ఆ జవాను అమరుడయ్యారు!
శ్రీనగర్: పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన బీఎస్ఎఫ్ జవాన్ గుర్నామ్ సింగ్ శనివారం రాత్రి అమరుడయ్యారు. చికిత్స పొందుతున్న గుర్నామ్ ను మెరుగైన వైద్యం కోసం ఏయిమ్స్ కు తరలించాలని చూస్తుండగా దురదృష్టవశాత్తూ గుర్నామ్ చనిపోయారని ఓ అధికారి రాజేందర్ థాపా మీడియాకు తెలిపారు.
పాక్ దాడులలో గాయపడ్డ జవాన్లకు మెరుగైన వైద్యం అందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అమరుడైన జవాను సోదరి గుర్జీత్ కౌర్ శనివారం ఆరోపించారు. తన సోదరుడి పరిస్థితి విషమంగా ఉందని, గుర్నమ్ ను విదేశాలకు తీసుకెళ్లి ట్రీట్ మెంట్ ఇప్పించాలని కుదరని పక్షంలో అక్కడి నుంచి మంచి వైద్యుల బృందాన్ని తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. (తప్పక చదవండీ: కేంద్ర ప్రభుత్వానికి జవాను సోదరి సూటి ప్రశ్న!)
పాకిస్తాన్ రేంజర్స్ జమ్ముకశ్మీర్ కతువా జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద శుక్రవారం జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను గుర్నామ్ సింగ్ గాయపడ్డారు. పాక్ కాల్పులను తిప్పికొట్టిన భారత్ మొత్తం ఏడు మందిని మట్టుపెట్టిన విషయం తెలిసిందే.