స్టయిలిష్ డాన్‌గా సూర్య | 'Anjaan' Telugu version to be released on Aug 15th | Sakshi
Sakshi News home page

స్టయిలిష్ డాన్‌గా సూర్య

Published Sat, Jun 21 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 9:10 AM

స్టయిలిష్ డాన్‌గా సూర్య

స్టయిలిష్ డాన్‌గా సూర్య

సూర్య తొలిసారిగా డాన్ పాత్ర పోషిస్తున్నారు. చాలా స్టయిలిష్‌గా ఉండే డాన్ పాత్ర కావడంతో సూర్య కూడా ఎంతో ఆసక్తిగా ఈ పాత్ర చేస్తున్నారు. రన్, ఆవారా తదితర చిత్రాలతో తెలుగు నాట కూడా అభిమానుల్ని సంపాదించుకున్న దర్శకుడు లింగుస్వామి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు వెర్షన్‌కు లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో సమంత కథానాయిక. ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రం గురించి లగడపాటి శిరీష శ్రీధర్ మాట్లాడుతూ -‘‘భారీ తారాగణంతో, 75 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రం రూపొందుతోంది.
 
 తమిళ వెర్షన్‌కు ‘అంజాన్’ టైటిల్ కాగా, తెలుగు వెర్షన్‌కు త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం. ఇందులో సూర్య పాత్రచిత్రణ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సమంత మునుపెన్నడూ లేనంతగా గ్లామర్ ప్రదర్శన చేశారు. యువన్ శంకర్‌రాజా సంగీతం, సంతోష్ శివన్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు కీలకం. ప్రముఖ బాలీవుడ్ నటి చిత్రాంగదా సింగ్ ఇందులో ప్రత్యేక నృత్యగీతం చేశారు’’ అని తెలిపారు. బ్రహ్మానందం, విద్యుత్ జమాల్, మనోజ్ బాజ్‌పాయ్, కెల్లీ డోర్జ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement