bharathi
-
ప్రముఖ రచయిత్రి డాక్టర్ విజయభారతి కన్నుమూత
సనత్‌నగర్/సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి, పద్మభూషణ్ బోయి భీమన్న కుమార్తె, బొజ్జా తారకం సతీమణి, సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా మాతృమూర్తి డాక్టర్ విజయభారతి (83) శనివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆమె, సనత్‌నగర్ రెనోవా నీలిమ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో ఆమె జన్మించారు. తెలుగు రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆమె ఎంఏ తెలుగు లిటరేచర్, అనంతరం పీహెచ్డీ చేశారు. తెలుగు సాహిత్యం, చరిత్ర, సామాజిక అంశాలకు సంబంధించి 20కి పైగా పుస్తకాలను రచించారు. ముఖ్యంగా ఆమె మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవిత చరిత్రలను తన పుస్తకాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతిగా కూడా వ్యవహరించారు. 2005లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 2015లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డులు ఆమెకు దక్కాయి. విజయభారతి పారి్థవదేహాన్ని ఆదివారం గాంధీ మెడికల్ కళాశాలకు అందించనున్నారు. ప్రముఖుల సంతాపం: ప్రముఖ రచయిత్రి, ఐఏఎస్ అధికారి బొజ్జా రాహుల్ తల్లి డాక్టర్ విజయభారతి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విజయభారతి తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలు అందించడంతో పాటు ప్రాచీన సాహిత్య కోశం, ఆధునిక సాహిత్య కోశం వంటి రచనలు వెలువరించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సాహితీరంగానికి ఆమె చేసిన సేవలు అపారమైనవని పేర్కొ న్నారు. రాహుల్ బొజ్జాతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. విజయభారతి మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విజయభారతి మరణంపై సెంటర్ ఫర్ దళిత్ స్టూడెంట్ (సీడీఎస్) చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య, వైస్ చైర్మన్కృష్ణ సంతాపం ప్రకటించారు. -
పుట్టలో పాలుపోసి వచ్చాక.. ఇలా జరగడంతో.. భయాందోళనలో స్థానికులు!
సాక్షి, కరీంనగర్: నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలుపోసిన ఓ మహిళ.. తన కుటుంబసభ్యులను సల్లంగా చూడాలని వేడుకుంది. నాగదేవతకు పూజలుచేసింది. ఆ రాత్రే ఆమె అనూహ్యంగా పాముకాటుకు గురై ప్రాణాలు విడిచింది. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధి అంబేడ్కర్‌నగర్‌కు చెందిన బొడ్డెల భారతి(40) శుక్రవారం రాత్రి పాముకాటుతో మృతి చెందింది. ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో కింద వేసుకున్న దుప్పట్లలో దూరిన పాము భారతినికాటు వేసింది. ఏదో కుట్టినట్లుగా ఉండడంతో నిద్రలేచేసరికి పాము కనిపించిందని, శరరంపై గాట్లు కూడా ఉండడంతో వెంటనే స్థానిక సామాజిక వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు.. గోదావరిఖనికి తరలించగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా నాగులపంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించిన సదరు మహిళ.. పాముకాటుకు గురికావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇవి చదవండి: వివాహం కావడంలేదని.. యువకుడు మనస్తాపంతో ఇలా.. -
ఆరోగ్యాధారిత వ్యవస్థలు బలోపేతం కావాలి
సాక్షి, హైదరాబాద్: ‘రానున్న ఆరోగ్య విపత్తులను ఎదుర్కునేందుకు అంతర్జాతీయంగా ఆరోగ్యాధారిత వ్యవస్థలను ఏకీకృతం, బలోపేతం చేయడం తక్షణ అవసరం’ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అభిప్రాయపడ్డారు. జీ20 ఇండియా ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో జరిగిన 3వ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా ప్రసంగించారు. ప్రాథమిక ఆరోగ్యాన్ని మూలస్తంభంగా ఉంచి, బలమైన ఆరోగ్య వ్యవస్థలను రూపొందించడంపై మనం దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. అంతర్జాతీయంగా అనుసంధానించిన నెట్వర్క్, ఎకో సిస్టమ్‌ను సృష్టించే దిశగా కొనసాగుతున్న ప్రయత్నాలను బలోపేతం చేయాలని ఆమె ఈ సందర్భంగా జీ 20 దేశాలను కోరారు. దానికి ఇది అనువైన సమయంగా పేర్కొన్నారు. డిజిటల్ హెల్త్ పై అంతర్జాతీయ కార్యక్రమ ఏర్పాటుకు భారత్ చేసిన ప్రతిపాదనను ఆమె ఈ సందర్భంగా ప్రతినిధుల దృష్టికి తెచ్చారు. ఇది దేశాల మధ్య డిజిటల్ వైరుధ్యాలను తగ్గించడానికి సాంకేతికత ఫలాలు ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ అందుబాటులో ఉండేలా చూసేందుకు వీలు కలిగిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రపంచపు ఫార్మసీ భారత్: కిషన్‌రెడ్డి కేంద్ర çపర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం, వెల్‌నెస్‌ల కోసం అత్యధికులు ఎంచుకుంటున్న 10 అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటిగా ఉందన్నారు. ప్రపంచపు ఫార్మసీగా మన దేశాన్ని అభివరి్ణంచిన ఆయన...మొత్తం ప్రపంచంలోని వ్యాక్సిన్లలో 33శాతం హైదరాబాద్‌లోని ఒక్క జీనోమ్ వ్యాలీ ద్వారానే ఉత్పత్తి అవుతోందని చెప్పారు. వచ్చే 2030కల్లా అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యాన్ని చేరుకునే విషయంలో మన దేశం కృత నిశ్చయంతో ఉందన్నారు. స్థిరమైన ఆరోగ్య వ్యవస్థ ద్వారానే బలమైన ఆర్థిక వ్యవస్థ: కేంద్రమంత్రి బాఘెల్ కేంద్ర మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ మాట్లాడుతూ స్థిరమైన ఆరోగ్య వ్యవస్థ ద్వారా మాత్రమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించగలమని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ఇటీవలి కోవిడ్ 19 మహమ్మారి నేరి్పందని గుర్తు చేశారు. అందరికీ అత్యుత్తమ ఆరోగ్య సౌకర్యాలు, వ్యాక్సిన్లు, థెరప్యూటిక్స్, డయాగ్నస్టిక్‌లను జీ20 వేదిక ద్వారా అందించడం భారత్ లక్ష్యంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి అయోగ్ సభ్యులు డా.వి.కె.పాల్, ఐసీఎంఆర్ డీజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ బహ్ల్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అభయ్ ఠాకూర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి హెకాలీ జిమోమి, జీ20 దేశాల ప్రతినిధులు, వైద్యరంగ ప్రముఖులు పాల్గొన్నారు. -
అప్పటికే నిశ్చితార్థం.. మరికొద్ది రోజుల్లో పెళ్లనగా.. షాపు ఓనర్‌తో కలిసి..
సాక్షి, రాయచూరు: జిల్లాలో లవ్ జిహాద్ తరహా ఘటన జరిగిట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటికే పెళ్లి కుదిరిన హిందూ యువతి భారతి (22)ని, మరో మతం యువకుడు రెహాన్ (24) పెళ్లి చేసుకున్నాడని భారతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. రెహాన్ నగరంలో పూల వ్యాపారం చేస్తున్నాడు. భారతి అతని షాపులో పనికి వెళుతున్న సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డారు. భారతికి ముందుగానే విజయనగర జిల్లా హూవినహడగలికి చెందిన యువకునితో పెళ్లి కుదిరి నిశ్చితార్థం జరిగింది. కానీ 3 రోజుల కిందట రెహాన్ భారతిని ప్రేమ పేరుతో నమ్మించి ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లి రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడని తల్లిదండ్రులు వాపోయారు. భారతిని పెళ్లికి ముందు మతం మార్పించారని చెప్పారు. పోలీసు స్టేషన్లో విచారణ.. తమ కుమార్తె భారతి కనపడటం లేదని వారు నేతాజీ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిద్దరిని పిలిచారు. భారతి స్టేషన్‌కు బుర్కా ధరించి వచ్చింది. తన కూతురు భారతి రెహాన్ వద్దకు కూలి పనికి వెళుతుండేదని, మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేశాడని భారతి తల్లి నాగమ్మ ఆరోపించింది. ఇద్దరూ మేజర్లు కావడం, ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని చెప్పడంతో పోలీసులు ఆ జంటను విచారించి పంపించివేశారు. చదవండి: (ఆర్ఎంపీ వైద్యం చేస్తూ.. యువతులతో వ్యభిచారం) -
ఎమ్మెల్యే కొనుగోలు కేసులో వాడీ వేడీగా సాగిన వాదనలు
-
చిన్నప్పుడే తల్లిదండ్రులు మృతి.. మేనత్త కుమారుడితో వివాహం చేస్తే..
కర్నూలు: స్థానిక బాపూజీ నగర్లో నివాసముంటున్న గోపీకృష్ణ భార్య భారతి(28) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు పట్టణానికి చెందిన భారతి చిన్నప్పుడే తల్లిదండ్రులు వెంగయ్య, రజితమ్మ మృతిచెందడంతో సోదరి సుశీల వద్ద పెరిగింది. 2013 నవంబర్‌లో మేనత్త కుమారుడు కర్నూలుకు చెందిన గోపీకృష్ణకు ఇచ్చి పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు. గోపీకృష్ణ గాంధీనగర్ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా, భారతి సి.బెళగల్ మండలం ఇనగండ్ల ప్రాథమిక పాఠశాలలో ఎస్జీ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. చదవండి: (మూడేళ్లు సహజీవనం.. ఇపుడు దూరంగా ఉంటోందని) వివాహమై ఎనిమిదేళ్లైనా సంతానం కలగకపోవడంతో భర్త తరచూ గొడవ పడి శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఇదే విషయమై రెండు రోజుల క్రితం సోదరికి చెప్పుకుని విలపించింది. ఈక్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. గమనించిన భర్త ఇతరుల సాయంతో కిందికి దించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త వేధింపుల కారణంగానే భారతి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటవ పట్టణ సీఐ కళావెంకటరమణ తెలిపారు. చదవండి: (Hyderabad: మసాజ్ సెంటర్ పేరుతో చీకటి బాగోతాలు) -
అత్తారింటికి వెళ్లి.. భార్య, బామ్మర్దిపై కత్తితో దాడి
సాక్షి, ఉక్కునగరం(గాజువాక): కుటుంబ సమస్యల నేపథ్యంలో భార్య, బామ్మర్దిలపై కత్తితో దాడి చేసి గాయపర్చిన సంఘటన వడ్లపూడి రైల్వే క్వార్టర్స్ చోటుచేసుకుంది. స్టీల్‌ప్లాంట్ పోలీసులు అందించిన వివరాలివి.. గాజువాకలోని సుందరయ్య కాలనీకి చెందిన భాస్కర్ (33) వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. అతనికి రైల్వే కార్టర్స్‌కు చెందిన భారతి (31)తో గతంలో వివాహం జరిగింది. భార్యతో మనస్పర్థల వల్ల రెండేళ్ల నుంచి గొడవలు పడుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఒక కేసు కోర్టులో నడుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఆదివారం రాత్రి భాస్కర్ రైల్వే క్వార్టర్స్‌లోని అత్తారింటికి వెళ్లి తలుపు కొట్టాడు. తలుపు తీసిన బామ్మర్ది గోపాలకృష్ణ పొట్టలో కత్తితో పొడిచాడు. ఈలోగా అక్కడికి వచ్చిన భార్య భారతి మెడపై, కడుపులో, ఎడమ చేతిపై దాడి చేశాడు. దీంతో ఆ ప్రాంతమంతా రక్తపు మరకలతో నిండిపోయింది. స్థానికులు వచ్చి అతడిని అడ్డుకున్నారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం మొదట గాజువాక ప్రైవేటు ఆసుపత్రికి, ఆ తర్వాత నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అతను గాజువాక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు స్టీల్‌ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధి కావడంతో స్టీల్‌ప్లాంట్ పోలీసులకు సమాచారం అందించారు. స్టీల్‌ప్లాంట్ సీఐ సత్యనారాయణరెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబంలో విషాదం) -
అమ్మాయివి నీకెందుకమ్మా? నన్ను చూసి నవ్వుకున్నారు..
లైన్ ఉమెన్ నియామకాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటికే రాతపరీక్ష సహా స్తంభాలు ఎక్కే పరీక్షల్లో (పోల్ క్లైంబింగ్ టెస్టు) విజయం సాధించి అన్ని విధాలుగా సమర్థతను నిరూపించుకున్నప్పటికీ..వారికి ఇప్పటికీ పోస్టింగ్ దక్కలేదు. ఒక వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలకమైన పోలీసు, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవి వంటి రక్షణ రంగాల్లో పెద్దపీట వేస్తూ మహిళాభ్యున్నతికి పాటుపడుతుంటే..మరో వైపు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)మాత్రం ఇప్పటికీ మహిళల పట్ల వివక్షతను ప్రదర్శిస్తూనే ఉందని పలువురు విమర్శిస్తున్నారు. అధికారుల తీరు వల్ల లైన్‌ఉమెన్‌గా ఇప్పటికే అన్ని అర్హతలు సాధించిన వాంకుడోతు భారతి, బి.శిరీషలకు ఏడాది కాలంగా నిరీక్షణ తప్పలేదు. సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 2019 సెప్టెంబర్ 28న 2500 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిస్కం చట్టం ప్రకారం దరఖాస్తు ఫాంలో మహిళలకు ఆప్షన్ ఇవ్వలేదు. అయితే అప్పటికే ఐటీఐ ఎలక్ట్రికల్ కోర్సు పూర్తి చేసిన మహబూబ్‌బాద్‌కు చెందిన భారతి, సిద్ధిపేటకు చెందిన శిరీష సహా మరో 30 మంది మహిళలు తమ భవితవ్యంపై ఆందోళన చెందారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు ఆదేశాల మేరకు 34 మంది ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. పురుష అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించినప్పటికీ.. మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించకపోవడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో 2019 డిసెంబర్ 15 వీరికి రాత పరీక్ష నిర్వహించారు. ఈ రాత పరీక్షలో ఇద్దరు మాత్రమే (భారతి, శిరీష)అర్హత సాధించారు. అప్పటికే పురుష అభ్యర్థులకు పోల్ క్లైంబింగ్ టెస్టు నిర్వహించి.. మహిళా అభ్యర్థులకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో వారు మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు 2020 డిసెంబర్ 23న వీరికి ఎర్రగడ్డలోని సెంట్రల్ పవర్ ఇనిస్టిట్యూట్‌లో పోల్ క్లైంబింగ్ పరీక్ష నిర్వహించారు. వీరిద్దరూ ఎనిమిది మీటర్ల ఎత్తున్న విద్యుత్ స్తంభాన్ని ఈజీగా ఎక్కి, పురుషులకు తామేమాత్రం తీసిపోబోమని నిరూపించారు. అంతేకాదు సంస్థలో లైన్ ఉమెన్ ఉద్యోగానికి అర్హత సాధించిన తొలి మహిళలుగా చరిత్ర సృష్టించారు. అయితే వీరికి ఇంకా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వక పోవడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులోని తొమ్మిదో నెంబర్ సింగిల్ బెంచి వద్ద పెండింగ్‌లో ఉండిపోవడంతో వారికి నిరీక్షణ తప్పలేదు. అయితే డిస్కం మాత్రం కోర్టు ఆదేశాలు వచి్చన తర్వాతే ఆర్డర్స్ ఇస్తామని చెబుతోంది. ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి? మాది సిద్ధిపేట జిల్లా మర్కుకు మండలం గణేష్‌పల్లి గ్రామం. మా అమ్మానాన్నలు వ్యవసాయ కూలీలే. 2015లో అల్వాల్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఎల్రక్టీషియన్ ట్రేడ్‌లో చేరాను. అప్పటికే కాలేజీ ప్రిన్సిపాల్ అభ్యంతరం కూడా చెప్పారు. అమ్మాయివి ఈ కోర్సు ఎందుకమ్మా...? మరేదైనా కోర్సు తీసుకోవచ్చు కదా! అని సూచించారు. కానీ నేను వినలేదు. పట్టుబట్టి అదే కోర్సులో చేరి పాసయ్యాను. 2019లో జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు చేసేందుకు వెళ్లితే అందు లో ఫీమేల్ ఆఫ్షన్ లేకపోవడం ఆందోళన కలిగింది. కొంత మంది యువతులం కలిసి హైకోర్టును ఆశ్రయించాం. కోర్టు అనుమతి ఇవ్వడంతో రాతపరీక్ష సహా పోల్ క్లైంబింగ్ కూడా పూర్తి చేశాం. అయినా మాకు ఉద్యోగం రాలేదు. ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూడాలో?. – బి.శిరీష, సిద్ధిపేట వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి మాది జనగాం జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామ సపీమంలోని సుకారిగడ్డ తండా. అమ్మానాన్నలు వ్యవసాయం చేస్తారు. టెన్త్ వరకు అక్కడే చదువుకున్నా. ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతో 2015లో ఇల్లందు ఐటీఐ కాలేజీలో ఎలక్ట్రికల్ కోర్సులో చేరాను. నాన్ లోకల్ కేటగిరిలో డిస్కంకు దరఖాస్తు చేశాను. రాత పరీక్ష కోసం వరంగల్‌లోని ఓ కేంద్రంలో శిక్షణ తీసుకున్నా. 90 మంది పురుష అభ్యర్థుల మధ్య నేను ఒక్కతినే. వారంతా నన్ను చూసి నవ్వుకున్నారు. అయినా నిరుత్సాహ పడలేదు. చివరకు కోర్టు ఆదేశాలతో రాత పరీక్ష, స్తంభం ఎక్కడం వంటి పరీక్షల్లోనూ నెగ్గాను. ఇప్పటికే మూడేళ్లైంది. అయినా ఎదురు చూపులు తప్పడం లేదు. వెంటనే పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చి మాకు న్యాయం చేయాలి. – వాంకుడోతు భారతి, జనగాం జిల్లా -
హృదయం ముక్కలైంది.. సోనూసూద్ ఎమోషనల్
సోనూసూద్.. కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న ఎంతోమందికి అండగా నిలుస్తున్న మహానుభావుడు. నిస్వార్థంగా పేదవారి కోసం తన శక్తినంతధారపోసి అవిశ్రాంతంగా కృషిచేస్తున్నాడు.. తాజాగా ఈ నటుడు భావోద్వేగానికి లోనయ్యాడు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన భారతి అనే కరోనా సోకిన విషయం తెలిసిందే. మహమ్మారి కారణంగా ఆమె ఊపిరితిత్తులు 80-నుంచి 90 శాతం వరకు పాడయ్యాయి. ఈ నేపథ్యంలో వైరస్ బాధితురాలిని చికిత్స నిమిత్తం నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌లో తరలించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దృరదృష్టవశాత్తు ఆమె తుదిశ్వాస విడిచింది. ప్రాణాలు కోల్పోవడంతో సోనూసూద్ కంటతడి పెట్టుకున్నాడు. తీవ్ర ఆవేదనకు లోనైన సోనూసూద్ ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. @కరోనాతో బాధపడుతున్న భారతి అనే యువతిని ఇటీవల నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌లో తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. అయితే చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం రాత్రి ప్రాణాలు విడిచింది. నెల రోజులపాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేసింది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. నేను ఆమెను బతికించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. నా హృదయం ముక్కలైంది’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. చదవండి: Sonu Sood: ప్రాణం పోసిన సోనూసూద్ ట్రస్ట్ -
బుట్ట నిండింది
రహదారికి ఇరువైపులా ఉండే చింతచెట్లు అవి. ఎంతగా చల్లదనాన్ని ఇస్తున్నా, ఆ రోడ్డుపై ఉరుకులు పరుగులతో ప్రయాణించే ఎవరూ వాటికేసి చూడరు. వేసవి వచ్చిందనగానే కొందరు మహిళలు మహిళలు ఆ చెట్లకేసి చూస్తుంటారు. చెట్లు చిగురేస్తే చాలు.. వారి గుండెల్లో ఆశలు మోసులెత్తుతాయి. తెలతెలవారుతూనే చింతచెట్టు ఎక్కుతారు. చిగురుకోసం చిటారుకొమ్మకైనా వెళతారు. బుట్టనిండితే వారి కళ్లు ఆనందంతో మెరుస్తాయి. అవసరమైతే రెండు మూడేసి చెట్లు లంఘించేందుకు ఏమాత్రం వెనుదీయరు. ఎందుకంటే కొన్ని నెలలపాటు ఆ చిగురే వారికి జీవన వనరు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పెదరావూరు గ్రామానికి చెందిన చీరాల నాగేంద్రం, మోరబోయిన భారతిలకు ఇదే ఉపాధి. ఏడాది పొడవునా వరినాట్లు, కలుపు తీయటం సహా పొలం పనులు చేస్తుండే వీరు, చిగుర్ల కాలంలో చింతచెట్లపై ఆధారపడతారు. చెట్లు చిగురించటం ఆరంభించిన దగ్గర్నుంచి కాపు దిగేవరకు చింత చిగురు కోతలో ఉంటారు. ప్రతిరోజూ కనీసం మూడుగంటలపాటు ఆ కొమ్మా ఈ కొమ్మా తిరుగుతూ చిగురు కోసుకుంటారు. ‘ఒక్కోసారి ఒక్క చెట్టుకే బుట్ట సరిపడా వత్తాది... లేకుంటే రెండు మూడేసి చెట్లు ఎక్కాల్సిందే’ నని నాగేంద్రం చెప్పింది. బుట్టనిండా చింతచిగురుతో తెనాలికి బయలుదేరి వెళతారు. గిరాకీ ఉన్నరోజు రూ.300 లేకుంటే కనీసం రూ.200 గిట్టుబాటవుతుంది. ఆ డబ్బయినా వస్తుందనే ఆశతోనే వీరు ప్రాణాలను లెక్కజేయకుండా భారీ చింతచెట్లను అవలీలగా ఎక్కేస్తుంటారు. ప్రమాదం కదా? అంటే.. ‘చిన్నప్పట్నుంచీ ఎక్కుతూనే ఉన్నాం... ఏం కాదు’ అని తేలిగ్గా కొట్టేశారు. నాగేంద్రంకు కొడుకు, భారతికి కుమార్తె, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాయకష్టంతోనే తమ కడుపులు నిండేవని, చింత చిగురు మరికొంత ఆధరువుగా ఉంటోందని చెప్పారు. ఏదేమైనా చిటారు కొమ్మల్లోంచి అటూ ఇటూ తిరుగుతూ చిగురు కోసం వారు పడుతున్న కష్టాన్ని చూసి, రోడ్డు వెంట వెళ్లేవారు ‘అమ్మో.!’ అనుకోకుండా ఉండలేరు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
ఎన్ని సార్లు చెప్పినా మారరా?
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీలో పారిశుధ్య పనుల నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎన్ని సార్లు చెప్పినా మార్పు రావడం లేదని అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. అనంతరం 18వ వార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. జగన్నాథాలయం వెనుక గల చెత్త కుప్పలు, పాత కూరగాయల మార్కెట్ వద్ద కుక్క కళేబరాన్ని చూసి ఇదేమిటని కమిషనర్ బాపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఈ నెల 1 నుంచి 8 వరకు ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలను నిర్వహిస్తుంటే, చెన్నూరు మున్సిపాలిటీలో పారిశుధ్య పనులు కానరావడం లేదన్నారు. పారిశుధ్య పనుల నిర్వహణపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. ఈ నెల 20 నుంచి ఆరో విడత హరితహారం పారంçభం కానుందని, నర్సరీలో పెంచుతున్న మొక్కలు నాటేందుకు పనికి రావని తెలిపారు. కాలనీల్లో ఖాళీ స్థలం ఉన్న చోట మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కమిషనరే కాకుండా వార్డుల్లో పర్యటించి పారిశుధ్య లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత కౌన్సిలర్ల పై ఉందన్నారు. వార్డుల్లో ప్రత్యేక పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలన్నారు. మళ్లీ వచ్చే సరికి మార్పు రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ బాపు, వైస్ చైర్మన్ నవాజోద్దిన్, కౌన్సిలర్లు శాంతారాణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భీమారం మండలంలో.. భీమారం(చెన్నూర్): మండలంలోని కాజిపల్లి, భీమారం గ్రామాల్లో జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరీ బుధవారం ఆకస్మికం తనిఖీలు నిర్వహించారు. భీమారం బస్టాండ్ ప్రాంతంలో పర్యటించారు. రోడ్డుకి పక్కనే పండ్ల దుకాణాలు నిర్వహించడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొబ్బరిబోండాలను తాగిన తర్వాత అక్కడే పడేయడం ద్వారా అందులో నీళ్లు నిల్వ ఉండి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. వెంటనే వాటిని తొలగించాలని మరోసారి అపరిశుభ్రంగా ఉంటే జరిమానా వేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. రోడ్డు పక్కనే షాపులు నిర్వహంచరాదని కొంత లోపలికి పెట్టుకోవాలని వ్యాపారులను కలెక్టర్ ఆదేశించారు. కాజిపల్లి గ్రామంలో పలువీధుల్లో నడుచుకుంటూ వెళ్లారు. ఎక్కడ చూసినా పరిశుభ్రత కానరాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు సభ్యుడికి చెందిన టెంట్ హౌస్ సామగ్రి ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై ఉండటం చూసి వార్డు సభ్యున్ని మందలించారు. ఒక ప్రజాప్రతినిధి అయుండి స్వచ్ఛకాజిపల్లికి సహకరించనందుకు రూ.1000, మరొకరికి రూ500 జరిమానా విధించాలని కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ విజయానందం, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో శ్రీపతిబాపు, సర్పంచ్‌లు గద్దె రాంరెడ్డి, తిరుపతి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. దక్కన్ గ్రామీణ బ్యాంక్‌ను సందర్శించిన కలెక్టర్ చెన్నూర్: పట్టణ పర్యటనలో భాగంగా స్థానిక దక్కన్ గ్రామీణ బ్యాంక్‌ను కలెక్టర్ భారతి హోళి కేరి సందర్శించారు. బ్యాంక్‌లో రైతులు కిక్కిరిసి ఉండటం చూసి ఇదేంటని ప్రశ్నించారు. లాక్‌డౌ న్ నిబంధనలకు విరుద్ధంగా మాస్కులు ధరించట్లేదని, భౌతికదూరం పాటించడంలేదని ఆధికా రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కనీసం నిబంధనలు పాటించకుంటే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. రైతులు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించే విధంగా బ్యాంకు వద్ద కానిస్టేబుల్‌ను ఉంచాలని ఎస్సై విక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. -
భూమి బిడ్డ
ఈ ఫొటోలో గేదె పాలు పితుకుతున్న యువతి.. ఆ ఫొటోలో ట్రాక్టర్ ఎక్కి పొలం దున్న అమ్మాయి.. కుడిపక్క ఫొటోలో ఎయిర్ హోస్టెస్ ఐడి కార్డు ధరించి ఉన్నదీ... ఒక్కరే. అదే అమ్మాయి మరో ఫొటోలో భర్త, కొడుకుతోపాటు పొలంలో పని చేస్తోంది. ఇంకో ఫొటోలో గుర్రం సవారీకి సిద్ధమవుతోంది. ఆమే.. భారతి ఖుటి. ఆమె గురించి గుజరాత్ రాష్ట్రంతోపాటు, దేశమంతా ఎందుకు మాట్లాడుకుంటోందనే విషయాన్ని ఈ ఫొటోలే చెప్తున్నాయి. భారతిది గుజరాత్ రాష్ట్రం, పోర్బందర్ జిల్లాలోని బేరాన్ గ్రామం. ఆమె 2010లో రామ్‌దేని పెళ్లి చేసుకుని లండన్‌కు ప్రయాణమైంది. రామ్‌దే అప్పటికే అక్కడ మేనేజిరియల్ ఎగ్జిక్యూటివ్‌గా మంచి ఉద్యోగంలో ఉన్నాడు. భారతి అక్కడికి వెళ్లి ట్రావెల్ అండ్ టూరిజమ్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సు చేసింది. బ్రిటిష్ ఎయిర్వేస్లో ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగంలో చేరింది. ఈస్ట్ లండన్‌లోని స్టాట్ఫోర్డ్లో నివాసం. 2014లో కొడుకు ‘ఓమ్’ పుట్టాడు. సంతోషంగా సాగిపోతోంది జీవితం. ఆ సమయంలో సొంతూరులో ఉన్న భారతి అత్తమామల ఆరోగ్యం ఆందోళనకు గురి చేసింది. రామ్‌దే, భారతి ఇద్దరూ పెద్దవాళ్లకు మంచి వైద్యం చేయించి స్వస్థత చేకూరే వరకు అంటిపెట్టుకుని ఉండి, తిరిగి యూకే వెళ్లారు. అయితే ఈ వయసులో అమ్మానాన్నలను ఇండియాలో ఉంచి తాము యూకేలో స్థిరపడడం కష్టంగా తోచింది రామ్దేకి. అదే విషయాన్ని భార్యతో చెప్పాడు. అందుకామె సరేనంది. అలా ఐదేళ్ల కిందట బేరాన్కి తిరిగి వచ్చేశారు. విమానం దిగి.. ట్రాక్టర్ ఎక్కింది మొత్తం రెండు వందల కుటుంబాలు నివసించే గ్రామం బేరాన్. దాదాపుగా అందరూ వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ వృత్తుల మీదనే జీవిస్తున్నారు. పంట పొలాలన్నీ రసాయనాలతో కలుషితమై ఉన్నాయి. దాదాపుగా ఓ నలభై ఏళ్ల కిందట... హరిత విప్లవంలో భాగంగా ఇన్సెంటివ్ మెన్యూర్ స్కీమ్‌ను పరిచయం చేసింది ప్రభుత్వం. అందుబాటులో ఉన్న సాగునేల దేశం మొత్తానికి కడుపు నింపేటంతటి ఆహారధాన్యాలను పండించడం కోసం చేసిన ప్రయత్నం అది. రసాయనిక ఎరువుల వాడకాన్ని రైతులకు పనిగట్టుకుని నేర్పించింది కూడా ప్రభుత్వమే. ఆ ప్రయత్నం విజయవంతమైంది. మన దేశం ఆహారభద్రత సాధించగలిగింది. కానీ పంట నేలలను నిస్సారం చేసుకుంది. ఇప్పుడు మరో విప్లవం రావాలి. అదే ఆర్గానిక్ రివల్యూషన్. ఈ వినూత్న విప్లవాన్ని తమ గ్రామంలో తొలి అడుగు వేయించింది భారతి. పంటకు తోడు పాడి ఏడు ఎకరాల భూమిలో వేరుశనగ, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, జొన్నలు పండిస్తోంది. రసాయన ఎరువుల ప్రస్తావనే లేకుండా పూర్తిగా సేంద్రియ ఎరువులుతో వ్యవసాయం చేస్తున్నారు ఈ దంపతులు. వ్యవసాయానికి అనుబంధంగా గేదెలతో డైరీ ఫార్మ్ కూడా పెట్టి పాడికి –పంటకు మధ్య ఉన్న పరస్పర ఆధారిత బంధాన్ని రుజువు చేస్తున్నారు. తన డైలీ రొటీన్‌ను స్వయంగా షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి, వ్యవసాయంలో సంపాదన యూకేలో ఉద్యోగంలో మిగిలే డబ్బుకంటే ఎక్కువగానే ఉంటోందని చెబుతోంది భారతి. ఈ దంపతులు ఇప్పుడు ఆ గ్రామస్థులకు రోల్ మోడల్స్. వీళ్ల గురించి తెలిసిన వాళ్లు ‘వీళ్లు బేరాన్ గ్రామానికి మాత్రమే కాదు మొత్తం దేశానికంతటికీ రోల్ మోడల్స్’ అని ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నారు. –మంజీర నేల మీద సాము అది 2015. లండన్‌లో ఉంటున్న రామ్‌దే నిర్ణయాన్ని సొంతూరిలో ఉన్న బంధువులందరూ వ్యతిరేకించారు. అప్పుడు రామ్దేకు అండగా నిలిచింది అతడి భార్య భారతి మాత్రమే. భారతి ఇచ్చిన భరోసాతో ఇండియా వచ్చేశాడు రామ్‌దే. ఇప్పుడు గుజరాత్‌లోని రామ్‌దే సొంతూరు బేరాన్ గ్రామస్థులతోపాటు ఆ రోజు నవ్విన బంధువులు కూడా భారతి ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్నుతుంటే కళ్లారా చూస్తున్నారు. ఆ దృశ్యాన్ని వీడియోలు తీసి యూ ట్యూబ్‌లో పెడుతున్నారు. యువత కంప్యూటర్, సాఫ్ట్వేర్ అంటూ ఖండాలు దాటిపోతుంటే... భారతి వాటిని వదిలేసి మన నేలను మించిన ఉపాధి హామీ మరెక్కడా ఉండదని నిరూపిస్తోందని ఆమె వీడియోలు చూసిన వాళ్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ తరం నేల విడిచి సాము చేస్తుంటే భారతి నేల మీద సాము చేస్తోంది. అదే ఆమె సక్సెస్ అని మరికొందరు మెచ్చుకుంటున్నారు. లండన్‌లో మంచి ఉద్యోగం, అక్కడే స్థిరపడే అవకాశాన్ని వదులుకుని జన్మభూమికి వచ్చి పొలం దున్నుతున్న ధీర అని ఆమెకు ట్యాగ్‌లైన్ ఇస్తున్నారు. -
మనువు కుదిరింది.. తనువు చాలించింది
శ్రీకాకుళం, కవిటి: చదువుకుంటానని చెప్పినా వినకుండా పెళ్లి నిశ్చయించారని మనస్థాపం చెందిన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి కవిటి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బసవకొత్తూరుకు చెందిన బసవ రామయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె బసవ భారతి(19) డిగ్రీ సెకెండియర్ చదువుతోంది. భారతికి పెళ్లి చేయాలని ఇంట్లో పెద్దలు మంచి సంబంధం చూసి వివాహ నిశ్చయం చేసుకున్నారు. అయితే తాను డిగ్రీ పూర్తి చేసేవరకు పెళ్లి చేసుకోనని, వివాహ ప్రయత్నాన్ని విరమించుకోవాలని భారతి పెద్దలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. రెండో కుమార్తెకు మంచి సంబంధం రావడం.. పెద్దకుమార్తెకు పెళ్లిచేయకుండా చిన్నమ్మాయికి వివాహం చేయకూడదన్న స్థానిక కట్టుబాట్లను గౌరవించేందుకే భారతికి పెళ్లి సంబంధాన్ని మాత్రమే నిశ్చయం చేశారు. డిగ్రీ పూర్తయిన తర్వాతే పెళ్లి చేద్దామనే ఆలోచనతో సంబంధం కుదుర్చుకున్నారు. కానీ భారతి పెద్దల నిర్ణయాన్ని అర్ధంచేసుకోలేక క్షణికావేశంలో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుంది. ఇంటికి వచ్చిన సోదరి వేలాడుతున్న అక్కను చూసి కేకలుపెట్టి ఇరుగుపొరుగువారికి సమాచారం అందించింది. వెంటనే వారు వచ్చి కొనఊపిరితో ఉన్న భారతిని సోంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే భారతి మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కవిటి ఎస్ఐ కె.వాసునారాయణ తెలిపారు. శవపంచనామా నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహం అప్పగించారు. -
సినిమా బాగాలేదనేవాళ్లకు డబ్బులు వెనక్కి ఇస్తాను
‘‘మనిషి చనిపోయాక చాలా ప్రేమను చూపెడతారు. కానీ, బతికున్నప్పుడే ఆ ప్రేమని పంచుకుంటే జీవితం బాగుంటుందని మా ‘నీ కోసం’లో చెప్పే ప్రయత్నం చేశాం’’ అన్నారు అవినాష్ కోకటి. అరవింద్ రెడ్డి, అజిత్ రాధారామ్, సుభాంగి పంత్, దీక్షితా పార్వతి హీరో హీరోయిన్లుగా అవినాష్ కోకటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీకోసం’. రాజలింగం సమర్పణలో అల్లూరమ్మ (భారతి) నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. అవినాష్ కోకటి మాట్లాడుతూ– ‘‘మా సినిమాలోని ప్రేమ కథలు చాలాకాలం ప్రేక్షకులతో ప్రయాణం చేస్తాయి. మరచిపోయిన లేదా వదిలేసిన బంధాలన్నీ గుర్తొస్తాయి’’ అన్నారు. ‘‘నీకోసం’ ఎందుకు చూడాలి? అనేవారికి నేనిచ్చే భరోసా ఒక్కటే. మా సినిమా ఆడుతున్న థియేటర్స్ కౌంటర్ వద్ద నా మొబైల్ నంబర్ ఇస్తాను. సినిమా బాగాలేదనేవాళ్లకు డబ్బులు వెనక్కి ఇస్తాను’’ అన్నారు అరవింద్ రెడ్డి. ‘‘యూత్‌కి కనెక్ట్ అయ్యే కథ ఇది’’అన్నారు అజిత్ రాధారామ్. ‘‘ఇది లవ్ స్టోరీ మాత్రమే కాదు.. లైఫ్ స్టోరీ కూడా’’ అన్నారు సుభాంగి పంత్. ‘‘మంచి టీమ్‌తో పని చేశానని సంతోషంగా ఉంది’’ అన్నారు దీక్షితా పార్వతి. సంగీత దర్శకుడు శ్రీనివాస్ శర్మ మాట్లాడారు. -
సాహిత్యంతో స్ఫూర్తి నింపుతున్న ‘భారతి’
బోధన్: పట్టణ కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, శరీర, అవయవదానం సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, ప్రముఖ రచయిత్రి కాట్రగడ్డ భారతి విభిన్నమైన సామాజిక అంశాలపై అక్షరాలను అస్త్రంగా మలుచుకుని కవితలు, పాటలు రాస్తూ, ప్రజల్లో చైతన్యస్ఫూర్తిని నింపే కార్యరంగాన్ని ఎంచుకుని ముందుకెళ్తున్నారు. సాహితీ రంగంలో తనదైన శైలిలో రచనలు చేస్తూ రాణిస్తున్నారు. భారతి రచనలు తెలుగు రెండు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చాయి. ముఖ్యంగా శరీర, అవయదానం ప్రాముఖ్యత అంశంపై 140 పైగా స్వీయ రచనలు (కవిత) రాసి సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ సహకారంలో ‘వెన్నెల పుష్పాలు’ కవిత సంకలనం పుస్తకాన్ని ముద్రించారు. 2016 జనవరి 3న హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి చంద్రశేఖర్, ఢిల్లీకి చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి దిలీప్‌కుమార్, సావిత్రిబాయి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధుల చేతుల మీదుగా కవిత సంకలనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. శరీర, అవయవదానం అంశంతో పాటు మాతృభాష ప్రాముఖ్యత, పరిరక్షణ, సామాజిక సమస్యలు, మహిళల సమస్యలపై అనేక కవితలు రాసి ‘కనుత కొలను’ అనే కవిత సంకలనాన్ని ముద్రించి ఆవిష్కరించారు. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, శరీర, అవయదానం సంఘం వ్యవస్థాపకురాలు గుడూరి సీతామహాలక్ష్మి ఉద్యమస్ఫూర్తితో కాట్రగడ్డ భారతి స్పందించి శరీర, అవయవదానం ఉద్యమం భుజాన వేసుకుని రచనలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె బోధన్ మండలంలోని సంగం జెడ్పీహెచ్ఎస్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలు. తెలుగు, ఇంగ్లిష్ బాషల్లో ఎంఏ పూర్తి చేశారు. మంచి వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారు. మాతృభాష తెలుగుపై అపారమైన మమకారం, ఆసక్తి ఆమెలో కనిపిస్తాయి. ఇటీవల 2019 జనవరి 3న విశాఖపట్నంలో జరిగిన సావిత్రి బాయి పూలే జయంతి వేడుకల్లో తాజాగా శరీర, అవయవదానం ప్రాముఖ్యతపై ఆమె స్వీయరచనలు నాలుగు పాటలు, 13 కవితలతో సీడీ క్యాసెట్‌ను రూపొందించి ఆవిష్కరించారు. -
వివాహిత ఆత్మహత్య
కర్నూలు, ఆదోని అర్బన్: పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన వివాహిత ఉప్పర భారతి (22) బుధవారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టింది. మృతురాలికి ఏడాది కూతురు సాయిపల్లవి ఉంది. స్థానికులు, టూ టౌన్ సీఐ భాస్కర్ అందించిన సమాచారం మేరకు.. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన ఈరమ్మ, నాగయ్య దంపతుల కూతురు ఉప్పర భారతికి నాలుగేళ్ల క్రితం క్రాంతినగర్‌కు చెందిన పెయింటర్ వీరేష్‌తో వివాహమైంది. స్థానికులు, తల్లి ఈరమ్మ తలుపులు తీయగా భారతి ఫ్యాన్‌కు వేలాడుతుండడంతో హుటాహుటిన ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. భారతి ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని టూటౌన్ సీఐ భాస్కర్ తెలిపారు. -
మమ్మల్ని పడేసి కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు!
కనీస వేతనాలతో బడి పిల్లలకు బాధ్యతగా వంట చేసి పెడుతున్న వాళ్లను కాదని, ఆ పనిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మధ్యాహ్న భోజన పథకం.. అధ్వాన్న భోజన పథకంగా మారే పరిస్థితి తలెత్తబోతోంది. ఆగస్టు 9 మధ్యాహ్నం. సమయం ఒకటీ ముప్పావు. కొటికే భారతికి ఫోన్ చేసింది సాక్షి. ఆ ఫోన్‌ను అదే స్కూల్లో ఉన్న ఒక టీచర్ తీశారు. ‘భారతి బయటకెళ్లిందని, అరగంటలో వస్తుందని’ చెప్పారామె. అన్నట్లుగానే అరగంటకు భారతి నుంచి ఫోన్ వచ్చింది. మధ్యాహ్నం స్కూల్లో పిల్లలకు భోజనం వండి, వారికి వడ్డించి, పిల్లల భోజనాలయిన తర్వాత హాస్పిటల్కెళ్లి వచ్చిందామె. అంతకు మూడు రోజుల ముందు పోలీసులు కొట్టిన దెబ్బలకు వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్ కెళ్లిందామె. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ‘మూగదెబ్బలు! తొడలు సహా ఒంటి మీద ఫలానా చోట అని చెప్పలేను. చెప్పలేని చోట్ల కూడా దెబ్బలయ్యాయి’ అన్నదామె బేలగా. ‘‘అసలేం జరిగింది?’’ అని అడిగినప్పుడు తన ఆవేదనను సాక్షితో పంచుకుంది భారతి. ‘‘మాది కర్నూలు. డ్వాక్రా మహిళను. మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు భోజనం వండుతుంటాను. కర్నూలు వన్‌టౌన్ ఎలిమెంటరీ స్కూల్లో వంట చేస్తాను. పదిహేనేళ్లుగా నాలాగ చాలామంది ఇదే పనిలో ఉన్నాం. ఇప్పుడు ఈ పనిని ప్రైవేటు వాళ్లకివ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ‘ఇన్నేళ్లుగా పని చేశాం, మాకు నెల గడవడానికి కొంత జీతమిచ్చి, పిల్లల మెనూ పెంచండి’ అని అడిగినందుకు మమ్మల్ని పడేసి కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు. మేమేం అడిగామని! మేము ప్రభుత్వాన్ని పెద్ద కోరికలేమీ కోరలేదు. ‘నెలకు ఐదువేల ఐదు వందలు వేతనం ఇవ్వండి, పిల్లల మెనూ ఇరవై రూపాయలకు పెంచండి’ అని అడిగాం. ఇప్పుడు ప్రభుత్వం మాకిస్తున్నది నెలకు వెయ్యి రూపాయలు. అది కూడా మే నెలలో స్కూళ్లకు సెలవున్న రోజుల్లో ఉండదు. ఏప్రిల్, జూన్ నెలల్లో స్కూళ్లు తెరిచేది సగం రోజులే కాబట్టి ఆ నెలల్లో ఐదు వందలే ఇచ్చారు. పిల్లల భోజనానికి ఒక్కొక్కరికి వందగ్రాముల బియ్యం ఇచ్చి, నాలుగు రూపాయల పదమూడు పైసలిస్తోంది. అందులోనే పప్పు, ఉప్పు, కారం, కూరగాయలు, నూనె... అన్నీ. గ్యాస్ లేదా కట్టెలు కొన్నా ఆ నాలుగు రూపాయల పదమూడు పైసల్లోనే. మా స్కూల్లో 70 మంది పిల్లలున్నారు. ఏ రోజుకారోజు లెక్కవేస్తారు, ఆ రోజు ఎంతమంది హాజరైతే అంతమందికే లెక్క వేసి డబ్బిస్తారు. వారానికి రెండు గ్యాస్ సిలిండర్లు ఖర్చవుతాయి. నెలకు ఎనిమిది సిలిండర్లు కావాలి. సబ్సిడీలో సిలిండర్లు ఇప్పించినా కొంత వెసులుబాటు ఉంటుంది. గ్యాస్ ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వస్తోంది. ధరలు ఒకరోజు ఉన్నట్లు మరో రోజు ఉండవు. నెలాఖరులో ఖర్చు లెక్క చూసుకుంటే మాకు మిగిలేది ఏమీ ఉండడం లేదు. మా వేతనం వెయ్యి రూపాయలు కూడా నికరంగా మిగిలే పరిస్థితి ఉండడం లేదు. గుడ్లు ఉడికేదెలా? వారానికి మూడు గుడ్లు పెట్టాలని ఒక విద్యార్థికి ఆరు రూపాయల పద్దెనిమిది పైసలిస్తామన్నారోసారి. గ్యాస్ సిలిండర్ సబ్సిడీలో ఇస్తే తప్ప గుడ్లు ఉడికించలేమని చెప్పాం. డబ్బులు పెంచకుండా గుడ్లు పంపిస్తున్నారు, కాదనకుండా వాటిని ఉడికించి పెడుతున్నాం. బ్లాక్‌లో సిలిండర్ కొని ఉడికించాలంటే మా చేతి డబ్బే పడుతోంది. ఇవన్నీ చెప్పుకోవడానికే విజయవాడకు వెళ్లాం. ఆ రోజు ఆగస్టు 6 ఊరూరు నుంచి మధ్యాహ్న భోజన పథకంలో వంట చేస్తున్న వాళ్లం కదిలాం. అందరం విజయవాడ చేరి ఉంటే ఉప్పెన ఉబికి వచ్చినట్లే ఉండేది. ఎక్కడి వాళ్లనక్కడ గ్రామాల్లో, మండలాల్లో బస్‌స్టాపుల్లో నిఘా వేసి మరీ... అరెస్టు చేశారు. మాలాంటి కొందరం మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా, పోలీసుల కంట పడకుండా విజయవాడ చేరుకోగలిగాం. తీరా అక్కడికి వెళ్లాక ఒక్కొక్కరినీ తరుముతూ, ఈడ్చుకుంటూ వెళ్లారు పోలీసులు. మా బట్టలూడిపోతున్నా సరే... అలాగే పట్టి వ్యాన్లలో పడేశారు. సిటీ నుంచి 30– 40 కిలోమీటర్ల దూరాన వదిలారు. మేమెక్కడున్నామో తెలియదు. ఎవర్ని అడగాలన్నా మనుషులే కనిపించడం లేదు. రోడ్డు మీదకెళ్లి వచ్చిన బస్సుల్ని ఆపి, ఎటు వైపు వెళ్తుందో అడిగి ఎక్కాం. బస్సు దిగిన తర్వాత ఆటోల్లో రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాం. అక్కడ రాత్రి ఎనిమిదిన్నరకు రైలెక్కి తెల్లవారి కర్నూలు చేరుకున్నాం. గాయం మానేది కాదు ఆ రోజు ఎంతటి దుర్దినమో మాటల్లో చెప్పలేం. కళ్లు తెరిచినా, కళ్లు మూసుకున్నా అవే సంఘటనలు గుర్తుకువస్తున్నాయి. ఎక్కడ బస్సెక్కామో, ఎక్కడ రైలెక్కామో... అంతా అయోమయంగా ఉంది. మాకు తగిలిన గాయాలు చిన్నవి కాదు. ఒంటికైన గాయాలు వారానికో నెలకో తగ్గుతాయి. కానీ మనసుకైన గాయాలు ఎప్పటికీ మానేవి కాదు. మేమేం తప్పు చేశామని అంత దారుణంగా వ్యవహరించిందీ ప్రభుత్వం! ఉగ్రవాదులమా, తీవ్రవాదులమా, నేరగాళ్లమా, దొంగతనాలు– దోపిడీలు చేసినోళ్లమా? మా పిల్లలకు వండి పెట్టుకున్నట్లే బడి పిల్లలకు అన్నం వండి పెడుతున్నాం. టీచర్లు సెలవులు పెడతారు, పిల్లలు బడికి డుమ్మా కొడతారేమో కానీ మేము ఎండనక, వాననక బడి తెరిచిన అన్ని రోజులూ పని చేశామే. మాకు చేసే న్యాయం ఇదేనా’’ అంటున్నప్పుడు భారతి గొంతు పూడుకుపోయింది. మాటలతో చెప్పలేని వేదన ఆమె గొంతులో పలికింది. నడిపిస్తున్నది మహిళలే! ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం మొదలు పెట్టినప్పుడు వంట చేయడానికి ఎవరూ ముందుకు రాని రోజులవి. అప్పట్లో రోజుకు ఒక విద్యార్థికి రూపాయి పావలా ఇచ్చేది ప్రభుత్వం. సామాజిక కార్యకర్తలు ఉద్యమించగా, మెనూ నాలుగు రూపాయల పదమూడు పైసలు చేసి, వండేవాళ్లకు వెయ్యి రూపాయలు ఇస్తోందని నిర్మల చెప్పారు. ‘నిజానికి పొదుపు సంఘాల మహిళలే ఈ పథకాన్ని నిలబెట్టారు. కొన్ని స్కూళ్లలో నీళ్లుండవు, నీళ్లు మోసుకొచ్చి వండాలి. వంటగది ఉండని చోట బయటే వండాలి. కొంతమంది పాత్రలు కూడా సొంతంగా కొనుక్కున్నారు. ప్రభుత్వం వాటికి డబ్బివ్వలేదు. వేతనం పెంచమంటే ‘పనిచేసేది మధ్యాహ్నం ఒక గంట సేపే కదా’ అంటున్నారు. వడ్డించే సమయం, తినే సమయమే కాదు కదా! పన్నెండు గంటలకు వడ్డించాలంటే ఉదయం వేరే ఏ పనులకూ వెళ్లకుండా ఈ పని కోసమే వాళ్ల సమయాన్ని కేటాయించుకోవాలి. స్కూలుకి వచ్చి వండి, భోజనం వడ్డించిన తర్వాత ఇళ్లకు పోయి ఇంటి పనులు చూసుకోవాలి. సాయంత్రమయ్యే సరికి మర్నాడు వంట కోసం కూరగాయల వంటివి సమకూర్చుకోవడానికి ఉపక్రమించాలి. దాదాపుగా రోజంతా ఇదే పనిలో ఉండక తప్పదు. కొన్ని చోట్ల ఆరు నెలలకు కూడా బిల్లులు రావడం లేదు. దుకాణాల్లో సరుకులు అరువివ్వకపోతే అప్పులు తెచ్చి వంట చేయాల్సిన పరిస్థితి. డబ్బివ్వలేదని వండడం మానేస్తే ‘ఎందుకు వండలేదు’ అని తప్పు వీళ్ల మీదనే మోపుతారు. ప్రభుత్వం కేంద్రీకృత వంటశాలల నిర్ణయంతో వీళ్లను రోడ్డున పడేయాలని చూస్తోంది. ఈ నిర్ణయం ప్రకారం జిల్లాలను క్లస్టర్లుగా విభజించి కొన్ని సంస్థలకిస్తారు. ఒక్కో వంటశాలకు మూడు నుంచి ఐదెకరాల పొలం ఇస్తారు. వంటగది కట్టి, వండి, పాతిక కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలన్నింటికీ రవాణా చేయాలి. కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేసినా, పిల్లలు ఆ భోజనాన్ని తినడం లేదన్న వాస్తవం ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినా సరే, అమలు చేసి తీరాలని చూస్తోంద’ంటూ నిర్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకేనా? ఆంధ్రప్రదేశ్ మొత్తంలో స్కూళ్లలో వంట చేస్తున్న వాళ్లు 60 వేల వరకు ఉన్నారు. ఆరవ తేదీన విజయవాడలో 1,650 మందిని అరెస్టు చేశారు. నాగమణి అనే అమ్మాయి కాలిని పట్టుకుని మెలి తిప్పేశారు. ఆమె నడవలేక పోతోంది. మహిళల మీద, పిల్లల భోజనం మీద ఉక్కుపాదం మోపే బదులు... మెనూ, వేతనం పెంచినట్లయితే పిల్లలు చక్కటి భోజనం చేస్తారు. ఈ పథకం అమలు చేస్తున్నామని జబ్బలు చరుచుకుంటూ ప్రచారం చేసుకోవడానికి పెట్టే డబ్బును పిల్లల కంచాల్లోకి మళ్లిస్తే చాలు. – పి. నిర్మల, కన్వీనర్, శ్రామిక మహిళా సంఘం, కర్నూలు జిల్లా – వాకా మంజులారెడ్డి -
తహసీల్దార్ సస్పెన్షన్
చిత్తూరు కలెక్టరేట్: వెదురుకుప్పం తహసీ ల్దార్ భారతిని విధుల నుంచి సస్పెండ్‌చేస్తూ కలెక్టర్ ప్రద్యుమ్న మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మండలంలోని ఆళ్లమడుగు గ్రామపరిధిలో 26 ఎకరాల డీకేటీ, కాలువ పోరంబోకు స్థలాన్ని ఎలాంటి రికార్డులు లేకుండానే ఆన్లైన్లో ఇతరుల పేరున నమోదు చేసి, పట్టాదారు పాసుపుస్తకాలుమంజూరు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. దీనికి కారకులైన తహసీల్దారుతో పాటు ఆర్ఐ గోపి, వీఆర్వో మురళిని కూడా సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. మండల పరిధిలోని ఆళ్లమడుగు గ్రామ లెక్కదాఖలాలో సర్వే నం.505, 507లో 26 ఎకరాల డీకేటీ, కాలువ పొరంబోకు స్థలం ఉంది. ఆ స్థలాన్ని అదే గ్రామానికి చెందిన సరోజమ్మకు సర్వే నం. 505–1లో 4.32 ఎకరాలు, లావణ్యకు 505–2లో 4.49 ఎకరాలు, పిత్రశ్రీకి 505–3లో 4.43 ఎకరాలు, నిర్మలకు 505–4 లో 4.44 ఎకరాలు, జ్యోతికి 507–5 లో 4.77 ఎకరాలు, హైమావతికి 505–7లో 4 ఎకరాల మేర ఎలాంటి రికార్డులూ లేకుండానే రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో 1బీ, అడంగళ్‌లో నమోదుచేసి, పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశారు. ఈ భూములను పొందిన రైతులు అందులో మామిడి చెట్లు సాగు చేసుకుంటున్నారు. ఇటీవల వారు ఆ భూములపై రుణం పొందేందుకు బ్యాంకర్లను ఆశ్రయించారు. దీనిపై బ్యాంకర్లు పరిశీలనలు జరపడంతో అసలు విషయం బయటపడింది. ఇంతలో గ్రామస్తులు కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ చిత్తూరు ఆర్డీఓ కోదండరామిరెడ్డిని పరిశీలన అధికారిగా నియమించారు. ఆయన ఆ భూములపై పరిశీలన చేపట్టగా ఎలాంటి రికార్డులు లేకుండానే పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయడం, ఆన్లైన్లోని 1బి, అడంగళ్‌లో నమోదు చేసినట్లు తేలింది. ఈ మేరకు కలెక్టర్ తహసీల్దారు, ఆర్ఐ, వీఆర్ఓలను సస్పెండ్ చేశారు. -
డాక్టర్ కావాలనుకుని డాన్సర్ అయ్యా..!
తమిళసినిమా: అనుకున్నవన్నీ జరగవు. జరిగేవన్నీ మన మంచికే అనుకోవాలని అంటున్నారు నృత్యదర్శకురాలు భారతి. చిన్నతనం నుంచి తాను డాక్టర్ అవ్వాలనుకుంటే.. నృత్యదర్శకురాలిగా స్థిరపడ్డానని అంటున్నారు. ఆమె సినీ పయనం ఒక డాన్సర్‌గా మొదలైంది. 17 ఏళ్లుగా ఈ రంగంలో తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ నృత్యదర్శకురాలి ఒక స్థాయికి ఎదిగారు. భారతి ప్రముఖ నృత్యదర్శకులు బృందా, కల్యాణ్, రాబర్ట్ తదితరుల వద్ద సహాయకురాలిగా పని చేశారు. దాదాపు 1000 పాటలకు డ్యాన్స్‌లో శిక్షణ మాస్టర్‌గా పనిచేశారు. డాన్సర్‌గా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుని బిగ్‌బాస్ రియాలిటీ షో ఫేం నటి ఓవియ కథానాయకిగా నటించిన ‘ఓవియ విట్టా యారు’చిత్రం ద్వారా నృత్యదర్శకురాలిగా ప్రమోట్ అయ్యారు. ఇటీవల పవిత్రన్ దర్శకత్వంలో విడుదలైన ధారవి చిత్రానికి నృత్య దర్శకురాలిగా పనిచేశారు. ప్రస్తుతం వీరదేవన్, పా.విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆరుద్ర, నటుడు తంబిరామయ్య కొడుకు కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ఉలగం విలైక్కు వరుదు వంటి పలు చిత్రాలకు నృత్య దర్శకురాలిగా ఆమె పనిచేస్తున్నారు. దర్శకుడు ఎళిల్, లింగుస్వామి, భూపతిపాండియన్, ఆర్.కన్నన్, పన్నీర్‌సెల్వం చిత్రాలకు, తెలుగులో దర్శకులు కిరణ్, భరత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రాలకు భారతి నృత్య రీతులను సమకూరుస్తున్నారు.ఏ.వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్న నేత్ర చిత్రంలో ‘వందుటాంగయ్యా.. వందుటాంగయ్యా పాటలో సంగీత దర్శకుడు శ్రీకాంత్‌దేవా, నటుడు రోబోశంకర్, ఇమాన్అన్నాచ్చిలతో కలిసి మాస్స్టెప్స్ వేసి దుమ్మరేపారట. నటనే తన వృత్తిగా.. మంచి నృత్యదర్శకురాలిగా పేరు తెచ్చుకోవడమే తన లక్ష్యం అంటున్నారు భారతి. -
ఇన్స్పైరింగ్ ఐఏఎస్‌లలో మనవాళ్లు ఇద్దరు
సాక్షి, హైదరాబాద్: బెటర్ ఇండియా వెబ్సైట్ దేశంలోని స్ఫూర్తిదాయక ఐఏఎస్ అధికారుల జాబితాను రూపొం దించింది. మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హొలికెరి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్‌లకు ఈ జాబితాలో చోటు దక్కింది. వినూత్న ఆలోచనలతో కొత్తరకమైన కార్యక్రమాలకు శ్రీకారంచుట్టి, ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని వీరిద్దరి గురించి బెటర్ ఇండియా సంస్థ పేర్కొంది. భారతి హొలికెరి గర్భిణుల ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను ప్రశంసించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యసేవలను మెరుగుపర్చారని పేర్కొంది. మెదక్ జిల్లాను వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చారు. ఇక రొనాల్డ్ రాస్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ప్రజల అభ్యున్నతికి విభిన్న కార్యక్రమాలను అమలుచేశారు. హరితహారం అమలుచేసి జిల్లాను ఉత్తమ స్థానంలో నిలిపారు. దివ్యాంగ సోలార్ సొసైటీ ఏర్పాటుచేసి దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేశారు. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి చేసేలా వినూత్న కార్యక్రమాలు అమలుచేశారు’ అని బెటర్ ఇండియా సంస్థ పేర్కొంది. -
భారతి కుటుంబానికి 25లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ నిర్వహించిన ధర్నాలో అస్వస్తతకు గురై మృతి చెందిన కార్యకర్త భారతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాను తక్షణమే చెల్లిస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆమె కుటుం బంలో అర్హులుంటే ప్రభుత్వ ఉద్యోగమిస్తామని, ఆమెకు పిల్లలు ఉంటే వారి చదువుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపై సోమవారం శాసనసభలో స్వల్ప కాల చర్చ జరుగుతున్న సమయంలో విపక్షాల కోరిక మేరకు భారతి మర ణించిన ఘటనపై సీఎం సభలో ప్రకటన చేశారు. భారతి మృతి దురదృష్టకరమని, ఆమెను వెనక్కి తీసుకురాలేమని అన్నారు. వ్యక్తిగతంగా ఎమ్మార్పీ ఎస్తో తనకు దగ్గరి సంబంధం ఉందని, చంద్ర బాబు మంత్రివర్గంలో ఉన్నప్పుడు మంత్రివర్గ ఉపకమిటీ సభ్యుడిగా ఎస్సీ వర్గీకరణకు తాను మద్దతు తెలిపానన్నారు. అలాగే టీఆర్ఎస్ అధినేతగా కూడా ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించానన్నారు. ఎస్సీ వర్గీకరణ జరపాలన్న డిమాండ్‌పై అఖిలపక్ష బృందంతో వచ్చి ప్రధాని మోదీని కలుస్తామని, అందుకు సమయం కేటా యించాల్సిందిగా కోరామని గుర్తు చేశారు. సంద ర్భాన్ని బట్టి సమయం కేటాయిస్తానని ప్రధాని హామీ ఇచ్చారని వెల్లడించారు. గతంలో సభలో చేసిన తీర్మానం మేరకు ఎస్సీ వర్గీకరణ చేయాలని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని పునరుద్ఘాటించారు. ఈ విషయం తీవ్రతను వివరిస్తూ ప్రధానికి ఒకట్రెండు రోజుల్లో లేఖ రాస్తానన్నారు. ఎస్సీ వర్గీకరణపై అన్ని రాజకీయపక్షాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు గురికావా ల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రధానిని కలసి ఈ సమస్యకు త్వరలో మంచి ముగింపు ఇద్దామని విపక్షాలకు పిలుపు నిచ్చారు. భారతి మృతిపై విచారణ.. ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌తో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించా లని ఎమ్మార్పీఎస్ ఇచ్చిన పిలుపు మేరకు కొందరు కార్యకర్తలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారని సీఎం కేసీఆర్ తెలిపారు. మధ్యా హ్నం 12.40 గంటల సమయంలో కార్యక ర్తలు కలెక్టరేట్ గేటు తోసుకుని లోపలికి పోవడానికి ప్రయత్నిం చారని, పోలీసులు అడ్డుకుని వారిని వాహనంలో తరలించేందుకు ప్రయత్నించారని అన్నారు. ఇదే సమయంలో ధర్నాలో పాల్గొన్న 40 ఏళ్ల భారతి అస్వస్తతకు గురై అక్కడే కూర్చోగా, పోలీసులు వెంటనే తమ వాహనంలో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారతి మృతిచెందారని, ఈ ఘటనకు సంబందించిన వీడియో ఫుటేజీని స్వయంగా తను వీక్షించానని సీఎం తెలిపారు. ఈ వీడియో ఫుటేజీని మీడియాకు విడుదల చేస్తున్నామని, ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరుపుతోందని చెప్పారు. భారతి మృతి చెందిన విషాద సమయంలో సభను నిర్వహించకుండా వాయిదా వేయాలని విపక్షాలు చేసిన సూచనతో ఏకీభవిస్తున్నానని అన్నారు. సీఎం విజ్ఞప్తి మేరకు స్పీకర్ మధుసూదనాచారి సభను మంగళవారానికి వాయిదా వేశారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్లండి: విపక్షాలు ఎస్సీ వర్గీకరణ జరపాలని ప్రధాని మోదీని కోరేందుకు రాష్ట్రం నుంచి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని విపక్షనేత కె.జానారెడ్డి, బీజేపీఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంఐఎం సభ్యుడు అహమ్మద్ పాషా ఖాద్రీ, సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. -
ఎస్సీ వర్గీకరణ పోరులో ఆగిన ఊపిరి
సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ చేపట్టిన చలో కలెక్టరేట్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలకు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. హుటాహుటిన ఆమెను ఉస్మానియాకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఎమ్మార్పీఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించింది. తోపులాటలో కిందపడిపోయి.. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలంటూ ఎమ్మార్పీఎస్ సోమవారం చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తొలుత ఎమ్మార్పీఎస్ నాయకులు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని అక్కడే బైఠాయించారు. లోనికి వెళ్లేందుకు యత్నించగా.. అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఈస్ట్ మారేడ్‌పల్లి గాంధీకాలనీకి చెందిన ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి(45) అస్వస్థతకు గురై కింద పడిపోయింది. వెంటనే ఎమ్మార్పీఎస్ నాయకులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ విషయం తెలియగానే ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, అధికార, విపక్ష నేతలు పెద్దఎత్తున ఉస్మానియాకు చేరుకున్నారు. ఇదీ ప్రభుత్వ హత్యే..: నాయకులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉస్మానియా వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలో నాలుగు గంటల పాటు గందరగోళం నెలకొంది. ఎమ్మార్పీఎస్ కళా మండలి జాతీయ నాయకులు ఎన్.సి.అశోక్ మాదిగ, ఆస్పత్రికి చేరుకొని తన బృందంతో భారతి పేరిట అప్పటికప్పుడు పాట కట్టి ఆలపించారు. తర్వాత ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ.. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులే అడ్డుకున్నారని, ఇది ప్రభుత్వ హత్యేనని వారు మండిపడ్డారు. ఏబీసీడీ వర్గీకరణ సాధన కోసం సీఎం కేసీఆర్ వెంటనే కేంద్రంతో చర్చించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రికి తరలివెళ్లిన నేతలు.. భారతి మృతి వార్త తెలియగానే వివిధ పార్టీల నేతలు ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, సీఎల్పీ నేత జానారెడ్డి, బీజేపీ శాసన సభాపక్ష నేత కిషన్‌రెడ్డి తదితరులు వారిలో ఉన్నారు. మరోవైపు భారతి మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంతాపం ప్రకటించారు. ఆమె ప్రాణాలకు పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. అసెంబ్లీలో ప్రకటనకు మాత్రమే పరిమితం కాకుండా వెంటనే అఖిలపక్షాన్ని, ఎమ్మార్పీఎస్ నాయకత్వాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలని హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం డిమాండ్ చేసింది. రూ.25 లక్షల నష్టపరిహారం: కడియం ‘‘గత 23 సంవత్సరాలుగా వర్గీకరణ కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ పోరాటంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి రావడం దురదృష్టకరం. భారతి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. ఏబీసీడీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తానని సీఎం హామీ ఇచ్చారు’’ పోలీసుల అత్యుత్సాహం వల్లే: జానారెడ్డి ‘‘ఎమ్మార్పీఎస్ పోరాటం ఇతర ఉద్యమాలకు ఓ కనువిప్పు. వారి పోరాట పటిమను ప్రశంసిస్తున్నాం. పోలీసుల అతి ఉత్సాహమే భారతి మరణానికి కారణం. అసెంబ్లీ నుంచి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లేలా మేమే టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం. కేంద్రంపైనా ఒత్తిడి తెస్తాం. ఆమె త్యాగం వృథా కాదు: కిషన్‌రెడ్డి ‘‘ఎస్సీ వర్గీకరణ కోసం ఓ మహిళ అసువులు బాసడం ఎంతో విచారకరం. ఆమె త్యాగం వృథా కాదు’’ అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి: మోత్కుపల్లి నర్సింహ్ములు, మాజీ ఎమ్మెల్యే ‘‘సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో వర్గీకరణ సమస్యను పరిష్కరించాలి. అఖిల పక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలి. వర్గీకరణకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోంది’’ -
మహిళా తారలతోనే...
హర్షిణి, రోజా, భారతి, మేఘనా రమి, జయ, ప్రవల్లిక ముఖ్య తారలుగా కేఆర్ ఫణిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘బటర్ ఫ్లైస్’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి జీవితా రాజశేఖర్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ అంబికా కృష్ణ క్లాప్ ఇచ్చారు. నల్లమల్లు రాధ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మహిళా ఆర్టిస్టులతోనే సినిమా తీయడం మంచి ప్రయత్నం’’ అన్నారు అంబికా కృష్ణ. ‘‘మహిళా తారలతోనే చేస్తున్న తొలి చిత్రమిది’’ అన్నారు ఫణిరాజ్. ‘‘మహిళలకు ఎదురయ్యే కష్ణనష్టాలను చూపించబోతున్నాం’’ అన్నారు రామసత్యనారాయణ. ఈ చిత్రానికి సంగీతం: ప్రత్యోదన్ స్వరకర్త. -
కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు
ధర్మవరం అర్బన్ : ధర్మవరం కొత్తపేటలోని పురపాలక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివే తమ కుమార్తె దాసరి భారతి బుధవారం నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు లక్ష్మీదేవి, ఆంజనేయులు గురువారం తెలిపారు. మూర్ఛ వ్యాధి రావడంతో మూడ్రోజుల నుంచి పాఠశాలకు పంపలేదన్నారు. బుధవారం ఆమెను ఇంట్లోనే వదిలి తాము కూలి పనులకు వెళ్లగా ఆమె కనిపించకుండా వెళ్లిపోయిందన్నారు. అంతటా వెతికినా ప్రయోజనం లేదని వాపోయారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఆచూకీ తెలిసిన వారు ధర్మవరం ఎస్ఐ సెల్: 8712925250 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. -
హైందవ ధర్మాన్ని రక్షించాలి
పుష్పగిరి స్వామీజీ శ్రీ విద్యాశంకర భారతీస్వామి కాకినాడ కల్చరల్ : హైందవ ధర్మాన్ని పరిరక్షించాలని పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీస్వామి పిలుపునిచ్చారు. కాకినాడలోని జిల్లా పురోహిత సంఘం అధ్యక్షుడు ఆకెళ్ళ మురళీకృష్ణ స్వగృహంలో స్వామీజీకి వేదమంత్ర పూర్వక పూర్ణకుంభంతో శనివారం స్వాగతం పలికారు. దేశంలో జరగుతున్న అన్యమత ప్రచారాల వల్ల హిందూమతం సంక్షోభంలో పడిందన్నారు. అన్యమత ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ధర్మ సంస్థాపన కోసం తాము దేశ పర్యటన చేస్తున్నామన్నారు. దేవాదాయశాఖలో జరుగుతున్న హైందవ విరుద్ధ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. భగవంతుని బోధనలను అనుసరిస్తే మానవ జీవితానికి సార్ధకత చేకూరుతుందన్నారు. కార్తికమాసం సందర్భంగా శ్రీ చక్రార్చన, మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలను నిర్వహించి భక్తులను అనుగ్రహిస్తున్నామన్నారు. కార్తికమాసం పుణ్యఫలం గురించి, ప్రత్యేకత గురించి భక్తులకు స్వామీజీ వివరించారు. కార్యక్రమంలో వై.పద్మనాభం, బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వాడ్రేవు సుబ్మహ్మణ్యం, ఆర్గనైజింగ్ కార్యదర్శి అజ్జరపు సత్యనారాయణ, చల్లా నిరంజ¯ŒS పాల్గొన్నారు.