ఆగస్ట్ 15న అంజాన్ | Anjaan to release on August 15, music in July | Sakshi
Sakshi News home page

ఆగస్ట్ 15న అంజాన్

Published Mon, Jun 2 2014 11:59 PM | Last Updated on Fri, Jul 12 2019 4:35 PM

ఆగస్ట్ 15న అంజాన్ - Sakshi

ఆగస్ట్ 15న అంజాన్

 అంజాన్ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. సింగం-2 తరువాత సూర్య నటిస్తున్న చిత్రం అంజాన్. ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న చిత్రం ఇది. సూర్య, దర్శకుడు లింగుసామిల తొలి కలయికతో తెరకెక్కుతున్న చిత్రం అంజాన్. అలాగే చెన్నై చిన్నది సమంత తొలిసారిగా సూర్యతో రొమాన్స్ చేస్తున్న చిత్రం ఇదే. చిత్రంలో సూర్య గెటప్ కూడా చాలా కొత్తగా ఉందంటున్నారు చిత్ర యూనిట్. సంతోష్ శివన్ చాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతం హైలైట్‌గా ఉండబోతున్న అంజాన్ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
 
 ఒక్క పాట మినహా చిత్రం షూటింగ్ పూర్తయ్యిందని, ఆ ఒక్క పాటను ఈ నెల 8న గోవాలో చిత్రీకరించనున్నట్లు దర్శకుడు లింగుసామి తెలిపారు. ఇది సూర్య సమంతలపై చిత్రీకరించనున్న రొమాన్సింగ్ గీతం అని చెప్పారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జూలైలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డబ్బింగ్ తదితర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నా ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement