– ఆస్కార్ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి నేత్ర
నేత్ర గురురాజ్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. బెంగళూరుకు చెందిన ఆమెకు అరుదైన అవకాశం దక్కింది. డైరెక్టర్‌గా, రైటర్‌గా, ఆర్టిస్ట్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా... ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను నిరూపించుకోవడానికి ‘చాప్టర్ 1, ఆల్ఫా 27, అస్ట్రాలజర్స్ లక్కీ డే, జాస్మిన్ ఫ్లవర్స్’ వంటి నాలుగు షార్ట్ ఫిలింస్‌కి పని చేశారు నేత్ర. ‘జాస్మిన్ ఫ్లవర్స్’కి కథ అందించడంతో ΄ాటు ఛాయాగ్రాహకురాలిగా చేశారు.
‘చాప్టర్ 1’లో విద్యార్థినిగా నటించారు. ‘ఆల్ఫా 27’కి కెమెరా, ఎలక్ట్రికల్ డి΄ార్ట్‌మెంట్‌లో పని చేశారు. ‘అస్ట్రాలజర్స్ లక్కీ డే’కి దర్శకత్వం వహించడంతో ΄ాటు ఛాయాగ్రాహకురాలిగానూ వ్యవహరించారు. ఈ చిత్రానికి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ‘జాస్మిన్ ఫ్లవర్స్’కి పలు చలన చిత్రోత్సవాల్లో అవార్డులు దక్కాయి.
ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నిరూపించుకుంటున్న నేత్ర గురురాజ్ తాజాగా ఆస్కార్ అకాడమీ తరఫున గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యారు. ఈ ప్రోగ్రామ్‌కి అవకాశం దక్కడం చిన్న విషయం కాదు. ప్రపంచ దేశాల్లో సినిమా రంగానికి చెందిన ప్రతిభ గల యువ ఛాయాగ్రాహకులను ఎంపిక చేసి, రెండు నెలల పాటు అకాడమీ ఆధ్వర్యంలో నిపుణుల దగ్గర మెళకువలు నేర్చుకునే అవకాశం కల్పిస్తారు.
కొన్ని నెలల క్రితం సినిమాటోగ్రఫీలో మాస్టర్స్ చేయడానికి లాస్ ఏంజిల్స్ వెళ్లిన నేత్ర ‘జాస్మిన్ ఫ్లవర్స్’తో తన కెమెరా పనితనాన్ని చాటుకున్నారు. అదే ఆమెకు ఆస్కార్ అకాడమీ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి అవకాశం దక్కేలా చేసింది. బంగారంలాంటి ఈ అవకాశం దక్కించుకున్న నేత్రకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment