Sheela
-
ట్రెండ్ మారింది.. ఫుడ్ మారాలి
ఫ్యాషన్ ట్రెండ్స్లాగానే ఆహారంలో కూడా కొంతకాలం పాటు ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రతి సందర్భంలోనూ ఆ ట్రెండ్ ఎవరికి మంచిది, ఎవరికి హానికరం అనే వివరాలను తన బ్లాగ్‌లో రాస్తూ సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు బెంగళూరుకు చెందిన న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి. హెల్త్ ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న షీలా కృష్ణస్వామి ఈ వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యసంరక్షణ గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.న్యూట్రిషన్, వెల్నెస్ రంగంలో నలభై ఏళ్ల అనుభవం ఉన్న షీలా కృష్ణస్వామి రోజూ 30 గ్రాముల నట్స్, సీడ్స్ తీసుకోవాలని చెప్పారు. ముప్ఫై గ్రాములంటే ఎన్ని అని తూకం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఓ గుప్పెడు చాలు. రోజూ గ్లాసు నీరు, గుప్పెడు బాదం పప్పులతో తన రోజు మొదలవుతుందన్నారు. ఉదయం ఇలాంటి శక్తినిచ్చే సహజాహారం తీసుకుంటే రోజంతా నీరసం రాదు. విటమిన్లు, ప్రొటీన్లతో కూడిన ఆహారం కోసం మన డైట్లో పప్పులు, ధాన్యాలు, పీచు, పాలు, పండ్లను తీసుకుంటున్నాం. బాదం, గుమ్మడి విత్తనాలను కూడా తప్పనిసరిగా చేర్చుకోవాలి. సమయానికి భోజనం చేయడం కుదరనప్పుడు కూడా బాదం తింటే దేహానికి దాదాపుగా సంపూర్ణ ఆహారం అందినట్లే. జంక్ బదులు గింజలు! వందేళ్ల కిందట ఇప్పుడున్న అనారోగ్యాలు లేవు. గడచిన తరాలు ఆహారం విషయంలో ఇంత ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. ఏం తినాలనిపిస్తే అది తిన్నారు. ఏం పండితే వాటినే తిన్నారు. ఊబకాయం, గుండె వ్యాధులు, డయాబెటిస్ వంటి అనారోగ్యాల్లేవు. అందుకు కారణం వారికి ఆహారం ద్వారా అందిన శక్తిని కరిగించేటంతటి వ్యాయామం ఉండేది. తగినంత వ్యాయామం ఉండడంతో మంచి నిద్ర ఉండేది. ఈ రెండింటి వల్ల దేహక్రియలు చక్కగా జరిగేవి. గట్ హెల్త్ అంటే అదే. ఆ గట్ హెల్త్ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వస్తోంది. ‘బెంగళూరులో నా కళ్లారా చూస్తుంటాను. ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లడానికి పదుల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. ఇంటికి వెళ్లేలోపు ఆకలి వేస్తుంటుంది. కారులో వెళ్తూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రై, సమోసాలు, బేకరీ ఫుడ్ వంటి జంక్ తింటూ ఉంటారు. నేనేం చె΄్తానంటే జంక్ స్థానంలో సహజ ఆహారాన్ని తీసుకోండి. ఆఫీసుకెళ్లేటప్పుడు పండ్లను బ్యాగ్‌లో తీసుకెళ్లడం కొన్నిసార్లు సాధ్యంకాకపోవచ్చు. బాదం వంటి నట్స్ ఒక చిన్న బాక్సులో పెట్టుకుంటే మధ్యలో ఆకలి అనిపించినప్పుడు పది గింజలు తింటే చాలు’ అన్నారు షీలా కృష్ణస్వామి. అరవై నాలుగేళ్ల వయసులో ఇంత చురుగ్గా ఉండడానికి సరైన ఆహారమే కారణమన్నారు. ‘అందంగా ఉండడానికి రహస్యం ఏమీ లేదు, ఆరోగ్యంగా ఉండడమే’నని నవ్వారామె. ఎలాగైనా తినండి!పరిపూర్ణ ఆరోగ్యానికి, దీర్ఘకాలం యవ్వనంగా ఉండడానికి దోహదం చేసే బాదం పప్పులను ఇలాగే తినాలనే నియమం ఏదీ అవసరం లేదు. పచ్చిగా లేదా నానబెట్టి తినవచ్చు. డ్రై రోస్ట్, నానిన వాటిని వేయించి,పోపు పెట్టి చాట్ మసాలా చల్లి తినవచ్చు. బాదం పప్పులను రాత్రి నానబెట్టి ఉదయం తినేటప్పుడు పొట్టు వలిచేస్తుంటారు. కానీ పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఆ ఫైబర్ కూడా దేహానికి అవసరమే. వృద్ధులకు పొట్టుతోపాటు తినడం ఇబ్బందవుతుంది. పొట్టు తీసి తినాల్సింది దంతాలు సరిగా లేని వాళ్లు మాత్రమే. – షీలా కృష్ణస్వామి, న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్, బెంగళూరు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటో : టి.దయాకర్ -
భర్త సవాలును స్వీకరించి.. సక్సెస్ సాధించి.. ఓ గృహిణి రూ.500 కోట్ల వ్యాపారం కథ!
దేశంలో చాలా మంది గృహిణుల్లో ఉత్తమ వ్యాపార అభిరుచి ఉంటుంది. సొంతంగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలని చాలా మంది అనుకుంటుంటారు. అయితే వారికి ఆశించిన తోడ్పాటు, ఆర్థిక వనరులు ఉండవు. దీంతో తమ వ్యాపార ఆలోచనను అక్కడితోనే ఆపేస్తుంటారు. కానీ కేరళకు చెందిన ఒక గృహిణి ఇంట్లోనే లోదుస్తులు, ఇన్నర్‌వేర్ బ్రాండ్‌ను ప్రారంభించి విజయవంతంగా నడిస్తోంది. తనకంటూ సొంత పేరును సంపాదించుకుంది. కేరళకు షీలా కోచౌఫ్, ఒక వ్యాపారవేత్త భార్య. వారిది బాగా స్థిరపడిన కుటుంబం. అయినా ఆమె తనకంటూ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని భావించింది. తన ఆలోచనను భర్తతో పంచుకుంది. కానీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆమె భర్త రెండు షరతులు పెట్టాడు. ఒకటి వ్యాపారానికి కుటుంబానికి సంబంధించిన డబ్బును వాడుకోకూడదు. రెండోది వ్యాపార కార్యాలయానికి ఖాళీగా అద్దె కట్టకూడదు. సవాలుకు సై! చాలా సంవత్సరాలు గృహిణిగా ఉన్న షీలా, తన భర్త సవాలును స్వీకరించింది. ఒక బ్యాంకు నుంచి చిన్నపాటి లోన్ తీసుకొని వీ-స్టార్ క్రియేషన్స్ అనే తన లోదుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. అలా బ్యాంకు రుణంతో 1995లో ఓ 10 మందితో చిన్న బట్టల వ్యాపారంగా ప్రారంభించింది. కేరళలో విక్రయిస్తున్న ఇన్నర్‌వేర్ లోదుస్తులు చాలామటుకు ముంబై, బెంగళూరు ప్రాంతాల నుంచి వస్తున్నాయని గ్రహించిన ఆమె రాష్ట్రంలోనే స్థానిక బ్రాండ్‌గా ఎదిగే లక్ష్యంతో వివిధ డిజైన్లు, రంగులతో నాణ్యమైన లోదుస్తులు, ఇన్నర్వేర్లను తయారు చేయడం ప్రారంభించింది. ప్రారంభంలో బ్రాలు, ప్యాంటీలను 10 మంది ఉద్యోగులు చేతితో కుట్టేవారు. సింపుల్ డిజైన్లు, అందుబాటు ధరల కారణంగా వీ-స్టార్ క్రియేషన్స్ వృద్ధి చెందడం ప్రారంభించింది. ఇప్పుడు మల్టీ-మిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. 1995లో షీలా కొచౌఫ్ స్థాపించిన వీ-స్టార్ క్రియేషన్స్ ఆదాయం 2022 నాటికి దాదాపు రూ. 500 కోట్లకు చేరుకుందని టోఫ్లర్ పేర్కొంది. జీ బిజినెస్ ప్రకారం.. షీలా కోచౌఫ్ మొత్తం నెట్‌వర్త్ 2020లో రూ. 540 కోట్లు. ఇదీ చదవండి ➤ Mira Kulkarni: కొవ్వొత్తుల తయారీతో మొదలుపెట్టి కోట్ల సంపాదన వరకు.. సక్సెస్ స్టోరీ అంటే ఈ ఒంటరి తల్లిదే..! -
Sheelaa Bajaj: ధీర వనిత.. నానమ్మ కథ
షీలా బజాజ్ వయసు 78. దేహం కదలికలు కష్టమయ్యే వయసు. కీళ్లు కదలికలు తగ్గే వయసు. కానీ, ఆమె మాత్రం చురుగ్గా వేళ్లు కదుపుతోంది. వేగంగా అడుగులు వేస్తోంది. ఊలుతో స్వెటర్లు అల్లుతోంది. చలికాలంలో చంటి పిల్లల పాదాలు, చేతులకు తొడిగే ఊలు సాక్సు, గ్లవ్స్ కూడా చక్కగా అల్లేస్తోంది. చేతిలో నైపుణ్యం ఉంటే వార్థక్యం కూడా దూరమవుతుందని చెబుతోంది షీలా బజాజ్. అంతేకాదు, తన మనుమరాలు యుక్తి 78 ఏళ్ల వయసులో తనను సంపాదనపరురాలిగా మార్చిందని సంతోషపడుతోంది షీలా బజాజ్. నానమ్మ కథ షీలా బజాజ్ జీవితంలో అనేక ఎదురుదెబ్బలకు గురైంది. కొడుకు అర్ధంతరంగా మర ణించాడు. అప్పటికి అతడి కూతురు యుక్తి చిన్నపాప. మనుమరాలిలో కొడుకును చూసుకుంటూ కోడలికి ధైర్యం చెబుతూ కుటుంబానికి అండగా నిలిచింది. ఆమె మనోధైర్యాన్ని చూసి విధికి కన్నుకుట్టినట్లుంది. కోడలిని కూడా పొట్టన పెట్టుకుంది. ఇక మిగిలింది తనూ, మనుమరాలు యుక్తి. ఆ పాపకి నానమ్మలోనే అందరూ. ఇప్పటికీ నానమ్మ అని చెప్పాల్సినప్పుడు యుక్తి ‘అమ్మ’ అనే సంబోధిస్తుంది. అంతటి అనుబంధం వాళ్లది. నానమ్మ కథ వినకుండా ఏ రోజూ నిద్రపోయేది కాదు యుక్తి. ఆ కథలన్నింటిలోనూ ఒకటే నీతి ఉండేది. కష్టం అనేది ఉండదు, పరిస్థితులు మాత్రమే ఉంటాయి. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడమే మనం చేయాల్సింది, చేయగలిగింది. ఈ నీతిని వింటూ పెరిగింది యుక్తి. నానమ్మ చెప్పిన కథలన్నింటికంటే ఆమె జీవిత కథే తనకు అత్యంత స్ఫూర్తివంతం అంటుంది యుక్తి. కాలం తన సమయాన్ని తాను పాటిస్తూ ముందుకు సాగిపోయింది. యుక్తి చదువుకుని, ఉద్యోగంలో చేరింది. షీలా బజాజ్ లో ఒంటరితనం మొదలైంది. ఇంతలో కరోనా వచ్చింది. ‘‘అమ్మ రోజంతా ఎంత ఒంటరితనానికి లోనవుతుందనేది నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో గమనించాను. ఆమెకు తెలియకుండానే ఆమెను తనకిష్టమైన పనిలో నిమగ్నం అయ్యేలా చేయగలిగాను. నాకు చిన్నప్పుడు అల్లినట్లే స్కార్ఫ్‌లు, స్వెటర్లు అల్లిపెట్టమ్మా... అని అడిగాను. ఊలు చేతిలోకి తీసుకున్న తర్వాత ఆమె ఇక చాలన్నా వినలేదు. ‘ఇలా అల్లుతూ ఉంటే.... నీ చిన్ననాటి రోజులే కాదు, నా చిన్ననాటి రోజులు కూడా గుర్తుకు వస్తున్నాయి’ అంటూ తనకు తోచినవన్నీ అల్లుతూ ఉండేది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. అవి కావాలని అడిగిన వాళ్లకు అమ్మేసి, ఆ డబ్బు ఇచ్చాను. తాను సంపాదనపరురాలినయ్యానని తెలిసిన ఆ క్షణం చూడాలి అమ్మ సంతోషం. నా బాల్యంలో నా ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఎంత భరోసానిచ్చిందో నాకిప్పటికీ గుర్తే. ఇప్పుడు నా పెంపకంలో ఉన్న అమ్మకు అంతటి భరోసా కల్పించడం నా బాధ్యత కదా’’ అంటోంది యుక్తి. మెదడు చురుకుదనం వేళ్లలో ఇక షీలా బజాజ్ అయితే... తన సృజనాత్మకతకు పదును పెట్టి ఊలుతో దిండు కవర్లు, కుషన్ కవర్లు, బాటిల్ కవర్, మగ్ వార్మర్ వంటి వినూత్నమైన అల్లికలను రూపొందిస్తోంది. ఇంత శ్రమ వద్దంటే వినదు కూడా. ‘ఈ వయసులో ఇంత వేగంగా అల్లగలగడం అంటే నాకెంతో గర్వం కదా. వేగం ఎందుకు తగ్గించుకోవాలి’ అని ప్రశ్నిస్తోంది. ‘డిజైన్‌కి అనుగుణంగా వేళ్లు వేగంగా కదులుతున్నాయంటే నా మెదడు కూడా అంతే చురుగ్గా ఉందని అర్థం’ అంటున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వు ఆమె పెదవుల మీద విరుస్తుంది. నిజమే... మనోధైర్యం ఉంటే పెరిగే వయసు ఉత్సాహానికి అడ్డంకిగా మారదు. చదవండి: International Day of Older Persons: అమ్మానాన్నలకు ఏం చేస్తున్నాం? -
కొత్త జీవితం
నటి షీలా వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారామె. ‘‘మా పెళ్లి రోజు మాకెంతో ప్రత్యేకమైనది. మేం ఇద్దరం కలిసి ఓ నూతన జీవితాన్ని ఆరంభించాం. నా వివాహం జరిగింది’’ అంటూ తన పెళ్లి ఫొటోను షేర్ చేశారు షీలా. చెన్నైకి చెందిన సంతోష్ రెడ్డి అనే వ్యాపారవేత్తను షీలా పరిణయమాడారు. 2000–2010 సమయంలో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో హీరోయిన్గా పలు సినిమాలు చేశారామె. తెలుగులో ‘పరుగు’ (2008), ‘మస్కా’ (2009), ‘అదుర్స్’ (2010) వంటి సినిమాల్లో నటించారు. 2011లో వచ్చిన ‘పరమవీరచక్ర’ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు షీలా. -
పెళ్లి పీటలెక్కిన బన్నీ హీరోయిన్
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పరుగు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి షీలా కౌర్ తాజాగా పెళ్లి పీటలెక్కారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న షీలా.. ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని బుధవారం చైన్నైలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశారు. ‘ఈ రోజు మాకెంతో ప్రత్యేకమైనది. పోల్చడానికి మించిన సమయం. గుండె లోతుల్లో సంతోషం నిండుకుంది. మేమిద్దరం కలిసి నూతన జీవితాన్ని ఆరంభించే ఓ కొత్త రోజు’ అంటూ ఫేస్బుక్లో పెళ్లి ఫోటో షేర్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు షీలాకు అభినందనలు తెలుపుతున్నారు. (గత రిలేషన్‌షిప్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు) 2006లో విడుదలైన సీతాకోక చిలుక చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన షీలా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం బాషల్లో నటించారు. అనంతరం మనోజ్ ‘రాజుభాయ్’, ఎన్టీఆర్ ‘అదుర్స్’, రామ్ ‘మస్కా’, బాలయ్య ‘పరమవీర చక్ర’ వంటి సినిమాల్లో నటించారు. అయితే షీలాకు అవేవి మంచి హిట్‌ను అందిచకపోయినా.. పరుగు సినిమా మాత్రం ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టింది.. 2011లో విడుదలైన బాలకృష్ణ పరమవీర చక్ర సినిమాలో తెలుగు తెరపై చివరిసారిగా కనిపించారు. అనంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు. (బిగ్‌బాస్-4: హోస్ట్‌గా మహేశ్ బాబు!) చదవండి : కేజీఎఫ్ 2 : డేట్ గుర్తుపెట్టుకోండి -
స్క్రీన్ టెస్ట్
1932లో తెలుగు సినిమా ప్రస్థానం ‘భక్తప్రహ్లాద’తో మొదలైంది. ఆ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హెచ్.ఎమ్.రెడ్డి. అదే టైటిల్‌తో 1967లో మరోసారి చిత్రపు నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కింది. రెండు చిత్రాలు పేరు తెచ్చుకున్నాయి. ఇలా హిట్ టైటిల్ రిపీట్ అయితే అదో అదనపు పబ్లిసిటీ అవుతుంది. అలా ఒకే పేరుతో విడుదలైన పలు సినిమాల గురించి ఈ వారం క్విజ్... 1. 1957లో రిలీజైన ‘మాయాబజార్’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. అదే టైటిల్‌తో 2006లో మరో సినిమా విడుదలైంది. మొదటి ‘మాయాబజార్’ దర్శకుడు కె.వి.రెడ్డి. 2006లో వచ్చిన సినిమా దర్శకుడు ఎవరు? ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ బి) నీలకంఠ సి) రవిబాబు డి) చంద్రసిద్ధార్థ్ 2.1989లో మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్‌హిట్ లవ్ స్టోరీ ‘గీతాంజలి’. అదే పేరుతో 2014లో విడుదలైన హారర్ చిత్రం ‘గీతాంజలి’కి దర్శకుడు రాజకిరణ్. కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్ ప్రాత పోషించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా? ఎ) ‘కలర్స్’ స్వాతి బి) నందితారాజ్ సి) అంజలి డి) తేజస్వి మడివాడ 3. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన ‘దేవదాసు’ సినిమా గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. 1953లో ఆ సినిమా విడుదలైంది. 1974లో హీరో కృష్ణ, 2006లో హీరో రామ్, 2018లో నాగార్జున ఈ పేరుతో మళ్లీ సినిమాలు చేశారు. రామ్ ‘దేవదాస్’ ద్వారా హీరోయిన్గా పరిచయమైన కథానాయిక ఎవరో కనుక్కోండి? ఎ) షీలా బి) హన్సిక సి) జెనీలియా డి) ఇలియానా 4. యన్టీఆర్, కృష్ణ హీరోలుగా 1973లో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం చేశారు. తర్వాత 2012లో దర్శకుడు పూరి జగన్నాథ్ అదే పేరుతో ఓ సినిమా తీశారు. ఆ సినిమాలో హీరో ఎవరో తెలుసా? ఎ) రానా బి) రవితేజ సి) రామ్ డి) కల్యాణ్ రామ్ 5. 1987లో చిరంజీవి, సుహాసిని జంటగా తమిళ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆరాధన’. అదే పేరుతో 1962లోనే యన్టీఆర్ ‘ఆరాధన’ చేశారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిందెవరో తెలుసా? ఎ) వాణిశ్రీ బి) సావిత్రి సి) జమున డి) కృష్ణకుమారి 6. కృష్ణ నటించిన 200వ చిత్రం ‘ఈనాడు’. ఆ సినిమా సూపర్‌హిట్. అదే పేరుతో 2009లో కమల్ హాసన్ హీరోగా నటించారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో మరో తెలుగు హీరో పోలీసాఫీసర్‌గా నటించారు. ఎవరా హీరో? ఎ) నాగార్జున బి) వెంకటేశ్ సి) రాజశేఖర్ డి) చిరంజీవి 7. 1979లో వచ్చిన యన్టీఆర్ ‘వేటగాడు’ సూపర్ హిట్. అదే టైటిల్‌తో 1995లో రాజశేఖర్ హీరోగా సినిమా చేశారు. 1979లో విడుదలైన ‘వేటగాడు’ చిత్రంలో ‘పుట్టింటోళ్లు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు...’ అనే సూపర్‌హిట్ క్లబ్ సాంగ్‌లో యన్టీఆర్‌తో కాలు కదిపిన ప్రముఖ డాన్సర్ పేరేంటి? ఎ) అనురాధ బి) జ్యోతిలక్ష్మీ సి) జయమాలిని డి) హలం 8. కె.విశ్వనాథ్ కెరీర్‌లోని అద్భుతమైన చిత్రాల్లో ‘శంకరాభరణం’ ఒకటి. ఆ సినిమా 1980లో విడుదలైంది. 2015లో విడుదలైన ‘శంకరాభరణం’ చిత్రంలో కథానాయకుడు ఎవరు? ఎ) నితిన్ బి) నవదీప్ సి) సిద్ధార్థ్ డి) నిఖిల్ 9. 1988 ‘ఘర్షణ’, 2004 ‘ఘర్షణ’ మంచి విజయం సాధించాయి. రెండు చిత్రాల్లోని పాటలు సూపర్‌హిట్. పాత ‘ఘర్షణ లోని ‘ఒక బృందావనం సోయగం...’ పాటను చిత్ర పాడారు. తర్వాతి ‘ఘర్షణ’లో ‘చెలియ చెలియ చెలియ చెలియా, అలల ఒడిలో ఎదురు చూస్తున్నా...’ పాట పాడిన గాయని ఎవరో తెలుసా? ఎ) కౌసల్య బి) శ్రేయా గోషల్ సి) మల్గాడి శుభ డి) ఎస్పీ శైలజ 10. ‘పెళ్లి పుస్తకం’ అనగానే బాపు–రమణలు గుర్తుకు వస్తారు. అదే పేరుతో మరోసారి ఓ సినిమా విడుదలైంది. మొదటిసారి విడుదలైన ‘పెళ్లి పుస్తకం’ చిత్రంలో హీరో రాజేంద్రప్రసాద్, రెండో సారి విడుదలైన చిత్రంలో హీరో ఎవరు? ఎ) రాహుల్ రవీంద్రన్ బి) నవీన్ చంద్ర సి) సుశాంత్ డి) సుమంత్ 11. 1989లో విడుదలైన జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. అదే పేరుతో కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి హీరోగా మరో సినిమా తెరకెక్కింది. ఆ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్గా నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) ఈషా రెబ్బా బి) కృతీ కర్భందా సి) తాప్సీ డి) పూర్ణ 12. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన చిత్రం ‘పవిత్రబంధం’. అదే పేరుతో వెంకటేశ్ హీరోగా ఓ సినిమా లె రకెక్కింది. ఆ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్గా నటించిందెవరో గుర్తుందా? ఎ) ఆమని బి) మీనా సి) సౌందర్య డి) రోజా 13. 1968లో విడుదలైన చిత్రం ‘రాము’. యన్టీఆర్ సరసన జమున కథానాయికగా నటించారు. 1987లో బాలకృష్ణ ‘రాము’ పేరుతో సినిమా చేశారు. ఆయన సరసన నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) సుహాసిని బి) రజని సి) రాధ డి) భానుప్రియ 14. కమల్‌హాసన్ ‘సత్య’ చిత్రంతో మంచి పేరు సంపాదించారు. ఆ సినిమా 1988లో విడుదలైంది. పదేళ్ల తర్వాత అదే పేరుతో ఓ సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. రామ్‌గోపాల్‌వర్మ నిర్మించి, దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో హీరో జె.డి చక్రవర్తి సరసన నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) ఊర్మిళ మటోండ్కర్ బి) ఆంత్రమాలి సి) నిషాకొఠారి డి) మధుషాలిని 15. 1955లో విడుదలైన ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన క్లాసికల్ మూవీ ‘మిస్సమ్మ’. ఆ చిత్రంలో ‘మిస్సమ్మ’ గా సావిత్రి నటిస్తే 2003లో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘మిస్సమ్మ’ వచ్చింది. 2003 ‘మిస్సమ్మ’ ఎవరో తెలుసా? ఎ) సిమ్రాన్ బి) భూమికా చావ్లా సి) త్రిష డి) రమ్యకృష్ణ 16. 1948లో ఓసారి, 1970 మరోసారి, 1995లో ఇంకోసారి ఇలా అనేక సార్లు ‘ద్రోహి’ టైటిల్‌తో సినిమాలు విడుదలయ్యాయి. 1948 సినిమాకు ఎల్వీ. ప్రసాద్, 1970 సినిమాకు కె.బాపయ్య దర్శకులు. 1995లో విడుదలైన సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా? ఎ) కమల్ హాసన్ బి) సురేశ్ కృష్ణ సి) పి.సి. శ్రీరామ్ డి) అర్జున్ 17. 1951 నాటి ‘మల్లీశ్వరి’ చిత్రంలో టైటిల్ రోల్‌ను భానుమతి పోషించారు. 2004 ‘మల్లీశ్వరి’లో టైటిల్ రోల్ చేసిన నటి ఎవరు? ఎ) కత్రినాకైఫ్ బి) టబు సి) అంజలా జవేరి డి) ప్రీతి జింతా 18. చిత్తూరు నాగయ్య హీరోగా కాంచనమాల హీరోయిన్గా బి.ఎన్. రెడ్డి దర్శకత్వం వహించిన 1939 నాటి చిత్రం ‘వందేమాతరం’. రాజశేఖర్ హీరోగా నటించగా టి.కృష్ణ 1985లో ‘వందేమాతరం’ టైటిల్‌తో సినిమా తీశారు. ఆ చిత్రంలో హీరోయిన్ ఎవరు? ఎ) విజయశాంతి బి) సుహాసిని సి) సుమలత డి) రాధిక 19. 1978లో విడుదలైన ప్రేమకావ్యం ‘మరోచరిత్ర’. బాలచందర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో కమల్‌హాసన్, సరిత జంటగా నటించారు. 2010లో ‘దిల్’ రాజు అదే టైటిల్‌తో ఓ సినిమా నిర్మించారు. ఆ చిత్రంలో హీరో ఎవరో తెలుసా? ఎ) ఆర్య బి) భరత్ సి) ప్రిన్స్ డి) వరుణ్ సందేశ్ 20. 1963లో ఓసారి, 2018లో ఓసారి ‘నర్తనశాల’ సినిమా విడుదలైంది. 1963లో విడుదలైన ‘నర్తనశాల’ లో అభిమన్యుడు పాత్రను పోషించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) యన్టీఆర్ బి) శోభన్‌బాబు సి) అక్కినేని నాగేశ్వరరావు డి) కాంతారావు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) సి 3) డి 4) బి 5) ఎ 6) బి 7) సి 8) డి 9) బి 10) ఎ 11) డి 12) సి 13) బి 14) ఎ 15) బి 16) సి 17) ఎ 18) ఎ 19) డి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
స్క్రీన్ టెస్ట్
1. ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంలో హీరో సిద్ధార్థ్‌తో చిన్నప్పటి నుండి స్నేహంగా ఉండే పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) శ్రుతీహాసన్ బి) హన్సిక సి) సమంత డి) నిత్యామీనన్ 2. స్నేహంపై తీసిన ‘కొండపల్లి రాజా’ చిత్రంలో హీరో ఎవరో కనుక్కోండి? ఎ) వెంకటేశ్ బి) భానుచందర్ సి) బాలకృష్ణ డి) రాజేంద్ర ప్రసాద్ 3. ‘ఆర్య 2’ చిత్రంలో అల్లు అర్జున్, నవదీప్ స్నేహితులుగా నటించారు. వారిద్దరు ఏ హీరోయిన్ కోసం తంటాలు పడతారో తెలుసా? ఎ) తమన్నా బి) కాజల్ అగర్వాల్ సి) గౌరీ ముంజల్ డి) షీలా 4. ‘ప్రేమదేశం’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇద్దరు స్నేహితులుగా అబ్బాస్, వినీత్ నటించారు. ఈ ఇద్దరూ లవ్ చేసే అమ్మాయిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) టబు బి) సోనాలీ బింద్రే సి) ఐశ్వర్యా రాయ్ డి) మనీషా కోయిరాల 5. ‘స్నేహం కోసం’ చిత్రంలో చిరంజీవి, విజయ్‌కుమార్ స్నేహితులుగా నటించారు. ఈ చిత్ర దర్శకుడెవరో తెలుసా? ఎ) సురేశ్ కృష్ణ బి) కె.యస్ రవికుమార్ సి) పి. వాసు డి) భారతీరాజా 6. ‘ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా... కాలం నీ నేస్తం ముస్తఫా...’ అనే పాట రచయితెవరో కనుక్కోండి? ఎ) భువనచంద్ర బి) వెన్నెలకంటి సి) సిరివెన్నెల డి) వేటూరి సుందర రామమూర్తి 7. ‘ ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రంలో హీరో రామ్‌కి బెస్ట్ ఫ్రెండ్‌గా నటించిన మరో హీరో ఎవరో తెలుసా? ఎ) నారా రోహిత్ బి) నాగ శౌర్య సి) శ్రీవిష్ణు డి) నవీన్ చంద్ర 8. హీరో గోపీచంద్ తన బెస్ట్ ఫ్రెండ్ అని ఓ హీరో పేరు చెప్తారు. ఎవరా హీరో? ఎ) ప్రభాస్ బి) కల్యాణ్‌రామ్ సి) రవితేజ డి) నాగార్జున 9. జగపతిబాబు స్నేహితుడు అనగానే గుర్తుకు వచ్చే హీరో ఎవరో తెలుసా? ఎ) నాగార్జున బి) అర్జున్ సర్జా సి) శ్రీహరి డి) ప్రకాశ్ రాజ్ 10. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండకు బెస్ట్ ఫ్రెండ్‌గా నటించిన నటుడెవరో తెలుసా? ఎ) రాహుల్ రామకృష్ణ బి) ‘వెన్నెల’ కిశోర్ సి) ప్రియదర్శి డి) సత్య 11. ‘అందాల రాక్షసి’ ఫేమ్ హీరో రాహుల్ రవీంద్రన్ ఓ ప్రముఖ హీరోయిన్‌కు బెస్ట్ ఫ్రెండ్. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) అంజలి బి) సమంత సి) రాశీ ఖన్నా డి) రెజీనా 12. అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్ అనే సినిమాలో కథానాయకునిగా నటించిన హీరో ఎవరో తెలుసా? ఎ) నిఖిల్ బి) ఆది పినిశెట్టి సి) శర్వానంద్ డి) సందీప్ కిషన్ 13. రాజీవ్ కనకాల ఓ పెద్ద హీరోకి బెస్ట్ ఫ్రెండ్. ఆ హీరో ఎవరో కనుక్కోండి? ఎ) అల్లు అర్జున్ బి) జూనియర్ ఎన్టీఆర్ సి) రామ్ చరణ్ డి) మహేశ్‌బాబు 14 ‘దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్...పాట ‘పెళ్లి పందిరి’ చిత్రంలోనిది. ఆ పాటలో ఇద్దరు స్నేహితులు నటించారు. అందులో ఒకరు పృథ్వీ. మరో హీరో ఎవరు? ఎ) తరుణ్ బి) శ్రీకాంత్ సి) జగపతిబాబు డి) జె.డి. చక్రవర్తి 15 ‘వసంతం’ సినిమాలో వెంకటేశ్ క్లోజ్ ఫ్రెండ్‌గా నటించిన హీరోయిన్ గుర్తుందా? ఎ) గజాల బి) రాశి సి) సిమ్రాన్ డి) కళ్యాణి 16. ఈ ఫొటోలో రజనీకాంత్‌తో ఉన్నది ఆయన చిరకాల మిత్రుడు. ఆ ఫ్రెండ్ పేరేంటో తెలుసా? ఎ) రాజా బహదూర్ బి) రాజా రవివర్మ సి) రాజన్ డి) రాజమణి 17. ‘నీ స్నేహం ఇక రాదు అని...’ పాట పాడిన సంగీత దర్శకులు ఎవరు? ఎ) యం.యం. కీరవాణి బి) ఆర్పీ పట్నాయక్ సి) దేవిశ్రీ ప్రసాద్ డి) ఇళయరాజా 18. ‘స్నేహితుడా.. స్నేహితుడా రహస్య స్నేహితుడా...’ పాట ‘సఖీ’ చిత్రం లోనిది. ఆ చిత్ర సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) ఏఆర్ రెహమాన్ బి) హారిస్ జయరాజ్ సి) దేవా డి) యువన్ శంకర్ రాజా 19. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీడేస్’ అనే సినిమా వచ్చింది. ఆ చిత్రంలో ‘టైసన్’ అనే క్యారెక్టర్ ఉంటుంది. ఫ్రెండ్షిప్కు ఎంతో విలువనిచ్చే పాత్రను పోషించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) నిఖిల్ బి) వరుణ్ సందేశ్ సి) రాహుల్ డి) వంశీ చాగంటి 20. బాపు అనగానే వెంటనే రమణ గుర్తుకొస్తారు. స్నేహమంటే వారిద్దరిదే అని అందరూ చెప్పుకుంటారు. వారిద్దరూ కలిసి చేసిన ఆఖరి చిత్రమేదో చెప్పుకోండి ఎ) రాధా గోపాళం బి) శ్రీ రామరాజ్యం సి) సుందరాకాండ డి) రాంబంటు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) ఎ 3) బి 4) ఎ 5) బి 6) ఎ 7) సి 8) ఎ 9) బి 10) ఎ 11) బి 12) ఎ 13) (బి) 14) సి 15) డి 16) ఎ 17) బి 18) ఎ 19) సి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
‘అమ్మ’ గైర్హాజరీలో షీలా
చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత ఆసుపత్రిలో చేరి పదిరోజులైనా ఆమె గైర్హాజరీలో తమిళనాడు పాలన సాగుతోంది. కానీ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? జయ కాకుండా ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకునే సత్తా ఉన్నవారెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం షీలా బాలకృష్ణన్. 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన షీలా.. సీఎం జయలలితకు నమ్మిన బంటు. రెండేళ్ల క్రితం రిటైరైనా ఈమెను జయ తన అధికారిక సలహాదారుగా నియమించుకున్నారు. అప్పటినుంచి పాలనలో షీలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అపోలో ఆసుపత్రిలో జయ చికిత్స పొందుతున్న ఫ్లోర్‌లోనే ఓ గదిలో ఉంటున్న షీలా.. ఇక్కడినుంచే పాలనా వ్యవహారాలు చూస్తున్నారు. ‘ఆసుపత్రికి వచ్చే మంత్రులు రెండు పనులపై వస్తున్నారు. ఒకటి అమ్మను చూడటం, రెండోది షీలా సూచనలు అందుకోవటం’ అని ఓ అన్నాడీఎంకే కీలక నేత తెలిపారు. 3 దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో పనిచేసిన షీలా బాలకృష్ణన్ అనుభవజ్ఞురాలని పలువురు ఐఏఎస్‌లు కొనియాడారు. -
ఓటేసిన సోనియా, షీలా