సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ నిర్వహించిన ధర్నాలో అస్వస్తతకు గురై మృతి చెందిన కార్యకర్త భారతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాను తక్షణమే చెల్లిస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆమె కుటుం బంలో అర్హులుంటే ప్రభుత్వ ఉద్యోగమిస్తామని, ఆమెకు పిల్లలు ఉంటే వారి చదువుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపై సోమవారం శాసనసభలో స్వల్ప కాల చర్చ జరుగుతున్న సమయంలో విపక్షాల కోరిక మేరకు భారతి మర ణించిన ఘటనపై సీఎం సభలో ప్రకటన చేశారు. భారతి మృతి దురదృష్టకరమని, ఆమెను వెనక్కి తీసుకురాలేమని అన్నారు. వ్యక్తిగతంగా ఎమ్మార్పీ ఎస్‌తో తనకు దగ్గరి సంబంధం ఉందని, చంద్ర బాబు మంత్రివర్గంలో ఉన్నప్పుడు మంత్రివర్గ ఉపకమిటీ సభ్యుడిగా ఎస్సీ వర్గీకరణకు తాను మద్దతు తెలిపానన్నారు. అలాగే టీఆర్‌ఎస్ అధినేతగా కూడా ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించానన్నారు. ఎస్సీ వర్గీకరణ జరపాలన్న డిమాండ్‌పై అఖిలపక్ష బృందంతో వచ్చి ప్రధాని మోదీని కలుస్తామని, అందుకు సమయం కేటా యించాల్సిందిగా కోరామని గుర్తు చేశారు. సంద ర్భాన్ని బట్టి సమయం కేటాయిస్తానని ప్రధాని హామీ ఇచ్చారని వెల్లడించారు. గతంలో సభలో చేసిన తీర్మానం మేరకు ఎస్సీ వర్గీకరణ చేయాలని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని పునరుద్ఘాటించారు. ఈ విషయం తీవ్రతను వివరిస్తూ ప్రధానికి ఒకట్రెండు రోజుల్లో లేఖ రాస్తానన్నారు. ఎస్సీ వర్గీకరణపై అన్ని రాజకీయపక్షాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు గురికావా ల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రధానిని కలసి ఈ సమస్యకు త్వరలో మంచి ముగింపు ఇద్దామని విపక్షాలకు పిలుపు నిచ్చారు.
భారతి మృతిపై విచారణ..
ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌తో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించా లని ఎమ్మార్పీఎస్ ఇచ్చిన పిలుపు మేరకు కొందరు కార్యకర్తలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారని సీఎం కేసీఆర్ తెలిపారు. మధ్యా హ్నం 12.40 గంటల సమయంలో కార్యక ర్తలు కలెక్టరేట్ గేటు తోసుకుని లోపలికి పోవడానికి ప్రయత్నిం చారని, పోలీసులు అడ్డుకుని వారిని వాహనంలో తరలించేందుకు ప్రయత్నించారని అన్నారు. ఇదే సమయంలో ధర్నాలో పాల్గొన్న 40 ఏళ్ల భారతి అస్వస్తతకు గురై అక్కడే కూర్చోగా, పోలీసులు వెంటనే తమ వాహనంలో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారతి మృతిచెందారని, ఈ ఘటనకు సంబందించిన వీడియో ఫుటేజీని స్వయంగా తను వీక్షించానని సీఎం తెలిపారు. ఈ వీడియో ఫుటేజీని మీడియాకు విడుదల చేస్తున్నామని, ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరుపుతోందని చెప్పారు. భారతి మృతి చెందిన విషాద సమయంలో సభను నిర్వహించకుండా వాయిదా వేయాలని విపక్షాలు చేసిన సూచనతో ఏకీభవిస్తున్నానని అన్నారు. సీఎం విజ్ఞప్తి మేరకు స్పీకర్ మధుసూదనాచారి సభను మంగళవారానికి వాయిదా వేశారు.
అఖిలపక్షాన్ని తీసుకెళ్లండి: విపక్షాలు
ఎస్సీ వర్గీకరణ జరపాలని ప్రధాని మోదీని కోరేందుకు రాష్ట్రం నుంచి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని విపక్షనేత కె.జానారెడ్డి, బీజేపీఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంఐఎం సభ్యుడు అహమ్మద్ పాషా ఖాద్రీ, సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment