Gurnam Singh
-
రైతు నేత గర్నామ్ సొంత రాజకీయ పార్టీ
చండీగఢ్: రైతు ఉద్యమ ముఖ్య నేతల్లో ఒకరైన గుర్నామ్ సింగ్ చదుని సొంతంగా ‘సంయుక్త సంఘర్షణ మోర్చా’ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పాల్గొంటుందని చెప్పారు. స్వచ్ఛ రాజకీయాలు, మంచినేతలను ప్రోత్సహించడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మత్తు పదార్థం ఓపియం తయారీలో వాడే గసగసాల సాగును ప్రోత్సహిస్తామన్నారు. ఈ పంట సాగుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా ఆందోళనలు కొనసాగించిన 40 రైతు సంఘాల సమాఖ్య సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) సభ్యుల్లో గుర్నామ్ సింగ్ చదుని కూడా ఒకరు. ఈయన హరియాణా బీకేయూ అధ్యక్షుడిగా ఉన్నారు. చదవండి: సన్నిహితులపై ఐటీ దాడుల మీద అఖిలేశ్ స్పందన -
ఆ జవాను అమరుడయ్యారు!
శ్రీనగర్: పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన బీఎస్ఎఫ్ జవాన్ గుర్నామ్ సింగ్ శనివారం రాత్రి అమరుడయ్యారు. చికిత్స పొందుతున్న గుర్నామ్ ను మెరుగైన వైద్యం కోసం ఏయిమ్స్ కు తరలించాలని చూస్తుండగా దురదృష్టవశాత్తూ గుర్నామ్ చనిపోయారని ఓ అధికారి రాజేందర్ థాపా మీడియాకు తెలిపారు. పాక్ దాడులలో గాయపడ్డ జవాన్లకు మెరుగైన వైద్యం అందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అమరుడైన జవాను సోదరి గుర్జీత్ కౌర్ శనివారం ఆరోపించారు. తన సోదరుడి పరిస్థితి విషమంగా ఉందని, గుర్నమ్ ను విదేశాలకు తీసుకెళ్లి ట్రీట్ మెంట్ ఇప్పించాలని కుదరని పక్షంలో అక్కడి నుంచి మంచి వైద్యుల బృందాన్ని తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. (తప్పక చదవండీ: కేంద్ర ప్రభుత్వానికి జవాను సోదరి సూటి ప్రశ్న!) పాకిస్తాన్ రేంజర్స్ జమ్ముకశ్మీర్ కతువా జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద శుక్రవారం జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను గుర్నామ్ సింగ్ గాయపడ్డారు. పాక్ కాల్పులను తిప్పికొట్టిన భారత్ మొత్తం ఏడు మందిని మట్టుపెట్టిన విషయం తెలిసిందే. -
కేంద్ర ప్రభుత్వానికి జవాను సోదరి సూటి ప్రశ్న!
భారత ఆర్మీపై కేంద్ర ప్రభుత్వం తీరు సరిగా లేదని బీఎస్ఎఫ్ జవాను కుటుంబం ఆరోపించింది. పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన దాడులలో గాయపడ్డ జవాన్లకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని భారత జవాను గుర్నామ్ సింగ్ సోదరి గుర్జీత్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మాత్రం విదేశీ పర్యటనలకు వెళ్తారు.. కానీ గాయపడ్డ సైనికులను మాత్రం తీసుకెళ్లడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారని సూటిగా ప్రశ్నించారు. అలా వీలుకాని పక్షంలో విదేశాల నుంచి మంచి వైద్య బృందాన్ని అయినా ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్ మెంట్ ఇప్పించొచ్చు కదా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. ప్రస్తుతం తన సోదరుడు గుర్నామ్ కౌర్ ఆరోగ్య పరిస్థితిపై తమ కుటుంబం తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు జాతీయ మీడియాకు వెల్లడించారు. జమ్ములోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గుర్నామ్ చికిత్స పొందుతున్నారు. తన సోదరుడి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అతడ్ని విదేశాలకు ఎందుకు తీసుకెళ్లడం లేదని గుర్జీత్ కౌర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాకిస్తాన్ రేంజర్స్ జమ్ముకశ్మీర్ లోని హిరానగర్ సమీపంలో లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) వద్ద శుక్రవారం జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను గుర్నామ్ సింగ్ గాయపడ్డారు.పాక్ రేంజర్స్ కాల్పులను తిప్పికొట్టిన భారత్ మొత్తం ఏడుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టిన విషయం తెలిసిందే.