చెన్నై ,పెరంబూరు: ప్రముఖ వైల్డ్ ఫిలిం మేకర్, ఛాయాగ్రహకుడు నల్లముత్తుకు జాతీయ అవార్డు వరించింది. 66వ జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సారి తమిళనాడుకు జాతీయ అవార్డుల విషయంలో తీవ్ర నిరాశనే కలిగించింది. బారం అనే ఒక్క చిత్రానికే ఉత్తమ చిత్ర అవార్డు లభించింది. ఈ చిత్రం ఇంకా తెరపైకి రాలేదు. కాగా కొంతలో కొంత మెరుగైన విషయం ఏమిటంటే చెన్నైకి చెందిన ప్రముఖ వైల్డ్ ఫిలిం మేకర్, కేమెరామెన్ నల్లముత్తుకు మచిలీ అనే డాక్యుమెంటరీ చిత్రానికి గానూ జాతీయ అవార్డు వరించింది.
ఈయన పూర్తి పేరు నల్లముత్తు అన్విట అదేష్రా. నల్లముత్తు టైగర్ సెంట్రిక్ డాక్యుమెంటరీ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట. ఆరంభంలో నిశ్చల చాయాగ్రహకుడిగా ఇస్రోలో పని చేసిన నల్లముత్తు ఆ తరువాత ఫిలిం డివిజన్‌లో పని చేశారు. ఈయన పలు ఇండిస్ట్రీస్‌కు, పలు డైరెక్టర్స్‌తోనూ, వరల్డ్ వైడ్ నెట్‌వర్క్స్‌తోనూ పని చేశారు. అదే విధంగా నేషనల్ జాగ్రఫిక్ చానల్, బీబీసీ, డిస్కవరీ ఛానల్ 4, యానిమల్ ప్లానెట్, స్టార్ టీవీ, దూరదర్శన్ వంటి చానళ్లకు వైల్డ్ ఫిలిం మేకర్‌గా పని చేశారు. ఇండియాలోనే ఫస్ట్ అండ్ లార్జెస్ట్ రన్నింగ్ పాండా అవార్డును అందుకున్న నల్లముత్తు తాజాగా మచిలీ అనే డాక్యుమెంట్ చిత్రానికిగానూ బెస్ట్ ఎన్నిరాన్‌మెంట్ కేటగిరీలో జాతీయ అవార్డును గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment