1. ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంలో హీరో సిద్ధార్థ్‌తో చిన్నప్పటి నుండి స్నేహంగా ఉండే పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
ఎ) శ్రుతీహాసన్ బి) హన్సిక సి) సమంత డి) నిత్యామీనన్
2. స్నేహంపై తీసిన ‘కొండపల్లి రాజా’ చిత్రంలో హీరో ఎవరో కనుక్కోండి?
ఎ) వెంకటేశ్ బి) భానుచందర్ సి) బాలకృష్ణ డి) రాజేంద్ర ప్రసాద్
3. ‘ఆర్య 2’ చిత్రంలో అల్లు అర్జున్, నవదీప్ స్నేహితులుగా నటించారు. వారిద్దరు ఏ హీరోయిన్ కోసం తంటాలు పడతారో తెలుసా?
ఎ) తమన్నా బి) కాజల్ అగర్వాల్ సి) గౌరీ ముంజల్ డి) షీలా
4. ‘ప్రేమదేశం’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇద్దరు స్నేహితులుగా అబ్బాస్, వినీత్ నటించారు. ఈ ఇద్దరూ లవ్ చేసే అమ్మాయిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
ఎ) టబు బి) సోనాలీ బింద్రే సి) ఐశ్వర్యా రాయ్ డి) మనీషా కోయిరాల
5. ‘స్నేహం కోసం’ చిత్రంలో చిరంజీవి, విజయ్‌కుమార్ స్నేహితులుగా నటించారు. ఈ చిత్ర దర్శకుడెవరో తెలుసా?
ఎ) సురేశ్ కృష్ణ బి) కె.యస్ రవికుమార్ సి) పి. వాసు డి) భారతీరాజా
6. ‘ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా... కాలం నీ నేస్తం ముస్తఫా...’ అనే పాట రచయితెవరో కనుక్కోండి?
ఎ) భువనచంద్ర బి) వెన్నెలకంటి సి) సిరివెన్నెల డి) వేటూరి సుందర రామమూర్తి
7. ‘ ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రంలో హీరో రామ్‌కి బెస్ట్ ఫ్రెండ్‌గా నటించిన మరో హీరో ఎవరో తెలుసా?
ఎ) నారా రోహిత్ బి) నాగ శౌర్య సి) శ్రీవిష్ణు డి) నవీన్ చంద్ర
8. హీరో గోపీచంద్ తన బెస్ట్ ఫ్రెండ్ అని ఓ హీరో పేరు చెప్తారు. ఎవరా హీరో?
ఎ) ప్రభాస్ బి) కల్యాణ్‌రామ్ సి) రవితేజ డి) నాగార్జున
9. జగపతిబాబు స్నేహితుడు అనగానే గుర్తుకు వచ్చే హీరో ఎవరో తెలుసా?
ఎ) నాగార్జున బి) అర్జున్ సర్జా సి) శ్రీహరి డి) ప్రకాశ్ రాజ్
10. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండకు బెస్ట్ ఫ్రెండ్‌గా నటించిన నటుడెవరో తెలుసా?
ఎ) రాహుల్ రామకృష్ణ బి) ‘వెన్నెల’ కిశోర్ సి) ప్రియదర్శి డి) సత్య
11. ‘అందాల రాక్షసి’ ఫేమ్ హీరో రాహుల్ రవీంద్రన్ ఓ ప్రముఖ హీరోయిన్‌కు బెస్ట్ ఫ్రెండ్. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఎ) అంజలి బి) సమంత సి) రాశీ ఖన్నా డి) రెజీనా
12. అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్ అనే సినిమాలో కథానాయకునిగా నటించిన హీరో ఎవరో తెలుసా?
ఎ) నిఖిల్ బి) ఆది పినిశెట్టి సి) శర్వానంద్ డి) సందీప్ కిషన్
13. రాజీవ్ కనకాల ఓ పెద్ద హీరోకి బెస్ట్ ఫ్రెండ్. ఆ హీరో ఎవరో కనుక్కోండి?
ఎ) అల్లు అర్జున్ బి) జూనియర్ ఎన్టీఆర్ సి) రామ్ చరణ్ డి) మహేశ్‌బాబు
14 ‘దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్...పాట ‘పెళ్లి పందిరి’ చిత్రంలోనిది. ఆ పాటలో ఇద్దరు స్నేహితులు నటించారు. అందులో ఒకరు పృథ్వీ. మరో హీరో ఎవరు?
ఎ) తరుణ్ బి) శ్రీకాంత్ సి) జగపతిబాబు డి) జె.డి. చక్రవర్తి
15 ‘వసంతం’ సినిమాలో వెంకటేశ్ క్లోజ్ ఫ్రెండ్‌గా నటించిన హీరోయిన్ గుర్తుందా?
ఎ) గజాల బి) రాశి సి) సిమ్రాన్ డి) కళ్యాణి
16. ఈ ఫొటోలో రజనీకాంత్‌తో ఉన్నది ఆయన చిరకాల మిత్రుడు. ఆ ఫ్రెండ్ పేరేంటో తెలుసా?
ఎ) రాజా బహదూర్ బి) రాజా రవివర్మ సి) రాజన్ డి) రాజమణి
17. ‘నీ స్నేహం ఇక రాదు అని...’ పాట పాడిన సంగీత దర్శకులు ఎవరు?
ఎ) యం.యం. కీరవాణి బి) ఆర్పీ పట్నాయక్ సి) దేవిశ్రీ ప్రసాద్ డి) ఇళయరాజా
18. ‘స్నేహితుడా.. స్నేహితుడా రహస్య స్నేహితుడా...’ పాట ‘సఖీ’ చిత్రం లోనిది. ఆ చిత్ర సంగీత దర్శకుడెవరో తెలుసా?
ఎ) ఏఆర్ రెహమాన్ బి) హారిస్ జయరాజ్ సి) దేవా డి) యువన్ శంకర్ రాజా
19. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీడేస్’ అనే సినిమా వచ్చింది. ఆ చిత్రంలో ‘టైసన్’ అనే క్యారెక్టర్ ఉంటుంది. ఫ్రెండ్‌షిప్‌కు ఎంతో విలువనిచ్చే పాత్రను పోషించిన నటుడెవరో కనుక్కోండి?
ఎ) నిఖిల్ బి) వరుణ్ సందేశ్ సి) రాహుల్ డి) వంశీ చాగంటి
20. బాపు అనగానే వెంటనే రమణ గుర్తుకొస్తారు. స్నేహమంటే వారిద్దరిదే అని అందరూ చెప్పుకుంటారు. వారిద్దరూ కలిసి చేసిన ఆఖరి చిత్రమేదో చెప్పుకోండి
ఎ) రాధా గోపాళం బి) శ్రీ రామరాజ్యం సి) సుందరాకాండ డి) రాంబంటు
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) ఎ 2) ఎ 3) బి 4) ఎ 5) బి 6) ఎ 7) సి 8) ఎ 9) బి 10) ఎ 11) బి
12) ఎ 13) (బి) 14) సి 15) డి 16) ఎ 17) బి 18) ఎ 19) సి 20) బి
నిర్వహణ: శివ మల్లాల
Comments
Please login to add a commentAdd a comment