camera man
-
చిరంజీవి మంచి మనసు.. కష్టాల్లో ఉన్న కెమెరామెన్‌కి సాయం
మెగాస్టార్ చిరంజీవి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం అందించడంలో ముందుండే చిరంజీవి తాజాగా మరో సినీ కళాకరుడికి చేయూతనందించారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎంజిఆర్, రజినీకాంత్, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున .. ఇలా ఎంతోమంది హీరోలతో దేవరాజ్ పనిచేశారు. తెలుగు, తమిళ, బెంగాళీ, మలయాళ భాషల్లో దాదాపు 300 సినిమాలకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సీనియర్ కెమెరామెన్ దేవరాజ్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి దేవరాజ్, ఆయన కొడుకును పిలిపించి రూ. 5లక్షల చెక్ అందించి సహాయం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు చిరు ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేయడంతో అవికాస్తా వైరల్‌గా మారాయి. కాగా చిరంజీవి నటించిన నాగు, పులిబెబ్బులి, రాణి కాసుల రంగమ్మ వంటి సినిమాలకు దేవరాజ్ కెమెరామెన్‌గా పనిచేశారు. మానవసేవే మాధవ సేవ అని మనసావాచా నమ్మే @KChiruTweets గారు మరో సారి తన ఉదారత చాటుకున్నారు♥️ సినిమాటోగ్రాఫర్ పి.దేవరాజ్ గారి ఆర్ధిక పరిస్థితి తెలుసుకుని క్షణం ఆలస్యం చేయకుండా 5లక్షల రూపాయలిచ్చి ఆయనకు సహాయం చేసారు #MegaStarWithGoldenHeart #Chiranjeevi #MegaStarChiranjeevi pic.twitter.com/75lrdzYVBJ — Mega Family Fans (@MegaFamily_Fans) February 2, 2023 -
పూట గడవని స్థితి, చచ్చిపోవాలనుంది: ఏడ్చేసిన సినిమాటోగ్రాఫర్
సినిమాను అద్భుతంగా తీయడానికి కెమెరామన్స్ ఎంతగానో కష్టపడుతారు. తెర వెనక వారి జీవితాల్లోనూ అంతే కష్టం దాగుటుంది. అందుకు సీనియర్ సినిమాటోగ్రాఫర్ పి. దేవరాజ్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తారు. ఛాలెంజ్ రాముడు, లాయర్ విశ్వనాథ్, పులి-బెబ్బులి, ఖైదీ కాళిదాస్, భలే తమ్ముడు, సింహ గర్జన.. ఇలా దాదాపు 300 సినిమాలకు పని చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ.. ఇలా ఎన్నో భాషల్లో సినిమాలు చేసుకుంటూ పోయిన ఆయన ప్రస్తుతం దీన స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో తన పరిస్థితి గురించి వెల్లడిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారాయన. 'నా తండ్రి శ్రీధర్ పెద్ద కెమెరామన్. ఎన్నో హిట్ సినిమాలకు ఆయన పని చేశారు. నేనీ వృత్తిలోకి రాకూడదనుకున్నాను. కానీ ఆయన మరణంతో ఇంట్లో 12 మందిని పోషించాల్సిన బాధ్యత నామీద పడింది. తప్పని పరిస్థితిలో సినిమాటోగ్రాఫర్‌గా మారాను. కష్టపడి పని చేశా.. పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాను. ఎంతోమందికి సాయం చేసిన నేను ఇప్పుడు కనీసం నడవలేని స్థితిలో సాయం కోసం అర్థిస్తున్నాను. పూట గడవడం కూడా కష్టమవుతోంది. నా స్నేహితుడు రజనీకాంత్ నెలకు రూ.5000 పంపిస్తాడు. మురళీ మోహన్ టాబ్లెట్ల కోసం మూడు వేలు పంపిస్తాడు. సినిమాల్లో జయప్రద, ప్రభ, విజయశాంతి.. ఇలా ఎంతోమంది ఆర్టిస్టులను సినిమాలకు రికమెండ్ చేశాను. కానీ వారెవరూ సాయానికి ముందుకు రావడం లేదు. ఇంటి అద్దె రూ.8 వేలు. అది కూడా కట్టలేని స్థితిలో ఉన్నాను. నాకు ఆపరేషన్ చేయాలంటే ఏడు లక్షల దాకా అవుతుంది. నాకంత స్థోమత లేదు. ఎందుకు బతికున్నానో తెలీదు, చచ్చిపోవాలనుంది' అంటూ కన్నీటిపర్యంతమయ్యారు దేవరాజ్. చదవండి: అందుకే మెడలో మంగళసూత్రం ధరిస్తా: సింగర్ -
నయన తార ప్రశంస అమితానందాన్ని ఇచ్చింది: కెమెరా మెన్
సాక్షి, చెన్నై: తన ఛాయాగ్రహణం పనితనానికి నయనతార సంతృప్తి చెంది ప్రశంసించడం అమితానందం కలిగించిందని ఓ2 మూవీ సినిమాటోగ్రాఫర్ తమిళళగన్ అన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన మన్మథలీలై చిత్రంతో ఛాయాగ్రాహకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఓ2 చిత్రానికి పనిచేశారు. జీఎస్ విఘ్నే ష్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డ్రీమ్ వారియర్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు నిర్మించిన చిత్రం ఇది. గత 17వ తేదీ నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ఛాలెంజ్‌తో కూడిన సన్నివేశాలను సమర్థవంతంగా చిత్రీకరించినట్లు పరిశ్రమ వర్గాలు, మీడియా వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని తమిళళగన్ వెల్లడించారు. దర్శకుడు విఘ్నే ష్ తన మిత్రుడిని 2019లో ఈ చిత్ర కథను చెప్ప గా అప్పటి నుంచే తానీ కథతో ట్రావెల్ అవుతూ వచ్చానని తెలిపారు. ఛాయాగ్రహణం విషయంలో చాలా పేపర్ వర్క్ చేశానన్నారు. షూటింగ్‌కు ముందు తాను కెమెరామెన్ అనగానే నయనతార సంశయించారనీ, తన పేపర్ వర్కు గురించి వివరించగానే సంతృప్తి చెందారన్నారు. చిత్రం చూసిన తరువాత చాలా హ్యాపీ అయ్యారని చెప్పారు. -
కెమెరా టెక్నిక్స్.. షార్ట్ఫిలిమ్స్ సూపర్‌హిట్..
జూబ్లీహిల్స్: ఓ చిన్న 5డీ కెమెరాతో ఫొటోగ్రఫీ రంగంలో సత్తా చాటుతూ.. ఇప్పటికే వందలాది లఘుచిత్రాలను తన కెమెరాతో చిత్రీకరించి శెభాష్ అనిపించుకుంటున్నాడు యూసుఫ్‌గూడ వెంకట గిరిబస్తీలో నివసించే యువ సినిమాటోగ్రాఫర్ సుధాకర్. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సుధాకర్‌కు చిన్నప్పటి నుంచే ఫొటోగ్రఫీ అంటే మక్కువ. తండ్రి కొనిచ్చిన చిన్ని కెమెరాతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నాడు. క్రమంగా సెల్ఫోన్లు రంగప్రవేశం చేయడం, వాటిలో అత్యుత్తమ నాణ్యత కలిగిన కెమెరాలు రావడంతో ఫోన్లో కూడా చిత్రీరణ చేసి భళా అనిపించుకున్నాడు. షార్ట్‌ఫిలిమ్స్‌తో సత్తా..నాలుగైదేళ్లుగా షార్ట్ఫిలిమ్స్ విజృంభణతో ఫొటోగ్రఫీని ఉపాధి అవకాశంగా మార్చుకున్నాడు. షార్ట్ఫిలిమ్ మేకింగ్‌లో పట్టుసాధించి ఇప్పటి వరకు దాదాపు 200కు పైగా షార్ట్ఫిలిమ్స్కు కెమెరామెన్‌గా పనిచేశాడు. అలాగే 10 ఇండిపెండెంట్ చిత్రాలకు, శివ 143, రహస్యం అనే చలనచిత్రాలకు పూర్తిస్థాయి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. మరో రెండు సినిమాలకు ఛాయగ్రహకుడిగా అవకాశాలు వచ్చాయి. ఈ రంగంలో పలు ప్రైవేట్ సంస్థల అవార్డులు అందుకున్నాడు. సుధాకర్ ఫొటోగ్రఫీ నిర్వహించిన హెలినా, అనుక్షణం, రాధాకృష్ణ, శ్వాస నువ్వే, రుధిరం తదితర లఘుచిత్రాలకు మంచిపేరు వచ్చింది. యూట్యూబ్‌లో పెద్దహిట్ చిత్రాలుగా నిలిచాయి. షార్ట్ఫిలిమ్స్కు పనిచేస్తున్నా.. ఫొటోగ్రఫి తిలక్ దగ్గర నేర్చుకున్నాను. మా ఊరి వంట కార్యక్రమానికి అసిస్టెంట్‌గా పనిచేశాను. రామ్‌గోపాల్ వర్మ స్ఫూర్తిగా చిట్టీలు వేసి డబ్బులు జమచేసి 5డి కెమెరా కొనుగోలు చేశాను. క్రమంగా షార్ట్ఫిలిమ్స్కు పనిచేస్తూ పేరు సంపాదించాను. నా ఫేస్బుక్ పేజ్‌కు 5వేల మంది, ఇన్‌స్ట్రాగామ్ పేజ్‌కు 5వేల మంది అభిమానులు ఉన్నారు. ఈ రంగంలో కొనసాగుతూ మంచి సినిమాటోగ్రాఫర్‌గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను. – సుధాకర్, షార్ట్ఫిలిమ్స్ సినిమాటోగ్రాఫర్ -
ఇంటి పేరు క్లిక్.. ఇళ్లు తళుక్కు
సాక్షి, బెంగళూరు : కొందరికి రేడియో వినడం అంటే ఇష్టం..మరికొందరికి పాటలంటే ఇష్టం..ఇంకొకరికి వంటల పిచ్చి....ఇంకా సంగీతం, నృత్యం ఇలా రకరకాల కళల్లో ఎవరి అభిరుచి వారికి ఉంటుంది. ఆ ప్రతిభతో ఆయా రంగాల్లో రాణించిన పేరు ప్రఖ్యాతులు గడించిన వారు చాలామందే ఉన్నారు. అయితే ఆ ప్రేమ కాస్త పిచ్చిగా మారి, దాన్ని చాలా భిన్నంగా, హృద్యంగా మల్చుకోవడం దాదాపు అరుదు అనే చెప్పాలి. కర్ణాటకలోని బెల్గాంకు చెందిన రవి హోంగల్ (49) ఇదే కోవకు చెందుతారు. చిన్నప్పటి నుంచీ ఆయనకు ఫోటోగ్రఫీపై మక్కువ ఎక్కువ. అలా ‘పెంటాక్స్’ కెమెరాతో కనిపించిన దృశ్యాలను క్లిక్ చేస్తూ ఎదిగారు. చివరికి దాన్నే వృత్తిగా ఎంచుకుని తన భార్య రాణితో కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. అంతేకాదు ప్రముఖ డిజిటల్ కెమెరాలు ఎప్సన్, కానన్, నికాన్ పేర్లను తన ముగ్గురు కుమారులకు పెట్టారు. ఇక్కడితో అయన అభిమానం ఆగిపోలేదు. కెమెరా ఆకారంలో బెల్గావ్లో మూడంతస్థుల భవనాన్ని నిర్మించుకోవడం విశేషం. సుమారు 71 లక్షల రూపాయలతో ప్రేమగా నిర్మించుకున్న తన కలల సౌధానికి ‘క్లిక్’ అని పేరు పెట్టుకోవడం మరో విశేషం. -
సినీ పరిశ్రమలో మరో విషాదం..
సాక్షి, చెన్నై: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నన్(69) శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దర్శకుడు భీమ్ సింగ్ కుమారుడైన కన్నన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో అయన ఎన్నో చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. దిగ్గజ దర్శకుడు భారతీరాజాతో కలిసి దాదాపు 40 సినిమాలకు పనిచేశారు. దీంతో కన్నన్ను భారతీరాజా రెండు కళ్లు అని పిలుస్తుండేవారు. వీరద్దరి కాంబినేషనలో వచ్చిన మొదటి చిత్రం నిజల్గళ్ కాగా, చివరి చిత్రం బొమ్మలాట్టమ్. ఇక తెలుగులో పగడాల పడవ, కొత్త జీవితాలు, సీతాకోక చిలుక, ఆరాధన చిత్రాలకు పనిచేసిన కన్నన్ తన కెమెరా పనితనం చూపించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కన్నన్ పార్థివదేహాన్ని అల్వార్ పేటలోని ఆయన నివాసం వద్ద ఉంచుతారు. రేపు(ఆదివారం) అంత్యక్రియలు నిర్వహిస్తామని కన్నన్ సన్నిహితులు తెలిపారు. -
టీవీ సీరియల్ కెమెరామెన్ ఆత్మహత్య
చెన్నై,వేలూరు: జోలార్‌పేట బస్టాండ్ సమీపంలో చెన్నైకి చెందిన టీవీ సీరియల్ కెమెరామెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నై వలసరవాక్కం గంగమ్మ వీధికి చెందిన శశికుమార్(47) టీవీ సీరియల్ కెమెరామెన్. ఇతని భార్య రాఘవి. వీరికి ఒక కుమార్తె ఉంది. ఇదిలా ఉండగా శశికుమార్ పనిచేస్తున్న స్టూడియోలో ఉన్న కెమెరాను రూ.2 లక్షలకు కుదవపెట్టినట్లు తెలిసింది. దీంతో స్టూడియో యాజమాన్యం విరుగంబాక్కం పోలీసులకు శశికుమార్‌పై ఫిర్యాదు చేశారు. మనస్తాపానికి గురైన శశికుమార్ ఈనెల 9న ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఈ క్రమంలో వేలూరు జిల్లా జోలార్‌పేట బస్టాండ్ సమీపంలోని చెరువు గట్టు వద్దనున్న ఒక చెట్టుకు శశికుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గురువారం స్థానికులు గుర్తించారు. వెంటనే జోలార్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. అనంతరం అతని పర్సులో ఉన్న ఫొటోలను పరిశీలించగా అందులో భార్య, కుమార్తె ఫొటో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అతని సెల్‌ఫోన్ నంబర్ ద్వారా అతని వివరాలను తెలుసుకొని వలసరవాక్కం పోలీసుల ద్వారా కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. భార్య రాఘవి తన భర్త మృతిపై అనుమానం ఉందని జోలార్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. -
వైల్డ్ ఫిలింమేకర్ నల్లముత్తుకు జాతీయ అవార్డు
చెన్నై ,పెరంబూరు: ప్రముఖ వైల్డ్ ఫిలిం మేకర్, ఛాయాగ్రహకుడు నల్లముత్తుకు జాతీయ అవార్డు వరించింది. 66వ జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సారి తమిళనాడుకు జాతీయ అవార్డుల విషయంలో తీవ్ర నిరాశనే కలిగించింది. బారం అనే ఒక్క చిత్రానికే ఉత్తమ చిత్ర అవార్డు లభించింది. ఈ చిత్రం ఇంకా తెరపైకి రాలేదు. కాగా కొంతలో కొంత మెరుగైన విషయం ఏమిటంటే చెన్నైకి చెందిన ప్రముఖ వైల్డ్ ఫిలిం మేకర్, కేమెరామెన్ నల్లముత్తుకు మచిలీ అనే డాక్యుమెంటరీ చిత్రానికి గానూ జాతీయ అవార్డు వరించింది. ఈయన పూర్తి పేరు నల్లముత్తు అన్విట అదేష్రా. నల్లముత్తు టైగర్ సెంట్రిక్ డాక్యుమెంటరీ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట. ఆరంభంలో నిశ్చల చాయాగ్రహకుడిగా ఇస్రోలో పని చేసిన నల్లముత్తు ఆ తరువాత ఫిలిం డివిజన్లో పని చేశారు. ఈయన పలు ఇండిస్ట్రీస్‌కు, పలు డైరెక్టర్స్‌తోనూ, వరల్డ్ వైడ్ నెట్‌వర్క్స్‌తోనూ పని చేశారు. అదే విధంగా నేషనల్ జాగ్రఫిక్ చానల్, బీబీసీ, డిస్కవరీ ఛానల్ 4, యానిమల్ ప్లానెట్, స్టార్ టీవీ, దూరదర్శన్ వంటి చానళ్లకు వైల్డ్ ఫిలిం మేకర్‌గా పని చేశారు. ఇండియాలోనే ఫస్ట్ అండ్ లార్జెస్ట్ రన్నింగ్ పాండా అవార్డును అందుకున్న నల్లముత్తు తాజాగా మచిలీ అనే డాక్యుమెంట్ చిత్రానికిగానూ బెస్ట్ ఎన్నిరాన్‌మెంట్ కేటగిరీలో జాతీయ అవార్డును గెలుచుకున్నారు. -
లఘుచిత్రాల సినిమాటోగ్రాఫర్
జూబ్లీహిల్స్: చిట్టీలు వేసి డబ్బులు జమ చేసి చిన్న 5డీ కెమెరాను కొనుగోలు చేసిన సుధాకర్... షార్ట్ఫిలిమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా రాణిస్తున్నాడు. యూసుఫ్‌గూడ వెంకటగిరిలో నివసించే సుధాకర్ ఇప్పటికే వందలాది ఫార్ట్ఫిలిమ్స్ను తెరకెక్కించాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సుధాకర్‌కు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీపై మక్కువ. తండ్రి కొనిచ్చిన చిన్న కెమెరాతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నాడు. క్రమంగా సెల్ఫోన్లలో అత్యుత్తమ నాణ్యతతో కెమెరాలు రావడంతో... ఫోన్లోనే షార్ట్ఫిలిమ్స్ చిత్రీకరించి శెభాష్ అనిపించుకున్నాడు. 150కి పైగా షార్ట్ఫిలిమ్స్... నాలుగైదేళ్లుగా షార్ట్ఫిలిమ్స్ ట్రెండ్ పెరగడంతో ఫొటోగ్రఫీని ఉపాధిగా మార్చుకున్నాడు సుధాకర్. షార్ట్ఫిలిమ్ మేకింగ్‌లో పట్టు సాధించి ఇప్పటి వరకు దాదాపు 150కి పైగా లఘుచిత్రాలకు కెమెరామెన్‌గా పని చేశాడు. త్వరలో విడుదల కానున్న ‘రహస్యం’ సినిమాకు పూర్తిస్థాయి సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. మరో రెండు సినిమాలకు అవకాశాలు వచ్చాయి. ఈ రంగంలో పలు ప్రైవేట్ సంస్థల అవార్డులు అందుకున్నాడు. సుధాకర్ తెరకెక్కించిన హెలినా, అనుక్షణం, రాధాకృష్ణ ,శ్వాసనువ్వే, రుధిరం తదితర లఘు చిత్రాలకు మంచి పేరొచ్చింది. వర్మ స్ఫూర్తితో.. తిలక్ దగ్గర ఫొటోగ్రఫీ నేర్చుకున్నాను. ‘మా ఊరి వంట’ కార్యక్రమానికి అసిస్టెంట్‌గా పని చేశాను. రామ్‌గోపాల్‌వర్మ స్ఫూర్తితో చిట్టీలు వేసి డబ్బులు జమ చేసుకొని 5డీ కెమెరా కొనుగోలు చేశాను. షార్ట్ఫిలిమ్స్కు పనిచేస్తూ పేరు సంపాదించాను. మంచి సినిమాటోగ్రాఫర్‌గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను.– సుధాకర్ -
ట్వీట్ ఎఫెక్ట్ : చిక్కుల్లో స్టార్ సినిమాటోగ్రాఫర్
ఎన్నో అద్భుత చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన టాప్ కెమెరామేన్ సంతోష్ శివన్ వివాదాంలో చిక్కుకున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో పాటు దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని కూడా అందుకున్న ఈ గ్రేట్ టెక్నీషియన్, తను చేసిన ఓ ట్వీట్ కారణంగా చిక్కుల్లో పడ్డారు. నిర్మాతలను ఉద్దేశిస్తూ క్రియేట్ చేసిన ఓ వివాదాస్పద మెమెను సంతోష్ శివన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ మెమెలో సాంకేతిక నిపుణులకు నిర్మాతలు డబ్బులిచ్చేప్పుడు అంటూ కోపంగా ఉన్న కుక్క ఫొటో, హీరోయిన్లకు డబ్బులిచ్చేప్పుడు నిర్మాతలు అంటూ ప్రశాంతంగా ఉన్న కుక్క ఫొటోతో తయారు చేశారు. ఈ ఫొటో సంతోష్ శివన్ ట్విటర్ అకౌంట్ తో దర్శనమివ్వటంతో వివాదం మొదలైంది. దీంతో పలువురు నిర్మాతల ఈ స్టార్ సినిమాటోగ్రాఫర్‌పై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సంతోష్ ట్వీట్‌ను డిలీట్ చేసినా అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. ఈ రోజు (బుధవారం) సమావేశం కానున్న నిర్మాతల మండలి ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. -
వేలూరులో టీవీ కెమెరామెన్ హత్య
వేలూరు: ఓ ప్రైవేట్ టీవీ కెమెరామెన్‌ను గంజాయి విక్రయించే ముఠా సభ్యులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన వేలూరులో చోటుచేసుకుంది. వేలూరు శరవణ్‌పేట ఎన్ఎస్కే నగర్‌కు చెందిన అశోక్‌కుమార్(25) ప్రైవేట్ టీవీ చానెల్లో కెమెరామెన్ అవివాహితుడు. గురువారం రాత్రి అశోక్‌కుమార్ ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 12.30 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన తిరుమలై, రమేష్, అగస్టిన్ అశోక్‌కుమార్ ఇంటి తలుపులు తట్టారు. అశోక్‌కుమార్ తలుపులు తీసిన వెంటనే ఈ ముగ్గురు కత్తితో దారుణంగా పొడిచారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు కేకలు వేయడంతో నిందితులు ముగ్గురూ అక్కడ నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అశోక్‌కుమార్‌ను కుటుంబసభ్యులు సమీపంలోని పెండ్‌ల్యాండ్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. విషయం తెలిసిన సౌత్ పోలీసులు నిందితులు తిరుమలై, రమేష్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అగస్టిన్ కోసం గాలిస్తున్నారు. నిందితులు ముగ్గురూ ఎన్ఎస్కే నగర్లో తరచూ గంజాయి విక్రయించే వారని తెలిసింది. దీన్ని అశోక్‌కుమార్ పోలీసులకు చెప్పడంతో ఈ విషయం తెలిసిన ముగ్గురు నిందితులు అశోక్‌కుమార్‌ను హత్య చేసినట్లు పోలీసుల తెలిపారు. -
పట్టుకోవడం కష్టం కాదు... అసాధ్యం!
అప్పారావు: దూరంగా ఉన్నవేవీ కనిపించడం లేదండీ.డాక్టర్ వెంగళ్: ఈ కిటికీలో నుంచి చూసి చెప్పు... ఆకాశంలో చందమామ కనిపిస్తుందా?అప్పారావు: బేషుగ్గా.డాక్టర్ వెంగళ్: అంత దూరాన ఉన్న చందమామనే చూడగలిగావ్. నీకెలాంటి సమస్యా లేదు వెళ్లు! బాక్సాఫీసు సూత్రాన్ని శాశ్వతంగా పట్టుకోవడం కష్టం కాదు... అసాధ్యం. డాన్ని కూడా అంతే. డాన్ కో పకడ్నా ముష్కిల్ నహీ... న ముమ్కిన్ హై! ‘షోలే’తో పుట్టారు సలీమ్-జావేద్ అనే బాలీవుడ్ పరుచూరి బ్రదర్స్. కానీ, 1978లో ‘డాన్’ క్యారెక్టర్ని హీరోగా చేసి రాసిన స్క్రిప్టుతో బాలీవుడ్లో ఏ దర్శకుడిని, నిర్మాతని, హీరోని ఒప్పించ లేకపోయారు. అందరి తిరస్కారానికీ గురైన ఆ స్క్రిప్టు ‘నారీమన్ ఎ. ఇరానీ’ అనే సినిమాటోగ్రాఫర్ కమ్ నిర్మాత జీవితాన్ని నిలబెట్టిందంటే ఆశ్చర్యం వేయక మానదు. ఇరానీ ఒక చిత్రం తీసి చేతులు, కాళ్లు, వళ్లు అన్నీ కాల్చుకుని కోటి ఇరవై లక్షల అప్పులో మునిగిపోతే, కెమెరామేన్‌గా వచ్చిన డబ్బులు బతకడానికీ, ఇంత పెద్ద అప్పు తీర్చడానికీ సరిపోక జీవితం దురవస్థల పాలైతే, ఆయన కెమెరామెన్‌గా మనోజ్ కుమార్ ప్రొడక్షన్లో ‘రోటీ కప్డా ఔర్ మకాన్’ అనే చిత్రానికి పనిచేస్తుంటే, దాని అసిస్టెంట్ డెరైక్టర్ చందర్ బారోత్ ఈయన దుస్థితిని చూడలేక, అమితాబ్‌ని, జీనత్ అమన్‌ని, నారీమన్గారు నిర్మాతగా ఒక్క చిత్రం చేసిపెడదాం అందరం కలిసి అని ఒప్పించారు. సలీమ్-జావెద్లని కలిస్తే ఎలాగా కంచి గరుడ సేవే కాబట్టి అప్పటికే కంచికి వెళ్లిపోయిందనుకున్న ‘డాన్’ కథని చవకగా ఇచ్చేశారు. మూడేళ్లు నానా కష్టాలూ పడి ఫైనాన్స్‌లు సమ కూర్చుకుని చందర్ బారోత్ దర్శకుడిగా చిత్రాన్ని పూర్తిచేస్తే, ఈలోపు నారీమన్ ఇరానీ చనిపోయారు. చిత్రం మీద వచ్చే డబ్బు ఆయన భార్యకి చెందేలా ఏర్పాటు చేసి మొత్తానికి చిత్రాన్ని రిలీజ్ చేస్తే అట్టర్ ఫ్లాప్ టాక్. అయినా ఓపిగ్గా థియేటర్ల వాళ్లు అలాగే ఉంచితే, ఆ నోటా ఈ నోటా ‘ఖైకే పాన్ బనారస్ వాలా..’, ‘అరె దీవానో...’, ‘యే మేరా దిల్...’ పాటలు బాగా పాపులర్ అయిపోయాయి. దాంతో జనం థియేటర్లకు పరుగు తీశారు. ఆ దెబ్బకి సినిమా రెండో వారం నుంచి పికప్ అయ్యి, చివరికి పెద్ద హిట్టయ్యి కూచుంది. సినిమాలో సెకండాఫ్ ట్విస్టులతో చాలా హెవీ అయిపోయింది కాబట్టి ప్రేక్షకుడికి రిలీఫ్ కోసం ఒక పాట పెట్టమని రషెస్ చూసిన మనోజ్‌కుమార్ సలహా ఇస్తే, అప్పుడు ఆలోచించి పెట్టిన పాటే ‘ఖైకే పాన్ బనారస్ వాలా’. చివరికి అదే ఈ చిత్రాన్ని పైలట్‌లా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లింది. తర్వాత ఇదే డాన్ 2006లో ఓ కొత్త రికార్డు నెలకొల్పాడు. జావేద్ అక్తర్ కొడుకు ఫర్హాన్ అక్తర్ దర్శకుడిగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో ‘డాన్’ మరో సారి వచ్చింది. మళ్లీ సూపర్ హిట్ అయ్యి కూర్చుంది. డాన్ని పట్టుకోవడం కష్టం కాదు అసాధ్యం అనుకుంటే కమర్షియల్ సినీ అభిమానులు ఆ డాన్ని అలవోకగా అభిమానంతో పట్టేశారు. గుండెల్లో దాచేశారు. ఇది చేసిన ఆర్టిస్టుల గొప్పదనం కాదు. తీసిన దర్శకుల గొప్పదనం కాదు. నిర్మాతల ఘనత అంతకన్నా కాదు. ఇది పూర్తిగా రచయితల విజయం. అన్నీ అమరి, అందరూ అప్పు తీర్చడానికి నడుం కట్టి సినిమా చేస్తే, ఆ సంకల్ప బలం నారీమన్ అప్పుల్ని తీర్చింది గానీ, వేరే సినిమా షూటింగ్లో కెమెరామెన్‌గా యాక్సిడెంట్‌కి గురైతే ఆయన ప్రాణాల్ని కాపాడలేకపోయింది. జీనత్ అమన్ మాత్రం చాలా జెన్యూన్‌గా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు పారితోషికంగా. నిజమైన చారిటీ ఆమెదే. మొదటి డాన్ దర్శకుడు చందర్ తర్వాత చెప్పుకోదగ్గ చిత్రాలేవీ తీయలేదు. కానీ ‘డాన్’తో బాక్సాఫీస్‌ని అద్భుతంగా ప్రభావితం చేసి, ‘డాన్’ డెరైక్టర్‌గా మిగిలిపోయారు. ‘డాన్’ హీరోయిజమ్, విలనిజమ్ రెండు షేడ్సూ హీరోలకి మాస్ ఇమేజ్‌ని పెంచే క్యారెక్టర్లుగా మిగిలి పోయాయి. ఎనిమిదిన్నర కోట్ల బడ్జెట్‌తో తీస్తే డెబ్భై కోట్లు వసూలు చేసింది. ఇక షారుఖ్ ‘డాన్’ అరవై కోట్ల ఖర్చుతో తీస్తే నూట అయిదు కోట్లు వసూలు చేసింది. 78లోనే తెలుగులో ఎన్టీఆర్ ‘యుగంధర్’గా, తమిళంలో రజనీకాంత్ ‘డాన్’ పేరుతో ఈ హిందీ ‘డాన్’ని రీమేక్ చేసి హిట్టు కొట్టారు. మళ్లీ 2006లో షారుఖ్ ‘డాన్’ని తమిళంలో విష్ణువర్థన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘బిల్లా’ పేరుతో, తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘బిల్లా’ పేరుతో రీమేక్ చేసి హిట్టు కొట్టారు. షారుఖ్ పక్కన ప్రియాంకా చోప్రా అందాలు ఆరబోస్తే, అజిత్ పక్కన నయనతార, ప్రభాస్ పక్కన అనుష్క ఎప్పుడూ లేనంత గ్లామరస్‌గా కనిపించి ప్రేక్షకుల మతులు పోగొట్టారు. షారుఖ్ ‘డాన్’లో ఫర్హాన్ అక్తర్ టేకింగ్ స్టైల్ చాలా బావుంటుంది. అమితాబ్ లాంటి హీరో సినిమాని ఎవరు చేసినా సాధారణంగా చూడబుద్ధి కాదు. అలా చూసుకుంటే షారుఖ్ కొంత కొరతగా అనిపించవచ్చు గానీ, ఆ పోలిక లేకుంటే షారుఖ్ కూడా ప్రేక్షకుల్ని బాగా మెప్పించినట్టే. కొత్త డాన్ హిట్ కావడానికి షారుఖ్ ఇమేజ్ బాగా పని చేసిందన్నది కాదనలేని వాస్తవం. పాటల్లో కూడా ‘ఖైకే పాన్ బనారస్ వాలా’, ‘యే మేరా దిల్’ని రీమిక్స్ చేసి మంచి పనిచేశారు దర్శకుడు ఫర్హాన్. హెలెన్ పోషించిన కామిని పాత్రని కరీనా కపూర్ పోషించడం సినిమాకి పెద్ద అట్రాక్షన్. అర్జున్ రామ్‌పాల్ పోషించిన జస్జీత్ పాత్ర చేయమని మొదట అక్షయ్ కుమార్‌ని అడిగితే, ‘డాన్’ పాత్ర అయితే చేస్తాను తప్ప వేరే పాత్ర చేయనన్నాట్ట. దాంతో అది అర్జున్‌కి దక్కింది. 78లో సలీమ్ - జావెద్ ఊహించిన ‘డాన్’ పాత్ర చిత్రణ, దాని నడవడిక, అందులో వచ్చిన ట్విస్ట్‌లు, పాత్రల స్వభావం కోసం వారు రాసిన మాస్, పంచ్ డైలాగులు... ఇవన్నీ 2006లో కూడా యథాతథంగా అంతే మోడరన్‌గా, స్టైలిష్‌గా ఉన్నాయి. ప్రేక్షకులను అంతే ఆకట్టుకుఆన్నయి. అంటే ఒరిజినల్ ఆలోచన ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు. మేధస్సంటే అదే. కాయితం మీద ఇలాంటి చిత్రాన్ని ఇంత బలంగా సృష్టించడం. దురదృష్టమంటే కూడా ఇదే. అంత పెద్ద రచయితలు కూడా ఇలాంటి స్క్రిప్టుతో ఎవరినీ ఒప్పించలేక పోవడం. అదృష్టమంటే ఆడియన్స్దే. ఏదో ఒకలా ఒక బలమైన సంకల్పం మూడున్నరేళ్లు కష్టపడి వెండితెరమీద బొమ్మైపడడం. అది మనసుల్ని రంజింపజేయడం. ఎంతమంది కథకులు నేర్చుకోవాల్సిన విషయాలున్నాయో ‘డాన్’ స్క్రిప్టులో అడుగడుగునా. ఈ ‘డాన్’ సక్సెస్ హాలీవుడ్లో ఒక చిత్రాన్ని ఇన్స్పైర్ చేసింది. కానీ అది ఆడలేదు. ఇదే సక్సెస్ రేఖ హీరోయిన్గా ‘మేడమ్ గీ’ పేరుతో ఇంకో చిత్రం రూపొందడానికి కూడా కారణమయ్యింది. అదీ ఆడలేదు. ఇలా ప్రభావితమై కొత్తగా రాసుకుని తీసిన చిత్రాలన్నీ ఫెయిలయ్యాయి. యథాతథంగా రీమేక్ చేసిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అందుకే అన్నాను ఇది రచయితల విజయం అని. ‘దేడ్ కహానీ’ అని దశాబ్దంన్నర కాలంలో బాలీవుడ్ సూపర్ హిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! 2000 నుంచి 2006 వరకూ నేను ప్రస్తావించిన ప్రతీ చిత్రమూ పాత కథే. అత్యంత పాత కథ షేక్స్పియర్ది (1595). అంటే ఒకటిన్నర దశాబ్ద కాలంలో బాలీవుడ్లో చిత్రాలుగా వచ్చిన కథలన్నీ మ్యాగ్జిమమ్ నాలుగు వేల సంవత్సరాల పాతవన్నమాట. కావాలంటే వెనక్కెళ్లి మళ్లీ అన్ని ఆర్టికల్సూ చూడండి... మీకే తెలుస్తుంది!