
చండీగఢ్: రైతు ఉద్యమ ముఖ్య నేతల్లో ఒకరైన గుర్నామ్ సింగ్ చదుని సొంతంగా ‘సంయుక్త సంఘర్షణ మోర్చా’ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పాల్గొంటుందని చెప్పారు. స్వచ్ఛ రాజకీయాలు, మంచినేతలను ప్రోత్సహించడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మత్తు పదార్థం ఓపియం తయారీలో వాడే గసగసాల సాగును ప్రోత్సహిస్తామన్నారు.
ఈ పంట సాగుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా ఆందోళనలు కొనసాగించిన 40 రైతు సంఘాల సమాఖ్య సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) సభ్యుల్లో గుర్నామ్ సింగ్ చదుని కూడా ఒకరు. ఈయన హరియాణా బీకేయూ అధ్యక్షుడిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment