Nethra
-
బంగారం లాంటి అవకాశం
నేత్ర గురురాజ్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. బెంగళూరుకు చెందిన ఆమెకు అరుదైన అవకాశం దక్కింది. డైరెక్టర్‌గా, రైటర్‌గా, ఆర్టిస్ట్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా... ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను నిరూపించుకోవడానికి ‘చాప్టర్ 1, ఆల్ఫా 27, అస్ట్రాలజర్స్ లక్కీ డే, జాస్మిన్ ఫ్లవర్స్’ వంటి నాలుగు షార్ట్ ఫిలింస్‌కి పని చేశారు నేత్ర. ‘జాస్మిన్ ఫ్లవర్స్’కి కథ అందించడంతో ΄ాటు ఛాయాగ్రాహకురాలిగా చేశారు. ‘చాప్టర్ 1’లో విద్యార్థినిగా నటించారు. ‘ఆల్ఫా 27’కి కెమెరా, ఎలక్ట్రికల్ డి΄ార్ట్మెంట్లో పని చేశారు. ‘అస్ట్రాలజర్స్ లక్కీ డే’కి దర్శకత్వం వహించడంతో ΄ాటు ఛాయాగ్రాహకురాలిగానూ వ్యవహరించారు. ఈ చిత్రానికి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ‘జాస్మిన్ ఫ్లవర్స్’కి పలు చలన చిత్రోత్సవాల్లో అవార్డులు దక్కాయి. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నిరూపించుకుంటున్న నేత్ర గురురాజ్ తాజాగా ఆస్కార్ అకాడమీ తరఫున గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యారు. ఈ ప్రోగ్రామ్‌కి అవకాశం దక్కడం చిన్న విషయం కాదు. ప్రపంచ దేశాల్లో సినిమా రంగానికి చెందిన ప్రతిభ గల యువ ఛాయాగ్రాహకులను ఎంపిక చేసి, రెండు నెలల పాటు అకాడమీ ఆధ్వర్యంలో నిపుణుల దగ్గర మెళకువలు నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. కొన్ని నెలల క్రితం సినిమాటోగ్రఫీలో మాస్టర్స్ చేయడానికి లాస్ ఏంజిల్స్ వెళ్లిన నేత్ర ‘జాస్మిన్ ఫ్లవర్స్’తో తన కెమెరా పనితనాన్ని చాటుకున్నారు. అదే ఆమెకు ఆస్కార్ అకాడమీ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి అవకాశం దక్కేలా చేసింది. బంగారంలాంటి ఈ అవకాశం దక్కించుకున్న నేత్రకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. -
జైల్లో నేత్ర.. నిర్మానుష్య బంగ్లాలో చోరీ
సాక్షి, బెంగళూరు: హత్య జరిగిన ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకుపోయిన సంఘటన నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గత నవంబర్ 7న రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామిరాజన్ను ఆయన రెండో భార్య, బ్యూటీషియన్ నేత్ర హారోక్యాతనహళ్లిలోని బంగ్లాలో తలపై రాడ్‌తో కొట్టి హత్య చేసింది. ఇందుకు నేత్ర ప్రియుడు, అక్క కొడుకు సహకరించారు. నేత్ర జైలుపాలవడంతో బంగళా ఖాళీగా ఉంది. ఇదే అదనుగా దొంగలు మంగళవారం రాత్రి బంగళా తలుపులు పగలగొట్టి చొరబడి విలువైన వస్తువులను చోరీ చేసారు. చదవండి: (ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..) -
భారత సెయిలర్ నేత్రకు స్వర్ణం
స్పెయిన్ వేదికగా జరిగిన గ్రాన్ కెనేరియా సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా సెయిలర్ నేత్రా కుమనన్ స్వర్ణ పతకంతో మెరిసింది. ఆరు రేసుల పాటు జరిగిన లేజర్ రేడియల్ క్లాస్ ఈవెంట్లో బరిలోకి దిగిన ఆమె 10 నెట్ పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని అందుకుంది. తొలి మూడు రేసుల్లో నేత్ర విజేతగా నిలవగా... అనంతరం జరిగిన నాలుగో రేసులో మూడో స్థానంలో, ఐదో రేసులో నాలుగో స్థానంలో నిలిచింది. బెనీటో లాంచో రజతాన్ని, మార్టినా రినో కాంస్యాన్ని సాధించారు. -
నేత్ర... కొత్త చరిత్ర
న్యూఢిల్లీ: సెయిలింగ్ క్రీడాంశంలో ఇప్పటివరకు భారత్ నుంచి తొమ్మిది మంది ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్నారు. అయితే వారందరూ పురుషులే. కానీ మహిళల విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి భారతీయ సెయిలర్‌గా తమిళనాడుకు చెందిన నేత్రా కుమనన్ బుధవారం రికార్డు సృష్టించింది. చెన్నైకి చెందిన 23 ఏళ్ల నేత్ర ఒమన్‌లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్‌లో లేజర్ రేడియల్ క్లాస్ ఈవెంట్లో పోటీపడుతోంది. బుధవారం రేసులు ముగిశాక 21 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో ఉంది. గురువారం జరిగే చివరి రోజు రేసుల తుది ఫలితాలతో సంబంధం లేకుండా నేత్రకు ఒలింపిక్స్ బెర్త్ ఖరారైంది. ‘మరో రేసు మిగిలి ఉండగానే నేత్ర కుమనన్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. గురువారం చివరి రేసు 20 పాయింట్లతో జరగనుంది. అయితే సమీప ప్రత్యర్థిపై నేత్ర 21 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో బుధవారమే ఆమెకు ఒలింపిక్స్ బెర్త్ ఖాయమైంది’ అని ఆసియా సెయిలింగ్ సమాఖ్య అధ్యక్షుడు మాలవ్ ష్రాఫ్ తెలిపారు. ఇప్పటివరకు భారత్ నుంచి సోలీ కాంట్రాక్టర్, బాసిత్ (1972 మ్యూనిక్), ధ్రువ్ భండారి (1984 లాస్ ఏంజెలిస్), కెల్లీ రావు (1988 సియోల్), ఫారూఖ్ తారాపూర్, సైరస్ కామా (1992 బార్సిలోనా), మాలవ్ ష్రాఫ్, సుమీత్ పటేల్ (2004 ఏథెన్స్), నచ్తార్ సింగ్ జోహల్ (2008 బీజింగ్) సెయిలింగ్‌లో ఒలింపిక్స్‌లో పోటీపడ్డారు. -
డాక్టర్ కావాలనుకుని డాన్సర్ అయ్యా..!
తమిళసినిమా: అనుకున్నవన్నీ జరగవు. జరిగేవన్నీ మన మంచికే అనుకోవాలని అంటున్నారు నృత్యదర్శకురాలు భారతి. చిన్నతనం నుంచి తాను డాక్టర్ అవ్వాలనుకుంటే.. నృత్యదర్శకురాలిగా స్థిరపడ్డానని అంటున్నారు. ఆమె సినీ పయనం ఒక డాన్సర్‌గా మొదలైంది. 17 ఏళ్లుగా ఈ రంగంలో తనస్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ నృత్యదర్శకురాలి ఒక స్థాయికి ఎదిగారు. భారతి ప్రముఖ నృత్యదర్శకులు బృందా, కల్యాణ్, రాబర్ట్ తదితరుల వద్ద సహాయకురాలిగా పని చేశారు. దాదాపు 1000 పాటలకు డ్యాన్స్‌లో శిక్షణ మాస్టర్‌గా పనిచేశారు. డాన్సర్‌గా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుని బిగ్‌బాస్ రియాలిటీ షో ఫేం నటి ఓవియ కథానాయకిగా నటించిన ‘ఓవియ విట్టా యారు’చిత్రం ద్వారా నృత్యదర్శకురాలిగా ప్రమోట్ అయ్యారు. ఇటీవల పవిత్రన్ దర్శకత్వంలో విడుదలైన ధారవి చిత్రానికి నృత్య దర్శకురాలిగా పనిచేశారు. ప్రస్తుతం వీరదేవన్, పా.విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆరుద్ర, నటుడు తంబిరామయ్య కొడుకు కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ఉలగం విలైక్కు వరుదు వంటి పలు చిత్రాలకు నృత్య దర్శకురాలిగా ఆమె పనిచేస్తున్నారు. దర్శకుడు ఎళిల్, లింగుస్వామి, భూపతిపాండియన్, ఆర్.కన్నన్, పన్నీర్‌సెల్వం చిత్రాలకు, తెలుగులో దర్శకులు కిరణ్, భరత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రాలకు భారతి నృత్య రీతులను సమకూరుస్తున్నారు.ఏ.వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్న నేత్ర చిత్రంలో ‘వందుటాంగయ్యా.. వందుటాంగయ్యా పాటలో సంగీత దర్శకుడు శ్రీకాంత్‌దేవా, నటుడు రోబోశంకర్, ఇమాన్అన్నాచ్చిలతో కలిసి మాస్స్టెప్స్ వేసి దుమ్మరేపారట. నటనే తన వృత్తిగా.. మంచి నృత్యదర్శకురాలిగా పేరు తెచ్చుకోవడమే తన లక్ష్యం అంటున్నారు భారతి. -
‘నేత్ర’ మూవీ స్టిల్స్