Anjaan
-
ఒక్కరే చూడొద్దు
మనం ఏవిటేవిటో అనుకుంటాం.. మనం ఏకాకులం అని అనుకుంటాం! చాలాసార్లు ఏకాంతం కోరుకుంటాం.. ఎవరితోనూ ఏ కనెక్షన్ లేకుండా మన ప్లేస్‌లో మనం ఉంటే బాగుండూ అనుకుంటాం. అలా అనుకోకండి... ముందు టీవీ ఉండొచ్చు.. వెనకాల ఇంకెవరైనా ఉండొచ్చు!! అర్ధరాత్రి దాటింది.. తలుపు కొడ్తున్నారు! లోపల.. ఒళ్లో పిల్లాడిని పెట్టుకుని కునికిపాట్లు పడుతున్న తల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్లు తెరిచింది. ఇంకా తలుపు కొడ్తూనే ఉన్నారు. ఆ తల్లి వణికిపోతోంది. ‘‘మామయ్యా.. మామయ్యా...’’ పిలిచింది, వచ్చింది తన మామేమో అనుకొని. ప్రతిస్పందనగా తలుపు కొట్టిన చప్పుడే వినపడుతోంది. ఆమెలో భయం ఎక్కువైంది. ‘‘ఈ పూట పనిచేస్తే సర్పంచ్ డబ్బులిస్తానన్నాడు. రెండు రోజులకు సరిపడా సరుకులు తెస్తా..’’ అని చెప్పి వెళ్లాడు. ఇప్పటిదాకా తిరిగి రాలేదు. తలుపు కొడ్తున్న చప్పుడు ఆగలేదు. సొంత ఊళ్లో.. ఉన్న ఎకరం భూమిని ఆక్రమించి భర్తను చంపేశాడు భూస్వామి. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని చంటిబిడ్డను చంకనేసుకొని ఈ ఊరొచ్చిపడ్డారు తనూ, మామ. ఇక్కడేమో అంతా వింతగా ఉంది. ఈసారి తలుపు చప్పుడు మరింత గట్టిగా వినపడటంతో వర్తమానంలోకి వచ్చింది ఆమె. మామయ్యా అని పిలిచినా బదులు పలకట్లేదంటే.. తలుపు కొడ్తోంది వాళ్లేనా? నెమ్మదిగా వెళ్లి చూద్దామని అనుకునేలోపే.. ఆ గుడిసెలో ఉన్న గుడ్డి దీపం కాస్తా ఆరిపోయింది. ఇంతలోకే మోకాళ్ల మీద పాకుతూ ఆ ‘ముగ్గురు పిల్లలు’ తనను చుట్టుముట్టారు. అనుకున్నంతా అయింది. రాత్రి గడపవతల అన్నం పెట్టలేదు. తలుపు తట్టి మరీ లోపలికి వచ్చేశారు. తన చేతుల్లో ఉన్న పిల్లాడిని దగ్గరగా పొదివి పట్టుకునుంది. అయినా వాళ్లు వదలట్లేదు. బలంగా లాగుతున్నారు. తను ప్రతిఘటిస్తోంది. చేతుల మీద రక్కుతున్నారు. గట్టిగా అరుస్తూ పిల్లాడిని ఎత్తుకొని వాళ్ల నుంచి తప్పించుకోవడానికి గుడిసె దాటింది. పరిగెడుతూ పరిగెడుతూ ఓ చిన్న గుడి దగ్గర ఆగింది. ఆమె దేవుడి ప్రాంగణంలోకి వెళ్లేసరికి ఆ ముగ్గురూ నిరాశతో వెనుదిరిగారు. ఊరవతల.. పాడుబడిన ఇంట్లో ఆ పూటకి ఎలాగో గండం తప్పించుకుంది ఆ తల్లి. కానీ ఆ ఊళ్లో కొనసాగాలంటే ప్రతిరోజూ ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిందే. ఉదయమనగా వెళ్లిన మామ జాడలేడు. తెల్లవారే వరకు గడిపిన ఆమె వెలుతురు వెలువడ్డ మరుక్షణమే మామను వెదకడానికి బయలుదేరింది. ఊరవతల తాగి పడి ఉన్నాడు. లేపి.. గుడిసె దగ్గరకు తీసుకొచ్చి రాత్రి జరిగిన సంఘటనను మొరపెట్టుకుంది. అవి పిల్ల పిశాచాలు. వాటికి తిండి పెట్టకపోతే నా కొడుకుని పీక్కుతింటాయి అంటూ ఏడ్చింది. పిల్లా లేదు.. పిశాచమూ లేదు. అంతా భ్రమ. ఈ ఊళ్లోవాళ్లు మూర్ఖులు అని కొట్టిపారేశాడు ఇంకా మత్తు వదలని మామ. వచ్చిన డబ్బులతో తాగడమే కాక పిచ్చి వాగుడు వాగుతున్నావని తిట్టింది. కొడుకును అతనికి అప్పజెప్పి తను బయలుదేరింది. ఆ ఊళ్లోకి అడుగుపెట్టినప్పుడు నది దగ్గర ఆ ఊరు ఆవిడ చేసిన హెచ్చరిక గుర్తొచ్చింది. ‘‘ఈ ఊళ్లోకి కొత్తగా వచ్చినట్టున్నారు. మీకు తినడానికి ఉన్నా లేకపోయినా.. రాత్రి పడుకునే ముందు గడపవతల ప్లేట్లో అన్నం పెట్టడం మాత్రం మరిచిపోవద్దు. లేకపోతే మీ పిల్లాడి ప్రాణాలు పోతాయ్’’ అని. ‘‘ఎందుకలా?’’ అడిగింది. ‘‘తెలియదు. 70 ఏళ్లుగా సాగుతున్న ఆచారం. ఈ ఊరు చివరన ఉన్న పాడుబడ్డ ఇంట్లో మూడు పిల్ల పిశాచాలుంటాయి. రాత్రి అయిందంటే చాలు.. ఊరు మీదకొస్తాయి. ప్రతి గుమ్మం ముందున్న అన్నం తిని వెళ్లిపోతాయి లేకపోతే ఆ ఇంట్లో పిల్లల్ని మింగేస్తాయని చెప్తుంటారు’’ అని తనకు తెలిసింది చెప్పింది ఆవిడ. ఆ ప్రకారమే ఈ తల్లి ఊరవతల ఉన్న పాడుపడిన ఇంటికి వెళ్లింది. ఆ ఇంట్లో ఓ తల్లి చిన్న కుండలో చారెడు బియ్యంతోపాటు నూరిపెట్టిన గన్నేరు పప్పు ముద్దనూ వేసి గంజి కాసి.. ఆ పిల్లలకు పెడ్తూ కనిపించింది. చివరకు తను కూడా తిని ఈమె కళ్లముందే ఆ ముగ్గురు పిల్లలతోపాటు ఆ తల్లీ నురగలు కక్కి చనిపోతుంది. విషయం అర్థమవుతుంది వచ్చిన తల్లికి. ఆకలితో చనిపోయిన ఆ పిల్లలే పిశాచాలై ఊరు మీద పడ్డారని. భయంతో వెనుతిరుగుతుంది. రెండో కథ చెరువు గట్టున.. జనం మధ్యలో .. ఎనభై ఏళ్ల ఓ ముసలావిడను గొలుసులతో గుంజకు కట్టేసి ఉంది. ‘‘ఈ దయ్యాన్ని వదిలిపెట్టేది లేదు బాబా’’ అంటున్నాడు ఆ ఊరి పెద్ద. ‘‘చెప్పు.. ఎందుకొస్తున్నావ్?’’ అంటూ బాబా మంత్రదండంతో ఆ ముసలావిడను బెదిరిస్తున్నాడు. ‘‘నేను దయ్యాన్ని కాను.. నన్ను వదిలేయండి’’ ముసలావిడ ప్రాధేయపడుతోంది. అయినా వినట్లేదు. అప్పుడు రంగప్రవేశం చేశాడు పోలీస్ ఇన్స్పెక్టర్. దెయ్యం పేరుతో వృద్ధురాలిని గొలుసులతో బంధించడాన్ని చూడలేకపోయాడు. అసలు దయ్యాలు, భూతాలు ఏంటి? అంతా మూఢనమ్మకాలు. మానసిక రోగాలు. భ్రమలు, భ్రాంతులు అంటూ ఆమెను విడిపించబోయాడు. ఊరి పెద్ద, బాబాతోపాటు చుట్టూ ఉన్న జనం, కానిస్టేబుల్స్ కూడా ‘‘అయ్యా.. అపచారం.. అది దయ్యమే. బంధించే ఉంచండి’’ అంటూ ఇన్స్పెక్టర్ మాట సాగనివ్వలేదు. చేసేదిలేక వెనక్కితగ్గాడు ఇన్స్పెక్టర్. కానీ రాత్రి కాపలాదారులు నిద్రలోకి జారుకున్నాక వచ్చి.. ఆ వృద్ధురాలిని విడిపించి తన జీప్‌లో ఆమె ఇంటి దగ్గర దింపాడు ఇన్స్పెక్టర్. ‘‘నన్ను విడిపించినందుకు చాలా కృతజ్ఞతలు ఇన్స్పెక్టర్గారూ. నాకున్న కాసింత పొలాన్నీ కబ్జాచెయ్యడానికి ఊరివాళ్లముందు నన్ను దయ్యంలా నిరూపించాలని చూస్తున్నారు ఊరి పెద్ద. వాడికి బాబా వత్తాసు. సమయానికి వచ్చి రక్షించారు. మీ రుణం ఎలా తీర్చుకోనూ?’’ వినయంగా అడిగింది ఆ వృద్ధురాలు. ‘‘అయ్యో.. ఇది నా బాధ్యత. అవునూ.. ఊరవతల.. ఈ చిట్టడవిలో ఒంటరిగా ఉంటున్నావా?’’ గాబరాగా అడిగాడు ఇన్స్పెక్టర్ ఆమె ఇల్లును చూసి. ‘‘లేదు బాబూ.. మా అక్కతో కలిసి ఉంటున్నాను. ఈ ఊరువాళ్ల బారి నుంచి తప్పించుకోడానికే’’ అంది. జాగ్రత్తలు చెప్పి జీప్ ఎక్కాడు ఇన్స్పెక్టర్. తెల్లవారి.. తన తల్లికి ఒంట్లో బాలేదని, రెండు రోజులు ఆమెకు సాయంగా ఉండొస్తానని పుట్టింటికి బయలుదేరింది ఎస్ఐ భార్య. యథావిధిగా అతనూ డ్యూటీకి వెళ్లాడు. అయితే రాత్రి ఇంటికి చేరేసరికి భార్య దర్శనమిచ్చింది. అదేంటి రెండు రోజుల దాకా రానన్నావ్.. అప్పుడే వచ్చావేంటి?అని ఆశ్చర్యపోతాడు ఇన్స్పెక్టర్. ‘‘మరీ చేతకాకుండా ఏమీ లేదు అమ్మకి. బాగానే ఉంది. మీకు కష్టమవుతుందని వచ్చేశా’’అంటుంది. ఆ రాత్రి ఎందుకనో మళ్లీ ఆ ముసలమ్మ గుర్తొస్తుంది ఎస్ఐకి. కానిస్టేబుల్‌ను తీసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు. అక్కడికి చేరుకోగానే భార్య నుంచి ఫోన్ వస్తుంది. ‘‘ఏంటీ.. ఇంకా ఇంటికి చేరారా లేదా? నేను లేను కదా అని డ్యూటీ పేరుతో స్టేషన్లోనే కాపురం ఉంటున్నారా?’’ అంటూ. షాక్ అవుతాడు ఎస్ఐ. మరి ఇంట్లో ఉన్నది ఎవరు? అనుమానంతోనే ఇంటికి వస్తాడు. ఇంట్లో భార్య కనపడుతుంది. అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎస్ఐకి. ఆ అయోమయంలోనే రెండు రోజులు గడుస్తాయి. పనిమీద ఎస్ఐ బయటకు వెళ్లినప్పుడల్లా పుట్టింటి నుంచి భార్య ఫోన్ చేస్తూంటుంది క్షేమసమాచారాల కోసం. మళ్లీ ఇంటికి వెళ్లేసరికి ప్రత్యక్షమవుతుంది. అదే విషయం అడిగితే.. నన్నే అనుమానిస్తున్నావా అంటూ ఏడుస్తుంది. ఏమీ అర్థంకాదు ఎస్ఐకి. చేసేదిలేక బాబా దగ్గరకు వెళ్తాడు. భార్య రూపంలో ఉన్నది దయ్యమేనని స్పష్టం చేస్తాడు బాబా. మంత్రించిన ఆవాలు ఇస్తాడు చుట్టూ చల్లుకోమని. వాటిని తీసుకొని ఇంటికి వెళ్లిన ఎస్ఐ నిస్సత్తువగా కుర్చీలో కూలబడ్తాడు. అతనిని చూసిన భార్య‘‘ఏంటి అంత నీరసంగా ఉన్నావ్? ఆకలిగా ఉందా? ఉండు వేడి వేడి సూప్ చేసుకొస్తాను’’ అంటూ వంటింట్లోకి వెళుతుంది. ఆమె అటు వెళ్లగానే బాబా ఇచ్చిన ఆవాలను కుర్చీ చుట్టూ చల్లుకుంటాడు. ఇంతలోకి బయట గుమ్మం నుంచి సూట్‌కేస్ పట్టుకొని భార్య వస్తుంది. దిమ్మతిరుగుతుంది ఎస్ఐకి. ‘‘ఇందాకే కదా వంటింట్లోకి వెళ్లావ్?’’ అంటాడు. ‘‘నేనా? ఇప్పుడే పుట్టింటి నుంచి వస్తుంటే..’’ అంటుంది అమాయకంగా. ‘‘రైలు దిగి ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నానో తెలుసా నన్ను పికప్ చేసుకోవడానికి వస్తావేమోనని. నీ ఫోన్ కలిస్తేనా?’’ అంటూ దగ్గరకు వస్తుంది. కింద ఆవాలను చూసి.. ‘‘అయ్యో ఆవాలు పడేసుకున్నారా? వంట రానప్పుడు ఎందుకీ తంటా? హాయిగా బయటనుంచి తెప్పించుకోక?’’ అంటూ చీపురు తెచ్చి కిందంతా శుభ్రం చేస్తుంది. ఈలోపు వంటింట్లోంచి సూప్‌తో వస్తుంది భార్యలాగే ఉన్నా ఇంకో ఆవిడ. ఈ ఇద్దరినీ చూసి ఎస్ఐ మతి పోతుంది నిజంగానే. ఆ ఇద్దరు ఆడవాళ్లూ విస్తుపోతారు ఒకరినొకరు చూసుకుని. వాళ్లలో నిజమైన భార్య ఎవరో? ఆ మిగిలిన వ్యక్తి ఎవరో? తెలుసుకోవడానికి రహస్యంగా బాబాకు ఫోన్ చేస్తాడు ఎస్ఐ. మాటల్లో పెట్టు వస్తానని చెప్తాడు బాబా. వాళ్లను మాటల్లో పెడ్తుండగానే బాబా వచ్చేస్తాడు. బాబాను చూసి సూప్ కాచిన భార్య పారిపోవడానికి ప్రయత్నిస్తుంటుంది. పట్టుకొని.. ‘‘ఈమే దయ్యం. ఆ ముసల్ది. నేను చెప్తే మీరు నమ్మలేదు. రక్షించినందుకు మీ భార్య రూపంలోనే వచ్చి మీతో కాపురం చేస్తోంది’’ అంటూ కాళ్లు, చేతులు కట్టేస్తాడు బాబా. అంతా చూసి అసలు భార్య కళ్లుతిరిగి పడిపోతుంది. భార్యే దయ్యమా? దయ్యమే భార్యా? ‘‘చెప్పు మళ్లీ ఎందుకొచ్చావో చెప్పు’’ అంటూ దెయ్యాన్ని కొడ్తుంటాడు బాబా. ‘‘ఈమె పెళ్లికాకుండా చనిపోయింది. అందుకే ఇప్పుడు నీతో కాపురం చేస్తోంది’’ అని ఎస్ఐతో చెప్తూ ఆ దయ్యాన్ని సీసాలో బంధించే ప్రయత్నం చేస్తుంటాడు బాబా. ఆ దయ్యం అలా సీసాలోకి దూరుతుందో లేదో ఇటు కళ్లుతిరిగిపడిపోయిన ఎస్ఐ అసలు భార్య లేస్తుంది. ‘‘ఎస్ఐ గారూ.. మీకేం భయంలేదిప్పుడు. ఆ ముసలి దయ్యాన్ని ఈ సీసాలో బంధించేశా’’ అని భరోసానిస్తూ వెళ్లిపోతాడు బాబా. ఆ సీసాను ఊరవతల చెరువు గట్టున పాతి పెడ్తాడు. మరుసటిరోజు అత్తగారిని చూడ్డానికి ఎస్ఐ తన భార్యతో ఊరికి ప్రయాణమవుతాడు. ముందు సీట్లో డ్రైవర్‌తోపాటు ఎస్ఐ, వెనక సీట్లో ఆయన భార్య కూర్చుని ఉంటారు. దయ్యం గురించి ఇంకా కలవర పడ్తున్నాడేమో అనుకొని వెనకనుంచి భర్త భుజమ్మీద చేయి వేస్తుంది ఆమె. ఏమీలేదులే అన్నట్టుగా వెనక్కితిరిగి చూడకుండానే ఆమె చేయిని నొక్కి రేర్ వ్యూ మిర్రర్లో చూస్తాడు భార్యను. వృద్ధ దయ్యం కనపడుతుంది నవ్వుతూ! ఒళ్లు గగుర్పొడిచే ఇలాంటి పదిహేను కథలతో ‘‘అంజాన్.. రూరల్ మిత్స్’’ పేరుతో పదిహేను ఎపిసోడ్ల న్యూ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అప్లోడై ఉంది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలకు చెందిన మూఢనమ్మకాల ఆధారంగా తీసిన సిరీస్ ఇది. అన్నిటికీ దయ్యమే నేపథ్యం. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యకు పాల్పడే కుటుంబసభ్యుల పనిపట్టే, మహిళల మీద జరుగుతున్న హింసను ఆపే మంచి దయ్యాల కథలూ ఉన్నాయి వీటిలో. రూరల్ మిత్స్ అనే ట్యాగ్‌లైన్‌తో తీసిన ఈ సిరీస్‌లో ఏ ఎపిసోడ్‌లోనూ అది మిత్ అన్న భావనను కలగజేసే లాజిక్ ఎండ్ ఇవ్వలేదు. హారర్ షోగా ప్రజెంట్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం అయ్యుంటే రూరల్ మిత్స్ అనే క్యాప్షన్ పెట్టి ఉండాల్సింది కాదు. పెట్టినందుకు కనీసం లాజిక్ ఎండ్‌ను ఇస్తే బాగుండేది. రాత్రి లైట్ ఆర్పేసుకొని ఈ సిరీస్ చూస్తే హారర్ షో థ్రిల్ కలుగుతుంది. అలాంటి జానర్‌ని ఇష్టపడే ప్రేక్షకులు ‘అంజాన్.. రూరల్ మిత్స్’ను ఎంజాయ్ చేస్తారు. – సరస్వతి రమ -
పోలీస్ అధికారిగా విక్రమ్
నటుడు సూర్య కోసం తయారు చేసిన కథలో విక్రమ్ నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. అంజాన్ చిత్రానికి ముందు సూర్య గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ధ్రువనక్షత్రం చిత్రం చేయాల్సి ఉంది. అయితే గౌతమ్‌మీనన్ తయారు చేసిన కథ నచ్చలేదంటూ సూర్య ఆ చిత్రం నుంచి వైదొలిగారు. తదుపరి సూర్య అంజాన్ చిత్రాన్ని, గౌతమ్‌మీనన్ అజిత్ హీరోగా ఎన్నైఅరిందాల్ చిత్రాన్ని చేశారు. గౌతమ్‌మీనన్ ప్రస్తుతం శింబు హీరోగా అచ్చంయంబదు మడమయడా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత గౌతంమీనన్ విక్రమ్ కథానాయకుడిగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇది సూర్య కోసం సిద్ధం చేసిన కథతో రూపాందించే చిత్రం అని సమాచారం. ఇందులో విక్రమ్ పోలీస్ అధికారిగా పవర్ఫుల్ పాత్రలో నటించనున్నారని తెలిసింది. సూర్య కోసం సిద్ధం చేసిన కథలో విక్రమ్ కోసం మార్పులు చేర్పులు చేస్తున్నట్లు టాక్. ఇంతకు ముందు కాక్కకాక్క చిత్రంలో పోలీస్ అధికారిగా చూపించిన గౌతమ్ మీనన్ తాజా చిత్రంలో విక్రమ్‌ను మరో విభిన్నకోణంలో తెరపై ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.అదే విధంగా విక్రమ్ ఇంతకు ముందు సామి చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో దుమ్మురేపారన్నది గమనార్హం. -
సికిందర్ గురించి సూర్య
-
ఆయన మీద నమ్మకంతోనే అంత ధైర్యం చేశా : సమంత
మొదట తమిళంలో నటించినా, ఇప్పుడు తెలుగు చిత్రాలతో యమ బిజీగా ఉంటున్న హీరోయిన్ సమంత తాజా తమిళ చిత్రం ‘అంజాన్’ (తెలుగులో ‘సికిందర్’) పుణ్యమా అని ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఈ సినిమాలోని ఓ పాటలో సమంత టూ పీస్ బికినీలో కనిపించడం, డెనిమ్ షార్ట్‌లు - ఒళ్ళు కనిపించే తెల్ల చొక్కా - నుదుటన ఎర్ర స్కార్ఫ్‌తో సినిమాలో నర్తించడం ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో చర్చ రేపింది. నిన్న మొన్నటి వరకు పాత్రలతో పాటు దుస్తులూ హుందాగా ఉండేలా జాగ్రత్తపడుతూ వస్తున్న ఈ యువ హీరోయిన్ ఒక్కసారిగా ఇలా సెక్స్ అప్పీల్ ఉండేలా డ్రెస్సింగ్ స్టయిల్ మార్చడం కెరీర్లో కొత్త దశకు సన్నాహం చేసుకోవడానికేనని విమర్శకుల వాదన. ఈ విషయంపై సమంత తాజాగా వివరణనిస్తూ... ‘‘నేను వేసుకున్న దుస్తుల గురించి ఇంత చర్చ జరుగుతుందని అనుకోలేదు’’ అంటూ అసలు సంగతి వివరించారు. జరిగింది ఏమిటంటే, పాట చిత్రీకరణకు కావాల్సిన దుస్తుల ఎంపికకు కేవలం రెండు రోజులే టైమ్ ఉందట. పాట కొద్దిగా జానపద ఫక్కీలో ఉంది కాబట్టి, దానికి ఆధునిక రంగు తేవడం కోసం షార్ట్‌లు వేసుకుందట సమంత. ఈ సినిమాలో తాను ఆ మాత్రం సెక్సీగా కనిపించడానికి సిద్ధపడ్డానంటే, అందుకు ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ కారణమంటున్నారామె. ‘‘ఆయన ఉన్నారు కాబట్టి, తెరపై నేను చెత్తగా కనిపించనని నాకు నమ్మకం ఉంది. అందుకే, కాస్తంత గ్లామరస్‌గా కనిపించడానికి ఇదే మంచి అవకాశమనుకున్నా. ఇవాళ తెరపై అందంగా కనిపిస్తున్నానంటే, అది ఆయన చలవే’’ అని సమంత అన్నారు. ఈ సినిమా పుణ్యమా అని సినిమా రంగానికి వచ్చి అయిదేళ్ళయిన తరువాత ఇప్పుడు అందరూ సమంత కూడా సెక్సీగా కనిపించగలదంటూ ఒప్పుకోవడం ఈ అమ్మడికి ఆనందం కలిగిస్తోంది. ‘‘ఇన్నేళ్ళుగా దాదాపు ఒకే రకంగా చూసి చూసి ప్రేక్షకులకే కాదు, నా లుక్ మీద నాకే విసుగెత్తింది. అలాంటప్పుడు ‘అంజాన్’తో ఈ కొత్త గుర్తింపు రావడం ఆనందంగా ఉందంటోంది సమంత. మొత్తానికి, గతంలో మహేశ్‌బాబు ‘1 - నేనొక్కడినే’ సినిమా ప్రచార సమయంలో బీచ్‌లో హీరో నడుస్తుంటే, అతని వెనక హీరోయిన్ పాకుతున్న ఫోటో మీద కామెంట్‌తో వివాదాస్పదమైన సమంత ఈసారి మాత్రం కురచ దుస్తుల్లో, బికినీలో కనిపించడం విశేషమే. ఆ పేరు చెప్పి, చర్చ పెట్టదలుచుకోలేదు! అన్నట్లు హీరో సిద్ధార్థ్‌తో తనకున్న అనుబంధం గురించి రకరకాల వార్తలు వస్తున్నా, ఆ విషయం గురించి సమంత ఇప్పటికీ నోరు విప్పడం లేదు. ‘‘వ్యక్తి పేరెందుకు కానీ, ఒకరితో నా అనుబంధం ఎంతో సంతోషంగా సాగుతోంది. నలుగురితోనూ చెప్పి, దాన్ని పాడుచేసుకోదలుచుకోలేదు’’ అని తాజాగా వ్యాఖ్యానించారామె. ‘‘ఎవరేం రాసినా సరే, నటీమణులకు ఇబ్బం దికరంగా ఉండదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, నేను అలా అనుకోవడం లేదు. నా వ్యక్తిగత ప్రేమ జీవితం గురించి బహిరంగ చర్చలు జరగడం నాకిష్టం లేదు’’ అని సమంత కుండబద్దలు కొట్టారు. ఆమె అభిప్రాయం గౌరవించదగినదే కదూ! -
సమంతకేమయ్యింది?
నటి సమంత కేమయ్యింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్న విషయం ఇదే. టాలీవుడ్ హీరోయిన్గా హవా సాగిస్తున్న ఈ చెన్నై చిన్నదానికి కోలీవుడ్‌లో ఇప్పటికీ చెప్పుకోవడానికి మచ్చుకైనా పెద్ద హిట్ లేదు. అయితే ఇప్పుడిక్కడ ఈ బ్యూటీకి యమ క్రేజ్. విజయ్, సూర్య, విక్రమ్ వంటి టాప్ హీరోల సరసన నటిస్తున్నారు. అదే స్థాయిలో విమర్శనలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల సూర్య సరసన నటించిన అంజాన్ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో సమంత పాల్గొనకపోవడంతో ఆమెపై రకరకాల ప్రచారం జరుగుతోంది. సాధారణంగా తాను నటించని చిత్ర కార్యక్రమాల్లో కూడా ఆహ్వానిస్తే పాల్గొనే ఈ చెన్నై చిన్నది తాను నటించిన తొలి భారీ చిత్రం అంజాన్ ఆడియో కార్యక్రమంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ జరగనున్న విషయం సమంతకు తెలుసు. ఆమెకూ చిత్ర యూనిట్ నుంచి ఆహ్వానం అందింది. అయినా ఈ అమ్మ డు కావాలనే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న ట్లు ప్రచారం జరుగుతోంది. నటుడు సిద్ధార్థ్ ప్రియురాలైన సమంత ఆయన మాదిరేతగుదునమ్మా అంటూ ట్విట్టర్లో అనవసర విషయాలకు పోయి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. గొడవలకు దారి తీసే చర్యలకు పాల్పడుతున్నారు. సహజంగా మాట్లాడుతూనే అనూహ్యంగా మూడీగా మారిపోతున్నారట. సిద్ధార్థ్‌తో లవ్ లో పడ్డ తరువాతే సమంత ఇలా ప్రవర్తిస్తున్నారనే గుసగుసలు కోలీవుడ్‌లో కోడై కూస్తున్నాయి. -
స్టయిలిష్ సికిందర్
తండ్రులకు తగ్గ తనయులు భారతీయ సినీరంగంలో చాలామంది ఉన్నారు. కానీ... తండ్రులను మించిన తనయులు మాత్రం సినీరంగంలో అరుదు. దక్షిణాదిన అయితే... అలాంటి కొడుకు సూర్య ఒక్కడే. తమిళ హీరో శివకుమార్ తనయుడిగా తెరకు పరిచయమయ్యారాయన. సుమారు యాభై ఏళ్లుగా హీరోగా, కేరక్టర్ నటునిగా శివకుమార్ సాధించలేని పేరుప్రఖ్యాతుల్ని అయిదారేళ్లలోనే సాధించేసి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు సూర్య. అంతేకాదు, నటునిగా అనతికాలంలోనే ఎన్నో ప్రయోగాలు చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. కమల్‌హాసన్ తర్వాత దక్షిణాదిన ప్రయోగాత్మక పాత్రలు పోషించిన అతి కొద్ది మంది హీరోల్లో సూర్య ఒకరంటే అది అతిశయోక్తి కాదు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న చిత్రం ‘ఆంజాన్’. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ‘సికిందర్’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఇందులో కూడా సూర్యది వైవిధ్యమైన పాత్రే. కెరీర్లో తొలిసారి స్టయిలిష్ డాన్‌గా నటిస్తున్నారాయన. నటనపరంగా, వాణిజ్యపరంగా సూర్య కెరీర్లో గుర్తుండిపోయే సినిమాలా ‘ఆంజాన్’ నిలుస్తుందని చిత్ర నిర్మాతలు సిద్దార్థ్‌రాయ్ కపూర్, ఎన్.సుభాష్‌చంద్రబోస్ నమ్మకం వెలిబుచ్చుతున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘సికిందర్’ని తిరుపతి బ్రదర్స్‌తో కలిసి లగడపాటి శిరీష, శ్రీధర్ నిర్మిస్తున్నారు. సమంత కథానాయిక. యువన్‌శంకర్‌రాజా స్వరాలందించిన ‘సికిందర్’ పాటలను ఈ నెల 31న తెలుగు చిత్ర ప్రముఖుల సమక్షంలో విడు దల చేయనున్నట్లు లగడపాటి శిరీష, శ్రీధర్‌లు చెప్పారు. ఆగస్ట్ 15న ‘సికిందర్’ విడుదల కానుంది. ఈరోజు సూర్య 39వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. -
సమంతకు ఫుడ్ పాయిజన్!
గతంలో ఎన్నడూ లేనంతగా తనకు మంగళవారం సినిమా కష్టాలు ఎదురయ్యాయని దక్షిణాది సినీతార సమంత సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో వెల్లడించింది. ఫుడ్ పాయిజన్ కావడంతో తాను స్వల్ప అనారోగ్యానికి గురయ్యాను. అంతేకాకుండా ట్రాన్సిట్ లో తన బ్యాగ్ ను పొగొట్టుకున్నాను అని ట్విటర్ లో వెల్లడించింది. అనారోగ్యం, ఫ్లయిట్ ఆలస్యం కావడంతో తాను అంజాన్ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొనడం లేదని సమంత తెలిపింది. సూర్య సరసన అంజాన్ చిత్రంలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం అంజాన్ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. Flight delay, baggage lost in transit and food poisoning. Worst day ever. Really sad that I couldn't attend the Anjaan audio function today — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) July 22, 2014 -
'సికిందర్'గా వస్తున్న సూర్య
-
ఆండ్రియాతో గొంతు కలిపిన సూర్య
సూర్య తమిళంలో ఎంత స్టార్ హీరోనో, తెలుగులో కూడా అంతే స్టార్ హీరో. శివపుత్రుడు, గజని, యముడు, సింగం-2... ఇలా ఇక్కడ కూడా ఎన్నో విజయాలను అందుకున్నారు సూర్య. ప్రస్తుతం ఆయన లింగుస్వామి దర్శకత్వంలో ‘ఆంజాన్’ సినిమా చేస్తున్నారు. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ‘సికిందర్’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. లగడపాటి శిరీషా శ్రీధర్, తిరుపతి బ్రదర్స్ కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇందులో సూర్య పాత్ర చిత్రణ ఊహలకు అందని రీతిలో ఉంటుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సూర్య గత చిత్రాలను మించే బడ్జెట్‌తో సిద్దార్థ్‌రాయ్ కపూర్, ఎన్.సుభాష్‌చంద్రబోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని మరో ప్రత్యేకత ఏంటంటే... ఇటీవలే అనిరుథ్ స్వరసారథ్యంలో ఆండ్రియాతో కలిసి సూర్య ఈ చిత్రంలో ఓ గీతం ఆలపించారు. ఆ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని టాక్. ‘ఏక్ దో తీన్...’ అంటూ సాగే ఈ పాటను తెలుగు వెర్షన్లో కూడా సూర్యనే ఆలపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. తమిళ వెర్షన్ పాటలను ఈ నెల 22న విడుదల చేయనుండగా, తెలుగు వెర్షన్ గీతాలు ఈ నెల 31న విడుదల కానున్నాయి. ఆగస్ట్ 15న ‘సికిందర్’ విడుదల కానున్నట్లు సమాచారం. -
'అంజాన్' టీజర్‌కు మంచి రెస్పాన్స్
-
'సికిందర్'తో 'రభస'కు ఎన్టీఆర్ సిద్ధం
-
స్టయిలిష్ డాన్‌గా సూర్య
సూర్య తొలిసారిగా డాన్ పాత్ర పోషిస్తున్నారు. చాలా స్టయిలిష్‌గా ఉండే డాన్ పాత్ర కావడంతో సూర్య కూడా ఎంతో ఆసక్తిగా ఈ పాత్ర చేస్తున్నారు. రన్, ఆవారా తదితర చిత్రాలతో తెలుగు నాట కూడా అభిమానుల్ని సంపాదించుకున్న దర్శకుడు లింగుస్వామి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు వెర్షన్‌కు లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో సమంత కథానాయిక. ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రం గురించి లగడపాటి శిరీష శ్రీధర్ మాట్లాడుతూ -‘‘భారీ తారాగణంతో, 75 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రం రూపొందుతోంది. తమిళ వెర్షన్‌కు ‘అంజాన్’ టైటిల్ కాగా, తెలుగు వెర్షన్‌కు త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం. ఇందులో సూర్య పాత్రచిత్రణ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సమంత మునుపెన్నడూ లేనంతగా గ్లామర్ ప్రదర్శన చేశారు. యువన్ శంకర్‌రాజా సంగీతం, సంతోష్ శివన్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు కీలకం. ప్రముఖ బాలీవుడ్ నటి చిత్రాంగదా సింగ్ ఇందులో ప్రత్యేక నృత్యగీతం చేశారు’’ అని తెలిపారు. బ్రహ్మానందం, విద్యుత్ జమాల్, మనోజ్ బాజ్‌పాయ్, కెల్లీ డోర్జ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. -
‘అంజాన్’లో సూర్య గాత్రం
సంగీతం, సాహిత్యాల మేనికలయిక పాట. అలాంటి పాటకు మంచి గానం తోడయితే వీనులవిందుగా ఉంటుంది. అయితే పాడడం అంత సులభం కాదు. గాయకులుగా రాణించడానికి అర్హత ఉంటుంది. అయితే అంత పరిజ్ఞానం లేకపోయినా చాలా మంది పాడేస్తున్నారు. ముఖ్యంగా నేటి నటీనటులు తమ గాన పాండిత్యాన్ని చూపించేస్తున్నారు. పద్మశ్రీ కమల్ హాసన్‌లో మంచి గాయకుడున్నాడని ఇప్పటికే నిరూపించుకున్నారు. ఈయన సంగీత, సాహిత్య రంగాల్లోనూ శిక్షణ పొందారు. అయితే అలాంటి శిక్షణ లేకుండా నటుడు శింబు, ధనుష్, శివకార్తికేయన్‌లాంటి యువ నటులు పాడేస్తున్నారు. చివరికి సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా కోచ్చడయాన్ చిత్రంలో పాడి తాను గాయకుడిననిపించుకున్నారు. తాజాగా ఈ కోవలోకి నటుడు సూర్య చేరనున్నారు. ఈయన ఇంతకు ముందు ఒక వాణిజ్య ప్రకటన కోసం గళం విప్పారు. తాజాగా అంజాన్ చిత్రం కోసం పాడనున్నారు. ఈయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అంజాన్. తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శక నిర్మాత లింగుసామి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్. చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రం కోసం సూర్య ఒక పాట పాడనున్నారు. అయితే ఈపాట ఇంకా రికార్డ్ చేయూల్సి ఉందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. -
ఆగస్ట్ 15న అంజాన్
అంజాన్ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. సింగం-2 తరువాత సూర్య నటిస్తున్న చిత్రం అంజాన్. ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న చిత్రం ఇది. సూర్య, దర్శకుడు లింగుసామిల తొలి కలయికతో తెరకెక్కుతున్న చిత్రం అంజాన్. అలాగే చెన్నై చిన్నది సమంత తొలిసారిగా సూర్యతో రొమాన్స్ చేస్తున్న చిత్రం ఇదే. చిత్రంలో సూర్య గెటప్ కూడా చాలా కొత్తగా ఉందంటున్నారు చిత్ర యూనిట్. సంతోష్ శివన్ చాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతం హైలైట్‌గా ఉండబోతున్న అంజాన్ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా చిత్రం షూటింగ్ పూర్తయ్యిందని, ఆ ఒక్క పాటను ఈ నెల 8న గోవాలో చిత్రీకరించనున్నట్లు దర్శకుడు లింగుసామి తెలిపారు. ఇది సూర్య సమంతలపై చిత్రీకరించనున్న రొమాన్సింగ్ గీతం అని చెప్పారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జూలైలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డబ్బింగ్ తదితర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నా ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
హాట్ టాపిక్‌గా సమంత స్టిల్స్
కోలీవుడ్‌లో ఇప్పుడు సమంతదే హాట్ టాపిక్. లింగుస్వామి దర్శకత్వంలో సూర్యకు జోడీగా ఆమె నటించిన ‘ఆంజానే’ సినిమా స్టిల్స్‌ని ఇటీవలే మీడియాకు విడుదల చేశారు. ఈ స్టిల్స్‌లో సమంత మాస్ అప్పీల్ చూసి తమిళ తంబీలు ఫిదా అయిపోతున్నారట. చిన్ని నిక్కర్ వేసుకొని, షర్ట్‌కి ఉన్న ఒక్క బటన్ మినహా మిగిలిన అన్ని బటన్స్నీ తీసేసి ఉన్న సమంత స్టిల్స్ తమిళనాట ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. తెలుగులో ఇప్పటికే నంబర్‌వన్ పొజిషన్ని ఎంజాయ్ చేస్తున్న సమంత... కోలీవుడ్‌లో కూడా ఆ ప్లేస్ కోసం ఉవ్విళ్లూరుతోందని, ఎలాగైనా హన్సికను వెనక్కి లాగడమే తన ధ్యేయంగా కనిపిస్తోందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీనిపై ఇటీవల సమంత స్పందిస్తూ- ‘‘కథానుగుణంగా ‘ఆంజానే’లో నా పాత్ర మాస్‌గా ఉంటుంది. దానికి తగ్గట్టే నా గెటప్‌ని డిజైన్ చేశారు లింగుస్వామి. ఈ సినిమా కచ్చితంగా తమిళనాట నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. పాత్ర కోసం ఎంతటి రిస్క్ చేయడానికి కూడా నేను రెడీ. పరిశ్రమలో నేను ఎవర్నీ పోటీగా భావించను. ఇక్కడ ఎవరి అవకాశాలు వారివి’’ అని చెప్పారు. -
సూర్యతో కరీనా కపూర్
బాలీవుడ్ భామ కరీనాకపూర్ ఈ ఏడాది కోలీవుడ్ తెరపై మెరవనున్నారు. అది కూడా ఒక ప్రత్యేక నృత్య గీతం ద్వారా. గతంలో కరీనాకి పలు తమిళ చిత్రాల్లో కథానాయికగా నటించే అవకాశం వచ్చినా, ఆమె అంగీకరించలేదు. చివరకు ప్రత్యేక గీతానికి పచ్చజెండా ఊపడం విశేషం. సూర్య హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘అంజాన్’లోనే ఆమె ఐటమ్ సాంగ్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం ఇప్పటికే బాలీవుడ్ భామ చిత్రాంగదా సింగ్‌తో ఓ ప్రత్యేక గీతం చిత్రీకరించారు. ఇందులో ఉన్న మరో ఐటమ్ సాంగ్‌కి కరీనా కపూర్‌ని అడిగారట. హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈ పాటకు కాలు కదపడానికి ఆమె అంగీకరించారు. అయితే, ఇంకా డేట్స్ కేటాయించలేదు. కరీనా పని ఒత్తిడి దృష్ట్యా ఆమెకు ఇబ్బంది కలగకుండా ముంబయ్‌లోనే ఈ పాటను చిత్రీరించాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా పాటలు స్వరపరిచారు. సూర్య, కరీనాలపై చిత్రీకరించనున్న పాటకు ప్రముఖ బాలీవుడ్ నృత్యదర్శకురాలు సరోజ్ ఖాన్ నృత్యరీతులు సమకూర్చనున్నారు. ఇది మంచి మాస్ మసాలా పాట అని సమాచారం. మాస్, క్లాస్ స్టెప్స్‌ని అద్భుతంగా చేయగల కరీనా ఈ పాటలో విజృంభిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
సూర్య న్యూ ఫిల్మ్ ‘అంజాన్’ ఫస్ట్‌లుక్ అదిరింది!