శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని నీటి పారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న భారతి ఇంటిపై బుధవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. అలాగే శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదరాబాద్లోని ఆమె బంధువుల నివాసాలపై కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడి చేశారు. వారి నివాసాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
ఈ దాడుల్లో ఇప్పటి వరకు రూ. కోటి విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే బంగారం, వెండి ఆభరణాలతోపాటు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. భారతికి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడి చేశారు.