సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: గత 200 రోజులుగా పంజాబ్, హరియాణా సరిహద్దులోని శంభూ సరిహద్దు వద్ద ఉద్యమం కొనసాగిస్తున్న రైతుల సాధకబాధకాలను పట్టించుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం ముందుకొచి్చంది. ఇందుకోసం పంజాబ్, çహరియాణా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ నవాబ్ సింగ్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. నిరసనబాట పట్టిన రైతన్నల సమస్యలను వినాలని, నెలల తరబడి రహదారిపై నిలిపిన వారి ట్రాక్టర్లు, ట్రాలీలు తదితరాలను హైవేల నుంచి తొలగించేందుకు రైతులను ఒప్పించాలని కమిటీకి కోర్టు సూచించింది.
కమిటీ వారం రోజుల్లోపు తొలి భేటీ జరపాలని సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాల్‌ల ధర్మాసనం ఆదేశించింది. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి శంభూ వద్ద ప్రభుత్వం ఏర్పాటుచేసిన బారీకేడ్లను తొలగించాలంటూ హైకోర్టు ఇచి్చన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హరియాణా ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పై విధంగా స్పందించింది. ఈ కమిటీకి సలహాలు, సూచనలు చేసేందుకు పంజాబ్, హరియాణా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు కోర్టు స్పష్టంచేసింది. పిటిషన్ తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదావేసింది.
Comments
Please login to add a commentAdd a comment