని నిబంధనల కారణంగా మేం ఆ పనిచేయలేకపోతున్నాం. పారదర్శకత లేనంత కాలం, బహిర్గతం చేయనంతకాలం ఈ వ్యవస్థలో జవాబుదారీతనం లేనట్లే’’ అని ‘ఎక్స్’ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ బృందం ఒక ప్రకటన విడుదలచేసింది.
Comments
Please login to add a commentAdd a comment