
అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్తాన్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దారుణ ప్రదర్శన అనంతరం పాకిస్తాన్ జట్టు.. వైట్‌బాల్ సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ కూడా పాక్ జట్టు ఆటతీరు ఏ మాత్రం మారలేదు. తొలుత కివీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను 4-1 తేడాతో కోల్పోయిన పాకిస్తాన్.. ఇప్పుడు వన్డే సిరీస్‌లో కూడా అదే దిశగా కొనసాగుతోంది.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేపియర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 73 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 345 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో రిజ్వాన్ సేన చతకలపడింది. లక్ష్య చేధనలో మంచి ఆరంభం లభించినప్పటికి మిడిలార్డర్ విఫలమం కావడంతో పాక్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఫిలిప్స్, కాన్వే, హెన్రి వంటి స్టార్ ప్లేయర్లు కివీస్ జట్టులో లేనప్పటికి.. పాకిస్తాన్ ఓడిపోవడాన్ని ఆ దేశ మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పాక్ జట్టుపై మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శల వర్షం గుప్పించాడు. అదేవిధంగా స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం బ్యాటింగ్ పొజిషన్‌పై కూడా అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
"బాబర్ ఎందుకు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలి?. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఓపెనింగ్ చేశాడు. చాలా మంది ఓపెనర్‌గానే బాబర్ రావాలని సూచించారు. అసలు ఎవరా క్రికెట్ ప్రొఫెసర్స్? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వారి వాళ్లే బాబర్ ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు.
ఇప్పుడు మూడో స్ధానంలో వచ్చి బాబర్ ఎలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు? క్రికెట్ ప్రొఫెసర్స్ ఇప్పుడు బయటకు వచ్చి దేశానికి క్షమాపణలు చెప్పాలి. ఇప్పుడు ఎవరూ బయటకు రారు. ఇలా క్రికెట్ ప్రొఫెసర్స్ అవ్వాలనుకునేవారిని బూట్లతో కొట్టాలి. బాబర్, రిజ్వాన్‌లను ఓపెనర్లుగా చేసిన వారే పాకిస్తాన్ క్రికెట్‌ను నాశనం చేశారు. పాకిస్థాన్ జట్టు ఫ్రాంచైజీ జట్టుగా మారిపోయింది" అని అలీ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IPL 2025: ఏంటి పరాగ్ బ్రో ఇది.. ఎందుకంత యాటిట్యూడ్? వీడియో వైరల్