ట్వీట్‌ ఎఫెక్ట్‌ : చిక్కుల్లో స్టార్‌ సినిమాటోగ్రాఫర్‌ | Santhosh Sivan Tweet Lands Him In Trouble With Producers | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 19 2018 12:13 PM | Last Updated on Wed, Sep 19 2018 2:21 PM

Santhosh Sivan Tweet Lands Him In Trouble With Producers - Sakshi

ఎన్నో అద్భుత చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన టాప్‌ కెమెరామేన్‌ సంతోష్‌ శివన్‌ వివాదాంలో చిక్కుకున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో పాటు దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని కూడా అందుకున్న ఈ గ్రేట్‌ టెక్నీషియన్‌, తను చేసిన ఓ ట్వీట్ కారణంగా చిక్కుల్లో పడ్డారు. నిర్మాతలను ఉద్దేశిస్తూ క్రియేట్‌ చేసిన ఓ వివాదాస్పద మెమెను సంతోష్ శివన్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేశారు.

ఈ మెమెలో సాంకేతిక నిపుణులకు నిర్మాతలు డబ్బులిచ్చేప్పుడు అంటూ కోపంగా ఉన్న కుక్క ఫొటో, హీరోయిన్‌లకు డబ్బులిచ్చేప్పుడు నిర్మాతలు అంటూ ప్రశాంతంగా ఉన్న కుక్క ఫొటోతో తయారు చేశారు. ఈ ఫొటో సంతోష్‌ శివన్‌ ట్విటర్‌ అకౌంట్‌ తో దర్శనమివ్వటంతో వివాదం మొదలైంది. దీంతో పలువురు నిర్మాతల ఈ స్టార్‌ సినిమాటోగ్రాఫర్‌పై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సంతోష్ ట్వీట్‌ను డిలీట్‌ చేసినా అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. ఈ రోజు (బుధవారం) సమావేశం కానున్న నిర్మాతల మండలి ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement