Legality
-
రైతు సంఘాలతో కేంద్రం చర్చలు
చండీగఢ్: పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడం వంటి డిమాండ్లపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సారథ్యంలోని బృందం శుక్రవారం చండీగఢ్‌లో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించింది. రెండున్నర గంటలకుపైగా జరిగిన ఈ చర్చల్లో సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాలకు చెందిన 28 మంది స భ్యుల ప్రతినిధి బృందం పాల్గొంది. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోని శంభు, ఖనౌరీల్లో ఈ రెండు రైతు సంఘాలు ఏడాదికిపైగా నిరసనలు సాగిస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వం తరఫున వ్యవసాయ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుద్దియన్, ఆహారం, పౌరసరఫరా శాఖ మంత్రి లాల్ చంద్ తదితరులు పాలొ న్నారు. మహాత్మాగాంధీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప బ్లిక్ అడ్మినిస్ట్రేషన్(ఎంజీఎస్ఐపీఏ)లో జరిగిన చ ర్చలు సుహృద్భావ వాతావరణంలో సాగాయన్నా రు. రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం తీసు కున్న చర్యలను ఈ సందర్భంగా రైతు నేతలకు వివరించామని ప్రహ్లాద్ జోషి చెప్పారు. తదుపరి రౌండ్ చర్చలు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో 22న జరుగుతాయని మంత్రి చెప్పారు. నిరశనదీక్ష సాగిస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఖనౌరీ నుంచి ఆయన్ను అంబులెన్సులో తీసుకువచ్చారు. ఆయన ప్రయాణానికి నాలుగు గంటల సమయం పట్టిందని రైతు నేత కాకా సింగ్ కొట్ర చెప్పారు. -
స్వలింగ వివాహాలకు చట్ట బద్ధత
బ్యాంకాక్: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే చట్టం థాయిలాండ్‌లో గురువారం అమల్లోకి వచ్చింది. దీంతో, మొదటిరోజే వందలాదిగా జంటలు ఒక్కటయ్యాయి. రాజధాని బ్యాంకాక్‌లోని ఓ షాపింగ్ మాల్లో ఏర్పాటైన ఈ వివాహ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెళ్లికి నిర్వచనం మారుస్తూ థాయ్ ప్రభుత్వం పౌర స్మృతిలోని కీలకమైన 1448 నిబంధనను ఆమోదించగా, దేశవ్యాప్తంగా ఒక్క రోజే నమోదైన వివాహాలు 1,448 మార్కును దాటే అవకాశముందని అధికా రులు తెలిపారు. దావోస్‌లో ఉన్న ప్రధానమంత్రి షినవత్రా ఈ సందర్భంగా స్వలింగ జంటలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎల్జీబీటీక్యూ వర్గం ఇంద్ర ధనస్సు జెండా థాయ్‌లాండ్‌పై రెపరెపలాడుతోంది’అంటూ ఫేస్బుక్ పేజీలో కామెంట్ పెట్టారు. జిల్లా మ్యారేజీ కార్యాలయాల్లో అధికారులు కొత్త జంటల కోసం పార్టీలు, ఫొటో బూత్‌లను ఏర్పాటు చేశారు. కప్ కేక్‌లను పంచిపెట్టారు. మొదటిగా పెళ్లి రిజిస్టర్ చేసుకున్న వారికి విమాన ప్రయాణ టిక్కెట్లను సైతం ఆఫర్ చేశాయి కొన్ని కంపెనీలు. ఇలాంటి మధుర క్షణాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు కొన్ని జంటలు సంతోషం వ్యక్తం చేశాయి. స్వలింగ వివాహం చట్టం ద్వారా ఏకమయ్యే వారు ఇకపై ఆస్తులను నిర్వహించుకోవచ్చు, వారసత్వంగా పొందొచ్చు పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు. తమ జీవిత భాగస్వామి అనారోగ్య పాలైతే వైద్య సదుపాయాలను వర్తింప జేసుకోవచ్చు, ఆర్థిక ప్రయోజనాలను పంచుకోవచ్చు. గతేడాది జూన్‌లో ఈ చట్టాన్ని పార్లమెంట్లో ఉభయ సభలు దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించాయి. సెప్టెంబర్‌లో థాయ్ రాజు దీనిపై సంతకం చేశారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన మూడో ఆసియా దేశం థాయ్‌ల్యాండ్. ఇప్పటి వరకు ఇలాంటి వివాహాలను నేపాల్, తైవాన్ చట్టాలు మాత్రమే గుర్తించాయి. థాయ్ పౌరస్మృతిలోని 70 సెక్షన్లు మార్చారు. మగ, ఆడ, భర్త, భార్య వంటి లింగ సూచక పదాలకు బదులుగా వ్యక్తి, భాగస్వామి అనే వాటిని చేర్చారు. అయితే, స్వలింగ జంటలు సరోగసీ ద్వారా కుటుంబాలను కలిగి ఉండాలంటే చట్టాల్లో మరో డజను వరకు మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. -
ఎంఎస్పీ పంజాబ్‌కే కాదు.. దేశమంతటికీ అవసరమే
చండీగఢ్: పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కేవలం పంజాబ్‌కే కాదు, దేశంలోని రైతులందరికీ అవసరమేనని నిరాహార దీక్ష చేస్తున్న పంజాబ్ రైతు నేత జగ్జీత్ సింగ్ దలేవాల్(70) పేర్కొన్నారు. ఈ విషయం కేంద్రానికి తెలిసేలా చేయాలన్నారు. ఈ పోరాటంలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల రైతులు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద దలేవాల్ చేపట్టిన దీక్షకు శనివారంతో 40 రోజులు పూర్తయ్యాయి. దీన్ని పురస్కరించుకుని ఖనౌరీలో ఏర్పాటైన ‘కిసాన్ మహాపంచాయత్’నుద్దేశించి దలేవాల్ మాట్లాడారు. కార్యక్రం వేదికపైకి దలేవాల్‌ను స్ట్రెచర్‌పై తీసుకువచ్చారు. బెడ్‌పై పడుకుని సుమారు 11 నిమిషాలపాటు మాట్లాడారు. ‘ఎంఎస్పీ పంజాబ్ రైతులకు మాత్రమే దేశమంతటికీ అవసరమే. ఎంఎస్పీకి గ్యారెంటీ సహా మనం చేస్తున్న డిమాండ్లు సాధారణమైనవి కావన్న విషయం నాకు తెలుసు. వీటిని సాధించుకోవడం ఏ ఒక్కరి వల్లో అయ్యే పనికాదు కూడా. ఇప్పటి ఆందోళనల్లో రెండు రైతు సంఘాలు మాత్రమే పాలుపంచుకుంటున్నాయి. పంజాబ్ ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తోంది. ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఈ పోరులో పాల్గొనాలి. ఇది కేవలం పంజాబ్ డిమాండ్ మాత్రమే కాదు, యావద్దేశానిది. అనే సందేశాన్ని కేంద్రానికి వినిపించేలా చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నా’అని ఆయన పేర్కొన్నారు. ‘మనం గెలుస్తామనే విశ్వాసం నాకుంది. బల ప్రయోగం చేసేందుకు ప్రభుత్వం ప్రయతి్నంచినా మనల్ని మాత్రం ఓడించలేదు. నాకేమైనా పట్టించుకోను. మళ్లీ రైతులు ఆత్మహత్యలకు పాల్పడే అవసరం రాకూడదనే నా ప్రయత్నమంతా’అని వివరించారు. ‘దలేవాల్ ప్రాణాలు ముఖ్యమని సుప్రీంకోర్టు అంటోంది. నేనూ మనిషిని సరే, దేశవ్యాప్తంగా బలవన్మరణాలకు పాల్పడిన 7 లక్షల మంది సంగతేమిటని గౌరవ సుప్రీంకోర్టును అడుగుతున్నా’అని దలేవాల్ అన్నారు. -
నేడు మళ్లీ ఢిల్లీ చలో
చండీగఢ్: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత సహా పలు డిమాండ్ల సాధనకు రైతు సంఘాలు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం ఆదివారం తిరిగి మొదలవుతుందని రైతు సంఘం నేత సర్వాన్ సింగ్ పాంథర్ చెప్పారు. శంభు నుంచి శుక్రవారం మొదలైన ర్యాలీపై హరియాణా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో మొత్తం 16 మంది గాయపడ్డారని, వీరిలో ఒకరు వినికిడి శక్తి కోల్పోయారని ఆయన వివరించారు. క్షతగాత్రుల్లో నలుగురు చికిత్స పొందుతుండగా మిగతా వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారన్నారు. ఈ పరిణామంతో శనివారం ర్యాలీని నిలిపివేశామని ఆయన శంభు వద్ద మీడియాకు తెలిపారు. తమ డిమాండ్లపై చర్చలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహా్వనం అందలేదని పాంథర్ చెప్పారు. తమతో చర్చలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. అందుకే, 101 మంది రైతుల బృందంతో కూడిన జాతాను ఆదివారం మధ్యాహ్నం నుంచి శాంతియుతంగా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. శుక్రవారం రైతులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో కేందరంలోని బీజేపీ ప్రభుత్వం అసలు స్వరూపం బట్టబయలైందని ఆయన వ్యాఖ్యానించారు. -
ఇప్పటికైతే ప్రత్యేకంగా లేదు!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో జలవనరులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక చట్టం అమలులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. శాసనసభ శీతాకాల సమావేశాలలోపు దానికి రూపం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈలోపు హైడ్రాకు పూర్తి చట్టబద్ధత కల్పిస్తూ, మరింత బలోపేతం చేయడానికి ఆరు శాఖలకు చెందిన చట్టాలను సవరిస్తున్నారు. దీనికి శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం కూడా ఆమోదముద్ర వేయడంతో త్వరలో ఆర్డినెన్స్ వెలువడనుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి అధికార విభాగాలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, జీహెచ్ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్ సర్విసెస్ చట్టాల్లోని కీలకాంశాలను సవరించనున్నారు. వీటి కింద నోటీసులు జారీ సహా వివిధ అధికారాలను సైతం హైడ్రాకు అప్పగించనున్నారు. జీహెచ్ఎంసీ చట్టం–1955 ప్రకారం ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలను తొలగించడం, అనధికార హోర్డింగ్స్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే జరిమానాలు విధించడం తదితర అధికారాలు ఇప్పటి వరకు జీహెచ్ఎంసీకి మాత్రమే ఉన్నాయి. కొత్త కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఏర్పాటైన తర్వాత అమలులోకి వచ్చిన తెలంగాణ పురపాలక చట్టం–2021 ప్రకారం ఆయా పురపాలికలకూ ఇవి దఖలయ్యాయి. బీపాస్ చట్టం–2020 ప్రకారం జోనల్ కమిషనర్ల నేతృత్వంలోని జోనల్ టాస్‌్కఫోర్స్, జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్‌లకు ఇలాంటి అక్రమ కట్టడాలు, కబ్జాలపై చర్యలకు అధికారాలు వచ్చాయి. హెచ్ఎండీఏ చట్టం–2008లో 8, 23 ఏ సెక్షన్ల కింద ఆ విభాగం కమిషనర్‌కు కూడా విశేషాధికారాలు ఉన్నాయి. తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని 1317ఎఫ్ సెక్షన్ ప్రకారం అక్రమ కట్టడాల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు సంబంధించి రెవెన్యూ డివిజనల్ అధికారితో పాటు కలెక్టర్‌కు అధికారం ఉంటుంది. తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357ఎఫ్ ప్రకారం నీటిపారుదల శాఖ అధికారి, జిల్లా కలెక్టర్‌కు జలవనరులైన చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. జీవోఎంఎస్ నం.67 ద్వారా 2002లో యూడీఏలతో పాటు ఎగ్జిక్యూటివ్ అధికారులకు, తెలంగాణ భూ ఆక్రమణల చట్టం–1905లోని 3, 6, 7, 7ఏ సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లకూ చర్యలు తీసుకునే అధికారం ఇచ్చారు. ఈ యాక్ట్‌లతో పాటు వాల్టా చట్టం–2002, జీవోఎంఎస్–168 ప్రకారం తెలంగాణ బిల్డింగ్ రూల్స్, తెలంగాణ ఫైర్ సరీ్వసెస్ యాక్ట్–1999లకూ సవరణ చేసి హైడ్రాకు అవసరమైన అధికారాలు ఇస్తున్నారు. న్యాయ విభాగం సిఫార్సుల ప్రకారం హైడ్రా గవరి్నంగ్ బాడీలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మిని్రస్టేషన్కు (సీసీఎల్ఏ) స్థానం కల్పించనున్నారు. ఈ మార్పుచేర్పులతో పాటు మరిన్ని కీలకాంశాలను హైడ్రా యాక్ట్‌లో పొందుపరచనున్నారని తెలిసింది. -
దద్దరిల్లిన సరిహద్దులు
చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వ్యవసాయ రుణాల రద్దుతో సహా ఇతర డిమాండ్లపై రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. రెండు రోజుల విరామం తర్వాత బుధవారం నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా తమ పోరాటం ఆగదని తేలి్చచెప్పారు. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణలతో పంజాబ్–హరియాణా సరిహద్దులోని శంభు, ఖనౌరీ బోర్డర్ పాయింట్లు దద్దరిల్లిపోయాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో ట్రాక్టర్ ట్రాలీలు, మినీ వ్యాన్లు, జేసీబీలపై నిరసనకారులు తరలివచ్చారు. సరిహద్దుల్లో వేలాది మంది గుమికూడారు. రక్షణ వలయాన్ని ఛేదించుకొని ముందుకు దూసుకెళ్లడానికి ప్రయతి్నంచారు. వాహనాలతో బారీకేడ్లను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని పోలీసులు అనుమానించారు. నిరసనకారులను చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు డ్రోన్‌తో బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. శంభు బోర్డర్ పాయింట్ వద్ద బుధవారం మూడుసార్లు బాష్పవాయువు ప్రయోగం చోటుచేసుకుంది. డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెంచారు. ఖనౌరీలోనూ రైతుల ఆందోళన కొనసాగింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీ వెళ్లడానికి తమను అనుమతించడానికి డిమాండ్ చేశారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. బాష్పవాయువు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి చాలామంది రైతులు మాసు్కలు, కళ్లద్దాలు ధరించారు. -
Farmers movement: సర్కారు ‘మద్దతు’ లేదనే..!
సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతన్న మరోసారి కన్నెర్రజేశాడు. డిమాండ్ల సాధనకు రాజధాని బాట పట్టాడు. దాంతో రెండు రోజులుగా ఢిల్లీ శివార్లలో యుద్ధ వాతావరణం నెలకొంది. అవసరమైతే మరోసారి నెలల తరబడి ఆందోళనలు కొనసాగించేందుకే రైతులు సిద్ధమవుతున్నారు. పంజాబ్, హరియాణాతో పాటు ఉత్తర యూపీకి చెందిన రైతులు భారీ సంఖ్యలో నిరసనల్లో పాల్గొంంటున్నారు. అన్ని పంటలకూ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించడంతో పాటు దానికి చట్టబద్ధత కల్పించాలన్నది వారి ప్రధాన డిమాండ్. దాంతోపాటు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు కూడా రైతులు పట్టుబడుతున్నారు. ఇంతకీ ఏమిటీ ఎంఎస్పీ? రైతు సంక్షేమానికి స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులేమిటి...? ఎంఎస్పీ కీలకం.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడంలో కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్ ప్రైస్–ఎంఎస్పీ)ది కీలక పాత్ర. ► రైతుల నుంచి పంటను సేకరించేందుకు ప్రభుత్వం చెల్లించే కనీస ధరే ఎంఎస్పీ. ► ఇది వారికి మార్కెట్ ఒడిదొడుకుల బారినుంచి రక్షణతో పాటు స్థిరత్వాన్ని, ఆదాయ భద్రతను కల్పిస్తుంది. ► దీన్ని కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సీఏసీపీ) నిర్ణయిస్తుంటుంది. ఈ విషయంలో ఉత్పత్తి వ్యయం, మార్కెట్ ధోరణులు, డిమాండ్–సరఫరా తదితరాలను పరిగణనలోకి తీసుకుంటుని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి ఎంఎస్పీపై సిఫార్సులు చేస్తుంది. వాటి ఆధారంగా సీసీఈఏ తుది నిర్ణయం తీసుకుంటుంది. సీఏసీపీ 1965లో ఏర్పాటైంది. ఇలా లెక్కిస్తారు... ఎంఎస్పీ లెక్కింపు సంక్లిష్టమైన ప్రక్రియ. ఇందుకోసం రైతులకయ్యే ప్రత్యక్ష, పరోక్ష ఉత్పత్తి వ్యయాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ► ఎరువులు, విత్తనాలు, కూలీల వంటివి ప్రత్యక్ష వ్యయం కాగా రైతు సొంత కుటుంబం పడే కష్టం, అద్దెలు తదితరాలు పరోక్ష వ్యయం. ► వీటిని స్థూలంగా ఏ2, ఎఫ్ఎల్, సీ2గా వర్గీకరిస్తారు. ► పంట ఎదుగుదల, ఉత్పత్తి, నిర్వహణ నిమిత్తం చేసే ఎరువులు, విత్తనాలు, కూలీల వ్యయం ఏ2 కిందకు వస్తుంది. ► ఈ అసలు ఖర్చులకు కుటుంబ కష్టం తదితర పరోక్ష ఉత్పత్తి వ్యయాన్ని కలిపితే ఎఫ్ఎల్. ► ఏ2, ఎఫ్ఎల్ రెండింటికీ మూలధన ఆస్తులు, రైతు చెల్లించే అద్దెలను కలిపితే వచ్చేదే సీ2. ► వీటికి తోడు పలు ఇతర అంశాలను కూడా సీఏసీఊ పరిగణలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు సాగు వ్యయం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ప్రతి క్వింటా పంట దిగుబడికి అయ్యే వ్యయమూ అంతే. అలాగే మార్కెట్ ధరలు, వాటి ఒడిదొడుకులు, కూలీల వ్యయం తదితరాలు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. వీటన్నింటితో పాటు సదరు పంట ఎగుమతులు, దిగుమతులు, మొత్తం నిల్వలు, డిమాండ్, తలసరి వినియోగం, ప్రాసెసింగ్ పరిశ్రమ ధోరణులు తదితరాలన్నింటినీ ఎంఎస్పీ లెక్కింపు కోసం సీఏసీపీ పరిగణనలోకి తీసుకుంటుంది. స్వామినాథన్ సిఫార్సులు... ► అన్ని పంటలకూ ఎంఎస్పీ హామీ ఇస్తూ చట్టం తేవాలి. ఎంఎస్పీ మొత్తం పంట సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతం ఎక్కువగా ఉండాలి (దీన్ని సీ2+50 పద్ధతిగా పిలుస్తారు). ► రైతు ఆత్మహత్యలను అరికట్టేలా భూమి, నీరు, సేంద్రియ వనరులు, రుణం, బీమా, టెక్నాలజీ, పరిజ్ఞానం, మార్కెట్ల వంటి మౌలిక సదుపాయాలు వారందరికీ అందుబాటులో తేవాలి. ► రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి. ► రైతు, వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ద్వారా మెరుగైన ధర కలి్పంచాలి. ► వ్యవసాయోత్పత్తుల సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రమాణాలకు తగ్గట్టు ఉండాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Farmers movement: రేపు రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’
న్యూఢిల్లీ/చండీగఢ్: రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన ‘ఢిల్లీ చలో’మార్చ్ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు హరియాణా సరిహద్దుల్లో అధికారులు భారీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నిషేధాజ్ఞలను అమలు చేయడంతో పాటు వాహనాల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు కాంక్రీట్ దిమ్మెలు, స్పైక్ బారియర్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. టొహానా బోర్డర్ వద్ద ఇసుక కంటెయినర్లను, కాంక్రీట్ బారికేడ్లను, మేకులను రోడ్డుపై ఏర్పాటు చేశారు. సోమవారం చర్చలకు రావాల్సిందిగా రైతు సంఘాలను కేంద్రం ఆహా్వనించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి డిమాండ్లతో సంయుక్త కిసాన్ మోర్చా, పలు ఇతర రైతు సంఘాలు ఢిల్లీ మార్చ్‌కి పిలుపివ్వడం తెలిసిందే. దాంతో ట్రాక్టర్ ట్రాలీ మార్చ్ సహా ఎటువంటి నిరసనలు చేపట్టరాదంటూ హరియాణా ప్రభుత్వం 15 జిల్లాల పరిధిలో సెక్షన్ 144 విధించింది. శంభు వద్ద పంజాబ్‌తో సరిహద్దును మూసివేసింది. ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సరీ్వసులను, బల్క్ ఎస్ఎంఎస్లను మంగళవారం దాకా నిషేధించింది. 2020–21లో రైతులు ఏడాదికి పైగా నిరసనలు కొనసాగించిన సింఘు, ఘాజీపూర్, తిక్రీ సరిహద్దుల్లో బారికేడ్లనే ఏర్పాటు చేసి, తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీలోని ఈశాన్య జిల్లాలో కూడా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. నిరసనకారులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. యూపీ, పంజాబ్ సరిహద్దుల్లో 5 వేల మంది పోలీసులను నియోగించారు. మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నిరసనకారులు బారికేడ్లను తొలగించుకుని లోపలికి రాకుండా ఘగ్గర్ ఫ్లై ఓవర్ వద్ద రోడ్డుకు ఇరువైపులా ఇనుపïÙట్లను అమర్చారు. ఏదేమైనా కనీసం 20 వేల మంది రైతులు ఢిల్లీ తరలుతారని రైతు సంఘాలంటున్నాయి. మోదీ సర్కారు నిరంకుశత్వంతో రైతులను అడ్డుకోజూస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. దాన్ని ఢిల్లీ నుంచి శాశ్వతంగా పారదోలాలని పిలుపునిచ్చారు. -
విరాళాల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు విరాళాలు అందుకునేందుకు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం చట్టబద్ధతను సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై వాదనలు గురువారం ముగిశాయి. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ‘ ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు అందుకున్న విరాళాల సమగ్ర డేటాను సీల్డ్ కవర్లో మాకు రెండు వారాల్లోగా అందజేయండి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ను ధర్మాసనం ఆదేశించింది. ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. బాండ్ల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సీపీఐ(ఎం) నేత, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)లు విడివిడిగా పిటిషన్ల వేయడం తెల్సిందే. బాండ్లను విక్రయించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను విరాళాల దాతల వివరాలు అడగబోము. కానీ ఎన్ని బాండ్లు విక్రయించారు, ఎంత మొత్తం పార్టీల ఖాతాల్లో జమ అయిందనే వివరాలు ఇవ్వండి’ అని ఈసీకి కోర్టు సూచించింది. ‘పరస్పర సహకార’ ధోరణికి ఈ బాండ్ పనిముట్టుగా మారొద్దు: అధికార పార్టీ నుంచి ప్రయోజనం పొందే వారు.. అధికార పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారీగా విరాళాల ద్వారా లబ్ది చేకూర్చడం, ఆతర్వాత అధికార పార్టీ నుంచి వారు అదే స్థాయిలో లబ్ధిపొందటం వంటి ధోరణి ఉండొద్దు. లబ్దిదారులు, అధికారి పార్టీ మధ్య నీకిది నాకది(క్విడ్ ప్రో కో) తరహా విధానానికి ఎలక్టోరల్ బాండ్ అనేది పనిముట్టుగా మారకూడదు’ అని వాదోపవాదనల సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ దాత వివరాలు గ్రహీత పార్టీకి తెలుసు. తాను ఎవరికి విరాళమిచ్చేది ఇంకో పార్టీకి తెలియకూడదని దాత కోరుకుంటున్నాడు. విరాళాల బదిలీ వ్యవహారం దాతకు, ఆ రాజకీయ పార్టీకి ముందే తెలిసినప్పుడు ఈ వివరాలు సాధారణ పౌరుడికి మాత్రం తెలియాల్సిన పని లేదని కేంద్రం వాదించడంలో ఆంతర్యమేంటి?’ అని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. -
‘స్వలింగ వివాహం’పై ధర్మాసనం: సుప్రీం
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఇవ్వాలా వద్దా అనే అంశానికి ఒకవైపు రాజ్యాంగం ప్రసాదించిన మానవహక్కులు, మరోవైపు ప్రత్యేక శాసనాలు, ఇంకోవైపు ప్రత్యేక వివాహ చట్టం ఉన్నాయి. ఇంతటి ప్రధానమైన అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనమే తేల్చాలి’’ అని వ్యాఖ్యానించింది. ఇలాంటి వివాహాలను అనుమతించకూడదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అభిప్రాయాన్ని వెల్లడించడం తెల్సిందే. ‘‘భారతీయ కుటుంబ వ్యవస్థకు స్వలింగ వివాహాలు పూర్తి విరుద్ధం. వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సున్నిత సమతుల్యతను ఇవి భంగపరుస్తాయి’ అంటూ ఆదివారం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ‘‘ఈ అంశంలో శాసన అంశాలు, మానవ హక్కులు ఇమిడి ఉన్నాయి. దీనిని రాజ్యాంగ ధర్మాసనమే పరిష్కరిస్తుంది’ అంటూ సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఏప్రిల్ 18వ తేదీకి వాయిదావేసింది. ‘స్వలింగ వివాహాలను అనుమతిస్తే ఎదురయ్యే సమస్యల గురించీ ఆలోచించాలి. ఇద్దరు తండ్రులు లేదా కేవలం ఇద్దరు తల్లులు మాత్రమే జంటగా జీవించే కుటుంబంలో ఎదిగే పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది ? ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమైన పార్లమెంట్ ఇలాంటి విషయాలను సమీక్షించాల్సి ఉంది. ఈ కేసు తీర్పు మొత్తం భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపనుంది. అందుకే కేసులో భాగస్వామ్య పక్షాల వాదోపవాదనలను విస్తృతస్థాయిలో వినాలి’ అని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఒక న్యాయవాది కోరగా రాజ్యాంగ ధర్మాసనాల విచారణలన్నీ ప్రత్యక్ష ప్రసారాలు అవుతున్నాయని ధర్మాసనం గుర్తుచేసింది. -
స్వలింగ వివాహాలు చట్ట విరుద్ధమే! కేంద్ర ప్రభుత్వం స్పందన ఇదే..
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలాంటి వివాహాలను చట్టబద్ధంగా గుర్తించడం అనేది వ్యక్తిగత చట్టాలు, ఆమోదయోగ్యమైన సామాజిక విలువల మధ్య సమతూకాన్ని దెబ్బతీస్తుందని వెల్లడించింది. అందుకే చట్టబద్ధత కల్పించలేమని వివరించింది. స్వలింగ వివాహాలు ముమ్మాటికీ చట్టవిరుద్ధమేనని పరోక్షంగా తేల్చిచెప్పింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది. ఐపీసీ సెక్షన్ 377 కింద స్వలింగ సంపర్కం నేరం కాదని తేల్చినప్పటికీ.. స్వలింగ వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించడాన్ని ప్రాథమిక హక్కుగా పిటిషనర్లు కోరలేరని స్పష్టం చేసింది. స్త్రీ–పురుషుడి సంబంధాలు, వేర్వేరు వ్యక్తుల నడుమ వ్యక్తిగత అవగాహనతో ఏర్పడే సంబంధాలు చట్టవ్యతిరేకం కాదని అఫిడవిట్లో కేంద్రం వెల్లడించింది. స్వలింగ సంపర్కుల సహజీవనం నేరం కాదు ఇద్దరు స్త్రీలు లేదా ఇద్దరు పురుషుల నడుమ జరిగిన పెళ్లికి వ్యక్తిగత చట్టాలు లేదా రాజ్యాంగబద్ధమైన చట్టాల కింద చట్టబద్ధత కల్పించడం, గుర్తించడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. స్వలింగ సంపర్కులు కలిసి జీవించడం నేరం కాదని వెల్లడించింది. కానీ, దీన్ని భార్య, భర్త, పిల్లలతో కూడిన భారతీయ కుటుంబ యూనిట్‌తో పోల్చలేమని కేంద్రం అభిప్రాయపడింది. ఒకవేళ స్వలింగ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే అది ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత చట్టాలను, నోటిఫైడ్ చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని వివరించింది. -
మద్దతు ధరకు చట్టబద్ధత
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునేలా చేసిన రైతన్నలు ఇక కనీస మద్దతు ధర కోసం పోరుబాట పట్టనున్నారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టబద్ధత కల్పించేంతవరరు ఉద్యమాన్ని కొనసాగించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఢిల్లీలో ఆదివారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సమావేశమైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో బలప్రదర్శన చేయాలని నిర్ణయానికొచ్చింది. సోమవారం లక్నోలో మహాపంచాయత్ కార్యక్రమాన్ని నిర్వహించి, కేంద్రానికి రైతుల బలమేంటో మరోసారి చూపిస్తామని రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ చెప్పారు. ‘‘వ్యవసాయ రంగంలో ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా రైతన్నల కష్టాలు తీరవు. కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించడమే అతి పెద్ద సంస్కరణ’’ అని అన్నారు. పార్లమెంట్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణతో పాటు తాము చేస్తున్న డిమాండ్లన్నీ కేంద్రం నెరవేర్చేవరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరపై చట్టం చేసేవరకు ఉద్యమం కొనసాగేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఇందుకోసం మరోసారి ఈ నెల 27న సమావేశం కావాలని నిర్ణయించారు. రైతు సంఘాలు ఆరు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాయి. వీటిపై తమతో కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించేదాకా ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పాయి. 29న పార్లమెంట్ వరకూ ర్యాలీ తమ డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలను రైతులు ముమ్మరం చేయనున్నారు. సోమవారం లక్నోలో కిసాన్ పంచాయత్‌తో పాటు ఈ నెల 26న ఢిల్లీలో అన్ని సరిహద్దుల్లో మోహరిస్తామని, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే రోజు అంటే ఈ నెల 29న పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘం నేత బల్బీర్ సింగ్ రాజేవాలే వెల్లడించారు. 24న కేంద్ర కేబినెట్ సమావేశం న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అవసరమైన అధికార ప్రక్రియను త్వరితంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఈ నెల 24న (బుధవారం) కేంద్ర మంత్రిమండలి సమావేశమయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించనుంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే వ్యవసాయ చట్టాల రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసింది. ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల కంటే ముందుగానే కేబినెట్ సమావేశమై చట్టాల రద్దుపై చర్చించి దానికి అవసరమైన తీర్మానాన్ని ఆమోదిస్తుంది. ఆపై ఉపసంహరణ బిల్లుకు తుదిరూపమిస్తారు. ప్రధాని మోదీకి బహిరంగ లేఖ సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసింది. ఎంఎస్పీకి చట్టబద్ధతతోపాటు మొత్తం ఆరు డిమాండ్లపై రైతులతో తక్షణమే చర్చలు ప్రారంభించాలని పేర్కొంది. అప్పటిదాకా పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పింది. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది. ‘‘11 రౌండ్ల చర్చల తర్వాత ద్వైపాక్షిక పరిష్కార మార్గం కనుగొనడం కంటే మీరు(ప్రధాని మోదీ) ఏకపక్ష తీర్మానానికే మొగ్గుచూపారు’’ అని లేఖలో ప్రస్తావించింది. రైతు సంఘాల ఆరు డిమాండ్లు ► పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలి. ► గత ఏడాది కాలంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన 700 మందికి పైగా రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. ► రైతులపై నమోదు చేసిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలి. ► పోరాటంలో రైతుల ప్రాణత్యాగాలకు గుర్తుగా ఒక స్మారక స్తూపం నిర్మించాలి. ► పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు–2020/21 ముసాయిదాను వెనక్కి తీసుకోవాలి. ‘‘దేశ రాజధాని ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ చట్టం–2021’ లో రైతులపై జరిమాన విధించే అంశాలను తొలగించాలి. హా లఖీమీపూర్ ఖేరి ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించి, అరెస్టు చేయాలి. -
తదుపరి కార్యాచరణ ఏంటి?
న్యూఢిల్లీ: మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే సరిపోదు, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు 40 రైతు సంఘాల ఉమ్మడి వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆదివారం సింఘు బోర్డర్ పాయింట్ వద్ద సమావేశం కానుంది. ఎంఎస్పీతోపాటు ప్రతిపాదిత ట్రాక్టర్ ర్యాలీపై చర్చించనున్నట్లు ఎస్కేఎం కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ శనివారం చెప్పారు. సాగు చట్టాల రద్దు ప్రక్రియ పార్లమెంట్లో పూర్తయ్యేదాకా రైతుల పోరాటం ఆగదని అన్నారు. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ వరకూ ప్రతిరోజూ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని విరమించుకోలేదని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతన్నలు ప్రారంభించిన పోరాటానికి నవంబర్ 26న ఏడాది పూర్తి కానుంది. ఈ చట్టాలను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తమ పోరాట కార్యక్రమంలో ఎలాంటి మార్పు ఉండబోదని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. ఈ నెల 26న ఢిల్లీ శివార్లలోని నిరసన కేంద్రాలకు రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. కేసులను ఉపసంహరించాలి: మాయావతి కనీస మద్దతు ధరకు హామీనిస్తూ చట్టాన్ని తీసుకురావాలని బహుజన సమాజ్‌పార్టీ అధినేత మాయావతి శనివారం డిమాండ్ చేశారు. రైతులపై నమోదు చేసిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. -
ఆధార్ రాజ్యాంగబద్ధమే.. సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు
-
ఆధార్ రాజ్యాంగబద్ధమే
న్యూఢిల్లీ: ఆధార్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. ఆధార్ పూర్తిగా రాజ్యాంగబద్ధమేనని దీని ద్వారా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందనేది పూర్తి అవాస్తవమని పేర్కొంది. 12 అంకెల ఆధార్ నెంబర్‌ను తప్పనిసరి చేసే సేవలను పరిమితం చేస్తూ బుధవారం తీర్పునిచ్చింది. బ్యాంకు అకౌంట్లు, మొబైల్ కనెక్షన్లు, స్కూల్ అడ్మిషన్లకు ఆధార్ తప్పనిసరి కాదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 తీర్పుతో స్పష్టం చేసింది. ఈ తీర్పులో జస్టిస్ చంద్రచూడ్ ఒక్కరే ఆధార్ చట్టంపై భిన్నమైన తీర్పు చెప్పారు. మిగిలిన వారంతా ఆధార్ రాజ్యాంగబద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరిగా అమలుచేయాల్సిందేనని కోర్టు తెలిపింది. ఆదాయపు పన్ను (ఐటీ) దాఖలు, పాన్ (పీఏఎన్) నెంబరు కేటాయింపులో ఆధార్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని తీర్పునిచ్చింది. పలువురు న్యాయ నిపుణులు ఈ తీర్పు సమతూకంగా ఉందని అభిప్రాయపడ్డారు. సెక్షన్ 57 అసంబద్ధం: సుప్రీం టెలికాం కంపెనీలతోపాటు, కార్పొరేట్ సంస్థలకు బయోమెట్రిక్ ఆధార్ డేటాను పొందేందుకు అనుమతించిన ఆధార్ (ఆర్థిక, ఇతర సబ్సిడీలు, పథకాలు, సేవల లబ్ధి కల్పించే) చట్టం – 2016లోని సెక్షన్ 57ను సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఆధార్ డేటా ఆర్నెల్ల కంటే ఎక్కువరోజులు దాచుకోవడానికి వీల్లేదని ఆదేశించింది. జస్టి‹స్ చంద్రచూడ్ భిన్నమైన తీర్పునిచ్చారు. ఆధార్‌చట్టాన్ని పార్లమెంటులో ద్రవ్యబిల్లుగా ఆమోదించడాన్ని ఆయన తప్పుబట్టారు. అయితే సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటుగా ధర్మాసనంలోని ఇతర జడ్జీలు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఖన్విల్కర్‌లు దీంతో విభేదించారు. ఆధార్ బిల్లును ద్రవ్యబిల్లుగా లోక్‌సభ ఆమోదించడాన్ని సమర్థించారు. ఆధార్ ద్వారా సమాజంలో వెనుకబడిన వర్గాలకు మేలు జరుగుతుందని.. ప్రభుత్వ పథకాలు అసలైన లబ్ధిదారులకు చేరేందుకు వీలుంటుందని ఈ నలుగురు పేర్కొన్నారు. ఆధార్ ఓ ప్రత్యేకమైన వ్యవస్థ అని.. దాన్ని అలాగే ఉంచేందుకు ప్రయత్నించాలని కేంద్రానికి సూచించారు. ‘ఆధార్ పేదలకు గౌరవాన్ని కల్పిస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛకన్నా గౌరవం దక్కడం ముఖ్యం’ అని 1,448 పేజీల తీర్పులోని కొన్ని అంశాలను చదువుతూ జస్టిస్ సిక్రీ పేర్కొన్నారు. ఓ మంచి పని జరుగుతున్నప్పుడు కాస్తంత చెడు జరగటం సహజమేనన్నారు. ‘పౌరులపై నిఘా పెంచేందుకే ఆధార్‌ను ప్రభుత్వం ప్రతిచోటా తప్పనిసరి చేస్తోందని పిటిషనర్ల వాదన. వ్యక్తిగత గోప్యత హక్కుకు విఘాతం కలుగుతోందంటున్నారు. ప్రభుత్వం ఆధార్ వ్యవస్థ భద్రతను మరింత కట్టుదిట్టంగా మార్చాలి’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతమున్నట్లుగా.. జాతీయ భద్రత పేరుతో ఆధార్ డేటాను సేకరించే అంశాన్ని కిందిస్థాయి ఉద్యోగులకు కట్టబెట్టడం సరికాదని పేర్కొంది. కనీసం జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారికి అధికారాన్ని అప్పజెప్పాలంది. ఆధార్ చట్టబద్ధతపై మాజీ హైకోర్టు న్యాయమూర్తి కేఎస్ పుట్టుస్వామి సహా 31 మంది పిటిషనర్లు వేసిన వ్యాజ్యాలను గతంలోనే (మే 10వ తేదీ) విచారణ పూర్తిచేసిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. బీజేపీకి చెంపపెట్టు: కాంగ్రెస్ ప్రైవేటు సంస్థల చేతికి ఆధార్ డేటాను అందించే ఆధార్ చట్టంలోని సెక్షన్ 57ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. ‘ఈ చట్టంలోని సెక్షన్ 57ను కోర్టు తప్పుబట్టడం హర్షదాయకం. ప్రైవేటు సంస్థలు ఆధార్ డేటాను తీసుకోవడం ఆపేస్తాయి’ అని ట్విట్టర్లో పార్టీ పేర్కొంది. ప్రైవేటు సంస్థలనుంచి ఆధార్ హక్కులను తొలగించడం.. అధికార బీజేపీకి చెంపపెట్టు అని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ విజయమిది: బీజేపీ ఆధార్ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్పు.. పేదలకు, పేదల పక్షపాత మోదీ ప్రభుత్వానికి దక్కిన విజయంగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ ఆధార్‌ను అడ్డుకునేందుకు పన్నిన కుట్రలన్నీ భగ్నమయ్యాయన్నారు.ఈ తీర్పు చారిత్రకమని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ అన్నారు. ఆధార్ ద్వారా ప్రభుత్వం సంక్షేమపథకాల్లో లీకేజీలు అరికట్టడంతో ప్రతిఏటా రూ.90వేల కోట్లు ఆదా అవుతున్నాయని ఆయన వెల్లడించారు. నిఘా అవాస్తవం: యూఐడీఏఐ ఆధార్ ద్వారా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగడం, నిరంతరం వారిపై నిఘా ఉంటుందన్న వార్తల్లో వాస్తవం లేదని యూఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) పునరుద్ఘాటించింది. ఆధార్ ద్వారా కల్పించే కనీస వివరాల ద్వారా వ్యక్తిగత గోప్యతకు భంగం కలగదు. సుప్రీం కోర్టు ఇదే విషయాన్ని వెల్లడించింది. పౌరులపై నిఘా ఉంచడం కూడా ఆధార్ వల్ల సాధ్యం కాదు. ఈ డేటాను కాపాడేందుకు కూడా ఆధార్ వద్ద పటిష్టమైన భధ్రతావ్యవస్థ ఉంది. పరిమిత ప్రభుత్వం రాజ్యాంగపరమైన విశ్వాసాన్ని ఆధార్ చట్టం కల్పిస్తోంది’ అని యూఐడీఏఐ సీఈవో అజయ్ అన్నారు. ద్రవ్యబిల్లు కాదు: జస్టిస్ చంద్రచూడ్ రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరగొద్దనే ప్రభుత్వం ద్రవ్యబిల్లుగా మార్చి లోక్‌సభ ఆమోదంతో సరిపెట్టిందని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో వెల్లడించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 110లోని పలు నిబంధనలు.. ఆధార్ చట్టాన్ని ద్రవ్యబిల్లుగా పరిగణించడానికి పూర్తి వ్యతిరేకమన్నారు. ఆధార్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ‘మొబైల్ ఫోన్లు భారతీయుల జీవనంలో భాగమైపోయాయి. దీన్ని ఆధార్‌తో జతపర్చడం వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛలకు విఘాతం కలిగిస్తుంది. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు వెంటనే వినియోగదారుల ఆధార్ డేటాను తొలగించాలి. బ్యాంకు అకౌంట్లను తెరిచేవారూ ఆధార్ వివరాలను పొందుపర్చడం సరికాదు. అంటే బ్యాంకు అకౌంట్ తెరిచే ప్రతి వ్యక్తిపై నిఘా పెట్టేందుకు ఆయనేమైనా ఉగ్రవాదా?’ అని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. వివిధ ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉండే ఆధార్ వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆధార్ ద్వారా సమాచార గోప్యతకు భంగం కలిగిస్తుందంటూ యూఐడీఏఐ కూడా అంగీకరించిందని ఆయన గుర్తుచేశారు. ఆధార్ లేకుండా భారత్‌లో జీవించడం దాదాపు కష్టమేననే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. పౌరుడి ప్రతి వివరాన్ని ఆధార్‌తో జతపరుస్తూ పోతే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం వ్యక్తిగత గోప్యత హక్కు ఉల్లంఘన జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పౌరుల డేటాకు భద్రతనిచ్చేందుకు యూఐడీఏఐకు సంస్థాపరమైన బాధ్యతలేమీ లేవన్నారు. వ్యక్తిగత గోప్యతను కాపాడలేని పక్షంలో ఇతర హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతుందని.. దీనికి భద్రత కల్పించే సరైన చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంటు వ్యవస్థదేనన్నారు. వాడివేడిగా వాదనలు.. అయినా! ఆధార్ చట్టబద్ధతపై విచారణ సందర్భంగా కోర్టు గదిలో.. కోర్టు బయటా వాడివేడి చర్చలు జరిగాయని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఇవేవీ ఆధార్‌కు వ్యతిరేకంగానో, అనుకూలంగానో నిర్ణయం తీసుకునేలా తమపై ప్రభావితం చేయలేదని స్పష్టం చేసింది. ఆధార్‌తో అనుసంధానమైన భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగానే వ్యవహరించామని తీర్పు సందర్భంగా పేర్కొంది. మేధావుల దగ్గర్నుంచి.. సామాన్య ప్రజల వరకు ఇంటర్వ్యూలు, కథనాలు, గల్లీ చర్చల్లో ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని కోర్టు తెలిపింది. ‘ఇరువర్గాల భావోద్వేగాలు, ఆవేశకావేశాలు, బాధలన్నింటినీ విచారణ సందర్భంగా అర్థం చేసుకున్నాం. పౌరులకు కల్పించిన హక్కులు, దేశభద్రతకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకునే మేం తీర్పును వెలువరించాం’ అని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘విచారణ సందర్భంగా ఆధార్‌కు వివిధ అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించిన అంశాలను పేర్కొన్నారు. ఆధార్‌కు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన వారేమో.. వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతోందని వాదించారు’ అని జస్టిస్ సిక్రీ వెల్లడించారు. వ్యక్తిగత సమాచారం భద్రమే ఆధార్ కార్డు దారుల వ్యక్తిగత సమాచార భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. వ్యక్తిగత సమాచారాన్ని చట్టం ఇక నుంచి భద్రంగా ఉంచుతుందని,ప్రభుత్వంకాని, ప్రైవేటు సంస్థలు కాని దాన్ని పొందలేవని అభిప్రాయపడింది. అక్రమ వలసదారులకు వద్దు అక్రమ వలసదారులకు ఆధార్ కార్డులు జారీ కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడం కోసం అక్రమ వలసదారులు ఆధార్ కార్డులు పొందుతున్నారంది. ‘భద్రతా కారణాలు’ చెల్లవు ఆధార్ చట్టంలోని 33వ సెక్షన్‌ను కోర్టు కొట్టివేసింది. దేశ భద్రత దృష్ట్యా వ్యక్తుల ఆధార్ సమాచారాన్ని బలవంతంగా సేకరించడానికి ఈ సెక్షన్ ప్రభుత్వానికి అధికారం కల్పించింది.ఇప్పుడీ సెక్షన్‌ను కొట్టివేయడంతో భద్రతా కారణాలు చెప్పి ఆధార్ వివరాలు లాక్కోవడం కుదరదు. పాన్–ఆధార్ లింక్.. ఆధార్‌తో పాన్ నంబర్ అనుసంధానం 50 శాతానికి పైగా పూర్తయింది. ఆధార్‌తో పాన్ లింక్‌ను కోర్టు బుధవారం సమర్థించిన నేపథ్యంలో తాజాగా విడుదల అయిన నివేదికలో ఈ విషయం తేలింది. సోమవారం నాటికి 21,08,16,676 పాన్ నంబర్లు ఆధార్‌కు అనుసంధానం అయ్యాయి. ఇప్పటివరకు జారీ చేసిన 41.02 కోట్ల పాన్ కార్డుల్లో 40.01 కోట్ల కంటే ఎక్కువ కార్డులు వ్యక్తిగతమైనవి కాగా మిగతావి పన్ను చెల్లించే కంపెనీలు, ఇతర విభాగాల పేరిట ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనుసంధానం గడువును ఆదాయపన్ను శాఖ గతంలో ఐదుసార్లు పొడిగించింది. ఆధార్ కేసు నడిచిందిలా... ఆధార్ రాజ్యాంబద్ధతపై న్యాయస్థానంలో దాఖలైన కేసు తొమ్మిదేళ్లు నడిచింది.ఆధార్‌ను వ్యతిరేకిస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ సందర్భంగా కోర్టులు భిన్న వ్యాఖ్యలు చేశాయి. చివరకు ఆధార్ రాజ్యంగబద్ధమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు కొనసాగిన క్రమమిది ► 2009, జనవరి: యుఐడీఏఐ ఏర్పాటు. ► 2010, సెప్టెంబర్: తొలి ఆధార్ నెంబరు కేటాయింపు. ► డిసెంబర్: పార్లమెంటులో ఆధార్ బిల్లు. ► 2011 సెప్టెంబర్: 10కోట్లకు చేరిన ఆధార్ పొందిన వారి సంఖ్య. ► డిసెంబర్: ఆధార్ బిల్లుపై స్టాండింగ్ కమిటీ రిపోర్టు. ► 2012, నవంబర్: ఆధార్ చట్టబద్ధతను సవాలు చేస్తూ రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి, మరికొందరు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు. ► 2013, నవంబర్: ఈ కేసులో ప్రతివాదులుగా చేరాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం ఆదేశం. ► 2015, అక్టోబర్: ఆధార్ స్వచ్ఛందమేనంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ► 2016, మార్చి 3: మళ్లీ లోక్‌సభకు ఆధార్ బిల్లు–2016. ఆర్థిక బిల్లుగా దీనికి ఆమోదం. ఆధార్ పొందిన వారి సంఖ్య 98 కోట్లు. ► సెప్టెంబర్: అమల్లోకి వచ్చిన ఆధార్ చట్టం. ► 2017,మే: ఆధార్ బిల్లును ఆర్థిక బిల్లుగా పరిగణించడంపై సుప్రీంలో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పిటిషన్. ► 2017, ఆగస్టు 24: వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు ధర్మాసనం రూలింగ్. ► 2018, జనవరి 17: ఆధార్ కేసు విచారణను ప్రారంభించిన సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం. ► సెప్టెంబర్ 26: ఆధార్ చట్టం రాజ్యాంగబద్ధతను సమర్థించిన సుప్రీంకోర్టు. చట్టంలోని కొన్ని నిబంధనలను కొట్టివేత. -
‘సెక్షన్ 497’పై తీర్పు వాయిదా
న్యూఢిల్లీ: వ్యభిచార చట్టం చెల్లుబాటును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు ముగించి, తీర్పును రిజర్వులో ఉంచింది. చివరి రోజైన బుధవారం కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ వాదనలు వినిపించారు. సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం వివాదాస్పద ఐపీసీ సెక్షన్ 497 చట్టబద్ధతపై విచారణచేపట్టడం తెల్సిందే. భర్త అనుమతి ఉన్న పక్షంలో వివాహేతర సంబంధం నేరం కాదని పేర్కొంటున్న ఈ చట్టంతో సమాజానికి ఏం ప్రయోజనమని కోర్టు బుధవారం కేంద్రాన్ని ప్రశ్నించింది. వివాహ వ్యవస్థకు ఉన్న పవిత్రతను దృష్టిలో ఉంచుకునే వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్నామని ఆనంద్ బదులిచ్చారు. వ్యభిచారాన్ని నేరం కాదని చెబుతున్న విదేశీ చట్టాలను పరిగణనలోకి తీసుకోవద్దని, దేశంలోని సామాజిక స్థితిగతుల ఆధారంగానే ఈ చట్టం చెల్లుబాటును నిర్ధారించాలన్నారు. ‘భర్త అనుమతి ఉంటే అది వ్యభిచారం కాదని చట్టం చెబుతోంది. అలాంటప్పుడు సెక్షన్ 497తో సమాజానికి కలిగే ప్రయోజనం ఏంటి? చట్టంలో కొన్ని వైరుధ్యాలున్నాయి. వివాహ వ్యవస్థ పవిత్రతను పరిరక్షించే బాధ్యత మహిళలదేనా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. -
‘బయోమెట్రిక్’ దుర్వినియోగం!
న్యూఢిల్లీ: పౌరుల దైనందిన కార్యకలాపాలన్నింటికీ బయోమెట్రిక్ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తే ఆ సమాచారం దుర్వినియోగమయ్యే ముప్పు ఉందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆధార్ చట్టబద్ధతపై బుధవారం జరిగిన విచారణలో గోప్యతా ఉల్లంఘనపై రాజ్యాంగ ధర్మాసనం పలు సందేహాలను లేవనెత్తింది. ప్రతి లావాదేవీకి బయోమెట్రిక్ ధ్రువీకరణను తప్పనిసరిచేయడం..వ్యక్తిగత సమాచారాన్ని సంగ్రహించడానికి దారితీస్తుందని, తరువాత అది దుర్వినియోగమయ్యేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది. ‘కేవలం వేలిముద్రల వల్ల ఎలాంటి వివరాలు తెలియవు. కానీ ఆ సమాచారాన్ని ఇతర వివరాలతో కలిపితే అదొక సమాచార నిధిగా మారుతుంది. అది దుర్వినియోగం కాకుండా ఉండాలంటే తగిన రక్షణ వ్యవస్థ అవసరం’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రతి దానికీ బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేయడం వల్ల ఇకపై అది కేవలం గుర్తింపు సూచికకే పరిమితం కాదని జడ్జి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి ఎన్నోసార్లు ఆధార్ వివరాలను ధ్రువీకరించుకుంటున్న సంగతిని ప్రస్తావించారు. ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తరఫున హాజరైన లాయర్ రాకేశ్ ద్వివేది జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..చాలా సందర్భాల్లో ధ్రువీకరణ ఒకసారే జరుగుతుందని పేర్కొన్నారు. అందుకు పాన్, మొబైల్ సిమ్ కొనుగోలును ఉదహరించారు. ఇప్పటికైతే ఆధార్ సమాచారాన్ని సంగ్రహించేందుకు అవకాశాలు లేవని, ఒకవేళ భవిష్యత్తులో ఆ పరిస్థితే తలెత్తితే కోర్టు జోక్యం చేసుకోవాలని అన్నారు. -
రోడ్ల అభివృద్ధి సంస్థకు చట్టబద్ధత
సాక్షి, హైదరాబాద్: భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా తెలంగాణ రోడ్ల అభివృద్ధి సంస్థకు చట్టబద్ధత కల్పించనున్న ట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తదుపరి అసెంబ్లీ సమావేశాల నాటికి ముసాయిదా బిల్లును సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. న్యాక్‌లో బుధవారం జరిగిన సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ సంస్థల నుంచి రోడ్ల అభివృద్ధి సంస్థ భారీగా రుణం తీసుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కీలక రహదారుల అభివృద్ధికి ఆ సంస్థ ద్వారా విజయబ్యాంకు కన్సార్షియం నుంచి రూ.600 కోట్లు రుణం పొందేందుకు ఏర్పాట్లు చేస్తున్న ట్లు చెప్పారు. ముఖ్యమైన, ఎంపిక చేసిన రోడ్ల ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ట్రాక్)లో భాగంగా ప్రణా ళికను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు రహదారి అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. బడ్జెట్ నిధులతో ఇలాంటి పనులు సాధ్యం కానందున ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని మంత్రి తుమ్మల చెప్పారు. -
సమితులకు రాజముద్ర
► రైతు సమన్వయ సమితులకు చట్టబద్ధత కల్పించే యోచనలో సర్కారు ►కార్పొరేషన్ లేదా సొసైటీలుగా నెలకొల్పే యోచన ►వాటికి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించి అధికారాల అప్పగింత.. వ్యవసాయ శాఖకు సమాంతర వ్యవస్థ ►కాంగ్రెస్ కోర్టు గడప తొక్కడంతో తర్జనభర్జన ►న్యాయ సలహా అనంతరం తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితులకు చట్టబద్ధత కల్పించే యోచనలో ఉంది. అయితే కేవలం ఒక జీవో ద్వారా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి సమితుల ఏర్పాటు, వాటి సభ్యులు, సమన్వయకర్తల నియామకంతో న్యాయపరమైన చిక్కులు వస్తాయన్న ఆందోళన సర్కారును వెన్నాడుతోంది. పైగా మంత్రులే వీటిని నామినేట్ చేస్తుండటం, అనేకచోట్ల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే చోటు ఉండటంతో విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై కాంగ్రెస్ కోర్టుకు వెళ్లింది. దీంతో ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. రైతు సమన్వయ సమితుల బాధ్యతలు, అధికారాలు, హక్కులపై ఇప్పటికీ మార్గదర్శకాలు ఖరారు కాలేదు. రైతులకు అన్ని విధాలా సహకరించాలని మాత్రమే సమితి సభ్యులకు చెబుతున్నారు. అదీగాకుండా వ్యవసాయశాఖ విస్తరణ వ్యవస్థ ఉండగా ఎలాంటి చట్టబద్ధత లేని రైతు సమన్వయ సమితులు సహకరించడమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితికి రూ.500 కోట్ల మూలధనం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవన్నీ కేవలం జీవోపై ఆధారపడి అమలు చేసే అవకాశం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతు సమన్వయ సమితులకు చట్టబద్ధత కల్పించి అధికారాలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. న్యాయ సలహా మేరకు చట్టబద్ధతపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని అంటున్నాయి. కార్పొరేషన్ లేదా సొసైటీ! విత్తనం వేయడానికి ముందు నుంచి చేతికొచ్చిన పంట అమ్ముకునే వరకు రైతులకు అవసరమైన సహకారం అందించడం రైతు సమన్వయ సమితుల ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి ఎకరానికి రూ.4 వేలు అందించే రైతు పెట్టుబడి పథకాన్ని అమలు చేయడం వీటి ప్రధాన బాధ్యత. అందుకోసం నిజమైన రైతులను గుర్తించడం వీటి లక్ష్యం. రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితి చేతిలో రూ.500 కోట్ల మూలధనం ఉంచనున్నారు. అది రైతుకు గిట్టుబాటు ధర దక్కేలా చూస్తుంది. ఎక్కడైనా అన్యాయం జరిగితే రైతుకు మూలధనం నుంచి సాయం చేసేలా సహకరిస్తుంది. చట్టబద్ధత లేకపోతే ఇవన్నీ సాధారణ సమితులతో చేయడం సాధ్యం కాదంటున్నారు. న్యాయపరంగా చిక్కులు కూడా వచ్చేది ఇక్కడే. అందువల్ల గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితులన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయించి కార్పొరేషన్ లేదా సొసైటీ ఏర్పాటు చేయాలన్న దిశగా ప్రభుత్వం యోచిస్తోందని వ్యవసాయశాఖ పేర్కొంటున్నాయి. కార్పొరేషన్ లేదా సొసైటీ ఏర్పాటు చేసి దానికి చైర్మన్, డైరెక్టర్లను నియమించే అవకాశం ఉందంటున్నారు. ఆ ప్రకారం రైతు సమన్వయ సమితి అనే పేరు కూడా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వాటికి ఎన్నికలు నిర్వహించకుండా ప్రస్తుత నామినేట్ పద్ధతిలోనే ఉండేలా చట్టంలో ఉన్న వెసులుబాటును కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. చైర్మన్‌గా ఎంపీ.. రాష్ట్ర స్థాయిలోని రైతు సమన్వయ సమితికి చైర్మన్‌గా ఓ ఎంపీ పేరు బలంగా వినిపిస్తోంది. దీనిపై సీఎం కూడా సానుకూలంగా ఉన్నట్టు వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతోంది. జిల్లాలకు, మండలాలకు, గ్రామాలకు కూడా చైర్మన్లను నియమించి వారందరికీ గౌరవ వేతనాలిచ్చే అవకాశం ఉంది. మరోవైపు కార్పొరేషన్ లేదా సొసైటీల్లో సభ్యులుగా ఉండే రైతులు షేర్ కేపిటల్ కింద కొద్దిమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఆ రకంగా మూలధనాన్ని పెద్దఎత్తున సేకరించవచ్చన్న తెలుస్తోంది. వ్యవసాయ శాఖ నీరుగారిపోతుందా? వ్యవసాయశాఖకు సమాంతర వ్యవస్థగా రైతు సమన్వయ సమితులు ఏర్పాటు కానున్నాయన్న చర్చ జరుగుతోంది. ఇవి ప్రస్తుత వ్యవసాయశాఖ విస్తరణ వ్యవస్థపై అధికారం చెలాయించే అవకాశమూ లేకపోలేదు. ప్రస్తుతం మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒక వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో), మండలానికి వ్యవసాయాధికారి (ఏవో), నియోజకవర్గానికి ఏడీఏ ఉన్నారు. వాటికి సమాంతరంగా సమితులు ఏర్పడబోతున్నాయన్న చర్చ జరుగుతోంది. పైగా విత్తనం వేయడం నుంచి పంట విక్రయం వరకు ఇవి కీలకమైతే ఇక వ్యవసాయశాఖ వ్యవస్థ నీరుగారిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయవచ్చా?
రాష్ట్ర క్రికెట్ సంఘాల అభిప్రాయం కోరిన లా కమిషన్ న్యూఢిల్లీ: భారత్‌లో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలకు చట్టబద్ధత కల్పించే అవకాశంపై జాతీయ లా కమిషన్ దృష్టి పెట్టింది. వివిధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు అభిప్రాయాలు తమకు తెలియజేయాలంటూ బీసీసీఐకి లేఖ రాసింది. దేశంలో బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలంటూ లోధా కమిటీ గత ఏడాది సిఫారసు చేసింది. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఈ అంశంపై విస్తృతంగా చర్చించమంటూ లా కమిషన్‌ను ఆదేశించింది. ‘బెట్టింగ్ అంశంలో వివిధ వర్గాల నుంచి సమాచారం, అభిప్రాయాలు సేకరిస్తున్నాం. ఈ అంశంలో రాష్ట్ర క్రికెట్ సంఘాల సూచనలు, సలహాలు ఉపయోగపడవచ్చని మేం భావిస్తున్నాం. మీ సంఘాల అభిప్రాయం తెలుసుకొని మాకు అందజేయండి’ అని లా కమిషన్ సభ్య కార్యదర్శి సంజయ్ సింగ్ బీసీసీఐని కోరారు. అయితే ఇది చాలా క్లిష్టమైన అంశమని బోర్డు అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘చట్టబద్ధం చేస్తే బెట్టింగ్ హౌస్‌లను ప్రభుత్వం నడిపిస్తుందా? లేక ఏదైనా కంపెనీకి అప్పచెబుతారా? గ్యాంబ్లింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థ అంటూ ఉంటుందా? మన దేశంలో లిక్కర్ బాధితులను దారిలోకి తెచ్చే కేంద్రాలే లేవు. ఇప్పుడు గ్యాంబ్లింగ్ వల్ల దారి తప్పిన వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారా?’ అని ఆయన ప్రశ్నించారు. -
పెళ్లిళ్లు వేలల్లో ... రిజిస్ట్రేషన్లు వందల్లో
►ఆరు నెలల్లో 578 వివాహాలు నమోదు ►జరిగినవి సుమారు నాలుగు వేలు ►వధూవరుల్లో కొరవడిన అవగాహన మార్కాపురం : వేలల్లో పెళ్లిళ్లు జరుగుతున్నా, చట్టబద్ధత కల్పించే రిజిస్ట్రేషన్ల విషయంలో వధూవరులకు అవగాహన లేకపోవడంతో సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో వివాహాల నమోదు నత్తనడకన సాగుతోది. జిల్లాలో ఇలా.. మార్కాపురం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో మార్కాపురం, అద్దంకి, కంభం, దర్శి, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి, పొదిలి, యర్రగొండపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. 2016 డిసెంబర్1నుంచి 2017 మే 31వరకు సుమారు 4వేల వరకు వివాహాలు జరగ్గా సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 578పెళ్లిళ్లు రిజిస్టర్ అయ్యాయి. పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. చట్టబద్ధంగా ఎన్ని? పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే కల్యాణ మండపాలు బుక్కవుతాయి. ఒక రోజు ఒక్కొక్క మండపంలో మూడు పెళ్లిళ్లు జరిగిన సంఘటనలు ఉన్నాయి. కల్యాణ మండపాలు బుక్ చేసుకునేందుకు రెండు, మూడు నెలలు ముందుగానే అడ్వాన్స్‌లు ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే వీటిలో చట్టబద్ధంగా నమోదవుతున్నవి మాత్రం చాలా తక్కువే. నెలకు సగటున వంద మాత్రమే వివాహాలు నమోదవుతున్నట్లు రిజిస్ట్రేషన్ శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. కోర్టులు చెబుతున్నా.. వివాహాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోర్టులు చెబుతున్నా అత్య«ధిక జంటలు వివాహాల నమోదుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. విదేశాలకు వెళ్లే జంటలు మాత్రమే తమ పెళ్లిళ్లను నమోదు చేయించుకుంటున్నారు. ఇవి లాభాలు ►వివాహానంతరం వచ్చే సమస్యల పరిష్కారంలో వివాహ ధ్రువీకరణ పత్రాలు ఉపయోగపడతాయి. ►జీవిత భాగస్వామిని విదేశాలకు తీసుకెళ్లాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి. ►విదేశాలకు వెళ్లడంతో పాటు న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతోంది. ►ముఖ్యంగా 2, 3 పెళ్లిళ్లు చేసుకునే వారి ఆట కూడా కట్టించవచ్చు. నమోదుకు.. వివాహాల రిజిస్ట్రేషన్‌కు గడువు అంటూ ఏమి లేదు. ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు. వివాహ శుభలేఖ, ముగ్గురు సాక్షుల, వయసు ధ్రువీకరణ పత్రం(పదో తరగతి సర్టిఫికెట్), పెళ్లి ఫొటోలు తీసుకుని దగ్గరలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే రిజిస్ట్రేషన్ చేస్తారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఈ ప్రక్రియ జరుగుతుంది. మహిళలకు పూర్తి రక్షణ వివాహాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోర్టులు చెబుతున్నాయి. భార్యభర్తల మధ్య గొడవలు జరిగి కోర్టుకు వచ్చినప్పుడు కచ్చితంగా వివాహ ధ్రువీకరణ పత్రం అవసరమవుతోంది. మహిళలను వంచించే వారి బండారం బయటపడుతుంది. వివాహం రద్దయిన తర్వాత భరణం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. మహిళలకు పూర్తిగా రక్షణ ఉంటుంది. – ఉమ్మడి రవీంద్రనాథ్, న్యాయవాది, మార్కాపురం -
స్వాగతిస్తున్నా
-
స్వాగతిస్తున్నా
• అరుణ్ జైట్లీ ప్రకటనపై బాబు ఇచ్చినదానికి అభినందిస్తున్నా • చేయాల్సినదానికి చట్టబద్దత కల్పించండి • హోదా సాధ్యం కాదంటున్నారు • కాబట్టి ఎంతివ్వాలో అంతివ్వండి సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రాష్ట్రానికి అందించిన సహాయానికి అభినందిస్తున్నానని, ఇకపై అందిచాల్సిన సహాయానికి చట్టబద్ధత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తామంటే సంతోషమని, ఒకవేళ హోదా ఇవ్వలేకపోతే దానికి సమానంగా నిధులు ఇవ్వాలని కోరారు. లేదంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించలేమని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనపై బుధవారం అర్ధరాత్రి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు మంత్రులతో కేంద్రం చేసిన ప్రకటనపై సుదీర్ఘంగా చర్చించారు. విలేకరుల సమావేశంలో యనమల రామకృష్ణుడు, పి. నారాయణ, కె.అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. జైట్లీ విలేకరుల సమావేశంలో ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పారని, పోలవరానికి వందశాతం నిధులిస్తామని హామీనిచ్చారని, రెవెన్యూలోటు మూడు సంవత్సరాల్లో భర్తీ చేస్తామని చెప్పారని చంద్రబాబు తెలిపారు. జాప్యం లేకుండా వెంటనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలన్నారు. ఈ విషయంలో గొడవలు పెట్టడం సరికాద న్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎవరు సహకరించినా అభినందిస్తానని చెప్పారు. కొందరు రాష్ట్రాభివృద్ధికి అడ్డం పడటంతో పాటు చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేంద్రం ప్రకటనపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూద్దామన్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన రాయితీల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రానికి అవసరమైనపుడు నిధులు ఇవ్వాలని, రాష్ర్టం స్థిరపడిన తరువాత నిధులు ఇస్తే ఏం లాభముంటుందని ప్రశ్నించారు. బీహార్ రాష్ట్రానికి ప్రకటించిన ప్యాకేజీ లాంటిది ఇవ్వడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. రాజధానికి ప్రస్తుతం రూ.వెయ్యికోట్లు ఇచ్చారని, ఇంకా రూ.1500 కోట్లు ఇస్తామంటున్నారని, అది ఏ మాత్రమూ సరిపోదని చెప్పారు. రాజధాని అంటే భవనాల నిర్మాణం కాదన్నారు. అసెంబ్లీలో సీట్ల పెంపు, కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటును వేగవంతం చేయలని ఆయన కోరారు. -
పార్లమెంటులో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి
బిల్లుకు చట్టబద్ధత కల్పించేంత వరకు పోరాటం ఆగదు ఎస్సీ కారొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి చేవెళ్ల: పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి.. చట్టబద్ధత కల్పించేంతవరకు పోరాటం ఆగదని రాష్ట్ర ఎస్సీ కారొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. వర్గీకరణే ప్రధాన ఎజెండాగా ఆగస్టు 8,9,10 తేదీల్లో నిర్వహించతలపెట్టిన ‘ఢిల్లీపై మాదిగల దండయాత్ర‘ పోస్టర్‌ను ఆయన రాష్ట్ర మాదిగ జేఏసీ కన్వీనర్ జోగు అశోక్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నా.. కేంద్రం ప్రభుత్వం మాత్రం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి తీవ్ర జాప్యం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే మాదిగలకు విద్య, ఉద్యోగ రంగాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని, వర్గీకరణతోనే తమకు న్యాయం జరుగుతుందని మాదిగలు ఆశిస్తున్నారని చెప్పారు. దామాషా ప్రకారం మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లుకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. తాము ఇతరులకు అన్యాయం చేయాలని కోరుకోవడం లేదని, తమకు మాత్రం న్యాయం చేయాలని అర్థిస్తున్నామని తెలిపారు. పార్లమెంటులో వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించేంతవరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. టీఎంజేఏసీ రాష్ట్ర కన్వీనర్ జోగు అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరుతూ వచ్చే నెలలో 8 నుంచి 10 రోజులపాటు ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి అధికసంఖ్యలో హాజరు కావాలని కోరారు. పోరాడితేనే హక్కులను సాధించుకోగలుగుతామన్నారు. వర్గీకరణ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీఎంజేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు పెరికె కరణ్ జయరాజ్, గద్దెల అంజిబాబు, తలారి వెంకటేష్, ఈరని మహేష్, చంటి, బాబు, చరణ్, భూపాల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
మర్పల్లి : ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డప్పు మోహన్, మండల అధ్యక్షులు పర్వేద శ్రీనివాస్, మండల అధికార ప్రతినిధి డప్పు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ఈ నెల 19 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించే మహాధర్నాకు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాదిగలకు హామీ ఇచ్చి నేడు కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం విడ్డూరమన్నారు. -
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
హన్మకొండ : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ (టీఎస్) జిల్లా అధ్యక్షుడు సిలువేరు సాంబయ్య డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని కోరుతూ హన్మకొండలోని ఏకశిల పార్కు వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే దీక్షలు చేపడుతున్నామన్నారు. ఈ నెల 27వరకు దీక్షలు కొనసాగుతాయని తెలి పారు. గత పాలకులు ఇచ్చిన మాట నిలుపుకోకపోవడం వల్లే మాదిగల ఉసురు తాకి అధికారానికి దూరమయ్యారని, వర్గీకరణ చేపట్టకపోతే బీజేపీకి కూడా అదే గతి పడుతుందని అన్నారు. మాదిగ, మాదిగ ఉప కులాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. దీక్షలో ఎమ్మార్పీఎస్(టీఎస్) నాయకులు మాదాసి రాంబాబు, పి.సంజీవ, మంద బాబురావు, ఆకులపల్లి బాబు, తాళ్ళ విజయ్, నమిండ్ల చిన్న స్వామి, తాళ్లపల్లి మధు. అర్షం అశోక్, చింత జోసఫ్, సారంగం, కాయిత ప్రసాద్, కట్కూరి కిశోర్ కూర్చున్నారు. -
ఆధార్ కు చట్టబద్ధత
♦ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ♦ ఆధార్ వినియోగాన్ని మరింత విస్తృతం చేస్తామన్న జైట్లీ ♦ ఎరువుల సబ్సిడీ ‘ప్రత్యక్ష బదిలీ’పై త్వరలో పైలట్ ప్రాజెక్టు న్యూఢిల్లీ: వివిధ వర్గాల వ్యతిరేకత, సుప్రీంకోర్టు మొట్టికాయల నేపథ్యంలో ‘ఆధార్’కు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి, అర్హులకే సబ్సిడీలు అందించడానికి ఆధార్ ఆవశ్యకమని... అందువల్ల ఆధార్‌కు చట్టబద్ధత కల్పించనున్నామని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. పేదలు, బలహీనవర్గాలకు ప్రయోజనం కల్పించేలా పారదర్శకంగా వ్యవహరించేందుకు ఆధార్ తోడ్పడుతుందన్నారు. బిల్లు సిద్ధంగా ఉందని, మరో రెండు రోజుల్లో దీన్ని పార్లమెంట్ ముందుకు తెస్తామని చెప్పారు. చట్టబద్ధత కల్పించడం ద్వారా ఆధార్ వినియోగాన్ని మరింత విస్తృతం చేసి, మరిన్ని అభివృద్ధి చర్యలకు అనుసంధానిస్తామని తెలిపారు. భారత సంచిత నిధి నుంచి కల్పించే అన్ని రకాల సబ్సిడీలు, సేవలు, ప్రయోజనాలను ఆధార్ ద్వారా అందజేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 98 కోట్ల మంది ఆధార్ నంబర్‌ను పొందారని... రోజూ సుమారు 26 లక్షల మంది నేరుగా, మరో 1.5 లక్షల మంది ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. వంటగ్యాస్‌కు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీఎల్) పథకం కింద 16.5 లక్షల మంది ప్రయోజనం పొందుతుండగా... అందులో 11.19 కోట్ల మంది తమ ఆధార్ నంబర్లను అనుసంధానం చేసుకున్నారని వెల్లడించారు. త్వరలోనే ఎరువుల సబ్సిడీని కూడా నేరుగా రైతులకే అందజేసే పథకాన్ని దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నామని జైట్లీ తెలిపారు. ఇక వివిధ సబ్సిడీ పథకాలను ఆధునీకరించడంలో భాగంగా... దేశవ్యాప్తంగా లక్ష రేషన్ దుకాణాలను కంప్యూటరీకరించనున్నట్లు ప్రకటించారు. -
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
వరంగల్, న్యూస్‌లైన్ : బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృషయ్య డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో బుధవారం జరిగిన బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని, బీసీ ఉప ప్రణాళికను అమలుచేయాలన్నారు. జనాభా ప్రకారం బీసీలకు 54 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ శాతం 50 శాతం మించిందని కోర్టుకెళ్లగా.. బీసీ సంక్షేమ సంఘం సుప్రీంకోర్టుకు వెళ్లి 34 శాతం రిజర్వేషన్ సాధించుకుందని చెప్పారు. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల లో లేని రిజర్వేషన్లు ఇక్కడ ఉన్నాయన్నారు. ఈ రిజర్వేషన్లు ఇలాగే కొనసాగాలంటే చట్టబద్ధత కల్పించాల్సిన అవసరముందన్నారు. అదే విధంగా చట్ట సభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఈ దిశగా పోరాటం ఉధృతం చేస్తామని కృష్ణయ్య చెప్పారు. రాజకీయ పార్టీలు బీసీలకు చట్ట సభల్లో సగం సీట్లు కేటాయించాలని, అలా కేటాయించని పార్టీలను బొందపెడతామని హెచ్చరించారు. సర్పంచ్‌లకు చెక్ పవర్ లేకుండా చేసి వారి ఆత్మాభిమానాన్ని దెబ్బ తీశారన్నారు. సీల్డ్‌కవర్ ద్వారా నియమితుడైన ముఖ్యమంత్రికి చెక్ పవర్ ఉండొచ్చు కానీ, నేరుగా ప్రజల ద్వారా ఎన్నికైన సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఉండొద్దా అని ప్రశ్నించారు. సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వకుంటే ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి జానారెడ్డిల పదవులకు ఎసరు పెడతామని, రాష్ట్రంలోని సర్పంచులందరితో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. న్యాయమూర్తులు నియామకానికి రిజర్వేషన్లు అవసరంలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని కృష్ణయ్య ఖండించారు.