ప్రతినాయకుడుగా సూర్య | Surya doing a deadly villain role in 24? | Sakshi
Sakshi News home page

ప్రతినాయకుడుగా సూర్య

Published Thu, Nov 26 2015 3:04 AM | Last Updated on Sun, Sep 3 2017 1:01 PM

ప్రతినాయకుడుగా సూర్య

ప్రతినాయకుడుగా సూర్య

హీరోగా కంటే విలన్‌గా నటించడమే కష్టం అంటారు. అలాగే విలన్ పాత్ర బలంగా ఉంటేనే హీరో పాత్ర ఎలివేట్ అవుతుంది. ఇక ప్రముఖ హీరోలు సైతం విలన్‌గా నటించాలన్న ఆసక్తిని చూపుతుంటారు. నటుడు సూర్య విషయానికి వస్తే వైవిధ్యం కోసం తపించే నటుల్లో ముందు వరుసలో ఉంటారు. ఆయన ఇప్పుడు తన నటనా తృష్ణను తీర్చుకుంటున్నారనే చెప్పవచ్చు. ఇటీవల సరైన సక్సెస్ లేక కాస్త అసంతృప్తితో ఉన్న సూర్య ఇప్పుడు విభిన్న చిత్రాలతో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు.
 
 అందులో ఒకటి పసంగ-2 కాగా రెండవది 24. పసంగ -2లో చిన్నారి బాలలతో కలిసి చక్కని సందేశాన్ని పిల్లలకు, పెద్దలకు అందించడానికి డిసెంబర్ 4న తెరపైకి రానున్నారు. ఇక 24 అనే చిత్రంలో ఏకంగా మూడు పాత్రలతో తన నట విశ్వరూపం చూపించడానికి ముస్తాబవుతున్నారు. ఇందులో ఒక పాత్రలో విలనీయం ప్రదర్శించనున్నారన్నది గమనార్హం. ప్రముఖ మలయాళ దర్శకుడు విక్రమన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. అందులో సూర్య విలన్ గెటప్, హీరో గెటప్‌లతో కూడిన పోస్టర్లు సూర్య అభిమానుల్ని విపరీతంగా అలరిస్తున్నాయి.
 
  ముఖ్యంగా విలన్ గెటప్‌లో సూర్య గంభీరంగా సమ్‌థింగ్ స్పెషల్‌గా కనిపించడం విశేషం. ఇందులో సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నటుడు సత్యన్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తమిళ ఉగాది సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement