
మెగాస్టార్ చిరంజీవి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం అందించడంలో ముందుండే చిరంజీవి తాజాగా మరో సినీ కళాకరుడికి చేయూతనందించారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎంజిఆర్, రజినీకాంత్, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున .. ఇలా ఎంతోమంది హీరోలతో దేవరాజ్ పనిచేశారు. తెలుగు, తమిళ, బెంగాళీ, మలయాళ భాషల్లో దాదాపు 300 సినిమాలకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సీనియర్ కెమెరామెన్ దేవరాజ్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి దేవరాజ్, ఆయన కొడుకును పిలిపించి రూ. 5లక్షల చెక్ అందించి సహాయం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు చిరు ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేయడంతో అవికాస్తా వైరల్‌గా మారాయి. కాగా చిరంజీవి నటించిన నాగు, పులిబెబ్బులి, రాణి కాసుల రంగమ్మ వంటి సినిమాలకు దేవరాజ్ కెమెరామెన్‌గా పనిచేశారు.
మానవసేవే మాధవ సేవ అని మనసావాచా నమ్మే @KChiruTweets గారు మరో సారి తన ఉదారత చాటుకున్నారు♥️
— Mega Family Fans (@MegaFamily_Fans) February 2, 2023
సినిమాటోగ్రాఫర్ పి.దేవరాజ్ గారి ఆర్ధిక పరిస్థితి తెలుసుకుని క్షణం ఆలస్యం చేయకుండా 5లక్షల రూపాయలిచ్చి ఆయనకు సహాయం చేసారు #MegaStarWithGoldenHeart #Chiranjeevi #MegaStarChiranjeevi pic.twitter.com/75lrdzYVBJ