నేత్ర చిత్రంలో శ్రీకాంత్‌దేవా, రోబో శంకర్‌లతో నృత్యం చేస్తున్న భారతి
తమిళసినిమా: అనుకున్నవన్నీ జరగవు. జరిగేవన్నీ మన మంచికే అనుకోవాలని అంటున్నారు నృత్యదర్శకురాలు భారతి. చిన్నతనం నుంచి తాను డాక్టర్ అవ్వాలనుకుంటే.. నృత్యదర్శకురాలిగా స్థిరపడ్డానని అంటున్నారు. ఆమె సినీ పయనం ఒక డాన్సర్‌గా మొదలైంది. 17 ఏళ్లుగా ఈ రంగంలో తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ నృత్యదర్శకురాలి ఒక స్థాయికి ఎదిగారు. భారతి ప్రముఖ నృత్యదర్శకులు బృందా, కల్యాణ్, రాబర్ట్ తదితరుల వద్ద సహాయకురాలిగా పని చేశారు.
దాదాపు 1000 పాటలకు డ్యాన్స్‌లో శిక్షణ మాస్టర్‌గా పనిచేశారు. డాన్సర్‌గా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుని బిగ్‌బాస్ రియాలిటీ షో ఫేం నటి ఓవియ కథానాయకిగా నటించిన ‘ఓవియ విట్టా యారు’చిత్రం ద్వారా నృత్యదర్శకురాలిగా ప్రమోట్ అయ్యారు. ఇటీవల పవిత్రన్ దర్శకత్వంలో విడుదలైన ధారవి చిత్రానికి నృత్య దర్శకురాలిగా పనిచేశారు. ప్రస్తుతం వీరదేవన్, పా.విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆరుద్ర, నటుడు తంబిరామయ్య కొడుకు కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ఉలగం విలైక్కు వరుదు వంటి పలు చిత్రాలకు నృత్య దర్శకురాలిగా ఆమె పనిచేస్తున్నారు.
దర్శకుడు ఎళిల్, లింగుస్వామి, భూపతిపాండియన్, ఆర్.కన్నన్, పన్నీర్‌సెల్వం చిత్రాలకు, తెలుగులో దర్శకులు కిరణ్, భరత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రాలకు భారతి నృత్య రీతులను సమకూరుస్తున్నారు.ఏ.వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్న నేత్ర చిత్రంలో ‘వందుటాంగయ్యా.. వందుటాంగయ్యా పాటలో సంగీత దర్శకుడు శ్రీకాంత్‌దేవా, నటుడు రోబోశంకర్, ఇమాన్‌అన్నాచ్చిలతో కలిసి మాస్‌స్టెప్స్ వేసి దుమ్మరేపారట. నటనే తన వృత్తిగా.. మంచి నృత్యదర్శకురాలిగా పేరు తెచ్చుకోవడమే తన లక్ష్యం అంటున్నారు భారతి.
Comments
Please login to add a commentAdd a comment