Santosh Sivan
-
వింతైన వాస్తవాలు
నితిన్ ప్రసన్న, ప్రీతీ అశ్రాని జంటగా నటించిన థ్రిల్లర్ చిత్రం ‘ఏ’ (ఏడీ ఇన్ఫినిటమ్). ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ విడుదల చేశారు. ‘కొన్నిసార్లు కల్పితాల కన్నా వాస్తవాలే వింతగా ఉంటాయి’ అనే కోట్ టీజర్లో ఉంది. ‘‘తొలి చిత్రంలోనే నితిన్ ప్రసన్న మూడు విభిన్నమైన పాత్రలను పోషించారు. ప్రముఖ ఫిలిం మేకర్ సింగీతం శ్రీనివాస్గారిని∙ప్రేరణగా తీసుకుని దర్శకుడు యుగంధర్ మంచి సాంకేతిక నిపుణులను తీసుకున్నారు. ఈ సినిమాకు విజయ్ కురాకుల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలను అనంత శ్రీరామ్ రాయగా దీపు, పావని ఆలపించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు కెమెరా: ప్రవీణ్ కె బంగారి, సౌండ్ మిక్సింగ్: సినాయ్ జోసెఫ్. -
సంతోష్ శివన్ చేతుల మీదుగా ‘ఏ’ టీజర్
నితిన్ ప్రసన్న, ప్రీతీ అశ్రాని, స్నేహల్ కమత్, బేబీ దీవెన, రంగాథం, కృష్ణవేణి, భరద్వాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన మెడికల్ థ్రిల్లర్ చిత్రం ‘ఏ (ఏ డి ఇన్ఫినిటమ్)’. అవంతిక ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ విడుదల చేశారు. (బుట్టబొమ్మ ఇష్టపడే క్రికెటర్ ఎవరో తెలుసా!) 55 సెకన్ల నిడివి గల ఈ టీజర్ అద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. సంతోషంగా ఉన్న కుటుంబంలో పాప కనపడకపోవడం ఆందోళన కలిగిస్తుంది. పాపను ఎవరు కిడ్నాప్ చేశారు, ఎలా మిస్ అయింది అనే విషయాలపై టీజర్ ద్వారా సస్పెన్స్‌ని కలిగించారు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడే సినీ ప్రేక్షకులు ఈ టీజర్‌ను తెగ లైక్ చేస్తున్నారు. దీంతో ఈ టీజర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి విజయ్ కురాకుల సంగీతాన్ని అందిస్తున్నారు. (కాంబినేషన్ ఫిక్స్?) -
షూటింగ్లో గాయపడ్డ హీరోయిన్
సీనియర్ హీరోయిన్ మంజు వారియర్ షూటింగ్లో గాయపడ్డారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ చిత్రం జాక్ అండ్ జిల్ షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా మంజు గాయాలపాలవ్వటంతో వెంటనే ఆమెను దగ్గరల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తలకి బలమైన గాయం కావటంతో కుట్లు వేసినట్టుగా తెలుస్తోంది. మంజు పూర్తిగా కోలుకున్న తరువాతే తిరిగి షూటింగ్ హాజరవుతారని చిత్రయూనిట్ వెల్లడించారు. థిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న జాక్ అండ్ జిల్ సినిమాలో కాళిదాస్ జయరామ్ హీరోగా నటిస్తున్నాడు. -
ట్వీట్ ఎఫెక్ట్ : చిక్కుల్లో స్టార్ సినిమాటోగ్రాఫర్
ఎన్నో అద్భుత చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన టాప్ కెమెరామేన్ సంతోష్ శివన్ వివాదాంలో చిక్కుకున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో పాటు దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని కూడా అందుకున్న ఈ గ్రేట్ టెక్నీషియన్, తను చేసిన ఓ ట్వీట్ కారణంగా చిక్కుల్లో పడ్డారు. నిర్మాతలను ఉద్దేశిస్తూ క్రియేట్ చేసిన ఓ వివాదాస్పద మెమెను సంతోష్ శివన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ మెమెలో సాంకేతిక నిపుణులకు నిర్మాతలు డబ్బులిచ్చేప్పుడు అంటూ కోపంగా ఉన్న కుక్క ఫొటో, హీరోయిన్లకు డబ్బులిచ్చేప్పుడు నిర్మాతలు అంటూ ప్రశాంతంగా ఉన్న కుక్క ఫొటోతో తయారు చేశారు. ఈ ఫొటో సంతోష్ శివన్ ట్విటర్ అకౌంట్ తో దర్శనమివ్వటంతో వివాదం మొదలైంది. దీంతో పలువురు నిర్మాతల ఈ స్టార్ సినిమాటోగ్రాఫర్‌పై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సంతోష్ ట్వీట్‌ను డిలీట్ చేసినా అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. ఈ రోజు (బుధవారం) సమావేశం కానున్న నిర్మాతల మండలి ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. -
కల నిజమైంది
ప్రముఖ మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాతృభాషలో మాత్రమే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ నటించి, మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. గాయకుడిగా కూడా మలయాళంలో పేరుంది. ఇప్పుడు మరో కొత్త అడుగు వేశారాయన. సినీ నిర్మాతగా మారారు. ‘పృథ్వీరాజ్ ప్రొడక్షన్ హౌస్’ను స్టార్ట్ చేసినట్లు ఆయన ప్రకటించారు. ‘‘మా కొత్త కలను నిజం చేసుకోవడానికి నేను, నా భార్య సుప్రియ ఏడాది నుంచి కష్టపడుతున్నాం. పృథ్వీరాజ్ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేశామని చెప్పడానికి ఆనందపడుతున్నాను. ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేయడానికి సంవత్సరం టైమ్ ఎందుకు పట్టింది? సమ్‌థింగ్ స్పెషల్‌గా ఏం చేయబోతున్నాం? అనే మరికొన్ని ప్రశ్నలకు త్వరలోనే మేము అనౌన్స్ చేయబోయే ప్రాజెక్ట్స్ ద్వారా సమాధానాలు దొరుకుతాయి. నా వంతుగా మలయాళ ఇండస్ట్రీకి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. న్యూ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసే క్రమంలో వ్యాపారవేత్త షాజి నడేశన్, కెమెరామేన్ సంతోష్ శివన్ ఎంతో సహకరించారు. నేను నిర్మాతగా బుడి బుడి అడుగులు వేయాలనుకున్నప్పుడు నా వేలు పట్టుకుని, నేను ప్రొడక్షన్ హౌస్ ప్రకటించేవరకూ ఈ ఇద్దరూ నాతో ఉన్నారు. వారికే కాదు సినిమా అంటే ఏంటో నేను తెలుసుకునే ప్రయాణంలో నాకు తోడుగా ఉండి, సహకరించిన అందరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు పృథ్వీరాజ్. -
మిస్టర్ జేమ్స్!
మలయాళ ఇండస్ట్రీలో మమ్ముట్టి సూపర్ స్టార్ అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన ఓ నూతన దర్శకుడికి, అది కూడా ఓ కెమెరామేన్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అందుకే కెమెరామేన్ శ్యామ్‌దత్ సైనుద్దీన్ దర్శకత్వంలో ఆయన చేస్తోన్న ‘స్ట్రీట్‌లైట్స్’ సినిమా హాట్ టాపిక్ అయింది. తెలుగులో వచ్చిన ‘ప్రస్థానం’, ‘ఆవకాయ బిర్యానీ’ సినిమాలకు కెమెరామేన్‌గా వర్క్ చేశారు శ్యామ్‌దత్. ఆయన చెప్పిన కంటెంట్‌లో దమ్ము ఉంది కాబట్టే మమ్ముట్టి ఈ సినిమా చేస్తున్నారని మాలీవుడ్ వారు అంటున్నారు. ఈ సినిమాలో జేమ్స్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్ క్యారెక్టర్లో మమ్ముట్టి నటిస్తున్నారు. క్రైమ్ అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుందట. వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సంగతి అలా ఉంచితే సీనియర్ కెమెరామేన్–డైరెక్టర్ సంతోష్ శివన్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా ఓ సినిమా స్టార్ట్ కానుంది. ఈ సినిమా షూటింగ్ జనవరిలో స్టార్ట్ అవుతుందని సమాచారం. ఈ సినిమా 16వ శతాబ్దపు బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందట. సంతోష్ శివన్ ఆల్రెడీ ‘ఉరిమి’, ‘ఆనందభాద్ర’ చిత్రాలను మలయాళంలో డైరెక్ట్ చేశారు. అన్నట్లు.. మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘స్పైడర్’ సినిమాకు సంతోష్శివన్నే సినిమాటోగ్రఫర్. -
'మా సినిమా ఏ ప్రభుత్వాలను గాయపరచలేదు'
తమిళనాట సంచలనంగా మారిన మెర్సల్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. చిత్ర నిర్మాతలు అభ్యంతరకర అంశాలను తొలగించేందుకు అంగీకరించినా వివాదం సద్ధుమణగటం లేదు. మరోవైపు కాంట్రవర్సీలతో సంబంధం లేకుండా ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. సినీ ప్రముఖుల నుంచి కూడా మెర్సల్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్.. మెర్సల్ సినిమాకు మద్ధతుగా ట్వీట్ చేయగా తాజాగా మరో సినీ ప్రముఖుడు మెర్సల్ వివాదంపై ఆసక్తికరంగా స్పందించారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు సంతోష్ శివన్.. మెర్సల్ సినిమాను ఉద్దేశిస్తూ ఆసక్తికరమైన ట్వీట్ ను తన ట్విట్టర్ పేజ్ లో షేర్ చేశారు. 'ఇక మీదట సినిమాలకు కొత్త స్టాట్యూటరి వార్నింగ్ వేయాలేమో.. తమ సినిమా నిర్మాణంలో ఏ ప్రభుత్వాలను గాయపరచలేదు అని' అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ట్వీట్ స్క్రీన్ షాట్ ను తన పేజ్ లో పోస్ట్ చేశారు. pic.twitter.com/bwEhrD2OoS — SantoshSivanASC. ISC (@santoshsivan) 22 October 2017 -
'మహేష్ బాబు స్టార్ పవర్ అపారం'
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్ బాబుపై ఆ చిత్ర సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆయన స్టార్ పవర్ అపారం అని ఆయనతో కలిసి పనిచేయటం ఆనందంగా ఉందని తెలిపాడు. గత మూడు వారాలుగా చెన్నైలోని ఇవిపి వరల్డ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తుండగా మహేష్ ఆఫీస్ కు సంబందించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మహేష్ తో తొలిసారిగా వర్క్ చేస్తున్న సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్, సూపర్ స్టార్ ఎనర్జీ అద్భుతమంటూ ఆకాశానికెత్తేశాడు. మహేష్ ఇక్కడ షూటింగ్ చేయటం చెన్నై కే కొత్త ఎనర్జీ తీసుకొచ్చింది. ఇంత భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న సినిమా కమర్షియల్ గా కూడా సరికొత్త రికార్డ్ లు సృష్టించనుందన్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు నటుడు ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్నాడు. -
మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్: సంతోష్
చెన్నై : ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు ఓ చిత్రం చేయనున్నారు. ఆ చిత్రం 2016లో షూటింగ్ జరుపుకోనుంది. ఈ మేరకు ప్రముఖ ఛాయగ్రాహకుడు సంతోష్ శివన్ గురువారం ట్విట్టర్లో వెల్లడించారు. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు హరీశ్ జైరాజ్ సంగీతాన్ని అందించనున్నారు. అయితే ఇదే చిత్రాన్ని తమిళంలో విజయతో చిత్రీకరించనున్నారని సమాచారం. మురుగుదాస్ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ గతంలో రెండు చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం మురుగదాస్... సోనాక్షి సిన్హా నటిస్తున్న అకీరాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్దం తర్వాత మురుగుదాస్ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. -
సినిమా రివ్యూ: సికిందర్
నటీనటులు: సూర్య, సమంత, మనోజ్ బాజ్ పాయ్, విద్యుత్ జమ్వాల్, దిలీప్ తాహిల్, రాజ్ పాల్ యాదవ్ ఫోటోగ్రఫి: సంతోష్ శివన్ సంగీతం: యువన్ శంకర్ రాజా ఎడిటింగ్: ఆంథోని నిర్మాత: లగడపాటి శ్రీధర్, సుభాష్ చంద్రబోస్, సిద్దార్థ్ రాయ్ కపూర్ దర్శకత్వం: లింగుస్వామి రాజు భాయ్ (సూర్య) ముంబైలో ఓ మాఫియా డాన్. రాజుభాయ్ ను వెతుక్కుంటూ కృష్ణ (సూర్య) వైజాగ్ నుంచి ముంబైకి చేరుకుంటాడు. ముంబైలో రాజు భాయ్, అతని స్నేహితుడు చందు (విద్యుత్ జమ్వాల్) ల స్నేహం, మాఫియా సామ్రాజ్యం గురించి కృష్ణకు తెలుస్తుంది. రాజు భాయ్ స్నేహితుడు చందును ముంబైని శాసించే ఇమ్రాన్ భాయ్ (మనోజ్ బాజ్ పాయ్) చంపేస్తాడు. తన గ్రూప్ లో కొందరు చేసిన నమ్మక ద్రోహా వల్లే చందు మరణానికి కారణమని రాజుభాయ్ తెలుసుకుంటాడు. అయితే రాజుభాయ్ ని కూడా ఇమ్రాన్ గ్రూప్ కాల్చేస్తుంది. ఇమ్రాన్ గ్రూప్ జరిపిన కాల్పుల్లో గాయపడిన రాజుభాయ్ ఏమయ్యాడు? రాజుభాయ్ ను కృష్ణ కలిశాడా? రాజుభాయ్, కృష్ణను ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడు? ఇమ్రాన్ భాయ్ మాఫియా సామ్రాజ్యానికి ఎవరు చెక్ పెట్టారు? తన స్నేహితుడు చందు మరణానికి రాజుభాయ్ ప్రతీకారం తీర్చుకున్నాడా అనే ప్రశ్నలకు సమాధానమే 'సికిందర్' చిత్ర కథ. నటీనటుల, సాంకేతిక వర్గాల పనితీరు: ఎన్నో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్న సూర్య ఈ చిత్రంలో రాజుభాయ్, కృష్ణ అనే రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఈ చిత్రంలో రాజుభాయ్, కృష్ణ పాత్రలను సూర్య సమర్ధవంతంగా పోషించాడు. రెండు పాత్రల్లోనూ తన మార్కును ప్రదర్శించాడు. గత చిత్రాల్లోని పాత్రలను పోల్చుకుంటే రాజుభాయ్, కృష్ణ పాత్రలు సూర్య కెరీర్ లోనే సాదా సీదా పాత్రలని చెప్పవచ్చు. సూర్య ప్రేయసిగా సమంత నటించింది. ఈ చిత్రంలో సమంత పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు కాని.. ఓ అడుగు ముందుకేసి.. పరిమితుల్లేకుండా గ్లామర్ ను ప్రదర్శించింది. సమంత కొన్ని సన్నివేశాల్లో హాట్ హాట్ గా కనిపించింది. విద్యుత్ జమ్వాల్, మనోజ్ బాజ్ పాయ్, బ్రహ్మనందం పాత్రలు అంతంత మాత్రమే. సంతోష్ శివన్ ఫోట్రోగ్రఫి, యువన్ శంకర్ రాజా సంగీతం, ఆంథోని ఎడిటింగ్ పర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది. సమీక్ష: సూర్య గత చిత్రాలకు కథ, కథనాలే ప్రధానం. అయితే సికిందర్ చిత్ర కథ, కథనాలు గతంలోని సూర్య సినిమాలకు విభిన్నంగా కనిపిస్తుంది. సికిందర్ చిత్రంలో ఎలాంటి కొత్తదనం కనిపించకపోగా... కథనంలో దమ్ములేకపోవడం ప్రేక్షకుల్ని అసహనానికి గురిచేస్తుంది. ఇక రెండవ భాగంలో ఈ సాగతీత ఎక్కువగానే అనిపించింది. సుమారు మూడు గంటల సినిమాలో ఎక్కడా ప్రేక్షకుడు ఫీలయ్యే సన్నివేశాలు, వినోద సన్నివేశాలూ ఎక్కడా కనిపించవు. ఏదో సినిమా నడుస్తుందనే ధోరణి కనిపిస్తుంటుంది. కథ బలహీనంగా ఉండటమనే అంశం మిగితా విభాగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపించింది. ఓవరాల్ గా సూర్యను సికిందర్ గా చూపించాలని దర్శకుడు లింగుస్వామి చేసిన ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. సగటు ప్రేక్షకులు ఆదరించడంపైనే సికిందర్ విజయం ఆధారపడి ఉంటుంది. పేలవమైన కథ, కథనాలు సూర్యను సికిందర్ గా నిలబెట్టడం అనేది కష్టమైనదే అని చెప్పవచ్చు. -రాజబాబు అనుముల -
ఆగస్ట్ 15న అంజాన్
అంజాన్ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. సింగం-2 తరువాత సూర్య నటిస్తున్న చిత్రం అంజాన్. ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న చిత్రం ఇది. సూర్య, దర్శకుడు లింగుసామిల తొలి కలయికతో తెరకెక్కుతున్న చిత్రం అంజాన్. అలాగే చెన్నై చిన్నది సమంత తొలిసారిగా సూర్యతో రొమాన్స్ చేస్తున్న చిత్రం ఇదే. చిత్రంలో సూర్య గెటప్ కూడా చాలా కొత్తగా ఉందంటున్నారు చిత్ర యూనిట్. సంతోష్ శివన్ చాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతం హైలైట్‌గా ఉండబోతున్న అంజాన్ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా చిత్రం షూటింగ్ పూర్తయ్యిందని, ఆ ఒక్క పాటను ఈ నెల 8న గోవాలో చిత్రీకరించనున్నట్లు దర్శకుడు లింగుసామి తెలిపారు. ఇది సూర్య సమంతలపై చిత్రీకరించనున్న రొమాన్సింగ్ గీతం అని చెప్పారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జూలైలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డబ్బింగ్ తదితర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నా ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
నిరసనల సెగలో ఓ తమిళ సినిమా
సుప్రసిద్ధ ఛాయాగ్రాహక - దర్శకుడు సంతోష్ శివన్ తాజా తమిళ చిత్రం ‘ఇనమ్’ (హిందీ వెర్షన్ పేరు ‘సిలోన్’) ఇప్పుడు వివాదాలకు నిలయమైంది. మార్చి ఆఖరు శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమా ప్రదర్శన పలు తమిళ సంఘాల నిరసనలతో ముచ్చటగా మూడు రోజులకే ఆగిపోయింది. సోమవారం నుంచి ఈ సినిమా ప్రదర్శనను ఉపసంహరించుకోవడం గమనార్హం. శ్రీలంక అంతర్యుద్ధంలో చిక్కుకుపోయి, అనాథలుగా మారిన కొంతమంది జీవితాల చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. శ్రీలంకలోని పరిణామాలతో అస్తవ్యస్తమైన అక్కడి తమిళుల జీవితాలను గుర్తుచేసే ఈ సినిమా పంపిణీ హక్కులను మరో ప్రముఖ తమిళ దర్శక - నిర్మాత లింగుస్వామి కొనుగోలు చేశారు. తీరా తాజా వివాదాలతో హాళ్ళ నుంచి ఈ సినిమాను ఉపసంహరించుకోవాల్సి వచ్చినట్లు ఆయన ప్రకటించారు. దాంతో, తమిళనాట రాజకీయాల ద్వారా వచ్చే ఒత్తిళ్ళు సినీ రంగంపై ఏ మేరకు ఉంటాయన్నది మరోసారి తేటతెల్లమైంది. సింహళీయులకు అనుకూలంగానూ, శ్రీలంకలోని ఈలమ్ తమిళులకు వ్యతిరేకంగానూ ఉందంటూ తమిళ రాజకీయ నాయకుడు, ఎం.డి.ఎం.కె. అధినేత వైకో ఈ సినిమాలోని సన్నివేశాలను చీల్చిచెండాడారు. మరికొన్ని తమిళ ఉద్యమకారులైతే పాండిచ్చేరీలో ‘ఇనమ్’ను ప్రదర్శిస్తున్న థియేటర్లపై దాడి చేశారు. నిషేధించాలంటూ పిలుపు నిచ్చారు. దాంతో, తమిళ సినిమా ప్రదర్శనను దేశవ్యాప్తంగా ఆపివేస్తున్నట్లు లింగుస్వామి హడావిడిగా ప్రకటించాల్సి వచ్చింది. ‘‘మంచి సినిమాలంటే ఇష్టపడే వ్యక్తిగా ‘ఇనమ్’ చిత్రాన్ని నేను పంపిణీ చేశాను. అంతేతప్ప, తమిళ సోదరుల భావోద్వేగాలను దెబ్బతీయాలనో, ఈ సినిమా ద్వారా లాభాలు కూడబెట్టుకోవాలనో నాకు ఏ కోశానా లేదు. కానీ, దురదృష్టవశాత్తూ కొన్ని సంఘాలు ఏకంగా తమిళుల పట్ల నాకున్న ప్రేమాభిమానాల పట్ల సందేహాలు వ్యక్తం చేశాయి. అది నన్ను బాధించింది’’అని ఆయన తన బాధను వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల జరగనున్న ఈ సమయంలో ‘‘జనంలో గందరగోళం సృష్టించకూడదనుకున్నా. అందుకే, ప్రదర్శనను ఆపివేస్తున్నా’’ అని చెప్పారు. సీనియర్ తెలుగు - తమిళ నటి సరిత, ఇంకా కరుణాస్, కరణ్ కీలకపాత్రలు పోషించిన ‘ఇనమ్’కు మళ్ళీ తెరపై మోక్షమెప్పుడో తెలీదు. సెన్సారైనా ఇక్కట్లే! నిజానికి, అంతర్జాతీయ ఖ్యాతికెక్కిన సినీ సృజనశీలి సంతోష్ శివన్ ఈ వాస్తవ కథా చిత్రంతో రిలీజ్‌కు ముందు నుంచి వార్తల్లో నిలిచారు. చెన్నైతో పాటు ముంబయ్ లాంటి చోట్ల కూడా సినిమా ప్రివ్యూలు ఏర్పాటు చేసి, వైరముత్తు, శేఖర్ కపూర్ లాంటి తమిళ, హిందీ సినీ ప్రముఖులకు ముందుగానే సినిమా చూపించారు. ఈ సినిమాకు మొత్తం మీద సానుకూలమైన స్పందన, సమీక్షలే వచ్చాయి. అయితే, వారి సూచనల మేరకు సినిమాలో కొన్ని డైలాగులనూ, నాలుగైదు దృశ్యాలనూ కూడా స్వచ్ఛందంగా తొలగించారు. అయినప్పటికీ, ఇప్పుడీ సినిమా వివాదాల్లో పడింది. ఆ మాటకొస్తే, ‘ఇనమ్’ సినిమాను సెన్సార్ బోర్డు చూసి, ప్రదర్శన యోగ్యమైందంటూ సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రభుత్వం ఈ చిత్రానికి ‘పన్ను మినహాయింపు’ ప్రకటించింది. కానీ, తీరా సెంటిమెంట్లు దెబ్బతిన్నాయంటూ కొన్ని తమిళ బృందాలు నిరసన తెలపడంతో కథ అడ్డం తిరిగింది. ఏమిటీ వివాదం? మలయాళీ మూలాలున్న సంతోష్ శివన్ ఉద్దేశపూర్వకంగానే తన చిత్రాల్లో పదే పదే ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్’ (ఎల్.టి.టి.ఇ)ను కించపరిచేలా చూపిస్తున్నారంటూ వైకో లాంటివారు ఆరోపిస్తున్నారు. శివన్ తన గత చిత్రం ‘టైస్ట్’లో ఎల్.టి.టి.ఇ.కి చెందిన ఆత్మాహుతి దళ సభ్యురాలైన ఓ మహిళ ఏ రకంగా ప్రాణత్యాగానికి సిద్ధమవుతుందో చూపారు. చిన్నపిల్లలను ఎల్.టి. టి.ఇ. పోరాట యోధులుగా మారుస్తోందనీ, అలాగే శ్రీలంక బౌద్ధ సన్న్యాసులు దయార్ద్ర హృదయులనీ సంతోష్ శివన్ తన చిత్రాల్లో చూపడాన్ని కూడా ఉద్యమకారులు తప్పుబడుతున్నారు. ఇదే పద్ధతిలో తమిళుడు ఎవరైనా ముందుకొచ్చి మలయాళీలను కించపరుస్తూ సినిమా తీసి, కేరళలో ప్రదర్శిస్తే, మలయాళీలు ఊరకుంటారా అని ఆగ్రహించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారీ ఆర్థిక నష్టానికి కూడా సిద్ధపడి, నిర్మాతలు సినిమా ప్రదర్శనను ఆపుచేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించడానికి సంతోష్ శివన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. ఒక్కసారి గతంలోకి వెళితే, గడచిన ఏడాది పైచిలుకు కాలంలో తమిళనాట కమలహాసన్ ‘విశ్వరూపం’, రాజీవ్ గాంధీ హత్యోదంతం ఆధారంగా వచ్చిన హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’, హీరో విజయ్ నటించిన ‘తలైవా‘ (తెలుగులో ‘అన్న’) లాంటివి సెన్సార్ జరుపుకొని కూడా రిలీజ్‌కు ముందు నిరసనలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ‘ఇనమ్’ చిత్రమైతే ఏకంగా రిలీజై కూడా, నిరసనలతో తెర మీద నుంచి పక్కకు తప్పించాల్సి రావడం విచిత్రం. -
ఇనమ్ మూవీ స్టిల్స్