Cinematography
-
‘రస్ట్’ కేసు కొట్టివేత
శాంటా ఫే: ‘రస్ట్’ సినిమా షూటింగ్ రిహార్సల్స్ సమయంలో 2021లో అలెక్ బాల్డ్విన్(61) చేతిలోని తుపాకీ పేలి సినిమాటోగ్రాఫర్ హలియానా హట్చిన్ ప్రాణాలు కోల్పోయిన ఘటన కేసు మూడేళ్లకు అనూహ్యంగా సుఖాంతమయింది. నటుడు అలెక్ బాల్డ్‌విన్‌పై ఉన్న ‘అసంకల్పిత హత్య’ ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగానే న్యూ మెక్సికో కోర్టు జడ్జి అకస్మాత్తుగా కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. కేసులో సాక్షులను అడ్డుకుంటూ పోలీసులు, లాయర్లు వ్యవహరించిన తీరు ఆధారంగానే తీర్పు ఇచ్చినట్లు జడ్జి మేరీ మార్లో సోమర్ తెలిపారు. కోర్టు హాల్లోనే ఉన్న బాల్డ్విన్ తీర్పు విని పట్టరాని ఆనందంతో ఏడ్చేశారు. మూడు దశాబ్దాలకు పైగా మంచి నటుడిగా పేరున్న బాల్డ్విన్ కెరీర్ 2021 నాటి ఘటనతో ప్రశ్నార్థకంలో పడింది. -
బంగారం లాంటి అవకాశం
నేత్ర గురురాజ్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. బెంగళూరుకు చెందిన ఆమెకు అరుదైన అవకాశం దక్కింది. డైరెక్టర్‌గా, రైటర్‌గా, ఆర్టిస్ట్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా... ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను నిరూపించుకోవడానికి ‘చాప్టర్ 1, ఆల్ఫా 27, అస్ట్రాలజర్స్ లక్కీ డే, జాస్మిన్ ఫ్లవర్స్’ వంటి నాలుగు షార్ట్ ఫిలింస్‌కి పని చేశారు నేత్ర. ‘జాస్మిన్ ఫ్లవర్స్’కి కథ అందించడంతో ΄ాటు ఛాయాగ్రాహకురాలిగా చేశారు. ‘చాప్టర్ 1’లో విద్యార్థినిగా నటించారు. ‘ఆల్ఫా 27’కి కెమెరా, ఎలక్ట్రికల్ డి΄ార్ట్మెంట్లో పని చేశారు. ‘అస్ట్రాలజర్స్ లక్కీ డే’కి దర్శకత్వం వహించడంతో ΄ాటు ఛాయాగ్రాహకురాలిగానూ వ్యవహరించారు. ఈ చిత్రానికి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ‘జాస్మిన్ ఫ్లవర్స్’కి పలు చలన చిత్రోత్సవాల్లో అవార్డులు దక్కాయి. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నిరూపించుకుంటున్న నేత్ర గురురాజ్ తాజాగా ఆస్కార్ అకాడమీ తరఫున గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యారు. ఈ ప్రోగ్రామ్‌కి అవకాశం దక్కడం చిన్న విషయం కాదు. ప్రపంచ దేశాల్లో సినిమా రంగానికి చెందిన ప్రతిభ గల యువ ఛాయాగ్రాహకులను ఎంపిక చేసి, రెండు నెలల పాటు అకాడమీ ఆధ్వర్యంలో నిపుణుల దగ్గర మెళకువలు నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. కొన్ని నెలల క్రితం సినిమాటోగ్రఫీలో మాస్టర్స్ చేయడానికి లాస్ ఏంజిల్స్ వెళ్లిన నేత్ర ‘జాస్మిన్ ఫ్లవర్స్’తో తన కెమెరా పనితనాన్ని చాటుకున్నారు. అదే ఆమెకు ఆస్కార్ అకాడమీ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి అవకాశం దక్కేలా చేసింది. బంగారంలాంటి ఈ అవకాశం దక్కించుకున్న నేత్రకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. -
రెండో భర్తకు విడాకులిచ్చిన నటి
ప్రముఖ మలయాళ నటి మంజు పిళ్లై విడాకులు తీసుకుంది. 24 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్‌కు విడాకులిచ్చింది. ఈ విషయాన్ని వాసుదేవ్ స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. '2020వ సంవత్సరం నుంచి మంజు, నేను విడివిడిగానే జీవిస్తున్నాం. విడాకుల ప్రక్రియ పూర్తయింది. తను ఇప్పుడు నాకు భార్య కాదు. అయితే మా మధ్య స్నేహం మాత్రం కొనసాగుతుంది. తనను నా స్నేహితురాలిగానే భావిస్తాను. ప్రస్తుతం మంజు కెరీర్ గొప్ప స్థాయిలో ఉంది. క్లోజ్ ఫ్రెండ్ సక్సెస్ అవుతుంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది' అని చెప్పుకొచ్చాడు. ఇది రెండోసారి కాగా మంజు గతంలో నటుడు ముకుందన్ మీనన్‌ను పెళ్లాడింది. కానీ కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు. తర్వాత 2000వ సంవత్సరంలో మంజు.. సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్‌ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా దయ అనే కూతురు పుట్టింది. గత కొంతకాలంగా వీరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తుండగా ఇన్నాళ్లకు అవి నిజమేనని ధ్రువీకరించాడు వాసుదేవ్. కెరీర్ సాగిందిలా 1992లో నట ప్రస్థానం ఆరభించింది మంజు పిళ్లై. గోలంతర వార్త, నీ వరువోళం, ఆయుష్మాన్ భవ, నింజగల్ సంతుస్తరను, మిస్టర్ బట్లర్, రావణప్రభు, తేజ్ భాయ్ అండ్ ఫ్యామిలీ, లవ్ 24x7, ఓ మై డార్లింగ్, ద టీచర్, జయ జయ జయ జయహే తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది. తమిళంలోనూ రెండు చిత్రాలు చేసింది. వాసుదేవ్ విషయానికి వస్తే కేరళ కేఫ్ చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా ప్రయాణం మొదలుపెట్టాడు. అయాల్, మెమొరీస్, దృశ్యం, అమర్ అక్బర్ ఆంటోని, అనార్కలీ వంటి పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. తెలుగులో మిస్ ఇండియా, ఖిలాడీ, బ్రో, ద వారియర్ సినిమాలకు పని చేశాడు. చదవండి: OTT: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
టాలీవుడ్లో తీవ్ర విషాదం
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ భార్య రుహీ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వృత్తిరీత్యా ఆమె యోగా శిక్షకురాలుగా పని చేస్తున్నారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో శుక్రవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా.. ఆమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పని చేశారు. భరత్ ఠాకూర్ యోగా క్లాసుల హైదరాబాద్ విభాగానికి కూడా ఆమె సారథ్యం వహించారు. కాగా..సెంథిల్ కుమార్ జూన్ 2009లో రూహీని వివాహం చేసుకున్నారు. టాలీవుడ్లో సెంథిల్ కుమార్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలకే ఎక్కువగా పనిచేశారు. టాలీవుడ్లో సై, ఛత్రపతి, యమదొంగ, అరుంధతి, మగధీర, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. View this post on Instagram A post shared by Senthil Kumar (@dopkksenthilkumar) -
‘మెకానిక్’తో ఆ సమస్య అర్థమవుతుంది: మంత్రి కోమటిరెడ్డి
‘‘నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యను ప్రధానంగా తీసుకుని సమాజానికి సందేశం ఇచ్చేలా రూపొందిన ‘మెకానిక్’ సినిమాని ప్రజలందరూ ఆదరించాలి. ఈ మూవీ ద్వారా ఫ్లోరైడ్ సమస్య, బాధితుల బాధలు సమాజానికి అర్థమవుతాయి. ఈ చిత్రం హిట్ అవుతుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా ముని సహేకర దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్’. ఎం. నాగమునెయ్య (మున్నా) నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిలీజ్ చేశారు. ‘‘మా చిత్రంలో అన్ని వాణిజ్య అంశాలు ఉన్నాయి. మంచి సందేశాత్మక చిత్రం ఇది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్
పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలామంది సెలబ్రిటీలు ఇదే మంచి తరుణమంటూ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ప్రముఖ మలయాళ సినిమాటోగ్రాఫర్ జామన్ టి జాన్ సైతం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఇంజనీర్, నిర్మాత అన్షు ఎల్సా వర్గీస్‌ను పెళ్లాడాడు. కేరళలోని కుమరకోమ్ బీచ్‌లో వీరి పెళ్లి జరగ్గా వధూవరులిద్దరూ తెలుపు వస్త్రాల్లో ధగధగ మెరిసిపోయారు. జామన్కిది రెండో పెళ్లి ఈ పెళ్లికి ఇరు కుటుంబాలతో పాటు అతి దగ్గరి బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, తెలుగు హీరోయిన్ కృతీ శెట్టి సహా పలువురు తారలు ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. కాగా జామన్‌కు ఇది రెండో పెళ్లి. ఇతడు 2014 ఫిబ్రవరి 2న నటి అన్ అగస్టీన్‌ను పెళ్లాడాడు. 2020లో వీరు విడాకులు తీసుకున్నారు. కోలీవుడ్, మాలీవుడ్‌లో బాగా బిజీ జామన్ టి జాన్.. 2011లో వచ్చిన చప్ప కురిష్ సినిమాతో ఛాయాగ్రహకుడిగా మాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. చార్లీ, కెన్ని నింటే మొయిటీన్, తిర, కప్ప, ధ్రువనక్షత్రం.. తదితర తమిళ, మలయాళ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. బాలీవుడ్లో గోల్మాల్ అగైన్, సింబా, సర్కస్, సూర్యవంశీ సినిమాలకు సైతం పని చేశాడు. తెలుగులో సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో ఒక పాటకు కెమెరామన్‌గా వ్యవహరించాడు. అలాగే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రానికి అదనపు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. View this post on Instagram A post shared by JomonTJohn ISC (@jomontjohn) చదవండి: వీడు హీరో ఏంట్రా? అన్నారు.. రాసిపెట్టుకోండి.. రోషన్ ఎమోషనల్ స్పీచ్ -
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరంటే..?
తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను టాలీవుడ్ ఆసక్తిగా గమనిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడంతో.. కొత్త ప్రభుత్వం ఇండస్ట్రీ పట్ల ఎలా వ్యవహరిస్తుంది? ప్రభుత్వ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? సినిమాటోగ్రపీ మంత్రి ఎవరు.. అనే చర్చలు టాలీవుడ్లో మొదలయ్యాయి. నేడు మంత్రులకు శాఖలు కేటాయించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు వరుసగా రెండు సార్లు సినిమాటోగ్రఫీ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పని చేశారు. సినిమా ఈవెంట్స్‌లో రెగ్యులర్‌గా పాల్గొంటూ ఆయన చిత్రపరిశ్రమకు దగ్గరగానే ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పరిశ్రమ అభివృద్ధికి సహకరించింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇండస్ట్రీ పట్ల ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నంది అవార్డులను ఇచ్చింది. కానీ తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఆ అవార్డులు కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యాయి. కొత్త ప్రభుత్వం అయినా పెద్ద మనసు చేసుకొని ఆ అవార్డులను ఇస్తుందా లేదా అని టాలీవుడ్ పెద్దలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి తమ సమస్యలను వినిపించుకునేందుకు టాలీవుడ్ పెద్దలు రెడీ అవుతున్నారు. -
మాస్ స్టెప్స్‌తో..
కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఎస్కే ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘పోకిరీ జులాయిలు...’ అంటూ సాగే పాటను చిత్రీకరిస్తున్నారు. కంచర్ల ఉపేంద్ర, వంద మంది జూనియర్ ఆర్టిస్టులు, ఇరవై మంది డ్యాన్సర్లు పాల్గొంటుండగా ఈ మాస్ పాటను చిత్రీకరిస్తున్నారు. ఊటీలో చిత్రీకరించే మరో పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘‘హీరో కావాలన్న మా అబ్బాయి ఆసక్తిని గమనించి, ఐదు చిత్రాలు నిర్మిస్తున్నాం’’ అన్నారు కంచర్ల అచ్యుతరావు. ఈ చిత్రానికి సంగీతం: రాము అద్దంకి. -
సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
సినీ కార్మి కుల కష్టాన్ని గుర్తించాలి
సాక్షి, న్యూఢిల్లీ: సినీ కార్మికుల కష్టాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కథానాయకులు రూ.కోట్లలో పారితోషికాలు అందుకుంటున్నారని, కార్మి కుల వేతనాలు మాత్రం అంతంతగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ కార్మికుల కష్టానికి తగ్గ ఫలం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు, 2023పై ఆయన మాట్లాడారు. భారతీయ చలనచిత్ర రంగంలో వివిధ విభాగాల్లో రెండు లక్షల మందికిపైగా కార్మి కులు పనిచేస్తున్నారని తెలిపారు. చిత్ర నిర్మాణ వ్యయంలో మూడోవంతు పైగా భాగం కథానాయకుల పారితోషికాలకే సరిపోగా.. మిగిలిన మొత్తంతో చిత్రనిర్మాణం పూర్తి చేయాల్సి వస్తోందన్నారు. సెన్సార్ బోర్డ్ సరి్టఫికెట్ పొందిన చిత్ర నిర్మాత లేదా దర్శకుడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు దాఖలు కాకుండా నిరోధించేలా సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణ చేయాలని కోరారు. రైల్వే అప్రెంటీస్లకు న్యాయం చేయండి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) చేసిన తప్పిదం కారణంగా వందలాది కోర్సు కంప్లీటెడ్ అప్రెంటిస్ అభ్యర్థులకు రైల్వే నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్సీవీటీ పరీక్షకు హాజరు కాలేదన్న సాకుతో వారి నియామకాన్ని రైల్వే పెండింగ్‌లో పెట్టిందన్నారు. మానవతా దృక్పథంతో ఆ అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పైరసీ సైట్ల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి:ఎంపీ నిరంజన్‌రెడ్డి విచ్చలవిడిగా పెరిగిపోతున్న పైరసీ సైట్ల నియంత్రణకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి భారతీయ సినిమా ఆర్థికంగా నష్టపోకుండా చూడాలన్నారు. పైరసీ సైట్లు సుమారు రూ.20 వేల కోట్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయన్నారు. గురువారం రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. ఆయా సైట్లను బ్లాక్‌చేయడం ద్వారా భారతీయ సినిమాను రక్షించొచ్చన్నారు -
సినిమా హీరోల రెమ్యూనరేషన్పై విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
-
సినిమా అంటే హీరో ఒక్కడే కాదు: రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: సినిమా అంటే హీరో ఒక్కడే కాదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, బడ్జెట్లో సింహభాగం హీరోలకు వెళ్లే సంస్కృతి మారాలని అభిప్రాయపడ్డారు. సినిమా బడ్జెట్లో అధికభాగం హీరోల రెమ్యునరేషన్లేనని గుర్తుచేశారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ వంటి బడా హీరోలు రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నారని చెప్పారు. సినిమా కోసం పనిచేసిన కార్మికులకు మాత్రం నామమాత్రపు జీతాలేనని తెలిపారు విజయసాయి రెడ్డి. కష్టపడిన అందరికీ సముచిత ప్రయోజనం చేకూరాలని ఆయన కోరారు. ఈ మేరకు చట్టాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు. హీరో కొడుకులే హీరోలు ఎందుకు అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదీ చదవండి: బాబు బాటలో పవన్.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా? -
సినిమాటోగ్రాఫర్ గా మారిన అనుపమ
వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్. కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. ఒకవైపు హీరోయిన్గా రాణిస్తూనే మరోవైపు తనలో దాగిఉన్న మరో టాలెంట్‌ని అందరికి తెలియజేయాలనుకుంటుంది. సినిమాటోగ్రఫీపై అనుపమకు మంచి అవగాహన ఉంది. ఎప్పటికైనా డీఓపీగా పని చేయాలని అనుపమ కోరిక. తాజాగా ఆమె కోరిక నెరవేరింది. సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ఐ మిస్ యు అనే షార్ట్ ఫిల్మ్‌తో సినిమాటోగ్రాఫర్‌గా మారింది. ఓ యూట్యూబ్ చానల్ వేదికగా విడుదలైన ఈ షార్ట్‌ఫిల్మ్‌లో అనుపమ కెమెరా వర్క్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. యూ ఎస్ లో నివసిస్తున్న ఒక యువకుడు.. అతని తల్లిదండ్రులతో అతని సంబంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వరుస హిట్స్ కూడా ఉన్న ఒక హీరోయిన్ ఇలా ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయడం సౌత్ ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. కార్తికేయ 2, 18 పేజెస్, బటర్‌ఫ్లై తదితర చిత్రాలతో అలరించిన అనుపమ.. ప్రస్తుతం ఓ కోలివుడ్ మూవీతో పాటు మలయాళ ఫిల్మ్‌లోనూ నటిస్తోంది. -
అంతర్జాతీయ పురస్కార బలగం
హాస్య నటుడు వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా నటించారు. ‘దిల్’ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమా మార్చి 3న విడుదలై, మంచి విజయం సాధించింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో ఈ చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీతోపాటు బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డులకు ఎంపికైన విషయాన్ని చిత్రదర్శకుడు వేణు వెల్లడించారు. ‘నా బలగం’కు ఇది మూడో అవార్డు. ప్రపంచ వేదికపై బలగం మెరుస్తోంది’’ అన్నారు. ఈ అవార్డును ఛాయాగ్రాహకుడు ఆచార్య వేణు, దర్శకుడు వేణు అందుకోనున్నారు. -
టాలీవుడ్లో విషాదం.. తారకరత్నను మరవకముందే మరొకరు మృతి
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. తారకరత్న మరణం మర్చిపోకముందే మరొకరు గుండెపోటుతో మృతి చెందారు. టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 2017లో వచ్చిన 'దర్శకుడు' మూవీకి ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆ తర్వాత బాజీరావు మస్తానీ, ధూమ్ 3, బేబీ, పంజా, యమదొంగ చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా సేవలందించారు. ప్రవీణ్ మృతి చెందడం టాలీవుడ్ మరోసారి విషాదంలో మునిగిపోయింది. -
తారకరత్న తండ్రి గురించి ఈ విషయాలు తెలుసా?
నందమూరి తారకరత్న ఇకలేరన్న విషయాన్ని యావత్ సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. టాలీవుడ్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నలభై ఏళ్ల వయసులోనే ఆయన మన మధ్య లేకపోవడం అత్యంత దురదృష్టకరమైన విషయం. ఈ క్రమంలో ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తారకరత్నం తండ్రి మోహన కృష్ణ కూడా సినీ పరిశ్రమకు చెందిన వారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన తన చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయితే తండ్రిలా నటన వైపు కాకుండా సినిమాటోగ్రఫీ వైపు వెళ్లారు. మోహన కృష్ణ పలు స్టార్ హీరోల సినిమాలకు కెమెరామెన్ గా కూడా పనిచేశారు. అంతే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఒకవైపు చదువుకుంటూనే కెమెరామెన్‌గా ఎదిగారు. ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమాకు మొదట అసిస్టెంట్ కెమెరామెన్‌గా ఆయన పని చేశారు. ఆ తర్వాత పలు సినిమాలకు పనిచేసిన తారకరత్న తండ్రి మోహనకృష్ణ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘అనురాగ దేవత’ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా మారారు. చివరగా తనయుడు తారకరత్న హీరోగా నటించిన వెంకటాద్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అప్పటి నుంచి తండ్రి ఎన్టీఆర్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారాయన. -
RRR సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, భార్య రూహీతో " ప్రత్యేక ఇంటర్వ్యూ "
-
కె విశ్వనాథ్ మృతికి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి ఘన నివాళి
వెండితెర కళాతపస్వి కె విశ్వనాథ్ అంత్యక్రియలు శుక్రవారం(ఫిబ్రవరి 3న) మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశాన వాటికలో ముగిశాయి. ఫిలిం నగర్ నుంచి పంజాగుట్ట వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగింది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం తరపున కె. విశ్వనాథ్ పార్థివ దేహానికి ఆయన ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘దర్శక దిగ్గజంగా ఎదిగిన కె. విశ్వనాథ్ తన మొదటి సినిమాతోనే నంది అవార్డు గెలుచుకున్నారు. 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటనతో కూడా అందరిని మెప్పించే పాత్రలు చేసి సినీ ప్రేక్షక హృదయాల్లో చిరస్మరణీయడుగా నిలిచారు. ఆయన రూపొందించిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం వంటి సినిమాలతో దేశ సినిచరిత్రలో కె.విశ్వనాథ్ తనదైన ముద్ర వేసుకున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు, రఘుపతి వెంకయ్య పురస్కారం, పద్మశ్రీ వంటి అత్యున్నతమైన అవార్డులను కె.విశ్వనాథ్ అందుకున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తులను కోల్పోవడం తెలుగు సినీ రంగానికి తీరని లోటు’ అని మంత్రి పేర్కొన్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
చిరంజీవి మంచి మనసు.. కష్టాల్లో ఉన్న కెమెరామెన్‌కి సాయం
మెగాస్టార్ చిరంజీవి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం అందించడంలో ముందుండే చిరంజీవి తాజాగా మరో సినీ కళాకరుడికి చేయూతనందించారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎంజిఆర్, రజినీకాంత్, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున .. ఇలా ఎంతోమంది హీరోలతో దేవరాజ్ పనిచేశారు. తెలుగు, తమిళ, బెంగాళీ, మలయాళ భాషల్లో దాదాపు 300 సినిమాలకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సీనియర్ కెమెరామెన్ దేవరాజ్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి దేవరాజ్, ఆయన కొడుకును పిలిపించి రూ. 5లక్షల చెక్ అందించి సహాయం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు చిరు ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేయడంతో అవికాస్తా వైరల్‌గా మారాయి. కాగా చిరంజీవి నటించిన నాగు, పులిబెబ్బులి, రాణి కాసుల రంగమ్మ వంటి సినిమాలకు దేవరాజ్ కెమెరామెన్‌గా పనిచేశారు. మానవసేవే మాధవ సేవ అని మనసావాచా నమ్మే @KChiruTweets గారు మరో సారి తన ఉదారత చాటుకున్నారు♥️ సినిమాటోగ్రాఫర్ పి.దేవరాజ్ గారి ఆర్ధిక పరిస్థితి తెలుసుకుని క్షణం ఆలస్యం చేయకుండా 5లక్షల రూపాయలిచ్చి ఆయనకు సహాయం చేసారు #MegaStarWithGoldenHeart #Chiranjeevi #MegaStarChiranjeevi pic.twitter.com/75lrdzYVBJ — Mega Family Fans (@MegaFamily_Fans) February 2, 2023 -
పూట గడవని స్థితి, చచ్చిపోవాలనుంది: ఏడ్చేసిన సినిమాటోగ్రాఫర్
సినిమాను అద్భుతంగా తీయడానికి కెమెరామన్స్ ఎంతగానో కష్టపడుతారు. తెర వెనక వారి జీవితాల్లోనూ అంతే కష్టం దాగుటుంది. అందుకు సీనియర్ సినిమాటోగ్రాఫర్ పి. దేవరాజ్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తారు. ఛాలెంజ్ రాముడు, లాయర్ విశ్వనాథ్, పులి-బెబ్బులి, ఖైదీ కాళిదాస్, భలే తమ్ముడు, సింహ గర్జన.. ఇలా దాదాపు 300 సినిమాలకు పని చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ.. ఇలా ఎన్నో భాషల్లో సినిమాలు చేసుకుంటూ పోయిన ఆయన ప్రస్తుతం దీన స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో తన పరిస్థితి గురించి వెల్లడిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారాయన. 'నా తండ్రి శ్రీధర్ పెద్ద కెమెరామన్. ఎన్నో హిట్ సినిమాలకు ఆయన పని చేశారు. నేనీ వృత్తిలోకి రాకూడదనుకున్నాను. కానీ ఆయన మరణంతో ఇంట్లో 12 మందిని పోషించాల్సిన బాధ్యత నామీద పడింది. తప్పని పరిస్థితిలో సినిమాటోగ్రాఫర్‌గా మారాను. కష్టపడి పని చేశా.. పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాను. ఎంతోమందికి సాయం చేసిన నేను ఇప్పుడు కనీసం నడవలేని స్థితిలో సాయం కోసం అర్థిస్తున్నాను. పూట గడవడం కూడా కష్టమవుతోంది. నా స్నేహితుడు రజనీకాంత్ నెలకు రూ.5000 పంపిస్తాడు. మురళీ మోహన్ టాబ్లెట్ల కోసం మూడు వేలు పంపిస్తాడు. సినిమాల్లో జయప్రద, ప్రభ, విజయశాంతి.. ఇలా ఎంతోమంది ఆర్టిస్టులను సినిమాలకు రికమెండ్ చేశాను. కానీ వారెవరూ సాయానికి ముందుకు రావడం లేదు. ఇంటి అద్దె రూ.8 వేలు. అది కూడా కట్టలేని స్థితిలో ఉన్నాను. నాకు ఆపరేషన్ చేయాలంటే ఏడు లక్షల దాకా అవుతుంది. నాకంత స్థోమత లేదు. ఎందుకు బతికున్నానో తెలీదు, చచ్చిపోవాలనుంది' అంటూ కన్నీటిపర్యంతమయ్యారు దేవరాజ్. చదవండి: అందుకే మెడలో మంగళసూత్రం ధరిస్తా: సింగర్ -
కొత్తవారిని ప్రోత్సహించాలి
‘‘తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త తరం అవసరం చాలా ఉంది. కొత్తవారు చేస్తున్న ఈ ‘అష్టదిగ్బంధనం’ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్తవారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రోత్సహించినప్పుడే మరిన్ని కొత్త సినిమాలు వస్తాయి’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సూర్య భరత్ చంద్ర, ఇషికా ముఖ్య తారలుగా బాబా పీఆర్ దర్శకత్వంలో మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రం ‘అష్టదిగ్బంధనం’. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. మనోజ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనున్నాం. ఒక వినూత్న కథాంశంతో బాబా పీఆర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయింది’’ అన్నారు. ‘‘హైదరాబాద్ నేపథ్యంలో సాగే హై వోల్టేజ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఇది’’ అని బాబా పీఆర్ అన్నారు. ‘‘నటనకు అవకాశం ఉన్న పాత్ర చేస్తున్నాను’’ అన్నారు సూర్య భరత్ చంద్ర. ‘‘తెలుగులో నాకు ఇది మూడో సినిమా’’ అన్నారు ఇషికా. -
టీజర్ బాగుంది
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకి యువతరం రావాల్సిన అవసరం ఉంది. కొత్త తరాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ‘ఎర్రర్ 500’ టీజర్ బాగుంది. యూనిట్ ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జస్వంత్ పడాల, నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రల్లో సందీప్ మైత్రేయ ఎన్. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎర్రర్ 500’. యు. బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. జస్వంత్ మాట్లాడుతూ– ‘‘ఎర్రర్ 500’ అందరికీ కనెక్ట్ అయ్యే కథ. నన్ను హీరోగా పరిచయం చేసిన బాలరెడ్డిగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. ‘బిగ్ బాస్’ ఫేం జస్వంత్‌ని హీరోగా లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అన్నారు సందీప్. ఈ చిత్రానికి కెమెరా: శశాంక్ శ్రీరామ్– ప్రశాంత్ మన్నె, సంగీతం: ఫణి కల్యాణ్. -
వారి ఆలోచన విధానంలో మార్పు రావాలి: దర్శక-నిర్మాత
Dadasaheb Phalke School Of Film Studies Completed 5 Years: "ఎవరైనా పిల్లలు... నేను కలెక్టర్ అవుతాను, డాక్టర్ చదువుతాను" అంటే తల్లిదండ్రులు సంతోషిస్తారు, గర్వపడతారు. కానీ అదే పిల్లలు.. "నేను హీరో అవుతాను, డైరెక్షన్ చేస్తాను, సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకుంటాను" అంటే మాత్రం గాభరాపడతారు. ''తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి" అంటున్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు-నిర్మాత, "దాదా సాహెబ్ ఫాల్కే ఆఫ్ ఫిల్మ్ స్టడీస్" డీన్ మధు మహంకాళి. సివిల్ సర్వెంట్స్ కి, డాక్టర్స్, లాయర్స్ కి తీసిపోని గౌరవమర్యాదలు.. సినిమా రంగంలో రాణిస్తున్నవారికి దక్కుతున్నాయనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని ఆయన కోరారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కళాతపస్వి కె.విశ్వనాధ్ చేతుల మీదుగా మొదలై... అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు వంటి చిత్ర ప్రముఖుల ప్రోత్సాహంతో తెలుగు చిత్రసీమకు గత ఐదేళ్లుగా ఎందరో ప్రతిభావంతుల్ని పరిచయం చేస్తున్న "దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్" అత్యంత విజయవంతంగా ఐదు వసంతాలు పూర్తి చేసుకుని, ఆరో ఏట అడుగుపెడుతున్న సందర్భంగా మధు మహంకాళి ప్రత్యేకంగా ముచ్చటించారు. తెలుగు రాష్ట్రాల్లో... దిగువ మధ్య తరగతివారికి అందుబాటులో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఏకైక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ తమదేనని మహంకాళి పేర్కొన్నారు. "దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్'లో యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీలకు మాత్రమే పరిమితం కాకుండా... ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, డిజిటల్ మ్యూజిక్ ప్రొడక్షన్ వంటి కోర్సులు సైతం ఉండడం తమ ఫిల్మ్ స్కూల్ ప్రత్యేకత అని మధు వివరించారు. ఇప్పటివరకు తమ ఫిల్మ్ స్కూల్ లో కోర్సులు చేసినవారంతా.. ఇండస్ట్రీలో వివిధ శాఖల్లో విశేషంగా రాణిస్తున్నారని తెలిపారు. నేషనల్, ఇంటర్నేషనల్, రీజినల్ సినిమాలపై సమగ్ర అవగాహన కలిగేలా తమ ఫిల్మ్ స్కూల్ సిలబస్ డిజైన్ చేశామన్నారు. మన దేశంలో ఉన్న బెస్ట్ ఫిల్మ్ స్కూల్స్ అనుసరించే సిలబస్ బాగా స్టడీ చేసి.. వాటన్నిటిలో ఉన్న ఉత్తమ అంశాలు మేళవించి.. తమ ఫిల్మ్ స్కూల్ బోధనను పొందుపరిచామన్నారు. సినిమా రంగంలో రాణించాలనుకునేవారు... అన్ని శాఖల పట్ల అవగాహన పెంచుకోవడం ఎంతైనా అవసరమని ఆయన పేర్కొన్నారు. -
మంత్రి పేర్ని నానికి అదనపు బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న పేర్ని వెంకట్రామయ్యకు (నాని) రాష్ట్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలను కూడా కేటాయించింది. ఈమేరకు బుధవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జిఓఎంఎస్ సంఖ్య 144 ద్వారా రాజపత్రం(గెజిట్ నోటిఫికేషన్) జారీచేశారు. చదవండి: (బస్సు ప్రమాదం: సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా)