వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి | legality of the classification | Sakshi
Sakshi News home page

వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

Published Fri, Jul 22 2016 4:38 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

legality of the classification

మర్పల్లి : ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డప్పు మోహన్‌, మండల అధ్యక్షులు పర్వేద శ్రీనివాస్‌, మండల అధికార ప్రతినిధి డప్పు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ఈ నెల 19 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించే మహాధర్నాకు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాదిగలకు హామీ ఇచ్చి నేడు కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం విడ్డూరమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement