
నితిన్ ప్రసన్న, ప్రీతీ అశ్రాని జంటగా నటించిన థ్రిల్లర్ చిత్రం ‘ఏ’ (ఏడీ ఇన్ఫినిటమ్). ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ విడుదల చేశారు. ‘కొన్నిసార్లు కల్పితాల కన్నా వాస్తవాలే వింతగా ఉంటాయి’ అనే కోట్ టీజర్‌లో ఉంది. ‘‘తొలి చిత్రంలోనే నితిన్ ప్రసన్న మూడు విభిన్నమైన పాత్రలను పోషించారు. ప్రముఖ ఫిలిం మేకర్ సింగీతం శ్రీనివాస్‌గారిని∙ప్రేరణగా తీసుకుని దర్శకుడు యుగంధర్ మంచి సాంకేతిక నిపుణులను తీసుకున్నారు. ఈ సినిమాకు విజయ్ కురాకుల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలను అనంత శ్రీరామ్ రాయగా దీపు, పావని ఆలపించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు కెమెరా: ప్రవీణ్ కె బంగారి, సౌండ్ మిక్సింగ్: సినాయ్ జోసెఫ్.
Comments
Please login to add a commentAdd a comment